రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి…

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, అసైన్డ్ భూముల విచారణ, భూ భారతి, 22-ఏ తదితర కీలక అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా దరఖాస్తుల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలంటే అధికారులు వచ్చిన దరఖాస్తులు ఆదారంగా క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ రికార్డుల ప్రామాణికతను నిర్ధారిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ…

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ

రామాయంపేట సెప్టెంబర్ 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్‌బోర్డ్‌ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్‌డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version