సంకేపల్లి నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే యాదయ్య…

సంకేపల్లి నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే యాదయ్య

నేటిధాత్రి, శంకర్ పల్లి:

 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంకేపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ గా దేశ్పాండే శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా ఉప్పరి రవీందర్ సగర, వార్డ్ మెంబర్లు గా తాళ్లపల్లి రుక్కమ్మ, కవ్వగూడెం మల్లేశం యాదవ్, ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సగర, తోకల గోవర్థన్ యాదవ్, తోకల సబిత పరమేశ్వర్ యాదవ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

 

 

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజాప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం కోసం కృషి చేస్తానని, గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహమ్మద్ సమియోద్దీన్..

సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహమ్మద్ సమియోద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామ ప్రజలు చాలా తెలివైనవారు గ్రామాలు అభివృద్ధి చేసేవారినే ఎన్నుకుంటారు.
ప్రముఖ సామాజికవేత్త మనూర్ మండల బెల్లాపూర్ గ్రామ మహమ్మద్ సమియోద్దీన్
మండల పరిధిలోని తమ గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త సమియోద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ సమియోద్దీన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకులు ప్రజలు ఎంతో చైతన్యవంతులని గ్రామాలను అభివృద్ధి చేసే నాయకులను సర్పంచ్ గా వార్డ్ మెంబర్లు గా ఎన్నుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

570 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు…

570 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కాటారం సబ్ డివిజన్ లోని కాటారం,ముత్తారం, మహాదేవపూర్, కొయ్యూరు గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తిస్థాయి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను విడిచిపెట్టరాదని ఆదేశించారు. రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద లేదా రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఏంసీసీ) అమలులో ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎలాంటి విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇప్ప పల్లి సర్పంచ్ గా మామిడిగి కవిత ఘన విజయం..

ఇప్ప పల్లి సర్పంచ్ గా మామిడిగి కవిత ఘన విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఇప్ప పల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో మామిడిగి కవిత 57 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్ప పల్లి గ్రామంలో మామిడిగి కవిత ఘన విజయాన్ని సూచిస్తున్నాయి.

నల్లబెల్లి మండలంలో బిఆర్ఎస్ హవా…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-15T125709.956.wav?_=1

 

నల్లబెల్లి మండలంలో బిఆర్ఎస్ హవా.

#16 సీట్లతో బీఆర్ఎస్ అగ్రస్థానం.

#12 సీట్లతో సరిపెట్టుకున్న అధికార పార్టీ..

#మాజీ ఎమ్మెల్యే పెద్ది గ్రామంలో ఘనవిజయం సాధించిన నాగవెల్లి జ్యోతి ప్రకాష్.

#సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

#ఒక సర్పంచ్ తో బోణి కొట్టిన బిజెపి.

నల్లబెల్లి, నేటి ధాత్రి

 

వరంగల్ జిల్లా నల్లబెల్లి: మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ హవ చూపించుకున్నది .29 సర్పంచ్ స్థానాలకు గాను12 గ్రామపంచాయతీలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకున్నది. కాగా భాజపా ఒక సర్పంచ్ సీటుతో బోణి కొట్టగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 16 స్థానాలో గెలుపొంది అగ్రస్థానంలో చేరుకున్నది . ఈ నేపథ్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగవల్లి జ్యోతి ప్రకాష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.గ్రామాలలో సుపరి పరిపాలన అందించే సర్పంచులు వీరే.
1, నల్లబెల్లి, నాగవెల్లి జ్యోతి బీఆర్ ఎస్.
2, ఆసరవెల్లి, కెలోతు రాజ్ కుమార్. బీఆర్ఎస్.
3, మేడపల్లి. అర్రె0 సాంబయ్య. బీఆర్ఎస్.
4, గొల్లపల్లి. బాదావత్ మంజుల. బీఆర్ఎస్.
5, అరువయపల్లి. మాలోతు రామ్ లాల్. బీఆర్ఎస్.
6, రాంపూర్. పురం భాస్కర్. బీఆర్ఎస్.
7, దస్తగిరి పల్లె. పులి రమేష్ గౌడ్. బీఆర్ఎస్.
8, శనిగరం. ఊట్కూరి అశోక్ గౌడ్. బీఆర్ఎస్.
9, గోవిందపూర్. పాడియా రజిత. బీఆర్ఎస్.
10, మూడు చెక్కలపల్లి. సపా వట్ కవిత. బీఆర్ఎస్.
11, కన్నారావుపేట. పల్నాటి మూర్తి. బీఆర్ఎస్.
12 ముచ్చింపుల తండ. మచ్చిక రవీందర్ గౌడ్. బీఆర్ఎస్.
13, బజ్జు తండా. జాటోతు రవి చిన్న. బీఆర్ఎస్.
14, లెంకలపల్లి. కస్తూరి రవీందర్. బీఆర్ఎస్.
15, రుద్రగూడెం. మంద సుజాత. బీఆర్ఎస్.
16, నారక్క పేట. దండేమ్ సంపత్. బీఆర్ఎస్.
17, రంగాపురం. ఓరుగంటి మాధురి. బిజెపి.
18, కొండాపూర్. అబ్బర బోయిన లలిత. కాంగ్రెస్.
19, నాగరాజు పల్లి. ఎరుకల రజిత. కాంగ్రెస్.
20, నందిగామ. భూక్య భాస్కర్. కాంగ్రెస్.
21, కొండాయిల్ పల్లి. ఎరుకల స్వప్న. కాంగ్రెస్.
22, రామతీర్థం. పొదిల వసంత. కాంగ్రెస్.
23, ధర్మరావుపల్లి. ముస్కే పోషాలు. కాంగ్రెస్.
24, గుండ్ల పహాడ్. కర్దూరి అనిత. కాంగ్రెస్.
25, మామిండ్ల వీరయ్య పల్లి. ఏడాకుల సరోజన. కాంగ్రెస్.
26, రేలకుంట. వాంకుడోత్ హేమలత. కాంగ్రెస్.
27, ముచ్చింపుల. ఇస్తారి శేఖర్ గౌడ్. కాంగ్రెస్.
28, అర్షణ పల్లి. సిద్ధ సంతోష్. కాంగ్రెస్.
29, బుచ్చిరెడ్డి పల్లె. భూక్య భద్రమ్మ. కాంగ్రెస్.
సర్పంచులుగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత మండలంలో బిఆర్ఎస్ అత్యధిక సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యులను గెలుచుకొని గులాబీ జెండా ఎగరవేశారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T122558.825.wav?_=2

 

ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఝరాసంగం గ్రామాలలో బి.ఆర్.ఎస్ అభ్యర్థులు వినోద బాలరాజ్ తరపున శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, నామ రవి కిరణ్ మరియు ఝరాసంగం గ్రామ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియా గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టౌన్ ప్రెసిడెంట్ బాబా నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్ధల గెలుపు కొరకు కృషి చేయాలని అనంతరం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ మాట్లాడుతూ లియూరియా కోసం రైతుల అగచాట్లు, బోనస్ బకాయిలు, రైతు భరోసా ఎగవేత, చాలిచాలని కరెంటు, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. మహిళలకు 2500, వృద్ధులకు 4000, తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా విమర్శించారు..

ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-10T124340.456.wav?_=3

 

ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్

ఆవకాశం ఇవ్వండి… అభివృద్ధి చూడండి..! యువతకు ఉపాధి… మహిళ సంఘాల బలోపేతం బలపరచిన అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని గ్రామం మొత్తం ఎన్నికల సందడి తారస్థాయికి చేరగా బలపరచిన అభ్యర్థి నాజియా అంజుమ్ షేక్ సోహెల్ ప్రచారంలో చురుకుదనం చూపుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

“ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాం” అనే నినాదంతో ప్రజల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యం తామెదుర్కొంటున్న గ్రామ తుమ్మనపల్లి గ్రామాన్ని సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని నాజియా అంజుమ్ షేక్ సోహెల్ స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సిసి రోడ్లు, త్రాగునీరు నిరంతర విద్యుత్ సరఫరా మహిళా సంఘాల బలోపేతం యువతకు ఉపాధి ఆవకాశాలు వృద్ధుల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామని తెలిపారు. ప్రజల్లో మంచి ఆదరణ గ్రామస్థులు చాలామంది ఆమె ప్రచారానికి పాజిటివ్ స్పందిస్తున్నారు. “ఈసారి అభివృద్ధి చేయగలిగేది నాజియా అంజుమ్ షేక్ సోహెల్ మాత్రమే” అని కొందరు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రచారం సమయంలో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో కలిసి నినాదాలు చేస్తున్నారు. తమ ఉంగరం గుర్తుకు ఓటు వేసి మార్పును అందించగల నాయకురాలిగా నాజియా అంజుమ్ షేక్ సోహెల్ పేరు స్పష్టంగా వినిపిస్తోంది.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ వార్డు మెంబర్లుగా పోటి చేస్తున్న సభ్యులు, గ్రామస్థులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T111323.941.wav?_=4

 

ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా

◆-: గ్రామ అభివృద్దె తమ ఏకైక ధ్యేయం

◆-: సర్పంచ్ అభ్యర్థి నాగేందర్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 14న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఝరాసంగం మండల పరిధిలో ని బోరేగావ్ సర్పంచ్ అభ్యర్థిగా నాగేందర్ పటేల్ బరిలో నిలిచారు. సోమవారం గ్రామం లో ఇంటింటా ప్రచారం లో భాగంగా అయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు.

అంతేకాకుండా గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వార్డులలో మూరికి కాలువలు సిసి రోడ్లు కనీస వసతులు లేక .ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాడుతున్నారని అన్నారు .ప్రధాన రోడ్డు నుండి బసవేశ్వర స్వామి ఆలయం వరకు తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తాను అన్నారు. రోడ్డు సౌకర్యం లేక మనుషులు మరియి పశువుల కు చాలా ఇబ్బందిగా ఉందని గెలిచిన వెంటనే రోడ్డు సౌకర్యం కల్పిస్తాను అన్నారు.

తాము ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే .కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరిగే విధంగా తాము పని చేస్తామన్నారు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ.

ప్రజల సమస్యల ను పరిష్కరించడమే తమ ధ్యేయమని అన్నారు. కావున గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

“ప్రలోభాలకు లొంగొద్దు: ఆంజయ్య పిలుపు”

ఓటర్లు డబ్బు మద్యం ప్రలోబాలకు లొంగొద్దు

• నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలి
•సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెక్రటరీ మంగలి ఆంజయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెసెక్రటరీ మంగలి ఆంజయ్య అన్నారు. ఈ సందర్బంగా మండలంలో సర్పంచి, వార్డు నెంబర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులు డబ్బులతో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ముందుగా ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, విందు కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బులు గెలిచిన తరువాత ప్రభుత్వం గ్రామపంచాయతీకి విడుదల చేసే నిధుల నుండి ఖర్చును పూడ్చుకునే అవకాశం సాధ్యం కాదనీ సమాచార హక్కు వికాస సమితి ముందుగా హెచ్చరిక తెలియజేస్తుందని అన్నారు. గ్రామానికి వచ్చిన నిధులను పనులు నిమిత్తం మాత్రమే పారదర్శకంగా ఖర్చు చెయ్యాలని సమాచార హక్కు చట్టం ప్రకారంగా పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240
ప్రకారంగా ప్రతీ విషయం ప్రజలందరూ తెలుసుకునే హక్కు ఉందని ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ను ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో సూచిక బోర్డు పై ప్రజలందరికీ తెలిచేలా ఏర్పాటు చెయ్యాలని అన్నారు .
నిధులను పక్కదారి పట్టించిన దుర్వినియోగం చేసినా,
సొంతానికి వాడుకున్న, తప్పుడు లెక్కలు చూపిన ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, నిధులను రికవరీ చేసి, పదవి నుండి తొలగించె అవకాశం ఉందని, కాబట్టి ఎన్నికల్లో అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దని సూచించారు. ఓటర్లు డబ్బు, మద్యం, ప్రలోబాలకు లొంగి ఓటు వేయొద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలని ఓటర్లకు సూచించారు.

తంగళ్ళపల్లికి అభివృద్ధి హామీ – రవి

ఇందిరమ్మ కాలనీలోఅo కారపు రవి ప్రచారం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన మాజీ మండల అధ్యక్షుడు అంకారపురవి టిఆర్ఎస్ పార్టీశ్రేణుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ముందు ముందుఉంచానాని.గ్రామంలో సిసిరోడ్లుగానిడ్రైనేజీలు గాని రోడ్లు గాని గ్రామంలో .అధికనిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి చేశానని తంగళ్ళపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మరోమారు మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మాజీమంత్రి కెటిరామారావు సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి వారందరితో మామయ్య గారిని ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగలమానస రాజు. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడివెంకట రమణారెడ్డి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ బింకర్
రాజన్న.తెలంగాణ జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ వెంగళరమేష్. బండి జగన్.ఎగుర్లకరుణాకర్. నేరెళ్ల అనిల్.ఓగ్గుబాల్లింగo. జంగాపల్లిబిక్షపతి.పరకపెల్లి తిరుపతి.భీమని.అరవిందు. పసులదుర్గయ్య.కొంగరి నరేష్.టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

మండలంలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T162109.715.wav?_=5

 

మండలంలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలో నేటి నుండి రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడతలో భాగంగా మండలంలోని గ్రామాలలో నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎంపీడీవో రామ రామ కృష్ణ తెలిపారు.మండలంలోని 14 గ్రామ పంచాయతీ సర్పంచ్, 138 వార్డు సభ్యులకు ఈనెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.6న నామినేషన్ల పరిశీలన,7వ తేదీన అప్పిల్ ,8న తిరస్కరణ,9వ తేదీన నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మండలంలో 6 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించబడతాయని, కంఠాత్మకూర్ క్లస్టర్ పరిధిలో కంఠాత్మకూర్,ధర్మారం, రామకృష్ణాపూర్,కౌకొండ క్లస్టర్లో కౌకొండ,సర్వాపూర్ నడికూడ పరిధిలో నడికూడ, ముస్త్యాలపల్లి,చౌటుపర్తి, రాయపర్తి పరిధిలో రాయపర్తి,నర్సక్కపల్లి, పులిగిల్ల క్లస్టర్ లో పులిగిల్ల,వరికోల్,చర్లపల్లి క్లస్టర్ పరిధిలో చర్లపల్లి నార్లాపూర్ గ్రామాల నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు.

గ్రామాభివృద్ధికై పాటుపడతా ఆశీర్వదించండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T161705.526.wav?_=6

 

గ్రామాభివృద్ధికై పాటుపడతా ఆశీర్వదించండి

◆- వనంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఎంపీ జగదీశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం(జహీరాబాద్),తమ గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని తనను అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఝరాసంగం మండలంలోని వనంపల్లి సర్పంచ్ అభ్యర్థి మాలి పటేల్ జగదీశ్వర్ పాటిల్ కోరారు.వనంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో పలు సమస్యలు నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.దళిత,వెనుకబడిన తరగతుల చెందిన ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని,వారి పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు మంజూరు చేయించి ఆదుకోవడం జరుగుతుందన్నారు.ఎంతోమంది చదువుకుని గ్రామంలో నిరుద్యోగులుగా మిగిలిపోయారని వారికి ఉపాధి పథకాలు మంజూరు చేయిస్తానన్నారు.చాలా మందికి పక్క గృహాలు లేకపోవడంతో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారని అర్హులైన వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేయించడానికి కృషి చేస్తానన్నారు.అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు,రేషన్ కార్డులు మంజూరు చేయిస్తానన్నారు.రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రతి ఏటా నష్టపోతున్నారని కమర్షియల్ పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు.గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చోట బోర్లు వేయించి మినీ ట్యాంకులు నిర్మించడం జరుగుతుందన్నారు.
గ్రామంలో అవసరమైనచోట మురికి కాలువలు,సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీకి సొంతభవనం, ఎస్సీ,బీసీ కమ్యూనిటీ భవనాల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. వనంపల్లి నుండి సిద్దాపూర్,
మిర్జాపూర్ గ్రామాల వైపు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకై నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు.గ్రామం నుండి రామచందర్,టోప్యా నాయక్ తండాలు,సేరిగడ్డ పొలాల వైపు గల రోడ్ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తానన్నారు.పంట పొలాలకు దారులు సక్రమంగా లేక రవాణా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటికి పక్కా రోడ్లు వేయిస్తానన్నారు.అందరికీ అందుబాటులో ఉండి కుల మతాలకు అతీతంగా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కోసం
అహర్నిశలు పాటు పడతానని అందరూ ఆశీర్వదించి తనను భారీ మెజారిటీతో సర్పంచుగా గెలిపించాలని అభ్యర్థి ఎంపీ జగదీశ్వర్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

న్యాల్యల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలి

న్యాల్యల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలి

◆:- ఎం.పి,కాంగ్రెస్ నేతలను మహమ్మద్ యూనుస్ వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

స్థానిక ఎన్నికల్లో న్యాల్కల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముహమ్మద్ యూనుస్ జహీరాబాద్ తమ బృందంతో చేరుకుని, మాజీ రాష్ట్ర మంత్రి మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ ఎంపీ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ లను జహీరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఇన్‌చార్జి క్యాంప్ ఆఫీస్ శుక్లా వర్ధన్ రెడ్డితో కలిసి న్యాల్కల్ మండల నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తును అందజేశారు. జడ్పిటిసి అభ్యర్థి ప్రకటిస్తే మండల ప్రజలను సేవలందిస్తానని ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సంగారెడ్డి ఉపాధ్యక్షుడు ముహమ్మద్‌ ముల్తానీ, జహీరాబాద్‌ మున్సిపల్‌ మాజీ సభ్యుడు ముహమ్మద్‌ ముయిజుద్దీన్‌, జహీరాబాద్‌ మున్సిపల్‌ మాజీ సభ్యుడు హఫీజ్‌ మహ్మద్‌ అక్బర్‌ హోగేలి, కాంగ్రెస్‌ జహీరాబాద్‌ మండల అడహాక్‌ కమిటీ అధ్యక్షుడు రాంలు యాదవ్, మహ్మద్‌ ఇనాయత్‌ అలీ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ మహమ్మద్‌ అయూబ్‌, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-3.wav?_=7

దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్ మొహియుద్దీన్‌ కు జహీరాబాద్ ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన

◆:- జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ,

◆:- దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, ఏఐఎంఐఎం క్రియాశీల నాయకుడు, జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ మరియు దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, హైదరాబాద్‌లోని దారుస్సలాంలో అధ్యక్షుడు మజ్లిస్-ఇ-వర్కర్ పార్లమెంట్ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అసెంబ్లీ సభ్యుడు మరియు మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ కౌసర్ మొహియుద్దీన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో జహీరాబాద్ రాజకీయ వాతావరణంలో కొత్త కదలిక వచ్చింది.
ఈ సెషన్ కేవలం పరిచయ కార్యక్రమం కాదు. జహీరాబాద్‌లోని వివిధ మున్సిపల్ వార్డుల పరిస్థితి, ప్రజా సమస్యలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని చర్చించాల్సి ఉంది, అది జహీరాబాద్ అయినా లేదా కోహిర్ అయినా. వాజిద్ చర్చను లోతుగా చేస్తూ, ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల పనితీరుపై వెలుగునింపారు మరియు షేఖాపూర్, మాడ్గి, దగ్వాల్ మరియు ఝరాసంగం యొక్క సర్పంచ్‌లు మరియు ఎన్నికైన ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి మరియు అభివృద్ధిలో అందించిన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ జమాత్ ఈ అంశాలను తీవ్రంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో జమాత్ ప్రతినిధులకు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినట్లే, ఈసారి కూడా వ్యవస్థీకృత మరియు ఉత్సాహభరితమైన ప్రచారంతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు తమ ప్రసంగంలో చెప్పారు. రాబోయే రోజుల్లో జహీరాబాద్ మరియు కోహిర్ ఝరాసంగం లలో ఏఐఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయనే వాస్తవానికి ఈ సమావేశం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version