బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి
◆:- టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయనిధి చాలా అండగా నిలుస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో కోట్లల్లో డబ్బులు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా కొంతవరకైనా లబ్ధి పొందవచ్చు అని టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అన్నారు.
మొన్న వరంగల్లో టిఆర్పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగిన టిఆర్పి రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు పేద ప్రజలకి మా పార్టీ అధికారంలోకి వస్తే, ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో మా పార్టీ అధ్యక్షులు వివిధ వర్గాల పేద ప్రజల కోసం సీఎం సహాయనిధి ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము.కావున జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ద్వారా సీఎం సహాయ నిధి కోసం అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను.