జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్…

జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్

జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిల్ మారుతి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో అన్ని గ్రామాల నుండి కంటి పొరలు & శుక్లాల సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోవాలనే వారికోసం జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ భూపాలపల్లి లో బస్సు ఏర్పాటు చేసి వారందరినీ కరీంనగర్ లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించనున్నారు తేదీ ఏప్రిల్ 13/2026 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు భూపాలపల్లి, కిరణ్ హాస్పిటల్ ముందు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల భవనం వద్దకు బస్సు వస్తుంది కావున వచ్చేవారు ఉదయం 9 గంటల వరకు అక్కడికి రాగలరు
ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోగలరు 9440903023 ఇతర ఏ జిల్లాల నుండైనా ఆపరేషన్ కోసం రావచ్చు వేరే జిల్లాల నుండి వచ్చేవారు ఫోన్ చేసి డైరెక్ట్ గా కరీంనగర్ హాస్పిటల్ దగ్గరికి రాగలరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9440903023
వెంట తీసుకరావాల్సినవి
ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ లు (3)
కలర్ ఫోటోలు (3)
ఒక జాత బట్టలు, ఒక చెద్దర్, పేషెంట్ తో వచ్చేవారు ఒక చద్దర్ తెచ్చుకోవాలి,అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకొని రాగలరు
ఆపరేషన్ చేయించుకునే వారు రెండు రోజుల నుండి మద్యం మానివేయాలి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి….

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియ చేస్తూ. అలాగే. తంగళ్ళపల్లి మండలం కేంద్రంలోని ఈనెల 19 నిర్వహిస్తున్న. శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి డాక్టర్ .భానుచందర్ ఆధ్వర్యంలో. అలాగే ఆపిల్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల. 19. తారీకు.న తంగళ్ళపల్లిమండల కేంద్రంలో. ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని. తెలియజేస్తూ ఇట్టి వైద్య శిబిరానికి. N5T G. సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ.బడుతుందని. తెలియజేస్తూ నిర్వాహకులు. మాజీ .జెడ్పిటిసి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోడిఅంతయ్య మాట్లాడుతూ తంగళ్ళపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుపుతూ తంగళ్ళపల్లి మార్కండేయ దేవస్థానం నిర్వహించబడే ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటికి సంబంధించి మరియు డెంటల్ వైద్య బృందంల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేసుకోవాలని తెలియజేస్తూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఈనెల .19.న .నిర్వహించి ఉన్న ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి పోస్టరును ఘనంగా ఆవిష్కరించారు. ఎట్టి కార్యక్రమంలో రంగు అంజయ్య. రెడ్డి ఐలయ్య. రంగు రాములు. గడ్డమీది అంతయ్య. కొంగరిమల్లేశం. జంగాపల్లిదేవయ్య. పెడతపల్లిమల్లేశం. N.5TG. టెక్నాలజీ సమస్త మేనేజింగ్ డైరెక్టర్ .ఆఫీజ్.బోర్డుఆఫ్ డైరెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు

ఉచితకంటిఆపరేషన్ బస్సును ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు..

ఉచితకంటిఆపరేషన్ బస్సును ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ముత్తారంలో ఈనెల 3,4. తేదీల్లో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్ష అనంతరం కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు వారికి కేటాయించిన తేదీల ప్రకారం హైదరాబాదు పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఆపరేషన్ అవసరమైన వారిని తీసుకెళ్తున్న బస్సును ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ జండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమం లో ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్ సింగల్ విండో మాజీ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు మరియు వార్డు సభ్యులు . చందు, దేవేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

పోరు వద్దు ఊరు ముద్దు…

పోరు వద్దు ఊరు ముద్దు

మాజీ మావోయిస్టు కంటికి శస్త్ర చికిత్స చేయించిన కోటపల్లి పోలీస్

ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి – జనజీవన స్రవంతిలో కలవండి

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారేపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లచ్చన్న,భార్యతో కలిసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు,లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని,తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినాడు.మాజీ మావోయిస్టు కు పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సహాయం,సమస్య ఉన్న అండగా ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆత్రం లచ్చన్న కు కంటి చికిత్స ను మంచిర్యాల లోని పవన్ ఆప్టికల్స్ ద్వారా ఉచితంగా కంటి చికిత్స చేపించారు.

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి…

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి

◆:- టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయనిధి చాలా అండగా నిలుస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో కోట్లల్లో డబ్బులు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా కొంతవరకైనా లబ్ధి పొందవచ్చు అని టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అన్నారు.
మొన్న వరంగల్లో టిఆర్పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగిన టిఆర్పి రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు పేద ప్రజలకి మా పార్టీ అధికారంలోకి వస్తే, ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో మా పార్టీ అధ్యక్షులు వివిధ వర్గాల పేద ప్రజల కోసం సీఎం సహాయనిధి ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము.కావున జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ద్వారా సీఎం సహాయ నిధి కోసం అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను.

ఉచిత వైద్య శిబిరం…

ఉచిత వైద్య శిబిరం

మందమర్రి నేటి ధాత్రి

 

 

జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గార్ల ఆదేశానుసారం , ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా శనివారం రోజు మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని దీపక్ నగర్ సబ్ సెంటర్ లోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో మండల వైద్య అధికారి రాపాక రమేష్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అట్టి శిబిరంకు హాజరైన రోగులు ప్రజలతో మాట్లాడారు.. ఆయన క్షయ వ్యాధి నివారణ కై అవగాహన కల్పిస్తూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల 1000 చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అలాగే ఎక్స్ రే అవసరం ఉన్నవారిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 102 వాహనం ద్వారా తీసుకెళ్లి పరీక్షల నిమిత్తం తిరిగి మరల తీసుకొని రావడం జరుగుతుంది ఈ శిబిరంలో డా. భవానీ, జిల్లా టిబి కో ఆర్డినేటర్ సురేందర్, సూపర్వైజర్లు,కళావతి. టిబి సూపర్వైజర్ కుమార్, ఏఎన్ఎం, పద్మ, జ్యోతి,
ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత,అలేఖ్య,రేష్మ,ఆర్బిఎస్కే సిబ్బంది డా. పద్మ శ్రీ ,అజయ్ ..
ఆశాలు.. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version