ఉచిత వైద్య శిబిరం…

ఉచిత వైద్య శిబిరం

మందమర్రి నేటి ధాత్రి

 

 

జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గార్ల ఆదేశానుసారం , ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా శనివారం రోజు మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని దీపక్ నగర్ సబ్ సెంటర్ లోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో మండల వైద్య అధికారి రాపాక రమేష్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అట్టి శిబిరంకు హాజరైన రోగులు ప్రజలతో మాట్లాడారు.. ఆయన క్షయ వ్యాధి నివారణ కై అవగాహన కల్పిస్తూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల 1000 చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అలాగే ఎక్స్ రే అవసరం ఉన్నవారిని మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 102 వాహనం ద్వారా తీసుకెళ్లి పరీక్షల నిమిత్తం తిరిగి మరల తీసుకొని రావడం జరుగుతుంది ఈ శిబిరంలో డా. భవానీ, జిల్లా టిబి కో ఆర్డినేటర్ సురేందర్, సూపర్వైజర్లు,కళావతి. టిబి సూపర్వైజర్ కుమార్, ఏఎన్ఎం, పద్మ, జ్యోతి,
ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత,అలేఖ్య,రేష్మ,ఆర్బిఎస్కే సిబ్బంది డా. పద్మ శ్రీ ,అజయ్ ..
ఆశాలు.. తదితరులు పాల్గొన్నారు

క్షయ అంతం మనందరి పంతం.

క్షయ అంతం మనందరి పంతం

గంగారం, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగారం నందు ప్రధానమంత్రి టీవీ ముక్తాభియాన్ కార్యక్రమంలో భాగంగా డా’ప్రత్యూష ఆధ్వర్యంలో క్షయ వ్యాధి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది అనుమానితులను ఎక్స్రే పరీక్షల నిమిత్తం గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి 102 , రబీకస్కె వెహికల్ ద్వారా తరలించారు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారి నుండి తెమడ సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇట్టి క్యాంపులో భాగంగా బరువు తక్కువ ఉండి తరచు వ్యధుల భరిన పడేఅంగన్వాడి పిల్లలను, వ్యాధి లక్షణములున్న పాఠశాల విద్యార్థులను స్థానిక వైద్యాధికారి మండల ప్రత్యూష పరీక్షించారు. అదేవిధంగా క్షయవ్యాధి మందులు వాడుతున్నటువంటి 11 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు తన సొంత ఖర్చులతో పోషకాహార కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.అనంతరం డా. ప్రత్యూష మాట్లాడుతూ టీబి ని నయం చేయాలంటే క్రమం తప్పని మందులతో పాటుగా మంచి ఆహారం తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది అని తెలిపారు. కార్యక్రమంలో Dr ప్రత్యూష, డా.శ్రీకాంత్, లక్ష్మి స్టాఫ్ నర్స్, రమాదేవి, రాజు ల్యాబ్ టెక్నీషియన్, శ్రీరాములు, రాంబాబు, మోహన్, టీవీ ట్రీట్మెంట్ సూపర్వైజర్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version