జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు పాఠశాలలో శుక్రవారం ఉదయం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేంకటయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఝరాసంగం విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం ఏకకంఠం
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికి జాతీయ గౌరవం ఐక్యతను పెంచుతున్న వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం గేయ ఆలాపనలో విద్యార్థులు తో సహా పోషక మహాశయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల కరస్పాండెంట్ బి.నాగన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,
