ఆరోగ్య శాఖలో అధికారుల అవినీతి కంపు?

మేడ్చల్ మల్కాజిగిరి “డిఎం అండ్ హెచ్ ఓ” ఉమా గౌరీ మీద వస్తున్న ఆరోపణల

  మీద దర్యాప్తు చెయ్యకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చు?

`వైద్య శాఖలో కొందరు అధికారుల ఇష్టారాజ్యం?

`మంత్రులకు అసలే అచ్చిరాని ఆరోగ్య శాఖ?

`అధికారులు చేసే అవినీతి మంత్రులకు అంటుకొని పదవులు పోయినవారున్నారు?

`ఒక్కసారి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తే రాజకీయం అవుట్ అయిన మంత్రులున్నారు?

`మంత్రి దామోదర రాజ నర్సింహా మెతక వైఖరి అధికారులు అలుసుగా తీసుకుంటున్నారు?

`రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతి భోజ్యం చేస్తున్నారు?

`ఆరోగ్య శాఖలో అవినీతి కంపు నింపు తున్నారు?

`మంత్రి మంచితనం అలుసుగా తీసుకుంటున్న ఉన్నతాధికారులు?

`అవినీతి బండారాలు బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు?

`ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్న “డిఎం అండ్ హెచఓ”లు?

`”మేడ్చల్ మల్కాజిగిరి “డి ఎం అండ్ హెచ్ ఓ” మీద లెక్క లేనన్ని ఆరోపణలు?

`ప్రభుత్వ వైద్యుల నుంచి మొదలు ప్రైవేట్ ఆసుపత్రులను వేధించుకు తింటున్నట్లు విమర్శలు?

`ఉమా గౌరీ బాధితులు వందల్లో ఉన్నట్లు సమాచారాలు?

`ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి లక్షల్లో వసూళ్లు?

`లంచం ఇవ్వకుంటే వెంటనే ఆగమేఘాల మీద ఆసుపత్రులు సీజ్?

`ఎలాంటి కారణం లేకున్నా లక్షలు సమర్పించుకోవాల్సిందే?

`ఉమా గౌరీ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని మరి వసూళ్లు?

`ఇప్పటికైనా మంత్రి స్పందించాకపోతే మొదటికే మోసం రావొచ్చు?

`అనవసరంగా మంత్రి అపఖ్యాతి మూట గట్టుకోవాల్సి రావొచ్చు?

హైదరాబాద్, నేటిధాత్రి:                       

పుండుకు ఆదిలోనే మందు వేయాలి. లేకుంటే అది వ్రణమైతుంది. శరీరాన్ని తింటుంది. అవినీతి కూడా అంతే. ఆదిలోనే దానిని తుంచేయకపోతు సమాజాన్ని తింటుంది. వ్యవస్ధను నాశనం చేస్తుంది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. ఎలాంటి సంబంధం లేకపోయినా పాలక పెద్దల రాజకీయంతో ఆడుకుంటుంది. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతుందన్న అనమానం వ్యక్తమౌతోంది. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో కొంత మంది అదికారు ల మూలంగా మంత్రి దామోదర రాజనర్సింహ పేరు అపఖ్యాతి పాలౌతుందన్న మాటలు వినిస్తోంది. సహజంగా మంత్రి దామోదర రాజనర్సింహ అత్యంత సౌమ్యుడు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా,ఇప్ప్పుడైనా ఎలాంటి వివాదాలు లేకుండా, రాకుండా తన పని తాను చేసుకుపోయే మంత్రి. అలాంటి ఆయన నిర్వహిస్తున్న శాఖలో కొంత మంది అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టుపట్టిసున్నారు. వైద్యశాఖను అవినీతి కంపులో కూరుకుపోయేలా చేస్తున్నారు. నిజానికి వైద్య శాఖ అంటేనే ఎంతో మందికి గౌరవం వుంటుంది. వైద్యులంటే ఎంతో నమ్మకం వుంటుంది. వైద్యులను చూస్తే మొక్కబుద్దవుతుంది. ఏ వ్యవస్ధలోనైనా సరే చీడపురుగులు వుంటారు. అలాగే వైద్యశాఖలోనూ వుంటారు. అలాంటి చీడ పురుగుల మూలంగా వైద్యశాఖకు చెడ్డపేరు వస్తోంది. అసలు ఆరోగ్యశాఖ అంటేనే రాజకీయ నాయకులు భయపడుతుంటారు. ఆ శాఖ తీసుకోవాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. రాజకీయాల్లో కూడా చాల సెంటిమెంట్లు వుంటాయి. ఒక్కసారి స్పీకర్‌గా పనిచేసిన నాయకుడికి ఇక రాజకీయం వుండదు. మరుసటి ఎన్నికల్లో గెలుపు వుండదు. అప్పటిదాక సాగిన రాజకీయం ఆగమ్యగోచరమౌతుందన్న నమ్మకాలు వున్నాయి. అలాగే మంత్రి వర్గంలో ఏ శాఖకు లేని సెంటి మెంటు కూడా వైద్యశాఖకూ వుంది. ఒక్కసారి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన ఏ నాయకుడైనా సరే తర్వాత రాజకీయం అంతంత మాత్రమే అనేది అనేక సార్లు రుజువైంది. ఆ సెంటిమెంటే నిజమైంది. అది కేవలం మూఢ నమ్మకం అనుకునేవాళ్లు వుండొచ్చు. కాని నిజమైన సందర్భాలు ఎక్కువగా వుండడంతో వైద్యశాఖ అంటే నాయకులు భయపడతారన్నది కూడా అంతే నిజం. అలా రాజకీయంగా కనుమరుగైన నాయకులు చాలా మంది వున్నారు. ఒక్కరో ఇద్దరో మళ్లీ రాజకీయాల్లో వున్నా చురుకైన పాత్ర పోషించి వారు లేరు. క్రియాశీల రాజకీయాలను ఏలినా వారు లేరు. అంతకు ముందు వున్న రాజకీయ బలం వున్నది లేదు. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తర్వాత వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన నాగం జనార్ధన్‌రెడ్డి ఎప్ప్పుడైతే వైద్యశాఖ మంత్రి అయ్యారో ఆయన రాజకీయ ప్రస్తానం కుదుపులకు లోనైంది. తర్వాత ఆయన రాజకీయం మునుపటిలా సాగకుండాపోయింది. ఆయన ఎన్ని పార్టీలు మారినా ఆయన రాత పూర్వవైభవం చూసింది లేదు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తొలి ఉప ముఖ్యమంత్రిగా వైద్యశాఖ మంత్రిగా పనిచేసి తాటి కొండ రాజయ్య రాజకీయం అక్కడితో ఆగిపోయింది. ఏదో రకమైన రాజకీయ అడ్డంకులు ఎదురౌతూనే వున్నాయి. ఇప్పటికీ ఆయనకు రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. తర్వాత వైద్యశాఖ మంత్రులుగా పనిచేసి వారిలో అప్పటి వరకు కీలకమైన పాత్ర పోషించిన వారి రాజకీయం కూడా అంతంత మాత్రంగానే వుంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రాజకీయం ఆగిపోయింది. తర్వాత ఈటెల రాజేందర్ లాంటి నాయకుడికి రాజకీయం తలకిందులైంది. రాజకీయాల్లో వున్నారంటే వున్నారన్నట్లే కాని ఆయన గత వైభవం లేదన్నది వాస్తవం. ఆరోగ్యశాఖ నిర్వహించిన తర్వాత ఎన్నికల్లో గెలిచింది కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్. రాజశేఖరరెడ్డి, తెలంగాణలో హరీష్‌రావు. అయితే ఈ ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖను అదనపు శాఖలుగా నిర్వహించిన నాయకులు మాత్రమే. మిగతా నాయకులంతా పూర్తిగా వైద్య ఆరోగ్యశాఖలు నిర్వహించారు. అందులో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య కూడా వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత ఈటెల రాజేందర్‌లాగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఒక్కసారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల్లో గెలవని నాయకులు వున్నారు. అందులో కోడెల శివప్రసాద్ రెడ్ది వున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచిన స్పీకర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా పనిచేసిన సంబాని చంద్రశేఖర్, శనక్కాయల అరుణ లాంటి వారు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అకారణంగా తన పదవిని కోల్పోయారు. తర్వాత ఎన్నికల్లో గెలిచినా, రాజకీయ త్యాగాలతో మొదటికే మోసం తెచ్చుకున్నారు. ఇప్ప్పుడు మళ్లీ ఎమ్మెల్యే అయ్యేందకు శతవిదాల ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అన్న డైలమాలోనే వున్నారు. తర్వాత వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు. ఈటెల రాజేందర్ వైద్యశాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టినప్ప్పుడే ఇక రాజకీయం అవుట్ అనే వార్తలు వచ్చాయి. అలాగే జరిగింది. తర్వాత అదనపు శాఖగా నిర్వహించిన హరీష్‌రావు గెలిచారు. కాని ప్రబుత్వం పోయింది. ఆయన రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే అదనపు శాఖలుగా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్యలు ముఖ్యమంత్రులయ్యారు. మరి తెలంగానలో అదనపు శాఖగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన హరీష్ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న దామోదర రాజనర్సింహ ఎంతో సౌమ్య స్వభావం వున్న నాయకుడు. ఆయన మంచి తనం కూడా ఆ శాఖ నిర్వహణలో పనికి రాకుండా పోతోందని అంటున్నారు.

మంత్రి మంచి తనాన్ని సాకుగా తీసుకొని కొంత మంది అదికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అనేకం వస్తున్నాయి. మంత్రి మెతక తనాన్ని అసలుగా తీసుకొని కొంత మంది పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటున్న డిఎంఅండ్ హెచఓలువున్నారు. వారిలోమొదటి వరుసలో మేడ్చల్, మల్కాజిరిగి డిఎంఅండ్‌హెచఓ ఉమా గౌరీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వున్నాయి. అటు ప్రభుత్వ వైద్యుల నుంచి మొదలు, ప్రైవేటు ఆసుపత్రులను ఆమె వేదించుకు తింటున్నారని అంటున్నారు. హైదరాబాద్ పరిధిని కూడా తనలో కలుపుకున్న మేడ్చల్, మ ల్కాజిగిరి డిఎంఅండ్‌హెచఓ ప్రైవేడు ఆసుపత్రులను నుంచి పెద్దఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పత్రికల్లో పుంఖాను పుంకాలుగా వార్త కథనాలు వస్తున్నాయి. పొగలేనిదే నిప్ప్పురాదు. అయినా బాదితులు మీడియా ముఖంగా వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు.

 నేటిధాత్రికి ఆమె బాదితులు ఎంతో మంది పోన్లు చేస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్ప్పుకుంటున్నారు. ఆమె వేదింపులు భరించలేకపోతున్నామంటున్నారు. మహిళా వైద్యులను కూడా ఆమె ఎంతో వేదస్తున్నారని తెలుస్తోంది. ఒక ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని ఆసుపత్రులకు ఫోన్లు చేసి అనుచరులను పంపించి వసూలు చేస్తుందంటున్నారు. ఏ ఆసుపత్రి నిర్వాహకులు ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో నిర్ణయిస్తారట. చెప్పిన గడువులోగా అడిగింది ఇవ్వకుంటే ఆసుపత్రిని సీజ్ చేస్తామంటారు. పైగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూడ ముందే ఆసుపత్రి సీజ్ చేసి తర్వాత వసూలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. గత గత సంవత్సర కాలంగా ఆమె వేదింపులు భరించలేకపోతున్నామని వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అయితే తాను నెల నెల ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వకుంటే, మీÅ£ంటే నాకు ఎక్కువ ప్రెజర్ వుంటుందని ఉమా గౌరీ అంటున్నట్లు కూడా బాధితులు చెబతున్నారు. అంటే ఆమె నెల నెల పై స్ధాయి పంపిస్తున్నామన్న మాట ఎవరి గురించి చెబుతోందన్న దానిపై కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే మంత్రి దామోదర రాజనర్సింహ శాఖ పరిస్దితిని అదుపు చేయకపోతే, జరుగుతున్న అవినీతిని అరికట్టకపోతే, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా మంత్రికి చెడ్డ పేరు వస్తుంది. అవినీతి అదికారులపై దర్యాప్తు చేసి పరిస్దితి చక్కదిక్కపోతే ప్రభుత్వం పరువు పోతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version