విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.
చదువుకోడానికి స్టడీ రూమ్ లేదు.
సరియైన ఆటస్థలం ఏర్పాటు చేయాలి.
మాజీ ఎమ్మెల్యే గండ్ర.
చిట్యాల. నేటి ధాత్రి :
చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు ప్రభుత్వ మోడల్ బాల, బాలికల విద్యాలయాలను సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గంట జ్యోతి మరియు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ కేటీఆర్ ఆదేశాల మేరకు చిట్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను మరియు ప్రభుత్వం మోడల్ పాఠశాలలను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు మాకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని, అదేవిధంగా మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు మా యొక్క హాస్టల్ పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని కోరడం జరిగింది.
అదేవిధంగా టాయిలెట్స్ అయిదు రోజులకి ఒకసారి క్లీన్ చేయడంతో చాలా దుర్వాసన వెదజలుతున్నాయని, అదే విధంగా మాకు చదువుకోవడానికి స్టడీ రూమ్, ఆడుకోవడానికి ఆటస్థలం, కరెంట్ సరిగ్గా రావడం లేదని మాకు సరైన కరెంట్, చుట్టుప్రక్కల ఆపరిశుభ్రంగా ఉండటంతో దోమలు ఎక్కువగా వస్తున్నాయి అని అందుకు మెస్ డోర్స్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా నీటి సమస్య అధికంగా ఉన్నది కారణంగా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని, వారికీ హాట్ వాటర్ కొరకు సోలార్ గ్రీజర్ మరియు సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
అదే విధంగా ఇప్పటి వరకు కోస్మోటిక్ బిల్లు రాలేదని వాటిని కూడా త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి వెంట మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.