ఎరువుల కోసం ఎదురుచూపులు!
గొప్పలు చెప్పుకోవడానికి, అబద్దాలు ఆడడానికి, డిల్లీకి చక్కర్లు కొట్టడానికి తప్ప కాంగ్రెస్ పాలకులకు ఏమీ చేతగాదు. రైతులను మోసం చేసి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రేవంత్ సర్కారు రైతులను అరిగోసపెడుతున్నది. పదేళ్ల కేసిఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల కొరత ఒక్కనాడు లేదు. పండిన పంటలు కొనుగోలు ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు. కాంగ్రెస్ వచ్చింది. అలసత్వమే దాని నైజమని మరో సారి నిరూపిస్తోంది. ఇంత దుర్మార్గమైన పాలన సాగుతుందని ఊహించలేదని రైతులు కాంగ్రెస్‌ను తిట్టిపోస్తున్నారు. అయినా పాలకులకు చీమ కుట్టినట్లు కావడం లేదంటున్న ‘‘బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
`ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు.
`తెలంగాణ వ్యాప్తంగా రైతులు పడుతున్న గోసలు.
`ఇందిరమ్మ రాజ్యమంటే ఎరవుల కోసం లైన్లో చెప్పులు.
`ఎరువుల షాపుల ముందే రోజుల తరబడి రైతుల పడిగాపులు.
`వానలో తడుస్తూ నిలబడి రైతులు పడుతున్న తిప్పలు.
`ఎరువులు అడిగిన రైతుల మీద లాఠీ చార్జీలు.
`మార్పు అంటే ఏమిటో చూపిస్తున్న కాంగ్రెస్ పాలకులు.
`ఎంతో పనుగడసక్కబెడుతున్నట్లు పదే పదే పాలకుల డిల్లీ యాత్రలు
`ఎరువుల కోసం ఒక్కనాడు కేంద్రం ముందు నోరు విప్పని మంత్రులు.
`రాష్ట్రానికి ఎన్ని ఎరువులు కావాలో లెక్కలు తెలియని పాలకులు.
`అరకొర ఎరువులు తెప్పించి చేతులు దులుపుకున్నారు.
`రైతుల ఆందోళనలు పాలకుల కంటికి కనిపించడం లేదు.
`రైతుల గోడు కాంగ్రెస్ నాయకుల చెవికెక్కడం లేదు.
`రైతులకు భరోసా ఇచ్చే దిక్కు లేదు.
`రైతులను ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
`పదేళ్లలో ఒక్క నాడు కూడా రైతులు ఇబ్బంది పడిరది లేదు.
`కేసీఆర్ పాలనలో ఎరువులు అందలేదన్న మాట వినిపించలేదు.
`రైతులకు సమృద్ధిగా ఎప్పటికప్పుడు అందిన ఎరువులు.
`ఏడాది పొడవునా అందుబాటులో అంతటా అప్పుడు ఎరువులు.
`కాంగ్రెస్ అంటేనే కరువు కాలం.
`ఎరువులకు కూడా దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం.
`తెలంగాణకు ఇంతకన్నా లేదు దౌర్భాగ్యం.
`తెలంగాణలో అన్నింటికీ రైతులు ఎదురుచూపులే.
`కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల జీవితాలు ఆగమే!
హైదరాబాద్,నేటిధాత్రి:
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. రైతుల గురించి పట్టించుకోవడమే మర్చిపోయారు. పైగా ఎరువుల కోసం రైతులు ప్రశ్నిస్తుంటే అసలు రైతులే కాదని సాక్ష్యాత్తు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం దుర్మార్గం. గత పదేళ్ల కాలంలో రైతులు ఏ ఒక్క నాడు కూడా ఎరువుల కోసం ఎదురుచూసిన సందర్భం లేదు. అసలు రైతులు ఒక్కక్షణం కూడా ఎరువులు, విత్తనాలు, పిండి సంచుల కోసం ఎదురుచూసిన సందర్భాన్ని కూడా రానీయకుండ కేసిఆర్ సమకూర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ప్రతి ఏటా ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురుచూసిన రోజులు అనేకం వున్నాయి. అప్పుడు కూడా ఎండనక, వాననక రైతులు ఎరువుల కోసం లైన్లో నిలబడలేక, చెప్పులు వరుస క్రమంలో పెట్టి ఎదురుచూసేవారు. అలా ఎప్పుడు తమకు అవకాశం వస్తుందో, ఎన్ని రోజలుకు ఎరువులు వస్తాయో అని రోజులు లెక్కబెట్టుకుంటూ నిలబడిన రోజులే ఎక్కువ వున్నాయి. అలా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విసిగి వేసారి వున్నారు. తెలంగాణ తెచ్చుకుంటే తమ కష్టాలు తీరుతాయని భావించారు. కేసిఆర్‌తో పాటు పద్నాలుగేళ్లు ఉద్యమం చేసి, ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న తెలంగాణలో కేసిఆర్ పాలనలో రైతులు ఎరువుల కోసం ఎదురుచూసే పరిస్దితి రానీయలేదు. ప్రతి కారుకు ముందే తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులను ముందే తెప్పించి పెట్టే వారు. ఏ ఒక్క రైతు కూడా తనకు ఎరువులు రాలేదని, సరిపోలేదని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కాని ఇప్పుడు ఒక్కఛాన్స్, ఒ క్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతు సమస్యలు తెలియవు. రైతులకు ఏ సమయంలో ఏం అవసరపడతాయో తెలియదు. ఎరువులు ఎప్పుడు కావాలో తెలియదు. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఎన్ని ఎరువులు అవసరపడాయో కూడా అవగాహన లేదు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా, రైతుల స్దితిగతులను తెలుసుకోలేని అసమర్ధ ప్రభుత్వం వల్ల రైతులు తెలంగాణలో తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రైతులకు ఎరువులు అందలేదంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? గొప్పలు చెప్పుకోవడానికి, కేసిఆర్ ప్రభుత్వం మీద లేనిపోని అబద్దాలు ప్రచారం చేయడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకూ పనికిరాదు. డిల్లీకి ఇప్పటి వరకు 50కి పైగా చెక్కర్లు కొట్టారు. ఏం సాదించారు. తెలంగాణకు రూపాయి నిధులు తేలేదు. ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది లేదు. ఆఖరుకు రైతులకు అందాల్సిన ఎరువులు కూడా మంజూరు చేయించలేని అసమర్దుల పాలనతో తెలంగాణ ఆగమైపోతోంది. రైతులు అవస్ధలు ఎదుర్కొవాల్సి వస్తోంది. రైతులను మోసం చేసి, మాయ మాటలు చెప్పి, ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. పదేళ్ల పాలనలో లేని ఎరువుల కొరత ఇప్పుడెందుకు వస్తోంది? ప్రభుత్వ పెద్దల అలసత్వం కాదా? ముఖ్యమంత్రి, మంత్రుల నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నేటి దాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
ఇంత దర్మార్గమైన ప్రభుత్వం వస్తుందని, ఇలాంటి పరిస్ధితులు ఎదురౌతాయని ఊహించలేదని ప్రజలు బోరున విలవిపిస్తున్నారు. ఎరువుల గురించి పడుతున్న బాదలు మాకు వివరిస్తున్నారు. రైతులు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వానికి చెవి మీద పేను పారినట్లు కూడా కావడం లేదు. రైతుల ఆగ్రహం కనిపించడం లేదు. రైతుల గోస వినే ఓపిక ప్రభుత్వ పెద్దలకు లేదు. రైతుల ఆవేదనన పట్టించుకునే నాధుడే లేడు. దున్నపోతు మీద వానపడ్డట్లే ప్రభుత్వం వుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్దితి వున్నా, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ఇంకా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. పార్లమెంటు ఎదుట ధర్నాలు చేసినట్లు, నిరసనలు తెలియజేస్తే ఎరువులు రావు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఎరువులు రావన్న కనీస సోయి కూడా కాంగ్రెస్ నాయకులు లేదు. ఇంత కాలం ఏం చేసినట్లు? గుడ్డి గుర్రాల పండ్లు తోమారా? ఇప్పుడు పరిస్ధితి తీవ్రమైన తర్వాత మేలుకున్నారా? ఇప్పుడు నిరసనలు తెలియజేస్తే వచ్చేస్తాయా? కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, యుద్ద ప్రాతిపదికన ఎరువులు తేవాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఊళ్లల్లో తిరిగే పరిస్ధితి లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా వారి ప్రభుత్వ పెద్దల చేతగాని తనాన్ని తిట్టిపోస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గమైన పరిస్ధితులు వుండేవో మళ్లీ అవే పాత రోజులు తెచ్చారు. మార్పు, మార్పు అని రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొడుతోంది. మా హాయాంలో కేసిఆర్ ప్రతి ఏటా రాష్ట్రం మొత్తం అవసరమైన లక్ష్యా ముప్పైవేల టన్నుల ఎరువులు తెప్పించి రైతులకు ఇచ్చారు. దాంతో ఎక్కడా ఏ సమస్య తలెత్తిన దాఖలాలు లేవు. అలవి కాని హమీలు ఇచ్చిన అదికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేతులెత్తేశారు. పాలక పెద్దలకు హెలీకాప్టర్లలో తిరిగే సోకు తప్ప, రైతుల సమస్యలు తీర్చాలన్న సోయి లేదు. పరిస్తితి ఇంత ఘోరంగా వున్నప్పటికీ ఒక్క మంత్రి కూడా స్పందించిన దాఖలాలు లేవు. రైతులకు నచ్చచెబుతున్నది లేదు. పైగా ఎరువుల కోసం మాట్లాడే రైతులను రైతులే కాదంటూ మంత్రి నిందిస్తున్నారు. రైతులు రోజుల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. ఎరువులు కావాలని అడుతున్న రైతుల మీద లాఠీలు రaులిపిస్తున్నారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా వుంటుందా? అన్నం పెట్టే రైతన్నలను కూడా కొట్టడానికి ఈ ముదనష్టపు ప్రభుత్వం వెనుకాడడం లేదు. రైతుల మీద లాఠీ విరుగుతుంటే కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు తప్పని అనడం లేదు. మూడు కోతుల నినాదంలాగా అందరూ కాంగ్రెస్ నాయకులు కళ్లు మూసుకుంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పే నాయకుడు కాంగ్రెస్‌లో కరువయ్యారు. ఎంతో పనుగడ సగవెట్టినట్లు విమానాలు, ఎక్కుడూ, దిగుడూ డిల్లీకి పోవడు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి డిల్లీకి చెక్కర్లు కొట్టుడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. అరకొర ఎరువులు తెచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు రైతులను మోసం చేయడానికి ఉత్తిత్తి నిరనసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే శక్తి లేదు. కేంద్రాన్ని ఒప్పించాలన్న ఆలోచన ఎవరికీ లేకుండాపోయింది. కేసిఆర్ హాయాంలో వానలు కురవకముందే వానకాలం పంటకు అవసరమైన రైతు బంధు పడేది. ఆ పైసలతో రైతులు ఎరువుల దుకాణాలలో రెడీగా వుండే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేవారు. సాగు వాటు మొదలుపెట్టేవారు. రైతు భరోసా ఎకరానికి రూ.7వేలు ఇస్తామని చెప్పి రైతులను నమ్మించి, మోసం చేశారు. కనీసం కేసిఆర్ ఇచ్చిన రూ.5వేలు కూడా ఇవ్వడం లేదు. రెండేళ్లలో రెండుసార్లు వేసి చేతులు దులుపుకున్నారు. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇలాంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకుంటాయన్న నమ్మకం పోయింది. అందుకే మళ్లీ బి ఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్నింటికీ శఠగోపం పెట్టేశారు. పైగా సిగ్గులేకుండా అన్ని అమలు చేస్తున్నామని ఇంకా పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. ఇలాంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ది చెప్పే సమయం దగ్గర్లోనే వుంది. ఇక మళ్లీ తెలంగాణలో 50 ఏళ్లైనా సరే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు. ఇక ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే రైతులే తరిమి తరిమి కొడుతరు.