ఎలక్ట్రికల్ టూ త్రీ వీలర్ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం…

ఎలక్ట్రికల్ టూ త్రీ వీలర్ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం లి., హైదరాబాద్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేయడం జరిగినది. ఈ ఆక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానం తో ఆర్థిక సహాయ పథకములు రవాణా రంగం పథకం క్రింద ఈవి టూ వీలర్, ఈవి త్రి వీలర్, వ్యవసాయ పథకములు క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ ఆహ్వానించడమైనది. ఆహ్వానించడమైనదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల మున్సిపాలిటి పరిధి లోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వ్యవసాయేతర పథకములకు వయస్సు 21 నుండి 50 సం!! ల వరకు వ్యవసాయ ఆధారిత పథకములకు వయస్సు 21 నుండి 60 సం!! కలిగిన వారు ఆన్లైన్ ప్రక్రియ (tsobmms.cgg.gov.in) ఈనెల 17 నుండి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థుల యొక్క సంవత్సర ఆదాయం రూ. 1,50,000 గ్రామీణ ప్రాంతాల వారికి రూ.2,00,000/- (పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వారికి) మించకుండా ఆదాయం కలిగి ఉండాలి.
అభ్యర్థులు ఆన్లైన్ చేసుకోవటానికి అవసరమైన పత్రములు:

ఆధార్ కార్డ్
రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు

కుల ధృవీకరణ పత్రం (మీసేవ జారీ చేసింది)

ఆదాయ ధృవీకరణ పత్రం (మీసేవ జారీ చేసింది)
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగం పధకములకు)

ఈవి ద్విచక్ర వాహనాల కోసం ఎస్.సి వ్యవస్థాపకులు / గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జొమాటో స్విగ్గీ రాపిడో ఉబర్ సమర్పించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఒక ప్రకటనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version