భూభారతిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వేగంగా పరిష్కరించాలి.
జిల్లాఅదనపు కలెక్టర్ అశోక్ కుమార్
చిట్యాల, నేటిదాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తాహ సిల్దార్ కార్యాలయాన్ని సోమవారం రోజున జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ (రెవిన్యూ ) తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి నివేదిక పై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసంబంధిత రికార్డుల నవీకరణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ఫీల్డ్ వెరిఫికేషన్ పురోగతిని తహసీల్దార్ తో పరిశీలించారు. భూభారతి నివేదికలో చూపిన అంశాలను సమయానుకూలంగా సవరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూముల సమస్యలపై ప్రజలు అనవసరంగా కార్యాలయాలకు తిరగకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని తాసిల్దార్ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహ సిల్దార్ సిబ్బంది పాల్గొన్నారు.
