ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్…

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సంపేట బాయ్స్ హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం వాకింగ్, యోగా చేయడంతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ, మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలోనే ఆరోగ్యం దాగిఉందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని, వాటికి బదులుగా బయో కవర్లను వినియోగించాలని సూచించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గిరిగాని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ పొన్నాల మనిషా, ఇన్‌చార్జి హెడ్ మాస్టర్ రవికుమార్, బిక్షపతి, రాంబాబు, ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తంగెళ్ల రవికాంత్, సభ్యుడు రాముసేవక్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆరోగ్యకర జీవనశైలి – పర్యావరణ హిత వినియోగంపై వర్క్‌షాప్…

ఆరోగ్యకర జీవనశైలి – పర్యావరణ హిత వినియోగంపై వర్క్‌షాప్

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పర్యావరణ అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఏకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ చైతన్యంపై ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సంస్థ అనుబంధంగా, తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మిల్లెట్స్, ఫ్రూట్ సలాడ్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, జూట్ బ్యాగుల తయారీ, పేపర్ వినియోగ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడంతో పాటు ప్రకృతికి మేలు చేసే జీవనశైలిని అవలంబించాలని సూచించారు. మిల్లెట్స్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్లాస్టిక్ వినియోగం ప్రకృతికి హానికరమని తెలిపారు. గ్రామస్థాయిలో సేంద్రియ ఆహారాలపై కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఒకరోజు కార్యక్రమం కాదని, ప్రతి రోజు పాటించాల్సిన జీవన విధానమని తెలిపారు. ప్లాస్టిక్‌కు బదులుగా జూట్ బ్యాగులు, పేపర్ ఉత్పత్తులు, సహజ వనరులతో తయారైన వస్తువులు ఉపయోగించడం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని చెప్పారు.అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పర్యావరణ అవగాహన కూడా ఎంతో అవసరమని, సహజ ఆహారాలు మరియు పర్యావరణ హిత వస్తువుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.ఏకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ ఎం. రాంబాబు మిల్లెట్స్ వినియోగం, ఫ్రూట్ సలాడ్ ఆరోగ్య ప్రయోజనాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలు, జూట్ బ్యాగుల తయారీ విధానం, పేపర్ వినియోగ ప్రాముఖ్యత వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎస్. కమలాకర్, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకండి: ఎమ్మెల్యే దొంతి

మేడారం జాతరలో ప్లాస్టిక్ ను వాడద్దు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రకృతి సిద్ధమైన మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడద్దని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో
తన క్యాంప్ ఆఫీస్ లో ప్లాస్టిక్ వాడకండి…మేడారాన్ని రక్షించండి అనే వాల్ పోస్టర్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతర లో ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ గాలి,నీరు,భూమిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడి పై ఉందన్నారు.సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ఇంటి దగ్గర నుండి ప్లాస్టిక్ రహిత వస్తువులను
తీసుకెళ్లి వాడుతూ,మేడారం అడవితల్లిని రక్షించాలని కోరారు.ఈకార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్,గండిగిరి,సంస్థ సభ్యులు తంగెళ్ల రవికాంత్,రాముసేవక్, నాగుర్లపల్లె మాజీ సర్పంచ్ రాజహంస,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలో భారత్ అగ్రగామికోసం ఆర్ఎస్ఎస్ దీక్ష…

ప్రపంచంలో భారత్ అగ్రగామికోసం ఆర్ఎస్ఎస్ దీక్ష *

ఆర్ ఎస్ ఎస్ గ్రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ *

మహాదేవపూర్ అక్టోబర్01 నేటి ధాత్రి *

మహాదేవపూర్ మండల కేంద్రంలోని భారతదేశం ప్రపంచంలో అగ్రగామి కావడానికి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టిందనీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ సత్యనారాయణ అన్నారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ముఖ్యమని కార్యకర్తలు కూడా దేశం తర్వాతనే ఇతర విషయాలకు ప్రాధాన్యమిచ్చే వారే ఈ సంస్థకోసం నిలబడతారని అన్నారు. పంచ పరివర్తనలో భాగంగా చెట్లు నాటడం, ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించడం, భూగర్భ జలాలను పెంపొందించడానికి కట్టుబడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. స్వ ఆధారిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వభాష, స్వవేషం, స్వ సంస్కృతి తోపాటు స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు. హిందూ కుటుంబాలు సమిష్టిగా ఉండేలా మానక మానసిక స్థితిని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పండుగ పర్వదినాలలో సమిష్టి కుటుంబంలోని వారందరూ కలుసుకునే సంప్రదాయాన్ని పాటించారన్నారు. పూర్వకాలం నుండి హిందుత్వంలో జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యం ఉన్నదే తప్ప కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేదని అలాంటి సమాజాన్ని పునర్ నిర్మించాలన్నారు అన్నారు. కుల మతాలను పాటించకుండా అందరిలో దైవమున్నాడని భావించే సమరసత కోసం కృషి చేయాలని అన్నారు. పౌర విధులను సక్రమంగా నిర్వహించారని రాజ్యాంగం, చట్టాలను పాటించడం ద్వారా సమాజంలో పౌర భావనను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని మరోపదేళ్లలో ప్రపంచంలోని అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రజలకు ఆర్ఎస్ఎస్ లో పరిచయం చేయడానికి ప్రతి మండలంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ గడ్డం శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దేవరావు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version