`దేశ వ్యాప్తంగా రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు.
`క్రమ క్రమంగా పెరుగుతున్న రాహుల్ క్రేజ్.
`జోడో యాత్రతో రాహుల్ బలం పెరిగింది.
`బిహార్ ఓట్ యాత్రతో రాహుల్ గ్రాఫ్ మరింత పెరిగింది.
`బిహార్ లో రాహుల్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
`ప్రజలు వేలాది మందిగా రాహుల్ సభలకు హజరౌతున్నారు.
`మొదటి సారిగా రాహుల్ ను చూసి బీజేపీ భయపడుతోంది.
`ఓట్ల గల్లంతుపై రాహుల్ వాదనకు ప్రజల మద్దతు కనిపిస్తోంది.
`రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడైన తర్వాత దూకుడు పెరిగింది.
`ఓట్ చోరీ అంశం తెరమీదకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఆయనతో కలిసి నడుస్తున్నాయి.
`బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
`ఎన్డీయే కూటమి మీద బిహార్ లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
`ఈ పదేళ్లలో బీజేపీ, జెడీయూ సంకీర్ణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోతోంది.
`ప్రతిపక్షాలను విమర్శించడమే ప్రచారాస్త్రం చేసుకుంటున్నారు.
`ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ బిహార్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
`బీజేపీి మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని అర్థమౌతోంది.
`ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌కు మద్దతు పెరిగింది.
`బీహార్ లో తేజస్వీ యాదవ్ నాయకత్వాన్ని 43 శాతం ప్రజలు మద్దతు?
`సిఎం. నితీష్ కుమార్ కు కేవలం 18 శాతం మద్దతు?
`సర్వే సంస్థలన్నీ ఇండియా కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి.
`బిహార్ లో వైద్య శాఖ మంత్రిని ప్రజలు తరిమేయడం పెద్ద సంచలనంగా మారింది
హైదరాబాద్,నేటిధాత్రి:
పెరుగుతున్న రాహుల్ ఇమేజ్ విపరీతంగా పెరుగుతోంది. రాహుల్ గాంధీ లాంటి నాయకత్వం తమకు కావాలని బ్రీపేజలు కోరుకుంటున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కూడా ..పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా పదకొండేళ్ల క్రితం నుంచి రాహుల్ గాంధీని పప్పు అంటూ బిజేపి విపరీత ప్రచారం చేస్తూ వచ్చేది. కాని ఏనాడు రాహుల్ గాంధీ దానిపై స్పందించలేదు.చింతించలేదు. డిఫెన్స్‌లో పడలేదు. పప్పు అనేది దేశమంతా తీసుకునే ఆహారం. మన దేశంలో బలమైన ఆహారం. అంతటి దానితో తనను పోల్చడం తనకు ఆనందమే అని బిజేపి నోరు మూయించారు. ఒకప్పుడు యువ రాజు అంటూ కీర్తించిన మీడియా కూడా రాను రాను రాహుల్‌కు స్పేస్ లేకుండా చేశారు. రాహుల్ గాంధీ వార్తలు రాయడానికి కూడా ఇష్టపడలేదు. రాహుల్ గాంధీ ఎంత మంచి సమచారాన్ని మీడియాకు అందజేసినా కూడా మీడియా పట్టించుకునేది కాదు. అసలు రాహుల్ చేసే వ్యాఖ్యలను కూడా మీడియా వక్రీకరించిన రోజులున్నాయి. బిజేపి ఏది చెబితే అదే మీడియా రాసుకున్న రోజులున్నాయి. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీ , పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమంటూ ఆరోపణలు చేసేవారు. కాశ్మీర్ అంశంలో ప్రతీసారి, ప్రతి అంశాన్ని గాంధీకుటుంబానికి ఆపాదిస్తూ బిజేపి చేస్తూ వచ్చేది. అయినా రాహుల్ ఎంతో విజ్ఞతలోనే రాజకీయాలు చేసేవారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసిన సూచనలు అప్పట్లో బిజేపి ప్రభుత్వం ఎంతో తేలిక చేసి మాట్లాడేది. రాహుల్‌కు ఏం తెలుసు అన్నట్లు మాట్లాడేది. కరోనా అనేది దేశంలోకి వస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. వెంటనే మన దేశానికి వచ్చే విమానాలను వెంటనే ఆపేయాలని సూచించారు. కాని రెండు నెలల పాటు అప్పడు బిజేపి ప్రభుత్వం కాలయాపన చేసింది. దాని పర్యవసానం దేశమంతా చూసిందే. తర్వాత వ్యాక్సిన్ విషయంలోనూ రాహుల్ గాంధీ చేసిన సూచనలు బిజేపి ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. వ్యాక్సిన్ విషయంలో తొందరపాటు వద్దని రాహుల్ సూచించారు. వాక్సిన్ అనేది 140కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నామంటూ బిజేపి గొప్పగా ప్రచారం చేసుకున్నది. కాని మన దేశంలో అనేక రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సిన్‌లను దేశ వ్యాప్తంగా ఉచితంగా ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే మొదలు పెట్టాయి. ప్రతి ఏడాది రెండుసార్లు పోలియో వ్యాక్సిన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం కూడా మొదలుపెట్టింది. దేశంలో ఇప్పుడున్న విద్యా, వైద్య, వైమానిక, రసాయిన, దేశ భద్రత, సాగు నీటి ప్రాజెక్టులు, పరిశోధనలు, ఆహర విప్లవం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో కనిపించే సాక్ష్యాలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు చేపట్టినవే. రాహుల్ గాందీ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఆర్ధిక విద్యను అధ్యయనం చేశాడు. దేశ ఆర్ధిక పరిస్దితులే కాదు, ప్రపంచ ఆర్ధిక పరిస్ధితులపై పూర్తి అవగాహన వున్న నాయకుడు. అయినా ఆయనకు బిజేపి ఏనాడు విలువ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆయన ప్రధాని పదవే కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారు. కాని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు. దేశాన్ని పాలించాలంటే తనకు ఇంకా ఎంతో అనుభవం రావాలని అన్నారు. కేంద్రంలో కనీసం మంత్రి పదవి కూడా తీసుకోలేదు. అది అంకితభావం వున్న నాయకుడు. ఏదో ఒక రోజు ప్రజలు రాహుల్ గాందీ కావాలని కోరుకునే రోజు వస్తుందని అనుకున్నాడు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. స్వాతంత్య్ర భారతావనిలో దేశమంతా పాదయాత్ర చేసిన నాయకుడిగా చరిత్రకెక్కారు. దేశ స్వాతంత్య్ర కాలంలో చాలా మంది పాదయాత్రలు చేశారు. ప్రజలను చైతన్యం చేశారు. కాని డెబ్బై సంవత్సరాల కాలంలో ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే దేశమంతా పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకున్నారు. ఇక ఓట్ చోరి అనే విషయంతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ సంచలనం సృష్టించారు. దాంతో బిజేపిపై ప్రజలకు వున్న మబ్బులు తొలగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీకి పెరుగుతున్న మద్దతు విపరీతంగా పెరుతోంది. తాజాగా బిహార్ ఎన్నికల యాత్రలో రాహుల్ సభలకు ప్రజలు స్వచ్చంధంగా వేలాదిగా వస్తున్నారు.. ముఖ్యంగా యువతలో ఓ రేంజ్‌లో రాహుల్‌కు క్రేజ్ పెరుగుతోంది. 2014కు ముందు ప్రదాని మోడీకి వచ్చినట్లే ఇప్పుడు రాహుల్‌కు కూడా కలిసి వస్తోంది. బలమైన ప్రతిపక్షం వుంటే తప్ప రాజకీయాల్లో ఇలాంటి మార్పులు రావని తేలిపోయింది. దేశ ప్రజలు 2014,2019లలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేశారు. దాని పర్యవసనాలు అనుభవించారు. నోట్ల రద్దు నుంచి మొదలు, జిఎస్టీ, ధరల మోతలు భరించారు. రెండుసార్లు బలమైన కేంద్ర ప్రభుత్వం బిజేపి రూపంలో ఏర్పాటైంది. ఆ ఏక పార్టీ పాలన విదానంలో ఒంటెద్దు పోకడలు కనిపించాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు లేకుండాపోయారు. ప్రతిపక్షాల వాదనలు పత్రికలు కూడా రాయలేకపోయాయి. ప్రధాని మోడీ చెప్పిందే నిజమని నమ్మారు. బిజేపి ఆలోచనలే దేశానికి శ్రీరామరక్ష అనుకున్నారు. రాహుల్ గాందీని పప్పు అంటూ నిందించారు. రాహుల్ ది ఏ కులమంటూ ఎద్దేవా చేశారు. లేనిపోని కల్పిత కథలన్నీ చెప్పారు. జనాన్ని నమ్మించారు. డామిట్ కథ అడ్డం తిరుగుతోంది. రాహుల్ నాయకత్వం, సమర్ధత మీద చర్చ మొదలైంది. దేనికైనా సరే సమయం రావాలి. కావాలి అంటారు. ఇప్పుడు అదే నిజమౌతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్రతిహాతంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూశారు. బిజేపిని బలపర్చారు. కాంగ్రెస్‌కు సమాంతరంగా గెలిపిస్తూ వచ్చారు. ఆఖరుకు కాంగ్రెస్‌కు కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశారు. ప్రజలు ఎంతైనా విజ్ఞులు. తాము కోరుకున్నట్లు పాలన సాగాలనుకోవడం ప్రజల నిర్ణయం. ప్రజా నిర్ణయమే అంతిమ తీర్పు. అందుకే 2014 నుంచి బిజేపికి దేశ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రాలలో కూడా కాషాయజెండా ఎగురవేశారు. ఇప్పుడు బిజేపికి గడ్డు కాలం మొదలైంది. గత ఎన్నికల్లో అప్‌కీ బార్ బిజేపి సర్కార్ అనే నినాదాన్ని జనం సంపూర్ణంగా విశ్వసించలేదు. బిజేపికి మద్దతు తెలపలేదు. కాకపోతే బిజేపిని అధికారం దరిదాపుల్లోకి తెచ్చి వదిలిపెట్టారు. దాంతో మళ్లీ సంకీర్ణ సర్కారు కేంద్రంలో ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి బిజేపి అవస్దలు ఎదుర్కొంటోంది. గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి బిజేపికి ప్రశ్న అనే పదమే వినిపించలేదు. బిజేపిదాకా ఆ పదమే చేరుకోలేదు. ఓసారి బిజేపికి అవకాశమిద్దామనుకున్న ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రశ్నలు వినిపించుకోలేదు. దానికి తోడు బిజేపి చెప్పిన ప్రతి విషయాన్ని నిజమే అని నమ్మారు. దేశం కోసం, ధర్మం కోసం అని బిజేపి చెప్పే మాటలను ప్రజలు బలంగా నమ్మారు. ముఖ్యంగా కశ్మీర్ అంశంలో ఎప్పటి నుంచో సాగుతున్న, నానుతున్న సమస్యలన్నీ బిజేపి వల్లనే తీరుతాయని జనం నమ్మారు. అది ప్రధాని మోడీ నేతృత్వంలోనే సాధ్యమౌతుందనుకున్నారు. కాని ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఎప్పుడైతే పహల్గావ్ దాడి తర్వాత ప్రజల్లో బిజేపిపై వున్న నమ్మకం క్రమంగా సడలుతోంది. ఎనుకున్న ప్రజలే ప్రశ్నించొద్దనే రాజకీయ పార్టీని ప్రజలే మళ్లీ పక్కన పెడతారన్న విషయాన్ని పార్టీలు మర్చిపోతున్నాయి. అందుకే పహల్గావ్ దాడిపై ఎవరూ మాట్లాడకుండా ఎత్తులు వేశారు. కాని కేంద్రంలో ఈసారి బలమైన ప్రతిపక్షం వుండడంతో అసలు విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో బిజేపిపై ప్రజలు ఎంత కోపంతో వున్నారో కూడా కనిపిస్తోంది. పహల్గావ్ దాడి విషయంలో బిజేపి వేసిన విన్యాసాలు ప్రజలు నిషితంగా గమనిస్తూ వచ్చారు. బిజేపి చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎలాంటి పొంతన వుండడం లేదని గ్రహించారు. పైగా పాకిస్తాన్‌తో యుద్దం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీజ్ ఫైర్ ప్రకటన భారతీయులను ఆశ్చర్యాలకు గురి చేసింది. ఆపరేషన్ సింధూర్ అని పేరుతో రంగంలోకి దిగగానే దేశ ప్రజలంతా ఎంతో సంతోషించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెబుతారని ఊహించారు. కాని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్‌ను ప్రకటించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి బిజేపిపై ప్రజల్లో ఒక రకమైన భావన మొదలైంది. తాజాగా ఆపరేషన్ మహాదేవ్ జరిపి, ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెప్పినా జనంలో స్పందన కరువైంది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదని చెప్పిన కేంద్రం, మళ్లీ ఆపరేషన్ మహదేవ్ ఎప్పుడు తెచ్చింది? అనే అనుమానంలోనే వున్నారు. ఇలా వరుస సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ గత పాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ద సమయంలో ఇందిరాగాంధీ చూపిన చొరవపై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆమె అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రీగన్‌తో నేరుగానే తమ దేశ రాజకీయ, సార్వభౌమత్వంలో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌ను రెండుగా చీల్చేసింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేసింది. ఆ సమయంలో ప్రపంచమంతా ఇందిరాగాందీని కొనియాడిరది. బిజేపి నాయకుడు మాజీ ప్రదాని అటల్ బిహారి వాజ్‌పాయ్ సైతం ఇందిరాగాందీని అపర కాళికా దేవి అంటూ కీర్తించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు గత పది సంవత్సరాలుగా ఎంత చప్పగా సాగాయో, ఇప్పుడు అంత హాట్‌గా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందిరాగాంధీ ధైర్యంలో కనీసం సగం వున్నా అమెరికా అద్యక్షుడు ట్రంప్ చెప్పింది అబద్దమని చెప్పంటూ ప్రతిపక్ష నేత రాహుల్ సవాలుతో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. ప్రతిపక్షాలు అదికార బిజేపిని చెడుగుడు ఆడుకుంటున్నాయి. అయితే రాహుల్ గాంధీ గత ఎన్నికల ముందు రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలోనే దేశమంతా ఆయనపై కొంత నమ్మకం మొదలైంది. తర్వాత ఆయన ప్రజలకు చేరువౌతున్న తీరు దేశమంతా గమనిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతోంది. మన దేశంలో ఏం జరుగుతుందో ఆయన ఎంత చెప్పినా జనం వినడానికి సిద్దంగా వున్నా, ప్రచార సాధనాలు సహకరించలేదు. కాని ఇప్పుడు ఆయన ఏది చెబితే అది జనం వింటున్నారు. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? కోవిడ్ సమయంలో రాహుల్ ఏం చెప్పారు. అదే ఎలా నిజమైంది? రాజ్యాంగ స్పూరిని గురించి వివరించడం అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంగ్లీషు వల్ల లాభమేమిటి? హిందీని బలవంతంగా రుద్దితే ఏం జరుగుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపై రాహుల్ చెప్పే ప్రతి మాట జనానికి చేరుతోంది. పైగా ప్రతిపక్షాలు కూడా రాహుల్ బాటలోకి వచ్చేస్తున్నారు. దాంతో రాహుల్ ఇమేజ్ ఇటీవల కాలంలో అమాంతం పెరిగింది.