పొత్తులతోనే కొంప ముంచుకుంటున్న కాంగ్రెస్

`ఒంటరిగా పోటీ కాంగ్రెస్‌కు ఎప్పటికైనా లాభం!
`సాగిలపడినంత కాలం ఇదే ఫలితం.

`సీట్లు కాంగ్రెస్‌ అడుక్కోవడం దురదృష్టకరం.
`ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగి మొదటకే మోసం.


`‘‘ఆప్‌’’ చేతిలో ఇప్పటికే మోసపోయింది.
`‘‘మహారాష్ట్ర’’లో పరువు పోగొట్డుకున్నది.
`ఉత్తరప్రదేశ్‌’’ లో ‘‘ఎస్పీ’’ ఇచ్చిన సీట్లు తీసుకున్నది.
`‘‘హర్యానా’’లో ‘‘ఆప్‌’’ మూలంగా ఆగమైపోయింది.
`‘‘డిల్లీ’’లో దిక్కు లేకుండా పోయింది.
`ఇప్పుడు ‘‘బీహార్‌’’ లో ‘‘ఆర్జేడీ’’ కూడా ‘‘కాంగ్రెస్‌’’ ను బెదిరిస్తోంది.
`ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్‌ భయపడుతోంది.
`ఉత్తరాధిలో బలపడకపోతే భవిష్యత్తు ఆగమ్యగోచరం.
`ఇప్పటికైనా మేలుకోకపోతే మరో పదేళ్లయినా కోలుకోవడం కష్టం.
`‘‘130 ఏళ్ల చరిత్ర’’ పార్టీకి వుంటే సరిపోదు.
`అవకాశాలు అందివచ్చినప్పుడు అందుకోకపోతే వెనుకబాటు తప్పదు.
`ప్రత్యర్థి బలంగా వున్నప్పుడు జనం ఏది చెప్పినా వినరు.
`మూస వాదాలను నుంచి కాంగ్రెస్‌ బైటకు రాకపోతే జనం గెలిపించరు.
`నిజాలు మాత్రమే జనం నమ్మడం లేదు.
`నమ్మించగల శక్తి వున్ననాయకులనే నమ్ముతున్నారు.
`ప్రాంతీయ పార్టీలకు బలమవుతున్నారు.
`దేశ వ్యాప్తంగా బలహీనపడిపోయారు.
`జాతీయ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడితే గెలవదు.
`ప్రాంతీయ పార్టీల చేతిలో పావుగా మారక తప్పదు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలం పెరుగుతోంది. పార్టీ అన్ని రాష్ట్రాలలో పుంజుకుంటోంది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ గ్రాఫ్‌ బాగా పెరుగుతోంది. రాహుల్‌ చెప్పే మాటలను జనం బాగా నమ్ముతున్నారు. ఆయన కోసం జనం సభలకు, ర్యాలీలకు విపరీతంగా వస్తున్నా రు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ప్రాంతీయ పార్టీలను ఎందుకు నమ్ముకుంటోంది? ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఎందుకు ఆదారపడుతోంది? ఏ వామపక్షాలనైనతే కాంగ్రెస్‌బలంగా నమ్మిందో
ఆ వామపక్షాలు కాంగ్రెస్‌ను నిండా ముంచాయి? యూపిఏ వన్‌లో వామపక్షాలకు కాంగ్రెస్‌ ఎంతో ప్రాధాన్యత కల్పించింది. అయినా వామపక్షాలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. రెండోసారి యూపిఏలో వామపక్షాలు అడుగడుగునా కాంగ్రెస్‌ను మోసం చేస్తూ వచ్చాయి. పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వచ్చాయి. కాంగ్రెస్‌ అండతో గెలిచిన వామపక్షాలు కాంగ్రెస్‌ను ఒక రకంగా అల్లాడిరచాయి. దేశంలో కాంగ్రెస్‌ ఈ పరిస్దితి రావడానికి కారణం వామపక్షాలు. ప్రాంతీయ పార్టీలు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతారన్నట్లు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన వాపక్షాలు కూడా కనుమరుగై పోయాయి. ఒకప్పుడు దేశంలో కీలకపాత్ర పోషిచిన వామపక్షాలు కాంగ్రెస్‌ మీద కత్తి దూసి ఆఖరుకు అడ్రస్‌ లేకుండాపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బిజేపి ఇంతలా పుంజుకోవడానికి వామ పక్షాలే పరోక్ష కారణం. కాంగ్రెస్‌ పార్టీ ఉదారతను అలుసుగా తీసుకొని ఆపార్టీని నిర్వీర్యం చేస్తే తాము బలపడతామని వామపక్షాలు భావించాయి. కాని కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేస్తే బిజేపి బలం పెరుగుతుందని ఆలోచించలేకపోయాయి. ఆ తర్వాత దేశంలోనే వామపక్షాలకు ఉనికి లేకుండా పోతాయని కూడా ఊహించలేదు. కాంగ్రెస్‌ అధికారం లోవున్నంత కాలం ప్రభుత్వం మీద నిరసనలు, ధర్నాలు, బంధులు చేపట్టేవి. మరి ఇప్పుడు పదకొండేళ్లుగా నోరు విప్పడానికి కూడా వామపక్షాలు ధైర్యం చేయలేకపో
తున్నాయి. కూర్చున్న చెట్టు కొమ్మ నరు క్కున్న వామపక్షాల పుణ్యమా? అని కాంగ్రెస్‌ గడ్డు రోజలు తెచ్చుకున్నది. ఇప్పటికైనా కాంగ్రె స్‌పార్టీ తేరుకోవాల్సిన అవసరం వుంది. 130 సంవత్సరాల చరిత్ర వుందని చెప్పుకోవడం కాదు? అప్పటి రాజకీయాలను చూపించే శక్తి తెచ్చుకోవాలి. రాజులైనా, రాజ్యాలైనా పట్టాభిషేకమే కీలకం. రాజకీ యాలైనా, నాయకులైనా పదవులే ముఖ్యం. ఈ విషయం రాహుల్‌గాందీ పదే పదే మర్చిపో తున్నాడు. ఘజనీ లాగా ఎన్నిసార్లు దండయాత్ర చేశాడన్నది ఆదర్శం ఎప్పుడూ కాదు. విఫల ప్రయత్నాలు ఎన్ని సార్లు చేసినా ఉపయోగం లేదు. అవకాశాలను అందిపుచ్చులేని వారు నాయకులుగా పనికిరారు. ప్రజాసేవ అనేది పదవుల్లో వున్నప్పుడే ఎక్కువ చేయగలరు. విసృతమైన సేవ చేయగలరు. నిజం చెప్పాలంటే రాహుల్‌ గాంధీ 2009లోనే తప్పటడుగు వేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాంధీ ప్రదాని కావాలనుకున్నారు. కాలేకపో యారు. 2009లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. రాహుల్‌ గాందీ చేజేతులా దానిని జార విడుచుకున్నారు. ఆనాడు ప్రధానిగా పనిచేసి ఐదేళ్లు పాలన చేసి, తర్వాత ఓడిపోయినా మాజీ ప్రదాని అనే గౌరవం వుండేది. కష్టపడకుండానే అన్నీ అవకాశాలు అందినప్పుడు జార విచుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు. మంత్రి పదవి వద్దన్న రాహుల్‌ గాంధీ ఈ పదకొండు సంవత్సరాలలో ఏం సాధించారు. రాజకీయాలు ఏం అవగాహన చేసుకున్నారు. తాను ప్రధాని అయితే ప్రజలకు ఏంచేయలగలను అనేది కూడా ఆయన ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కోసం అనవసర వృధా ప్రయత్నాలు చేస్తున్నా రు. చరిత్రో పోరాటం చేసి గెలిచిన వారున్నారు. అందివచ్చిన అవకాశాలతో పదవులు అందుకున్నవారున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించిన వారు కూడా వున్నారు. రాజకీయాల్లో వ్యూహాలకన్నా మిన్నవైనవి ఏమీ వుండవు. వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా చేసినంత కాలం పగ్గాలు ఆయన చేతిలో పెట్టలేదు. పగ్గాలు రాహుల్‌ గాందీ అందుకోలేదు. రాహుల్‌ గాందీ స్ధానంలో మరే నాయకుడు వున్నా, కాంగ్రెస్‌ను అదికారంలోకి తీసుకొచ్చేవారు. పార్టీ అధ్యక్షుడి పదవే మోయలేని రాహుల్‌ గాంధీ దేశ బాద్యతను ఎలా నిర్వర్తిస్తారో అర్దం కావడం లేదు. ఎందుకంటే ఆయన నాయకత్వమంతా ఫెయిల్యూర్‌తోనే మొదలౌతోంది. ఫెయిల్యూర్‌ కాంగ్రెస్‌ మూట గట్టుకుంటోంది. పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ గెలిచింది వుందా? కాంగ్రెస్‌ను రాహుల్‌ గెలిపించాడన్న భావన పార్టీలో వుందా? ఆయన వ్యూహాలన్నీ అపజయాలుగానే మిగిలిపోతున్నాయి. ఇంకా నాలుగేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా వుంటాయో తెలియవు. ఈసారి కూడా రాహుల్‌ గాంధీ తన పంథాను మార్చుకోలే కపోతే దేశంలో కాంగ్రెస్‌ ప్రజలకు మరింత దూరమవడం ఖాయం. దేశంలో ప్రజలు బిజేపిని గెలిపిస్తున్నారంటే, మరో ప్రజలకుమరో ప్రత్యా మ్నాయం కనిపించడం లేదు. రాహుల్‌ గాందీ మీద ప్రజలకు నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికీ రాహుల్‌ విషయంలో చిన్న పిల్లల చేష్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మానుకోవాలి. హుందాగా రాజకీయాలు చేయడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలకు దూరంగా వుండాలి. ఎన్నికల తర్వాత పొత్తులకు పోవాలే తప్ప, ఎన్నికలుముందు పొత్తులే కాంగ్రెస్‌ను నిండా ముంచేస్తున్నాయి. ఒక్కసారి గత ఐదారేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం చూస్తుంటే, ప్రాంతీయ పార్టీలను నమ్మి బొక్కా బోర్లా పడుతూ వస్తోంది. తన కాళ్ల మీద తాను కాంగ్రెస్‌ పార్టీ నిలబడలేకపోతోంది. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీ ఇచ్చే సీట్ల మీద ఆదారపడి రాజకీయం చేయడం కాంగ్రెస్‌ దురదృష్టకరం. 80 లోకసభ సీట్లులో 15 సీట్లు ఇస్తే చాలనుకుంటే కాంగ్రెస్‌ నాయకులు ఏం కావాలి. వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి. పార్టీలు చీలితే బిజేపి బాగు పడుతుందన్న భ్రమ నుంచి కాంగ్రెస్‌ బైటకు రావాలి. కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకోవాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి ఫ్రధాన కారణం ఆప్‌. అదే ఆప్‌తో సక్యత వల్ల కాంగ్రెస్‌కు మరింత నష్టమే మిగిలింది తప్ప లాభం జరగలేదు. నిజానికి 2013లో ఆప్‌కు డిల్లీలో మద్దతు ఉపసహంరించుకోవడం కాంగ్రెస్‌ చేసిన మొదటి తప్పు. తర్వాత ఆప్‌ కోసం చేతులు చాప డం కాంగ్రెస్‌ చేసిన రెండో తప్పు. అక్కడితో ఆగకుండా పదేపదే ఆప్‌ కోసం తన రాజకీయాన్ని కాంగ్రెస్‌ కోల్పోతూ వచ్చింది. హర్యానాలో గెలవాల్సిన కాంగ్రెస్‌ఎందుకు ఓడిపోయింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగానే అదికార బిజేపి విజయాలు సొంతం చేసు కుంటోంది. ప్రతిపక్షాల మధ్య లుక లుకలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టు కొస్తున్నాయి. డిల్లీ మాజీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైలు కు పంపించినప్పుడు ఆయనకు మద్ద తుగా కాంగ్రెస్‌ నిలిచింది. తర్వాత హర్యానా ఎన్నికలకు ముందు ఆప్‌తో కలిసి బిజేపికి వ్యతిరేకంగా ప్రచా రం సాగించింది. ఆఖరుకు ఎన్ని కలు దగ్గర పడి టికెట్ల పంపకాలలో తేడా వచ్చింది. ఆప్‌ జెల్లకొట్టి కాంగ్రెస్‌కు హాండ్‌ ఇచ్చింది. దాంతో మళ్లీ హర్యానాలో మూడోసారి బిజేపి గెలిచింది. హాట్రిక్‌ సాధిం చింది. అదే సమయంలో కాంగ్రెస్‌, ఆప్‌లు సర్ధుకుపోతే అధికారం దక్కేది. కాని కలిసి సాగలేదు. అది డిల్లీలో కూడా బిజేపి అదికా రంలోకి రావడానికి కారణ మైంది. ప్రతి చోట కాంగ్రెస్‌ మీద ఇతర ప్రాంతీ య పార్టీలు ఆదిపత్యం వహించా లనే చూస్తున్నాయి. తాజాగా బిహార్‌ లో నిన్నటి వరకు మహాగట్‌బం దన్‌లో భాగంగా ఆర్జేడీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ప్రచారం చేస్తూ వచ్చిం ది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా అక్కడ దృష్టిపెట్టింది. ఎలాగైనా సరే బిజేపిని, జేడీయూకు అధికారానికి చరమగీతం పాడాలని రాహు ల్‌ గాందీ ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. అందులో భాగం గా ఓట్‌ చోరీ అనే విషయాన్ని పెద్దఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. బీహార్‌ సాక్షిగా ఎన్నికల సంఘం మీద పెద్దఎ త్తున ఆరోపణలు చేశారు. 65లక్షల ఓట్ల గల్లంతుపై న్యాయం పోరాటం చేస్తున్నా రు. ప్రజల్లో వుంటూ చైతన్యా న్ని రగిలిస్తున్నారు. తీరా ఎన్ని కల తేదీ ప్రకటన దగ్గరకు వచ్చేసరికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు. ఇలా ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని పదేళ్లుగా రాజకీయం చేసినా ఎదు గూ బొదులేదు. ఇలా తమ శ్రమను ప్రాంతీయపార్టీలకు వృదా చేయడం కన్నా, పార్టీని బలోపేతం చేసుకోవడం ఎంతైనా అవసరం. బిజేపిని ఓడిరచాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను పెంచి పోషిస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ మీద ఆ పార్టీలకు కృతజ్ఞత వుండడం లేదు. అందుకే ఇక నుంచైనా ఒంటరి పోరు మీద దృష్టిపెట్టండి. అదే పార్టీని గట్టెక్కిస్తుంది.

పేర్నాల మాటలు..పేకుడు దద్దమ్మలు!?

`ఉద్దండుల పోకడలు.. పొంకనాల చేష్టలు!?

`ప్రజా తీర్పును అవహేళన చేస్తున్రు!

`రాజ్యాంగ స్పూర్తిని పాతరవెట్టిన్రు.

`ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్రు.

`త్రిశంఖు స్వర్గంలో యాలాడుతున్రు!

`ప్రమాణం చేసి పచ్చి అబద్దాలా!?

`ఇమానం తప్పిన్రు!?

`ఇజ్జత్‌ ఇడిశిపెట్టిన్రు?

`నియ్యత్‌ మరిశిండ్రు!

`తొండి మాటలు నేర్శిన్రు!

`కారు దిగలేదంటన్రు

`కాంగ్రెస్‌లో చేరలేదంటన్రు

`ప్రజల నమ్మకాన్ని వంచించిన్రు.

`పార్టీ మారలేదంటన్రు!

`కప్పుకున్నది కాంగ్రెస్‌ కండువ కాదంటున్రు!

`జాతీయ జెండా కండువా అని తొండి ముచ్చట్లు చెప్తున్రు!

`బీఆర్‌ఎస్‌ లోనే వున్నామని బుకాయిస్తున్రు!

`బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే కొనసాగుతున్నామంటున్రు.

`నియోజకవర్గ అభివృద్ధి కోసమే సిఎం ను కలిశినమంటున్రు!

`పూటకో మాట మారుస్తున్రు!

`ప్రజలను ఏమారుస్తున్రు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          నిజాలు ఎలాగూ చెప్పలేరు. కనీసం అబద్దాలైలు కూడా ఆడలేనప్పుడు ధైర్యవంతులని ఎలా అంటారు. అలాంటి వారికి రాజకీయాలెందుకు? ప్రజా ప్రతినిధులు అయ్యేందెందుకు? వారికి పదవులెందుకు? ప్రజల పక్షాన నిలిచినట్లు లేదు? కనీసం తమకు తాముగా రాజకీయ నాయకుడిగా చెప్పుకోవడానికి లేదు? ఇంకా ఎందుకు ఆ పదువులు? రాజకీయం ఎప్పుడూ సూటీగా వుండదని అంటారు. కాని డొంకతిరుడుగు రాజకీయాలైనా సరే సరిగ్గా చేయలేని వారు ప్రజలకు మేలు చేయలేరు. వారి పదవుల కూడా కాపాడుకోలేరు. తెలంగాణలో పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు. రాజీపడే రాజకీయాలు చేసే శక్తిలేదు. ఏ పార్టీలో వున్నామో చెప్పడానికి నోరు కూడా రావడం లేదు. పార్టీ మారినట్లు ఒప్పుకునే ఆత్మస్ధైర్యం లేదు. ఇంతగా దిగజారి రాజకీయాలు చేసి ఆ ఎమ్మెల్యేలు చేసేదేమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మూడునెలల్లో పది మంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కారు దిగారు. కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ విషయం వాళ్లే స్వయంగా మీడియా సాక్షిగా, కార్యకర్తల సమక్షంలో చెప్పారు. కాని ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. తాము పార్టీ మారలేదంటున్నారు. కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. ఇది అనైతిక కాదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లు కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పడం కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా? కనీసం ఆత్మ ప్రబోధం అనేది కూడా వారిలో లేదా? ఎనుకున్న ప్రజలను వంచించడం కాదా? నమ్మి టికెట్‌ ఇచ్చిన పార్టీని మోసం చేయడం కాదా? గెలిపించిన కార్యకర్తలను నట్టెట ముంచడం కాదా? నమ్మించి గొంతు కోసినట్లు కాదా? కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్వాల ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌. సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంక్రట్‌రావు, దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలు బిఆర్‌ఎస్‌ కు రాం రాం చెప్పి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వారితోపాటు ఎంత మందిని కాంగ్రెస్‌లో చేర్చారు. సుప్రింకోర్టు తీర్పు దృష్ట్యా గడువు దగ్గరపడుతుండడంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ వారికి నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాదానం చెప్పాలన్నారు. అందులో 8మంది ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని చెప్పారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మరింత సమయం కోరారు. అయితే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పాడు. ఆయన పార్టీ మారిన రోజు తన రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌ నుంచి అని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్లానని, ఆ తార్వత బి ఆర్‌ఎస్‌లో వున్నానన్నారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చానని మీడియా ముందు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో సమర్ధవంతమైన నాయకుడు. ఆయన పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలని పార్టీ మారినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి యువకుడు, ఇంకా మరో ముప్పై ఏళ్లు రాజకీయం చేయగలిగే శక్తి వున్న నాయకుడితో పనిచేయడం ఆనందంగా వుందన్నారు. కాని స్పీకర్‌కు మాత్రం తాను పార్టీ మారలేదని సమాధానమిచ్చారు. సరే అదే నిజమని అనుకుందాం. కాని ఆయన ప్రభుత్వంలో భాగాస్వామిగా వున్నారు. ఓ కార్పోరేషన్‌కు చైర్మన్‌గా క్యాబినేట్‌ ర్యాంగ్‌ పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆయన పచ్చి అబద్దంచెప్పినట్లు కాదా? అనేక సార్లు సిఎల్‌పి సమావేశంలో పాలు పంచుకోలేదా? ఎంతో సుధీర్ఘమైన అనుభవం వున్న నాయకుడు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, అలాంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి అవసరమని నమ్మి కేసిఆర్‌ 2014 తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు. 2018 తర్వాత ఏకంగా స్పీకర్‌ పదవిని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌గా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇలా అబద్దాలు చెప్పడం విడ్డూరం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ఫ్లెక్సీలున్నాయి. పార్టీ మారినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ఇంటి మీదకు దాడికి దిగిన సందర్భం కూడా అరికెపూడికి వుంది. అయినా పార్టీ మారలేదని చెప్పడం విడ్డూరంగా వుంది. వీరిలో డాక్టర్‌ సంజయ్‌ మీద కేసిఆర్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. నిజానికి జగిత్యాల టికెట్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఆమె ఎంపిగా వున్న సమయం నుంచి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించారు. నిజామాబాద్‌ ఎంపిగా వున్న సమయంలో నిజామాబాద్‌తోపాటు , జగిత్యాల అభివృద్దికి కవిత ఎంతో కృషి చేశారు. అయినా కన్న కూతురు కవితను కాదని సంజయ్‌కు టికెట్‌ ఇస్తే గెలిచి, పార్టీ మారడం అనేది ఏమాత్రం నైతికత కాదని అంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసిఆర్‌ ఎంతో ప్రాదాన్యతనిచ్చారు. ఉన్నత విద్యావంతుడు. పరిపాలనపై పట్టున్న నాయకుడు అని ఎంతో కేసిఆర్‌ నమ్మారు. 2014 ఎన్నికల్లో వరంగల్‌ ఎంపిగా గెలిచిన కడియం శ్రీహరిని, ఉన్న ఫలంగా ఎమ్మెల్సీని చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో ఓ మీడియాలో ఇంతకన్నా నాకు వేరే ఆశలు లేవు. రాజకీయాలు చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి కావడం నా అదృష్టం. ఇక నా జీవితం బిఆర్‌ఎస్‌లోనే పరిసమాప్తమని చెప్పారు. అలా నమ్మిన కడియం శ్రీహరి, రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆఖరుకు గత ఎన్నికల ముందు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్‌ ఇచ్చారు. అయినా కడియం శ్రీహరి మూడు నెలలు కూడా బిఆర్‌ఎస్‌లో లేరు. ఇంకా విచిత్రమేమిటంటే ప్రభుత్వం పడిపోకుండా చూసుకో అని ఒక దశలో రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో సూచించిన కడియం శ్రీహరి, పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. కాని రాజకీయ అనుభవం నేర్పిన పాఠంతో ఆయన చూపించిన రాజకీయ చాణక్యం నిగూడమైంది. కేసిఆర్‌ మరింత నమ్మకంతో కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్‌ ఎంపి. టికెట్‌ కూడా ఇచ్చారు. ఆ సీటు కోసం ఎంతో మంది పోటీ పడినా వారికి కాదని కడియం శ్రీహరికి ప్రాదాన్యతనిచ్చారు. అటు బిఆర్‌ఎస్‌ భీఫామ్‌ ఇచ్చిందో లేదో, ఇటు డిల్లీకి వెళ్లి కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ బిఫామ్‌ తెచ్చుకున్నారు. తన కూతురు కోసం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సార్లు తాను కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. కాని ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఏ పార్టీలో వుండాలో ఆ పార్టీలోనే వున్నానంటూ సమాదానం దాట వేశారు. వరంగల్‌ రాజకీయాల్లోనే టాలెస్టు పర్సనాలిటీ అని గొప్పగా చెప్పుకునే కడియం శ్రీహరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తన కూతురు కోసం పార్టీ మారడమే కాదు, ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న విషయం భహిరంగ రహస్యమే. తప్పించుకునే ఛాన్స్‌లేదని తెలిసినా పార్టీ మారినట్లు కడియం శ్రీహరి ఒప్పుకోకపోవడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఇక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తప్పించుకునే పరిస్ధితి అసలే లేదు. ఎందుకుంటే ఆయన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా వుంటూనే కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ తరుపున సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. వేటు పడాల్సి వస్తే ముందుగా దానం నాగేందర్‌ కు అందరికంటే ముందుపదవిపోక తప్పదు. కాని ఎన్నుకున్న ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమౌతుందో దానం నాగేందర్‌కు గతంలోనే ఓ అనుభవం వుంది. 1999లో మొదటి సారి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్‌కు 2004కు కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దాంతో రాత్రికి రాత్రి టిడిపి పార్టీ టికెట్‌ తెచ్చుకొని సైకిల్‌ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. కాని కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకొన్న అనుభవం దానంకు వుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న భయం వుంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ పోటీ చేయాలంటే భయం పట్టుకున్నది. అందుకే రాజీనామా అంటే భయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే దారి అయితే రాజీనామా చేయాలి. లేకుంటే వేటుకు సిద్దపడాలి. రెండిరటిలో ఏదో ఒకటి తప్పదు. రాజకీయాలలో ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే తప్ప భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ మారరు.

పీఏ చెప్పిందే ఫైనల్‌!?

`పీఏ చెబితే ఎమ్మెల్యే చెప్పినట్లే!(నా)!?

`మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పీఏ ఇష్టారాజ్యం

`మంచిర్యాల ఎమ్మెల్యే పేరు చెడగొడుతున్న పీఏ

`ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే పనులు కానిస్తున్న పీఏ

`మంచిర్యాల నియోజకవర్గంలో పెత్తనమంతా పీఏదే!

`నియోజకవర్గ పనులన్నీ పీఏ కనుసన్నల్లోనే..

`పీఎ ఎస్‌ అంటే ఎస్‌..నో అంటే నో..

`పీఏ అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.

`వద్దంటే కాంట్రాక్టులు వదులుకోవాల్సిందే.

`ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గానికి రావడం లేదు.

`ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావును కలిసేందుకు పీఏ ఎవరికీ అవకాశమివ్వడం లేదు.

`అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడు

`అర్హులైన కాంట్రాక్టర్లను పక్కన పెడుతున్నాడు

`అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

`లోకల్‌ల్లో క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ లేని వారికి టెండర్లు అప్పగిస్తున్నారు

`స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు

`అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నాడు

`అంతా నా ఇష్టమన్నట్లు వ్యవహరిస్తున్నాడు

`ఇప్పటికైనా ఎమ్మెల్యే నిజాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

`అవినీతిలో మునిగితేలుతున్న పిఏను పక్కన పెట్టకపోతే నష్టం జరిగిపోతుందంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎమ్మెల్యేలు చెబితే పనులౌతాయి. మంచిర్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దగ్గర పనిచేసే పిఏ చెప్పిన పనులే అవుతాయి. పిఏ చెప్పినట్లే జరుగుతాయి. ఇక్కడ పిఏ చెప్పిందే ఫైనల్‌..అలా అని ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు ఆదేశాలతో జరిగిపోతున్నాయా? అంటే అదీ లేదు. అసలు ఎమ్మెల్యేకు ఈ విషయాలే తెలియవు. అంతగా పిఏ. ఏదిచెబితే ఎమ్మెల్యే అది చెప్పినట్లే అన్నట్లుగా సాగుతోంది. ఇలా రాష్ట్రంలోనే కాదు, నియోకవర్గంలోఎంతో పేరున్న ఎమ్మెల్యే పేరు చెడిపోవడానికి ఇలాంటి పిఏ ఒక్కరుంటే చాలు అని పార్టీ నాయకులు , ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నమ్మారు. పిఏ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదే మంచిర్యాలలో అందరూ అనుకుంటున్న మాట. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకుఎంతో మంచి పేరుంది. కాని ఏం లాభం. ఆయన పెట్టుకున్న పిఏ వల్ల తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు చెప్పడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. నాయకులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తన వద్ద పని చేసే పిఏను అంతగా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గ నాయకులు కూడా ఎవరూ పిఏ మీద పిర్యాధు చేయడానికి సాహసించడం లేదు. పైగా పిఏతో సఖ్యతగా వుంటే చాలనుకుంటున్నారు. కాని ప్రజలకు మేలు చేయాలన్నా,సేవ చేయాలన్నా, అభివృద్ది పనుల చేపట్టాలన్నా తామే ముఖ్యమన్న సంగతి నాయకులు కూడా మర్చిపోతున్నారు. పిఏ చెప్పినట్లు తలాడిస్తున్నారు. ఒక రకంగా వారికి కూడా తప్పడం లేదు. ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది నాయకులైన వాళ్లు కూడా పిఏ. మన్ననలు పొందాలనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పార్టీ నాయకులకు దౌర్భాగ్యమైన పరిస్తితే. కాని ఏం లాభం? నోరు తెరిచి ప్రశ్నించలేరు. తమ ముందు పిఏ ఎంత అని అనుకోలేరు. ఎమ్మెల్యేకు చెప్పిన ఆయన పట్టించుకుంటాడో లేదో అన్న అనుమానం. ఎమ్మెల్యేకు ఎప్పుడూ సమాచారమందించే పిఏతో పెట్టుకొని పేరు చెడగొట్టుకోవడం ఎందుకు? ఎమ్మెల్యేకు దూరం కావడమెందుకు? అనే ధోరణిలోనే నాయకులు సాగుతున్నారు. దాంతో ఆ పిఏ ఆడిరది ఆట.. పాడిరది పాటగా మారిపోయింది. ఎలాంటి విషయాల్లోనైనా సరే పిఏ. ఎస్‌ అంటే ఎస్‌. నో.అంటే నో..అంతే! అంతకు మించి దారి లేదు. పరిష్కారం అంతకాన్న లేదు. అంతగా పిఏ ఏలుబడి సాగుతోంది. నిజమే పిఏ పలుకుబడి మంచి పనుల విషయంలోనో, ప్రజలకు మేలు జరిగే విషయంలో సాగితే బాగుంటుంది. కాని తన ఇష్టానుసారం పిఏ సాగిస్తున్న తీరు మాత్రం అందరికీ ఇబ్బందికరంగా మారుతోంది. నాయకులే ఎమ్మెల్యే పిఏ ముందు పెద్దగా నోరు విప్పకపోవడంతో అధికారులు కూడా పిఏకు వంత పాడుతున్నారు. పిఏ చెప్పిందే చేస్తున్నారు. పిఏ ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇలా అధికారులు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు? ఆఖరుకు కోర్టు తీర్పులను కూడా పక్కన పెడుతున్నారు. అభివృద్ది పనులను చేపట్టే కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా అదికార గణం నుంచి మొదలు, నియోకవర్గ, ముస్సిపల్‌ అదికారులంతా పిఏ చెప్పినట్లు వినాలి. పిఏ చెప్పిన వారికే కాంట్రాక్టులివ్వాలి. అర్హత లేని వాళ్లైనా సరే పిఏ చెప్పి వారికే టెండర్లు అప్పగించారు. ఇలాంటి ఏ విషయంలోనూ ఎమ్మెల్యేకు సమాచారం వుండడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. తమను ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా చేస్తున్నాడని వాపోతున్నారు. నియజక వర్గ పెత్తనమంతా తన గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరతీస్తున్నాడు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు అనార్యో కారణంగా నియోజకవర్గానికి రావడం లేదు. అది అలుసుగా తీసుకొని పిఏ రెచ్చిపోతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎమ్మెల్యేను కలవాలని ఎంత ప్రయత్నించినా పిఏ. ఆ అవకాశం కల్పించడం లేదు. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు వెళ్లినా అప్పాయింటు మెంటు దొరక్కుండా పిఏ చూసుకుంటున్నాడు. దాంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లలేక, పిఏ చేస్తున్న పనులు భరించలేక కాంట్రాక్టర్లు సతమతమౌతున్నారని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే అదికారులను గుప్పిట్లో పెట్టుకొని స్ధానిక కాంట్రాక్టర్లను పిఏ వేధిస్తున్నాడని తెలుస్తోంది. అర్హులైన , లోకల్‌ కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, ఎక్కడి నుంచో వచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. నియోజకవర్గ పరిదిలో ఏ పనులు చేయాలన్నా, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ వుండాలి. అది స్దానికంగా వుండాలి. కనీసం నియోజకవర్గానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వుండాలి. ఇది నిబంధనలు చెబుతున్నాయి. స్ధానికంగా వున్న కాంట్రాక్టర్లందరికీ మంచిర్యాలలోనే క్యాలిటీ కంట్రోల్‌ ల్యాబులున్నాయి. కాని వారికి మాత్రం కాంట్రాక్టులు అందడం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ధర్డ్‌ పార్టీలకే టెండర్లు, కాంట్రాక్టులు వెళ్తున్నాయి. అలా అదికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పిఏ తన ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. స్ధానికంగా క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ లేకపోవడం వల్ల జరుగుతున్న పనులు నాణ్యతను కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. స్ధానికంగానే క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబులున్న కాంట్రాక్టర్లు పనికిరాకుండాపోతున్నారు. కాంట్రాక్టులు దక్కించుకోలేకపోతున్నారు. ఇలా గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్టులపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయినా అదికారులు ఆ తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టులు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా రద్దు చేసి మరీ కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. పిఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పిఏ తన స్వార్ధం కోసం అదికారులను గుప్పిట్లో పెట్టుకొని నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావుకున్న పేరును చెడగొడుతున్నారు. అంతా నా ఇష్టమన్న రీతిలో పిఏ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. పిఏ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావుకు తెలిసే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే మద్దతు లేకుండానే పిఏ ఇంత ఇష్టాను సారం వ్యవహరిస్తారా? అని అనుమానపడే పరిస్ధితి వస్తుంది. ఇంకా మూడేళ్ల కాలం వుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు సేవ చేయాల్సి వుంది. ఇలాంటి సమయంలో పిఏ ఆగడాలను ఎమ్మెల్యే ఉపేక్షిస్తూపోతే ప్రజల్లో నమ్మకం పోయే పరిసి ్దతి రావొచ్చు. ప్రేమ్‌సాగర్‌రావు మంచితనం చాలా మందికి తెలిసినా, కొంత మందికి తెలియకపోవచ్చు. ఎన్నికల నాటికి పరిస్ధితి చేయిదాటి పోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా, రాకపోయినా ఇప్పటికైనా మేలుకుంటే ఎంతోమంచిదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే మీద ఎలాంటి వ్యతిరేకత ఇప్పటి వరకు లేదు. కాని పిఏ వల్ల ఆ వ్యతిరేకత మొదలౌతే చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లౌవుతుంది. పిఏల వ్యవహార శైలి వల్ల గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. అలాంటి పరిస్దితి రాకుండా వుండాలంటే వెంటనే ఎమ్మెల్యే పరిస్ధితులను చక్కదిద్దుకుంటేనే రాజకీయ భవిష్యత్తు వుంటుందని ప్రేమ్‌సాగర్‌రావు శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

ఆశపడే…మళ్లా గోసపడే!

-మంది మాటలు నమ్మితె..ఎనుకటి కాలం ముందటికొచ్చే!

-రైతు బంధు కేసిఆర్‌ ఇంట్లకేలి ఇస్తుండా అంటే నమ్మితిరి!

-పదికి ఐదు కలిపి ఇస్తామంటే గంతేస్తిరి

-కాళేశ్వరం కేసిఆర్‌ జేబుల పైసలా అంటే జేజేలు కొడితిరి

-యాభై ఏండ్లలో నీళ్లియ్యనోళ్లను నమ్మితిరి
అబద్దాలు చెప్పీ, చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు నమ్మించి, వంచించారు. సంతోషంగా కేసిఆర్‌ పాలనలో కడుపు చల్లగా బతుకిన, రైతుల నోట్లో కాంగ్రెస్‌ పాలకులు మట్టికొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటు ఇయ్యలేరు. ఎరువులియ్యలేరు. వడ్లు కొనలేరు. రైతును బతకనీయరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలదని, అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ ప్రజలు, రైతులు ఇంక జన్మల కాంగ్రెస్‌ ను నమ్మరు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రజల్లోకి రావాలంటే సిగ్గు పడుతున్నరు. భయపడుతున్నరు. అంటున్న మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్లా ధర్మారెడ్డి, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు’’ తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…

-పదేళ్లలో అరవై ఏళ్ల గోస తీర్చినా కేసిఆర్‌ ను ఒద్దనుకుంటిరి

-ఆరునెలలల్ల ఇరవై నాలుగు గంటల కరంటిచ్చిడు గొప్పేనా అంటే ఓట్లేస్తిరి

-అవద్దాలు చెప్పినోళ్ల మాటింటిరి

-కండ్ల ముందుకు కష్టం రాకుంట సూశిన కేసిఆర్‌ ను దింపితిరి

-కోరికోరి కొరివితో తలగోక్కుంటిరి

-ఎండిపోయిన బావుల్ల నీళ్లొచ్చినా మర్చిపోతిరి

-బతకపోయి, మళ్లోచ్చి బతుకు బంగారమైనా నియ్యత్‌ తప్పితిరి

-మోసం చేసినోళ్లనే నమ్మితిరి..నరకం సూడవడితిరి

-తీరిన గోస తిరిగొచ్చే..

-ఎరువు కరువు మళ్లోచ్చే…

-చెప్పుల లైన్లు మళ్ల కనిపించే..

-బస్తా కోసం కొట్టుకోవాల్సి రావట్టే..

-ఎరువు లేక పంట ఏడ్వవట్టే..

-పంట చేతికెలా వస్తుందని రైతు కంటతడిపెట్టే

-కాలమైనా నీళ్లు లేవాయే..

-కాళేశ్వరం నీళ్లు ఉత్తగ పోవట్టే

-నమ్మితే బతుకులు ఆగంకావట్టే!

అబద్దాలు చెప్పి చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు నమ్మించి వంచించారు. సంతోషంగా కేసిఆర్‌ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్లో కాంగ్రెస్‌ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటియ్యలేరు. ఎరువులియ్యలేరు. పూర్తి స్ధాయిలో వడ్లు కొనలేరు. రైతును బతకనీయలేరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలలేదని తెలంగాణ ప్రజలను నమ్మించి, అలవి కాని హమీలిచ్చి, ఒక్క అవకాశమివ్వండని కోరి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలను రాచి రంపాన పెడుతున్నారు. పాలన చేతగా రైతులను అరి గోసకు గురి చేస్తున్నారు. కనీసం ఎరువులు కూడా సకాలంలో సరఫరా చేసేదిక్కులేదు. మరో వైపు అన్ని వర్గాలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇంక జన్మలో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి రావాలంటే కూడా జంకుతున్నారు. భయపడుతున్నారు. ప్రజలకు ముఖం చూపడం లేదు. పల్లెల్లోకి వస్తే ప్రజలే కాంగ్రెస్‌ నాయకులను తన్ని తరమిస్తారని భయపడుతున్నారంటునన్న మాజీ ఎమ్మెల్యే , బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్లా దర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే….
చరిత్రలో ప్రజలను మోసూం చేసిన పాలకులు వున్నారు. ప్రభుత్వాలున్నాయి. ప్రజలకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన పాలకులున్నారు. ఇచ్చిన హమీలను కనీసం గుర్తు చేయలేకుండా పాలించిన వారున్నారు. ఏం హమీలిచ్చారో కూడా తెలియని పాలకులున్నారు. ప్రజలను మోసం చేసిన, అదికారం కోసం అలవి కాని హమీలు ఇచ్చిన పాలకులను చూస్తున్నాం. కాని ప్రజలు ఒక నాయకుడిని మోసం చేసిన సందర్భం కూడా తెలంగాణలో చూశాం. అరవై సంవత్సరాలుగా ప్రజలు అనుభవిస్తున్న గోసను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం సాధన తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి లేదని జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్‌. పద్నాలుగు సంవత్సరాల పాటు సుధీర్ఘమైన అలుపెరగని పోరాటం చేసి, కేందర్ర మెడలు వంచి తెలంగాణను సాధించిన ధీరుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ది చేసుకోవాలో కూడా ఉద్యమ కాలం నాడే బ్లూ ప్రింట్‌ తయారు చేసిన ఉద్యమ కారుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో రూపొంచిందించిన బ్లూ ప్రింట్‌ను పదేళ్ల కాలంలో అమలు చేసి బంగారుతెలంగాణను తయారు చేసిన పాలకుడు కేసిఆర్‌. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాష్ట్రాన్ని ఇంత వేగంగా అభివృద్ది చేసిన పాలకుడు ప్రపంచంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా వున్న తెలంగాణను బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఎస్‌ఆర్‌సీ స్టేట్‌ రీ ఆర్గనైజేషన్‌ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలుపుతున్నామని చెప్పి, బాష ఒకటైనా యాసలో, వేషదారణలో, సంస్కృతీ సంప్రదాయాలలో ఏ మాత్రం సంబంధం లేని రెండు ప్రాంతాలను కలిపి 1956లో కాంగ్రెస్‌ పార్టీ దిద్దుకోలేని తప్పు చేసింది. తెలంగాణ పాలిట మరణ శాసనం రాసింది. అలా 1956లో మొదలైన గోస తెలంగాణ ప్రజలు 2014 వరకు అనుభవించారు. అరిగోస పడ్డారు. ఆకలికి ఏడ్చారు. బతుకు దెరువుకు ఏడ్చారు. ఆత్మగౌరవం కోసం తపించారు. ఆత్మాభిమానం లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులుగా బతికారు. బతకలేక వలసలు పోయారు. వున్న ఊరును,కన్నతల్లిని వదిలి పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. ఇలా బతుదెరువు కోసం వలసలు వెళ్లారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అభివృద్దిని అలక్ష్యం చేశారు. తెలంగాణ ప్రగతిని పక్కన పెట్టారు. తెలంగాణ అంటేనే ఉమ్మడి పాలకులు మండిపడ్డారు. తెలంగాణకు సాగు నీరివ్వలేదు. సరిగ్గా కరంటు ఇవ్వలేదు. సాగుకు ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. రైతులు బోర్లు వేసుకునేందుకు అవకాశమివ్వలేదు. వాల్టా చట్టం తెచ్చి రైతులపై కేసులు నమోదు చేశారు. జైలు పాలు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎంత హింసించాలో అంత హింసించారు. మొత్తంగా తెలంగాణలో సాగు లేకుండా చేశారు. సాగు పడావు పడేలా చేశారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్నారు. పాలించడం చేత కదన్నారు. నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఉమ్మడి పాలకుల చెప్పినట్లు వినే ఉత్సవిగ్రహాలు మార్చారు. తెలంగాణ అంటే వెనుబడిన ప్రాంతంగా మార్చారు. చెరువులు ద్వంసం చేశారు. ప్రాజెక్టులు కట్టలేదు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. నల్లగొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్‌ మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చూశారు. చిన్న వయసులోనే ప్రాణాలు పోతుంటే కనికరం చూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని చేశారు. అలాంటి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన సాధించిన పోరాట యేధుడు కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణలో బతుకు విలువ పెంచారు. తెలంగాణ బతుకు దేశానికే ఆదర్శం చేశారు. ఏ తెలంగాణలో అయితే తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎగతాళి చేశారో అదే తెలంగాణలో బంగారు పంటలు పండేలా చేశారు. బంగారు తెలంగాణ తయారు చేశారు. సాగు, తాగు నీటి సమస్య తీర్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని సాగు అద్భుతాలు సృష్టించారు. కాళేశ్వరం లాంటి గొప్ప సాగునీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఐదేళ్లలో చింతలు లేని తెలంగాణ తయారు చేశారు. పదేళ్లలో బంగారు తెలంగాణ తయారుచేశారు. ఒకప్పుడు మెతుకు కోసం ఆరాటపడిన తెలంగాణను దేశానికి అన్న పూర్ణను చేశారు. చుక్క చుక్క ఒడిసిపట్టి తెలంగాణకు మళ్లించాడు. ఎండిన వాగులు పారించారు. ఎండా కాలంలో చెరువులు మత్తలు దుంకించాడు. ఎండిపోయిన బావును మళ్లీ కళకళలాడేలా చేశారు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూశారు. ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్ట రాక్షస పాలన చూశారు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ బంగారు పాలన చూశారు. ఒకప్పుడు చీకటి బతుకులు చూసిన తెలంగాణకు వెలుగులు తెచ్చిన కేసిఆర్‌ పాలన చూశారు. ఎకరాల కొద్ది భూములున్నా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన రైతులున్నారు. ఆటోలు నడుపుకున్నారు. హోటళ్లలో సర్వర్లుగా పనిచేశారు. ఏ చేతితో బంగారు పంటలు పండిరచారో అదే చేతితో, రాళ్లు కొట్టారు. ఎంగిలి ప్లేట్లు కడిగారు. ఇలా తెలంగాణ రైతులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ మరిపించిన కేసిఆర్‌ పాలన చూశారు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకునేలా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు. పండిన పంటలను కల్లం నుంచే నేరుగా కొనుగోలు చేశారు. రెండు మూడు రోజుల్లో రైతుల అక్కౌంట్లలో డబ్బులు పడేలా చేశారు. ఇన్ని చేసిన కేసిఆర్‌ను కాదుకొని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించుకున్నారు. కేసిఆర్‌ పాలనలో చీకు చింత లేని జీవితాలు అనుభవించారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని మళ్లీ చింతలు కొని తెచ్చుకున్నారు. విద్య, వైద్యం లేకుండా చేశారు. ఏ ప్రజలు పాలించమని నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలనే ఇబ్బందుల పాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా అలవాటే. కేసిఆర్‌ రైతు బంధు ఇస్తే ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? మేం అదికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఏమైంది? ఆనాడు కేసిఆర్‌ చెప్పినట్లే రైతు బంధుకు రాం..రాం అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల మేలు కోరి కేసిఆర్‌ ఎన్నో సార్లు చెప్పారు. నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్‌ వస్తే కష్టాలు వస్తాయన్నారు. కరంటు కటకట మొదలౌతుందని కేసిఆర్‌ చెప్పి చూశారు. కాని కాంగ్రెస్‌ మాటలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే ఆగం చేస్తుందని కేసిఆర్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినలేదు. అలా ప్రజలను మాయ చేసిన కాంగ్రెస్‌ నాయకులు అధికారం తప్ప ప్రజా సేవను గాలికి వదిలేశారు. కాంగ్రెస్‌ పాలన అంటేనే రాక్షస రాజ్యమని మరోసారి తేలిపోయింది. తెలంగాణ అంతా మళ్లీ కేసిఆర్‌ జపం మొదలైంది. సారే రావాలని కోరుకుంటున్నారు. ఇక వచ్చేదంతా బిఆర్‌ఎస్‌ కాలమే. తెలంగాణ రైతులకు పండుగ రోజులు మళ్లీ కేసిఆర్‌ పాలనలోనే..

కృష్ణార్జునులు ధన్యులు.

అవ్వల మురిపెం..చూసిన కళ్లకు సంబురం!

`ఒకే దగ్గర కృష్ణార్జునులను చూసి అవ్వల సంతోషం.

`మహిళల మద్దతు మరింత చిగురింతకు అవ్వలిచ్చిన చిరునవ్వుల వరం.

`గులాబీ దళానికి వున్న బలానికి ఈ సన్నివేశం నిదర్శనం.

`కేటీఆర్‌, హరీష్‌ లను చూడగానే చుట్టుముట్టిన అవ్వలు.

`కృష్ణార్జునులకు ఒకే శాలువలో సత్కారం.

`కేటీఆర్‌ ను దగ్గర తీసుకొని అవ్వలు పంచుకున్న ఆత్మీయతకు సాక్ష్యం.

`కృష్ణార్జునులను చూసిన ఆనందంలో అవ్వలు విరబూయించిన చిరునవ్వుల వనం.

`నాయకుల పట్ల ప్రజల్లో వున్న నమ్మకానికి సంకేతం.

`ప్రజల్లో ఎంతగా మమేకౌమౌతున్నారో చెప్పడానికి ఒక సందర్భం.

`కేసీఆర్‌ అంటే వున్న అభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం.

`ఆ అభిమానం ఇద్దరు నేతల మీద కురిపిస్తున్న మహిళా లోకం.

`ఇలాంటి ప్రేమ నాయకులందరికీ సాధ్యం కాదు.

`ప్రజల్లో వున్న అంత గొప్ప ప్రేమను దూరం చేసుకోవద్దు.

`అరమరికలు లేకుండా కృష్ణార్జునులు కలిసి సాగాలని అవ్వలు ఇచ్చిన దీవెనలు.

`భవిష్యత్తు బీఆర్‌ఎస్‌ దే అని స్పష్టతనిచ్చిన అవ్వల అనురాగాలు.

`అందుకున్న ఇద్దరు కృష్ణార్జునులకు అవే ఆశీస్సులు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
మన నిత్య జీవితంలో కొన్ని సన్ని వేషాలు, సందర్భాలు ఎదురౌతుంటాయి. అవి కొన్ని సార్లు అబ్బురపరుస్తుంటాయి. ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆనందాన్ని నింపుతాయి. సంతోషాన్ని అందిస్తాయి. అవి మనకే తారస పడనక్కర్లేదు. ఎదుటి వారికి జరుగుతున్నా మనం కూడా సంతోషిస్తుంటాం. ఆ క్షణం మనం కూడా కొంత ఆనందానికి లోనౌతుంటాం. అవి అనుభవించేవారికి ఎలా వుంటుంది? ఆ ఆనందానికి అవధులు వుండవు. అందుకు ఒక్క చిరునవ్వు చాలు. అక్కడ వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారుతుంది. వారి జీవితంలోనే కాదు, చూసే వారి జీవితంలో కూడా ఒక గొప్ప అనుభూతి జీవితాంతం మిగిలిపోతుంది. మనసు పులకరించిపోతుంది. ఇలాంటి సందర్భాలు కొందరి జీవితాల్లో పదే పదే వస్తుంటాయి. కొందరి జీవితాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అలా ఎప్పుడూ ఎదురయ్యే సన్నివేషాలలో పాత్రదారులైన వాళ్లు ఎంత అదృష్టవంతులో అని అనిపించక మానదు. అలాంటి అదృష్టాన్ని పదే పదే అందుకునే నాయకులు తెలంగాణలో ఇద్దరే ఇద్దరు వున్నారు. వాళ్లే కృష్ణార్జునులుగా పిలువబడే కేటిఆర్‌, హరీష్‌రావు. సహజంగా ప్రజలంటే మాకు ఎంతో ఇష్టమని ప్రతి నాయకుడు చెప్పేదే. కాని ఆ నాయకుడంటే మాకు ఎంతో ఇష్టమని ప్రజల చేత చెప్పించుకోవడం అంటే వారి మనసు ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఊరు, వాడ, ప్రాంతం, జిల్లా అని తేడా ఎక్కడ లేకుండా ఎక్కడికెళ్లితే అక్కడ ఆ నాయకుల పట్ల ప్రజలు ప్రేమ ఆదరణ చూపిస్తుంటే చూసే వాళ్లకు కూడా ఎంతో సంతోషంగా వుంటుంది. రాజకీయ ప్రత్యర్ధులకు సైతం ప్రజల నుంచి ఇలాంటి ప్రేమాభిమానాలు కేటిఆర్‌, హరీష్‌లకు దక్కడాన్ని చూసి సంతోషపడతారని చెప్పాలి. పైకి ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా, ప్రత్యర్దులుగా ఎన్ని ఆరోపణలు గుప్పించుకున్నా నాయకులుగా ప్రజల్లో చెరగని ప్రేమను సొంతం చేసుకున్న నాయకులంటే తోటి నాయకులెవరైనా సరే ఆనందపడతారు. కేటిఆర్‌, హరీష్‌లకు ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి ఇలాంటి సన్నివేషాలు తరుచూ జరుగుతూనే వుంటాయి. వారిని చూడగానే పల్లె అయినా, పట్నమైనా సరే ప్రజలు వారి వద్దకు చేరుకుంటారు. ఈ ఇద్దరు బాగున్నారా? అని ఆ ప్రజలను అడగకముందే బాగున్నారా! అయ్యా అంటూ అవ్వలు మూగిపోతారు. కేటిఆర్‌, హరీష్‌రావుల వద్దకు చేరుకుంటారు. వారిని చూసి ఏదో నాయకులు వచ్చారన్న భావన వారిలో వుండదు. తమ పిల్లలు వచ్చినంత సంతోషంగా ఈ ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వెళ్లగానే బావిస్తారు. వారి వద్దకు చేరుకుంటారు. నవ్వుతూ, ముసిముసి నవ్వులు కురిపిస్తుంటారు. అలాంటిదే తాజాగా మరో సన్నివేషం జరిగింది. మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కేటిఆర్‌ వెళ్లారు. సహజంగా ఈ ఇద్దరు పార్టీ కార్యాక్రమాలు, పార్టీ వేదికలు, రాజకీయ సభల్లో నిత్యం కలుసుకుంటూనే వుంటుంటారు. నిత్యం ఫోన్‌లలో సంబాషించుకుంటూనే వుంటారు. ప్రత్యేకంగా ఒకరి ఇంటికి ఒకరు వెల్లడం అనేది సహజంగా కనిపించదు. ఈ మధ్య హరీష్‌రావు ఇంటికి కేటిఆర్‌ వెళ్లారు. ఆ విషయం తెలిసిన చుట్టుపక్కల అమ్మలకు, అక్కలకు, అవ్వలకు తెలిసింది. ఇద్దరు నాయకులు ఇంటి నుంచి బైటకు వెళ్లిపోయే ముందు ఆ అవ్వలంతా ఇద్దరిని చుట్టుముట్టారు. కేటిఆర్‌, హరీష్‌లను పేరు పేరునా పలకరించారు. కేటిఆర్‌ను చూడగానే మరింత అమితానందం పొందారు. ఎందుకంటే హరీష్‌రావు ఎప్పుడూ కనిపిస్తూనే వుంటారు. అక్కడికి వచ్చిన కేటిఆర్‌తో కలిసి హరీష్‌ను చూసే సరికి కృష్ణార్జులను ఒకే సారి ప్రత్యక్ష్యంగా చూడడంతో అక్కడ అవ్వలు సంతోషం వ్యక్తంచేశారు. కేటిఆర్‌కు కరచాలనం చేశారు. కేటిఆర్‌ను పట్టుకొని యోగక్షేమాలు అడిగారు. కేసిఆర్‌ ఆరోగ్యం ఎలా వుందని ఆరాతీశారు. అమ్మ ఎలా వుందని ప్రశ్నించారు. ఓ అవ్వ ఏకంగా కేటిఆర్‌ కడుపులో తల పెట్టి కేటిఆర్‌పై వున్న మమకారాన్ని చూపించింది. గదవ పట్టుకొని కేటిఆర్‌ను చిన్నపిల్లాడిలా ముద్దు చేసింది. ఆ నాయకుల పట్ల ప్రజలకు వున్న అభిమానానికి ఇవి సంకేతం. సహజంగా నాయకులు ఎదురు పడితే, ప్రజలు తమ సమస్యలు చెబుతారు. తమ సమస్యలు వివరిస్తారు. లేదా ప్రశ్నిస్తారు. వారి పాలనపై తమ అభిప్రాయాలను చెబుతారు. కాని ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించలేదు. ఆ నాయకులను చూసిన ఆనందం చాలు అనుకున్నట్లు అవ్వలు మురిసిపోయారు. ఇలా ఇద్దరు నాయకుల పట్ల తెలంగాణ అక్కలు, అమ్మలు,చెల్లెండ్లు, అవ్వలు చూపించే ప్రేమలు మరే ఇతర నాయకులు దక్కినట్లు కూడా కనిపించవు. అవి కూడా బిఆర్‌ఎస్‌ నేతలకు మాత్రమే ఎదురౌతుంటాయి. బిఆర్‌ఎస్‌ అదికారంలోవున్నప్పుడు కేటిఆర్‌ మహబూబ్‌ నగర్‌ జిల్లా పర్యటను వెళ్లారు. అక్కడ ఓ అరుగు మీద అవ్వలు కూర్చుకున్నారు. ఆ సమయంలో కేటిఆర్‌, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌లు పాదయాత్ర చేశారు. సరిగ్గా అవ్వలు కూర్చున్న చోటుకు కేటిఆర్‌ రాగానే ఎంతో మురిసిపోయారు. అయ్యా..అని పిలిచారు. దాంతో కేటిఆర్‌ వాళ్ల వద్దకు వెళ్లారు. వారితో కూర్చొని మాట్లాడారు. ఆ సమయంలో కేటిఆర్‌తోపాటు , అవ్వల మధ్య సంబాషణల్లో నవ్వులు విరబూశాయి. అంటే బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడైనా, ఇప్పుడైనా ఈ నాయకుల పట్ల ప్రజల్లో ఒకటే భావన వుంది. ఇప్పుడంటే ప్రతిపక్షంలో వున్నారు. ఇప్పుడు సమస్యలు లేవనెత్తినా ఉపయోగం లేదు. కాని అధికారంలో వున్నప్పుడు సహజంగా నాయకులు తారసపడితే ఏదో సమస్యలు చెబుతారు. కాని అప్పుడు కూడా నీ కడుపు సల్లగుండ. అని అవ్వలు దీవించారే గాని, మాకు ఈ సమస్యలున్నాయని చెప్పలేదు. కేటిఆర్‌ దేవుడు. మాకు పించన్‌ ఇస్తున్నడు. అని దీవించారు. ఇంతకన్నా నాయకులు ఏం కోరుకుంటారు. ఇలాగే హరీష్‌రావు ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు గుమిగూడుతారు. ఆయనను తమ సొంత కొడుకులా పలకరిస్తారు. ప్రజలను హరీష్‌రావు ఎలా వున్నాడని అడకముందే సారు..బాగున్నర అని ఎదురొస్తారు. ఏమైన సమస్యలున్నాయా? అంటే మీరున్నంక మాకేం బాధ సారూ..అంటారే గాని, ఇది రాలేదు..అది రాలేదని చెప్పడం జరిగేది కాదు. ఇప్పుడు సాదారణ ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లినా అదే ప్రేమ , ఆదరణ ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు కూడా మీరున్నంక మాకేంత తక్కువ అనేలాంటి పదాలే వాడుతారు. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్ధితులను హరీష్‌కు వివరిస్తుంటారు. అందుకే హరీష్‌ ఏ ఊరికి వెళ్లినా ఓ అరుగు మీద కూర్చుంటారు. అందరూ అక్కడకు చేరుకుంటారు. అవ్వలంతా ఆయన చుట్టుముట్టి హరీష్‌నే యోగ క్షేమాలు తెలుసుకుంటారు. ఇలా బిఆర్‌ఎస్‌లో మరి కొంత మంది కూడా వున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా ఇలాంటి సన్నివేషాలు చూస్తుంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన చుట్టూ చేరుతారు. పిల్లాజెల్లా అందరూ ఆయననుఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. నాయకుడు వచ్చాడన్న భయం వారిలో కనిపించదు. ఇక ఇటీవల కాలంలో ఎర్రబెల్లి తన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆయనను చుట్టుముట్టి ఎరువులు రావడం లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని,నీళ్లు రావడం లేదని చెప్పే సందర్భాలు మీడియాలో చూస్తూనే వున్నాం.
మిమ్మల్ని ఓడిరచి తప్పుచేశినం అంటూ ఒక నాయకుడి వద్దకు వచ్చి ప్రజలు పొరపాటును వెళ్లడిరచడం కూడా చాలా అరుదు. అంతే కాదు నాయకుడి వద్ద ఎంత చనువు లేకపోతే ఓటు ఈసారి అటే ఏసిన అని చెప్పి, నాయకుడిని నవ్వించడం కూడా ఎక్కడ చూసి వుండరు. కాని ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రజలు నేను ఓటు వేయలేదని చెప్పిన చిరునవ్వుతో వారితో కలిసిపోవడం అనేది అందరి వల్ల కాదు. తనకు ఓటు వేయలేదని ప్రజల మీద కోపం చూపించే నాయకులే వుంటారు. కాని వేయలేదని చెప్పే చనువు, నాకు తెలుసని నవ్వుతూ వారితో కలిసిపోయే నాయకులు వుండడం కూడా తెలంగాణ నాయకులు గొప్పదనం అని కూడా చెప్పాలి. ఇలా ప్రజాదరణ లభించడం అనేది వారి నిబద్దతకు, ప్రజా సేవకు నిదర్శనమని చెప్పడంలో సందేహం లేదు.

పిల్లల పాలిట పాపిష్టిజ్యోతి! ఇదేం చదువు చెప్పే రీతి.

-వీపు అంతా వాతలు! కమిలిపోయేలా దెబ్బలు!!

-రాచిరంపాన పెడుతున్న పరంజ్యోతి.

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-మాటలు రాని విద్యార్థిని చితకబాదిన టీచర్‌.

-ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లాడు

-యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది!

oasis school warangal incident

-దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు?

-భారతీయత అనే వాట్సాప్‌ గ్రూప్‌ లో పిల్లల దెబ్బల ఫోటోలు వైరల్‌.

-ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వాక్యాలు?

-మూగ విద్యార్థి మీద టీచర్‌ ప్రతాపం.

oasis school warangal incident

-పాఠాలు చెబుతున్నారా! కోపాలు తీర్చుకుంటున్నారా!

-మీకు పిల్లలు లేరా! వారిని ఇలాగే కొడతారా!!

-పసివాడన్న కనికరం లేని టీచర్లు.

-ఎంత కొట్టినా ఏడ్వలేడు పిల్లాడు 

-చేతులెలా వచ్చాయో టీచర్‌ కు..

-వరంగల్‌ ఒయాసిస్‌ స్కూల్‌ టీచర్‌ నిర్వాకం.

-టీచర్‌ కొడుతున్నా అరవలేడు.

-ఏడ్చినా కన్నీళ్లు తప్ప మాటలు రావు.

-అలాంటి విద్యార్థిని కొట్టేందుకు టీచర్‌కు చేతులెలా వచ్చాయి.

-మాటలు రాని విద్యార్థి మీద కనికరం లేకుండా దెబ్బలు.

-యూకేజీ విద్యార్థిపై ఇంత దాష్టికమా?

-విద్యార్థికి మాటలు రాకపోవడం నేరమా

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-తల్లిదండ్రులను పిలిచి బుజ్జగింపులు.

-తల్లిదండ్రులతో పరంజ్యోతి బేరసారాలు.

-ఫీజులో రాయితీ కల్పిస్తామని తల్లిదండ్రులను వేడుకలు.

-ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని స్కూల్‌ ను మూసేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌.

-విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు.

-చైల్డ్‌ వెల్పేర్‌ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                     

అతను యూకేజీ చదువుతున్న పసివాడు. రోజూ స్కూలుకు వెళ్లినట్లే వెళ్లి ఇంటికి వచ్చాడు. తల్లి స్కూల్‌ యూనిఫామ్‌ మార్చేందుకు అబ్బాయి షర్టు విప్పింది. అంతే ఆ అబ్బాయిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది. గుండెలు పిండేలా ఆ తల్లికి ఏడుపు వచ్చింది. ఆ అబ్బాయి వీపంతా తడిమి చూసింది. ఆ తల్లి చేయి వీపు మీద పడగానే ఆ పసివాడు విలవిలలాడిపోయాడు. ముట్టుకుంటేనే జంకుతున్నాడు. వీపంతా ఎర్రగా మారిపోయింది. రక్తం కనిపించేలా వీపు మీద వాతలు తేలాయి. ఏం జరిగిందో చెప్పడానికి ఆ పసివాడికి మాటలు రావు. సహజంగా చిన్న పిల్లలకు మాటలు రాకపోవడం వేరు. కాని ఆ అబ్బాయికి పుట్టుకతోనే మాటలు రావు. కాని ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడు చదువుకోవాలని ఆశించారు. అది కూడా ఎంత ఖర్చయినా సరే మంచి ప్రైవేటు స్కూలుకు పంపాలని అనుకున్నారు. ఫీజులు చెల్లిస్తున్నారు. మాటలు రాకపోయినా, మన మాటలు వింటాడు. మనం ఏం చెబుతాడో అర్ధం చేసుకోగలడు. అందువల్ల స్కూలుకు పంపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని స్కూలు నుంచి ఇంటికి విచ్చన ఆ పసివాడి వీపు నిండా వాతలే వున్నాయి. అది కూడా వీపంతా కమిలిపోయేలా దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆ తల్లి తట్టుకోలేక ఏమైంది నాన్నా, అని అడిగినా ఏదీ చెప్పలేని మూగ జీవితం ఆ పసివాడిది. కనీసం టీచర్‌ కొట్టాడని చెప్పలేడు. టీచర్‌ కొడుతుంటే ఏడ్వలేడు. తన భాధను కన్నీటి రూపంలో తప్ప మరో రకంగా చెప్పలేడు. అందులోనూ టీచర్‌ కర్కషంగా కొట్టినా ఆ పసివాడు వద్దని వారించే వయసు కాదు. కొట్టకండి సార్‌ అనేందుకు నోరు లేదు. ఎదురుతిరిగే వయసు అసలే కాదు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్చించలేడు. కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం, బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు. అలాంటి పసివాడిని కసి తీరా కొట్టిన ఆ టీచర్‌ ఎవరో గాని అతను కర్కోటకుడా? లేక రాక్షసుడా? ఒక పసివాన్ని ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? అసలే మూడు నాలుగేళ్ల పిల్లవాడు. మాటలు రాని మూగ వాడు. అలాంటి పిల్లాన్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్‌కు వుండాలి. అంతే కాని ఆ పిల్లాడిని కసి తీరా కొట్టేంత దుర్మార్గుడు టీచర్‌ గా పనిచేయడానికి అనర్హుడు. శిక్షార్హుడు. అలా పిసి పిల్లవాడిని కొట్టిన టీచర్‌ను నిజంగానే చెట్టుకు కట్టేసి కొట్టితా తప్పులేదు. ఆ టీచర్‌ మిడిమిగి జ్ఞానం వున్నవాడైనా కావాలి. లేకుంటే ఆ స్కూల్‌ యాజమాన్యానిది వింత పోకడైనా కావాలి. ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు. కాని ఇలా ఒళ్లు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు. అసలు కొట్టిన వాడికి పిల్లలున్నారా? లేరా? ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా? ఆరా తీయాలి. ఎందుకంటే బిఈడీ, టిటిసి ట్రైనింగ్‌ చీసుకునే చాత్రోపాద్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది. చైల్డ్‌ సైకాలజీ చదువుకోవాలి. పిల్లల మనస్తత్వాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల అందిరి మనస్తత్వం ఒక్కలా వుండదు. పిల్లలందిరకీ ఒకే రకమైన ఆలోచనలు వుండవు. కొంత మంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు. మరి కొంత మంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు. కొంత మంది ఎప్పుడూ ఆటల మీదనే దృష్టిపెడుతుంటారు. మరి కొంత మంది విద్యార్ధులకు ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. ఇలా ఒక్కొ విద్యార్ధికి ఒక్కొ రకమైన జ్ఞానం సొంతంగా వుంటుంది. వాటిని గమనించి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠాలు చెప్పడమే చైల్డ్‌ సైకాలజీ. ఇలా పిల్లాడిని వీపుంతా కమిలిపోయేలా కొట్టిన వాడి చదువు సంధ్యలేమిటో తెలుసుకోవాలి. పిల్లల్లో అల్లరి చేసేవాళ్లు కొంత మంది వుంటారు. అయితే యూకేజీ చదువుకునే పిల్లల అల్లరి ఆనందంగానే వుంటుంది. అలాంటి విద్యార్ధుల అల్లరిని చూసి కోపం తెచ్చుకునేవాడు టీచర్‌గానే పనికిరాడు. అందులో నోటి నుంచి మాట రాని ఓ మూగ పిల్లవాడు చెసే అల్లరి ఏముంటుంది? అలాంటి పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఇష్టపడరు. ఎంత సేపు తోటి పిల్లలను గమనిస్తూ వుంటారు. అంతే తప్ప వాళ్లు ఇతర పిల్లలతో పోట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. అందరి వైపు ఒక రకమైన చూపులతో చూస్తూ మిగతా వారు గలగల మాట్లాడుతుంటే, నేనేందుకు మాట్లాడడం లేదన్న భావన తన మనసు ఆ పసి హృదయాన్ని ప్రశ్నిస్తూనే వుంటుంది. అలాంటి పిల్లాడిని కొట్టిన స్కూల్‌ యాజమాన్యంలో కనీసం పశ్చాత్తాపం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు కూడా యాజమాన్యానికి ఇష్టం లేదు. ఏ మీడియా నన్ను ఏమీ చేయలేదంటూ ఏం జరిగిందని ప్రశ్నించిన మీడియాతో యజమాని పరంజ్యోతి చిర్రుబుర్రులాడడం వింతగా వుంది. విచిత్రంగా వుంది. తాజాగా ఆ పిసివాడిని కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలు పెద్దఎత్తున భారతీయత అనే వాట్సాప్‌ ద్వారా పెద్దఎత్తున వైరల్‌ అవుతున్నాయి. వరంగల్‌ జిల్లా మొత్తం పాకిపోయింది. అది గమనించిన ఒయాసిస్‌ స్కూల్‌ యజమాని ఆ పసివాడి తల్లిదండ్రులను పిలిపించుకొని బేర సారాలకు దిగినట్లు కూడ సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని తల్లిదండ్రులను కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. తమ పిల్లాడి ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ స్కూల్‌ మేనేజ్‌ మెంటు ఆ తల్లిదండ్రులకు ఆశలు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దఎత్తున సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతుండడంతో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే వారిని పరంజ్యోతి బెదిరిస్తున్నారు. నా వెనుక పెద్ద పెద్ద నాయకులున్నారంటూ చెబుతున్నట్లు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఈ విషయం కొంత మంది పోలీసు అదికారుల దృష్టికి వచ్చింది. ఏ జరిగింది? మీ స్కూలు బస్సులు ఇలా రోడ్డు మీద వుంటే ఎలా? అని ఆ పోలీసులు అదికారులు ప్రశ్నిస్తే మీపై ఆఫీసర్‌కు ఏం కంప్లయింట్‌ చేస్తావో చేసుకో అని వారిని కూడా పరంజ్యోతి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా స్కూల్‌లో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రశ్నించిన వారిని బెదిరించే స్దాయికి విద్యా సంస్ధలు ఎదగడం అనేది వ్యవస్దకే నష్టం. అందువల్ల విద్యా శాఖ జరిగిన సంఘటనపై వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. విద్యార్ధిని అంతలా చితకబాదినా డిఈవో, ఎంఈవోలు ఇంత వరకు స్పందించలేదు. ఆ స్కూల్‌లో ఏం జరిగిందన్నదానిపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. ఇప్పుడు జరిగింది చిన్న సంఘటన కాదు. పసివాడిని వీపులో పిడికిలితో టీచర్‌ గుద్దితే ఆ పిల్లోడి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యులు? అదృష్టం బాగుండి పిల్లవాడుచేయని తప్పుకు శిక్షను అనుభవించాడు. అదే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు పరిస్దితి ఏమిటి? ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా వుంది. అంత జరిగితే ఆ విషయాన్ని బైట పెట్టకపోవడం కూడా తప్పే. ఇవాళ ఈ అబ్బాయికి జరిగింది. మరోసారి మరో అబ్బాయికి జరగదన్న గ్యారెంటీ ఏముంది? ఈ తల్లిదండ్రులను బెదిరించినట్లే ఇతర తల్లిదండ్రులను కూడా స్కూల్‌ యాజమాన్యం బెదిరిస్తుంది. భయపెడుతుంది. కనీసం మాటలు రాని పిల్లాడిని ఎలా కొట్టారని ప్రశ్నించే ధైర్యం తల్లిదండ్రులకు లేదా? ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెబితే అంగీకరిస్తారా? మీ పిల్లాడి ప్రాణాలకన్నా, చదువు ఎక్కువకాదు. ఆ స్కూల్‌ ఫీజు రాయితీ అంతకన్నా పెద్దది కాదు. ఇప్పటికైనా ప్రైవేటుస్కూళ్లలో చదువుకునే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వారి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు? తమ పిల్లలను టీచర్లు ఎలా ట్రీట్‌ చేస్తున్నారన్నది కూడా తెలుసుకుంటుండాలి. లేకుంటే స్కూళ్ల యజమాన్యాల వేషాలు మితిమీరిపోతుంటాయి. విద్యా శాఖతోపాటు, చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ వెంటనే స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యార్ధిని కొట్టిన టీచర్‌ను, ఆ స్కూల్‌ యజమాని పరంజ్యోతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే కట్టడి చేయకపోతే మిగతా స్కూళ్లు కూడా ఇలాగే తయారౌతాయి.

ప్రగతిలో ఖమ్మం ఫస్ట్‌..మంత్రులలో పొంగులేటి బెస్ట్‌!

-పొంగులేటి శీనన్నే నా కుడి భుజం

-శీనన్నే నాకు కొండంత బలమని చెప్పిన సిఎం

-మంత్రిత్వ శాఖల నిర్వహణలో శీనన్నే టాప్‌ అని చెప్పిన సిఎం

-పదేళ్ల బిఆర్‌ఎస్‌లో ఆగిపోయిన అభివృద్ధి

-ఖమ్మం అభివృద్ధి పరుగులో పొంగులేటి చిత్తశుద్ధి

-ప్రజలకిచ్చిన మాట కోసం పొంగులేటి కృషి

-తెలంగాణ వచ్చినా నిన్నటి దాక అభివృద్ధికి ఖమ్మం ఆమడ దూరం

-ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం అందుకుంటున్న మొదటి స్థానం

-చికచక సాగునీటి ప్రాజెక్టులు

-ఊరూర ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు

-వాడ వాడలా సాగుతున్న అభివృద్ధి పనులు

-అవినీతి రహిత పాలనలో దేశానికే ఆదర్శం

-రెవెన్యూ సంస్కరణల్లో భూ భారతి ఒక విప్లవం

-రిజిస్ట్రేషన్‌ శాఖలో అనూహ్యమైన మార్పులు

-పేదలకు మెరుగైన సేవలకు రిజిస్ట్రేషన్‌ శాఖలు నిలయాలు

-ఖమ్మం అభివృద్ధికి మంత్రి పొంగులేటి పట్టుదల

-ఏడాదిన్నరలోనే ఖమ్మం ప్రగతి తోరణాలతో కళకళ

-ఖమ్మంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి శీనన్న కృషి

-ప్రతి ఏడాది 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు

-ప్రతి గ్రామంలో ప్రతి పేదకు ఇల్లు

-ఐదేళ్ళలో విడతల వారిగా నిర్మాణాలు.

-ఖమ్మంలో తొలి విడత ఇండ్లకు గృహప్రవేశాలు

-తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          ప్రజా ప్రభుత్వం, సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పడుతున్న శ్రమతో ఖమ్మం జిల్లాను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్నదే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఆయన వేసుకన్న ప్రణాళికలను అమలు చేస్తూ వున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. అటు మంత్రిగా రాష్ట్రాభివృద్ది, జిల్లా నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఖమ్మం జిల్లా అన్ని రంగాలలో ప్రగతిలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా గూడులేని నిరుపేదలు ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామన్న తన ఎన్నికల హమీని పక్కాగా అమలు చేస్తున్నారు. పేదల కళ్లలో ఆనందం నింపుతున్నారు. అన్ని జిల్లాల కంటే ముందుగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టిన నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అంతే వేగంగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వహస్తాలతో ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయించారు. ఏడాది కాలంలో ఆ ఇండ్లను పూర్తి చేసి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదగా గృహ ప్రవేశాలు చేయించారు. అదీ నాయకుడిగా, ప్రజలకిచ్చిన హమీలు నేరవేర్చే ప్రజా ప్రతినిధి లక్ష్యమని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన చూసిన తమ జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలని ఇతర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు స్పూర్తిపొందేలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన కితాబు ఎంతో విలువైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనకు కుడిభుజంగా వున్నారని అన్నారు. ఆయన పక్కన వుంటే కొండంత బలమున్నట్లేనే అని మంత్రి పొంగులేటిని సిఎం. కొనియాడారు. ఎందుకంటే మంత్రి పొంగులేటిశ్రీనివాస్‌ రెడ్డి చేపడుతున్న మంత్రిత్వ బాధ్యతల్లో ఆయన శాఖలు అన్నింటా ఫస్టు..బెస్ట్‌ అనిపించేలా పనిచేస్తున్నారు. గత బిఆర్‌ఎస్‌ హాయాంలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని చెప్పి ఊరించి, ఊరించి పదేళ్లపాటు ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. అలాంటి కాలం నుంచి కాంగ్రెస్‌ను అదికారంలోకి తెచ్చి, ఖమ్మం జిల్లాలో అర్హులైన పేదలందిరకీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తున్నారు. గృహ నిర్మాణ మంత్రిగా కూడా పొంగులేటి శ్రీనివాస్‌ వుండడంతో ఇందిరమ్మ ఇండ్లపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ ఐదేళ్ల కాలానికి 20లక్షలకు పైగా ఇ ందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం శరవేగంగా జరుతున్నాయి. అందులో చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కూడా జరుపుకున్నాయి. ఈ దసరాకు చాలా వరకు పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్దంగా వున్నాయి. గత ప్రభుత్వంలాగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంమాటలు చెప్పి తప్పించుకోలేదు. అందుకే తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.22వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఏడాది మొత్తం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపూరి చేయనున్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే పేదలకు ఇంటి నిర్మాణ పూర్తిని బట్టి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే అటు ఇంటి నిర్మాణం,ఇటు బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరగకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతి వారం డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం. ఏ వారానికి ఆ వారం డబ్బులు చేతిలో వుంటే, ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పులు చేయాల్సిన అవసరం వుండదు. పైగా ఇంటి నిర్మాణం ఒక్క రోజు కూడా ఆగిపోదు. వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్గుతుంది. ఇలా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయలేదు. గత బిఆర్‌ఎస్‌ పాలకులు అసలే చేయలేదు. డబుల్‌ బెడ్‌రూంలు నిర్మాణం చేసి ఇస్తామని 2014,2018 ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. కాని ఇండ్లు నిర్మాణం చేపట్టలేదు. తర్వాత అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. ఆ మాటను కేసిఆర్‌ తప్పారు. ఏ రకంగా ఇండ్లను ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తీరా గత ఎన్నికల సమయంలో సొంత స్థలం వున్నవారికి రూ.5లక్షలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. దానిని ప్రజలు నమ్మలేదు. పదేళ్లలో పది ఇండ్లు కట్టని బిఆర్‌ఎస్‌కు ఎన్నికలప్పుడే డబుల్‌ బెడ్‌రూంలు గుర్తొస్తాయని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు చెప్పిందంటే ఖచ్చితంగా ఇండ్లు ఇస్తుందని బలంగా నమ్మారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదలందిరకీ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌. ఆ సమయంలో తెలంగాణలో 25లక్షల ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో రేవంత్‌ సర్కారు ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటి విడతలో ఇండ్లు రాని వారు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇంకా నాలుగేళ్ల కాలం వుంది. విడతలవారిగా ఇచ్చే ఇండ్లలో ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు హమీ ఇచ్చారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లతోపాటు, ఆయన నిర్వహిస్తున్న రెవిన్యూ శాఖలో కూడ అనేకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. ప్రజాపాలన ప్రజలకు మరింత చేరువ చేశారు. గత ప్రభుత్వ హాయాంలో తీసుకొచ్చిన ధరణి మూలంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నీ తీర్చేందుకు భూ బారతీ తెచ్చారు. ప్రజల సమస్యలు తొలగించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమల రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు పడకుండా చేశారు. ధరణి మూలంగా కొన్నిలక్షల మంది సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఎంత చెప్పినా కేసిఆర్‌ వినిపించుకోలేదు. ప్రజల బాధలు పట్టించుకోలేదు. దాంతో రెవిన్యూ వ్యవస్ధలో అప్పుడు పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నాయకులు పంచుకొని తినడానికి ధరణి బిఆర్‌ఎస్‌కు ఉపయోపడిరది. కాని ఇప్పుడు భూ భారతి మూలంగా ఏ ఒక్కరికీ ఇబ్బంది రాదు. నష్టం కలగదు. అవినీతికి ఎక్కడా తావులేదు. ఏ ఒక్క అదికారి అవినీతికి పాల్పడిని ప్రజా ప్రభుత్వం ఉపేక్షించడం లేదు. ఎంతో మంది అవినీతి అదికారులను జైలుకు పంపించారు. అవినీతిని ఇంతగా అంతం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. దేశంలోనే ఇంతలా అవినీతిని కంట్రోల్‌ చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. అంతగా అవినీతి నిర్మూలన జరుగుతోంది. అది కేవలం రెవిన్యూలోనే కాదు, అన్ని శాఖల్లో అమలు జరుగుతోంది. అవినీతి రక్కసి పారిపోతోంది. ఇక రిజిస్ట్రేషన్‌ శాఖలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకే దగ్గర అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేశారు. దాంతో ప్రజలకు ఎలాంటి అసౌక్యం కలగకుండా పోయింది. అవినీతి అనే పేరు వినపడకుండా చేసిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికే దక్కింది. ఇలా తన శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తూనే మరో వైపు ఖమ్మం జిల్లా ప్రగతిని బాటలువేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగు విస్తరణ, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిపిస్తున్నారు. ఖమ్మ జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి పొంగులేటి చొరవతో తెలంగాణలో పదేళ్ల తర్వాత సుమారు ఏడు లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం అందేలా చేస్తున్నామని పొంగేలేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇలా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాను నెంబర్‌ వన్‌ చేస్తూ ముందుకు సాగుతుండడంతో, మంత్రుల్లో ఆయననే ఫస్ట్‌ , బెస్ట్‌ అనే కితాబు అందుకుంటున్నారు. మిగతా మంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ది పనులు వేగ వంతంచేస్తున్నారు. దటీజ్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని కొనియాడబడుతున్నారు.

పెంచి తగ్గించడం పండగనా?

-జిఎస్టీ తగ్గింపుతో మేలు జరిగేనా!

-జనం నిజమని నమ్మమంటారా?

-పన్నులు పెంచి తగ్గించడం కూడా గొప్పేనా!

-ఏడేళ్లు ఏడిపించి ఇప్పుడు జోలపాడతారా!

-జిఎస్టీ తీసుకొచ్చిన రోజు దేశానికి రెండో స్వాతంత్య్రం అన్నారు.

-ఎడాపెడా స్లాబ్‌లు తెచ్చి పన్నులు బాదారు.

-ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు.

-ఇప్పుడు జిఎస్టీ తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు.

-పరోక్షంగా ప్రజలను పీడిరచుకు తిన్నామని ఒప్పుకున్నారు.

-జిఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ లేదు.

-కేవలం 1.1 శాతమే తేడా వస్తుంది.

-ప్రభుత్వానికి 48 వేల కోట్ల నష్టమని కేంద్రం చెప్పడం విడ్డూరం.

-జిఎస్టీ తగ్గించారు సరే కంపెనీలు ధరలు పెంచితే చేసేదే ముంది!

-ధరల పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ.

-దానిని అదుపు చేయకుండా పన్నులు తగ్గించినట్లు ప్రకటిస్తే సరిపోతుందా!

-జనానికి ఊరట కల్గుతుందా?

-బంగారం మీద జిఎస్టీ తగ్గించామన్నారు.

-బంగారం ధర భారీగా తగ్గుతుందన్నారు.

-ఏడాలో తులం బంగారం ముప్పై వేలు పెరిగిం!

-నిత్యవసర వస్తువుల ధరలు అంతే…

-నాలుగు రోజులు తగ్గిస్తారు.

-కంపనీలు పెంచితే ఆటోమేటిక్‌గా ధరల భారం తప్పదు.

-ప్రభుత్వం చెప్పే గొప్పలకు అర్థముండదు.

-జనానికి ఊరట కల్గిన సంతోషం ఎంతో కాలం వుండదు.

-పన్నలు తగ్గిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులే అంటారు.

-ఎన్నికలు రాగానే తగ్గించినట్లు ప్రకటించి మాయ చేస్తారు.

-జనానికి అన్నీ తెలుసు. భరించక తప్పదని తెలియంది కాదు.

-పన్నులు పీడిరపుకు మార్గం.

-అంతకన్నా ఏముంది దౌర్భాగ్యం

హైదరాబాద్‌, నేటిధాత్రి:

ప్రజలను బురిడీ కొట్టించడంలో రాజకీయ నాయకులను మించిన వారు లేరు. రాజకీయ నాయకులు ఏది చేసినా కరక్టె అనిపించుకుంటారు. తాము చేసిందే కరక్టని ప్రజల చేత కూడా అనిపిస్తారు. అదీ రాజకీయాలకు వున్న గొప్ప తెలివి. ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలదే అంతిమ నిర్ణయం. అందుకే జనం ఏమనుకున్నా సరే..ఎన్నికల్లో గెచే దాక ఒకమాట. గెచాక ప్రజాభివృద్ది పేరుతో మరో మాట. రెండు నాలుకలు లేకుంటే నాయకులు కాలేదు. రాజకీయాలు చేయలేరని చెప్పడానికి చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అంటూ జిఎస్టీని తెచ్చిం. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పన్నుల విషయంలో లెక్కా పత్రం వుండే కాదు. అంటూ జేపి చెప్పిన లెక్కలు జనం నమ్మారు. పన్నుల వసూలు అనేది ఎలా జరుగుతుందో కూడా లెక్క లేకపోతోం. దాంతో ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటూ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వన్‌ నేషన్‌, వన్‌ టాక్స్‌ అంటూ ప్రజలను నమ్మించారు. ప్రజలు కూడా ఊరట కల్గుతుం. ధరలు పెద్దఎత్తున తగ్గుతాయని ఆశించారు. మన దేశంలో నూటికి ఎనభై మంది గువ మధ్య తరగతి ప్రజలే వుంటారు. వారికి రూపాయి ఆదా అయినా సరే అ ఎంతో భరోసాగా వుంటుందని ఆశించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చిం. 2017లో దేశమంతా అబ్బురపడేలా జిఎస్టీ తీసుకొచ్చారు. తాము తెస్తున్న జిఎస్టీ దేశానికి రెండో స్వాతంత్య్రం లాంటిదన్నారు. అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చినట్లే, జిఎస్టీని కూడా అర్ధరాత్రి ప్రకటించారు. అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా ఆ కార్యక్రమాన్ని రాత్రంతా మేలుకొని టివీలకు అతుక్కొని తిలకించారు. గతంలో ఒక వస్తువు, ఒక ప్రాంతంలో ఒక రకమైన పన్ను. మరో ప్రాంతంలో మరో రకమైన పన్ను విధానం వుండే. ఇక దేశంలో ఎక్కడైనా ఏ వస్తువైనా సరే ఒకే పన్ను విధానం అని చెప్పారు. పన్నులను సరలీకృతం చేస్తామని చెప్పారు. దేశమంతా సంతోషపడిర. ఎంతో సంబరపడిర. దేశం కోసం, ధర్మం కోసమంటే ఇదే అని ప్రజలు కూడా బిజేపిని ఎంతో కీర్తించారు. జీఎస్టీ అమలు విషయానికి వచ్చే సరికి ఐదు రకాల స్లాబులు తెచ్చారు. అంతా గందరగోళంగా వుందన్న అనుమానం ప్రజలకు ఆలోనే తెలిసిపోయిం. తగ్గాల్సిన ధరలు పెరుగుతూ వచ్చాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతూ వెళ్లిం. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ గురించి తెలిసి, చిన్న చిన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఏదో జరుగుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అటు ప్రజలకే కాదు, ఇటు వ్యాపారులకు కూడా జిఎస్టీ అనే గుడి బండగా మారుతూ వచ్చిం. ఏడా, రెండేళ్ల గడిచే సరికి దేశంలో వ్యాపారుల జీవితాలు తలకిందులౌతూ వచ్చాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జిఎస్టీ తెచ్చి, దానిని అమలు కార్యాచరణ ప్రకటించిన వెంటనే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. జిఎస్టీ అనే పన్ను విధానంలో లోపభూయిష్టమైందన్నారు. ప్రజలకు నామాలు పెట్టడం తప్ప మరేం లేదన్నారు. ప్రజలను మరింత దోచుకునేందుకు ఎత్తుగడ అన్నారు. గతంలో పన్ను విధానాన్ని ఎత్తి చూపిన బిజేపి నిర్ణయం ప్రజలను పెనం మీద నుంచి పొయ్యిలో వేసినట్లే అవుతుందని అన్నారు. దాన్ని బిజేపి తీవ్రంగా తప్పు పట్టిం. పైగా ఆ సమయంలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అప్పటికే రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ వుండే. రాహుల్‌ గాందీ మీద బిజేపి ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడుతుండేది. రాహుల్‌ ఏం మాట్లాడినా పెడర్దాలు తీసేవారు. ప్రజలు కూడా నిజమే కావొచ్చని, రాహుల్‌ చెప్పేదే అబద్దమని కూడా అనుకుంటూ వచ్చారు. బిజేపి మాటలనే బలంగా నమ్ముతూ వచ్చారు. కాని ప్రజలకు రాను రాను అర్ధమైం. జిఎస్టీ వల్ల పెద్ద బొక్క పడుతోందని అర్ధమైం. ఆ సమయంలో రాహుల్‌ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు నిజమే అనే అనుమానం ప్రజలకు వస్తుందన్న సమయంలో జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. ఐదు స్లాబులన నాలుగు చేశారు. ప్రజలను ఊరడిరచారు. ప్రజలకు ఊరటక్పస్తున్నామని చెప్పారు. అయినా రాహుల్‌ గాంధీ హెచ్చరిస్తూనే వచ్చారు. జిఎస్టీ మూలంగా దేశంలో 18లక్షల చిరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు కనుమరుగయ్యారు. కొన్ని కోట్ల మంకి ఉపా లేకుండాపోయిందని రాహుల్‌ చెప్పారు. ఇప్పుడు అదే నిజమౌతోం. ఒకదశలో ఆహార పదార్థాల మీద కూడా వేసిన పన్నులపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న. పాలు, పెరుగు మీద కూడా 12శాతం జీఎస్టీ వేశారు. దాంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైం. దాంతో మళ్లీ దానిని సవరించారు. ఐదు శాతానికి తెచ్చారు. స్కూలు పిల్లలు వాడే పెన్నులు, పెన్సిళ్లు, ఏరేజర్లు, నోట్‌ బుక్స్‌ ఇలా ప్రతి వస్తువు మీద జీఎస్టీ వేయడం పెద్ద చర్చనీయాంశమైం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై జిఎస్టీ వేయడాన్ని దేశమంతా తప్పు పట్టిం. కాలక్షేపం కోసం తినే పాప్‌ కార్న్‌లో కూడా మూడు రకాల పన్నులు వేయడం బిజేపి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్న. అప్పటి నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పంంచలేదు. గత ఎన్నికల్లో బిజేపికి పూర్తి స్దాయి మెజార్టీ వస్తే ప్రజల జీవితాలు ఎలా వుండేవో అని అనుకుంటున్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పాటైం. బలమైన ప్రతిపక్షం తయారైం. దాంతో బిజేపిపై ప్రతిపక్షాలు అడుగడుగునా విజయం సాధిస్తున్నాయి. బిజేపికి గడ్డుకాలం కనిపిస్తోం. ఓ వైపు ఓట్‌ చోరీ అంటూ రాహుల్‌ గాందీ చేస్తున్న పోరాటం ప్రజలను బాగా ఆకర్షిస్తోం. ప్రజల్లో పెద్దఎత్తున చైతన్యం నింపుతోం. పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన కేంద్రం ఎలాగైనా ఆ దేశానికి బుద్ది చెబుతుందని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలతో సహా,ప్రజలంతా అండగా నిచారు. పహల్‌గావ్‌లో టెర్రరిస్టులు చేసిన పనికి దేశమంతా కుతకుతలాడిర. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరిం. ఆపరేషన్‌ సిందూర్‌ మొదలు పెట్టిన కేంద్రం హటాత్తుగా ఆపరేషన్‌ ఆపేసిం. ఆపరేషన్‌ సిందూర్‌ అయిపోయం. పాకిస్తాన్‌ను చావు దెబ్బతీశామని ప్రజలు అనుకుంటున్న వేళ అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దేశం వ్యాప్తంగా ఒక్కసారిగా కళకళం రేపాయి. యుద్దం నేనే ఆపానంటూ ట్రంప్‌ చెప్పారు. ఒకసారి కాదు పదే పదే చెబుతూ వచ్చారు. దాంతో మన దేశ సార్వభౌత్వం మీద అమెరికా పెత్తనమేమిటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోమొదలైం. ఈ సంఘటన ప్రతిపక్షాలకు మంచి ఆయుధమైపోయిం. ఇక అప్పటి నుంచి అటు ఓట్‌ చోరీ అంశం, ఇటు ఆఫరేషన్‌ సిందూర్‌ అంశాలతో కేంద్రాన్ని ఉక్కిరిక్కిరి చేస్తున్నాయి. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పహల్గావ్‌ మీద దాడి జరిగిన రోజు ప్రధాని మోడీ ఇరాన్‌ పర్యటనలో వున్నారు. హుటాహుటిన దేశానికి చేరుకున్నారు. దానిపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారని అందరూఅనుకున్నారు. కాని మధ్యాహ్నం వరకు బిహార్‌ వెళ్లి ఎన్నికల సభలో మాట్లాడారు. ఇక్కడే ప్రతిపక్షాలకు, ప్రజలకు మరింత ఆగ్రహం వచ్చేలా చేసిం. పార్లమెంటు సమావేశాలలో అధికార బిజేపిని ప్రతిపక్షాలు ఊపిరి సలపనివ్వలేదు. ఇక ఎలాగైనా ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిం. ఆగష్టు పదిహేను స్వాతంత్య్ర నోత్సవం రోజున దేశ ప్రధాని మోడీ దీపావళికి ప్రజలకు కానుక ప్రకటిస్తున్నాను అని చెప్పారు. అందరూ ఏముంటుందని అనుకున్నారు. జిఎస్టీని తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడున్న నాలుగు స్లాబుల స్దానంలో రెండు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. తాజాగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం చేశారు. ఇక ప్రజలు పండగ చేసుకొమ్మంటున్నారు. దాంతో ప్రతిపక్షాలు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. కొండంత పెంచి రవ్వంత తగ్గించి పండగ చేసుకొమ్మడనం బిజేపికే చెల్లిందని ప్రతిపక్షాలు ఎదురు దాడి చేయడం మొదలు పెట్టాయి. ఇలా అయినా బిజేపికి వచ్చే రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే ఇక్కడ కూడా జిఎస్టీ ఎత్తుగడ పాచిక పారలేకుండాపోయిం. కాకపోతే కొంతలో కొంత ఊరట కల్గుతుందని అనుకుంటున్నారు. అయితే అది ఎంత కాలముంటుందో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గిందని ధరలు తగ్గిస్తే, ఉత్పత్తి దారులు వస్తువుల ధరలు పెంచితే మొదటికే వస్తుందని నవ్వుకుంటున్నారు. ఇది బిజేపికి ఎంత మేర మేలు చేస్తుందో వేచి చూడాలి.

ఘనంగా గణేశుని వీడ్కోలు…

ఘనంగా గణేశుని వీడ్కోలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 6 (నేటి ధాత్రి)

 

 

గణేష్ ని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున గ్రీన్ వుడ్ హై స్కూల్ లోని వినాయకునికి ఘనంగా వీడ్కోలు తెలిపారు. మండల కేంద్రంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంతిమ కార్యక్రమం అయినా నిమర్జన కార్యక్రమాన్ని గ్రీన్ వుడ్ హై స్కూల్ విద్యాసంస్థ ఉదయాన్నే పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆటపాటలతో భక్తి గీతాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, ఉపాధ్యాయులు రాజకుమార్ తో పాటు తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.

‘‘కేసీఆర్‌’’ సంతోషంలో కనిపించేది ‘‘సంతోషే’’!


`‘‘కేసీఆర్‌’’ ఆరోగ్యానికి ఔషదం ‘‘సంతోషే’’!

`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్‌’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!

`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేస్తున్నాడు.

BRS MP SANTOSH RAO

`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.

`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.

`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.

`నిరంతరం ‘‘కేసీఆర్‌’’ వెన్నంటే వుంటాడు.

BRS MP SANTOSH RAO

`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్‌’’ కనిపిస్తారు.

`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.

`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్‌’’ వెనకాలే వుంటాడు.

`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్‌’’ను చూసుకుంటాడు.

`అలాంటి ‘‘సంతోష్‌’’ సేవలను శంకించడం తగదు.

`అనుక్షణం ‘‘కేసీఆర్‌’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.

`‘‘కేసీఆర్‌’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.

`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.

`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్‌’’ కోసం త్యాగం చేస్తున్నాడు.

`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.

`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.

`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.

`‘‘సంతోష్‌’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.

`‘‘సంతోష్‌’’ లాగా ‘‘కేసీఆర్‌’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.

`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్‌’’ ను ‘‘కేసీఆర్‌’’ చూసుకోవడానికి కారణం అదే.

`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్‌’’ దే.

`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.

`ఎంతగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేసినా ‘‘సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే’’!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

జోగిన పల్లి సంతోష్‌రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ సిఎం. అయ్యాక సంతోష్‌ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్‌ గురించి కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్‌ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్‌ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్‌ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్‌ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్‌ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్‌ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, కేసిఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్‌ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్‌ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్‌కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్‌ గురించి చెప్పడం జరిగింది. సంతోష్‌ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్‌ చెప్పారు. కేసిఆర్‌ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్‌ డిల్లీలో కేసిఆర్‌కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్‌రావు, డిల్లీలో కేసిఆర్‌ వున్నప్పుడు సంతోష్‌ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్‌ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్‌ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్‌ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్‌ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్‌ఎస్‌ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్‌ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్‌ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్‌ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్‌ ఎదుర్కొన్నారు. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్‌ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్‌ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్‌ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్‌ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్‌ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్‌ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్‌. కేసిఆర్‌ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్‌. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్‌ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్‌. తన తండ్రి కేసిఆర్‌ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్‌, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్‌ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్‌ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్‌ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్‌ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్‌కు సంతోష్‌ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్‌ను సంతోష్‌లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్‌ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. కేసిఆర్‌ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్‌ వల్లనే కేసిఆర్‌ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్‌ వెంటే వుంటారు. కేసిఆర్‌ వెన్నంటే వుంటారు. కేసిఆర్‌ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్‌ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్‌ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్‌ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్‌ అంటే కూడా కేసిఆర్‌కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్‌కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్‌ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్‌కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్‌ ఎప్పుడూ కేసిఆర్‌కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్‌కుఎంతసేవ చేసినా సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్‌కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్‌ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్‌ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్‌ లాగా కేసిఆర్‌కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్‌ ఈస్‌ గ్రేట్‌ అని అందరూ అనాల్సిందే.

శీనన్న సిరిమంతుడే..శ్రీమంతుడే!

`వేలాది కుటుంబాలను ఆదుకున్న దేవుడే!

`వరికోల్‌ను సిరికోల్‌ చేసిన పెన్నిదే!

`అనాధలకు అన్నం పెడుతున్న బ్రహ్మ దేవుడే!

`యాభై వేల కుటుంబాలలో వెలుగులు నింపిన సూర్యుడే.

`మహిళా సాధికారిత కోసం కృషి చేసిన మహనీయుడే

`ఎంతో మంది యువతకు ఉపాది కల్పించిన విశ్వకర్మనే.

`గూడు లేని పేదలకు సొంతిళ్లు నిర్మించి ఇచ్చిన దర్మదాతే.

`ఎంతో మంది ఆరోగ్యాలను కాపాడిన వైద్యుడే.

`పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న సామాన్య కార్యకర్తే.

`కార్యకర్తలను కడుపులో పెట్డుకొని చూసుకుంటున్న నాయకుడే.

`ఆపదలో వున్న వారిని ఆదుకుంటున్న ఆపద్బాందవుడే.

`పార్టీ అప్పగించిన పనులను విజయవంతం చేస్తున్న అజేయుడే.

`అభాగ్యుల పాలిట వరదేవుడే.

`అన్నా అని గడప తొక్కితే ఆలస్యం చేయకుండా సాయమందించే ఆపన్న హస్తమే.

`పేదల చిరునవ్వుల్లో వెలుగుతున్న వేకువ వెలుగు శీనన్నే.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మానవత్వం చాటు కోవాలంటూ మాటలు వుంటే సరిపోదు. పేదలను ఆదుకోవాలనుకుంటే చెట్టుపేరు చెప్పుకుంటే సేవ చేసినట్లు కాదు. అందుకు మనసుండాలి. పేదల మీద ప్రేమ వుండాలి. తోటి సమాజం మీద కరుణ వుండాలి. మనతోటి సమాజంలో బతుకుతున్న వారికి చేయూతనందించాలన్న మంచి గుణముండాలి. వారి జీవితాలను వెలుగులోకి తేవాలన్న జిజ్ఞాస వుండాలి. అన్నం కోసం తపిస్తున్నవారికి ఆకలి తీర్చాలన్న దయ వుండాలి. ఇవన్నీ కావాలంటే గొప్పవ్యక్తిత్వముండాలి. ఇవన్నీ మెండుగా, నిండుగా వున్న నాయకుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. సంపాదించుకున్న దానిని చూసి మురిసిపోయేవాళ్లుంటారు. దాచుకునే వాళ్లుంటారు. తాతల నాటి ఆస్ధులు కలిసొచ్చి అహం ప్రదర్శించేవాళ్లుంటారు. కాని తాను ఎంత ఎదిగినా ఒదిగి వుండే నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ప్రజల్లో తాను ఒకడుగా జీవించే దార్శనికుడు పోచంపల్లి. నిత్యం ప్రజలతో మమేకమై, వారికి కష్టసుఖాలు తీర్చుతూ వారికి చేదోడు వాదోడుగా వుండే మానవతా మూర్తి పోచంపల్లి. తాను సంపాదించిన సొమ్మును పది మందికి పంచి తృప్తి పొందే నాయకుడు పోచంపల్లి. ఎమ్మెల్సీ పోచంపల్లి చేసిన సాయాలు, దానాలు లెక్కలేనివి. నిజం చెప్పాలంటే ఆయన పుట్టకతోనే ఆగర్భ శ్రీమంతుడు. పుట్టుకతోనే సిరిసంపదలు కలిగిన సిరిమంతుడు. అంతే తప్ప ఆయన రాజకీయాలకు వచ్చి సంపాదించిందేమీ లేదు. రాజకీయాల వల్ల సంపాదించుకన్నది కాదు. కల్వకుంట్ల కవిత చేసిన పోచంపల్లిపై చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన అభిమానులు ఎంతో మంది చింతిస్తున్నారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేవలం మాజీ ఎంపి. సంతోష్‌ స్నేహితుడు కావడమే ఆయనకు అదృష్టం కలిసొచ్చినట్లు చెప్పడం విడ్డూరం. సంతోష్‌ మూలంగానే రాజకీయాలలో అవకాశాలు అందిపుచ్చుకున్నాడని అది వారి బిక్షలాగా కవిత మాట్లాడడం సరైంది కాదు. సంతోష్‌ లేకుంటే పోచంపల్లి ఎవరు? అనే ప్రశ్న వేసే హక్కు కవితకు లేదు. ఎందుకంటే బి ఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, సంతోష్‌, పోచంపల్లిలు ఒకే దగ్గర చదువుకున్న స్నేహితులు. అంతా మాత్రానా పోచంపల్లి ఎవరి మీద ఆధారపడి చదువుకోలేదు. కవిత చేసిన వ్యాఖ్యల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చదువుకోసం సంతోష్‌ మీద ఆధారపడినట్లు అర్ధమొచ్చేలా వుంది. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వంద ఎకరాల భూస్వామ్య కుటుంబం. అయినా ఆయన ఎక్కడా అలాంటి దర్పం ప్రదర్శించే నాయకుడు కాదు. పోచంపల్లి కుటుంబం ఎప్పటినుంచో ప్రజా సేవలో వుంది. పోచంపల్లికి తాతలనాడే వందల ఎకరాల భూములు కలిగివున్నారు. ఒక రకంగాచెప్పాలంటే ఆగర్భ శ్రీమంతులు. అలాంటి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒకసామాన్య కుటుంబం నుంచి వ్యక్తికి ఇన్ని ఆస్ధులు ఎలా వచ్చాయి? అని కవిత ప్రశ్నించడం అవివేకం. శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన ఊరు వరికోలు గ్రామంలో వున్న భూమిలో 24 ఎకరాలు పేదలు ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి దానం చేసిన గొప్ప మానవతా మూర్తి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. తన సొంత డబ్బులతో తన ఊరిని బాగు చేసిన నాయకుడు. ఊరిలో ఏ అభివృద్ది పనిని అడిగినా పోచంపల్లి పేరే చెబుతుంది. తెలంగాణలో ఏ గ్రామంలో లేని విధంగా పంచాయితీ భవనాన్ని కార్పోరేట్‌ కార్యాలయంలా నిర్మాణం చేశాడు. చిన్న గ్రామమైనా సరే ఆ ఊరికి చెందిన వాళ్లు పెళ్లిళ్లు, పేరంటాలకు ఇతర గ్రామాలకు వెళ్లకుండా, పక్కనే వున్న పట్టణం వరకు వెళ్లకుండా అన్ని రకాల హంగులుతో కూడిన అద్భుతమైన ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేయించి ఇచ్చాడు. ఊరందరికీ ఉచితంగా ఎలాంటి ఫంక్షన్‌ అయినా చేసుకునే వీలు కల్పించాడు. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా ఆయన ఎలా ఉన్నత చదువులు చదువుకున్నాడో అలాగే పేదలందరూ మంచి విద్యను అందుకోవాలన్న సదుద్దేశంతో పోచంపల్లి పౌండేషన్‌ ద్వారా ఎంతో మంది చదవుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన విద్యా దాత పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. నిజం చెప్పాలంటే ఆయన చేసిన వ్యాపారాలలో వచ్చే ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తాడని చెప్పడంలో సందేహం లేదు. అటు వ్యాపార రంగంలో వెలుగుతూనే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. కేవలం రాజకీయాల కోసం బిఆర్‌ఎస్‌లో చేరిన నాయకుడు కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేటిఆర్‌, సంతోష్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఆపదలో వుండి సరైన వైద్యం చేయించుకోలేని ఎంతో మందికి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఎంతోమందికి వైద్య సాయం అందించారు. పూర్తి వైద్య ఖర్చులు పెట్టుకొని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు పోచంపల్లి. తాను పుట్టిన ఊరునేకాదు, చుట్టుపక్కల అనేక గ్రామాలలో ఆయన చేసిన అభివృద్ది దర్శనమిస్తుంది. ప్రతి గ్రామంలో పోచంపల్లి చేసిన అభివృద్ది కనిపిస్తుంది. ఆయన సొంత నిధుల చేసిన అభివృద్ది పనులు అనేకం ఎదురొస్తాయి. ఆయన చేసిన అభివృద్ది అక్కడితో ఆగకుండా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అనేక మండలాలు, గ్రామాలలో పోచంపల్లి చేసిన అభివృద్ది కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ ఊరికి వెళ్లినా పోచంపల్లి వల్ల బాగుపడిన కుటుంబం ఒక్కటైనా వుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి గ్రామంలో పోచంపల్లి వల్ల లబ్ధి పొందిన కుటుంబం ఖచ్చితంగా వుంటుంది. అంత గొప్పది పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి సేవా గుణం. ముఖ్యంగా జనగామ జిల్లాలో కూడ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అనేకం వున్నాయ. చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు లెక్కలేకుండా వున్నాయి. అలా ప్రజల గుండెల్లో వున్న నాయకుడు పోచంపల్లి. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా రూ.5 కోట్లతో అత్యాధునిక హంగులతో వైకుంఠ దామాన్ని నిర్మాణం చేశారు. ప్రత్యేంగా ఆయన గుళ్లు గోపురాలకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇచ్చిన విరాళాలు అన్నీ ఇన్నీ కావు. ఏ ఊరులో గుడి కడుతున్నామని చెప్పినా సరే వెంటనే చందాలు ఇస్తుంటారు. పేరు ప్రఖ్యాతులతో విలసిల్లుతున్న దేవాయాల అభివృద్దికి ఇతోదిక నిధులు ఇచ్చిన నాయకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. జనగామ జిల్లా జీడికల్‌ దేవాలయ అభివృద్ది కోసం రెండు కోట్లిచ్చారు. ఇలా అనేక దేవాలయాల అభివృద్దికి లేదనకుండా నిదులిచ్చారు. ములుగు జిల్లా పాలంపేటలో వున్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో పోచంపల్లి ఎంతో కృషిచేశారు. ముఖ్యంగా మహిళలలో ఆర్ధిక స్వావలంబన కోసం పెద్దఎత్తున కుట్టు మిషన్లు పంచారు. నడిగూడ, దామెర మండలంతోపాటు, పరకాల అర్భన్‌లో పోచంపల్లి ఫౌండేషన్‌ ద్వారా సుమారు 5వేల మందికి కుట్టు మిషన్లు అందించారు. ఒకప్పుడు వరికోల్‌గా పేరున్న గ్రామాన్ని ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఊరు అని గుర్తించేలా అభివృద్దిచేశారు. వరికోల్‌ను సిరికోల్‌ అనేంతగా గొప్పగా తీర్చిదిద్దారు. అంతే కాదు ఏ ఆదరణలేని ఎంతో మంది వృద్దులకు అన్నం పెడుతున్న పరబ్రహ్మ స్వరూపం పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. పిల్లలు లేక చూసుకునే దిక్కులేక, పిల్లలుండి పట్టించుకోలేని వృద్దులెంతో మందికి ఆశ్రయం కల్పించి, వారికి నీడనిస్తున్న దేవుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఒక్క పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి మూలంగా యాబై వేల మంది కుటుంబాలలో వెలుగులు నిండాయంటే మాటలు కాదు. చేసిన సాయం కూడాఎవరికీ చెప్పుకునే మనస్తత్వం ఆయనకు లేదు. గుప్తదానాలను ఎడమ చేతికి తెలియకుండా, కుడి చేతితోఇచ్చేంత మనసున్న నాయకుడు పోచంపల్లి. మహిళా సాదికారిత కోసం ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది. తనకు తెలిసిన ఎంతో మంది యువతకు ఉపాది కల్పించి వారి జీవితాలను నిలబెట్టిన దార్శనికుడు పోచంపల్లి. పార్టీ కోసం అహర్నిషలు కృషిచేస్తున్నాడు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాడు. ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వుందని తెలిసినా వెంటనే వారికి దైర్యంగా నిలబడతాడు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే వైద్యసేవలు అందిస్తాడు. ఆర్దికపరమైన ఇబ్బందులుంటే ఆదుకుంటాడు. ఇలా కార్యకర్తలకు పెద్దన్నగా అండగా వుంటాడు. అలాంటి నాయకుడికి కవిత చీపురు పుల్లలా తీసేసినట్లు మాట్లాడడాన్ని బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. పోచంపల్లి నిర్మాణాలు చేపట్టడం ఆయన వ్యాపారంలో ఒక భాగం. అది తప్పెలా అవుతుంది. దానిని కూడా తప్పు కవిత తప్పు పట్టడం ఆమెలోని అహానికి నిదర్శనం. నాయకులు ఎదరగాలని పార్టీ పెద్దలు కోరుకోవాలే గాని, ఎదుగుతున్నారని కుట్రలు చేయడం మాత్రం ఎవరికీ మంచిది కాదు.

కక్ష, కుట్రలతో కేసిఆర్‌ ను ఏమి చేయలేరు!

-కట్టుడు అంటే కూల్చినంత సులువు కాదు.

-కేసిఆర్‌ అంటేనే తెలంగాణ గుండె చప్పుడు!

-పిసి.ఘోష్‌ కమీషన్‌తో కొండను తవ్వి ఎలుకను పట్టారు!

-కమీషన్‌, కమీషన్‌ అని ఊదరగొట్టారు!

-కమీషన్‌ రిపోర్ట్‌ ఇచ్చిన తర్వాత 60 పేజీలు తెచ్చి ఏదో చేద్దామనుకున్నారు.

-అసెంబ్లీలో 600 పేజీలు నివేదిక పెట్టి తెల్ల మొహం వేశారు.

-అది పిసి. ఘోష్‌ కమీషన్‌ కాదు, కాంగ్రెస్‌ కక్ష సాదింపు అని తేలిపోయింది.

-ఎంత ప్రయత్నం చేసినా జనం నమ్మడం లేదని మరో నాటకానికి తెర తీశారు.

-కాంగ్రెస్‌, బిజేపి ఒక్కటే అని మళ్ళీ నిరూపించారు.

తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సమయం చూసి రెండు పార్టీలకు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయి. అబద్దాల పునాదుల మీద ఏది నిలబడదు. బలమైన నిర్మాణం కాళేశ్వరం మీద పిల్లి శాపాలు పని చేయవు. ఇప్పటికైనా ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బుద్ధిగా పాలన చేసుకుంటే బాగుంటుంది. కాళేశ్వరం తెలంగాణ గుండెకాయ. కేసిఆర్‌ తెలంగాణ రక్షకుడు. అలాంటి నాయకుడి మీద చరిత్రలో అక్షరం కూడా కదిలించలేరంటున్న మాజీ ఎమ్మెల్యే , బిఆర్‌ఎస్‌ నాయకుడు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు. ఆయన మాటల్లోనే…

-కాళేశ్వరం మీద కాంగ్రెస్‌ కుప్పిగంతులు!

-కాళేశ్వరం గొప్పదనం ప్రజలందరికీ తెలుసు!

-కాళేశ్వరం అనేది తెరిచిన పుస్తకం.

-కట్టిన నిర్మాణాలు మన కళ్ల ముందే వున్నాయి.

-అనేక రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు కనిపిస్తూనే వున్నాయి.

-తెలంగాణ మొత్తం ఇంటింటికి మంచినీరు అందుతోంది.

-పరిశ్రమలకు కావాల్సినంత నీరిస్తోంది.

-ఇదంతా కేసిఆర్‌ పుణ్యం కాదా!

-కాళేశ్వరం నిర్మాణం వల్లనే సాధ్యమైందన్నది నిజం కాకుండా పోతుందా!

-సిఎం రేవంత్‌ జిల్లా పాలమూరు పచ్చబడలేదా!

-వలసలు ఆగిపోలేదా! పాలమూరు కరువు పారిపోలేదా!

-తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందడం లేదా!

-కాళేశ్వరం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్‌ అని కాంగ్రెస్‌కు తెలుసు.

-కాళేశ్వరం తెలంగాణకు వర ప్రదాయినీ అని తెలుసు.

-కాంగ్రెస్‌ పార్టీ తన మనుగడ కోసం అబద్దాలు చెప్పిందని తెలుసు.

-ప్రజలకు పదే పదే అవాస్తవాలు చెప్పి, చెప్పి లబ్ధి పొందారు

-ఆ అబద్దాలతో అధికారంలోకి వచ్చి దిక్కులు చూస్తున్నారు

-ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.

-కాళేశ్వరం మీద కక్షకడితే కొట్టుకుపోయేది కాంగ్రెస్సే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 కేసిఆర్‌ అనే మూడక్షరాలు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. తెలంగాణ సమూహానికి సారధి. తెలంగాణ ప్రగతికి దారి. తెలంగాణ ఏర్పాటు కర్త. బంగారు తెలంగాణ ఆవిష్కర్త. అలాంటి నాయకుడిపై క్షక్ష పూరితమైన రాజకీయాలు ఎవరు చేసినా తెలంగాణ సమాజమే క్షమించరు. బిఆర్‌ఎస్‌ను రాజకీయ కుట్రల ద్వారా కనుమరుగు చేయాలని ఎవరైన కలలు గంటే వారి జేమమ్ములు దిగిరావాలే. అంతే తప్ప బిఆర్‌ఎస్‌ను, కేసిఆర్‌ను కదిలించే శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఒక అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ ప్రజలను నిత్యం కాంగ్రెస్‌ నాయకులు వేడుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని ఒక్కసారి నమ్మమంటూ కోరుకున్నారు. పోనీలే అని ప్రజలు అనుమానంతోనే అవకాశమిచ్చారు. ప్రజలు అనుకున్నదే కాంగ్రెస్‌ పాలకులు చేస్తున్నారు. ప్రగతిని గాలికి వదిలేశారు. అభివృద్దిని ఆమడ దూరం తరిమేశారు. బిఆర్‌ఎస్‌ పార్టీ మీద కక్ష కట్టారు. తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ను ఏదో రకంగా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కాని ఎక్కడా వీలు పడకపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రస్టేషన్‌కు గురౌతున్నారు. ముఖ్యంగా సిఎం. రేవంత్‌రెడ్డి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. తన కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నారు. కాని అది ఈ జన్మలో సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. కేసిఆర్‌ మీద కోపంతో ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల నాడు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కారు. వాటి అమలు చేయాలన్న చిత్తశుద్దిని ఏనాడో వదిలేశారు. డైవర్టు పాలిటిక్స్‌ సాగిస్తున్నారు. కేసిఆర్‌ కుటుంబంమీద పగ పెంచుకున్నారు. ఎలాగైనా కేసిఆర్‌ను, కేటిఆర్‌, హరీష్‌రావులను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నారు. సమయం చూసి కాంగ్రెస్‌, బిజేపిలకు కర్రు కాల్చి వాత పెడతారు. అబద్దాల పునాదుల మీద ఏది నిలబడదు. పిల్లి శాపాలకు ఉట్టి తెగిపోదు. కాళేశ్వరం మీద ఎన్ని రకాల విన్యాసాలు కాంగ్రెస్‌ చేసినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇప్పటికీ నిత్యం పదిలక్షల క్యూసెక్కుల వరద గత నెల రోజులుగా మేడిగడ్డ నుంచి వెళ్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదే మేడిగడ్డ నుంచి సుమారు 25లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వెళ్లింది. అప్పుడు కూడా ఒక్క ఇంచ్‌ కదిలింది లేదు. కాని కాళేశ్వరం కూలుతుందని అబద్దాలు ప్రచారం చేసి అదికారంలోకి వచ్చారు. అది కూలాలని కలలుగంటున్నారు. అది కూలే కట్టడం కాదు. కలకలకాలం నిలబడే కట్టడం. తరతరాలకు తెలంగాణకు నీళ్లందించే వరప్రసాదం. బుద్దిగా పాలన సాగించకుండా, తెలంగాణ సాగును ఆగం చేస్తున్నారు. రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారు. కాళేశ్వరం తెలంగాణ గుండెకాయ. కేసిఆర్‌ తెలంగాణ రక్షకుడు. కేసిఆర్‌ అనే మూడక్షరాల తెలంగాణ మేరు పర్వతమంటి కేసిఆర్‌ కీర్తినిగాని, ఆయన చరిత్రలో ఒక్క అక్షరాన్ని కూడా రేవంత్‌ రెడ్డి కదిలించలేరు. అది సిఎం.రేవంత్‌ రెడ్డే కాదు, వాళ్ల తాతలు దిగి వచ్చినా సాద్యమయ్యేది కాదంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న తాజా రాజకీయ విశేషాలు ఆయన మాటల్లోనే…

రాష్ట్ర ప్రభుత్వం కేసిఆర్‌ను ఏరకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా ముందుగా తెలంగాణ ప్రజలే ఊరుకోరు. తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. ఈ విషయం రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. అయినా ఏదో రకంగా కేసిఆర్‌ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పిసి.ఘోష్‌ కమీషన్‌ వేశారు. ఇరవై నెలలు కొండను తవ్వారు. ఎలుకును కూడా పట్టుకోలేకపోయారు. అంటే కేసిఆర్‌ నిజాయితీ ఇక్కడే తేలిపోయింది. పిసి.ఘోష్‌ కమీషన్‌ ఆఖరుకు తేల్చిన విషయం ఒక్కటే..కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా ఆరు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. దానిని వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో రేవంత్‌రెడ్డికి దిక్కు తోచక, నివేదికను బూచీగా చూపించి కేసిఆర్‌ మీద పగ సాదించాలని చూశారు. అసెంబ్లీలో పెట్టినా ఆ కమీషన్‌ రిపోర్టుతో రేవంత్‌ రెడ్డి పప్పులు ఉడకవని తేలిపోయింది. పైగా ఈ కమీషన్‌ నివేదికను ఆసరా చేసుకొని ఎలాంటి దర్యాప్తు చేపట్టొదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో రేవంత్‌ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. దాంతో కమీషన్‌ పేరుతో కాకుండా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ నివేదినను ఆసరా చేసుకొని కాళేశ్వరం మీద సిబిఐకి అప్పగించాలని తీర్మానం చేశారు. సిబిఐకి లెటర్‌ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఉత్తరం రాయగానే సరిపోదు. అందుకు కేంద్రం అంగీకరించాలి. గతంలో కేసిఆర్‌ ప్రభుత్వంలో జారీ చేసిన జీవో. 50కి బదులు జీవో. నెం.51 తీసుకురావాలని చూస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ, ఐటిలను జేబు సంస్ధలుగా చేసుకొని, ప్రతిపక్ష పార్టీలను వేదిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. రాహుల్‌ గాంధీని సిబిఐ విచారించేందుకు పిలిచిన రోజు కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేశారు. సిఎం. రేవంత్‌ రెడ్డితో సహా, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు రాజ్‌భవన్‌ దగ్గర ధర్నా చేసిన సంగతి రాష్ట్ర ప్రజలు అప్పుడే మర్చిపోయారని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నట్లున్నారు. ఏ సిబిఐ రాజకీయ కక్షల కోసం కేంద్రం వినియోగిస్తుందని సద్దుపూస ముచ్చట్లు చెప్పిన రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం నిర్మాణాన్ని సిబిఐకి అప్పగించడం విడ్డూరం. అయినా సినిమాల్లో చూసినట్లు సిబిఐ అని పిలవగానే వచ్చేందుకు ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద సిబిఐ విచారణ చేయలేదు. కాళేశ్వరం నిర్మాణమేమీ జాతీయ హోదా వున్న ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణం జరగలేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ అదికారుల పర్యవేక్షలో జరిగింది. అందువల్ల సిబిఐ దర్యాప్తు జరిగేందుకు అవకాశం లేదు. ఒక తప్పు చేయడం మొదలు పెడితే దానిని కప్పి పుచ్చుకునేందుకు పదే పదే తప్పుల మీద తప్పులు చేయాల్సి వస్తుందని పెద్దలు అన్నారు. ఇప్పుడు సరిగ్గా రేవంత్‌ రెడ్డి అదే చేస్తున్నారు. పదే పదే నన్ను జైలుకు కేసిఆర్‌ పంపించారంటూ చెప్పుకొని, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు. అయితే రేవంత్‌ రెడ్డి అంటే కేసిఆర్‌ వ్యక్తిగత కుట్రలు చేయలేదు. కేసిఆర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ పద్నాలుగు సంవత్సరాల పాటు కొట్లాడి, అరవై ఏళ్ల తెలంగాణ కల సాకారం చేశారు. అలా తెచ్చుకున్న తెలంగాణను విఫల ప్రయత్నంగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తూ రేవంత్‌ రెడ్డి పట్టుబడ్డారు. పట్టపగలు రూ.50లక్షలు లంచంతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయారు. ఓటుకు నోటు కేసులో జైలు కెళ్లారు. అంతే తప్ప ఆయన తెలంగాణ ఉద్యమం కోసం జైలుకెళ్లలేదు. ఏనాడు జై తెలంగాణ అన్న నాయకుడు రేవంత్‌రెడ్డికాదు. అరవై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు పడిన గోస నుంచి బైటపడి ఆత్మగౌరవంతో బతకాలనుకుంటుంటే తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా, తెలంగాణ రాజకీయాలలో అస్ధిరతను సృష్టించాలని చూసి, జైలుకు వెళ్లడం కూడా గొప్పదనమని రేవంత్‌రెడ్డి భావించడం సిగ్గు చేటు. చేసిందే తప్పుడు పని. చేసిందే నేరం. అయినా తాను తప్పు చేయలేదు. తనను పట్టుకోవడం కేసిఆర్‌ చేసిన తప్పు అని రేవంత్‌రెడ్డి అనుకోవడం అంత మూర్భత్వం మరొకటి లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఏ దారి దొరకడం లేదని రేవంత్‌రెడ్డి మధనపడుతూ కుట్రలకు తెరతీస్తున్నారు. కాళేశ్వరం అనేది తెరిచిన పుస్తకం. ఆ నిర్మాణాలన్నీ ప్రజల కళ్లముందే వున్నాయి. కాని కాంగ్రెస్‌ మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తోంది. తెలంగాణ రాక ముందు పరిస్ధితులు ఏమిటి? తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్ధితులు ఏమిటో తెలిసి కూడా కాంగ్రెస్‌ నాటకాలు ఆడడం ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారు. రైతులు ఓ వైపు ఎరువులు కావాలంటుంటే అందించే శక్తి లేదు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఎలా ఆడుకోవాలన్న సోయి లేదు. ఎంత సేపు బిఆర్‌ఎస్‌ పార్టీమీద అబద్దాలు ఎలా ప్రచారం చేయాలి. కేసిఆర్‌ను ఎలా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. దుర్మార్గపు పాలన సాగిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పాలన దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ప్రజలు ఇప్పటికీ సారే రావాలంటున్నారు. కేసిఆర్‌ కావాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ గాలిలో కాంగ్రెస్‌, బిజేపిలు అడ్రస్‌ లేకుండా కొట్టుకుపోవడం ఖాయం.

అసలైన సైనికుడు ‘‘హరీష్‌’’.

`అడుగడుగునా కేసీఆర్‌ కు అండగా నిలిచిన నాయకుడు.

`ప్రతి క్షణం పార్టీని కంటికి రెప్పలా కాపాడిన రక్షకుడు.

`టీఆర్‌ఎస్‌ పుట్టుక నుంచి పార్టీ కోసం పని చేసిన నాయకుడు.

`పార్టీ బలోపేతంలో కీలకపాత్రదారి హరీష్‌.

`తెలంగాణ మొత్తం టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడానికి కారణం హరీష్‌.

`కేసీఆర్‌ ఆదేశాలతో పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాయకుడు.

`ఉద్యమ స్వరం ఊరూర నింపిన నాయకుడు.

`ఊరూరు పార్టీకి కంచుకోట చేసిన నాయకుడు హరీష్‌.

`కేసీఆర్‌ కీర్తిని నలుదిశలా ప్రసరింప జేసిన నాయకుడు హరీష్‌.

`అవమానాలు భరించాడు.

`పార్టీని అర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాడు.

`ఉద్యమ సమయంలో అన్నీ తానై ముందు నడిచాడు.

`అందర్నీ సమన్వపరుస్తూ పార్టీని కంచుకోట చేశాడు.

`తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా నిలిపాడు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే! ఎమ్మెల్సీ కల్వకుంట్ల తన వేలుతో తన కన్నే పొడుచుకున్నారు.. మాజీ మంత్రి హరీష్‌రావు, సోదరుడు సంతోష్‌లను అబాసు పాలు చేయాలన్న తాపత్రయంలో మొదటికే మోసం తెచ్చుకున్నారు. విపరీతమైన వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. పార్టీలో కొందరు పొగబెడుతున్నారంటూ చేసిన తన వ్యాఖ్యలకన్నా, తానే పొగ పెట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. అయినా హరీష్‌రావు లాంటి నాయకుడిపై ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారనుకోవడం కవిత మూర్ఖత్వం. కవిత లేనప్పుడే పార్టీ పురుడు పోసుకున్నది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన పునాదులువేసుకున్నది. కవిత లేనప్పుడే పార్టీ బలమైన శక్తిగా మారింది. కవిత వల్లపార్టీకి జరిగిన మేలు లేదు. బిఆర్‌ఎస్‌ లేకపోతే కవిత లేదు. కేసిఆర్‌ కూతురు కాకపోతే కవితకు రాజకీయమే లేదు. ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. కవితను నాయకురాలు చేసిందే బిఆర్‌ఎస్‌ పార్టీ. ఆమెకు రాజకీయ జీవితం ఇచ్చిందే బిఆర్‌ఎస్‌. ఆ పార్టీ కేసిఆర్‌ చేతనే పురుడుపోసుకోవచ్చు. కాని ఆ పార్టీ అడుగులు వేయడంలో హరీష్‌ పాత్రే కీలకమైంది. గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్‌రావు లేకుంటే పార్టీ నడిచేదే కాదు. హరీష్‌రావు లేకుంటే పార్టీ ఇంత కాలం బతికేదే కాదు? ఇది ముమ్మాటికీ నిజం. తన జీవితం మొత్తం పార్టీకోసం అంకితం చేసిననాయకుడు హరీష్‌రావు. తన జీవిత లక్ష్యాన్ని కాదనుకొని పార్టీ కోసం జీవితం త్యాగం చేసిన నాయకుడు హరీష్‌రావు. వస్తుందో రాదో తెలియని తెలంగాణకోసం ఆయన పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. కేసిఆర్‌ రాజకీయ పార్టీ నామకరణం చేసి, హరీష్‌రావు భుజాల బాద్యతలు పెట్టారు. అప్పుడు కవిత ఇండియాలో కూడా లేరు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో బలపడిరదో అప్పుడు కవిత ఇండియాకు వచ్చారు. అప్పటికే కేసిఆర్‌ బలమైన నాయకుడుగా మారిపోయారు. అందుకు హరీష్‌రావు పాత్ర ఎంతో గొప్పది. నిజంగా తండ్రి మీద కవితకు ప్రేమ వుంటే ఆమె ఆనాడు టిఆర్‌ఎస్‌లో చేరాలి. పార్టీకోసం పనిచేయాలి. కాని ఆ పని చేయలేదు. తండ్రి పేరు చెప్పుకొని జాగృతి సంస్ధ ఏర్పాటు చేశారు. జాగృతితో ముందుకు సాగారు. కాని ఏనాడు పార్టీ కోసం కష్టపడిరది లేదు. తనదారి తాను ఎంచుకొని వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో భాగాస్వామ్యమయ్యారే గాని, బిఆర్‌ఎస్‌కు మేలుచేసింది లేదు. బిఆర్‌ఎస్‌ కోసం పని చేసింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే కవిత పార్టీలోకి వచ్చింది. ఎంపి సీటు తీసుకున్నది. గెలిచింది. బిఆర్‌ఎస్‌లో ఆమె ప్రస్తానమంతా పదేళ్లు మాత్రమే. కాని హరీష్‌రావు పాత్ర 26 సంవత్సరాలు. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి పార్టీకి ప్రాణం పెట్టి పనిచేశాడు. అలాంటి నాయకుడిని అవినీతి పరుడు అని కవిత అంటే జనం కూడా నమ్మరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాట్లాడడం అంటేనే పరోక్షంగా తన తండ్రి కేసిఆర్‌ను ఇరికించినట్లే లెక్క. పైగా హరీష్‌రావును రెండోసారి అందుకే పక్కన పెట్టారంటూ లేనిపోని ముచ్చట్లు చెప్పితే కేసిఆర్‌ మీద ప్రజలకు వున్న నమ్మకాన్ని కవితే సన్నగిల్లేలా చేసినట్లౌవుంది. పార్టీ కోసం అంత పనిచేసిన హరీష్‌రావుపై హరీష్‌రావుపై కవిత వ్యాఖ్యలు ఎట్టిపరిస్ధితుల్లోనూ సరైనవి కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఒక్కసారిగా పార్టీని కుదిపేసినంత పనైంది. నిజానికి కవితపై గతంలోనే షోకాజ్‌లు నోటీసులిస్తారని అందరూ భావించారు. కాని కేసిఆర్‌ వేచి చూసే ధోరణి అనుసరించారు. గతంలోనే ఓసారి కేసిఆర్‌ ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ లైన్‌ దాటితే ఉపేంక్షించేదిలేదని పలు మార్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ను పంపించిన సందర్భంలోనూ ఇదే విషయం స్పష్టం చేశారు. పార్టీలో ఏ స్ధాయిలో వున్నవారికైనా ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు. అయితే కవిత తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించి, రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆఖరుకు పార్టీ రజతోత్సవ వేడుకల్లో తనకు తగిన ప్రాదాన్యత కల్పించలేదన్న అక్కసును దృష్టిలో పెట్టుకొని కేసిఆర్‌కు లెటర్‌ రాశారు. అది బైటకొచ్చింది. అందులో ఆమె చేసిన సూచనల ముసుగులో ఏకంగా కేసిఆర్‌ను ప్రశ్నించినట్లైంది. నిజానికి ఏ ప్రాంతీయ పార్టీలోనైనా సరే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా తక్కువ. అది ఎవరైనా సరే, పార్టీ అంతర్గత సమావేశాలలో మాత్రమే వెల్లడిరచాలి. ఆఖరుకు రజతోత్సవ వేదికపై కేసిఆర్‌ ఇలా అనుసరించేది వుండే అంటూ కొన్ని కీలక సూచనలు చేశారు. అది నిజానికి పార్టీ దిక్కరణ కిందకే వస్తుంది. పైగా ఆ లెటర్‌ లీకైన తర్వాత పార్టీలో కేసిఆర్‌ చుట్టూ దెయ్యాలున్నారంటూ మరో రకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా కేసిఆర్‌ పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవద్దని సూచించారు. ఇక మాజీ మంత్రి జగదీష్‌రెడ్డినిద్దేశించి మాట్లాడినప్పుడే ఆమెపై చర్యలు తీసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఓ వైపు కవిత తాను పార్టీలోనే వున్నానంటూనే మరో వైపు పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వుండేవారు. చివరికి ఆమె ఏకంగా హరీష్‌రావు, సంతోష్‌రావులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. పార్టీలో ఇంకా ఎవరిపై కవిత వ్యాఖ్యలు చేసినా సహించేవారేమో? కాని హరీష్‌రావు, సంతోష్‌రావులపై చేసిన వ్యాఖ్యలు ఆమెను సస్పెండ్‌ చేసే వరకు వచ్చాయి. ఏ మాటకామాట చెప్పుకోవాలి. అసలు హరీష్‌రావు లేని బిఆర్‌ఎస్‌ను ఊహించుకోవడమే కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే హరీష్‌ రావు లేకుంటే కేసిఆర్‌ కూడా పార్టీని నడపడం కష్టం. బిఆర్‌ఎస్‌ పార్టీకి మొదటి సైనికుడు హరీష్‌రావు. అసలైన సైన్యాధ్యక్షుడు హరీష్‌రావు. కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు హరీష్‌ తప్ప ఇంకొకరు లేరు. సంతోష్‌రావు కూడా తర్వాత వచ్చారు. అడుగడుగునా కేసిఆర్‌ కు అండగా వుంటూ వచ్చిన హరీష్‌ రావు పోషించిన పాత్ర అంత సులభమైంది కాదు. సహజంగా రాజకీయాలు వేరు. ఉద్యమ రాజకీయాలు వేరు. రెండు రకాల పాత్రలు సమర్ధవంతంగా పోషించిన నాయకుడు హరీష్‌రావు. అటు కేసిఆర్‌ కోసం పనిచేయాలి. ఇటు ఉద్యమం కోసం పనిచేయాలి. మరో వైపు నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలి. ఇలా మూడు పాత్రలను కూడా అలవోకగా పోషించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. పార్టీ కోసం ఆయన తిండి,నిద్రలు మానుకొని పనిచేసినరోజులు అనేకం వున్నాయి. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా హరీష్‌రావు కాళేశ్వర నిర్మాణం సమయంలో అనేక రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఉదయమంతా పర్యటనలు, అదికారులతో రివ్యూలు, అభివృద్ధిపనులు, రాత్రికి మళ్లీ కాళేశ్వరానికి చేరి ఆ పనులు పర్యవేక్షలు చేసిన నాయకుడు హరీష్‌రావు. అలా ప్రాజెక్టు పూర్తయ్యేవరకు కాళేశ్వరం నిర్మాణ పనులతో సతమతమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక అధ్భుతమైన కట్టడాన్ని తనచేతుల మీద నిర్మాణమౌతుందన్న ఆనందం ఒక వైపు, ఎంతో బాధ్యతతో పనిచేశారు. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో కాళేశ్వరం పూర్తి కావడం లో హరీష్‌ పాత్రను ఎవరూ శంకించలేదు. అంతగొప్పగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఏకైక నాయకుడు హరీష్‌రావు. ఇక సంతోష్‌రావు విషయానికి వస్తే మొదటినుంచి కేసిఆర్‌ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా కేసిఆర్‌ అనేక వేదికల మీద చెప్పారు. తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందుకే సంతోష్‌రావుకు రాజ్యసభ ఇస్తున్నానని కూడా చెప్పారు. హరీష్‌రావుపై లేనిపోని వ్యాఖ్యలు చేసి కవిత తప్పు చేసింది. కవితపై చర్యలు తీసుకోకపోతే నేరుగా పార్టీ మీద మాట్లాడేవారు పెరుగుతారు. కవిత కూడా సరిగ్గా పార్టీ ఎదుగుతున్న తరుణంలో మరింత బలపడుతుందన్న విశ్వాసం ఏర్పడుతున్న సందర్భాన్ని చూసుకొని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ రజతోత్సవ సభ విజయవంతమైందని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్న సమయంలో లేఖ రాశారు. పార్టీలో అందరికీ వేదిక మీద మాట్లాడే అవకాశమిస్తే బాగుండేదంటూ మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది జరగలేదంటూ పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్‌ పార్టీ మీద ఎదురు దాడి చేస్తున్న సమయంలో తన ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందని కవిత చెప్పడంతో బిఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడే పరిస్తితి విచ్చింది. ఇప్పుడేమో కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసి, కాళేశ్వరం తెలంగాణ వర ప్రదాయిని అని నిరూపించే సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూర్గిగా వ్యతిరేకమైనవే అన్నది తేలింది. ఓ వైపు కేసిఆర్‌ మీద ప్రేమను చూపిస్తూనే, పరోక్షంగా కాళేశ్వరంలో అవినీతికి కారకుడు కేసిఆరే అనే అర్దం సృరించేలా కవిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నుంచి దూరమైంది. ఏది ఏమైనా హరీష్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం కూడా స్వాగతించలేదు. ఆమెపై తెలంగాణ సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైందని చెప్పక తప్పదు.

పప్పు కాదు, నిప్పు!

`దేశ వ్యాప్తంగా రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు.

`క్రమ క్రమంగా పెరుగుతున్న రాహుల్‌ క్రేజ్‌.

`జోడో యాత్రతో రాహుల్‌ బలం పెరిగింది.

`బిహార్‌ ఓట్‌ యాత్రతో రాహుల్‌ గ్రాఫ్‌ మరింత పెరిగింది.

`బిహార్‌ లో రాహుల్‌ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

`ప్రజలు వేలాది మందిగా రాహుల్‌ సభలకు హజరౌతున్నారు.

`మొదటి సారిగా రాహుల్‌ ను చూసి బీజేపీ భయపడుతోంది.

`ఓట్ల గల్లంతుపై రాహుల్‌ వాదనకు ప్రజల మద్దతు కనిపిస్తోంది.

`రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నాయకుడైన తర్వాత దూకుడు పెరిగింది.

`ఓట్‌ చోరీ అంశం తెరమీదకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఆయనతో కలిసి నడుస్తున్నాయి.

`బీహార్‌ లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

`ఎన్డీయే కూటమి మీద బిహార్‌ లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

`ఈ పదేళ్లలో బీజేపీ, జెడీయూ సంకీర్ణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోతోంది.

`ప్రతిపక్షాలను విమర్శించడమే ప్రచారాస్త్రం చేసుకుంటున్నారు.

`ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌ బిహార్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

`బీజేపీి మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని అర్థమౌతోంది.

`ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌కు మద్దతు పెరిగింది.

`బీహార్‌ లో తేజస్వీ యాదవ్‌ నాయకత్వాన్ని 43 శాతం ప్రజలు మద్దతు?

`సిఎం. నితీష్‌ కుమార్‌ కు కేవలం 18 శాతం మద్దతు?

`సర్వే సంస్థలన్నీ ఇండియా కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి.

`బిహార్‌ లో వైద్య శాఖ మంత్రిని ప్రజలు తరిమేయడం పెద్ద సంచలనంగా మారింది

హైదరాబాద్‌,నేటిధాత్రి:
పెరుగుతున్న రాహుల్‌ ఇమేజ్‌ విపరీతంగా పెరుగుతోంది. రాహుల్‌ గాంధీ లాంటి నాయకత్వం తమకు కావాలని బ్రీపేజలు కోరుకుంటున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కూడా ..పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా పదకొండేళ్ల క్రితం నుంచి రాహుల్‌ గాంధీని పప్పు అంటూ బిజేపి విపరీత ప్రచారం చేస్తూ వచ్చేది. కాని ఏనాడు రాహుల్‌ గాంధీ దానిపై స్పందించలేదు.చింతించలేదు. డిఫెన్స్‌లో పడలేదు. పప్పు అనేది దేశమంతా తీసుకునే ఆహారం. మన దేశంలో బలమైన ఆహారం. అంతటి దానితో తనను పోల్చడం తనకు ఆనందమే అని బిజేపి నోరు మూయించారు. ఒకప్పుడు యువ రాజు అంటూ కీర్తించిన మీడియా కూడా రాను రాను రాహుల్‌కు స్పేస్‌ లేకుండా చేశారు. రాహుల్‌ గాంధీ వార్తలు రాయడానికి కూడా ఇష్టపడలేదు. రాహుల్‌ గాంధీ ఎంత మంచి సమచారాన్ని మీడియాకు అందజేసినా కూడా మీడియా పట్టించుకునేది కాదు. అసలు రాహుల్‌ చేసే వ్యాఖ్యలను కూడా మీడియా వక్రీకరించిన రోజులున్నాయి. బిజేపి ఏది చెబితే అదే మీడియా రాసుకున్న రోజులున్నాయి. దేశ విభజనకు కాంగ్రెస్‌ పార్టీ , పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కారణమంటూ ఆరోపణలు చేసేవారు. కాశ్మీర్‌ అంశంలో ప్రతీసారి, ప్రతి అంశాన్ని గాంధీకుటుంబానికి ఆపాదిస్తూ బిజేపి చేస్తూ వచ్చేది. అయినా రాహుల్‌ ఎంతో విజ్ఞతలోనే రాజకీయాలు చేసేవారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసిన సూచనలు అప్పట్లో బిజేపి ప్రభుత్వం ఎంతో తేలిక చేసి మాట్లాడేది. రాహుల్‌కు ఏం తెలుసు అన్నట్లు మాట్లాడేది. కరోనా అనేది దేశంలోకి వస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. వెంటనే మన దేశానికి వచ్చే విమానాలను వెంటనే ఆపేయాలని సూచించారు. కాని రెండు నెలల పాటు అప్పడు బిజేపి ప్రభుత్వం కాలయాపన చేసింది. దాని పర్యవసానం దేశమంతా చూసిందే. తర్వాత వ్యాక్సిన్‌ విషయంలోనూ రాహుల్‌ గాంధీ చేసిన సూచనలు బిజేపి ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. వ్యాక్సిన్‌ విషయంలో తొందరపాటు వద్దని రాహుల్‌ సూచించారు. వాక్సిన్‌ అనేది 140కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నామంటూ బిజేపి గొప్పగా ప్రచారం చేసుకున్నది. కాని మన దేశంలో అనేక రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సిన్‌లను దేశ వ్యాప్తంగా ఉచితంగా ఇవ్వడం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలే మొదలు పెట్టాయి. ప్రతి ఏడాది రెండుసార్లు పోలియో వ్యాక్సిన్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం వేయడం కూడా మొదలుపెట్టింది. దేశంలో ఇప్పుడున్న విద్యా, వైద్య, వైమానిక, రసాయిన, దేశ భద్రత, సాగు నీటి ప్రాజెక్టులు, పరిశోధనలు, ఆహర విప్లవం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో కనిపించే సాక్ష్యాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నప్పుడు చేపట్టినవే. రాహుల్‌ గాందీ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఆర్ధిక విద్యను అధ్యయనం చేశాడు. దేశ ఆర్ధిక పరిస్దితులే కాదు, ప్రపంచ ఆర్ధిక పరిస్ధితులపై పూర్తి అవగాహన వున్న నాయకుడు. అయినా ఆయనకు బిజేపి ఏనాడు విలువ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆయన ప్రధాని పదవే కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారు. కాని ఆయన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు. దేశాన్ని పాలించాలంటే తనకు ఇంకా ఎంతో అనుభవం రావాలని అన్నారు. కేంద్రంలో కనీసం మంత్రి పదవి కూడా తీసుకోలేదు. అది అంకితభావం వున్న నాయకుడు. ఏదో ఒక రోజు ప్రజలు రాహుల్‌ గాందీ కావాలని కోరుకునే రోజు వస్తుందని అనుకున్నాడు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. స్వాతంత్య్ర భారతావనిలో దేశమంతా పాదయాత్ర చేసిన నాయకుడిగా చరిత్రకెక్కారు. దేశ స్వాతంత్య్ర కాలంలో చాలా మంది పాదయాత్రలు చేశారు. ప్రజలను చైతన్యం చేశారు. కాని డెబ్బై సంవత్సరాల కాలంలో ఒక్క రాహుల్‌ గాంధీ మాత్రమే దేశమంతా పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకున్నారు. ఇక ఓట్‌ చోరి అనే విషయంతో దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ సంచలనం సృష్టించారు. దాంతో బిజేపిపై ప్రజలకు వున్న మబ్బులు తొలగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీకి పెరుగుతున్న మద్దతు విపరీతంగా పెరుతోంది. తాజాగా బిహార్‌ ఎన్నికల యాత్రలో రాహుల్‌ సభలకు ప్రజలు స్వచ్చంధంగా వేలాదిగా వస్తున్నారు.. ముఖ్యంగా యువతలో ఓ రేంజ్‌లో రాహుల్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. 2014కు ముందు ప్రదాని మోడీకి వచ్చినట్లే ఇప్పుడు రాహుల్‌కు కూడా కలిసి వస్తోంది. బలమైన ప్రతిపక్షం వుంటే తప్ప రాజకీయాల్లో ఇలాంటి మార్పులు రావని తేలిపోయింది. దేశ ప్రజలు 2014,2019లలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేశారు. దాని పర్యవసనాలు అనుభవించారు. నోట్ల రద్దు నుంచి మొదలు, జిఎస్టీ, ధరల మోతలు భరించారు. రెండుసార్లు బలమైన కేంద్ర ప్రభుత్వం బిజేపి రూపంలో ఏర్పాటైంది. ఆ ఏక పార్టీ పాలన విదానంలో ఒంటెద్దు పోకడలు కనిపించాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు లేకుండాపోయారు. ప్రతిపక్షాల వాదనలు పత్రికలు కూడా రాయలేకపోయాయి. ప్రధాని మోడీ చెప్పిందే నిజమని నమ్మారు. బిజేపి ఆలోచనలే దేశానికి శ్రీరామరక్ష అనుకున్నారు. రాహుల్‌ గాందీని పప్పు అంటూ నిందించారు. రాహుల్‌ ది ఏ కులమంటూ ఎద్దేవా చేశారు. లేనిపోని కల్పిత కథలన్నీ చెప్పారు. జనాన్ని నమ్మించారు. డామిట్‌ కథ అడ్డం తిరుగుతోంది. రాహుల్‌ నాయకత్వం, సమర్ధత మీద చర్చ మొదలైంది. దేనికైనా సరే సమయం రావాలి. కావాలి అంటారు. ఇప్పుడు అదే నిజమౌతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అప్రతిహాతంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూశారు. బిజేపిని బలపర్చారు. కాంగ్రెస్‌కు సమాంతరంగా గెలిపిస్తూ వచ్చారు. ఆఖరుకు కాంగ్రెస్‌కు కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశారు. ప్రజలు ఎంతైనా విజ్ఞులు. తాము కోరుకున్నట్లు పాలన సాగాలనుకోవడం ప్రజల నిర్ణయం. ప్రజా నిర్ణయమే అంతిమ తీర్పు. అందుకే 2014 నుంచి బిజేపికి దేశ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రాలలో కూడా కాషాయజెండా ఎగురవేశారు. ఇప్పుడు బిజేపికి గడ్డు కాలం మొదలైంది. గత ఎన్నికల్లో అప్‌కీ బార్‌ బిజేపి సర్కార్‌ అనే నినాదాన్ని జనం సంపూర్ణంగా విశ్వసించలేదు. బిజేపికి మద్దతు తెలపలేదు. కాకపోతే బిజేపిని అధికారం దరిదాపుల్లోకి తెచ్చి వదిలిపెట్టారు. దాంతో మళ్లీ సంకీర్ణ సర్కారు కేంద్రంలో ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి బిజేపి అవస్దలు ఎదుర్కొంటోంది. గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి బిజేపికి ప్రశ్న అనే పదమే వినిపించలేదు. బిజేపిదాకా ఆ పదమే చేరుకోలేదు. ఓసారి బిజేపికి అవకాశమిద్దామనుకున్న ప్రజలు కూడా కాంగ్రెస్‌ ప్రశ్నలు వినిపించుకోలేదు. దానికి తోడు బిజేపి చెప్పిన ప్రతి విషయాన్ని నిజమే అని నమ్మారు. దేశం కోసం, ధర్మం కోసం అని బిజేపి చెప్పే మాటలను ప్రజలు బలంగా నమ్మారు. ముఖ్యంగా కశ్మీర్‌ అంశంలో ఎప్పటి నుంచో సాగుతున్న, నానుతున్న సమస్యలన్నీ బిజేపి వల్లనే తీరుతాయని జనం నమ్మారు. అది ప్రధాని మోడీ నేతృత్వంలోనే సాధ్యమౌతుందనుకున్నారు. కాని ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఎప్పుడైతే పహల్గావ్‌ దాడి తర్వాత ప్రజల్లో బిజేపిపై వున్న నమ్మకం క్రమంగా సడలుతోంది. ఎనుకున్న ప్రజలే ప్రశ్నించొద్దనే రాజకీయ పార్టీని ప్రజలే మళ్లీ పక్కన పెడతారన్న విషయాన్ని పార్టీలు మర్చిపోతున్నాయి. అందుకే పహల్గావ్‌ దాడిపై ఎవరూ మాట్లాడకుండా ఎత్తులు వేశారు. కాని కేంద్రంలో ఈసారి బలమైన ప్రతిపక్షం వుండడంతో అసలు విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో బిజేపిపై ప్రజలు ఎంత కోపంతో వున్నారో కూడా కనిపిస్తోంది. పహల్గావ్‌ దాడి విషయంలో బిజేపి వేసిన విన్యాసాలు ప్రజలు నిషితంగా గమనిస్తూ వచ్చారు. బిజేపి చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎలాంటి పొంతన వుండడం లేదని గ్రహించారు. పైగా పాకిస్తాన్‌తో యుద్దం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీజ్‌ ఫైర్‌ ప్రకటన భారతీయులను ఆశ్చర్యాలకు గురి చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరుతో రంగంలోకి దిగగానే దేశ ప్రజలంతా ఎంతో సంతోషించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెబుతారని ఊహించారు. కాని అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సీజ్‌ ఫైర్‌ను ప్రకటించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి బిజేపిపై ప్రజల్లో ఒక రకమైన భావన మొదలైంది. తాజాగా ఆపరేషన్‌ మహాదేవ్‌ జరిపి, ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెప్పినా జనంలో స్పందన కరువైంది. ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదని చెప్పిన కేంద్రం, మళ్లీ ఆపరేషన్‌ మహదేవ్‌ ఎప్పుడు తెచ్చింది? అనే అనుమానంలోనే వున్నారు. ఇలా వరుస సంఘటనలతో కాంగ్రెస్‌ పార్టీ గత పాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ద సమయంలో ఇందిరాగాంధీ చూపిన చొరవపై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆమె అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌ రీగన్‌తో నేరుగానే తమ దేశ రాజకీయ, సార్వభౌమత్వంలో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌ను రెండుగా చీల్చేసింది. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేసింది. ఆ సమయంలో ప్రపంచమంతా ఇందిరాగాందీని కొనియాడిరది. బిజేపి నాయకుడు మాజీ ప్రదాని అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ సైతం ఇందిరాగాందీని అపర కాళికా దేవి అంటూ కీర్తించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు గత పది సంవత్సరాలుగా ఎంత చప్పగా సాగాయో, ఇప్పుడు అంత హాట్‌గా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందిరాగాంధీ ధైర్యంలో కనీసం సగం వున్నా అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ చెప్పింది అబద్దమని చెప్పంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌ సవాలుతో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్‌ తీసుకున్నాయి. ప్రతిపక్షాలు అదికార బిజేపిని చెడుగుడు ఆడుకుంటున్నాయి. అయితే రాహుల్‌ గాంధీ గత ఎన్నికల ముందు రాహుల్‌ జోడో యాత్ర చేసిన సమయంలోనే దేశమంతా ఆయనపై కొంత నమ్మకం మొదలైంది. తర్వాత ఆయన ప్రజలకు చేరువౌతున్న తీరు దేశమంతా గమనిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతోంది. మన దేశంలో ఏం జరుగుతుందో ఆయన ఎంత చెప్పినా జనం వినడానికి సిద్దంగా వున్నా, ప్రచార సాధనాలు సహకరించలేదు. కాని ఇప్పుడు ఆయన ఏది చెబితే అది జనం వింటున్నారు. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? కోవిడ్‌ సమయంలో రాహుల్‌ ఏం చెప్పారు. అదే ఎలా నిజమైంది? రాజ్యాంగ స్పూరిని గురించి వివరించడం అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంగ్లీషు వల్ల లాభమేమిటి? హిందీని బలవంతంగా రుద్దితే ఏం జరుగుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపై రాహుల్‌ చెప్పే ప్రతి మాట జనానికి చేరుతోంది. పైగా ప్రతిపక్షాలు కూడా రాహుల్‌ బాటలోకి వచ్చేస్తున్నారు. దాంతో రాహుల్‌ ఇమేజ్‌ ఇటీవల కాలంలో అమాంతం పెరిగింది.

వానలో, వరదలో ‘‘కృష్ణార్జునులు’’!

`వరద ప్రాంతాలలో విసృత పర్యటన.

`ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓదార్పు.

`సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ.

`బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ప్రజలకు సహాయ సహకారాలు.

`పార్టీ పరంగా ప్రజలకు అండగా…

`ప్రభుత్వం నిర్లక్ష్యం మీద తీవ్ర విమర్శలు.

`50 సంవత్సరాలలో తెలంగాణలో ఎప్పుడూ లేనంత వర్షం.

`కుంభవృష్టి కి కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాలు అతలాకుతలం.

`ప్రభుత్వం వెంటనే సహాకచర్యలు చేపట్టాలని డిమాండ్‌.

`వేలాది ఎకరాలలో పంట నష్టం.

`వందలాది ఇండ్లు నేల మట్టం.

`ఇసుక మేటలతో నిండిపోయిన పొలాలు.

`తక్షణ అర్థిక సహాయం విడుదల చేయాలని హరీష్‌, కేటీఆర్‌ ల డిమాండ్‌.

`బీఆర్‌ఎస్‌ హయాంలో తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు.

`ఎకరాకు 10 వేలు వెంటనే చెల్లించారు.

`ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ప్రజలను కేసీఆర్‌ ఆదుకున్నారు.

`కేంద్రంపై ఆధారపడకుండా వెనువెంటనే సహాయ చర్యలు తీసుకున్నారు.

`వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్‌ వినియోగించారు.

`వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు.

`పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

`లక్షలాది మందికి భోజన, వసతులు అందజేశారు

`ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించారు

`నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు

`హైదరాబాదులో కూడా ఇంటికి రూ. 10 వేలు అందించారు

`ఇప్పుడు ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసిందని హరీష్‌, కేటీఆర్‌ విమర్శలు

`వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్నా రేవంత్‌ సర్కార్‌ పట్టించుకోలేదని ఆరోపణలు

`సహాయక చర్యలు వదిలేసి ఇతర సమస్యల మీద రివ్యూలు చేశారని విమర్శలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          నాయకులు అంటే ఇలా వుండాలి. బండికి జోడెద్దుల్లాగా పనిచేసేనాయకులు బిఆర్‌ఎస్‌కు వున్నారు. వాళ్లే బావా, బావమర్ధులు హరీష్‌రావు, కేటిఆర్‌లు. తెలంగాణ ఉద్యమ నాయకులు. ఉద్యమ బాగస్వాములు. ప్రజా సమస్యలు తెలిసిన వాళ్లు. ప్రజల జీవితాల మీద అవగాహన వున్న వాళ్లు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లే అంకితభావం వున్న నాయకులు. ఎందుకంటే వారికి నాయకత్వ లక్షణాలే కాదు, ప్రజా సారధులు అయ్యేందుకు ఉద్యమం అనేక పాఠాలు నేర్పింది. రాజకీయ బాటలు చూపింది. ప్రజల కోసం పనిచేసే తత్వాన్ని అందించింది. వాళ్లద్దరు సహజ రాజకీయ నాయకులు కాదు. కేవలం వారసత్వంతో నాయకులైన వారు కాదు. ప్రజల నుంచి పుట్టిన నాయకులు. ఉద్యమం నుంచి నాయకత్వం పురుడుపోసుకున్న వాళ్లు. అందుకే ప్రజలంటే వారికి ఎనలేని ఇష్టం. ప్రజలు కష్టపడుతుంటే చూడలేదు. రాజకీయంగా శత్రువులైనా సరే వారు ఎదురుపడితే తలవంచి నమస్కారం చేయాల్సిందే. దగ్గరకొచ్చి కరచాలనం చేయాల్సిందే. ఎందుకంటే అది వారి సభ్యత. సంస్కారం. మన్నన. అందుకే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందు మాట్లాడుకునేది ఈ ఇద్దరి గురించే. ఆ తర్వాతే ఇతర నాయకుల ప్రస్తావన. అంతలా తెలగాణ రాజకీయాల్లో మమేకమైన నాయకులు. వారికి పార్టీ గెలుపోటములతో పనిలేదు. పార్టీ ఓడిపోయినా ఏనాడు ఇంట్లో వున్నది లేదు. నిత్యం ప్రజల్లోనే వుంటారు. ప్రజల కోసమే వారు రాజకీయం చేస్తారు. తమ ప్రజల యోగక్షేమాల గురించే పదేపదే ఆలోచిస్తుంటారు. నమ్మిన వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. తన నియోకజవర్గ ప్రజలన కళ్లల్లో ఎట్టుకొని పాలిస్తుంటారు. వారికి ఏ ఆపద వచ్చినా సరే అర్ధరాత్రైనా ఆదుకుంటారు. భరోసా కల్పిస్తారు. అది ఏ రూపంలోనైనా సరే ఆపదలో వున్నవారిని ఆదుకుంటారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇంతటి పేరు సంపాదించుకున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీకి చేరో కన్నుగా మారిపోయారు. పార్టీని రక్షించుకోవడంలో రెండు దిక్కులుగా బలోపేతం చేస్తున్నారు. అలాంటి నాయకులు ప్రజలు బాధ పడుతుంటే ఇళ్లలో వుండలేరు. వానొచ్చినా, వరదొచ్చినా లెక్క చేయరు. ప్రజల కోసం ఎంత కష్టమైనా వెళ్లి వారికి ధైర్యం చెబుతారు. ఆపదలోవున్న వారిని గట్టెక్కిస్తారు. సహాయ సహకారాలు అందిస్తారు. తాజాగా భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. జల విలయం సృష్టించాయి. సుమారు 50 ఏళ్ల కాలంలో ఇంతటి వర్షాపాతం రెండు రోజుల్లో నమోదైన సందర్భం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో సహజంగా అదికార పార్టీకి చెందిన నాయకులు హుటాహుటిన కార్యక్షేత్రంలోకి వెళ్తారు. ప్రజలకు అండగా నిలుస్తారు. కాని ప్రతిపక్షాలు కూర్చున్న చోట మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తుంటారు. కాని ఈ ఇద్దరు నాయకులు మాత్రం అధికారంలోవున్నా అందరకంటే ముందుగానే ప్రజల వద్దకు చేరుకుంటారు. ప్రతిపక్షంలో వున్నా అదే బాధ్యతను నిర్వర్తించారు. కామారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రజలు ఆగమయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు గండ్లు తెగిపోయాయి. ఎప్పుడో వందేళ్ల క్రితం నిర్మాణంచేసిన పోచారం ప్రాజెక్టుపై నుంచి కూడా నీళ్లు వెళ్లాయి. అంటే అంతటి వర్షాపాతం ఎప్పుడూ ఎవరూ వినలేదు. గత యాభై సంవత్సరాల కాలంలో ఇలాంటి వర్షం ఏనాడు చూడలేని ప్రజలు చెబుతున్నారు. ఇరవై నాలుగు గంటలు కరిసిన కుంభవృష్టి మూలంగా కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వానలు విస్తారంగా కురిశాయి. అనేక వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. కాని ప్రభుత్వం ఇంత వరకు పంట నష్టం గురించి ఆలోచించలేదంటూ హరీష్‌రావు, కేటిఆర్‌లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు వెళ్లకముందే ముంపు ప్రాంతాలను, సమస్యాత్మక ప్రదేశాలను వర్షంలోనే ఈ ఇద్దరు నేతలు విసృతంగా పర్యటించారు. ప్రజలకు భరోసా కల్పించారు. అండగా వుంటామన్నారు. పార్టీ పరంగా చేయాల్సినంత సహాయం కూడా చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలకు తోడుగా వున్నారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. పార్టీపరంగా ప్రజలకు అండగా నిలిచారు. 

నిజం చెప్పాలంటే ఇంతటి వర్షం 50 సంవత్సరాలలో తెలంగాణలో ఒక్క రోజులో ఎప్పుడూ కురవలేదు. కామారెడ్డి జిల్లాలో 59 సెంటీ మీటర్లు, మెదక్‌ లో 40 సెం.మీ. సిరిసిల్లలో 30 సెం.మీ.కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇవేమీ వారం రోజుల పాటు నిరంతరంగా కురిసినవి కాదు. రాత్రికి రాత్రే అల్లకల్లోలం సృష్టించిన వర్షాలు. అధికారులు అప్రమత్తంగా వుండాల్సిన సమయం. కానీ అధికారులు మొద్దు నిద్ర వీడలేదని చెప్పడానికి ఈ జిల్లాలే సాక్ష్యం. ముఖ్యంగా పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అంశం. కామారెడ్డి లో పోలీసులు సహాయక చర్యలలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో విపత్తు నిర్వహణ పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాదికారి ప్రజల మీద రుసరుసలాడినట్లు కూడా వీడియోలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్‌ అవుతున్నాయి. అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి. రాత్రికి రాత్రే కురిసిన వర్షానికి వేలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలన్నింటిలో కలిపి వందలాది ఇండ్లు చెడిపోయాయి. కొన్ని పాక్షికంగా దెబ్బ తిన్నాయి. కొన్ని నేల మట్టయ్యాయి. పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయు. రైతులకు తక్షణ అర్థిక సహాయం విడుదల చేయాలని హరీష్‌, కేటిఆర్‌ ల డిమాండ్‌.

బిఆర్‌ఎస్‌ హయాంలో కూడా ఇలాగే వర్షాలు కురిశాయి. ఇంత వర్షం అప్పుడు కురవలేదు. ములుగు, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో వర్షం కురిసింది. ఆ సమయంలో కేసిఆర్‌ తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు. అంతే కాకుండా హుటాహుటిన కేసిఆర్‌ వరద ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకున్నారు. తక్షణ సాయం కింద విడుదల చేసిన రూ.500 వర్షం ముగిసిన మరుసటి రోజు నుంచే రైతులకు పంచారు. తర్వాత పంట నష్టం పకడ్బందీగా అంచనా వేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకున్నారు. ఎకరాకు 10 వేలు వెంటనే చెల్లించారు. తర్వాత ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందనేదానిని నేరుగా రైతుతో మాట్లాడి పంట నష్టం అందించారు. అలా ఖమ్మం, వరంగల్‌ జిల్లాల రైతులను, ప్రజలను కేసిఆర్‌ ఆదుకున్నారు. ఆ సమయంలో కేంద్రం రావాలి, అంచనా వేయాలని కూడా ఆలోచించలేదు. కేంద్రం మీద నెట్టేసి చేతులు దులుపుకోలేదు. తర్వాత కొంత కాలానికి కేంద్ర బృందం వచ్చింది. వెళ్లిందే కానీ, కేంద్రం ఆ సమయంలో రూపాయి సాయం చేయలేదు. అయినా కేసిఆర్‌ ఏనాడు కేంద్రాన్ని నిందించలేదు. అందుకే కేంద్రంపై ఆధారపడకుండా వెనువెంటనే సహాయ చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్‌ వినియోగించారు. ఎంతో మందిని కాపాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించారు. ఖమ్మం పట్టణం వర్షాలతో అతలాకుతలమైంది. కేసిఆర్‌ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజలను పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో లక్షలాది మందికి భోజన, వసతులు అందజేశారు. ఖమ్మం ఆ రోజులను ఇంకా మర్చిపోలేరు. అర్థరాత్రులు కూడా బిఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు సహాయక చర్యలలో పాలు పంచుకున్నారు. రాత్రంతా ప్రజలతోనే వున్నారు. మేమున్నామని బిఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు ప్రజలకు భరోసా కల్పించారు. వర్షం తగ్గిన తర్వాత కాలనీలలో వున్న నిలిచిపోయిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేశారు. తర్వాత ప్రజలను తిరిగి వారి వారి ఇళ్లకు చేర్చారు. అంతే కాకుండా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు. హైదరాబాదలో 2019లో రాత్రికి రాత్రి 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అప్పటికి అదే అత్యధిక వర్షపాతం. ఆ సమయంలో హైదరాబాదు వాసులందరికీ కేసిఆర్‌ ఇంటికి 10 వేలు పంపిణీ చేశారు. కేటిఆర్‌ మున్సిపల్‌ మంత్రిగా మోకాలు తోతు నీళ్లు, బురదలో మూడు రోజుల పాటు నిర్విరామంగా కాలనీలు తిరిగారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. వరద నివారణ చర్యలు చేపట్టారు. ఇక కరోనా కాలంలో కేటిఆర్‌ చేసిన సేవ హైదరాబాదు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. హరీష్‌ రావు తన నియోజకవర్గమే కాదు, ఫోన్‌ చేసిన ప్రతి ఒక్కరికీ వైద్య సాయం అందించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆ సమయంలో అన్న హరీషన్న నా ప్రాణాలు కాపాడన్నా అని ఓ జర్నలిస్టు వీడియో పెడితే వెంటనే వైద్య సదుపాయం కల్పించారు. తన నియోజకవర్గ ప్రజలందరికీ హరీష్‌ రావు ప్రొటీన్‌ పుడ్‌తో కూడిన కిట్‌ను అందజేశారు. హరీష్‌ రావు కరోనా తో బాధపడుతున్నా తన ప్రజలకు సేవలందించారు. నాయకులంటే అలా వుండాలని ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు కోట్ల రూపాయల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలా బిఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేసిన సేవలు అంతా ఇంతా కాదు. అలాంటి అనేక ఉపద్రవాలను చూసిన హరీష్‌ రావు, కేటిఆర్‌ లు అధికారంలో లేకపోయినా ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసిందని హరీష్‌, కేటిఆర్‌ విమర్శలు చేశారు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్నా రేవంత్‌ సర్కార్‌ పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. సహాయక చర్యలు వదిలేసి ఇతర సమస్యల మీద రివ్యూలు చేయడమేమిటని ప్రశ్నించారు. వెంటనే ప్రజలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

అయితే మీరు, లేకుంటే మేము!

`మనమిద్దరమే వుందాం!

`జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరి!

`కాంగ్రెస్‌, బిజేపిలు అనుసరిస్తున్న విధానం!

`మూడో పార్టీ పురుడుపోసుకుంటే ఇద్దరం మునుగుతాం.

`సఖ్యతైనా, సంవాదమైనా మన మధ్యే వుండాలి.

`మూడో పార్టీ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి.

`రాజకీయంగా బద్ద శత్రుత్వమే పైకి కనిపించాలి.

`అమెరికాలో వున్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి.

`మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయం మనమే చేయాలి.

`జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి.

`ఆప్‌ను అణచివేయడంలో ఇదే పంధా అనుసరించారు!

`బీఆర్‌ఎస్‌ లాంటి పార్టీ డిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు!

`తృణమూల్‌ను బెంగాల్‌ దాటకుండా చూసుకుంటున్నార్‌.

`జేడియూను పొత్తులో బీహార్‌ దాటకుండా చేశారు.

`తెలుగు దేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు.

`టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ అనగానే అదును చూసి ఒత్తేశారు.

`కేసీఆర్‌ ను కోలుకోకుండా చేశారు.

`ఏదో ఒక కూటమిలో వుంటే తప్ప ఏ తలనొప్పి వుండదు.

`కాంగ్రెస్‌ ను కాదని ఆప్‌ ఆగమైంది.

`ఎవరినీ నమ్మక బిఆర్‌ఎస్‌ ఎటుగాకుండా వుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలలో ఆధిపత్యం కనిపించినా అంతర్గతంగా వుండే అవగాహనలు చాలా వుంటాయి. వాటి ఆధారంగానే రాజకీయాలు కొనసాగుతుంటాయి. పైకి మాత్రమే బద్ద శతృత్వం కనిపిస్తుంది. స్నేహ హస్తాలు పైకి బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. పార్టీల మధ్య ఒప్పందాలు లోతుగా అర్థం చేసుకుంటే తప్ప కనిపించవు. కాకపోతే తాము ఎల్లకాలం అధికారంలో వుండాలన్న లక్ష్యంతో పని చేస్తుంటాయి. గెలుపోటములు ప్రజల నిర్ణయానికి వదిలేస్తుంటాయి. నిజం చెప్పాలంటే రాజకీయ పార్టీలు చేసే ప్రచారం మీద ప్రజలు ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒక అపోహ మాత్రమే. ఏ తరం ఆలోచనలు ఎలా వుంటాయన్నది ఏ రాజకీయ పార్టీ అంచనా వేయలేదు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కొట్టుకుపోక తప్పదు. గెలిచామనే సంబరం రాజకీయ పార్టీలకు ఆ క్షణమే వుంటుంది. గెలిచినా ఐదేళ్లలో ప్రజా ఉద్యమాలు రావొచ్చు. ఉపద్రవాలు దరి చేరొచ్చు. రాజకీయ పార్టీలలో చీలికలు రావొచ్చు. నాయకులు విడిపోవచ్చు. సొంత పార్టీలలోనే ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోవచ్చు. ఇందుకు బిజేపి మినహాయింపు కాకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో పాలించే రాజకీయ పార్టీలలో ఎల్ల కాలం ఒక్కరే పరిపాలిండాన్ని సొంత నాయకులు కూడా అంగీకరించరు. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా పనిన నరేంద్ర మోడీని నాలుగో సారి కూడా సొంత పార్టీ అంగీకరించే పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే బిజేపిలో కూడా ఎంతో సమర్థవంతమైన నాయకులున్నారు. వాళ్లలో క. మోడీ తప్ప మరో నాయకుడు లేడనే భావన బలపడితే బిజేపికి భవిష్యత్తులో తీరని నష్టం ఎదురుకావొచ్చు. పైగా ఎప్పుడూ మోడీనే అంటే పార్టీలో తిరుగుబాటు మొదలుకావొచ్చు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ 75 సంవత్సరాల వయసు అంశాన్ని పదే పదే తెరమీదకు తెస్తోంది. రాజకీయాలలో ఎప్పుడూ ఏదో ఒకటి జరగొచ్చు. ఎప్పటికీ ఒకే రకమైన రాజకీయం సాగకపోవచ్చు. వ్యక్తి స్వామ్యరాజకీయానికి బిజేపిలో చోటు లేదు. అయినా ప్రధాని మోడీకి ఇప్పటి వరకు ఎదురులేదు. భవిష్యత్తులో కూడా వుంటుందని అనుకోలేం..తర్వాత రోజులలో ప్రజలు మార్పు కోరుకోలేరని చెప్పలేం..అందుకే జాతీయ రాజకీయాలలో కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జాతీయ స్థాయిలో మూడో రాజకీయ వ్యవస్థ చేరకుండా, రానివ్వకుండా అయితే మీరు, లేకుంటే మేము! అనే అంతర్లీన ఒప్పందానికి కాంగ్రెస్‌, బిజేపిలు వచ్చాయా? అంటే అవుననే విషయాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషక మేధావి వర్గాలలో చర్చలకు దారి తీస్తున్నాయి. దేశంలో ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చక్రం తిప్పుతూ వుండేవి. ఇప్పుడు ఆ పార్టీలు మనుగడ కోసం ఆరాటపడుతున్నాయి. పోరాటం చేసే శక్తి చాలని వ్యవస్థలుగా మిగిలిపోయాయి. అయితే జాతీయ స్థాయిలో ఎదగాలని, దేశ వ్యాప్తంగా రాజకీయంగా బలపడాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆప్‌, తృణమూల్‌ వున్నాయి. బిఆర్‌ఎస్‌ ఆ పని చేయాలనుకొని ఓడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చతికిలపడిపోయింది. ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేసే స్థితిలో వుంది. ఒకప్పుడు బిఎస్పీ పార్టీ జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం అవుతుందని అంచనా వేశారు. కానీ బిఆర్‌ఎస్‌ లాగానే సొంత రాష్ట్రంలో ఓడిపోయింది. ఇప్పుడు కనుమరుగయ్యే తరుణానికి, పుంజుకోవాలన్న ఆరాటానికి మధ్య ఊగిసలాడుతోంది. సమాజ్‌ వాదీ ఉత్తర భారతంలోనే విస్తరించాలని చూసినా కుదరలేదు. కాకపోతే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ లో బలంగానే వుంది. ప్రజలు బిజేపిని కాదనుకుంటే గెలిచే పార్టీగా ఉత్తర ప్రదేశ్‌ లో క్యూలో వుంది. ఇలా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న పార్టీలు ప్రాంతీయ భావనలతో బతుకులీడుస్తున్నాయి. కానీ ఇంతలో ఆప్‌ వచ్చేసి ఎక్కడ బిజేపి, కాంగ్రెస్‌ లను చీపురుతో ఊడ్చేస్తుందో అనే భయం పట్టుకుంది. అందుకే ఇక ఎట్టిపరిస్థితులలోనూ మనమిద్దరమే వుందాం! అన్న ఆలోచనలలో రెండు పార్టీలున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరిలో ఇలాంటి అవగాహన అనేది ఏర్పడినా, పెరిగినా ప్రాంతీయ పార్టీలకు ఉరే మిగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాకుండా ఈ రెండు పార్టీల కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీ వైపు నిలిస్తే తప్ప పార్టీలు భవిష్యత్తులో బతికే ఛాన్స్‌ లేదు. ఈ రెండు కూటములలో కాకుండా మూడో వ్యవస్థ ఏది ఏర్పడకుండా కట్టుదిట్టమైన రాజకీయంతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అంతే కాకుండా మూడో పార్టీ పురుడుపోసుకుంటే ఇద్దరం మునుగుతాం అనే ఆలోచనలు రెండు పార్టీలు చేస్తున్నాయి. రాజకీయంగా పరిణామాలైనా సరే సఖ్యతైనా, సంవాదమైనా మన మధ్యే వుండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యే అవకాశం వుంది. అది మూడో ఫ్రంట్‌ రూపంలో ఉపద్రవం ముంచుకురావొచ్చు. ఎన్నికల సమయాలలో ఏదైనా జరగొచ్చు. ఏది జరిగినా రెండు జాతీయ పార్టీలకు నష్టదాయకమే అవుతుంది. మూడో పార్టీగాని, మూడో ఫ్రంట్‌ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి. ముఖ్యంగా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు కాకుండా, ప్రాంతీయ పార్టీలను తమ అదుపాజ్ఞలో వుంచుకోవాలి. సహజంగా రాష్ట్రాల ఎన్నికలు అనగానే ప్రాంతీయ పార్టీలు వున్న చోట ఆ పార్టీల వైపే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. స్థానిక సమస్యల మీద వాళ్లకు అవగాహన తో పాటు కమిట్‌ మెంట్‌ వుంటుంది. దానికి తోడు ఏదో ఒక సెంటిమెంట్‌ కూడా వుంటుంది. వాటి నుంచి ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడరు. అలా దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇలాంటిది ఏదో సెంటిమెంట్‌ వుంటుంది. మహారాష్ట్ర లో మరాఠ, తమిళనాడులో పెరియార్‌, ఆంద్రప్రదేశ్‌ లో తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలంగాణ లో ప్రాంత అస్థిత్వ సెంటిమెంట్‌ బలమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా రాజకీయాలు చేయడం ఎంతో అవసరమని గుర్తించినట్లున్నారు. అయితే కాంగ్రెస్‌, బిజేపిపు రాజకీయంగా బద్ద శత్రుత్వమే పైకి కనిపించేలా రాజకీయం చేస్తుంటాయి. మన దేశ రాజ్యాంగ మాత్రుక కొంత అమెరికా రాజ్యాంగ లక్షణాలను పోలివుంటుంది. కానీ మన దేశంలో బహు పార్టీల రాజకీయం సాగుతోంది. దీనిని ఎలాగో కట్టడి చేయలేం. రాజ్యాంగ పరంగా సాధ్యమయ్యే పని అసలే కాదు. అందువల్ల రెండు జాతీయ పార్టీల అంతర్గత అవగాహన ఒక్కటే సరైన మార్గం. అమెరికాలో వున్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి. మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయం మనమే చేయాలి. ఇలాంటి అవగాహన రెండు జాతీయ పార్టీలలో బలంగా వుంది. ఈ విషయమై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి. తొలుత డిల్లీలో ఆప్‌ పార్టీని రెండు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కేజ్రివాల్‌ ఏకు మేకౌతున్నాడని తెలుసుకోవడానికి రెండు పార్టీలకు పార్టీలకు పెద్దగా సమయం పట్టలేదు. చాలా త్వరగానే కోలుకున్నాయి. నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలలో వచ్చిన కేజ్రివాల్‌ను అవినీతి పరుడనే ముద్ర వేసి ప్రజలను నమ్మించగలిగారు. డిల్లీలో ఆప్‌ను ఓడిరచారు. కేజ్రివాల్‌ దూకుడుకు కళ్లెం వేశారు. ఆప్‌ను అణచివేయడంలో ఇదే పంధా అనుసరించారు! తెలంగాణలో పురుడుపోసుకున్న బిఆర్‌ఎస్‌ లాంటి పార్టీ డిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు! దీదీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీకి ప్రధానమంత్రి కావాలని బలంగా వుంది. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరింది. పార్టీని విస్తరించాలనుకున్నది. కుదరలేదు. తృణమూల్‌ను బెంగాల్‌ దాటకుండా చూసుకుంటున్నార్‌. ప్రధానమంత్రి కావాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కు వుంది. 2014లోనే తాను కావాలనుకున్నాడు. తన అవసరం ఏ కూటమికి వున్నా ప్రధాని పోస్ట్‌ కోసం ఎసరుపెట్టుకొని కూర్చున్నారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేకు మద్దతు పలికి, సిఎంగా తన ఆశలు అక్కడికే పరిమితం చేసుకున్నాడు. తోక జాడిరచే ధైర్యం చేయలేని స్థితిలో బిజేపిలో ఒదిగిపోయాడు. జేడియూను పొత్తులో బీహార్‌ దాటకుండా చేశారు. తెలుగు దేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు. పరోక్షంగా అప్పుడు కేసిఆర్‌ కు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే కేసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ అనగానే అదును చూసి ఇక్కడ ఒత్తేశారు. కవిత రూపంలో బిఆర్‌ఎస్‌ ను ఇరుకున పడేశారు. రాజకీయంగా ఇబ్బందుల పాలు చేశారు. దేశంలో ఏ నాయకుడు ఎదిరించనంతగా కేసిఆర్‌ బిజేపిని, మోడీని తూర్పార పట్టారు. బిజేపికి శత్రువయ్యారు. అలాగని కాంగ్రెస్‌ కు మిత్రుడు కాలేని రాజకీయాలు ఎదుర్కొన్నాడు. మొదటికే మోసం వచ్చేలా బిజేపి చేసిన రాజకీయంలో కేసిఆర్‌ చిక్కుకున్నారు. బిఆర్‌ఎస్‌ అనకపోతే ఇప్పుడు అధికారంలోనే వుండే వారు. కవిత రాజకీయ జీవితం ఇలా మలుపు తిరిగి వుండేది కాదు. అలా కేసిఆర్‌ ను కోలుకోకుండా చేశారు. ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక కూటమిలో వుంటే తప్ప ఏ తలనొప్పి వుండదు. అనే దశకు దేశ రాజకీయాలను తెచ్చారు. కాంగ్రెస్‌ ను కాదని ఆప్‌ ఆగమైంది. ఎవరినీ నమ్మక బిఆర్‌ఎస్‌ ఎటుగాకుండా వుంది. భవిష్యత్తు ఎలా వుంటుందనేది ఇంత కన్నా క్లారిటీ ఏమి వుండదు.

ప్రభుత్వాన్నే ‘‘బ్లాక్‌ మెయిల్‌’’ చేస్తున్నారు

`ఆరోగ్య శ్రీ కోసం వెలిసిన పుట్టగొడుగులు!

`వైద్య రంగాన్ని విషతుల్యం చేస్తున్న చీడ పురుగులు

`నయవంచిత ప్రైవేటు ఆసుపత్రులు

`వైద్యం ముసుగులో వ్యాపారం!

`ఆరోగ్యశ్రీ నిధులు అడ్డదిడ్డంగా మేయడం!

`ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి కైంకర్యాలు!

`మానవత్వం లేని ఆసుపత్రుల అడ్డదారి సంపాదనలు

`లెక్కలేనన్ని లెక్కల చెబుతూ దోచుకుంటున్న కాసుపత్రులు

`వైద్యం పేరుతో సాగిస్తున్న దుర్మార్గపు వ్యాపార నిలయాలు

`బకాయిల పేరుతో పదే పదే బెదిరింపులు

`బుకాయింపుల పేరుతో అడ్డగోలు బిల్లులు

`రేవంత్‌ సర్కార్‌ ఉదాసీనతను సొమ్ము చేసుకుంటున్నారు

`గత ప్రభుత్వ బకాయిలు చెల్లించినా మొండికేస్తున్న ఆసుపత్రులు

`ఆరోగ్య శ్రీ పరిధి పెంచడంతో పండుగ చేసుకుంటున్న ఆసుపత్రులు

`అయినా దన దాహం తీరక లేనిపోని కొర్రీలు

`22 శాతం వైద్య చార్జీలు పెంచుకున్నా సంతృప్తి లేని అలకలు

`ఇటీవలి బకాయిలు చెల్లించకపోతే వైద్యం చేయమని ప్రభుత్వానికే హెచ్చరికలు

`గతంలో ఇలా చేస్తేనే ఆరోగ్య శ్రీ అక్రమాలపై ఎంక్వౌరీ వేశారు

`ఆసుపత్రుల బోగోతాలు వెలుగులోకి తెచ్చారు

`చర్యలు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారింది

`గత ప్రభుత్వంలో విజిలెన్స్‌ ఎంక్వౌరీలో తేలిన ఆసుపత్రులను మూస్తేగాని బుద్ధి రాదు

`ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు చెక్‌ పెడితే గాని దారికి రారు

`దుర్మార్గమైన దోపిడీ సాగిస్తున్న ఆసుపత్రుల లైసెన్స్‌ రద్దు చేయకపోతే దోపిడీ ఆగదు

`ఆరోగ్య శ్రీ నిధుల కోసం ఆసుపత్రులు పెట్టిన వాళ్లు చాలా మంది వున్నారు

`ఆరోగ్య శ్రీ నిధులతోనే ఆసుపత్రులు నడుపుకుంటున్నారు

`తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు ప్రభుత్వాన్నే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు

`ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పెట్టకపోతే ఆసుపత్రుల ఆగడాలు ఆగవు

`సామాన్యులకు సరైన వైద్యం అందదు

 

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                            

ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే యోచనలో అనేక పదకాలు అమలు చేస్తుంటాయి. ప్రైవేటు వ్యాపారులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ఆలోచన చేస్తాయి. దురదృష్టమేమిటంటే మన దేశంలో విద్య, వైద్యం వ్యాపారమైపోయాయి. విద్య, వైద్యం ప్రజలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. అయితే సమాజంలోని అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వానికి కూడా పూర్తి స్దాయిలో వీలు కాకపోవచ్చు. అప్పుడు పరోక్షంగా ప్రైవేటు వ్యవస్ధలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడుంది. ఇక్కడే ప్రైవేటు వ్యక్తులు విద్య, వైద్యాన్ని పూర్తిగా వ్యాపారమయం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య రంగాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులు భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రజల కోసం ప్రభుత్వాలు తెచ్చే ఉచిత వైద్యాన్ని కూడా వైద్య వ్యవస్ధలు అలుసుగా తీసుకుంటున్నాయి. డబ్బు సంపాదనకు మార్గంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పధకాలను వారికి వరంగా చేసుకుంటున్నాయి. పైగా ప్రభుత్వాన్నే బెదిరించే స్దాయికి చేరుకుంటున్నాయి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్వీర్యం చేసే పన్నాగాలు పన్నుతుంటాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పధకం గత ఇరవై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలు జరుగుతోంది. ఈ పధకం తెచ్చిన నాడు పెద్దగా ప్రభుత్వాసుపత్రుల లేవు. కాని ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న ఆలోచనతో అప్పటి పాలకులు ఆరోగ్యశ్రీ తెచ్చారు. అందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల సహకారం తీసుకున్నారు. అయితే ఆ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే నేరుగా బిల్లులు చెల్లించే ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్‌ సర్కారు పదిలక్షల వరకు పరిమితి పెంచింది. గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందేలా వుండేది. ఇలా ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రైవుటు ఆసుపత్రులు కామదేనువుగా మార్చుకున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలు పెంచినా ప్రైవేటు ఆసుపత్రుల ఆశ తగ్గలేదు. తమ వైద్యానికి అదనంగా మరో చార్జీలు పెంచాలని కోరారు. అయినా రేవంత్‌ సర్కారు మరో 22శాతం ఫీజులు చెల్లించేందుకు కూడా అంగీకరించింది. అయినా ఆసుపత్రుల దన దాహం తీరడం లేదు. అయినవీ కానివీ అన్నట్లు లెక్కలేస్తున్నారు. సహజంగా జరిగే వైద్యానికి మించి బిల్లులు వేస్తున్నారు. ఇష్టాను సారం లెక్కలు చూపిస్తున్నారు. అయినా సరే పధకానికి ఆటంకం కలగొద్దన్న ఆలోచనతో ప్రభుత్వం మరింత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు తెలిసినా, భరిస్తూ, సహిస్తూ వస్తోంది. తమ వైద్యానికి ధరలు పెంచాలని కోరినా ప్రభుత్వం ఒప్పుకుంటూనే వుంది. వారికి అందాల్సిన బకాయిలు ఇప్పటికే రెండుసార్లు చెల్లించారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ బాకాయిలు ఏకంగా రూ.1700 కోట్లు చెల్లించారు. తర్వాత మరో 340 కోట్లు చెల్లించారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వం ఆసుపత్రుల బకాయిలు చెల్లించలేదు. మొత్తని వాడిని మొత్తబుద్దవుతుందని ఒకసామెత. ప్రైవేటు ఆసుపత్రుల తీరు అలాగే వుంది. ఓ వైపు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పధకాన్ని చేయాల్సినంత దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు బిల్లులు అనేకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేకం వెలుగులోకి కూడా వచ్చాయి. అయినా వారి భయం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తమ మీద ఆదారపడాల్సిందే అన్న ధీమా వారిలో మరింత పెరిగిపోతూ వస్తోంది. ఇటీవల తమ బకాయిలు చెల్లించకపోతే తాము వైద్యం ఆపేస్తామంటూ ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు అల్టిమేటమ్‌ జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ బాకాయిలు చెల్లించపోతే ఆరోగ్య శ్రీ సేవలు ఆపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఆరోగ్య శ్రీ వల్లనే బతుకుతున్నాయి. ఆరోగ్య శ్రీ లేకుంటే తెలంగాణలో సగానికి పైగా ఆసుపత్రులు మూత పడాల్సిందే. ఈ నిజం తెలిసినా ప్రైవేటు ఆసుపత్రులు తమ ఆగడాలు ఆపడం లేదు. ప్రభుత్వాల ఉదాసీనత, మెకత వైఖరిని అలుసుగా చేసుకుంటున్నారు. చెలరేగిపోతున్నారు. ప్రతీసారి అనేక కొర్రీలు పెడుతూ, ఆరోగ్య శ్రీకి అడ్డంకులు సృష్టిస్తూ, ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజం చెప్పాలంటే కేవలం ఆరోగ్యశ్రీ కోసమే తెలంగాణలో అనేక ఆసుపత్రులు వెలిశాయి. ఈ సంగతి ఆసుపత్రుల నిర్వాహకులకు తెలిసినా, ప్రభుత్వాలను బెదిరించి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆపేస్తే తెలంగాణలోని సుమారు 70శాతం ఆసుపత్రులు మూసుకోవాల్సిందే. కాని ప్రభుత్వం ఆ పని చేయదన్న దుర్మార్గం పెచ్చరిల్లిపోతోంది. ఆసుపత్రలు మీద చర్యలు తీసుకునే స్ధితి వుండదన్న ధీమాతో ప్రైవేటు ఆసుపత్రులు ఆటలాడుతున్నాయి. గత ప్రభుత్వం కేసిఆర్‌ హాయంలో ఆరోగ్యశ్రీ అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. దాంతో విజిలెన్స్‌ ఎంక్వౌరీ చేశారు. ఆ రిపోర్టు కూడా ప్రభుత్వం వద్ద వుంది. ఆ రిపోర్టు పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవడం మొదలుపెడితే, సోకాల్డ్‌ గొప్ప ఆసుపత్రులని చెప్పుకునేవి అనేకం మూత బడడం ఖాయం. అంతలా ఆరోగ్యశ్రీలో అవినీతి జరిగాయనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అందుకు గత ప్రభుత్వం ఆసుపత్రుల గొంతెమ్మ కోరికలు తీర్చలేదు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతామంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. అందుకే గత ప్రభుత్వ హాయంలో రెండు వేల కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు వున్నా, ప్రైవేటు ఆసుపత్రులు నోరు మెదపలేదు. బకాయిలు ఇస్తేగాని వైద్యం చేయలేమని చేతులెత్తేయలేదు. పదే పదే తమ చికిత్సలకు చార్జీలు పెంచాలని కోరలేదు. మొత్తం పదేళ్ల కాలంలో ఒకటో, అరో తప్ప ఆరోగ్యశ్రీ ఆసుత్రులు ప్రభుత్వాన్ని కోరింది లేదు. ప్రభుత్వం బకాయిలు ఇచ్చినప్పుడు తీసుకున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటూ వేడుకుంటూ వుండేవారు. కాని ఇప్పుడు ఆసుపత్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నెల 30లోగా బకాయిలు చెల్లించాలని డెడ్‌ లైన్‌పెడుతున్నాయి. లేకుంటే సేవలు నిలిచిపోతాయని అల్టిమేటమ్‌ జారీ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో బాకీ పడిన బకాయిలను ఏక కాలంలో రేవంత్‌ సర్కార్‌ వెనుకాడకుండా ఏక కాలంలో 1780కోట్లకు పైగా విడుదల చేయడం అనేది గొప్ప విషయం. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకూడదన్న ఆలోచనతో రేవంత్‌ సర్కార్‌ ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేశాయి. నిజానికి ప్రభుత్వం అంత మొత్తం ఒకేసారి విడుదల చేస్తుందని ప్రైవేటు ఆసుపత్రులు ఊహించలేదు. మొత్తం 2200 కోట్ల బకాయిల్లో ఓ 300 నుంచి 500 కోట్లు విడుదల చేస్తాయని అనుకున్నారు. కాని ఎంతో ఉదారతతో ఎక్కడా వైద్య సేవలకు అంతరాయం కలకూడదన్న గొప్ప మనసుతో రేవంత్‌ సర్కారు ఏక కాలంలో మూడువంతులకు పైగా నిధులు విడుదల చేసింది. అయినా ప్రైవేటు ఆసుపత్రులకు నీతి లేకుండాపోయింది. నిజాయితీ అనే పదం కూడా వారి డిక్షనరీలో లేకుండా చేసుకుంటున్నారు. రేవంత్‌ సర్కార్‌ ఇలా ఏక కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడంతో ఈ రెండుసంవత్సరాల కాలంలో పెద్దఎత్తున ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లు, ఎంతో మంది వ్యాపార వేత్తలు కూడా వైద్య రంగంలోకి దిగారు. పెద్దఎత్తున ఆసుపత్రులు పెట్టారు. ప్రభుత్వాన్ని కోరి, ఒప్పించి, మెప్పించి ఆరోగ్య శ్రీ సేవల కోసం ఎంపానల్‌ మెంట్లు చేయించుకున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ నిధుల మీదనే ఆదారపడి ఆసుపత్రులు నడిపించుకుంటూ ప్రభుత్వాన్నే బ్లాక్‌ మెయిల్‌ చేసేదశకు చేరుకుంటున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటే తప్ప ప్రైవేటు ఆసుపత్రులు దారికి రావు. గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్‌ ఎంక్వౌరీ రిపోర్టును బట్టిచర్యలు తీసుకుంటే చాలా ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దవుతాయి.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో డేరింగ్‌ కింగ్‌

-డైమనిక్‌ పాలిటిక్స్‌లో ఆరి తేరిన లీడర్‌!

-ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడు.

-రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు.

-ఎవ్వరి సలహాలు తీసుకోడు.

-తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు.

-తన నిర్ణయాలు వెంట నడిచే వారిని వదులుకోడు.

-ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు.

-రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని తెలుసు.

-అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు.

-ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడు.

-రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు.

-తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు.

-ఎదురయ్యే సమస్యలను క్షణాలలో మరిపించగలడు.

-రెండేళ్ళలలో జరిగిన పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు.

-తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు.

-మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోగలడు.

-ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు.

-రాజకీయ వ్యతిరేకుల చేత కూడా దటీజ్‌ రేవంత్‌ అనిపించుకోగలడు.

-రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి.

-ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

డైవర్ట్‌ అనే మాట లేకుండా దేశంలో రాజకీయాలు సాగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు అదే అనుసరిస్తున్నాయి. ఆ దారిలోనే నడుస్తున్నాయి. అలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ఎవరు సమర్థవంతంగా పోషిస్తే రాజకీయాలలో వాళ్లే కింగ్‌లౌతున్నారు. అలాంటి నాయకులే దేశమంతటా సాగుతున్నారు. డైవర్షన్‌ రాజకీయాలే ప్రపంచమంతా సాగుతున్నాయనేది కూడా ముమ్మాటికీ నిజం. అలాంటి రాజకీయాలను నమ్ముకుంటే తప్ప రాణించలేమని నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. రాజకీయం కూడా ఒక లక్ష్యం చేసుకొని నాయకుడవ్వాలి. రాజకీయాలలో డైవర్షన్లు, డైమెన్షన్లు సహజం. అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావు. నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడలాంటే లాజిక్‌ల కన్నా మ్యాజిక్‌లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నమ్మకాల విన్యాసాలే రాజ్యమేలుతాయి. జనం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త దనం కోరుకుంటారు. ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడు విజేత అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మడికట్టుకునే రాజకీయాలు సాధ్యం కాదు. భీమ్మించుకొని కూర్చుంటే అసలే సాధ్యం కాదు. ఎత్తుకు పైఎత్తులలో అవతలి వారిని చిత్తు చేయాలంటే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే..గత పాలకుల కన్నా భిన్నంగా పాలిస్తానని నాలుగు మాటలు చెబితే ప్రజలు ఆహ్వానించే రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పిన వారిని కూడా ప్రజలు ఆదరించిన సందర్భాలు కూడా లేవు. జనం కోరుకునే వాటినైనా నాయకులు కళ్ల ముందు వుంచుతామనే మాటలు చెప్పి ఒప్పించాలి. లేకుంటే నాయకుడి ఆలోచనల్లోకైనా జనాన్ని రప్పించి గోల్‌ కొట్టాలి. ఒక్కసారి వెనుకబడితే ముందుకొచ్చే రోజులు కావు. ఎదురొచ్చిన వారి నుంచి తప్పుకుంటూ కాకుండా, వారిని తప్పిస్తూ ముందుకు వెళ్తేనే సక్సెస్‌ అవుతున్న రోజులు. ఈ ఎత్తులు, వ్యూహాలు ఆది నుంచి అనుసరిస్తూ, ఆచరిస్తూ ముందుకెళ్లి సక్సెస్‌ అయిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆయన అవకాశాలు ఎదురు రాలేదు. అవకాశాలను తన వైపు తిప్పుకొని గెలుస్తూ వచ్చాడు. నిజం చెప్పినా సరే తనదైన శైలిలో చెప్పి గెలిచాడు. అబద్దాలు చెప్పినా సరే జనం అవే వాస్తవమని నమ్మేలా చేశాడు. డైరెక్ట్‌గా డైవర్షన్‌ పాలిటిక్స్‌లో కింగ్‌ అయ్యారు. రాజకీయాలలో ఎలా గెలిచారన్నది ఎప్పుడూ పాయింట్‌ కాదు. గెలిచారా లేదా? అన్నదే కీ పాయింట్‌. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచారు. అవతలి వారిని ప్రతిసారి ఊహించని దెబ్బ కొట్టడంలో ఆరి తేరిన నాయకుడనిపించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అసమ్మతి నుంచి సమ్మతి పొందిన నాయకుడై వెలుగొందుతున్నారు. బరి గీసి నిలబడి, ఎదురించి నిలబడి విజయాన్ని దాసోహం చేసుకుంటున్నారు. దటీజ్‌ రేవంత్‌ రెడ్డి అని ప్రత్యర్థుల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాజకీయాలలో రకరకాల భిన్నాభిప్రాయాలు వుండొచ్చు. అభిప్రాయ బేధాలు పొడసూపొచ్చు. కానీ కాదనుకున్న వారి చేత కొనియాడబడే స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ సాధ్యం అసలే కాదు. అందుకు అకుంఠిత దీక్ష అవసరం. కష్టాలు, నష్టాలు తరుముతున్నా నిలబడే ధైర్యం కావాలి. అన్నిటికన్నా గుండె నిబ్బరంగా వుండాలి. కష్టాలను చిరు నవ్వు తో స్వాగతించే మనస్తత్వం అలవడాలి. గెలుపే లక్ష్యం తప్ప మిగతావన్నీ చాలా చిన్న సమస్యలుగానే చూడాలి. లక్ష్యం పెద్దదైనప్పుడు ఎదురయ్యే సమస్యలు గడ్డిపరకలుగా మార్చుకోవాలి. ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినను అనే రాజకీయాలు చేయడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి దిట్ట. మనకంటూ కొన్ని పక్కా వ్యూహాలు సొంతగా వుండాలి. వాటికి తోడు ఇతర నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మొత్తం ఇతరుల మీద ఆధారపడితే మొదటికే మోసం రావొచ్చు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అందుకే రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అటు కేసిఆర్‌ ను పదే పదే రెచ్చగొట్టి, మీడియా అటెన్షన్‌ అంతా తనవైపు తిప్పుకునే వారు. పిసిసి అధ్యక్షుడుగా వున్న సమయంలో ఒక్కరోజు కూడా రాజకీయాలకు దూరంగా వున్నది లేదు. కేసిఆర్‌ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు. మల్లన్న సాగర్‌ బాదితుల పక్షాన పోరాటం చేసినా, బాసర విద్యార్థుల పక్షాన నిలిచే రాజకీయం చేసినా ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు. తన నిర్ణయాలతో వెంట నడిచే వారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఇంతటి మంచి తనం రేవంత్‌ రెడ్డి సొంతం. అందుకే పార్టీలకు అతీతంగా రేవంత్‌ రెడ్డి ని ఇష్టపడతారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా వ్యక్తుల మధ్య వుండే స్నేహపూర్వక సంబంధాలు వేరు. ఇప్పుడున్న రోజులలో రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని రేవంత్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఎలాంటి గాడ్‌ ఫాదర్‌ లేకుండా రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం రేవంత్‌ లా అందరికీ సాధ్యం కాదు. ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడగా తనను తాను నిరూపించుకున్నాడు. నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడు కూడా ఒక మాట అనడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నాడు. గతంలో కేసిఆర్‌ ఉద్యమ కాలంలో ఎంతటి వారినైనా సరే చీల్చి చెండాడే వారు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఒక రకంగా జంకుతున్నాడు. ఎందుకంటే తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు రేవంత్‌ రెడ్డి. తన పాలనలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎదురైన అనేక సమస్యలను క్షణాలలో మరిపించగలిగేలా ఎత్తులు వేస్తూ వస్తున్నాడు. రెండేళ్ళలలో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. దానిని వివాదం చేయాలని బిఆర్‌ఎస్‌ ఎంత చూసినా ఆ పార్టీకి సాధ్యం కాలేదు. బిఆర్‌ఎస్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిన దాని ముందు సుంకిశాల ఎంత చిన్నది అని ఎదురుదాడి కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి మొదలుపెట్టారు. దానిని పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్‌ దంటూ బిఆర్‌ఎస్‌ ను దబాయించారు. ఆఖరుకు ఆ పాపం కూడా బిఆర్‌ఎస్‌ ఖాతాలో వేసి ఎదురుదాడి చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు బిఆర్‌ఎస్‌ సుంకిశాల మీద మాట్లాడిరది లేదు. అలా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరికించడం రేవంత్‌ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పకతప్పదు. ఆ మధ్య ఎస్‌ఎల్బీసి టన్నెల్‌ వ్యవహారం ఎటు పోయిందో కూడా తెలియనంతగా రాజకీయాలను తన వైపు తిప్పుకోగల సమర్థవంతమైన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కాకపోవడానికి కూడా కేసిఆరే కారణమని ప్రజలను నమ్మించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. కేవలం కేసిఆర్‌ చేసిన అప్పుల మూలంగా నెల నెల మిత్తీలకే 6 వేల కోట్లు చెల్లిస్తున్నానని చెప్పి, ప్రజలను నమ్మించి పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు ఒక్క సీటు కూడా రాకుండా రాజకీయం చేసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. రాజకీయంగా తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు. మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోవడంలో రేవంత్‌ రెడ్డి దిట్ట. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

టెండర్‌ ప్యాడీ దోపిడీ! మిల్లర్‌కు ట్రాజెడీ!!

`టెండరింగ్‌ దళారులు మిల్లర్ల పాలిట విలన్లు!

`మిల్లర్‌ కెందుకు శాపం!

`టెండర్‌ ప్యాడీకెందుకు పెత్తనం.

`బకాయిలు చెల్లిస్తాం మొర్రో అంటున్న మిల్లర్లు!

`గడువు ముగిసిందని కిరికిరి పెడుతున్న టెండర్‌ ప్యాడీ దళారులు.

`ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య దళారులెందుకు?

`ఏ రాష్ట్రంలో లేని విధానం తెలంగాణలో ఎందుకు?

`మిల్లర్ల బకాయిలు వసూలుకు బోలెడు సిబ్బంది వున్నారు.

`పర్యవేక్షణకు వందలాది మంది అధికారులున్నారు.

`నలుగురు టెండర్‌ ప్యాడీ దళారులకు ఉద్యోగుల సహకారం ఎందుకు?

`క్వింటాలుకు దళారీ వ్యవస్థకు రూ. 230 ఇవ్వడమెందుకు?

`మిల్లర్ల నుంచి నిర్ణీత సమయంలో బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత విస్మరించిన టెండర్‌ ప్యాడీ.

`మిల్లర్‌ చెల్లించకపోయినా నిర్ణీత గడువులో బకాయిలు చెల్లించాల్సింది టెండర్‌ ప్యాడీ.

`అందుకు మిల్లర్‌ బలికావడం సరైంది కాదు.

`గడువు ముగిసిందన్న నెపంతో మిల్లర్ల మీద అదనపు బారం మోపడం అన్యాయం.

`టెండర్‌ ప్యాడీ పొరపాటును మిల్లర్లను బలి చేయడం దుర్మార్గం.

`తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం విజయవంతం కావడంలో మిల్లర్లది కీలకపాత్ర.

`అలాంటి మిల్లర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

`దళారీ వ్యవస్థతో మిల్లర్లను మింగేయడం సరైందికానిది.

`ఇప్పటికైనా టెండర్‌ వ్యవస్థను రద్దు చేయండి.

`మిల్లర్‌ బకాయిలు వసూలులో టెండర్‌ ప్యాడీ పనితనమేమీ లేదు.

`అధికారుల చొరవ లేనిది ఏ పని కాదు.

`టెండర్‌ ప్యాడీని కోట్లు చెల్లించుకుంటూ మేపడం అవసరం లేనిది.

`టెండర్‌ ప్యాడీకి ఇచ్చే సొమ్మే మిల్లర్లకు ఇస్తే ప్రభుత్వానికి మేలు.

`సన్న బియ్యం పథకం మరింత విజయవంతమయ్యేందుకు తిరుగుండదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          ఎంత చెట్టుకంత గాలి, సీత కష్టాలు, సీతవి, పీత కష్టాలు పీతవి అని వింటుంటాం. అలాగే రైస్‌ మిల్లర్ల కష్టాలు కూడా కనిపించనంత పెద్దగానే వుంటాయి. కాని సమాజంలో రైస్‌ మిల్లర్లు అంటే ఒక రకమైన అభిప్రాయం వుంది. ఆ అభిప్రాయం అనేది నిజమా? కాదా? అన్నది లోతుగా తెలిసిన వాళ్లకే తెలుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధానం ఒకటి తెలంగాణలో వుంది. గత ప్రభుత్వ హాయాంలో దీనిని ప్రవేశపెట్టడం జరగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయలేదు. దాంతో అది పెరిగి కొండలా మారింది. నిజానికి బకాయిలు పెద్దవి చేసుకోవాలని ఎవరూ అనుకోరు. అప్పటి ప్రభుత్వ అలసత్వమో, అధికారుల నిర్లక్ష్యమో, సంబంధిత శాఖ పెద్దల ఉదాసీనతో గాని, మిల్లర్ల బాకాయిలు బాగానే పెరిగిపోయాయి. అంటే కొన్ని వేల కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వం మారి, ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ బకాయిల గురించి పూర్తిగా బైట పడిరది. అయితే కొండలా పేరుకుపోయిన మిల్లర్ల బకాయిలు వసూలు చేయడానికి గత ప్రభుత్వం ప్రత్యేకంగా టెండర్‌ ప్యాడీ విధానాన్ని తెచ్చింది. నిజానికి అది అవసరం లేదు. కాని ఎవరు సూచించారో? ఎవరు సలహా ఇచ్చారో గాని, మొత్తానికి టెండర్‌ ప్యాడీ అనే వ్యవస్దను తెచ్చి మిల్లర్ల నెత్తిన పెట్టేశారు. అందులో ఓ నలుగురు వ్యక్తులు నాలుగు ఏజెన్సీలుగా టెండర్‌ ప్యాడీ దక్కించుకున్నారు. అప్పటి నుంచి మిల్లర్లకు వేధింపులు, ఇబ్బందులు మొదలయ్యాయి. నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెండర్‌ ప్యాడీకి చెందిన వ్యవస్ధ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమే కాదు, నిర్ణీత గడువులో వాటిని ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు కాలేకపోయినా, చేయలేకపోయినా ఆ ఏజెన్సీలు ప్రభుత్వానికి వున్న బకాయిలు చెల్లించాలి. ఇందులో మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఈ వ్యవస్ధ అనేదే వ్యర్ధం. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే సివిల్‌ సప్లై శాఖకు వేలాది మంది ఉద్యోగులున్నారు. వందలాది మంది ఉన్నతాదికారులున్నారు. పైగా ప్రతి జిల్లాలకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ వున్నాడు. వారిపై పై స్దాయిలో కూడా మంత్రిత్వ శాఖలో కూడా ఉన్నతాదికారులున్నారు. ఇంత మంది వున్న తర్వాత గత ప్రభుత్వం టెండర్‌ ప్యాడీని కాల్‌ఫర్‌ చేసింది. నలుగురు టెండర్‌ ప్యాడీ పాడారు. కాని వారికి ఎలాంటి ప్రత్యేకమైన వ్యవస్ధ వుండదు. వారికి ప్రత్యేకమైన యంత్రాంగం ఏమీ వుండదు. ఆ ఏజెన్సీలకు ఉద్యోగులు కూడా వుండరు. ఆ టెండర్‌ ప్యాడీ ఆధారపడాల్సింది మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల మీదనే ఆదారపడి పనిచేయాలి. మిల్లర్ల వద్ద బకాయిల వసూలుకు సివిల్‌ సప్లై అదికారులను వినియోగించుకుంటుంటారు. మిల్లర్ల మీద ఒత్తిళ్లు తెస్తుంటారు. ఇలా ఈ రేవంత్‌ సర్కారు వచ్చిన తర్వాత సుమారు ఓ 20వేల కోట్ల వరకు వసూలు చేశారు. ఈ టెండర్‌ ప్యాడీనికి పాడుకునేందుకు కొంత మొత్తం ఈఎండి చేస్తారు. చాల వరకు ఈ టెండర్‌ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేశారు. అయితే ఇంకా కొన్ని బకాయిలు మిగిలిపోయాయి. ఇలా మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడానికి ప్రభుత్వం టెండర్‌ ప్యాడీ వ్యవస్ధకు క్వింటాలుకు సుమారు రూ.230 వరకు ఇస్తుందని సమచారం. ఇలా కేవలం మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడానికి మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు రాయల్టీగా అందుకుంటున్నారు. ఇలా టెండర్‌ ప్యాడీకి ఇస్తున్న సొమ్మును మిల్లర్లకే ఇస్తే, మిల్లర్లు ఎంతో సంతోషంగా బకాయిలు చెల్లిస్తారు. ప్రభుత్వానికి సకాలంలో బియ్యం కూడా సరఫరా చేస్తారు. కాని ప్రభుత్వాలు ఆ పని చేయకుండా మధ్య దళారీ వ్యవస్ధను తయారుచేశారు. అది మిల్లర్లకు శాపంగా మారుతోంది. గతంలో టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వసూలు చేయగాని ఇంకా కొన్ని బకాయిలు చాలా మంది మిల్లర్ల నుంచి వసూలు చేయాల్సి వుంది. ఆ బాకాయిలను టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ కావాలనే వసూలు చేయలేదన్నది మిల్లర్ల నుంచి వినిపిస్తున్న మాట. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ కావాలనే బకాయిల వసూలుకు రాకుండా, గడువు ముగిసేలా చేసిందని మిల్లర్లు చెబుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా మిల్లర్లనుంచి బకాయిలు వసూలు చేయకుండా, కాలయాపన చేసి, ఇప్పుడు వాటికి పెనాల్టీ వేసి వసూలు చేయడానికి టెండర్‌ ప్యాడీ సిద్దమైనట్లు తెలుస్తోంది. మా దగ్గర డబ్బులున్నాయి. మేం బకాయిలు చెల్లించేందుకు ఎప్పుడూ సిద్దంగా మొర్రో అని మిల్లర్లు మొత్తుకుంటున్నా, టెండర్‌ ప్యాడీ వినలేదు. పైగా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందించి, మిల్లర్లను విలన్లను చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నిజం చెప్పాలంటే ఇక్కడ టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ అనేది మిల్లర్లకు శాపంగా మారింది. మిల్లర్ల పాలిట టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వేదించుకు తింటుందనే వాదన వుండనే వుంది. తమ చేతుల్లో పని వుండి, చేతుల్లో డబ్బులు వున్నప్పుడు బకాయిలు చెల్లిస్తామంటే తీసుకోవడం లేదనేది మిల్లర్లు చెబుతున్న మాట. తమ వద్ద డబ్బులు లేని సమయం చూసి బకాయిల వసూలు చేసేందుకు టెండర్‌ ప్యాడీ నోటీసులు ఇవ్వడం అంటే తమను వేదించడమే అని మిల్లర్లు వాపోతున్నారు. అయినా మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ పెత్తనం ఎందుకు? అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. తాము బకాయిలు చెల్లించడానికి ఈ సమయానికి కూడా సిద్దంగా వున్నామని మిల్లర్లు అంటున్నారు. అయినా టెండర్‌ ప్యాడీ కిరికిరి పెడుతుందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. తమ నుంచి పెనాల్టీలు వసూలు చేసి, ప్రభుత్వం వద్ద పేరు కొట్టేయడానికి, టెండర్‌ ప్యాడీని రెన్యువల్‌ చేసుకోవడానికి టెండర్‌ ప్యాడీ ఆడుతున్న నాటకమని మిల్లర్లు అంటున్నారు. ఏ రాష్ట్రంలోని లేని విదానాన్ని గత ప్రభుత్వం తెచ్చిన మా నెత్తిమీద రుద్దిందని, ఈ ప్రభుత్వం రద్దు చేయాలని మిల్లర్లు కోరుతున్నారు. తమకు చేతి నిండా పుష్కలంగా పని వుందని, ప్రభుత్వ బకాయిలు పూర్తిగా చెల్లించడానికి అభ్యంతరమేమీ లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా వున్న 3వేల మంది మిల్లర్లను పిలిచి మాట్లాడితే తమకున్న సమస్యలు, టెండర్‌ ప్యాడీ వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తామంటున్నారు. తెలంగాణలో ఎంతో మంది సమర్ధవంతమైన అదికారులున్నారు. వారు చేయలేని పని టెండర్‌ ప్యాడీ చేయలేదు. పైగా అధికారుల సహాకారంతోనే టెండర్‌ ప్యాడీ పనిచేయాలి. అలాంటప్పుడు ఈ వ్యవస్ధ ఎందుకు అని మిల్లర్లు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో అన్ని విషయాలు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లాల అద్యక్ష, కార్యదర్శులు కోరుతున్నారు. నేటిదాత్రితో జిల్లాలకు చెందిన మిల్లర్‌ అసోసియేషన్‌ అద్యక్ష , కార్యదర్శులు మాట్లాడుతూ టెండర్‌ప్యాడీ వ్యవస్ధ మూలంగా మొత్తం సివిల్‌ సప్లై శాఖను చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నారని అంటున్నారు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధకు కోట్ల రూపాయిలు ఇచ్చిన కూర్చుండ బెట్టి మేపడం తప్ప ఏమీ లేదని మిల్లర్లు అంటున్నారు. ఇలాంటి వ్యవస్ధ వల్ల మొత్తం మిల్లింగ్‌ వ్యవస్ధ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంటున్నారు. టెండర్‌ ప్యాడీకి ఇచ్చే రాయిల్టీ తమకే ఇస్తే, మాకుఎంతో ప్రభుత్వం మేలు చేసిందౌతుందంటున్నారు. దేశంలో ఎక్కడా లేని సన్న బియ్యం ప్రజలకు అందించే గొప్ప కార్యక్రమం అమలు జరుగుతోంది. అందుకు అవసరమైన బియ్యాన్ని సరఫరా చేయాల్సింది మిల్లర్లే. అలాంటి మిల్లర్లను ఇబ్బందుల పాలు చేస్తూ పోతే, ప్రభుత్వం అమలు చేసే సన్న బియ్యం పధకానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇంత పెద్ద వ్యవస్ధను ఓ నలుగురు వ్యక్తులు శాసిస్తూ, వేదిస్తూ పోతుంటే మిల్లర్లు అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

చెప్పు చేతుల్లో లేని ఎరువులు!?

ఎరువుల కోసం ఎదురుచూపులు!

 గొప్పలు చెప్పుకోవడానికి, అబద్దాలు ఆడడానికి, డిల్లీకి చక్కర్లు కొట్టడానికి తప్ప కాంగ్రెస్‌ పాలకులకు ఏమీ చేతగాదు. రైతులను మోసం చేసి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రేవంత్‌ సర్కారు రైతులను అరిగోసపెడుతున్నది. పదేళ్ల కేసిఆర్‌ పాలనలో విత్తనాలు, ఎరువుల కొరత ఒక్కనాడు లేదు. పండిన పంటలు కొనుగోలు ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు. కాంగ్రెస్‌ వచ్చింది. అలసత్వమే దాని నైజమని మరో సారి నిరూపిస్తోంది. ఇంత దుర్మార్గమైన పాలన సాగుతుందని ఊహించలేదని రైతులు కాంగ్రెస్‌ను తిట్టిపోస్తున్నారు. అయినా పాలకులకు చీమ కుట్టినట్లు కావడం లేదంటున్న ‘‘బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

`ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు.

`తెలంగాణ వ్యాప్తంగా రైతులు పడుతున్న గోసలు.

`ఇందిరమ్మ రాజ్యమంటే ఎరవుల కోసం లైన్లో చెప్పులు.

`ఎరువుల షాపుల ముందే రోజుల తరబడి రైతుల పడిగాపులు.

`వానలో తడుస్తూ నిలబడి రైతులు పడుతున్న తిప్పలు.

`ఎరువులు అడిగిన రైతుల మీద లాఠీ చార్జీలు.

`మార్పు అంటే ఏమిటో చూపిస్తున్న కాంగ్రెస్‌ పాలకులు.

`ఎంతో పనుగడసక్కబెడుతున్నట్లు పదే పదే పాలకుల డిల్లీ యాత్రలు

`ఎరువుల కోసం ఒక్కనాడు కేంద్రం ముందు నోరు విప్పని మంత్రులు.

`రాష్ట్రానికి ఎన్ని ఎరువులు కావాలో లెక్కలు తెలియని పాలకులు.

`అరకొర ఎరువులు తెప్పించి చేతులు దులుపుకున్నారు.

`రైతుల ఆందోళనలు పాలకుల కంటికి కనిపించడం లేదు.

`రైతుల గోడు కాంగ్రెస్‌ నాయకుల చెవికెక్కడం లేదు.

`రైతులకు భరోసా ఇచ్చే దిక్కు లేదు.

`రైతులను ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

`పదేళ్లలో ఒక్క నాడు కూడా రైతులు ఇబ్బంది పడిరది లేదు.

`కేసీఆర్‌ పాలనలో ఎరువులు అందలేదన్న మాట వినిపించలేదు.

`రైతులకు సమృద్ధిగా ఎప్పటికప్పుడు అందిన ఎరువులు.

`ఏడాది పొడవునా అందుబాటులో అంతటా అప్పుడు ఎరువులు.

`కాంగ్రెస్‌ అంటేనే కరువు కాలం.

`ఎరువులకు కూడా దిక్కులేని కాంగ్రెస్‌ ప్రభుత్వం.

`తెలంగాణకు ఇంతకన్నా లేదు దౌర్భాగ్యం.

`తెలంగాణలో అన్నింటికీ రైతులు ఎదురుచూపులే.

`కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతుల జీవితాలు ఆగమే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                          

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. రైతుల గురించి పట్టించుకోవడమే మర్చిపోయారు. పైగా ఎరువుల కోసం రైతులు ప్రశ్నిస్తుంటే అసలు రైతులే కాదని సాక్ష్యాత్తు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం దుర్మార్గం. గత పదేళ్ల కాలంలో రైతులు ఏ ఒక్క నాడు కూడా ఎరువుల కోసం ఎదురుచూసిన సందర్భం లేదు. అసలు రైతులు ఒక్కక్షణం కూడా ఎరువులు, విత్తనాలు, పిండి సంచుల కోసం ఎదురుచూసిన సందర్భాన్ని కూడా రానీయకుండ కేసిఆర్‌ సమకూర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ప్రతి ఏటా ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురుచూసిన రోజులు అనేకం వున్నాయి. అప్పుడు కూడా ఎండనక, వాననక రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడలేక, చెప్పులు వరుస క్రమంలో పెట్టి ఎదురుచూసేవారు. అలా ఎప్పుడు తమకు అవకాశం వస్తుందో, ఎన్ని రోజలుకు ఎరువులు వస్తాయో అని రోజులు లెక్కబెట్టుకుంటూ నిలబడిన రోజులే ఎక్కువ వున్నాయి. అలా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై విసిగి వేసారి వున్నారు. తెలంగాణ తెచ్చుకుంటే తమ కష్టాలు తీరుతాయని భావించారు. కేసిఆర్‌తో పాటు పద్నాలుగేళ్లు ఉద్యమం చేసి, ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న తెలంగాణలో కేసిఆర్‌ పాలనలో రైతులు ఎరువుల కోసం ఎదురుచూసే పరిస్దితి రానీయలేదు. ప్రతి కారుకు ముందే తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులను ముందే తెప్పించి పెట్టే వారు. ఏ ఒక్క రైతు కూడా తనకు ఎరువులు రాలేదని, సరిపోలేదని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కాని ఇప్పుడు ఒక్కఛాన్స్‌, ఒ క్క ఛాన్స్‌ అంటూ ప్రజలను వేడుకొని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతు సమస్యలు తెలియవు. రైతులకు ఏ సమయంలో ఏం అవసరపడతాయో తెలియదు. ఎరువులు ఎప్పుడు కావాలో తెలియదు. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఎన్ని ఎరువులు అవసరపడాయో కూడా అవగాహన లేదు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా, రైతుల స్దితిగతులను తెలుసుకోలేని అసమర్ధ ప్రభుత్వం వల్ల రైతులు తెలంగాణలో తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రైతులకు ఎరువులు అందలేదంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? గొప్పలు చెప్పుకోవడానికి, కేసిఆర్‌ ప్రభుత్వం మీద లేనిపోని అబద్దాలు ప్రచారం చేయడానికి తప్ప కాంగ్రెస్‌ పార్టీ ఎందుకూ పనికిరాదు. డిల్లీకి ఇప్పటి వరకు 50కి పైగా చెక్కర్లు కొట్టారు. ఏం సాదించారు. తెలంగాణకు రూపాయి నిధులు తేలేదు. ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది లేదు. ఆఖరుకు రైతులకు అందాల్సిన ఎరువులు కూడా మంజూరు చేయించలేని అసమర్దుల పాలనతో తెలంగాణ ఆగమైపోతోంది. రైతులు అవస్ధలు ఎదుర్కొవాల్సి వస్తోంది. రైతులను మోసం చేసి, మాయ మాటలు చెప్పి, ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టి, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. పదేళ్ల పాలనలో లేని ఎరువుల కొరత ఇప్పుడెందుకు వస్తోంది? ప్రభుత్వ పెద్దల అలసత్వం కాదా? ముఖ్యమంత్రి, మంత్రుల నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

                                                     ఇంత దర్మార్గమైన ప్రభుత్వం వస్తుందని, ఇలాంటి పరిస్ధితులు ఎదురౌతాయని ఊహించలేదని ప్రజలు బోరున విలవిపిస్తున్నారు. ఎరువుల గురించి పడుతున్న బాదలు మాకు వివరిస్తున్నారు. రైతులు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వానికి చెవి మీద పేను పారినట్లు కూడా కావడం లేదు. రైతుల ఆగ్రహం కనిపించడం లేదు. రైతుల గోస వినే ఓపిక ప్రభుత్వ పెద్దలకు లేదు. రైతుల ఆవేదనన పట్టించుకునే నాధుడే లేడు. దున్నపోతు మీద వానపడ్డట్లే ప్రభుత్వం వుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్దితి వున్నా, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ఇంకా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. పార్లమెంటు ఎదుట ధర్నాలు చేసినట్లు, నిరసనలు తెలియజేస్తే ఎరువులు రావు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఎరువులు రావన్న కనీస సోయి కూడా కాంగ్రెస్‌ నాయకులు లేదు. ఇంత కాలం ఏం చేసినట్లు? గుడ్డి గుర్రాల పండ్లు తోమారా? ఇప్పుడు పరిస్ధితి తీవ్రమైన తర్వాత మేలుకున్నారా? ఇప్పుడు నిరసనలు తెలియజేస్తే వచ్చేస్తాయా? కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, యుద్ద ప్రాతిపదికన ఎరువులు తేవాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కాంగ్రెస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ఊళ్లల్లో తిరిగే పరిస్ధితి లేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా వారి ప్రభుత్వ పెద్దల చేతగాని తనాన్ని తిట్టిపోస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గమైన పరిస్ధితులు వుండేవో మళ్లీ అవే పాత రోజులు తెచ్చారు. మార్పు, మార్పు అని రైతుల నోట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మట్టికొడుతోంది. మా హాయాంలో కేసిఆర్‌ ప్రతి ఏటా రాష్ట్రం మొత్తం అవసరమైన లక్ష్యా ముప్పైవేల టన్నుల ఎరువులు తెప్పించి రైతులకు ఇచ్చారు. దాంతో ఎక్కడా ఏ సమస్య తలెత్తిన దాఖలాలు లేవు. అలవి కాని హమీలు ఇచ్చిన అదికారంలోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు చేతులెత్తేశారు. పాలక పెద్దలకు హెలీకాప్టర్లలో తిరిగే సోకు తప్ప, రైతుల సమస్యలు తీర్చాలన్న సోయి లేదు. పరిస్తితి ఇంత ఘోరంగా వున్నప్పటికీ ఒక్క మంత్రి కూడా స్పందించిన దాఖలాలు లేవు. రైతులకు నచ్చచెబుతున్నది లేదు. పైగా ఎరువుల కోసం మాట్లాడే రైతులను రైతులే కాదంటూ మంత్రి నిందిస్తున్నారు. రైతులు రోజుల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. ఎరువులు కావాలని అడుతున్న రైతుల మీద లాఠీలు రaులిపిస్తున్నారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా వుంటుందా? అన్నం పెట్టే రైతన్నలను కూడా కొట్టడానికి ఈ ముదనష్టపు ప్రభుత్వం వెనుకాడడం లేదు. రైతుల మీద లాఠీ విరుగుతుంటే కూడా ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు తప్పని అనడం లేదు. మూడు కోతుల నినాదంలాగా అందరూ కాంగ్రెస్‌ నాయకులు కళ్లు మూసుకుంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పే నాయకుడు కాంగ్రెస్‌లో కరువయ్యారు. ఎంతో పనుగడ సగవెట్టినట్లు విమానాలు, ఎక్కుడూ, దిగుడూ డిల్లీకి పోవడు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి డిల్లీకి చెక్కర్లు కొట్టుడు తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. అరకొర ఎరువులు తెచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రైతులను మోసం చేయడానికి ఉత్తిత్తి నిరనసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే శక్తి లేదు. కేంద్రాన్ని ఒప్పించాలన్న ఆలోచన ఎవరికీ లేకుండాపోయింది. కేసిఆర్‌ హాయాంలో వానలు కురవకముందే వానకాలం పంటకు అవసరమైన రైతు బంధు పడేది. ఆ పైసలతో రైతులు ఎరువుల దుకాణాలలో రెడీగా వుండే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేవారు. సాగు వాటు మొదలుపెట్టేవారు. రైతు భరోసా ఎకరానికి రూ.7వేలు ఇస్తామని చెప్పి రైతులను నమ్మించి, మోసం చేశారు. కనీసం కేసిఆర్‌ ఇచ్చిన రూ.5వేలు కూడా ఇవ్వడం లేదు. రెండేళ్లలో రెండుసార్లు వేసి చేతులు దులుపుకున్నారు. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకుంటాయన్న నమ్మకం పోయింది. అందుకే మళ్లీ బి ఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్నింటికీ శఠగోపం పెట్టేశారు. పైగా సిగ్గులేకుండా అన్ని అమలు చేస్తున్నామని ఇంకా పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. ఇలాంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ది చెప్పే సమయం దగ్గర్లోనే వుంది. ఇక మళ్లీ తెలంగాణలో 50 ఏళ్లైనా సరే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు. ఇక ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వస్తే రైతులే తరిమి తరిమి కొడుతరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version