ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం.

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికి వేయడం బాధాకరం

మందమర్రి నేటి ధాత్రి:

మందమరి మార్కెట్ బస్టాండ్ చౌరస్తాలో ప్రకృతిని నాలుగోసారి బలిచేశారు. ప్రకటనల ప్రాధాన్యతకి ప్రకృతి విలువ తక్కువ అన్నట్లు, ఈ ఎండాకాలంలో పదిమందికి నీడనిచ్చే రాళ్ల చెట్టును రాత్రికి రాత్రే కోమ్మలు నరికి వేశారు. ఈ చెట్టు కొమ్మలను కనీస ఆనవాళ్లు కనిపించకుండా చెట్టు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రంగా చేసి వేయడం వెనుక చెట్టును మళ్లీ ఎదగకుండా తుదిముట్ట ఇవ్వాలన్న ఉద్దేశమే ఉన్నట్లు ప్రత్యక్షదర్శులు చెబుతున్నారు.

Trees

ఈ చెట్టు వయస్సు సుమారు 20 సంవత్సరాలు. మున్సిపాలిటీ పరిధిలో పని చేసే కొందరి మాటల ప్రకారం… ఇదే చెట్టును గతంలో మూడు సార్లు కోసి గాయపర్చారు. కానీ ప్రతిసారీ అది మళ్లీ కోల్పోయిన కొమ్మలను పుట్టించుకుంటూ నిలబడింది. ఈసారి మాత్రం నిండా నీడాను అందించే కొమ్మలానే నరికి వేసినట్లు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యం గా ఆటో డ్రైవర్లు మాట్లాడుతు”మేము ఆటోలో రోజంతా తిరిగి వేసవి వేడిలో అలసిపోయి ఇక్కడే ఆగుతాం. ఇప్పుడు ఆ నీడ కూడా పోయింది” అంటూ కొందరు ఆటో డ్రైవర్స్ బాధతో చెప్పుకొచ్చారు. “అదే చెట్టుకింద మా సోడాబండి పెట్టుకుంటే కాస్త నీడలో పనిచేస్తాం. ఇప్పుడు మేము ఎండల్లో కాలిపోతున్నాం” అంటూ ఓ చిన్న వ్యాపారి వాపోయాడు.ప్రత్యక్షంగా చూసినవారూ, చెట్టు నీడను అనుభవించినవారూ ఆ కోపం, బాధ, అసహనం కలగలిపిన మాటలతో చెట్టు గాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు .

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో లీగల్ అవేర్నెస్ క్యాంపును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీమతి కవిత దేవి నిర్వహించి మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మరియు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ మహిళ సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిత్యజీవితంలో మహిళలు ఎన్నో కష్టాలకు గురివుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని.

Camp

అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో మహిళల పాత్ర, గృహహింస నిరోధకత, మహిళా సాధికారత, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై క్షుణ్ణంగా వివరించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న, ప్యానెల్ న్యాయ వాదులు రుద్రయ్య స్వామి, సామజిక కార్యకర్త కోట ధనరాజ్ గారు, ఎంపిడిఓ సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఎస్సై సాయి తేజ, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు  పాల్గొన్నారు.

భూ కబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి.

భూ కబ్జాదారుడు పై చర్యలు తీసుకోవాలి.

స్థానిక వాసులను భయ భ్రాంతులకు గురిచేస్తున్న బొమ్మినేని తిరుపతిరెడ్డి

హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు.

కాశిబుగ్గ నేటిధాత్రి:

 

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను భూ కబ్జాదారుడు బొమ్మనేని తిరుపతిరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. కబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలని హోసింగ్ బోర్డు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు స్థానిక వాసులు విద్యార్థు చేయడం జరిగింది. అనంతరం కీర్తి నగర్ మరియు గరీబ్ నగర్ వాసులు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కు సంబంధించిన భూములను స్థానికంగా ఉంటున్న బొమ్మినేని తిరుపతి రెడ్డి నేను కీర్తి నగర్ కాలనీ అధ్యక్షుడిని అని స్తానిక వాసులను భయబ్రాంతులకు గురి చేస్తూ, తప్పుడు పత్రాలను సృష్టిస్తూ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎంఐజి,ఎల్ఐజి లోని కొన్ని ఇండ్లకు సంబంధించిన యజమానులు స్థానికంగా లేకపోవడంతో వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ కొంతమంది వ్యక్తులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను మరియు ఇండ్లను ఆక్రమించుకోని లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుందన్నారు.ఇదేంటని అని ప్రశ్నిస్తే ఖాళీ స్థలాల దగ్గర రౌడీల సహాయంతో,రాజకీయ అండ దండలతో ప్రశ్నించిన స్థానికులను, మహిళలను అని చూడకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తూ, తిరుపతిరెడ్డి అతని అనుచరులు కలిసి స్థానికులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ కి సంబంధించిన రోడ్డును సైతం కబ్జా చేసి రోడ్డు మూసివేసి ప్రహరీ గోడను నిర్మించుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అతను సొంత స్థలంగా వాడుకోవడం జరుగుతుందన్నారు.

land grabber

అది సుమారు 100 గజాలకు పైనే ఉంటుంది.అంతే కాకుండా పక్క భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్న తిరుపతిరెడ్డి ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మిస్తున్న క్రమంలో స్థానికులు వద్దని ఎంత చెప్పిన వినకుండా ప్రశ్నించే వారిని అతని అనుచరులతో బెదిరించడం జరుగుతుందన్నారు. స్థానికులు అంతా కుల, మతాలకు అతీతంగా కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ స్థలం కాలనీ వాసులకు అందరికి ఉపయోగపడే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది . గతంలో కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ కీర్తి నగర్ నందు తప్పుడు పత్రాలతో, కొంతమంది రౌడీల అండ దండలతో, రాజకీయ బడా బాబులతో చేతులు కలిపిన తిరుపతిరెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భూములను కబ్జా చేస్తూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ని సర్వనాశనం చేస్తున్నారని స్థానిక మహిళలు దుమ్మెతిపోస్తున్నారు.

అంతా నేనే ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి అధ్యక్షుడనని నాకు ఎదురు చెప్పే వారు లేరని, నాకు ఎదురు చెప్పితే వారు కాలనీ లో ఉండరని,వాళ్ల సంగతి ఎట్లా చెప్పాలో మాకు బాగా తెలుసు అని స్థానికులను, మహిళలను, ఒంటరిగా ఉన్న సమయంలో వారి వద్దకు వచ్చి రౌడీల సహాయంతో వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు.స్థానికులకు,మహిళలకు ఏదైనా జరిగితే పూర్తిగా తిరుపతి రెడ్డి,అతని అనుచరులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.వారితో స్థానికులకు ప్రాణభయం ఉందని అన్నారు. తిరుపతి రెడ్డి ఆగడాలు రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగామారుతుందని అన్నారు.హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న తిరుపతి రెడ్డి, రౌడీ ముకల పై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి.!

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుల సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై మందమర్రి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు ధార రవి సాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.పాత బస్టాండ్ ఏరియాలో ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Sindhu

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.

Sindhu

ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో మార్తా కుమార్, దీక్షితులు,వినయ్,రంగు శ్రీనివాస్,జకుల కంకయ్య,బస్టాండ్ వ్యాపార సంఘం నాయకులు తదితరు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే .

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ముంగి ఎస్ ఎల్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన న్యాల్కల్ మండల  .మాజీ జెడ్పీటీసీ భాస్కర్ గారి బావమరిది గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజి మార్కెట్ చైర్మన్ గుండపా,మాజి సిడిసి చైర్మన్ ఉమాకంత్ పాటిల్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ నేను అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, మాజి సర్పంచ్ లు కళీమ్,ప్రభు పటేల్,మల్లా రెడ్డి,జగదీశ్వర్,కరణ్,మాజి ఎంపీటీసీ రాములు,నాయకులు విజేందర్ రెడ్డి,దత్తురెడ్డి,రాథోడ్ భీమ్ రావ్ నాయక్ తదితరులు.

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం.!

దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలి…

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

ఈనెల 20వ తారీకు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులను ఏఐటియుసి సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ కోరారు. శుక్రవారం మందమర్రి ఏరియాలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీ లో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐటియుసి యూనియన్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథులుగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య లు హాజరయ్యారు.

Strike

అనంతరం వారు మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేయడం కార్మికులకు నష్టమని, కార్మికుల హక్కులు కోల్పోతామని, కార్మిక చట్టాలను నీరుగార్చే విధానం అని అన్నారు. కార్మిక లోకానికి తోడుగా ఏఐటియుసి ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలతో ఉన్న కార్మికులకు ఈనెల 20న జరిగే దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, దినేష్, వేణుగోపాల్, సిరాజ్ ,నరేంద్ర, అబ్బాస్, స్వామి, శ్రీనివాస్, రాజమౌళి, ఏఐటీయూసీ సంఘ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా:-
ఇసుక క్వారీల లైసెన్సులు రద్దు చెయ్యాలి:-

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్:-

యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ :-

భూపాలపల్లి నేటిధాత్రి:

 

శుక్రవారం రోజున సి పి ఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ ను సందర్శించడం జరిగిందని. అనంతరం ఆయన భూపాలపల్లి లో మాట్లాడుతూ అక్కడనుండి ఇష్టానుసారంగా అధిక లోడుతో వందలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలో 10 ఇసుక క్వారీలు నడుస్తున్నాయని విచ్చలవిడిగా ఇసుకను డంపు చేసుకుంటూ అధిక లోడుతో లారీల్లో తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించు కుంటున్నారని తక్షణమే వారి లైసెన్స్ రద్దు చేసి  ఇసుక క్వారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అని డిమాండ్ చేసారు.సహజ సంపదను అక్రమంగా తరలించుకుంటు సొమ్ము చేసుకుంటున్నారని.

Transportation

  గత ప్రభుత్వంలో ఇలాగే విచ్చలవిడిగా దందా కొన సాగిందని , ఈ ప్రభుత్వంలో నైనా మార్పు వస్తుందని ఆశించిన ప్రజల ఆకాంక్ష నెరవేర లేదని , ఇప్పుడు కూడా విచ్చలవిడిగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదన ద్యేయంగా దందా కొనసాగిస్తున్నారని , అనేకమంది నిరుపేదలు యాక్సిడెంట్లో చనిపోతున్నారని , కాళేశ్వరం నుండి భూపాలపల్లి కి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిందే అని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని, అధిక ఇసుక లోడ్ల తో లారీలు నడవడం వలన రోడ్లు మొత్తం కృంగి పోయాయి అని, ఇంత నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు చూచి చూడనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇట్టి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఒక వేళ తీసుకోకపోతే పార్టీ తరుపునుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.

భారత్ మాతాకీ జై అంటూ మసీదులో హోరెత్తిన నినాదాలు.

పాకిస్తాన్ డౌన్ డౌన్
భారత్ మాతాకీ జై. అంటూ మసీదులో హోరెత్తిన నినాదాలు .

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ ఏమసీదులో జుమ్మా నమాజ్ తరువాత ముస్లిం సోదరులందరూ పాల్గొని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ డౌన్ డౌన్ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ లోని పైల్గాం లో విహారయాత్రకు పోయిన అమాయకులైన 26 మందిని కాల్చి చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల పైన మాత్రమేదాడి చేయడం జరిగింది కానీ వక్రబుద్ధి గల పాకిస్తాన్ భారతదేశం లోని సరిహద్దు ప్రాంతాల పైన అమాయక ప్రజల పైన దాడి చేస్తూ యుద్ధం చేస్తున్న ది ఈయుద్ధంలో మన భారత సైన్యానికి మనమందరం ఆత్మస్థైర్యాన్ని కలిగించి మన భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలవాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం పౌరుడు కూడా భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేస్తూ మన దేశం పాకిస్తాన్ పై మరొక్కసారి గెలవాలని కోరుకుంటున్నాం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మొహమ్మద్ అజ్మత్ మియా హైదర్ పాషా మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య.

*ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య *
జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులచే అన్ని ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నామన్నారు. ఐఎఫ్ఫీ (IFP)ప్యానల్ బోర్డుతో విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పిస్తూ, ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు విద్య బోధన జరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ) తో కూడా విద్య బోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టిక ఆహారం, ఉదయం రాగి జావా, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆట స్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సాదిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిడిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…

రైతులందరు తమ వివరాలను నమోదు చేసుకోవాలి .

రైతులందరు తప్పకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలి – ఎన్.ప్రియదర్శిని

రామడుగు నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అమలుపరుస్తున్న విశిష్ట రైతుల గుర్తింపు కార్డుల నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, రంగసాయిపల్లి గ్రామాల్లో సహాయక వ్యవసాయ సంచాలకులు ఎన్.ప్రియదర్శిని సందర్శించారు. ఈసందర్భంగా ఎన్.ప్రియదర్శిని మాట్లాడుతూ ఈనమోదు కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించబడుతుందని రైతులందరు తప్పకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆయా క్లస్టర్ లో ఏఈవోలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కోహీర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్ ఏపీఓ రాజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శశి కూలీలు పాల్గొన్నారు.

ఈనెల 20న కార్మిక సంఘాల.!

ఈనెల 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్ నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే20న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని దీని జయప్రదంకై జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ శుక్రవారం పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడ్ లో గల సిమెంట్ గోదాం వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్ ను శుక్రవారం హమాలీ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నలబై నాలుగు లేబర్ కోడ్లను సంస్కరించి కార్మికుల పని భారoని పెంచారని ఎనిమిది గంటలు ఉన్న పని గంటలకు పన్నేండు గంటలుగా మార్చారని దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూ ప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహించడo జరుగుతుందని దీనిలో ప్రభుత్వ, ప్రవేట్ రంగంలో పనిచేసే కార్మిక లోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈపోస్టర్ ఆవిష్కరణలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు నన్నవేని శ్రీనివాస్, ననవేని కొమరయ్య, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం .

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మే 22న తేదీన జరిగే హిందూ ఏక్తా యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. ప్రతి ఒక్క హిందూ పార్టీలతో, కులలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరు సంఘటితమై స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. ప్రతి ఒక్క హిందూ హాజరై ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, కారుపాకల అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేం కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం.

ఆంజనేయ స్వామి విగ్రహానికి సూర్య చక్రం అలంకరణ…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహానికి హనుమాన్ భక్తులు గోవిందుల రమేష్, వెంకట నరసింహ స్వామి ఇద్దరు కలిసి సూర్య చక్రం రూపకల్పన చేయించి ఆంజనేయ స్వామికి అలంకరించారు. నిత్యం తిరుగుతూ ఉండే సూర్య చక్రం ఆంజనేయ స్వామికి అలంకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సతీష్ శర్మ, ప్రవీణ్ శర్మ,హనుమాన్ భక్తులు రవి, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కోర్కెలు తీర్చే కలి యుగదైవం శ్రీ మత్స్యగిరి స్వామి.

కోరిన కోర్కెలు తీర్చే కలి యుగదైవం శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం

నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కాకతీయుల కళావైభ వానికి ప్రతీక ఈ దేవా లయం

రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షే త్రంగా ప్రసిద్ధి గాంచిన దేవాల యం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలకేంద్రం లోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల కళా వైభవా నికి ప్రత్యేకగా నిలిచిన మత్స్య గిరి స్వామి దేవాలయం.ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలను ఘనంగా నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుంది
కాబట్టి శనివారం నుండి బుధవారం వరకు కార్యక్రమం కోసం చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.ఆలయ చరిత్ర గురించి గుడి చైర్మన్ మాట్లాడుతూ శాయంపేట గ్రామపొలిమేరలోని మచ్చర్ల య్య గుట్టపై. శ్రీ మత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమారు 569 సంవత్సరాల క్రితం కొలువుదీరినట్లు పూర్వీ కులు పేర్కొంటున్నారు.మహావి ష్ణువు దుష్టశిక్షణకై దశావతా రాలలో భాగంగా మొదట మత్స్యవతారంగా వెలసినట్లు చెబుతున్నారు మచ్చర్లయ గుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయిం చిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్ధంగా మచ్చా అవతారంలో స్వామి వారు దర్శనమిస్తారు.

Lord Vishnu

ఈ గుట్ట లోపటికి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుం ది అప్పుడు నిర్మించిన దేవుని చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడు తున్నది కాకతీయ సామంత రాజు కొత్త గట్టు సీమ పాలకు డు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవాల యం నిర్మించినట్లు తెలుస్తుంది కాలక్రమంలో మచ్చర్లయ గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపో యింది గ్రామం మధ్య లో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్నినిర్మించా రు.

Lord Vishnu

దేవాలయ గోపురం పైన మహావిష్ణువు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి. కల్యాణోత్సవ కార్యక్రమం తేదీ మే 10 శనివారం ఉదయం తోలక్కం ప్రారంభం పుట్ట బం గారు సేవ మధ్యాహ్నం ధ్వజా రోహణం గరుడ ముద్దా (సంతానం లేని దంపతులు గరుడ ముద్ద ప్రసాదం స్వీకరించగలరు) సాయంత్రం ఎదురుకోళ్లు తేదీ 11 బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం తేదీ 12 సోమవారం ఉదయం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవాహన సేవ గుట్టమీదికి పోవడం తేదీ 13 మంగళవారం సాయంత్రం రథోత్సవం అలుకతీరుట తేదీ 14 బుధవారం ఉదయం చక్ర వరీ సాయంత్రం నాకబలి నాగవల్లి పండిత సన్మానం తో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.

వేసవి వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

వేసవి వ్యాధులు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

వేసవి ఎండలతో అనేక రుగ్మతలు వ్యాపిస్తుండటం సహజం. డీ హైడ్రేషన్‌ నుంచి ఫుడ్‌ పాయిజనింగ్‌ వరకూ కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వ్యాధులు వైరస్‌ల వల్ల వస్తాయి. పరిశుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించాలి. తరచుగా చేతులు, కాళ్లు కడుక్కోవాలి. ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్‌ శానిటైజర్‌ ఉపయోగించటం మర్చిపోవద్దు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటం చాలా అవసరం. వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల వివరాలు ఇవిగో …

వడదెబ్బ (సన్‌స్ట్రోక్‌) : ఎండలో ఇష్టానుసారంగా తిరిగినా, నీరు తక్కువగా తీసుకున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా, అయోమయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చెమట పట్టకపోవటం, కాళ్ళూ చేతుల నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహకోల్పోవటం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లబర్చాలి. తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. నీళ్లు తాగించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లటం ఉత్తమం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీరు, గ్లూకోజ్‌ డి వంటివి తీసుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రోరల్‌ ఫౌడర్‌ లేదా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచుకోండి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగండి.

Summer diseases

విషాహారం (ఫుడ్‌పాయిజనింగ్‌) : ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు వేసవిలో సాధారణం. ఇవి ఎక్కువగా హానికారక బ్యాక్టీరియా, పరాన్నజీవుల వల్ల వస్తాయి. అధిక వేడికారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహారం చెడిపోకుండా చూసుకోవాలంటే బాగా ఉడికించాలి. వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజా ఆహారాన్ని తినటం ముఖ్యం. మసాలాలతో కూడిన ఆహారాన్ని తగ్గించాలి.
కంటి ఇన్ఫెక్షన్‌ : ఈ కాలంలో కనిపించే కొన్ని సాధారణ కంటి వ్యాధుల్లో కంటి వాపు, అలెర్జీ, కంజక్టివైటిస్‌ ఉంటాయి. తగినంత విశ్రాంతి కళ్లకు ఇవ్వాలి. వాటిపై ఒత్తిడి తగ్గించాలి. మీ కళ్ళు, ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రమైన నీటితో కడగాలి. ఎండలో బయటకు వెళ్తే కళ్లజోడు వాడటం మంచిది. సమస్యలు వస్తే డాక్టరు సిఫారసు మేరకు ఐడ్రాప్స్‌, మందులు వాడాలి.
చర్మ సమస్యలు : సూర్యుడి అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు, స్వేద గ్రంథులు మూసుకుపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చెమట వల్ల మచ్చలు, దురద మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండా లంటే వేసవిలో సన్‌స్క్రీన్‌ లోషన్లు వంటివి కూడా ఉపయోగించొచ్చు. వాడిన దుస్తులను ఉతక్కుండా మళ్లీ వాడకూడదు. చెమట ఎక్కువగా పడుతున్నం దున స్నానం రెండుమూడు సార్లు చేయొచ్చు. శరీరానికి గాలి తగిలేలా వదులైన, చెమట పీల్చే కాటన్‌ దుస్తులు ధరించటం మేలు.
అతిసార : ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే వేసవిలో విరోచనలు సాధారణం. కలుషిత ఆహారం తినటం, నీరు తాగటం, మద్యపాన అలవాట్లు డయేరియాకు దారితీస్తాయి. అతిసారం నుంచి దూరంగా ఉండటానికి నీటిని మరిగించిన తర్వాత మాత్రమే తాగటం అలవాటుగా చేసుకోవాలి. కూరగాయలను ముక్కలుగా చేయటానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి. ఇళ్లల్లో ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలి. పాడైనవి కాకుండా వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం మేలు.
చికెన్‌పాక్స్‌ : చికెన్‌పాక్స్‌ (అమ్మోరు) చాలా సాధారణ వేసవి వ్యాధుల్లో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపురంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. ఇది పిల్లల్లో తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది సోకినప్పుడు బయటకు తిరగకుండా ఇంట్లో ఉండటమే మేలు. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. త్వరగా తగ్గే వీలుంది.
తట్టు : మీజిల్స్‌ మరో సాధారణ వేసవి వ్యాధి. మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సో వైరస్‌ వేసవిలో వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడటం, తరువాతి దశలో, చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్‌ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి. మందులు వాడితే తగ్గిపోతుంది.

Summer diseases

కామెర్లు : నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది హైపటైటిస్‌ ఎ వల్ల వస్తుంది. ప్రధానంగా కలుషిత మైన ఆహారం, నీటి వినియోగం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది పిత్తం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది.
టైఫాయిడ్‌ : జ్వరం వస్తే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరంతోపాటు తలనొప్పి, నీరసంగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసు కోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. కలుషిత ఆహారం, నీటి వనరులు బ్యాక్టీరియాకు సంతానోత్పత్తికి ప్రదేశంగా మారతాయి. టైఫాయిడ్‌ వస్తే బలహీనత, ఆకలిలేకపోవటం, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
గవదబిళ్ళలు : వేసవి వ్యాధుల్లో గవదబిళ్లలు అత్యంత అంటువ్యాధి. ఈ వైరల్‌ వ్యాధి పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథివాపు, కండరాలనొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవటం, బలహీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి.
తలనొప్పి : అధిక ఉష్ణోగ్రతలతో తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. వేడి వల్ల వచ్చే తలనొప్పి శరీరం వేడికి ప్రతి స్పందించటం వల్ల కూడా వస్తుంది.
పైన పేర్కొన్న వ్యాధులకు అధునాతనమైన మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టరు సలహా మేరకు వాటిని ఉపయోగిస్తే అవి నియంత్రణలోకి వస్తాయి.

ఈ చిట్కాలు పాటించండి ….

– తరచూ మంచినీరు, నిమ్మకాయ ద్రావణంతోపాటుగా ఎక్కువ మజ్జిగ తీసుకోవాలి
– నారింజ, దానిమ్మ వంటి పండ్లను తినాలి
– మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ బయటకు వెళ్లకండి
– క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
సూర్యకాంతికి గురి కావడాన్ని తగ్గించండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వ్యాయామం వంటి కార్యక్రమాలను చేయండి.
– కళ్ల సంరక్షణ కోసం కూలింగ్‌ గ్లాసులు పెట్టుకోవాలి
– లేతరంగు, తేలికైన వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి
– బ్యాక్టీరియాతో ఉండే స్ట్రీట్‌ఫుడ్‌ తినొద్దు
– ప్యాకింగ్‌ చేసిన పండ్లు, కూరగాయలు తీసుకోవద్దు
– పండ్లు, కూరగాయల వినియోగాన్ని పెంచండి.
– ఆల్కాహాల్‌, కెఫైన్‌ తీసుకోవద్దు
– కూల్‌డ్రింక్స్‌ తాగొద్దు.

– డాక్టర్‌ రమ్య ఝరాసంగం మండల వైద్యాధికారి

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: జిల్లాస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, అధికారులు ఆదేశాలు జారీచేసిన కింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా , టోప్యా నాయక్ తండాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. గురువారం పలు తండాలను పరిశీలించగా బోజ్యానాయక్ తండా లో సగం మందికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మరి కొంతమందికి నీటి సరఫరా కావడం లేదు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ గత మూడు నెలల నుంచి పనిచేయకపోవడంతో మూలన పడింది.పాఠశాల ఆవరణలో నర్సరీ పెంపకం నిర్లక్ష్యంగా కనిపించింది. రామ్ చందర్ నాయక్ తండా కు సరైన రోడ్డు మార్గం లేదు. పూర్యా నాయక్ తండా లో మినీ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉంది. మురికి కంపు కొడుతుంది. తండావాసులకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. టోప్యా నాయక్ తండాలలో ఇటీవలనే నూతనంగా మంచినీటి బోర్లు వేశారు. బోర్ నుంచి తండా వరకు పైప్ లైన్ వేయకపోవడంతో ఓ మహిళ రైతుకు చెందిన వ్యవసాయ పైపులను అమర్చి నీటిని అందిస్తున్నారు. సిసి రోడ్లు అసలుకే కనిపించలేదు. నాలుగు తండాలో కలిపి అనుసంధాన రోడ్లు లేక వైద్యం, ఇతర గ్రామాలకు వెళ్లే గిరిజనులు, బడికి వెళ్ళే విద్యార్థులు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే టోప్యా నాయక్ తండాకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందర్శించడం లేదని గిరిజన వాసులు వాపోయారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. ఎంపీడీవో సుధాకర్

బోజ్యానాయక్ తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ వివరణ కోరగా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పైప్ లైన్ విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈద్గా మైదానంలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు.

24న జహీరాబాద్‌లోని ఈద్గా మైదానంలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు వ్యతిరేకంగా నిరసన సమావేశం,

◆ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షత వహించనున్నారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మీ క్నావిజ్ వక్ఫ్ బచావ్ ప్రచారం ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ యొక్క వక్ఫ్ బచావ్ దస్తూర్ బచావ్ ప్రచారం యొక్క కేంద్ర నిరసన సర్వసభ్య సమావేశం 2025 మే 24, శనివారం, అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు జహీరాబాద్ ఈద్గా మైదాన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు ఫకీహ్ అస్ర్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మాని అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో, అన్ని ఆలోచనా విధానాల బాధ్యతాయుతమైన స్నేహితులు, రాజకీయ పార్టీల బాధ్యతాయుతమైన స్నేహితులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగాలు చేస్తారు. ముస్లిం పర్సనల్ లేబర్ బోర్డు వ్యవస్థాపక మరియు కార్యనిర్వాహక సభ్యులు కూడా పాల్గొంటారు. మతం లేదా మతంతో సంబంధం లేకుండా ముస్లిం సోదరులందరూ ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో పాల్గొని తమ ఐక్యత, జాతీయ గర్వం, మత గౌరవం మరియు సజీవ దేశాన్ని ప్రదర్శించాలని అభ్యర్థించారు.మీ ఉనికికి రుజువును అందించండి మరియు ఈ వివాదాస్పద నల్ల చట్టానికి వ్యతిరేకంగా మీ సమిష్టి నిరసనను నమోదు చేయండి.

error: Content is protected !!
Exit mobile version