జీర్లపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు…

జీర్లపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరసంఘం మండల కేంద్రంలోని జీర్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పందిరిలో నృత్యాలు, పాటలు, స్కిట్లతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉపాధ్యాయులకు, స్నేహితులకు భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, జిల్లా విద్యాధికారులు, కలెక్టర్ వంటి పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version