ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడం *

ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడం *
HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం మొగుళ్లపల్లి

నేటి దాత్రి

 

తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ జిల్లా భూపాలపల్లి డి ఎం హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ మండల వైద్యాధికారిని డాక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ నవత ఆధ్వర్యంలో సోమవారం రోజునగ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ గారి చేతుల మీదుగా, ముఖ్య అతిథి తాసిల్దార్ సునీత సమక్షంలో ఘనంగా ప్రారంభించబడినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం మహిళలు మరియు బాలికలను సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడం. HPV వైరస్ కారణంగా వచ్చే వ్యాధులను ముందుగానే నివారించేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో ప్రయోజనకరమని డా. నవతా గారు తెలిపారు.
ఈ HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్యంగా 14-15 సంవత్సరాల బాలికలకు టీకా ఇవ్వబడుతున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి టీ.బి. ముక్త్ భారత్ అభియాన్ కింద టీబీ బాధితులకు పోషకాహార కిట్లు అందజేయడం జరిగింది. ఈ కిట్లు రోగుల ఆరోగ్య పునరుద్ధరణకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో CHO రాజేందర్ ప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ సునీత,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, స్టాఫ్ నర్స్ సరిత, కల్పన, ల్యాబ్ టెక్నీషియన్ సంపూర్ణ, ANMs మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
మండలంలోని అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమీప ఆరోగ్య కేంద్రాలలో HPV వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో నిరంతరంగా కొనసాగుతుందని డాక్టర్ నవత తెలిపారు

ఉచిత వైద్య శిబిరం…

ఉచిత వైద్య శిబిరం

మందమర్రి నేటి ధాత్రి

 

 

జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గార్ల ఆదేశానుసారం , ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా శనివారం రోజు మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని దీపక్ నగర్ సబ్ సెంటర్ లోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో మండల వైద్య అధికారి రాపాక రమేష్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అట్టి శిబిరంకు హాజరైన రోగులు ప్రజలతో మాట్లాడారు.. ఆయన క్షయ వ్యాధి నివారణ కై అవగాహన కల్పిస్తూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల 1000 చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అలాగే ఎక్స్ రే అవసరం ఉన్నవారిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 102 వాహనం ద్వారా తీసుకెళ్లి పరీక్షల నిమిత్తం తిరిగి మరల తీసుకొని రావడం జరుగుతుంది ఈ శిబిరంలో డా. భవానీ, జిల్లా టిబి కో ఆర్డినేటర్ సురేందర్, సూపర్వైజర్లు,కళావతి. టిబి సూపర్వైజర్ కుమార్, ఏఎన్ఎం, పద్మ, జ్యోతి,
ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత,అలేఖ్య,రేష్మ,ఆర్బిఎస్కే సిబ్బంది డా. పద్మ శ్రీ ,అజయ్ ..
ఆశాలు.. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version