మేడారం బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి
పరకాల,నేటిధాత్రి
సోమవారం పట్టణంలోని అంగడి మైదానంలో పరకాల నుండి మేడారం వెళ్ళు బస్సులను శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.మేడారం జాతర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పండుగగా అని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించింది అన్నారు.
