కోటి గోటి తలంబ్రాల శోభయాత్రకు అధికారుల కు ఆహ్వానం
శ్రీ రామదాసు సేవ సమితి మరియు శ్రీ రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో శ్రీ భద్రాచల సీతారాములా కల్యాణ కోటిగోటి తలంబ్రాల కార్యక్రమం ప్రతి సంవత్సరం సామూహికంగా చేయడం అనవయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మార్చి12–2026గురువారం రోజునా కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర నిర్వహణకు మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి ఎంపీడీఓ ఎల్ భాస్కర్ ని సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ ని మర్యాద పూర్వకముగా ఆహ్వానించడం జరిగిందని శ్రీ రామదాసు సేవ సమితి ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మారావుపేట సేవ సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్ భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్ ఉపాధ్యక్షులు దూలం శంకర్ పనికేలా శివకృష్ణ సమితి సభ్యులు కురిమిళ్ల తిరుపతి గందే ప్రకాష్ పాల్గొన్నారు..
