శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి,శివ మార్కండేయ, సుబ్రహ్మణ్య స్వామి,పంచముఖ ఆంజనే యస్వామి,ఆదిత్యాది నవగ్రహ దేవాలయం సముదాయము సుందరముగా నిర్మాణము చెయ్యడం జరిగింది. స్వామి వారిని దర్శింప వచ్చిన భక్తుల పట్ల కోరిన కోర్కెలు కొంగు బంగారం అగుచూ ప్రముఖ క్షేత్రం నందు ఒకటిగా ఈ దేవాలయము పరిగణించ బడుతున్నది ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుట ద్వారా తెలంగాణ రాష్ట్రం నందు హనుమకొండ జిల్లాలోని శాయంపేట గ్రామం యొక్క విశిష్టతను చాటు తుంది. ప్రతిష్ట జరిగే ద్వాదశ సంవత్సరములు అగుచున్న సందర్భంలో స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ బుధవారం తేదీ 30- 04- 2025 నుండి 3-05-2025 షష్టి శనివారం వరకు ద్వాదశ వార్షికోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుచున్నవి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని ప్రజలను కోరారు

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గాంధీ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల రాణి నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు డాక్టర్లు ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఈ దాడితో భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి

* అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

 

ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు.!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసి పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల మామిడిగి గ్రామానికి చెందిన బక్క రెడ్డి పెంట రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి నాయకత్వములో పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో చంద్రన్న,తుక్క రెడ్డి,మాణిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా రెడ్ క్రాస్ సేవలు.

గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా రెడ్ క్రాస్ సేవలు ……
చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపు విజయవంతం..
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సందర్శన… క్యాంపు పట్ల హర్షం…

రామయంపేట ఏప్రిల్ 25 నేటి ధాత్రి (మెదక్)

 

 

గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం నాడు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరoలో పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.. చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.
అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు deme యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా చిన్న శంకరంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మేడ్చల్ మెడిసిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ప్రవళిక, సంజన, నీరజ, దీక్షిత, సుప్రియ, సౌజన్య, హర్ష, తేజస్విని, hamsika
శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా పి హెచ్ సి కి చెందిన డాక్టర్లు B.Hruday, మెడికల్ staff కుమారి,నందిని,బుజ్జి,Mala , మాధవి,లలిత,రేణుకా పాల్గొన్నారు.

 

Medical camp

అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుమారు 100 మందికి పైగా రోగులు వివిధ రకాల పరీక్షలను చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి టి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, రేషన్ డీలర్ తోట శ్రీనివాస్ గుప్తా, మద్దెల సత్యనారాయణ, జీడి తిరుపతి, N. మాధవరెడ్డితొ పాటు గ్రామస్తులు పాల్గొన్నారు
……………
రెడ్ క్రాస్ సేవల పట్ల ఎమ్మెల్యే హర్షం..
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. రెడ్ క్రాస్ సంస్థ వారు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.. చిన్న శంకరంపేట lo వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తుlo చేపట్ట బోయే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభను గ్రామ గ్రామన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్టణాలు దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డుసృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి ఈ నేల 27 న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సుమారు 1300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయిని బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్ తెలిపారు. నడికూడ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి :

 

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ మరుమళ్ళ కొమురయ్య గారి తల్లి స్వర్గస్తులైన సమాచారం తెలిసిన వెంటనే వచ్చి భౌతికాయానికి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం కల్పించి వారికి అండగా ఉంటామని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు లక్ష్మక్క పల్లి మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మి రెడ్డి గారి తండ్రి స్వర్గస్తులైన తెలుసుకున్న వెంటనే వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట బిజెపి నాయకులు మాజీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి,మల్లారెడ్డి ,శ్రీనివాస్ యాదవ్, ఉడుత కుమార్,కొండల్ రెడ్డి, అప్పన కొమురయ్య, ఈదునూర్ కుమార్ ,సమ్మిరెడ్డి,శంకర్, మోటం శ్రీనివాస్, పల్లె రాయమల్లు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్.!

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్ మృతులకు సంతాపం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కాశ్మీర్ పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన 27 మంది హిందూ బంధువులకు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగినది. ఈ ఉగ్రదాడి దారుణమైన దుశ్చర్య గా భావిస్తూ అన్ని కులాలను సమానంగా సోదర భావంగా భావించే ఈ భారత దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఇకముందు హిందువుల పైన ఇలాంటి దాడులు జరిగితే ఊరుకోమని తెలియపరుస్తూ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన హిందూ బంధువులకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు మనమందరము బాసటగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి,నరెడ్ల రాఘవరెడ్డి,గుల్లపల్లి నరసింహారెడ్డి,డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్ రెడ్డి, కూతురు వెంకట్ రెడ్డి లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు, దుండ్రా జలజా రెడ్డి, ముసుకు తిరుపతిరెడ్డి, ఏమి రెడ్డి కనక రెడ్డి, జువ్వెంతుల, లక్ష్మారెడ్డి మంద బాల్ రెడ్డి, కోశాధికారి- ఎడ్మల హనుమంత రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ – భీమ నీలిమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి కరెడ్ల మల్లారెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, గడ్డం సత్యనారాయణ రెడ్డి,బిచ్చల రాజిరెడ్డి, సంతాపం ప్రకటించడం జరిగినది.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ.!

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ
మృతుల కుటుంబలకు సంతాపం

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యం లో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసన గా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌక్ లో నిన్న రాత్రి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న భారత్ లోని సెక్యులర్ పార్టీలను రాజకీయంగా అణిచివేయాలని హిందువులంతా ఒక్కటై పోరాడితేనే హిందువులకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా సంఘాటీతంగా ఒక్కటి కావాలని పిలుపునిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న సెక్యులర్ పార్టీలను అంతం చేయాలని తెలియజేస్తూ నిన్న ఈ మరణకాండలో మృతి చెందిన కుటుంబలకు వారికి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా జననివాళి అర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్, ఉరవకొండ రాజు,జ్ఞాన రాంప్రసాద్,దూడం శివప్రసాద్ ,దుమాల శ్రీకాంత్,కోడం రవి,మోర రవి,పండగ మాధవి,వైశాలి హరీష బండారి వెంకటేశ్వర్లు సురేష్ దూడం సురేష్ ఇంజాపూర్ మురళి, రాజేందర్ మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.!

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.

బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆ విద్యార్థినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. ఆమె మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ అన్నారు. విద్యార్థిని ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఒక్క అధికారి కూడా రాకపోవడం దురదృష్టం అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వేంకటేశ్వర గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కృష్ణ, నవీన్, నర్సింగ్, శీతల్, సంగీత, స్రవంతి, కమల, దుర్గం ఎల్లయ, వాణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి.!

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి

ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యం లో భవ సంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రం లో జరిగే గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను ఐక్య వేదిక బృందం కలిసి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి అందరూ హాజరు అయి విజయవంత చేయాలి అని పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భముగా లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో జరిగే సప్త భవాని మాతలు , 6 గురు జాతి గురువులు, బాలాజీ మహారాజ్, భవసంగ్ మహారాజ్, బుడియ బాపు, లింగ మసంద్, లోక మసంద్ ల భోగ్ భండార్ కార్య క్రమానికి జాతి గురువులు, సాధువులు, సంతువులు, బావాలు, భగత్ ల చేతుల మీదుగా మాత్రమే జరిగే భోగ్ కార్య క్రమానికి హాజరు అయ్యి శనివారం ఏప్రిల్ 26 న జరిగే మాకుల భవసంగ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామి వారి బండ్లు తిరిగే కార్య క్రమానికి అందరూ హాజరు అవ్వాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్య క్రమం లో జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త అలాగే పూజారుల సంఘం నాయకులు బానోత్ సీతారాం నాయక్,రవి నాయక్ గూగులోత్ ,మరిపెడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, యుగంధర్ రెడ్డి,భట్టు నాయక్, మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు బోడ రవి నాయక్ జిల్లా విద్యార్థి విభాగం సమన్వయ కర్త బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం

కనువిందు చేస్తున్న ముదిగుంట రహదారి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట, కాన్కూర్ మార్గంలో కనువిందు చేస్తున్న రహదారి వనాలు.

ముదిగుంట రహదారి నుండి ప్రయాణించే వాహనాదారులు ఈ ప్రకృతి వనాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇంత మండు వేసవి కాలంలో కూడా ఈ చెట్లు ఒకదానికి ఒకటి అల్లుకొని చల్లదనాన్ని ఇస్తూ రహదారి వెంట పూలవనంతో చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఇలాంటి ఆహ్లదమైన వాతావరణాన్ని పకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.

టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్.!

టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ లో వన్య ప్రాణుల కోసం నీటి కుంట ఏర్పాటు

మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్

జైపూర్  నేటి ధాత్రి:

 ఎండలు తీవ్రంగా ఉండడం తో ప్లాంటేషన్ లలో,అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ పేర్కొన్నారు.జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలో ఉన్న టీజీ ఎఫ్ డీసీ నీలగిరి ప్లాంటేషన్ లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు.ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండే విధంగా తవ్వించి నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్,సిబ్బంది పాల్గొన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.!

హిందూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

వేద పాఠశాల విద్యార్థులు హిందూ ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని, అదే మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితా దేవి అన్నారు. ఝరాసంగం మండలం మరిదిపూర్ లోని దత్తగిరి ఆశ్రమంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ తో కలిసి ఈనెల 29న జరిగే శనీశ్వర జయంతి కరపత్రాలను ఆవిష్కరించారు.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ.

జమ్మూ కాశ్మీర్ పహల్గం లో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలో ఉగ్రమూఖల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు అశ్రునివాళి అర్పించి, కొవ్వాత్తుల ర్యాలీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హిందువులరా మేల్కొండి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్థాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ముక్యంగా హిదువులను గుర్తించి మరి దాడి చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్, గడ్డం జీవన్ రెడ్డి,దండిక లింగం,బూమయ్య,సంతారం,రాజేష్,శ్రీకర్,ప్రసాద్,గణేష్,శివ, శ్రీహరి, మల్లేష్,గంగమల్లయ్య, చారి నాయకులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు సురబీ నవీన్ పాల్గొన్నారు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు.!

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు నీయులు కొనింటి మానిక్ రావు గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడం పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,తాజా మాజీ సర్పంచులు చిన్నారెడ్డి, విజయ్, నాయకులు లక్ష్మణ్ యాదవ్,బాబు మియ తదితరులు.

ధర్మం వైపు వెళ్ళండి.!

ధర్మం వైపు వెళ్ళండి…!

– జహీరాబాద్ సివిల్ కోర్ట్ జడ్జ్

జహీరాబాద్  నేటి ధాత్రి:

ఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలు, దత్తాత్రేయ స్వామి, పంచవృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 29న శనైశ్వర స్వామి జయంతి కరపత్రాన్ని విడుదల చేశారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version