మేడారం జాతరలో ప్లాస్టిక్ ను వాడద్దు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రకృతి సిద్ధమైన మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడద్దని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో
తన క్యాంప్ ఆఫీస్ లో ప్లాస్టిక్ వాడకండి…మేడారాన్ని రక్షించండి అనే వాల్ పోస్టర్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతర లో ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ గాలి,నీరు,భూమిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడి పై ఉందన్నారు.సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ఇంటి దగ్గర నుండి ప్లాస్టిక్ రహిత వస్తువులను
తీసుకెళ్లి వాడుతూ,మేడారం అడవితల్లిని రక్షించాలని కోరారు.ఈకార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్,గండిగిరి,సంస్థ సభ్యులు తంగెళ్ల రవికాంత్,రాముసేవక్, నాగుర్లపల్లె మాజీ సర్పంచ్ రాజహంస,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
