వనపర్తి లో ఆర్టీఏ నెంబర్ రిజిస్ట్రేషన్ లేని వాహనాలు రోడ్లపై పార్కింగ్
వారు ప్రజలపై దాదాగిరి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆ ర్టి ఏ రిజిస్ట్రేషన్ లేని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేసి అనధికారికంగా వస్తువులను అన్లోడింగ్ చేసి దింపుతున్నారు . రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనాల వారిపై రోడ్డుపై నడిచే ప్రజలపై దాదాగిరి చేసి నానా హంగామా సృష్టిస్తున్నారని ఆపై దాడులు కూడా చేస్తున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు గతంలో టౌన్ ఎస్ఐ గా పని చేసిన వెంకటేష్ గౌడ్ వనపర్తి పట్టణంలో రోడ్లపై వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు . కమాన్ సెంటర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహం దగ్గర వర్తక సంఘం భవనం దగ్గర నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చి దింపుతున్నారని ఆ వాహనాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన వస్తువులను దింపుతూ వనపర్తి ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారి జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకొని వాహనాల ను తనిఖీలు నిర్వహించి జిల్లా రవాణా శాఖ అధికారి వాహనాలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు . అదేవిధంగా పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ కర్నూల్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా కమాన్ చౌరస్తా హనుమాన్ టీటీడీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర రోడ్లపై వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకొని జరిమానాలు విధించాలని ప్రజల పై దాడులు చేసే వాహనాల వారి గూర్చి సీ సీ కెమెరాలతో రికార్డింగ్ ఆధారాలు తీసుకొని కేసు లు నమోదు చేయాలని ఆయన జిల్లా ఎస్పీని కోరారు
జహీరాబాద్ శివారులో లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నం-పూణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు ఉల్లిగడ్డ లోడ్ తో వెళుతున్న లారీ టైర్ పేలి డివైడర్ ను ఢీ కొనగా వెనుక నుంచి వస్తున్న డీసీఎం లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సహదీప్ మండల్ (30), బాలాజీ (50) అనే ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు .
◆-: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్
◆-: “నెమ్మదిగా స్థిరంగా విజయాలు – సురక్షితమైన ప్రయాణం.”
జహీరాబాద్ నేటి ధాత్రి:
సమాజంలో రోడ్డు భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా, ప్రమాదాలను నివారించడానికి కెవి స్కూల్ జంక్షన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కృష్ణపూర్ రోడ్ ప్రాంతాలలో కొత్త స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ కొలత వాహనాల వేగాన్ని నియంత్రిస్తుంది మరియు పాదచారులు మరియు విద్యార్థుల భద్రతను మెరుగుపరుస్తుంది. కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. కెవి స్కూల్ జంక్షన్, కృష్ణపూర్ రోడ్. రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు భద్రతను పెంచడం. స్థానిక నివాసితులు మరియు వాహనదారుల భద్రతను పెంచడానికి ఈ నవీకరణ ఒక ముఖ్యమైన ఝరాసంగం. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐ క్రాంతికుమార్ పటేల్ అన్నారు
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు .
◆-: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్
◆-: “నెమ్మదిగా స్థిరంగా విజయాలు – సురక్షితమైన ప్రయాణం.”
జహీరాబాద్ నేటి ధాత్రి:
సమాజంలో రోడ్డు భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా, ప్రమాదాలను నివారించడానికి కెవి స్కూల్ జంక్షన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కృష్ణపూర్ రోడ్ ప్రాంతాలలో కొత్త స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ కొలత వాహనాల వేగాన్ని నియంత్రిస్తుంది మరియు పాదచారులు మరియు విద్యార్థుల భద్రతను మెరుగుపరుస్తుంది. కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. కెవి స్కూల్ జంక్షన్, కృష్ణపూర్ రోడ్. రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు భద్రతను పెంచడం. స్థానిక నివాసితులు మరియు వాహనదారుల భద్రతను పెంచడానికి ఈ నవీకరణ ఒక ముఖ్యమైన ఝరాసంగం. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐ క్రాంతికుమార్ పటేల్ అన్నారు
ఎలక్ట్రికల్ టూ త్రీ వీలర్ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లి., హైదరాబాద్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేయడం జరిగినది. ఈ ఆక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానం తో ఆర్థిక సహాయ పథకములు రవాణా రంగం పథకం క్రింద ఈవి టూ వీలర్, ఈవి త్రి వీలర్, వ్యవసాయ పథకములు క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ ఆహ్వానించడమైనది. ఆహ్వానించడమైనదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల మున్సిపాలిటి పరిధి లోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వ్యవసాయేతర పథకములకు వయస్సు 21 నుండి 50 సం!! ల వరకు వ్యవసాయ ఆధారిత పథకములకు వయస్సు 21 నుండి 60 సం!! కలిగిన వారు ఆన్లైన్ ప్రక్రియ (tsobmms.cgg.gov.in) ఈనెల 17 నుండి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థుల యొక్క సంవత్సర ఆదాయం రూ. 1,50,000 గ్రామీణ ప్రాంతాల వారికి రూ.2,00,000/- (పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వారికి) మించకుండా ఆదాయం కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ చేసుకోవటానికి అవసరమైన పత్రములు:
ఆధార్ కార్డ్ రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు
కుల ధృవీకరణ పత్రం (మీసేవ జారీ చేసింది)
ఆదాయ ధృవీకరణ పత్రం (మీసేవ జారీ చేసింది) శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగం పధకములకు)
ఈవి ద్విచక్ర వాహనాల కోసం ఎస్.సి వ్యవస్థాపకులు / గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జొమాటో స్విగ్గీ రాపిడో ఉబర్ సమర్పించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గల ముఫై రెండు ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ఆర్ఐ ముసుగు శ్రీనివాసరెడ్డి సహకారంతో ప్రతి పాఠశాలలో చదువుతున్న ప్రతి ఇరవై మందికి ఒక్క చెస్ బోర్డు చొప్పున నూటాఆరు చెస్ బోర్డులను స్థానిక రామడుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు చెస్ బోర్డులను పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రంగనాథ శర్మ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లు కలిగి ఉండాలని, మేదోసంపత్తి ఎదుగుదల, ఆత్మవిశ్వాసం, సరియైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశాలు పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండేలా, తీర్చిదిద్దేందుకు చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులు పంపిణీ చేస్తున్నామని తెలియజెప్పినారు. ఈకార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, రూపారాణి, కే.సురేష్, చెస్ నెట్వర్క్ ప్రోగ్రాం మేనేజర్, విద్యాసాగర్, రామడుగు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఝరాసంగం: నిమ్జ్ జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి అనేది తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఒక కీలకమైన ప్రాజెక్ట్ ఇది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వద్ద ఏర్పాటు సుమారు 12,635 ఎకరాల్లో విస్తరించాలని 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంతో కొంతమేరకు భూసేకరణ ఆలస్యమైంది. ప్రస్తుతం ఝరాసంగం మండలంలో బర్దిపూర్, ఎల్గోయి, చిల్లపల్లి, చిల్లపల్లి తండా గ్రామాల్లో సుమారుగా 3,245 ఎకరాల భూమిలో వివిధ పరిశ్రమల స్థాపన కోసం ఫస్ట్ ఫేజ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పనులు ప్రారంభం కావడంతో 14 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లు అనిపిస్తుంది.దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమల ఉత్పాదకతను పెంచేందుకు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో నిమ్డ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సుమారు 13 నిమ్స్ ప్రాజెక్టులను ప్రతిపాదించగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు ప్రాజెక్టులు కేటాయించారు.
వాటిలో ఒకటి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత, రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ సమస్యల కారణంగా నిమ్ ప్రాజెక్టు పనులు చాలా సంవత్సరాలుగా ముందుకు సాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మేర భూసేకరణ చేపట్టింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల స్థాపన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో అధికారులు నిమ్డ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీంతో నిజ్జా ప్రాంతంలో మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు పరిశ్రమల స్థాపనకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పలు పరిశ్రమలకు భూముల కేటాయింపు….
నిమ్డ్ పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చిన పలు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈవీఎం టెక్నాలజీ సంస్థకు 511 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్థ రూ. వెయ్యి కోట్ల రూపాయలతో పరిశ్రమలు స్థాపించనున్నది. ఈ సంస్థకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన చేసింది. భారీ ప్రహరీ గోడ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ రూ. 2,100 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందం కుదిరించుకుంది. హ్యుందాయ్ మోటార్ కంపెనీ (ఈవీ ఆటోమోటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కంపెనీకి 675 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా ఈ సంస్థ సుమారుగా రూ. 8,528 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇటీవలనే స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 4,276 మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని భావిస్తున్నారు. త్వరలో ఈ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన జరుగనున్నట్లు ప్రచారం కొనసాగుతోంది.
మౌలిక వసతుల కల్పనలో ముందుకు…..
మొదటి విడతగా సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టనున్నారు. దాదాపు రూ. 2,369 కోట్ల వ్యయంతో నిమ్డ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతగా సేకరించిన 3,245 ఎకరాల భూముల్లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి.
జోరుగా కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం…
నిమ్డ్ పలు పరిశ్రమల నిర్మాణం కోసం ఉండేందుకు కార్మికుల కోసం దాదాపు 100 షెడ్ల నిర్మాణం జోరుగా కొనసాగుతోంది. 24/7 పనులు సాగేందుకు వీలుగా విద్యుత్, నీటి సరఫరా, వైద్యం, భోజనశాలలు, డ్రైనేజీ, భద్రత ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తానికి 14 సంవత్సరాల నిరీక్షణకు పరిశ్రమల స్థాపన కోసం ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలతో తెరపడినట్లు కనిపిస్తుంది.
స్పెల్లింగ్ బీ జాతీయస్థాయి పోటీలకు సరస్వతి విద్యార్థి
రామడుగు, నేటిధాత్రి:
జాతీయ స్థాయి స్పెల్లింగ్ బీ పోటీలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని ఉప్పు అన్విత ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన జోనల్ స్థాయి స్పెల్లింగ్ బీ పోటీల్లో అన్విత తృతీయస్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఈసందర్భంగా ఆయన సూచించారు. అనంతరం జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అన్వితను విశ్వం ఎడ్యుటెక్ జోనల్ హెడ్ వినాయక్, ఇంటర్నేషనల్ మెమొరీ ట్రైనర్ దైవాల వేణుకుమార్, స్కూల్ కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.
న్యాల్కల్ మండలంలో పదో తరగతి పరీక్షలకు 455 మంది విద్యార్థులు హాజరు
జహీరాబాద్, నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) మారుతి తెలిపిన వివరాల ప్రకారం, మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 45 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు.
రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
జహీరాబాద్, నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం దిగ్వాల్ రాయపల్లి సమీపంలో ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని జీర్లపల్లికి చెందిన రాజు (48) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని కుడి కాలు పాదం, మూడు దంతాలు విరిగిపోయాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, రాజుకు ప్రథమ చికిత్స అందించి జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
మేదపల్లి గ్రామంలో కరెంటు గోసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ పాటిల్ తెలిపారు. రోజుకు పలుమార్లు కరెంటు పోవడంతో గృహ అవసరాలు, రైతుల వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని అన్నారు. సమయంలో కూడా విద్యుత్ సరఫరా సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమాజంలో రోడ్డు భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా, ప్రమాదాలను నివారించడానికి కెవి స్కూల్ జంక్షన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కృష్ణపూర్ రోడ్ ప్రాంతాలలో కొత్త స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ కొలత వాహనాల వేగాన్ని నియంత్రిస్తుంది మరియు పాదచారులు మరియు విద్యార్థుల భద్రతను మెరుగుపరుస్తుంది. కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. కెవి స్కూల్ జంక్షన్, కృష్ణపూర్ రోడ్. రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు భద్రతను పెంచడం. స్థానిక నివాసితులు మరియు వాహనదారుల భద్రతను పెంచడానికి ఈ నవీకరణ ఒక ముఖ్యమైన ఝరాసంగం. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐ క్రాంతికుమార్ పటేల్ అన్నారు
జహీరాబాద్-అల్గోల్ రహదారిని నరకప్రాయంగా చాలా అధ్వాన్నంగా వర్ణించారు.
◆-: అధికారుల నిర్లక్ష్యంపై శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహీరాబాద్, నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం నుండి అల్గోల్ వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రస్తుతం మరణ ఉచ్చుగా మారిపోయింది.రోజూ వందలాది వాహనాలు ప్రయాణించే ఈ కీలకమైన రోడ్డు పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.గత కొంతకాలంగా రోడ్డు దారుణమైన స్థితికి చేరుకున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు దాని వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల వైఖరిపై శ్రీనివాస్ రెడ్డి నిరాశ: ఈ రోడ్డు దుస్థితిని గమనించిన స్థానిక నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.తాను స్వయంగా వినతిపత్రాలు సమర్పించి, రోడ్డు మరమ్మతులు కోరినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన ఫిర్యాదు చేశారు.అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించకుండా సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల భయం: “ఈ రోడ్డుపై ప్రయాణించడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించడమే. భారీ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు పడి తీవ్రంగా గాయపడుతున్నారు. రాత్రిపూట ఈ రోడ్డుపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారింది” అని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు.తక్షణ చర్యకు డిమాండ్: ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు గాఢ నిద్ర నుండి మేల్కొని, వెంటనే నిధులు మంజూరు చేయాలని మరియు ఈ రహదారికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
`ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్న “డిఎం అండ్ హెచఓ”లు?
`”మేడ్చల్ మల్కాజిగిరి “డి ఎం అండ్ హెచ్ ఓ” మీద లెక్క లేనన్ని ఆరోపణలు?
`ప్రభుత్వ వైద్యుల నుంచి మొదలు ప్రైవేట్ ఆసుపత్రులను వేధించుకు తింటున్నట్లు విమర్శలు?
`ఉమా గౌరీ బాధితులు వందల్లో ఉన్నట్లు సమాచారాలు?
`ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి లక్షల్లో వసూళ్లు?
`లంచం ఇవ్వకుంటే వెంటనే ఆగమేఘాల మీద ఆసుపత్రులు సీజ్?
`ఎలాంటి కారణం లేకున్నా లక్షలు సమర్పించుకోవాల్సిందే?
`ఉమా గౌరీ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని మరి వసూళ్లు?
`ఇప్పటికైనా మంత్రి స్పందించాకపోతే మొదటికే మోసం రావొచ్చు?
`అనవసరంగా మంత్రి అపఖ్యాతి మూట గట్టుకోవాల్సి రావొచ్చు?
హైదరాబాద్, నేటిధాత్రి:
పుండుకు ఆదిలోనే మందు వేయాలి. లేకుంటే అది వ్రణమైతుంది. శరీరాన్ని తింటుంది. అవినీతి కూడా అంతే. ఆదిలోనే దానిని తుంచేయకపోతు సమాజాన్ని తింటుంది. వ్యవస్ధను నాశనం చేస్తుంది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. ఎలాంటి సంబంధం లేకపోయినా పాలక పెద్దల రాజకీయంతో ఆడుకుంటుంది. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతుందన్న అనమానం వ్యక్తమౌతోంది. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో కొంత మంది అదికారు ల మూలంగా మంత్రి దామోదర రాజనర్సింహ పేరు అపఖ్యాతి పాలౌతుందన్న మాటలు వినిస్తోంది. సహజంగా మంత్రి దామోదర రాజనర్సింహ అత్యంత సౌమ్యుడు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా,ఇప్ప్పుడైనా ఎలాంటి వివాదాలు లేకుండా, రాకుండా తన పని తాను చేసుకుపోయే మంత్రి. అలాంటి ఆయన నిర్వహిస్తున్న శాఖలో కొంత మంది అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టుపట్టిసున్నారు. వైద్యశాఖను అవినీతి కంపులో కూరుకుపోయేలా చేస్తున్నారు. నిజానికి వైద్య శాఖ అంటేనే ఎంతో మందికి గౌరవం వుంటుంది. వైద్యులంటే ఎంతో నమ్మకం వుంటుంది. వైద్యులను చూస్తే మొక్కబుద్దవుతుంది. ఏ వ్యవస్ధలోనైనా సరే చీడపురుగులు వుంటారు. అలాగే వైద్యశాఖలోనూ వుంటారు. అలాంటి చీడ పురుగుల మూలంగా వైద్యశాఖకు చెడ్డపేరు వస్తోంది. అసలు ఆరోగ్యశాఖ అంటేనే రాజకీయ నాయకులు భయపడుతుంటారు. ఆ శాఖ తీసుకోవాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. రాజకీయాల్లో కూడా చాల సెంటిమెంట్లు వుంటాయి. ఒక్కసారి స్పీకర్‌గా పనిచేసిన నాయకుడికి ఇక రాజకీయం వుండదు. మరుసటి ఎన్నికల్లో గెలుపు వుండదు. అప్పటిదాక సాగిన రాజకీయం ఆగమ్యగోచరమౌతుందన్న నమ్మకాలు వున్నాయి. అలాగే మంత్రి వర్గంలో ఏ శాఖకు లేని సెంటి మెంటు కూడా వైద్యశాఖకూ వుంది. ఒక్కసారి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన ఏ నాయకుడైనా సరే తర్వాత రాజకీయం అంతంత మాత్రమే అనేది అనేక సార్లు రుజువైంది. ఆ సెంటిమెంటే నిజమైంది. అది కేవలం మూఢ నమ్మకం అనుకునేవాళ్లు వుండొచ్చు. కాని నిజమైన సందర్భాలు ఎక్కువగా వుండడంతో వైద్యశాఖ అంటే నాయకులు భయపడతారన్నది కూడా అంతే నిజం. అలా రాజకీయంగా కనుమరుగైన నాయకులు చాలా మంది వున్నారు. ఒక్కరో ఇద్దరో మళ్లీ రాజకీయాల్లో వున్నా చురుకైన పాత్ర పోషించి వారు లేరు. క్రియాశీల రాజకీయాలను ఏలినా వారు లేరు. అంతకు ముందు వున్న రాజకీయ బలం వున్నది లేదు. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తర్వాత వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన నాగం జనార్ధన్‌రెడ్డి ఎప్ప్పుడైతే వైద్యశాఖ మంత్రి అయ్యారో ఆయన రాజకీయ ప్రస్తానం కుదుపులకు లోనైంది. తర్వాత ఆయన రాజకీయం మునుపటిలా సాగకుండాపోయింది. ఆయన ఎన్ని పార్టీలు మారినా ఆయన రాత పూర్వవైభవం చూసింది లేదు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తొలి ఉప ముఖ్యమంత్రిగా వైద్యశాఖ మంత్రిగా పనిచేసి తాటి కొండ రాజయ్య రాజకీయం అక్కడితో ఆగిపోయింది. ఏదో రకమైన రాజకీయ అడ్డంకులు ఎదురౌతూనే వున్నాయి. ఇప్పటికీ ఆయనకు రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. తర్వాత వైద్యశాఖ మంత్రులుగా పనిచేసి వారిలో అప్పటి వరకు కీలకమైన పాత్ర పోషించిన వారి రాజకీయం కూడా అంతంత మాత్రంగానే వుంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రాజకీయం ఆగిపోయింది. తర్వాత ఈటెల రాజేందర్ లాంటి నాయకుడికి రాజకీయం తలకిందులైంది. రాజకీయాల్లో వున్నారంటే వున్నారన్నట్లే కాని ఆయన గత వైభవం లేదన్నది వాస్తవం. ఆరోగ్యశాఖ నిర్వహించిన తర్వాత ఎన్నికల్లో గెలిచింది కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్. రాజశేఖరరెడ్డి, తెలంగాణలో హరీష్‌రావు. అయితే ఈ ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖను అదనపు శాఖలుగా నిర్వహించిన నాయకులు మాత్రమే. మిగతా నాయకులంతా పూర్తిగా వైద్య ఆరోగ్యశాఖలు నిర్వహించారు. అందులో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య కూడా వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత ఈటెల రాజేందర్‌లాగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఒక్కసారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల్లో గెలవని నాయకులు వున్నారు. అందులో కోడెల శివప్రసాద్ రెడ్ది వున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచిన స్పీకర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా పనిచేసిన సంబాని చంద్రశేఖర్, శనక్కాయల అరుణ లాంటి వారు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అకారణంగా తన పదవిని కోల్పోయారు. తర్వాత ఎన్నికల్లో గెలిచినా, రాజకీయ త్యాగాలతో మొదటికే మోసం తెచ్చుకున్నారు. ఇప్ప్పుడు మళ్లీ ఎమ్మెల్యే అయ్యేందకు శతవిదాల ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అన్న డైలమాలోనే వున్నారు. తర్వాత వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు. ఈటెల రాజేందర్ వైద్యశాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టినప్ప్పుడే ఇక రాజకీయం అవుట్ అనే వార్తలు వచ్చాయి. అలాగే జరిగింది. తర్వాత అదనపు శాఖగా నిర్వహించిన హరీష్‌రావు గెలిచారు. కాని ప్రబుత్వం పోయింది. ఆయన రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే అదనపు శాఖలుగా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్యలు ముఖ్యమంత్రులయ్యారు. మరి తెలంగానలో అదనపు శాఖగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన హరీష్ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న దామోదర రాజనర్సింహ ఎంతో సౌమ్య స్వభావం వున్న నాయకుడు. ఆయన మంచి తనం కూడా ఆ శాఖ నిర్వహణలో పనికి రాకుండా పోతోందని అంటున్నారు.
మంత్రి మంచి తనాన్ని సాకుగా తీసుకొని కొంత మంది అదికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అనేకం వస్తున్నాయి. మంత్రి మెతక తనాన్ని అసలుగా తీసుకొని కొంత మంది పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటున్న డిఎంఅండ్ హెచఓలువున్నారు. వారిలోమొదటి వరుసలో మేడ్చల్, మల్కాజిరిగి డిఎంఅండ్‌హెచఓ ఉమా గౌరీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వున్నాయి. అటు ప్రభుత్వ వైద్యుల నుంచి మొదలు, ప్రైవేటు ఆసుపత్రులను ఆమె వేదించుకు తింటున్నారని అంటున్నారు. హైదరాబాద్ పరిధిని కూడా తనలో కలుపుకున్న మేడ్చల్, మ ల్కాజిగిరి డిఎంఅండ్‌హెచఓ ప్రైవేడు ఆసుపత్రులను నుంచి పెద్దఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పత్రికల్లో పుంఖాను పుంకాలుగా వార్త కథనాలు వస్తున్నాయి. పొగలేనిదే నిప్ప్పురాదు. అయినా బాదితులు మీడియా ముఖంగా వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు.
నేటిధాత్రికి ఆమె బాదితులు ఎంతో మంది పోన్లు చేస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్ప్పుకుంటున్నారు. ఆమె వేదింపులు భరించలేకపోతున్నామంటున్నారు. మహిళా వైద్యులను కూడా ఆమె ఎంతో వేదస్తున్నారని తెలుస్తోంది. ఒక ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని ఆసుపత్రులకు ఫోన్లు చేసి అనుచరులను పంపించి వసూలు చేస్తుందంటున్నారు. ఏ ఆసుపత్రి నిర్వాహకులు ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో నిర్ణయిస్తారట. చెప్పిన గడువులోగా అడిగింది ఇవ్వకుంటే ఆసుపత్రిని సీజ్ చేస్తామంటారు. పైగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూడ ముందే ఆసుపత్రి సీజ్ చేసి తర్వాత వసూలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. గత గత సంవత్సర కాలంగా ఆమె వేదింపులు భరించలేకపోతున్నామని వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అయితే తాను నెల నెల ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వకుంటే, మీÅ£ంటే నాకు ఎక్కువ ప్రెజర్ వుంటుందని ఉమా గౌరీ అంటున్నట్లు కూడా బాధితులు చెబతున్నారు. అంటే ఆమె నెల నెల పై స్ధాయి పంపిస్తున్నామన్న మాట ఎవరి గురించి చెబుతోందన్న దానిపై కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే మంత్రి దామోదర రాజనర్సింహ శాఖ పరిస్దితిని అదుపు చేయకపోతే, జరుగుతున్న అవినీతిని అరికట్టకపోతే, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా మంత్రికి చెడ్డ పేరు వస్తుంది. అవినీతి అదికారులపై దర్యాప్తు చేసి పరిస్దితి చక్కదిక్కపోతే ప్రభుత్వం పరువు పోతుంది.
· కేవలం పదిరోజుల్లో “వెలుగుమట్ల” సమస్యను పరిష్కరించిన నేత
· నిజమైన బాధితులను గుర్తించి ఇళ్ల పట్టాలు అందజేత
· డిసెంబర్ 9 నాటికి గహప్రవేశాలు జరిపేందుకు ఇప్పటినుంచే చర్యలు
· పదెకరాల్లో మోడల్ కాలనీ నిర్మాణం
· సమర్థవంతమైన పనితీరుతో మంత్రివర్గంలో స్థానం సుస్థిరం
· ఆదేశాలివ్వడమే కాదు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఆయన పనితీరుకు నిదర్శనం
· ఖమ్మం జిల్లాను అభివద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ముగ్గురు మంత్రులు
హైదరాబాద్, నేటిధాత్రి:
రాష్ట్ర రెవెన్యూ, గహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగుమట్ల బాధితులకు పదిహేను రోజుల్లోగా ఇళ్ల పట్టాలిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మడమతిప్పని నాయకుడిగా నిరూపించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే మార్చి 11న ఉపముఖ్యమం త్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావులతో కలిసి 311 మంది బాధితులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. మంత్రిగా ఆయన ఏ విషయంలోలైనా వేగంగా స్పందించి అనుకున్నదానికంటే పని పూర్తిచేస్తారన్న పేరుంది. ఆ పేరును వెలుగుమట్ల బాధితుల విషయంలో కూడా మార్చి 1న ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు రోజుల ముందే ఈ ప్రక్రియను పూర్తిచేసి సెభాష్ అనిపించుకున్నారు.
గత ఫిబ్రవరి నెలలో వెలుగుమట్ల (ఖమ్మ) భూదాన్ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారంటూ పేదల ఇళ్లను కూల్చివేతతో వివాదం రాజుకుంది. జిల్లాకు చెందిన ముగ్గు రు నాయకులు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వార్తలు రావడంతో ఈ ముగ్గురు మంత్రు లు చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. తమపై వస్తున్న ఆపవాదులనులను అసత్యాలని నిరూపించేందుకు ముగ్గురు మంత్రులు తక్షణమే రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి అడుగులు ముందుకు వేసారు. ఆవిధంగా చర్యలు తీసుకున్న తర్వాత మార్చి 11న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన చేతుల మీదుగా బాధితులకు పట్టాలు పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “నష్ట నివారణ చర్యల్లో” కీలక పాత్ర పోషించారు. అర్హులైన బాధితులను గుర్తించాలని కలెక్టర్‌ను అదేశించడమే కా కుండా, మోడల్ కాలనీగా అభివద్ధి చేయడానికి పదెకరాల భూమిని గుర్తించాలని సూ చించారు. ఆదిశగా ఆయన వ్యక్తిగతంగా ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు కషిచేశారు.
ఇక రెవెన్యూ, గహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి, తన శాఖకు చెందిన సమస్యే కావడంతో, ఖాళీ చేయించిన కుటుంబాలకు కావలసిన భూమినిఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. గుర్తించిన భూమికి వారంలోగా నిర్మాణానికి అవసరమైన నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. ఆవిధంగా ముగ్గురు మంత్రులు గత కొద్దికాలంగా అనవసర రాద్ధాంతానికి కారణమైన వెలుగుమట్ల వివాదానికి ముగింపు పలికారు. అంతేకాదు ఈ ఏడాది డిసెంబర్ 9నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రిచేత గహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా స్పష్టం చేయడం విశేషం. బాధితులను ప్రస్తుతం కొన్ని తాత్కాలిక షెల్టర్లకు తర లించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, తదితర ఫంక్షన్ హాళ్లలో 700 బాధితులకు స దుపాయం కల్పించగా, మరికొంతమందిని కూల్చివేతల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్ర భుత్వ పునరావాస కేంద్రాలకు కలెక్టర్ తరలించారు.
ఇక రెవెన్యూ, గహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకుఅనుకున్న ప్రకారం మోడల్ కాలనీ నిర్మాణం పూర్తిచేసి, వీరితో గహప్రవేశాలు పూర్తిచే యించాలన్న కతనిశ్చయంతో వున్నారు. కాలనీ నిర్మాణానికి అవసరమైన విశాలమైన రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తారు. ఇక పారిశుద్ధ్య కార్యక్రమం కింద స మగ్రమైన రీతిలో మురుగునీటి పారుదల సౌకర్యాన్ని కల్పించనున్నారు. అంతేకాదు కాలనీలో ఒక ఆసుపత్రి, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నిర్మిస్తారు. ప్రభుత్వ వీటిని మిగిలిన 16ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. వీటితో పాటు ఒక కమ్యూనిటీ హాల్‌ను, కమర్షియల్ కాం ప్లెక్స్‌ను నిర్మాణాలు కూడా పూర్తిచేస్తారు. ఈ శాఖ మంత్రి కావడంతో పొంగులేటి శ్రీని వాసరెడ్డి ప్రత్యేకంగా ఈ పనులను పర్యవేక్షించనున్నారు. ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకుఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమన్న సత్యాన్ని నిరూపించే దిశగా ముఖ్యంగా వివాదాస్పద వెలుగుమట్ల బాధితుల విషయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో ఎంతో చురుగ్గా పనిచేశారు. క్షేత్రస్థాయిలోఅధికార్లతో సామాజిక`ఆర్థిక సర్వే చేయించారు. సుమారు 412మంది బాధితులను గు ర్తించగా తొలిదశలో 311మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అనర్హులకు జాబితాలో చోటు లేకుండా పారదర్శకంగా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. “పేదవాడి కన్నీరు తుడవడమే తన ధ్యేయం”గా పొంగులేటి పనిచేస్తున్నారు. వెలుగుమట్ల కూల్చివేతల విషయంలో తన పై వచ్చిన ప్రతికూలతను మానవతా దక్పథంతో వ్యవహరించి బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించడం ద్వారా సానుకూలంగా మలచుకోవడం ఆయన సమర్థ నాయకత్వాన్ని వెల్లడిస్తోంది.
కేవలం స్థానిక సమస్యలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం “భూ భారతి పోర్టల”తో పాటు కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడంలో కీలకంగా వ్యవహ రిస్తున్నారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తూ సుమారు 2.35లక్షల పెండింగ్ మ్యుటేషన్ల ను క్లియర్ చేయడం ఆయన ప్రతిభకు, నిబద్ధమైన పనితీరుకు నిదర్శనం. ధరణి పోర్టల్ లో అప్పీలు చేసుకునే అవకాశం పరిమితంగా వుండేది. ఈ ఇబ్బందిని అధిగమించే రీతిలో, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిల్లోనే సమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించడం భూభారతి చట్టం ప్రత్యేకత. ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి కమతానికి 12అం కెలతో కూడిన “భూదార్ నెంబరు”ను కేటాయిస్తారు. దీని ద్వారా భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాప్‌లు అందుబాటులో వుంటాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియుసర్వే విభాగాలను ఒకే ఛత్రం కిందికి తెచ్చారు. దీనివల్ల భూమి రిజిస్ట్రేషన్ కాగానే ఆ టోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగేలా, వారసత్వ భూములు ఎటువంటి జాప్యం లేకుండా బదలాయింపు జరిగేలా నిబంధనలు రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి సాదా బైనామాలను క్రమబద్ధీకరించే అవకాశం కల్పించారు. ఫిర్యాదులు, అప్పీళ్ల విషయంలో రైతులనుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయరు. ఆబాదీ, గ్రామకంఠం భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని కొన్ని మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి “ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ” అందుబాటులోకి రానుంది. దీనిద్వారా రైతులు ఒక్క క్లిక్‌తో తమ భూముల వివరాలు తెలుసుకోగలుగుతారు. ధరణికి, భూభారతికి వున్న ప్రధానమైన తేడా ఏంటంటే, ధరణిలో కేవలం డిజిటల్ రికార్డులుండగా, భూభారతిలో డిజిటల్‌తో పాటు మాన్యువల్ రికార్డులను కూడా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 18లక్షల ఎకరాల భూములు వివాదాల్లో వుండటం వల్ల పార్ట్`బి (నిరోధిత జాబితా)లో వుండిపోయాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చిన భూభారతి ద్వారా సమస్యలు పరిష్కరించి అసలైన యజమానులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఇన్ని మార్పులు తీసుకొ చ్చిన ఘనత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిదే అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
రాష్ట్ర వ్యాప్తం గా మూడులక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యాన్ని సాధించాలన్న తపన ఆయనలో బాగా కనిపిస్తున్నది. ఈ దిశగా అధికార్లను పరుగులు పెట్టిస్తున్నారు. మార్చి నెలాఖరుకు మొదటి విడత పూర్తిచేసి, ఏప్రిల్ నుంచి రెండో విడత ప్రారంభించాలన్న కతనిశ్చయంతో వున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో “బెస్ట్ పర్మాఫర్మర”గా పొంగులేటి ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయడం, పనులపై పూర్తి అవగా హనతో అధికార్లపై పట్టు సాధించి పనులు చేయించడం ఆయన ప్రత్యేకత.ఈ లక్షణమే ఆయన్ను విలక్షణ నాయకుడిగా గుర్తింపు తెచ్చింది.
అంతదాకా ఎందుకు, ఎన్నో ఏళ్లుగా ఏటూ తేలని, వెలుగుమట్ల భూముల వివాదాన్ని కేవలం పదకొండు రోజుల్లో పరిష్కరించి, బాధితులకు పునరావాస సదుపాయం ఘనత పొంగులేటిదే అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. దీంతో ఇప్పటివరకు ఆ భూముల్లోతాము నిర్మించుకున్న ఇళ్ల విషయంలో సందిగ్ధంతో వున్న బాధితులకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లలో గహప్రవేశా లు నిర్వహించాలన్నది ఆయన లక్ష్యం. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నారు.
భూముల సర్వే విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. భూ రికార్డులు మరింత కచ్చితంగా వుండేందుకు వీలుగా జీపీఎస్, డీజీపీఎస్ రోవర్ పరికరాలను ప్రవేశపెట్టారు.ఇక రెవెన్యూ శాఖను కేవలం పన్నులు వసూలు చేయడానికి మాత్రమే కాకుండా, ప్రజా సేవకు పనిచేసేవిధంగా తీర్చిదిద్దారు. రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ఇప్పటివరకు అద్దె ఇళ్లలో కొనసాగుతున్న 230 తహసీల్దార్, ఆర్డీవో కార్యాల యాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రళాలికలు రచించారు. ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, ఒక్కొక్క ఇంటికి అందించే రూ.5లక్షలను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నాలుగు విడతలుగా జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
రెవెన్యూ‘గహ నిర్మాణ శాఖలతో పాటు ఆయన సమాచార పౌరసంబంధాలశాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఈ మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆయన సొంత జిల్లా అయిన ఖమ్మం జి ల్లాలో పూర్తిగా పది స్థానాలను కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేలా చేసిన ఘనత ఆయనదే. ఆ విధంగా ఆయన సొంత జిల్లాతో పాటు, కేబినెట్‌లో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకు న్నారు. పనితీరు విషయంలో ఆయన ప్రభుత్వం, ప్రజలనుంచి పూర్తి మార్కులు సంపా దించుకున్నారు. పొంగులేటి విజయంలో ఆయన పాటించే “డెడ్‌లైన” అంశం చాలా కీల కం. ఆయన సాధిస్తున్న విజయాలకు దీన్ని పాటించడమే ప్రధాన కారణం. అంతేకాదు ఆయన కేవలం ఆదేశాలివ్వడానికే పరిమితం కారు. క్షేత్రస్థాయిలో పనుల తీరును ఎప్పటి కప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఆయన పాటించే “డెడ్ లైన” వల్ల తక్కువ సమ యంలో ఎక్కువ ఫలితాలు చూపగలుగుతున్నారు.
భక్తుల విశ్వాసానికి ఆలయం.. అధికార ప్రదర్శనకు కాదు.
ప్రత్యేక దర్శనాలు భక్తులకా..? లేక పరిచయాల రాజకీయాలకా..?
ధర్మకర్తలు సేవకులా..? లేక గుడి యజమానులా..?
వరంగల్, నేటిధాత్రి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళి ఆలయంలో ధర్మకర్తల జోక్యం రోజురోజుకు మితిమీరుతున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిలో ఉద్యోగులు ఉన్నప్పటికీ, ధర్మకర్తల హడావుడి ఎక్కువై సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గుడిలో సేవలు చేయాల్సిన బాధ్యత ఉన్న ధర్మకర్తలు తమ విధులు పక్కన పెట్టి పెత్తనం చెలాయిస్తున్నారని, తమకు తెలిసిన వ్యక్తులను ప్రత్యేక దర్శనానికి పంపిస్తూ సామాన్య భక్తులను పక్కన పెట్టుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల గంటల తరబడి క్యూలో నిలబడే భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిన్న పిల్లలు, పసిపిల్లలతో వచ్చిన మహిళలకు కూడా నేరుగా దర్శనం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని మహిళా భక్తులు వాపోతున్నారు. మరోవైపు రూ.100 టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్లిన ఒక ఎన్‌ఆర్‌ఐ మహిళకు కేవలం ఒక్క క్షణం కూడా నిలబడనివ్వకుండా నెట్టివేయడంతో ఆమె గుడి సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన ఆలయంలో చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆమెను మళ్లీ దర్శనానికి పంపించినట్లు సమాచారం.
అలాగే ఆలయంలోని ఒక ధర్మకర్త గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు బోనగాని యాదగిరి గౌడ్‌తో అమర్యాదగా మాట్లాడిన ఘటన పెద్ద గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
“గుడిలో ఉద్యోగులు, అయ్యగారు, ధర్మకర్తలు అందరూ తమకు తెలిసిన వారినే ముందుగా తీసుకెళ్తున్నారు. సామాన్య భక్తుల పరిస్థితి ఎవరూ పట్టించుకోవడం లేదు” అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఉద్యోగులు జర్నలిస్టులకు కూడా దర్శనం అవకాశం కల్పించకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన భద్రకాళి ఆలయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ధర్మకర్తల హడావుడికి చెక్ పెట్టి, సామాన్య భక్తులకు సౌకర్యంగా దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ధర్మకర్తలా..? లేక గుడి యజమానులా..?
భక్తుల సేవ కోసం నియమించిన ధర్మకర్తలు కొన్నిసార్లు గుడి యజమానుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ పరిపాలనను పర్యవేక్షించి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కొందరు ధర్మకర్తలు తమ పరిచయస్తులను ప్రత్యేక దర్శనాలకు పంపిస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
గంటల తరబడి క్యూలో నిలబడే భక్తులు ఇబ్బంది పడుతుంటే, పరిచయాల ఆధారంగా కొందరికి వెంటనే దర్శనం కల్పించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ధర్మకర్తల పని సేవ చేయడం గానీ, పెత్తనం చెలాయించడం కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఆలయాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకలు. అలాంటి పవిత్ర స్థలాల్లో అధికార ప్రదర్శనలు కాకుండా, భక్తులకు గౌరవంగా దర్శనం కల్పించే విధంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.
ధర్మకర్తలు అసలు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?
చేయాల్సినవి….
ఆలయ పరిపాలన సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలి. భక్తులకు సౌకర్యంగా, గౌరవంగా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆలయ ఆస్తులు, హుండీ ఆదాయం, విరాళాల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలి. పూజలు, సేవలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయా అని పర్యవేక్షించాలి. గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి మార్గనిర్దేశం చేయాలి. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టాలి.
చేయకూడనివి…..
గుడిలో పెత్తనం చెలాయించడం. తమకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే ప్రత్యేక దర్శనాలు కల్పించడం. సామాన్య భక్తులను క్యూలైన్‌లో ఇబ్బంది పెట్టడం. ఆలయ సిబ్బంది పనుల్లో అనవసర జోక్యం చేసుకోవడం. గుడి ప్రాంగణంలో గొడవలు, వాగ్వాదాలకు కారణం కావడం. భక్తులను అవమానించేలా మాట్లాడడం లేదా ప్రవర్తించడం.
ముఖ్యంగా:…. ధర్మకర్తలు గుడిలో అధికారం చూపేందుకు కాదు, భక్తులకు సేవ చేయడానికి ఉంటారు. ధర్మకర్తల వ్యవహారం వల్ల భక్తులు ఇబ్బంది పడితే అది ఆలయ ప్రతిష్ఠకే మచ్చగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
“జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్యను కలిసిన శాసనసభ్యుడు కొణింటి మాణిక్ రావు గురువారం ఒక వినతి లేఖను సమర్పించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను లబ్ధిదారులకు అప్పగించాలని ఆయన కోరారు. కొత్త సిసి రోడ్లు, డ్రెయిన్లు మరియు వాటి మరమ్మతులు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. మిషన్ భగీరథ పనుల మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఉపాధ్యాయుడు రవీందర్ కి ధర్మనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం
జైపూర్,నేటి ధాత్రి:
మండలంలోని ఇందారం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న గోపగాని రవీందర్ కు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి రాష్ట్రస్థాయి పురస్కారం ను ప్రధానం చేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే సమాజ చైతన్యం కోసం గత మూడు దశాబ్దాలుగా సాహితీ రంగంలో విశేషమైన కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకంగా అందించే ఈ పురస్కారానికి గాను రవీందర్ ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.కవిగా,రచయితగా, విమర్శకుడిగా,కథకుడిగా సాహితీ సంస్థల నిర్వాహకుడుగా రవీందర్ కృషి చేస్తూనే ఐదు కవితా సంపుటాలను,మూడు వ్యాస సంకలనాలను ప్రచురించారని ఆయన తెలిపారు.తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఇతర సాహితీవేత్తల చేతుల మీదుగా మార్చి 17న ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.శ్రీనివాస్ తో పాటుగా సహచర ఉపాధ్యాయులు,జిల్లాలోని పలువురు కవులు,రచయితలు గోపగాని రవీందర్ కు అభినందనలు తెలిపారు.
సమాజంలో మార్పు రావాలంటే విద్య ఎంతో కీలకమని జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తన జన్మదినం సందర్భంగా గురువారం జహీరాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని సూచించారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. తన జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, రమాదేవి, రేణుక, పూజా తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
ఈనెల 14 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకానునట్లు ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని అలాగే ఎగ్జామ్ సెంటర్ లకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లను తెరువకూడదని తెలిపారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులను మాస్ కాపీయింగ్ చేసేందుకు గాని ఎవరికైనా బయట వ్యక్తులు సపోర్ట్ చేయడానికి వస్తే, వారి వల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినవస్తుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.