`వరద ప్రాంతాలలో విసృత పర్యటన.
`ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓదార్పు.
`సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ.
`బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ప్రజలకు సహాయ సహకారాలు.
`పార్టీ పరంగా ప్రజలకు అండగా…
`ప్రభుత్వం నిర్లక్ష్యం మీద తీవ్ర విమర్శలు.
`50 సంవత్సరాలలో తెలంగాణలో ఎప్పుడూ లేనంత వర్షం.
`కుంభవృష్టి కి కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాలు అతలాకుతలం.
`ప్రభుత్వం వెంటనే సహాకచర్యలు చేపట్టాలని డిమాండ్.
`వేలాది ఎకరాలలో పంట నష్టం.
`వందలాది ఇండ్లు నేల మట్టం.
`ఇసుక మేటలతో నిండిపోయిన పొలాలు.
`తక్షణ అర్థిక సహాయం విడుదల చేయాలని హరీష్, కేటీఆర్ ల డిమాండ్.
`బీఆర్‌ఎస్ హయాంలో తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు.
`ఎకరాకు 10 వేలు వెంటనే చెల్లించారు.
`ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలను కేసీఆర్ ఆదుకున్నారు.
`కేంద్రంపై ఆధారపడకుండా వెనువెంటనే సహాయ చర్యలు తీసుకున్నారు.
`వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ వినియోగించారు.
`వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు.
`పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
`లక్షలాది మందికి భోజన, వసతులు అందజేశారు
`ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించారు
`నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు
`హైదరాబాదులో కూడా ఇంటికి రూ. 10 వేలు అందించారు
`ఇప్పుడు ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసిందని హరీష్, కేటీఆర్ విమర్శలు
`వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపణలు
`సహాయక చర్యలు వదిలేసి ఇతర సమస్యల మీద రివ్యూలు చేశారని విమర్శలు
హైదరాబాద్,నేటిధాత్రి: నాయకులు అంటే ఇలా వుండాలి. బండికి జోడెద్దుల్లాగా పనిచేసేనాయకులు బిఆర్‌ఎస్‌కు వున్నారు. వాళ్లే బావా, బావమర్ధులు హరీష్‌రావు, కేటిఆర్‌లు. తెలంగాణ ఉద్యమ నాయకులు. ఉద్యమ బాగస్వాములు. ప్రజా సమస్యలు తెలిసిన వాళ్లు. ప్రజల జీవితాల మీద అవగాహన వున్న వాళ్లు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లే అంకితభావం వున్న నాయకులు. ఎందుకంటే వారికి నాయకత్వ లక్షణాలే కాదు, ప్రజా సారధులు అయ్యేందుకు ఉద్యమం అనేక పాఠాలు నేర్పింది. రాజకీయ బాటలు చూపింది. ప్రజల కోసం పనిచేసే తత్వాన్ని అందించింది. వాళ్లద్దరు సహజ రాజకీయ నాయకులు కాదు. కేవలం వారసత్వంతో నాయకులైన వారు కాదు. ప్రజల నుంచి పుట్టిన నాయకులు. ఉద్యమం నుంచి నాయకత్వం పురుడుపోసుకున్న వాళ్లు. అందుకే ప్రజలంటే వారికి ఎనలేని ఇష్టం. ప్రజలు కష్టపడుతుంటే చూడలేదు. రాజకీయంగా శత్రువులైనా సరే వారు ఎదురుపడితే తలవంచి నమస్కారం చేయాల్సిందే. దగ్గరకొచ్చి కరచాలనం చేయాల్సిందే. ఎందుకంటే అది వారి సభ్యత. సంస్కారం. మన్నన. అందుకే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందు మాట్లాడుకునేది ఈ ఇద్దరి గురించే. ఆ తర్వాతే ఇతర నాయకుల ప్రస్తావన. అంతలా తెలగాణ రాజకీయాల్లో మమేకమైన నాయకులు. వారికి పార్టీ గెలుపోటములతో పనిలేదు. పార్టీ ఓడిపోయినా ఏనాడు ఇంట్లో వున్నది లేదు. నిత్యం ప్రజల్లోనే వుంటారు. ప్రజల కోసమే వారు రాజకీయం చేస్తారు. తమ ప్రజల యోగక్షేమాల గురించే పదేపదే ఆలోచిస్తుంటారు. నమ్మిన వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. తన నియోకజవర్గ ప్రజలన కళ్లల్లో ఎట్టుకొని పాలిస్తుంటారు. వారికి ఏ ఆపద వచ్చినా సరే అర్ధరాత్రైనా ఆదుకుంటారు. భరోసా కల్పిస్తారు. అది ఏ రూపంలోనైనా సరే ఆపదలో వున్నవారిని ఆదుకుంటారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇంతటి పేరు సంపాదించుకున్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి చేరో కన్నుగా మారిపోయారు. పార్టీని రక్షించుకోవడంలో రెండు దిక్కులుగా బలోపేతం చేస్తున్నారు. అలాంటి నాయకులు ప్రజలు బాధ పడుతుంటే ఇళ్లలో వుండలేరు. వానొచ్చినా, వరదొచ్చినా లెక్క చేయరు. ప్రజల కోసం ఎంత కష్టమైనా వెళ్లి వారికి ధైర్యం చెబుతారు. ఆపదలోవున్న వారిని గట్టెక్కిస్తారు. సహాయ సహకారాలు అందిస్తారు. తాజాగా భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. జల విలయం సృష్టించాయి. సుమారు 50 ఏళ్ల కాలంలో ఇంతటి వర్షాపాతం రెండు రోజుల్లో నమోదైన సందర్భం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో సహజంగా అదికార పార్టీకి చెందిన నాయకులు హుటాహుటిన కార్యక్షేత్రంలోకి వెళ్తారు. ప్రజలకు అండగా నిలుస్తారు. కాని ప్రతిపక్షాలు కూర్చున్న చోట మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తుంటారు. కాని ఈ ఇద్దరు నాయకులు మాత్రం అధికారంలోవున్నా అందరకంటే ముందుగానే ప్రజల వద్దకు చేరుకుంటారు. ప్రతిపక్షంలో వున్నా అదే బాధ్యతను నిర్వర్తించారు. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రజలు ఆగమయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు గండ్లు తెగిపోయాయి. ఎప్పుడో వందేళ్ల క్రితం నిర్మాణంచేసిన పోచారం ప్రాజెక్టుపై నుంచి కూడా నీళ్లు వెళ్లాయి. అంటే అంతటి వర్షాపాతం ఎప్పుడూ ఎవరూ వినలేదు. గత యాభై సంవత్సరాల కాలంలో ఇలాంటి వర్షం ఏనాడు చూడలేని ప్రజలు చెబుతున్నారు. ఇరవై నాలుగు గంటలు కరిసిన కుంభవృష్టి మూలంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వానలు విస్తారంగా కురిశాయి. అనేక వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. కాని ప్రభుత్వం ఇంత వరకు పంట నష్టం గురించి ఆలోచించలేదంటూ హరీష్‌రావు, కేటిఆర్‌లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు వెళ్లకముందే ముంపు ప్రాంతాలను, సమస్యాత్మక ప్రదేశాలను వర్షంలోనే ఈ ఇద్దరు నేతలు విసృతంగా పర్యటించారు. ప్రజలకు భరోసా కల్పించారు. అండగా వుంటామన్నారు. పార్టీ పరంగా చేయాల్సినంత సహాయం కూడా చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలకు తోడుగా వున్నారు. బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. పార్టీపరంగా ప్రజలకు అండగా నిలిచారు.
నిజం చెప్పాలంటే ఇంతటి వర్షం 50 సంవత్సరాలలో తెలంగాణలో ఒక్క రోజులో ఎప్పుడూ కురవలేదు. కామారెడ్డి జిల్లాలో 59 సెంటీ మీటర్లు, మెదక్ లో 40 సెం.మీ. సిరిసిల్లలో 30 సెం.మీ.కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇవేమీ వారం రోజుల పాటు నిరంతరంగా కురిసినవి కాదు. రాత్రికి రాత్రే అల్లకల్లోలం సృష్టించిన వర్షాలు. అధికారులు అప్రమత్తంగా వుండాల్సిన సమయం. కానీ అధికారులు మొద్దు నిద్ర వీడలేదని చెప్పడానికి ఈ జిల్లాలే సాక్ష్యం. ముఖ్యంగా పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అంశం. కామారెడ్డి లో పోలీసులు సహాయక చర్యలలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో విపత్తు నిర్వహణ పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాదికారి ప్రజల మీద రుసరుసలాడినట్లు కూడా వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతున్నాయి. అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి. రాత్రికి రాత్రే కురిసిన వర్షానికి వేలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలన్నింటిలో కలిపి వందలాది ఇండ్లు చెడిపోయాయి. కొన్ని పాక్షికంగా దెబ్బ తిన్నాయి. కొన్ని నేల మట్టయ్యాయి. పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయు. రైతులకు తక్షణ అర్థిక సహాయం విడుదల చేయాలని హరీష్, కేటిఆర్ ల డిమాండ్.
బిఆర్‌ఎస్ హయాంలో కూడా ఇలాగే వర్షాలు కురిశాయి. ఇంత వర్షం అప్పుడు కురవలేదు. ములుగు, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో వర్షం కురిసింది. ఆ సమయంలో కేసిఆర్ తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు. అంతే కాకుండా హుటాహుటిన కేసిఆర్ వరద ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకున్నారు. తక్షణ సాయం కింద విడుదల చేసిన రూ.500 వర్షం ముగిసిన మరుసటి రోజు నుంచే రైతులకు పంచారు. తర్వాత పంట నష్టం పకడ్బందీగా అంచనా వేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకున్నారు. ఎకరాకు 10 వేలు వెంటనే చెల్లించారు. తర్వాత ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందనేదానిని నేరుగా రైతుతో మాట్లాడి పంట నష్టం అందించారు. అలా ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులను, ప్రజలను కేసిఆర్ ఆదుకున్నారు. ఆ సమయంలో కేంద్రం రావాలి, అంచనా వేయాలని కూడా ఆలోచించలేదు. కేంద్రం మీద నెట్టేసి చేతులు దులుపుకోలేదు. తర్వాత కొంత కాలానికి కేంద్ర బృందం వచ్చింది. వెళ్లిందే కానీ, కేంద్రం ఆ సమయంలో రూపాయి సాయం చేయలేదు. అయినా కేసిఆర్ ఏనాడు కేంద్రాన్ని నిందించలేదు. అందుకే కేంద్రంపై ఆధారపడకుండా వెనువెంటనే సహాయ చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ వినియోగించారు. ఎంతో మందిని కాపాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించారు. ఖమ్మం పట్టణం వర్షాలతో అతలాకుతలమైంది. కేసిఆర్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజలను పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో లక్షలాది మందికి భోజన, వసతులు అందజేశారు. ఖమ్మం ఆ రోజులను ఇంకా మర్చిపోలేరు. అర్థరాత్రులు కూడా బిఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు సహాయక చర్యలలో పాలు పంచుకున్నారు. రాత్రంతా ప్రజలతోనే వున్నారు. మేమున్నామని బిఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు ప్రజలకు భరోసా కల్పించారు. వర్షం తగ్గిన తర్వాత కాలనీలలో వున్న నిలిచిపోయిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేశారు. తర్వాత ప్రజలను తిరిగి వారి వారి ఇళ్లకు చేర్చారు. అంతే కాకుండా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు. హైదరాబాదలో 2019లో రాత్రికి రాత్రి 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అప్పటికి అదే అత్యధిక వర్షపాతం. ఆ సమయంలో హైదరాబాదు వాసులందరికీ కేసిఆర్ ఇంటికి 10 వేలు పంపిణీ చేశారు. కేటిఆర్ మున్సిపల్ మంత్రిగా మోకాలు తోతు నీళ్లు, బురదలో మూడు రోజుల పాటు నిర్విరామంగా కాలనీలు తిరిగారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. వరద నివారణ చర్యలు చేపట్టారు. ఇక కరోనా కాలంలో కేటిఆర్ చేసిన సేవ హైదరాబాదు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. హరీష్ రావు తన నియోజకవర్గమే కాదు, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికీ వైద్య సాయం అందించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆ సమయంలో అన్న హరీషన్న నా ప్రాణాలు కాపాడన్నా అని ఓ జర్నలిస్టు వీడియో పెడితే వెంటనే వైద్య సదుపాయం కల్పించారు. తన నియోజకవర్గ ప్రజలందరికీ హరీష్ రావు ప్రొటీన్ పుడ్‌తో కూడిన కిట్‌ను అందజేశారు. హరీష్ రావు కరోనా తో బాధపడుతున్నా తన ప్రజలకు సేవలందించారు. నాయకులంటే అలా వుండాలని ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కోట్ల రూపాయల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలా బిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేసిన సేవలు అంతా ఇంతా కాదు. అలాంటి అనేక ఉపద్రవాలను చూసిన హరీష్ రావు, కేటిఆర్ లు అధికారంలో లేకపోయినా ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసిందని హరీష్, కేటిఆర్ విమర్శలు చేశారు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. సహాయక చర్యలు వదిలేసి ఇతర సమస్యల మీద రివ్యూలు చేయడమేమిటని ప్రశ్నించారు. వెంటనే ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.