జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్
జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిల్ మారుతి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో అన్ని గ్రామాల నుండి కంటి పొరలు & శుక్లాల సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకోవాలనే వారికోసం జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ భూపాలపల్లి లో బస్సు ఏర్పాటు చేసి వారందరినీ కరీంనగర్ లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించనున్నారు తేదీ ఏప్రిల్ 13/2026 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు భూపాలపల్లి, కిరణ్ హాస్పిటల్ ముందు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల భవనం వద్దకు బస్సు వస్తుంది కావున వచ్చేవారు ఉదయం 9 గంటల వరకు అక్కడికి రాగలరు
ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోగలరు 9440903023 ఇతర ఏ జిల్లాల నుండైనా ఆపరేషన్ కోసం రావచ్చు వేరే జిల్లాల నుండి వచ్చేవారు ఫోన్ చేసి డైరెక్ట్ గా కరీంనగర్ హాస్పిటల్ దగ్గరికి రాగలరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9440903023
వెంట తీసుకరావాల్సినవి
ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ లు (3)
కలర్ ఫోటోలు (3)
ఒక జాత బట్టలు, ఒక చెద్దర్, పేషెంట్ తో వచ్చేవారు ఒక చద్దర్ తెచ్చుకోవాలి,అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకొని రాగలరు
ఆపరేషన్ చేయించుకునే వారు రెండు రోజుల నుండి మద్యం మానివేయాలి
