ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహానుభావులలో ఒకరని, ఆయన జీవితంలోని గొప్ప త్యాగాలు, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు.

పాపన్న జీవితం మనకు ధైర్యం, నిబద్ధత, న్యాయ పోరాటం వంటి విలువలను నేర్పుతుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను గుర్తించి, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.

యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ తీసుకొని, సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పాపన్న గౌడ్ అభిమానులు, యువత, గ్రామస్తులు పాల్గొని, మహానుభావుని సేవలను స్మరించుకున్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి’

కల్వకుర్తి/ నేటి ధాత్రి

 

 

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు..

బత్తుల బాల కుమార్ గౌడ్, తాలూకా ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్, పాలకోవు యువజన ఉపాధ్యక్షులు ధర్మని రవి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ ప్రచార కార్యదర్శి విష్ణు గౌడ్, ప్రధాన కార్యదర్శి గణేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ అనిల్, జంగయ్య, కృష్ణా, నరేందర్ గౌడ్, పాండు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీకాంత్ గౌడ్ ,అల్లాజీ గౌడ్,సురేష్ గౌడ్, రాకేష్ గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించామన్నారు. గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బజార్ సిద్ధ గౌడ్, వెల్దుర్తి బాలరాజు గౌడ్, చిన్న అంజాగౌడ్,బాల గౌడ్,బజార్ కొండగౌడ్, రంజిత్ గౌడ్,వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,నవీన్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్,చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.

ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.

“వక్ఫ్ బిల్లుకు “వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన.

రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.

పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలోనూ “ఈద్” శుభాకాంక్షలు.

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

ఈనెల రెండవ తేదీ నుండి ప్రారంభమైన రంజాన్ సోమవారం నాటికి ఈదుల్ తో ముగిసింది. మహాదేవపూర్ మండల కేంద్రం తో పాటు ఉమ్మడి మండలంలోని కాళేశ్వరం, పంకేనా, లెంకలగడ్డ, అన్నారం, గ్రామాల్లోని ఈద్గాల వద్ద, ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కొరకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థించడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వఫ్ఫ్ బోర్డు బిల్లును క్యాబినెట్ ఆమోదం కొరకు ప్రతిపాదించడంతో, ఈద్గా వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలను ధరించి బిల్లులు వ్యతిరేకించడం జరిగింది. మండల కేంద్రంతో పాటు ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో ఈద్గాలు అలాగే గ్రామ ప్రజలు ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలపడంలో నిమగ్నం కావడం జరిగింది. మతసామర్స్యాలకు ప్రతీకంగా రంజాన్ మాసం, పవిత్రత తో కూడిన పండుగ కావడంతో, కుల మతాలకు తేడా లేకుండా పిల్ల పెద్ద, ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులకు అలై బలై చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

Wakf Bill

 

ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలోని” ఖుద్బ” అనంతరం ప్రత్యేక దువా కార్యక్రమం చేయడం జరుగుతుంది, 30 రోజులపాటు రోజాలు ఉన్న ముస్లింలు చేతులెత్తి ఈదుల్ ఫితర్ నమాజ్ అనంతరం” దువా” నిర్వహించడం జరుగుతుంది, ఈ దువాలు మదిని ఈదుగా జామి మస్జీద్ ఈద్గా కు సంబంధించిన మత గురువులు ప్రత్యేకంగా, రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తుపాతు రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రత్యేక దువ నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, లో అల్లాహ్, దీవించి సంరక్షించాలని కోరడం జరిగింది. మరోవైపు ఈద్ శుభాకాంక్షలు సంబంధించి సామాజిక మాధ్యమం ఉమ్మడి మండలంలోని “వాట్సప్ గ్రూప్”
“నమస్తే మహాదేవపూర్” మిన్ను భాయ్ రిపోర్టర్” లోకల్ గ్రూప్ తో పాటు “మిన్ను భాయ్ విత్ ముస్లిం” సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరూ మతానికి సంబంధం లేకుండా ఈదుల్ ఫితర్ తో పాటు ఈద్ ముబారక్ సందేశాలను పంపి, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

Wakf Bill

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.

పవిత్ర మాసం రంజాన్ చివరి రోజు, ఈదుల్ ఫితర్ కొరకు ప్రత్యేక ప్రార్థన కొరకు ఈద్ఘా ల వద్దకు చేరిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుటకు, ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్, బిజెపి, పార్టీలతో ప్రతినిధులతో పాటు, పలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఈద్గాల వద్దకు చేరి నమాజ్ అనంతరం, అలా ఇవ్వలాయ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయ్,రామారావు, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు సుధాకర్, పి ఎ సి ఎస్ చైర్మన్ తిరుపతి, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్, శ్రీపతి బాబు, సల్మాన్ ఖాన్. సింగిల్ విండో డైరెక్టర్ ఇబ్రహీం, వామన్ రావు, కలికోట వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కుదురుపల్లి మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య, నాగరాజు,అశోక్,ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన, సల్మాన్ ఖాన్, ఇస్తియాక్, ఖదీర్, అలీమ్ ఖాన్, తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన, అస్రార్ ఖురైషి, ఎండి అజాజ్ ఖాన్, ఎండి సలావుద్దీన్, గయాజ్ ఖాన్, ఇర్షాద్ ఖాన్, సలాం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్ ఖాన్, ముజీబ్ ఖాన్, అసిన్ ఖాన్ ఖాన్ మేస్త్రి, ఎండి ఉవెజ్, సోయఫ్ ఖాన్, షాకిరుల్ల ఖాన్, సయ్యద్ ముఖిద్, సయ్యద్ మెహరాజ్, ఎండి నయూమ్, ఎండి సోహెల్, ఎండి చాంద్, ఎండి నదీమ్, షేక్ బబ్లు, ఎండి ఇమ్రాన్, ఎండి నూమాన్, షేక్ రొమాన్,షారుఖ్ ఖాన్,ఎండి మోఖిద్,అక్రమ్ ఖాన్,షాహిద్,వాలిఉల్లహ ఖాన్,మశుక్ అలీ, లకు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Wakf Bill

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.

ఈదుల్ ఫితర్ నిర్వహణకు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరడం జరుగుతుందని, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా, మహదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రామ్మోహన్ రావ్, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, కాలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ తమాషా రెడ్డి, పలివెల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద, సిఆర్పిఎఫ్ బాటాయంతో పాటు సివిల్ పోలీస్ లతో ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, సుమారు రెండు గంటల పాటు పోలీస్ సిబ్బంది, ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ విధులు నిర్వహించి, చివరికి పోలీసులు కూడా ముస్లింలకు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది. స్థానిక మైనారిటీలతోపాటు మస్జిద్ కమిటీల బాధ్యులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం.

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

మండలంలోని వెంకటాపురం గ్రామంలోని గంగాదేవి తండా ఎస్టీ కాలనీ లో పౌరహక్కుల దినోత్సవం ను పంచాయతీ సెక్రటరీ కోట శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ తహసిల్దార్ పల్లకొండ రవి హాజరై మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మాణం చేయాలని, అంటరానితనం రూపుమాపి సమానత్వం కొరకు సామాజిక చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే అందరూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని,ఆర్థిక,రాజకీయ, సామాజిక అభివృద్దిలో ముందుండాలని అన్నారు, ప్రజల వద్ద నుండి వచ్చిన వినతులను స్వీకరించి తగిన పరిష్కారం చేస్తామన్నారు, అనంతరం పౌరహక్కుల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నజ్మా, ఏ ఇ ఓ అరున్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ సభ్యులు మాంకాల యాదగిరి , సీసీ యాకాంబ్రం, అంగన్వాడీ టీచర్ భాలీ , ఉమాదేవి, సినియర్ అసిస్టెంట్ రాజేష్, ఎంఆర్ పీ స్ మండల అధ్యక్షులు ఈ వెంకన్న, రాష్ట్ర నాయకులు గడ్డం రమేశ్, సిఎ రజిత, గ్రామ పంచాయితీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ,మునిసిపాలిటీ, జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణీకరణ వల్ల అడవులు నశించిపోయి భూభాగం మొత్తం సిమెంటు కాంక్రీట్ జంగల్ గా మారి భూమిలో నీరు ఇంకిపోక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. దీనికి ప్రతి ఒక్క ఇంటి నిర్మాణం వద్ద ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని,అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రతిభ సంస్థ అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిపై ఏడు పాళ్లు నీళ్లు మూడు పాళ్ళు భూమి ఉన్నప్పటికీ 97.5 శాతం సముద్రాల్లోని పనికిరాని ఉప్పు నీరు ఉండగా రెండున్నర శాతం మాత్రమే మంచినీరు అని అలాగే కూడా ఒక్క శాతం మాత్రమే భూమి ఉపరితలంలో నదులు సరస్సులలో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్ ,మున్సిపాలిటీ మేనేజర్ సంపత్ కుమార్,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సూర్యతేజ, జూనియర్ అసిస్టెంట్ శివ టెక్నికల్ ఆఫీసర్ నర్సింగరావు, ప్రతిభ సంస్థ వెంకటేశ్వర్లు, వినియోగదారుల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సారంగం, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

ప్రపంచ మంచినీటి దినోత్సవం సందర్బంగా తిమ్మంపేట,తొగర్రాయి ప్రభుత్వ పాఠశాలలో బాలవికాస స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలవికాస కోఆర్డినేటర్ రజిత, దేవేంద్ర రమాదేవి, లక్ష్మిలు విద్యార్థులను ఉద్దెశించి మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.భూగర్భ జలాలను డెవలప్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలకు అవగహన కల్పించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు,వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఎంహెచ్పీఎస్ అన్ని వర్గాల మేలుకొరకు పోరాటం చేస్తుంది

ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి:

MHPS

మాదిగల రిజర్వేషన్ ప్రకారం రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కు అనుకూలంగా ప్రత్యేక సీట్లు కేటాయించాలని
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎంహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కులను సాధించే దిశగా కొన్ని దశాబ్దాల ఉద్యమ కాలంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి క్రియాశీలకంగా పనిచేసిందని ఆవిర్భావం నుండి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.గత ప్రభుత్వంలోని దళిత బంధం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని అమలులో ఉంచాలని కోరారు.గత డిసెంబర్ నెలలో జరిగినటువంటి గ్రూపు-2 గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల రిజర్వేషన్ అమలు చేసి మరోసారి మాదిగల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడాలని ఎస్సీల వర్గీకరణ మాదిగ అమరవీరుల విజయమని,నామినేటెడ్ పదవులలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వాలని మైస ఉపేందర్ మాదిగ అన్నారు.ఈ కార్యక్రమము లో
మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొల్లికొండ వీరేందర్ గజ్జల మల్లేష్,పుల్ల రమేష్ ఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు (వరంగల్ జిల్లా)వంతడుపుల అవినాష్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,కందుకూరి ప్రభాకర్ఎంహెచ్పీఎస్ హనుమకొండ(జిల్లా ఇన్చార్జి), మందా ఆరోగ్యం,సిలుముల రాజు,బరిగల బాబు,ఒసేపాక రవి,మున్నా తదితరులు పాల్గొన్నారు.

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలి.

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి

వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ,17మార్చి,నేటిదాత్రి:

ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆలయ అధికారులు,పాలకవర్గానికి సూచించారు.సోమవారం ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కు అర్చకులు స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు.తొలుత ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే నాగరాజుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అరెల్లి లింగస్వామి,డైరెక్టర్లు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు,ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి,హసన్ పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,కాంగ్రెస్ గడ్డం శివరాం ప్రసాద్,మార్క రాజు,చిర్ర రాము,వీసం సురేందర్ రెడ్డి,సంతోష్,గడ్డం అరుణ్, వరుణ్,సుమంత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు.

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నెక్కొండ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి అశోక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి బర్త్డే కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ అశోక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి సుబ్బారెడ్డి, కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, రామారావు శిరీష -రాము, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమల్ నాయక్, ఆవుల శ్రీనివాస్, మహమ్మద్ షబ్బీర్, దూదిమెట్ల రాజు, పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

రేజింతల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు.

రేజింతల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు .సఫీయ సుల్తానా ఆధ్వర్యంలో నో బ్యాగ్‌ డే ఘనంగా నిర్వహించారు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రేజింతల్ లో నో బ్యాగ్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా అధికారులు సి ఎం ఒ – వెంకటేశం ఏ ఎం ఒ – అనురాధ జి సి డి ఒ – సుప్రియ

School

జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి ఏం ఈ ఒ మారుతి రాథోడ్
ప్రధానోపాద్యాయురాలు సఫీయ సుల్తానా. ఛైర్మన్ రామేశ్వరి ఎంపీటీసీ మల్లిక విద్యార్థుల తల్లిదండ్రులు మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఫైన్ మోటార్ స్కిల్స్,గ్రాస్ మోటార్ స్కిల్స్, బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్, బైలాటరల్ యాక్టివిటీస్, స్పాన్ ఆఫ్ అటెన్షన్ కి సంబంధించిన యాక్టివిటీస్ 100 కి పైగా ప్రదర్శనలను నిర్వహించారు. అలాగే నో బ్యాగ్ డే లో భాగంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరికీ ఆకట్టుకుంది.ప్రతి సంవత్సరం సైన్స్ ఫెయిర్ గత 5 సంవత్సరాల నుండి పాఠశాలలో నిర్వహిస్తున్నారు.ఈ సారి వినూత్నంగా నో బ్యాగ్ డే నిర్వహించడం పట్ల జిల్లా అధికారులు హర్షం వ్యక్తంచేశారు. అలాగే జిల్లా విద్యా శాఖ తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయులు .సఫీయ సుల్తానా గారిని జిల్లా అధికారులు శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది.

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు.

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న చిన్నారులు

నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో చిన్న పిల్లలు అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ప్రతి సంవత్సరం మార్చి నెలలో కామ దహనం తర్వాత వచ్చే హోలీ పండుగను చిన్నా పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా రంగురంగుల రంగులతో ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయతో చల్లుకుంటూ రంగులు పూస్తూ కేరింతలతో జరుపుకునే గొప్ప పండుగ హోలీ అలాగే పిల్లలతో పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఈ హోలీని జరుపుకున్నారు.

అంబరన్ని అంటిన హోలీ సంబరాలు.

బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్తీలో అంబరన్ని అంటిన హోలీ సంబరాలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

హోలీ పండుగ సందర్భంగా బెల్లంపల్లి
పట్టణంలో బాబు క్యాంప్ బస్తీ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగంగా వైభవంగా హోలీ పండుగ జరుపుకున్నారు పండుగను సంతోషంగా బస్తీ వాసులు పెద్దలు చిన్నారులు పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని
రంగులతో హోలీ పండుగ జరుపుకున్నారు.వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట.శ్రీను సామల శ్రీనివాస్ అట్ట సత్యనారాయణ నాగుల దేవయ్య.పి సురేష్ మహిళలు పిల్లలు
పాల్గొన్నారు.

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి.

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి

ఎస్సై నరేష్

ముత్తారం :- నేటి ధాత్రి

హోలీ వేడుకలను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి సహజ సిద్దమైన రంగులను ఉపయోగించాలని సూచించారు మధ్యం మత్తులో వాహనాలు నడపటం మధ్యం మత్తులో రోడ్లపై వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వాహనాల పై రంగులు చల్లడం చట్ట విరుద్ధంమని తెలిపారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకొనబడునని ఎస్సై నరేష్ తెలిపారు

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి..

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి..

సీఐ వెంకటరాజా గౌడ్..

రామాయంపేట మార్చి 13 నేటి ధాత్రి (మెదక్)

హోలీ పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని సీఐ వెంకటరాజా గౌడ్ ప్రకటన విడుదల చేశారు. హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పండగను ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించాలని సూచించారు.ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు సృష్టించడం, మద్యం సేవించి వాహనం నడపడం చట్ట విరుద్ధమని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.

మంజీర విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు..

రామయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

Graduation Day

మంజీరా విద్యాలయంలో నేడు యూకేజీ విద్యార్థులకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది .విద్యార్థులు ప్రీ ప్రైమరీ ముగించుకొని ప్రైమరీ స్థాయిలోకి వెళ్లడం సందర్భంగా ఈ గ్రాడ్యువేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనంలోనే ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం నేటితరం విద్యార్థుల యొక్క అదృష్టంగా భావించడం జరిగింది. వాసవి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో జరుపుకునేటటువంటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. పిల్లలని చూసి గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో తల్లిదండ్రులు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో ఆనందించారు. అతిధి రాజేశ్వరి (చైల్డ్ సీనియర్ మేనేజర్ అండ్ ట్రేనర్ స్కాలరి ప్రోగ్రాం )గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు చేసే పనులను చూసి విద్యార్థులు నేర్చుకుంటారని, ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులు గాని వారిని చూసి ఆచరిస్తారని అందుకే చెప్పడం కంటే మనం ఆచరించి చూపించడం వారికి ఆదర్శనీయంగా ఉంటుంది, అని చెప్పారు. పిల్లలని చదువుకోమని చెప్పి తల్లిదండ్రులు టీవీ సీరియల్ చూస్తే పిల్లలు టీవీ చూడొద్దంటే ఫోన్ చూడొద్దు అని చెప్పడం తల్లిదండ్రులు అస్తమానం ఫోన్లో చూస్తుంటే, రీల్స్ చేయడం కోసం ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలు ఏ విధంగా సరైన మార్గంలో వెళ్తారు చెప్పడం కంటే ఆచరించడం ఉత్తమం. క్లాస్ కి టీచర్లు కూడా రోజు పిల్లల కంటే ముందుగా వచ్చి ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడిగితే వారు మారుతారు కానీ టీచర్ రోజు లేటుగా వస్తే అడగడానికి అర్హులు కారు అని చెప్పడం జరిగింది .కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే పిల్లలు స్టేజి మీద చక్కగా ఉపన్యసించడం జరిగింది .ఈ వయసు నుంచి స్టేజ్ ఫియర్ అనేది పోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలను ఈ డ్రెస్ లో చూడడం ఈ కార్యక్రమాన్ని చూడడం ఈ చుట్టుపక్కల ఏ పాఠశాలలో జరిగినటువంటిది మంజీర పాఠశాల వాళ్ళు నిర్వహించడం మా పిల్లలు మరియు మా యొక్క అదృష్టంగా భావిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, స్వాతి ,మౌనిక ,మీనా ప్రజ్ఞ ,శ్రీశైలం, అనిల్ శ్రీనివాస్ ,అమూల్యాలు పాల్గొన్నారు.

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.!

నేడు అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
చిల్పూర్( జనగామ) నేటిధాత్రి
చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు( బుధవారం) శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారిని బి.లక్ష్మీ ప్రసన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్టపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ చిల్పూరు గుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం శేషాద్రి నిలయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ అర్చకులు రంగాచార్యులు, రవీందర్ శర్మ, కృష్ణమాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..

రాయికల్ .నేటి ధాత్రి…

Mahotsavam

మార్చి 11.రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రోజున అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. కళ్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి ఓడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం చేశారు.. అనంతరం భక్తులందరికీ అన్నదానం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథ చార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, నాయకులు, యువకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు.!

మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి..

రామయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే జయంతుల, వర్ధంతుల కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తున్నప్పటికీ రామాయంపేట మున్సిపల్ నాయకులకు మాత్రం తమకు సంబంధంలేని అంశం అంటూ గాలికి వదిలేస్తున్నారని
మహనీయుల పండగల రోజు సైతం కార్యక్రమాన్ని చేస్తున్న తామే అక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పని తొలగించి మహనీయులను నీటితో శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని పోచమ్మ అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ పరిస్థితి మారాలంటే ఎంత సమయం పడుతుంది, ఎప్పటికీ మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలుగుతుందో , ఈ విషయాలను ప్రజలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, నాయకులు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అని పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా జయంతి ఉత్సవాలు అధికారికంగా స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల ఆవేదన. చేశారు.

జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.

జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని లీగర్ లీటరసి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.

మెట్ పల్లి మార్చి 8 నేటి ధాత్రి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు హాజరయ్యారు.
అనంతరం సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని భారత దేశ న్యాయస్థానం మహిళలకు ఉద్యోగులలో రాజకీయాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మహిళలకు మన భారత దేశంలో ప్రాధాన్యత ఇస్తారని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వివిధ రంగాల ఉద్యోగాలలో ముందుగా పురుషులకంటే మహిళలు ఉద్యోగం సాధించి మంచి గుర్తింపు పొందుతున్నారని వారికి మరిన్ని ఉపయోగ ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహక వ్యాపారాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని గుర్తింపు వీటిని మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని మీకు ఏ న్యాయ సలహా కావాలన్నా మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుపాలని దానికి మేము పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు సామాన్య గృహిణిగా ఉన్న సాధారణ మహిళ చిరు పట్ట గొలుసుల తయారు చేసే వ్యాపారము ప్రారంభించి ఉన్నత వ్యాపార స్థానం చేరిన గృహిణి ని మరియు సీనియర్ మహిళ అడ్వకేట్లను ఘనంగా సన్మానం చేశారు .
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి నాగేశ్వరరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, టి వేణుగోపాల్ ,మగ్గిడి నరసయ్య ,కోటగిరి వెంకటస్వామి, ప్రిన్సిపాల్ సంతోష్ ,తెడ్డు సురక్ష, దయ రాజారామ్, తుల రాజేందర్, ఓజ్జల శ్రీనివాస్ ,గడ్డం శంకర్ రెడ్డి, అలల శంకర్, తదితరులు విద్యార్థిని విద్యార్థులు అడ్వకేట్లు అధ్యాపకులు పాల్గొన్నారు.

ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న.

* ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్*

జహీరాబాద్. నేతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక అంగన్వాడీ కేంద్రం లో మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని. ఇసందర్బంగ మేధాపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళలని ఉద్దేశించి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని. ప్రతి ఆడబిడ్డ లో తన తల్లిగా చెల్లిగా అక్కగా చూడాలని. స్త్రీ లేనిదే జననం లేదు అని.ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం అని అయన కొనియాడుతూ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version