సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రయాణాలకు అనుకూలమైన రోజులు, దిశలను ఎంచుకోవడం ముఖ్యం. ఇలా ప్రణాళిక లేకుండా ప్రయాణించడం వల్ల కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ప్రయాణం సంతోషంగా, విజయవంతంగా సాగడానికి కొన్ని రోజులు శుభప్రదంగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మతపరమైన కార్యక్రమాలు, దేవాలయాల సందర్శనలు, మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్రలు లేదా ఏదైనా ఆధ్యాత్మిక, ముఖ్యమైన పనిని చేపట్టడానికి ఉత్తమ రోజులు. ఈ రోజుల్లో ప్రారంభించే ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.
