అభివృద్ధి పనులను వేగవంతం చేయాలిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నేటి ధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండలం కిష్టంపేట లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలను విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.చెన్నూర్ మండల కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి వైద్య సేవలను అందుబాటులో ఉంచుతుందని తెలిపారు.ఈ క్రమంలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి సందర్శించారు.వివిధ భూ సమస్యలపై భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి త్వరగా జారీ చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version