బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు .

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

shine junior college

 

 

 

 

 

Bomb Threat: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

 

హైదరాబాద్, జూన్ 18: బేగంపేట ఎయిర్‌పోర్టుకు (Begumpet Airport) బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat) తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఉదయం (బుధవారం) 10:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌‌కు సమాచారం ఇవ్వగా.. వెంటనే వారు అక్కడకు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలోని ఉద్యోగులందరినీ బయటకు పంపించి బాంబు స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు.

 

 

అయితే విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని.. అదంతా ఫేక్ కాల్‌గా బాంబు స్క్వాడ్ గుర్తించింది. కాల్ చేసిన నెంబర్ ఆధారంగా ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్‌బుక్‌లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులు విద్య ద్వారా మాత్రమే పురోగతి సాధించగలరని మరియు సమాజంలో మంచి పౌరులుగా నిరూపించుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటే వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలనే తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కె. ప్రసాద్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

shine junior college

 

 

 

రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

 

 

 

 

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి(Rameshwaram Ramanathaswamy Temple) రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు ఆ ఆలయంలో సులువుగా దైవదర్శనం చేయలేకపోతున్నారు. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలకు పూర్వమే రామేశ్వరం ఆలయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే వారి కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ ఉండేది.

 

 

 

 

ఆ క్యూలైన్‌లో వెళ్ళి స్థానికులు సులువుగా దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి డిప్యూటీ కమిషనర్‌ చెల్లదురై బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్థానికుల క్యూలైన్‌ తొలగించారు. స్థానికులు ధర్మదర్శనం (సర్వదర్శనం) క్యూలైన్‌లోనే రావాలని ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆలయ నిర్వాహకులపై స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల రాజీ చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలయ అధికారులు గతంలా ప్రత్యేక క్యూలైన్‌లో స్థానికులను అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.

 

 

 

 

 

 

 

 

ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం రామేశ్వరం నగరంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వేల సంఖ్యలో స్థానికులు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వైపు దూసుకొచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కారణంగా ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ విజయవంతం.

రేపు టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ
విజయవంతం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి

మంచిర్యాల జూన్ 18 నేటిదాత్రి:

shine junior college

 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఈనెల 20వ తేదీన నస్పూర్ లోని ప్రెస్ క్లబ్ లో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో-కన్వీనర్లు కె.వెంకటస్వామి, గడ్డం సత్యగౌడ్ తదితరులు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఫెడరేషన్ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్లొంటారని వారు పేర్కొన్నారు. జిల్లాలో సంఘం నిర్మాణం, సభ్యత్వం, జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై ఈ సందర్భంగా మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిచనున్నట్టు తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో విరివిగా సభ్యత నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న విలేకరులు స్వచ్ఛందంగా సంఘంలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తో పాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాత్రికేయ మిత్రులను మహాసభకు సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలోని ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు భాస్కర్, చంద్రమౌళి  పాల్గొన్నారు.

చైతన్య జ్ఞాపకాలతో కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత

చైతన్య జ్ఞాపకాలతో అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత 

 

shine junior college
సమంత వెనుక మెడ కింద ఏ మాయ చేసావే కి గుర్తుగా YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుందా.. ? అంటే నిజమే అనే మాట వినిపిస్తుంది. అంతలా ఆమె ఏ విషయంలో కన్ఫ్యూజ్ చేసింది అని అంటే.. తాన్ మాజీ భర్త నాగ చైతన్య(Naga Chaithanya) గుర్తులను చెరిపేసిందా.. ? లేదా అనే విషయంలో అన్నమాట. ఏ మాయ చేసావే(Ye Mayaa Chesave) సినిమాతో సామ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఏ మాయ చేసావే సినిమాలో తనతో రొమాన్స్ చేసిన నాగ చైతన్యనే సామ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా ఆమె మంచి హోదానే అందుకుంది. ఆ సమయంలోనే తన ప్రేమకు గుర్తుగా ఒంటిపై మూడు టాటూలు వేయించుకుంది.  ఇక కలకాలం కలిసి ఉంటారన్న ఈ జనతా నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి చై ను సామ్ మర్చిపోలేక బాగా సతమతమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇక ఇప్పటికే చై గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తుందని.. ఆమె నడుము పై భాగంలో ఉన్న చై అనే టాటూను రిమూవ్ చేయించిందని వార్తలు వచ్చాయి.

ఇక  ఈ మధ్యనే ఆమె ఇంకో టాటూను కూడా చెరిపివేసిందని వార్తలు వచ్చాయి. ఆమె వెనుక మెడ కింద ఏ మాయ చేసావే కి గుర్తుగా YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. ఆ సినిమా వలనే  చై తో పరిచయం ఏర్పడిందనే గుర్తుగా  ఆ టాటూను వేయించుకుంది. ఇక మొన్నటికి మొన్న ఒక వీడియోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. చై గుర్తుగా ఉన్న చివరి టాటూను కూడా సామ్ చెరిపేసి కొత్త జీవితాన్ని మొదలుపెడుతుందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా బాంద్రాలో సామ్ జిమ్ అవుట్ ఫిట్ లో ఆమె కారు ఎక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో YMC  టాటూ క్లియర్ గా కనిపించింది. అంటే మొన్న వీడియోలో సామ్ ఆ టాటూను మేకప్ తో కవర్ చేసిందని తెలుస్తోంది.  నిజంగా ఆమె ఈ టాటూస్ ను చెరిపివేయలేదని.. కావాలనే అప్పుడప్పుడు సామ్  ఇలా మేకప్ వేసి  ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుందని తెలుస్తోంది. దీంతో నెటిజన్స్  ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఎప్పుడు ఒకేలా ఉండాలని.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనుకున్నప్పుడల్లా టాటూ గేమ్  ఆడుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే సామ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. 

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

దుగ్గొండి ఎస్సై రణధీర్.

నర్సంపేట దుగ్గొండి నేటిధాత్రి:

shine junior college

వివిధ పనుల నిమిత్తం ఇండ్ల నుండి బయటకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గొండి ఎస్సై రణధీర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
ఇందుమూలంగా దుగ్గొండి మండల గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ మీ బంధువుల ఇండ్లకు గాని, తీర్థయాత్రలు గాని, ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు మీ ఇండ్లకు తాళాలు వేసి పోయేటప్పుడు తలుపులకు సెంట్రల్ లాకింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు పడాలని సూచించారు.అలాగే ఇంట్లో ఉండే విలువైన వస్తువులను తమతో పాటు తీసుకెళ్ళాలని లేనిపక్షంలో ఇంట్లో ఒకరు ఉండే విధంగా చూసుకోవలని ఎస్సై రణధీర్ తెలియజేశారు.

కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి కేటీఆర్

కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి- కేటీఆర్

సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారు

కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేయడం,పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడంతోనే బీఆర్ఎస్ నేత కుంటయ్య ఆత్మహత్య

కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం-న్యాయపోరాటం చేస్తాం

కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు,పెళ్లిల్లు చేయడంతో పాటు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

కుంటయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

shine junior college

కాంగ్రెస్ హయాంలో సెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేశాడని ఫిర్యాదుచేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్బా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.


మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలమైందన్నారు కేటీఆర్. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదోదో ఊహించుకుంటారన్న కేటీఆర్, బయటికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్దత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు , ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామి ఇచ్చారు. ఈరోజు కుంటయ్య కి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపుచేయాలన్నారు.ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు.

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

 

shine junior college

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక మందణ్ణ మధ్య సాగుతున్న ప్రేమాయాణం ఇవాళ మొదలైందేమీ కాదు. అయితే వీరిద్దరూ ఆ విషయాన్ని ఇంతవరకూ అధికారికంగా మాత్రం చెప్పలేదు. దాంతో ఎక్కడైనా వీరిద్దరు కలిసి కనిపిస్తే పాపరాజీలకు అది పండగలా ఉంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌ (National crush) రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) మధ్య సాగుతున్న ప్రేమాయణం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కొన్నేళ్ళుగా సాగుతున్నదే. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి రశ్మిక బయటపడినట్టుగా విజయ్ దేవరకొండ మాత్రం బయట పడటం లేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు.

రశ్మిక మాత్రం అవకాశం కుదిరినప్పుడల్లా విజయ్ ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ ను విడమర్చి, విపులంగా చెబుతోంది. ఎవరు ఆ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించినా… సంకోచం లేకుండా దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ ఇన్ డైరెక్ట్ గా అందరికీ తెలిసిందేగా అనేస్తోంది. రశ్మిక ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా… ఆమె చుట్టు పక్కల విజయ్ దేవరకొండ లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? అని పరికించి చూడడం అందరికీ అలవాటైపోయింది. అలానే విజయ్ దేవరకొండ ఫారిన్ ట్రిప్ వేసినా… అదే ప్లేస్ కు రశ్మిక కూడా వెళ్ళే ఉంటుందనే సందేహంతో ఆమె సోషల్ మీడియాను సెర్చ్ చేయడం కామన్ అయిపోయింది. ఏ మాత్రం హింట్ దొరికినా… ఇద్దరు ప్రేమికులు కలిసే వెళ్ళారోచ్ అంటూ ఆధారాలతో ఆ ఫోటోలను పెట్టడం పరిపాటిగా మారింది.

తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న ఫోటో ఒకటి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ డ్రస్ లో రశ్మిక ఉండగా, బ్లూ కలర్ డ్రస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇద్దరూ ముఖాలకు మాస్క్ పెట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ బయట కారు ఎక్కుతుండగా కొందరు దీనిని సెల్ లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్ డమ్’ (Kingdom) మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. అలానే రశ్మిక నటించిన ‘కుబేర’ (Kubera) సినిమా 20వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులను మరింత వెయిట్ చేయించకుండా ఈ జంట ఎప్పుడు తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.

భయపడి అడుగు ఆపకే

భయపడి అడుగు ఆపకే

 

shine junior college

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు…

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సప్తమి గౌడ కథానాయిక. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. మంగళవారం చిత్రబృందం ‘ఆగకే అమ్మాడీ… భయపడి అడుగు ఆపకే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది ఈ సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. లయ వర్ష బొల్లమ్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

మంచినీటి బోరు మోటారు ను మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ నాయకులు.

మంచినీటి బోరు మోటారు ను మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి:

 

 

shine junior college

గణపురం మండల కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని గణప సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న బోరు బావికి భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలతో మోటార్ బిగించి ప్రారంభించిన మండల అధ్యక్షులు వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షులు రేపాక రాజేందర్ వారితో మాజీ వైస్ ఎంపీపీ విదినేని అశోక్ భూపాల్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణ గోలి రవి గ్రామపంచాయతీ సిబ్బంది సాంబయ్య

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత

గణపురం నేటి ధాత్రి:

shine junior college

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ నిర్వహించారు గణపురం మండల కేంద్రంలోని సోమేశ్వర మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు పబ్బ. వర్షిని. రాకేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ అనంతరం రాకేష్.వర్షిని దంపతులు 3.000 రూపాయలతో నిత్య ధూప దీప సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బాటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..

6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..

 

shine junior college

 

 

 

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్‌ రోడ్డును ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

 

చెన్నై: ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్‌ రోడ్డు(Marina Beach Road)ను ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతున్న మెరీనా బీచ్‌లో ట్రాఫిక్‌ సమస్య కూడా అధికంగా ఉంది. కామరాజ్‌ రోడ్డులో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి చాలా సేపు వాహనాలు నిలిచిపోతున్నాయి.

ప్రస్తుతం మెరీనా లైట్‌ హైస్‌ సమీపంలో జరుగుతున్న మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, పర్యాటకుల విజ్ఞప్తి మేరకు, ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారిగా ఉన్న మెరీనా బీచ్‌ రోడ్డును ఆరు లేన్లగా మార్చేందుకు జీసీసీ నిర్ణయించింది. అందుకోసం కామరాజర్‌ రోడ్డు(Kamarajar Road)లోని వార్‌ మెమోరియల్‌ నుంచి లైట్‌ హౌస్‌ వరకు 2.8 కి.మీ విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు 23 మీటర్ల వెడల్పుతో ఉంది.

 

 

ఈ రోడ్డును అదనంగా 6 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం విస్తరంచనున్న ప్రాంతంలో నడక దారి, దివంగత నేతల విగ్రహాలున్నాయి. రోడ్డు విస్తరణ కోసం వార్‌ మెమోరియల్‌ నుంచి లైట్‌ హౌస్‌ వరకు ఉన్న 9 విగ్రహాలు ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, 20 మీటర్ల వెడల్పు కలిగిన రాధాకృష్ణన్‌ రోడ్డు కూడా విస్తరించనున్నారు.ఈ విస్తరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు జీసీసీ అధికారులు తెలిపారు.

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

shine junior college

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి సౌత్ ఇండియా సూప‌ర్‌ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది.

 

 

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం అగ‌ష్టులో 14న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమానుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ గ్లిమ్స్ సినిమాపై అమాంతం అంచ‌నాలు పెంచ‌గా.. ఆ వీడియోలో ర‌జ‌నీ మిన‌హా ఏ హీరో ముఖం డైరెక్టుగా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం విశేషం.ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది.

 

 

బాక్సాపీస్ వ‌ద్ద‌ ‘కూలీ’ చిత్రం విదేశీ రైట్స్‌ ధర సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం విదేశీ పంపిణీ హక్కుల బిజినెస్‌ ప్రారంభమైన క్ర‌మంలో ఈ మూవీ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థ ఏకంగా రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర చెల్లించేందుకు ముందుకొచ్చింద‌ని వినికిడి. అయినప్పటికీ చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ మరింత అధిక మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారని దాంతో ఈ ఫారిన్‌ రైట్స్‌ బిజినెస్ చ‌ర్చ‌లు ఇంకా న‌డుస్తూనే ఉన్నాయ‌ని ఈ నెలాఖ‌రున అన్నీ ఫైన‌ల్ అవుతాయ‌ని స‌మ‌చారం. ఈ సినిమా హక్కులను రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు విక్రయిస్తే మాత్రం.. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ రైట్స్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

shine junior college

 

ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు…
ముజ్‌ఫర్‌పూర్‌ (బిహార్‌): ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. డిస్ట్రిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్‌ అకాడమీ తరఫున 13 ఏళ్ల అయాన్‌ కేవలం 134 బంతుల్లో 327 పరుగులు సాధించాడు. అందులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు ఉన్నాయి. అయాన్‌, వైభవ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి ప్రాక్టీస్‌ కూడా చేసేవారు. ‘వైభవ్‌ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి బాటలోనే నేనూ నడుస్తున్నాన’ని అయాన్‌ చెప్పాడు. రాజ్‌ తండ్రి కూడా క్రికెటర్‌ కావడం విశేషం.

నాకు నటించడమే రాదన్నారు

నాకు నటించడమే రాదన్నారు

shine junior college

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే…

 

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో లాయర్‌గా సురేశ్‌ గోపీ నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ ‘నాకు నటన రాదంటూ చాలా మంది ట్రోల్‌ చేశారు. అయినా దర్శకుడు ప్రవీణ్‌ నాకు అవకాశం ఇచ్చారు. ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్‌ సమయంలో నా కెరీర్‌ పరంగా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. కాగా, అనుపమ వ్యాఖ్యలపై సురేశ్‌ గోపీ స్పందించారు. ఒక నటిపై వివక్షను ప్రదర్శించడం మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కాదని అన్నారు. ‘అనుపమ మాట్లాడిన మాటలు ఆమె హృదయాంతరాళం నుంచి వచ్చాయి. గతంలో నటి సిమ్రాన్‌ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. మలయాళ చిత్రపరిశ్రమ ఆమెను చిన్నచూపు చూసి ఇండస్ట్రీ వదిలిపోయేలా చేసింది’ అని అన్నారు.

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

shine junior college
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా…
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మంగళవారం నయనతార సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న అనిల్‌ రావిపూడి ప్రేమ, కుటుంబ విలువలతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవి పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది, ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని యూనిట్‌ తెలిపింది. షైన్‌స్ర్కీన్స్‌, గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

shine junior college

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్ద‌మ‌వుతోంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) లీడ్ రోల్‌లో, చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వ‌హించారు. గ‌తంలో శ్రీ రామ్‌, శివ‌బాలాజీల‌తో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను రూపొందించి మంచి విజ‌యం ద‌క్కించుకున్న‌ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ మ‌లి ప్ర‌య‌త్నంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

 

1980లలో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం వ‌ళ్ల అక్క‌డ‌ ప్రతి వధువు తమ‌ పెళ్లి రోజునే మరణిస్తుంటారు. దీంతో దశాబ్దంగా ఆ ఐర్లో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోయి ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో జీవిస్తుంటారు. ఈక్ర‌మంలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఓ శక్తివంతమైన సందేశంతో ఈ సిరీస్‌ను మ‌లిచారు. ఈ నేప‌థ్యంలోగ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ క‌థ‌కు అదిరిపోయే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంశాల‌ను మేళ‌వించి చూసే ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ ఇవ్వ‌నున్నారు. ఇప్పుడీ సిరీస్ జూన్ 27 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండ‌గా త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు కృష్ణ పోలూరు, నిర్మాత శ్రీరామ్‌, న‌టి అభిజ్ఞలు మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. దాంలో అది ఆ విలేజ్‌లో భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాంటి గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ అని అన్నారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో చిత్రీక‌రించామ‌ని, ప్రేక్షకులు ఈ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిరీస్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం, మండల విద్యార్థినికి స్టేట్ ర్యాంక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో పురం అక్షిత రెడ్డి D/o పురం బసిరెడ్డి MPC(మొదటి సంవత్సరంలో)466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు ఉత్తమ సాధించింది.ఈ సందర్భంగా విద్యార్థిని పురం అక్షిత రెడ్డికి ప్రిన్సిపల్ టీ తేనావతి మరియు అధ్యాపక బృందం మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

పల్లె పోరుకు సిద్ధం!…..

పల్లె పోరుకు సిద్ధం!…..

◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి

◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.

సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

shine junior college

అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు. . ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి మా వోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం .భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం వెలిశాల గ్రామా నికి చెందిన గాజుల రవి అలియాస్ ఉదయ్ 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ముగిసింది., అప్పటి రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధిలో గాజర్ల రవి ఒకరు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గాజర్ల రవి పై 25 లక్షల రివార్డు ఉంది గాజుల రవి మృతితో టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛా యలు అలముకున్నాయి.

error: Content is protected !!
Exit mobile version