వనపర్తి ఆలయంలో పూలమాల కైంకర్య సేవ

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూలమాల కై oకరియా సేవలో భక్తులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T132339.214-1.wav?_=1

 

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కై oకరియా సేవలో ఏరియా హాస్పిటల్ పాలకమండలి మాజీ సభ్యులు లగిశెట్టి సాయి ప్రసాద్ దంపతులు మార్కెట్ కమిషన్ కొండ రాజయ్య దంపతులు రాజశేఖర్ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది శంకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయని గోదాదేవి అమ్మవారికి పూలమాల కైoకరియా సేవ అర్చనలు పూజలు చేయించే భక్తులు ఆలయంలో సంప్రదించాలని భక్తులను కోరారు పూజల అనంతరం భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు . పూలమాల కై oకరియా సేవలో పాల్గొనే భక్తులను ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఆశీర్వదించారు ధనుర్మాస ఉత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మ వారికి కృపకు పాత్రు లు .ఆలయ ప్రధాన పూజారి భక్తులకు విజ్ఞప్తి చేశారు

యాసంగికి ఎస్సారెస్పీ నీళ్లపై అనిశ్చితి

ఇంకా ఖరారు కానీ నీటి విడుదల షెడ్యూల్

యాసంగికి ఎస్సారెస్పీ నీళ్లు వచ్చేనా?

ఆందోళనలో రైతులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T131631.224.wav?_=2

 

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఎస్సారెస్పీ నీరు వరప్రదాయని మారిన శ్రీరామ్ సాగర్ నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారిం ది ఈ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల కోసం రైతులు ఎదు రుచూస్తున్నారు. నీటి విడు దల అనే విషయం ఎవరు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతు లు ఆందోళనలు చెందుతు న్నారు ముఖ్యంగా ఎస్సారెస్పీ నీటిపై రైతాంగం ఆధారపడి ఉంటుంది నీటి విడుదల షె డ్యూల్ కోసం ఎదురుచూ స్తున్న రైతులు ఈ యాసంగి శ్రీరాoసాగర్ ఎస్సారెస్పీ పరిధి లోని ఇప్పటివరకు షెడ్యూలు ఖరారు కాకపోవడం వల్ల రైతు లు అయోమయంలో ఉన్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యాసంగి డిసెంబర్ తోలి వారంలోనే షెడ్యూల్ విడుదల చేయగా రైతులు విత్తనం నాటు కొన్నా రు కొంతమంది ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూస్తు న్నారు ఒకవేళ నీటిని విడుదల చేయదలుచుకుంటే షెడ్యూలు విడుదల చేయాలని లేని పక్షంలో నీటి విడుదల ఉండ దని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు

 

గతేడాది యాసంగిలో నీళ్లు అందక నష్టపోయాం

గతేడాది యాసంగిలో 2.20 ఎకరాల వరి, మొక్కజొన్న సాగు చేసిన సకాలంలో నీళ్లు అందకపోవడంతో పంట మొ త్తం ఎండిపోయి తీవ్రంగా నష్ట పోయాం ఈసారైనా అధికా రులు స్పందించి సకాలంలో నీళ్లు అందించాలని రైతులు కోరుతున్నారు

సాగుకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలి

బేర్గుసతీష్ శాయంపేట మండల రైతు

ఎస్సారెస్పీ కాలువ నీళ్లపై ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న గతేడాది ఎస్సారెస్పీ నీళ్లు సకాలంలో రాలేదు 8 ఎకరాల్లో నాలుగు ఎకరాలు వరి నాలుగు ఎకరాలు మొక్కజొన్న విత్తుకోవడం జరిగింది నీళ్లు లేక ఎండిపో యి పశువులకు మేత పాలైం ది. రైతుకు 16 లక్షల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడం కాబ ట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే నీళ్లను అందిం చాలి.

పుస్తకాలు కొనండి… పఠనాన్ని పెంపొందించండి

పుస్తకాలు కొనండి….

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T130731.705.wav?_=3

 

జహీరాబాద్ నేటిధాత్రి:

 

ప్రతి సంవత్సరం 11 రోజులపాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ బుక్ ఫేయిర్ పేరుతో నిర్వాహకులు పుస్తకాల పండుగను నిర్వహిస్తున్నారు.పుస్తక ప్రియులకు దేశ ,ప్రపంచ గొప్ప గొప్ప రచయితల రచనలకు పరిచయం చేసి పుస్తక పఠనానికి దోహదం చేస్తున్నారు. దాదాపు 368 పైగా పుస్తకాల స్టాల్ లను ఏర్పాటు చేసి వివిధ రకాల పుస్తకాలను విభిన్న భాషల పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఈ లాంటి బుక్ ఫేయిర్ లను ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పెద్దగొల్ల నారాయణ అన్నారు. పుస్తకాలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని, ఉన్నత,ఉత్తమ విలువలకు దోహదం చేస్తాయి కనుక ప్రతి ఇంటిలో తప్పకుండా కనీసం లో కనిసంగా 100 పుస్తకాలతో మినీ గ్రంథాలయం ఉండాలని సూచించారు. ఈనాటి యువ ప్రపంచానికి పుస్తకాల ప్రాముఖ్యతను తెలియపరుచడం చాలా ముఖ్య విషయం అన్నారు. ఈ సందర్భంగా తాను రాసిన పుస్తక విలాపం రచనను గుర్తు చేసుకున్నారు. అందులోని ఒక వాఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ నెట్ వచ్చాక యువత నన్ను(పుస్తకం) నెట్టి వేస్తున్నారు అని పుస్తకం విలాపం చెందిన తీరును తెలియజేసారు.ఏ కార్యక్రమంలో తనకు మాట్లాడడానికి అవకాశం వచ్చినా విద్యా, పుస్తకాల గొప్ప తనం గురించి, ఎక్కడైనా యువకులు కనిపించిన పుస్తక గురించి ప్రస్తావించారు.హైదరాబాద్ బుక్ ఫేయిర్ అంటే తనకు కూడా చాలా ఇష్టం అన్నారు.ప్రతి సంవత్సరం ఆ పుస్తకాల పండుగలో పాల్గొని చాలా పుస్తకాలను కొనుగోలు చేస్తాను అన్నారు.వివిధ రచనలు చెయ్యడం తో పాటు, వివిధ రకాల పుస్తకాలను సేకరించి చదవడం అదృష్టం గా భావిస్తాను అని గుర్తు చేశారు..
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులతో కలిసి బుక్ ఫేయిర్ ను సందర్శించి పలు పుస్తకాలను కొనుగోలు చేశారు..

బీఆర్ఎస్‌లో చేరిన కొత్తూరు (డి) సర్పంచ్

బీఆర్ఎస్ లో చేరిన కొత్తూరు (డి) సర్పంచ్

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T125846.019.wav?_=4

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం కొత్తూర్ (డి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ మాణిక్ ప్రభు, ఐదుగురు వార్డు సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో గురువారం బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజులు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T125108.610.wav?_=5

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఝరాసంగంలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో బోరు బావిని తవ్వించడం జరిగింది. త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కాలనీలో అందరి సహకారంతో బోరు ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ పాటిల్, చంద్రప్ప, పెంటయ్య, సంగమేశ్వర్, ఆనందం, రాజ్ కుమార్, నాగప్ప, తుకారం, ఇస్మాయిల్, మహమ్మద్ ఫక్రుద్దీన్, అనిల్ కుమార్, సాయిలు, నర్సింలు, లక్ష్మయ్య, సంగన్న, ఫక్రుద్దీన్, కృష్ణ, దత్తు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో మంటల్లో దగ్ధమైన కారు

ప్రమాదవశాత్తు మంటలు వవాహనం దగ్ధం

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T124237.102.wav?_=6

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, గురువారం రాత్రి జహీరాబాద్ బీదర్ రోడ్డులో ఒక కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని బూడిదైంది. వివరాల ప్రకారం, జహీరాబాద్ బీదర్ రోడ్డులోని రైల్వే గేట్ సమీపంలో మారుతి ఓమ్ని వ్యాన్ చెడిపోయి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు బూడిదైంది. కారులో సిఎన్‌జి గ్యాస్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే భయం నెలకొంది మరియు ప్రయాణీకులు పారిపోయారు, ఎవరికీ గాయాలు కాలేదు లేదా ఎటువంటి ప్రమాదం జరగలేదు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

కాంగ్రెస్‌ కు భవిష్యత్తు ‘‘ప్రియాంక‘‘!

దేశ రాజకీయాలకు మరో ఇందిర ‘‘ప్రియాంక‘‘.

`ఇందిరా గాంధీ మళ్ళీ ఆధిపరాశక్తి రూపం ప్రియాంక.

`బీజేపీ ని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నది ప్రియాంక.

`ప్రధాని మోడీకి నేరుగా సవాలు విసురుతున్నది ప్రియాంక.

`నెహ్రు మీద మోడీకి వున్న కోపం వరుసగా లిస్ట్‌ ప్రకారం చెప్పండని సవాలు విసిరింది ప్రియాంక.

`మళ్ళీ నెహ్రు మీద నోరెత్తొద్దని హెచ్చరించిన బ్రేవ్‌ లీడర్‌ ప్రియాంక.

`దేశంలో దమ్ముంటే బ్యాలెట్‌ ఎన్నికలు పెట్టండని సవాలు విసిరింది ప్రియాంక.

`బ్యాలెట్‌ పేపర్‌ తో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదని చెప్పింది ప్రియాంక.

`ధైర్యానికి నానమ్మ రూపం ప్రియాంక.

`దేశానికి రేపటి ఆశాకిరణం ప్రియాంక.

`ఇప్పుడే కాదు రెండున్నర దశబ్దాలకు ముందే ప్రియాంకే వారసురాలు అనుకున్నారు.

`అదే సమయంలో ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

`రాబర్ట్‌ వాద్రను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికి పరిమితమయ్యారు.

`రాహుల్‌ గాంధీ రాజకియ ప్రవేశం చేశారు.

`జానికి రాజీవ్‌ గాంధీ రాజకీయాలకు వస్తాడని ఎవరూ ఊహించలేదు.

`రాజీవ్‌ గాంధీ కన్నా ముందే అయన తమ్ముడు సంజయ్‌ గాంధీ రాజకీయాలలోకి వచ్చారు.

`ఇందిరా గాంధీ కి చేదోడు వాదోడుగా వున్నారు.

`అనుకోకుండా హెలికాప్టర్‌ ప్రమాదం లో మరణించారు.

`తర్వాత కాలంలో ఆపరేషన్‌ బ్ల్యూ స్టార్‌ అనేది పెద్ద సంచలనం సృష్టించిది.

`ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో సైనికులు స్వర్ణ దేవాలయం లోకి వెళ్లాల్సివచ్చింది?

`అది సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది.

`ఇందిరాగాంధీ అంగ రక్షకులే ఆమెను కాల్చి చంపారు.

`అనుకోని సమయంలో రాజీవ్‌ గాంధీ ప్రధాని అయ్యారు.

`తర్వాత జరిగిన ఎన్నికలలో 408 సీట్లతో కాంగ్రెస్‌ గెలిచింది.

`ప్రధాని రాజీవ్‌ గాంధీ శ్రీలంక కు సైనిక సహాయం చేశారు.

`‘‘ఎల్‌ టిటిఈ‘‘ కి అది నచ్చలేదు. 

`అప్పటి నుంచి రాజీవ్‌ గాంధీ వాళ్లకు టార్గెట్‌ అయ్యారు.

`తమిళనాడు లోని పేరంభదూర్‌ ప్రచారంలో మానవ బాంబ్‌ పేలింది?

`ఆ దుర్గటనలో రాజీవ్‌ గాంధీ మరణించారు.

`అప్పటి నుంచి గాంధీ కుటుంబం కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంది.

`తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులోచ్చాయి.

`కాంగ్రెస్‌ నాయకులంతా సోనియా గాంధీ ని పార్టీ అధ్యక్షురాలు గా ఉండాలని కోరారు.

`అప్పుడు కూడా కాంగ్రెస్‌ ఆశా కిరణం ప్రియాంకే అనుకున్నారు.

`రాహుల్‌ గాంధీ రాజకీయాలలోకి తీసుకు రావడం సోనియా గాంధీ కి కూడా ఇష్టం లేదు.

`ఆ తరం లో ముగ్గురు చనిపోవడం సోనియా లో కలతను పెంచింది.

`పార్టీ భవిష్యత్తు దృష్ట్యా రాహుల్‌ రాక తప్పలేదు.

`ఇప్పుడు పార్టీ నిలబడాలంటే ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు.

`పియాంక పార్టీని అధికారంలోకి తెచ్చి అన్నను ప్రధాని చేయడమే ఆమె లక్ష్యం.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                                

 కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ స్దాయిలో భవిష్యత్తు వాయినాడ్‌ ఎంపి. ప్రియాంక గాంధీ. ఇది ఇప్పుడు జాతీయ స్దాయిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. రాహుల్‌ గాంధీ నిజానికి ఎంతో సమర్ధవంతమైన నాయకుడు. ఎంతో విజ్ఞానమున్న నేత. అంతర్జాతీయ స్ధాయి ఆర్దిక వ్యవస్ద మీద ఎంతో అవగాహన వున్న నాయకుడు. అంతర్జాతీయ రాజకీయాల మీద కూడా పట్టున్న నాయకుడు. కాని ఆయన విజ్ఞానం మన దేశానికి పనికి రావడం లేదు. కారణం ఆయనలో వాక్చాతుర్యం లేకపోవడమే? ప్రజలను ఒప్పించి, మెపించే బాష తెలియకపోవడమే. ప్రజలను ఆకట్టుకునేలా ఆయనకు పదాలు జలజల రాకపోవడమే. అవును. ఒక నాయకుడు మంచి వ్యాఖ్యత అయితేనే జనాన్ని మెప్పించగలడు. అవి నిజాలైనా కాని, అబద్దాలైనా కాని జనం నమ్మాలంటే జనాన్ని రంజింపజేసే విధంగా ఆయన మాట తీరు వుండాలి. కాని అది ఆయనకు పదిహేనేళ్లయినా రావడం లేదు. ఆయన చెప్పే మాటలు జనాలకు వెళ్లడం లేదు. బిజేపి నాయకుల మాటల ముందు ఆయన తేలిపోతున్నారు. బిజేపి చేస్తున్న విమర్శలకు ఆయన సరైన సమాదానం ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో చాలా వెనుకబడి పోతున్నారు. ఆయన చెప్పే విషయాలు ఎంతో గొప్పగా వుంటాయి. ఆయన అంచనాలు ఎంతో దూరదృష్టిని కలిగి వుంటాయి. కాని ఆయన మాటలను బిజేపి పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. పైగా నాయకత్వ లక్షణాలు వున్నప్పటికీ ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపే శక్తి ఆయనకు లేదు. అంతే కాకుండా 2009లో ఆయన ప్రధాని కావాల్సిన నాయకుడు. కాని ఆయన ఆనాడు వదులుకోవడమే కాంగ్రెస్‌ పార్టీకి, ఆయన భవిష్యత్తు రాజకీయానికి శాపంగా పరిణమించింది. ఆనాడే ఆయన రాజకీయ జీవితం దారి తప్పింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశి పర్యటనలపై ఎవరూ నోరు మెదపరు. కాని రాహుల్‌ గాందీ విదేశాలకు వెళ్లడాన్ని బిజేపి వివాదం చేస్తుంది. అయినా దాన్ని రాహుల్‌ పట్టించుకోరు. విదేశాలలో రాహుల్‌ ఎంతో అద్యయనం కోసం వెళ్తుంటారు. అది చెప్పుకోరు. కాని బిజేపి చెప్పే మాటలను జనం నమ్ముతున్నారు. ప్రతిపక్ష నేతగావుంటూ ఆయన విదేశాలలో విలాసాలకు వెళ్తారని బిజేపి అంటే జనం నమ్ముతున్నారు. గతంలో ఏ ప్రధాని ఇలా విదేశీ పర్యటలకు వెళ్లలేదని ఏనాడు రాహుల్‌ గాందీ ప్రధాని మోడీని విమర్శించిన సందర్భాలు లేదు. దేశ దేశాలు తిరిగే ప్రదాని మోడీ కరోన సమయంలో ప్రపంచ దేశాలు జాగ్రత్తపడినంత తొందరగా చర్యలు తీసుకోలేదు. కాని అందరికంటే ముందుగానే రాహుల్‌ గాంధీ స్పందించారు. పెను ఉప ద్రవం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ఆ సమయంలో రాహుల్‌ వ్యాఖ్యలను బిజేపి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా రాహుల్‌ను హేళన చేసిన సందర్భం వుంది. అలా రాహుల్‌ గాంధీ అన్ని విషయాల్లో తేలిపోతున్నారు. అందుకే ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈ మూడు సంవత్సరాలలో పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రియాంక గాందీ పార్టీ పగ్గాలు చేపట్టడమే మేలన్న అభిప్రాయాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక గాందీ అచ్చు ఇందిరాగాందీని పోలి వుంటారు. ఇందిరాగాందీలో కనిపించే స్పాంటినిటి ప్రియాంకలో మెండుగా వుంది. పార్లమెంటులో కాని, సభల్లో గాని, మీడియా ముందు గాని ఆమె వేసే చమక్కులు ఎంతో పవర్‌ పుల్‌గా వుంటాయి. ఓ వైపు ఎంతో సీరియస్‌నెస్‌ను చూపిస్తాయి. అంతే ఫన్నీగా వుంటాయి. ఇలా ఒక్క మాట అన్ని రకాల డైమెన్షన్లను చూపించే విధంగా ప్రియాంక పంచ్‌లు వేయడం ఇటీవల కాలంలో చాల చూస్తున్నాం. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు, బిజేపి నాయకులు ప్రియాంక గాందీ పంచుకులకు నివ్వెరపోతున్నారు. ఏ విషయంలోనైనా సరే ఆమె గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్నారు. సబ్జెక్టును పర్‌ఫెక్టుగా వివరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలలో ఆమె నేరుగా ప్రదాని మోడీని సవాలు చేసేలా మాట్లాడుతూ వస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రదాని అయిన తర్వాత పార్లమెంటులో గాని, సభలలో గాని పదే పదే నెహ్రూ గురించి ప్రస్తావిస్తూ అనర్దాలన్నింటికీ కారణమంటూ చెబుతూవుంటారు. అది నరేంద్ర మోడీకి బాగా అలవాటైంది. జనానికి కూడా వినడానికి ఇంపుగా మారింది. దాంతో ప్రియాంక గాందీ ఒక్క మాటలో ప్రధాని మోడీ నోరు మూయించారు. పదే పదే నెహ్రూను ప్రస్తావిస్తూ మాట్లాడడం ఎందుకు? నెహ్రూ చేసిన తప్పులేమిటో వరుసగా ఒక లిస్టు రాసి చెప్పండి. దానిపై పార్లమెంటులో చర్చ చేపట్టండి. ఒక రోజా, రెండు రోజులా, పది రోజులా నిర్ణయం తీసుకోండి. ఎన్ని గంటలు చర్చిస్తారో చర్చించండి. ప్రజలకు తెలియజేయండి. తర్వాత ఇక వదిలేయండి. ఎంత సేపు నెహ్రూ కాలం గురించి ఎందుకు? మీరు ప్రధాని అయి పదకొండు సంవత్సరాలౌతోంది. వర్తమానం చెప్పండి. ఈ పదకొండేళ్లలో సాదించిన ప్రగతి చెప్పండి. ఇవ్వాల చంద్రయాన్‌ గురించి చెప్పుకుంటున్నారంటే అది నెహ్రూ పుణ్యమే అంటూ ఆమె నిండుపార్లమెంటులో చెప్పడంతో బిజేపి నాయకులనోర్లు మూతపడ్డాయి. నెహ్రూ పటేల్‌ను ప్రదాని కాకుండా అడ్డుకున్నారన్న విషయంలో కూడా ప్రియాంక చెప్పిన సమాధానం బిజేపి వాళ్లను ఇరుకున పెట్టింది. అంతే కాకుండా దేశమంతా బ్యాలెట్‌పద్దతిలో ఎన్నికలు పెట్టండనికోరుతోంది. బిజేపికి, కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం వుంటే బ్యాలెట్‌ తో ఎన్నికలు రండి? అని సవాలు విసిరింది. బ్యాలెట్‌ పద్దతిన బిజేపి ఎన్నికలకు వస్తే ఒక్కసీటు కూడా గెల్చుకోలేదని తేల్చి చెప్పింది. ఇలా బిజేపిని ఇంత తక్కువ కాలంలో ఆమె నోరు మూయించే స్దాయికి చేరింది. నిజానికి రెండున్న దశాబ్దాల క్రితం వరకు రాజకీయాలలోకి ప్రియాంక వస్తుందని అందరూ అనుకున్నారు. రాహుల్‌ గాందీ రాజకీయాలకు సరిపోడని ఆనాడే అన్నారు. కాని అనుకోకుండా ప్రియాంక రాలేదు. రాహుల్‌ రాజకీయాలలోకి వచ్చారు. వచ్చిన అవకాశాలను ఆయన దూరం చేసుకున్నారు. అది ఆయన స్వయం కృతాపరధమే అవుతుంది. తనకు తానుగా తన నాయకత్వ పటిమను నిరూపించుకొని ప్రదాని అవుదామనుకున్నాడు. కాని మూడుసార్లు ఆయన అదికారానికి దూరమయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయన వదులుకున్నారు. ఇప్పటికీ దేశంలో కాంగ్రెస్‌ అంటే గాందీకుటుంబమే దిక్కు. రాహుల్‌ గాందీ అటునాయకుడిగా పార్టీకి దిక్కుగా మారలేదు. పెళ్లి చేసుకోలేదు. దాంతో అటు కుటుంబ వారసత్వమైనా, ఇటు రాజకీయ వారసత్వమూ ఆయన వదులుకున్నట్లే లెక్క. రాహుల్‌ గాంధీ ప్రదాని కావాలంటే ప్రియాంకా గాందీ వల్లనే సాధ్యమౌతుంది. ప్రియాంకా గాందీ పార్టీ పగ్గాలు చేపడితేనే కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో బైట పడగలుగుతుంది. లేకుంటే పార్టీ పరిస్దితి మరింత దిగజారే అవకాశం వుంటుంది. ఇప్పటికే రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ అంతరించిపోతుంది. వరుసగా బిజేపి పార్టీ అధికారంలోకి వస్తుంటే రాష్ట్రాలలో సమర్ధవంతమైన నాయకులు రావడం లేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఎల్లకాలం ప్రతిఫక్షంలోనేవుండాలనుకోరు. ఇదే పరంపర కొనసాగితే కాంగ్రెస్‌నుంచి రాష్ట్ర నాయకులు బిజేపి దారి పట్టొచ్చు. అందువల్ల పార్టీకి జవసత్వాలు రావాలి. పార్టీకి పునరుజ్జీవం తెచ్చే నాయకత్వం కావాలి. ప్రియాంక తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రియాంక రంగంలోకి దిగి తన కుటుంబం చేసిన త్యాగాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం ఎంత పోరాటం చేసిందో ఈ తరానికి తెలియజేయాలి. 50 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనతో జరిగిన అభివృద్ది చెప్పాలి. విద్యా, వైద్య రంగాలలో ఎలా పురోగతి సాదించారో చెప్పాలి. ఈ పదకొండేళ్లలో బిజేపి పాలనలో విద్యా వ్యవస్ద ఎలా కునారిల్లిందో చెప్పాలి. నిరుద్యోగ సమస్య ఎలా పెరిగిందో చెప్పాలి. చిన్న చిన్న వ్యాపారాలు ఎలా చిదిమేయబడ్డాయో చెప్పాలి. జిఎస్టీ వల్ల జనం ఎంత నష్టపోయారో ప్రియాంక చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకులను జాతీయం చేస్తే బిజేపి ఎలా ప్రైవేటు పరం చేస్తుందో చెప్పాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ఎలా ఆదుకున్నారో చెప్పాలి. దేశంలో నెహ్రూ కాలంలోనే ఎన్ని బహులార్దక ప్రాజెక్టులు నిర్మాణం చేశారో చెప్పాలి. పదకొండేళ్లలో మోడీ ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని ఎలా నిర్లక్ష్యం చేసిందో చెప్పాలి. నోట్ల రద్దు నుంచి జనం ఎదుర్కొన్న సమస్యలు చెప్పాలి. ఓట్‌ చోరి ఒక్కటే పట్టుకుంటే సరిపోదు. బిజేపి ప్రకృతిని ఎలా విద్వంసం చేస్తుందో చెప్పాలి. అవన్నీ ప్రియాంక గాంధీ వల్లనే సాద్యమని కాంగ్రెస్‌ బలంగా నమ్ముతోంది.

పాండురంగ స్వామి ఆలయంలో ధనుర్మాసo 10 వ రోజు ప్రత్యేక పూజలో భక్తులు..

పాండురంగ స్వామి ఆలయంలో ధనుర్మాసo 10 వ రోజు ప్రత్యేక పూజలో భక్తులు

వనపర్తి నేటిదాత్రి 

 

వనపర్తి పట్టణ ములో పాండురంగ ఆలయంలో ధనుర్మాసo సందర్భంగా 10 రోజు పూజలో భక్తులు పాల్గొన్నారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ వాకిటి శ్రీదర్ ఆలయ పురోహితులు రామకృష్ణ కమిటీ నిర్వహుకులు పూరి బాల్ రాజు పిన్నం వసంత నరేందర్ నుకల విజయ్ వెంకట్ రమణ ఎరువ శీరీష భక్తులు పాల్గొన్నారు

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్

కాప్రా నేటిధాత్రి

 

 

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చ్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గొల్లురీ అంజయ్య , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి , పాస్టర్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కార్యక్రమానికి విచ్చేయుచున్న
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ మండల గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారు ఉదయం 8 గంటలకు వచ్చి వారి వారి కల్యాణ లక్ష్మి చెక్కులను తీసుకోగలరని ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
కోరారు
స్థలం : * గణపురం గ్రామపంచాయతీ కార్యాలయం *

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణకు గుర్తింపు

క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి సందేశం అందించాలి

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఎమ్మెల్యే మాధవరెడ్డితో కలిసి నర్సంపేట డివిజన్ చర్చిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రార్థనలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అన్ని మతాల మధ్య ఐక్యత సామరస్యమే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపని ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడమే నిజమైన అభివృద్ధికి సంకేతమని రాష్ట్ర ఐటీ పరిశ్రమ, వాణిజ్యం,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.క్రిస్టమస్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం తిమ్మరాయన్ పాడ్ లో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలాగే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ పండుగా
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు ఆరోగ్యం సమృద్ధి నిండాలని కోరుకుంటూ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్..

ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాషి కాలనీ చర్చిలో పాస్టర్ రాజవీర్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మదిన వేడుకలకు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను ముందుగా అందరికీ మేరీ హ్యాండ్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

న్యాయవాది అయిత కృష్ణ మోహన్ నివాసంలో శ్రీ మహాలక్ష్మి యాగం..

న్యాయవాది అయిత కృష్ణ మోహన్ నివాసంలో శ్రీ మహాలక్ష్మి యాగం
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో సీనియర్ న్యాయవాది పట్టణ ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు అయిత కృష్ణమోహన్ నివాసంలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు ఈ మహాలక్ష్మి యాగం గోశాల నిర్వాహకులు రామాచార్యులు నిర్వహిoచారని సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు

అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం..

అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతుల

భూపాలపల్లి నేటిధాత్రి

 

గురువారం మధ్యాహ్నం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ – మహా అన్న ప్రసాద కార్యక్రమం అత్యంత కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలసి భిక్ష చేశారు.

వనపర్తి పట్టణ అవొప క్యాలండర్ ఆవిష్కరణ..

 

వనపర్తి పట్టణ అవొప క్యాలండర్ ఆవిష్కరణ

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణ అవొప క్యాలెండర్ ఆవిష్కరణ లక్ష్మి శ్రీనివాస కన్వెన్షన్ హాల్ నిర్వహించామని వనపర్తి పట్టణ అవొప అధ్యక్షుడు కలకొండ శ్రీనివాసులు ఓక ప్రకటన లో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల నుంచి.అవొప క్యాలండర్ వనపర్తి పట్టణంలో ఆర్యవైశ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు బచ్చు రాము పూరి బాలరాజు నాగబంది యాదగిరి సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ గోకారం కృష్ణమూర్తి రాజు కట్ట సాయి నారాయణ పోలిశెట్టి మురళి సంబు వెంకటరమణ కటకం శ్రీధర్ ఉప్పల భాస్కర్ కొట్ర సునీల్ ఆకుతోట శ్రీధర్ పివి ఎస్ ఎన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న…

 

జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ మంత్రి వర్యులు,జహీరాబాద్ ఇన్‌చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ప్రమీల జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు, జహీరాబాద్ ఇన్‌చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ప్రమీల గారు పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

రజక సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కి సన్మానం..

 

రజక సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కి సన్మానం

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మేయర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్,ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, 3వ వార్డ్ మెంబర్ నేరెళ్ల లక్ష్మీ శంకర్, 11వ వార్డు మెంబర్ పసునూటి సౌమ్య శంకర్ లకు స్వీటు శాలువాలతో రజక సహకార సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక సహకార సంఘం గౌరవ అధ్యక్షులు వైనాల వెంకటేశ్వర్లు, రజక సహకారసంఘం పెద్దమనుషులు పసునూటి వెంకన్న,ఎన్నిoడ్ల సమ్మయ్య, వైనాల భాస్కర్, పసునూటి రాజు, నేరెళ్ల సారయ్య, రజక సహకార సంఘం సభ్యులు, పసునూటి శంకర్, ఎన్నిండ్ల శంకర్, వంచనగిరి అశోక్,ఎన్నిండ్ల శంకర్, పసునూటి మధు, వడ్డేపల్లి రవి, కంచర్ల ఐలు, నేరెళ్ల శంకర్, నేరెళ్ల రాజు, రామడుగు నరేష్ ,కుమార్, పసునూటి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం…

 

 

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం

భూపాలపల్లి నేటిధాత్రి

 

జర్నలిస్టులకు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా కాలయాపన చేస్తున్న అధికారులు,ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ ఇళ్ల స్థలాల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నట్టు జయశంకర్ జిల్లా కేంద్రం లో రిలే దీక్షకు దిగిన జర్నలిస్టులు వెల్లడించారు..రెండు మూడు రోజుల్లో స్థలాలు కేటాయించక పోతే ఆమరణ దీక్షకు సిద్ధం అంటూ హెచ్చరించారు..
ఇళ్ల స్థలాల కోసం జయశంకర్ జిల్లా కేంద్రం లో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరహార దీక్షలు 31 వ రోజుకు చేరుకున్నాయి..అయితే స్థలాల కేటాయింపులో కాలయాపన జరుగుతుదనీ అదే విధంగా అధికారులు నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడం తో ఇళ్ల స్థలాల కోసం ఉద్యమ కార్యచరణ ను మరింత ఉదృతం చేస్తున్నట్లు తెలిపారు.. రెండు మూడు రోజుల్లో ఇళ్ల స్థలాల పై అధికారులు ప్రజా ప్రతినిధుల నుండి సరైన స్పందన రాకపోతే ఎమ్మ్యేల్యే క్యాంప్ కార్యాలయాన్ని..కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు… అప్పటికి దిగి రాకపోతే ఆమరణ దీక్షలకు సిద్ధం అని వెల్లడించారు.ఈ కార్యక్రమం లో 37 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు

ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలి..

 

 

ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ లో పాస్టర్ రాజ వీరు ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల కార్యక్రమానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరైనారు అనంతరం కేక్ కట్ చేసి ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు అన్నారు

పార్థీవదేహానికి నివాళులర్పించిన నాగుర్ల..

 

 

పార్థీవదేహానికి నివాళులర్పించిన నాగుర్ల

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలో వార్త రిపోర్టర్ బొమ్మ అశోక్ తల్లి బొమ్మ విజయ మృతి చెందగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమీషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు.వీరి వెంట రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు,అరె సంక్షేమ సంఘం నడికూడ మండల అధ్యక్షులు లోకేటి నగేష్,వాంకె రాజు, శ్రీనివాస్,ప్రభాకర్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version