జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఎరువుల కొరత

◆:- మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకుంటున్న రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఎరువుల కోసం రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ ఒక రైతుకు రెండు బస్తాల ఎరువు ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారు ఎరువుల కొరత లేదు అని చెప్పే అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కూడా ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్ స్టేషన్ లో టోకెన్ తీసుకొని చెప్పులు క్యూ లైన్లో పెట్టి చిమ్మ చీకటిలో పక్కన నిద్రపోయే వారు ఇప్పుడు మళ్ళీ అవే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం తిరుమలాపూర్* గ్రామానికి చెందిన పెండ్లి రవి ఇటీవల మరణించగా నేడు వారి నివాసాలకు వెళ్లి పెండ్లి రవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేశారు.అదే గ్రామానికి చెందిన కంచు చంద్రమ్మ* ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి రవి, యూత్ అధ్యక్షుడు రాంబాబు, చిట్యాల టౌన్ యూత్ అధ్యక్షులు అల్లం రాజు, కొత్తపల్లి రాము గోపగాని శివకృష్ణ, గోల్కొండ మహేష్, ఎలగొండ చిరంజీవి, గోపగాని వెంకటేశ్వర్లు, నీరటి నారాయణ, నాగిరెడ్డి శంకర్, కంచు తిరుపతి, గొర్రెటి ఓదెలు, గద్దల తిరుపతి, జన్నె జనార్ధన్, కలవేన ప్రవీణ్, నగరపు సాయి తదితరులు పాల్గొన్నారు.

బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T134426.549-1.wav?_=1

బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లతీరుపై. హారా తీసిన స్థానిక ఎంపీడీవో. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వాడవాడలా ఇండ్లు తిరుగుతూప్రభుత్వ ఆదేశానుసారం. విడతలవారీగా తొందరగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇండ్లకు సంబంధించిన దానిని లబ్ధిదారులు తొందరగా పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా. స్థానిక. తంగళ్ళపల్లి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ లబ్ధిదారులను వారు చేస్తున్న పనులు త్వరగా ముగించుకొని. ప్రభుత్వం అందించే. రుణాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగుర్ల.ప్రశాంత్. దేవరాజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ గ్రామ లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

భూపాలపల్లి లో ఇండియన్ గ్యాస్ ఏజన్సీఅదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-1.wav?_=2

భూపాలపల్లి లో ఇండియన్ గ్యాస్ ఏజన్సీఅదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

భూపాలపల్లి నేటిధాత్రి

వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు మెరుగైన సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లిలో సోమవారం అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ను ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి లోని అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కంకటరాజ వీరు గౌడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడి నుండి భూపాలపల్లి వినియోగదారుల కు గ్యాస్ సఫఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు భూపాలపల్లిలో అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కౌంటర్ ద్వారా వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందే విధంగా ఉంటుందని, అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాజవీర్ గౌడ్ ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్, కంకటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోస్.

శ్రీ పర్వత పర్వతవర్దిని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T143751.150.wav?_=3

శ్రీ పర్వత పర్వతవర్దిని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T132609.249.wav?_=4

బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట కులగణన చేసి అట్టి బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చి చట్టబద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వాన్ని కి కనువిప్పు కలిగించి బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిరిసిల్ల నుంచి బయలుదేరారు. చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప, టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు రెడ్దిమల్ల భాను, గుడిసె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సబ్బని వేణు కలిసి బయలుదేరారు.

నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే .

నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సాయంచేయేది లేదు

బిఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం విసిరిన కాంగ్రెస్ నాయకులు

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

బిఆర్ఎస్ నాయకులారా, మీరు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది దొరల గడీ కాదు, ప్రజాస్వామ్యం. మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మేము విమర్శించడం సిగ్గుచేటంట? మరి మీరు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, పచ్చి అబద్ధాలతో బురద జల్లుడు రాజకీయం చేయడం సిగ్గుచేటు కాదా?
ఎర్రబెల్లి పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలను అభివృద్ధి చేశారని అంటున్నారు. ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని అభివృద్ధి మీదా? రోడ్లు లేవు, తాగునీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు. ఇదేనా మీ అభివృద్ధి? కేవలం తమ ఆస్తులు, అంతస్తులు పెంచుకోవడమే అభివృద్ధి అనుకుంటే అది మీ భ్రమ.

 

 

 

నాగరాజు గెలుపు అడ్డి మీద గుడ్డి దెబ్బ అంటారా? అది ప్రజల తీర్పు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే నాగరాజును గెలిపించారు. ప్రజల తీర్పును అవమానించి, మీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల మన్ననలు పొందిన చరిత్ర దయాకర్ రావుది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ గొప్ప నాయకుల మార్గంలో నడుస్తూ ప్రజలకు ఏం చేశారో చెప్పండి. కేవలం పదవుల కోసం పార్టీలు మారడం, ప్రజలను మోసం చేయడమేనా మీ గొప్ప చరిత్ర?
“దొరల పెత్తనం” అని అంటున్నాం, మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించేది దొరలే అంటారా? మా చుట్టూ ఉన్నది ప్రజలు! ప్రజల ఆశీస్సులతో, ప్రజల మద్దతుతోనే మేము ముందుకు వెళ్తున్నాం.

 

 

 

 

 

 

మీ చుట్టూ ఉన్నది కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే పెత్తందారులు మాత్రమే. అందుకే మీకు ప్రజల కష్టాలు కనిపించడం లేదు.
మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే సీన్ మాకు లేదంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. మీ ముఖ్యమంత్రే ప్రజలు తనను దొంగలా చూస్తున్నారని చెప్పిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు చీత్కరించారో ఆ మాటలే నిదర్శనం.

 

 

 

 

 

స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని చోట్లా బిఆర్ఎస్ జెండా ఎగురుతుందనేది మీ పగటి కల. ప్రజలు మేల్కున్నారు. మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది.

 

 

 

 

నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాకు నీతులు చెబుతారా? మీ నాయకులు, మీ కింద పనిచేసే చెంచాలు మాట్లాడుతున్న బూతుల గురించి ఆలోచించండి. దయాకర్ రావును విమర్శించే స్థాయి మాకు లేదంటారా? ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలను ప్రశ్నించే ధైర్యం మాకు ఉంది. మాకు ఏ స్థాయి అవసరం లేదు. ప్రజల మద్దతు ఉంటే చాలు.

 

 

ఖబడ్దార్ కాంగ్రెస్ చెంచాలారా అని హెచ్చరిస్తున్నారా? గుర్తుంచుకోండి, మేము చెంచాలం కాదు, ప్రజల సేవకులం. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు. మీరు ప్రజలను కించపరుస్తూ, అహంకారంతో మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీ పతనం దగ్గరలోనే ఉంది. అని వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ,మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, బ్లాక్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి లు సంయుక్తంగా ఆరోపించారు… ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మైస సురేష్ , సీనియర్ నాయకులు కమగోని ప్రభాకర్ గౌడ్ , దుబ్బాక శివకుమార్ చీటూరి రాజు కుక్కల రాకేష్ ఆరేల్లి ఆరెల్లి ప్రభాకర్, గోధుమల విక్రం ముంజకృష్ణ తో పాటు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లోని చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కంచర్ల రాంబాబు గారి తండ్రి (కంచర్ల పోశాలు) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్నిగురువారం చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* పరామర్శించి వారి ఆత్మకు మనస్పూర్తిగా శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ సీనియర్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ లోని ఫయాజ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ మరియు వారి బృందం కాంగ్రెస్ పార్టీ లో నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని,మైనార్టీ లకు మంత్రివర్గం లో చోటు కల్పించకపోవడం మైనారిటీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎంటో అర్థమైంది అని,రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ దే అని,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఇబ్రహీం,మొహమ్మద్ అలి,ఆల్లిపూర్ నాయకులు శంకర్ పటేల్,దీపక్,మోహన్,ప్రవీణ్ మెస్సీ , తదితరులు పాల్గొన్నారు..

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన.

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఏ.చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్దంతిని పురస్కరించుకుని, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.,ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత,ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..
ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ , గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాజీవ్ గాంధీ గారి జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ , శ్రీనివాస్ రెడ్డి , రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, సామెల్ గారు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హుగెల్లి రాములు , శుక్లవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ , జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, ఉదయ్ శంకర్ పాటిల్ మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ఆరుముల్ల ఎల్ల స్వామి కుమార్తె అరుణ్ జ్యోతి కిషోరల వివాహ మహోత్సవానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేగండ్రసత్యనారాయణరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు

జైపూర్,నేటి ధాత్రి:

 

కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు.జైపూర్ మండలంలోని శివ్వారం,కుందారం,నర్సింగాపూర్,పౌనూరు,గ్రామాలలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోతున్నారని అవకతవకలు చేస్తూ రైతుల దగ్గర నుండి దళారులు కాజేస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి వడ్ల సెంటర్లను ఏర్పాటు చేసిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తెలుసుకొని సన్న రకం వడ్లకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందజేస్తుందని కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 తో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరూ దీన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చల్ల సత్యనారాయణ రెడ్డి,మంతెన లక్ష్మణ్,చల్ల విశ్వంభర్ రెడ్డి,పండుగ రాజన్న,శీలం వెంకటేష్,లక్ష్మీనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.

రాజ్యాంగమును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో నగరంపల్లి కొండంపల్లి కొండాపూర్ రంగారావుపల్లి బిక్కోనిపల్లి బంగ్లాపల్లి సీతారాంపురం అప్పయ్య పల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా ఈ రోజు గణపురం మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్,కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపిటిసి కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారుభారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేయాలని కోరారు. నగరంపల్లి మాజీ సర్పంచ్ ఆలూరి కుమారస్వామి, పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి భాస్కర్ రావు, మాధవ్ సత్యనారాయణ రెడ్డి, గొర్రె బాలరాజు, గొర్రె రవి, వెల్గం రాజయ్య, మల్లికార్జున, ఆవుల రవి, తదితరులు పాల్గొన్నారు.కొండంపల్లి దాసర రవి,చిట్యాల నాగరాజు, దాసరి లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజబాబు , మాజీ సర్పంచ్ మామిడి రవి, మామిడి సర్వేశం, మాజీ ఎంపిటిసి పెద్దల్ల సారయ్య, మామిడి చిరంజీవి, రవి తదితరులు పాల్గొన్నారు. రంగారావు పల్లి మాజీ ఎంపీపీ రామేశ్వరరావు, కందుకూరు బ్రహ్మచారి, రవి, ఎర్రబెల్లి మలల్ రావు,భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. బంగ్లాపల్లి సీనియర్ నాయకులు ఉపేందర్ రావ్, గొట్టేముక్కల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షులు పీట్ల రంజిత్, మాజీ ఎంపిటిసి బొల్లం జంపయ్య, మాజీ ఎంపిటిసి పెద్దోళ్ల సారయ్య, ఉపేందర్ రావ్, గొట్టేముక్కుల సుధాకర్ రావు, దూడ దేవేందర్ రెడ్డి, గంధం రాజు, మంద రగు, మేకల పున్నo, తదితరులు పాల్గొన్నారు. అప్పయ్య పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు కొడాలరి రవి, దోమల రాజయ్య, దోమల సమ్మయ్య, ఎలుక పెళ్లి రమేష్, దోబ్బాల సాంబయ్య, మాజీ సర్పంచ్ దోమల రవీందర్, తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ.

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

Congress leaders

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో బీసీ లకు 42% శాతం రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని పలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్ల పంపిణీ చేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రెస్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. టిపిసిసి సభ్యుడు సంగీతం శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప. గడ్డం నరసయ్య. మ్యాన ప్రసాద్. ఆకులూరి బాలరాజు. కుడిక్యాల రవి.తదితరులు పాల్గొన్నారు.

ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

ఇప్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
◆డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
◆ మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో మొగడం పల్లీ మండల మాజీ కోప్షన్ మెంబర్ హర్షద్ పటేల్ ఏర్పాటు చేసిన ఇప్తార్ వేడుకల్లో యన్.గిరిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మహ్మద్.తన్వీర్ మాజీ టిజిఐడిసి చైర్మన్ హాజరయ్యారు. ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు మైనార్టీ సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version