జయంతి ఎందుకు జరుపుకుంటారు వివరించారు.!

తూర్తి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. జయంతి ఎందుకు జరుపుకుంటారు అని వివరించారు.

కథలపూర్ మండలంలోని తూర్తి గ్రామంలో. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అంబేద్కర్ గురించి అన్నో చెప్పుకొచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14.1891జన్మిచారు. భారత రాజ్యాంగన్ని రూపొందిచడంలో మరియు సామజిక సమానంత్వం కోసం పోరాడారు అయన కీలక పత్రను గౌరవిస్తూ దేశవ్యాప్తంగాఅంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటారు.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

అంబేద్కర్ ఎక్కడ జన్మిచారు.
అసలు పేరు బీంరావ్ రంజి అంబేద్కర్. జననం.1891ఏప్రిల్ 14.మౌ సెంట్రల్ ప్రావిన్సు బ్రిటిష్ ఇండియా.మరణం.1956 డిసెంబర్ 6. ఢిల్లీ భారతదేశం
అయన రాజకీయ పార్టీ. షెడ్యూల్ కులాల సంఘం
*ఇతర రాజకీయ పదవులు.రిపబ్లిక్ పార్టీ ఇండిపెండెంట్లేబర్ పార్టీ.

భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర ఏమిటి ?

భారత రాజ్యాంగ రూపశిల్పి.
అంబేద్కర్ చేసిన అత్యంత ముఖ్యమైన సహకారం భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అతని పాత్ర పౌరులందరికీ ప్రాథమిక హక్కులు మరియు సమాన అవకాశాల కోసం వాదించారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి. ఆర్టికల్ 17. మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి నిబంధనలను ప్రవేశపెట్టింది.

*అంబేద్కర్ చరిత్ర ఏమిటి
ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత. సంఘ సంస్కర్త
ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడుఅతను స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి. చెప్పారు.భారతీయ సమాజాన్ని ఎవరైనా చీకటి నుండి వెలుగులోకి నడిపించారంటే అది ఆయనే. అని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ నినాదాలతో. పూల మాలలు వేసి స్వీట్ పంపిణి చేసిన అంబేద్కర్ యూవజన సంఘం సభ్యులు. మరియు తూర్తి గ్రామ సభ్యులు. యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ఈస్టర్.

సిఎస్ఐ చర్చిలో ఘనంగా మట్టల ( ఈస్టర్) పండుగ

నేటి ధాత్రి/ భద్రాచలం

 

 

స్థానిక సీఎస్ఐ చర్చిలో మట్టల పండుగను ఆదివారంఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు ఈత మట్టలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా కనిపించాయి భక్తులు ఈత మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ చర్చి చుట్టూ తిరిగారు అనంతరం చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఏసుప్రభు జెరుసలెం పట్టణంలో ప్రధమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఏసు ప్రభువును గాడిద పై తీసుకొని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల ఈత మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు దీనినే క్రైస్తవులు మట్టల ( ఈస్టర్) పండుగగా ఆచరిస్తారు ఈ సందర్భంగా పాస్ట్రేట్ ,& గ్రూప్ చైర్మన్ రేవ , కె . టీ .విజయ్ కుమార్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ గడిదేసి సాల్మన్ , పస్ట్రేట్ & గ్రూప్ సెక్రెటరీ, రితీష్ రెడ్డి, ట్రెజర్ , వై .ప్రసాద్ రావు, మరియు కమిటీ సభ్యులు జోసెఫ్ కుమార్ ,రాజు రవికిషోర్ ,మధు సంతాయ్య. పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న వేముల మహేందర్ గౌడ్

జయంతి అంటే పాలతో ఫోటోలు కడగడం కాదు..ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి..పేదల పక్షాన నిలబడిన మహోన్నతమైన నాయకుడు బి.ఆర్ అంబెడ్కర్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమేనని, తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఎన్నో అవమానాలు, కుల వివక్షతను ఎదుర్కొని దేశంలో ఎన్నో సంఘసంస్కరణలకు ఆద్యం పోసి వెలి వాడల నుంచి దేశానికే రాజ్యాంగాన్ని అందించిన గొప్ప దార్శనికుడు, బడుగు బలహీన వర్గాల బహుజన బాంధవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటితరం వారి స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని..కుల వివక్షతకు..కుల నిర్మూలనకు..అగ్రవర్ణాల అణచివేతకు..వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఎతైన విగ్రహాలు నెలకొల్పి..జయంతులు..వర్ధంతుల సందర్భంలో మాత్రమే అంబేద్కర్ ను గుర్తు చేసుకునే ఒరవడిని కాకుండా వారి స్ఫూర్తిని, చరిత్రను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు.

అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద

 

ర్భంగా ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని జమియత్ ఉలమా-ఇ-హింద్ మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్
ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.

మల్లక్కపేటలో ఘనంగా హనుమాన్ జయంతి

మల్లక్కపేట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్

పరకాల,నేటిధాత్రి మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల చేతులమీదుగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ మాట్లాడుతూ ఉదయం నుండి హనుమాన్ మందిరం లో భక్తులు అధికసంఖ్యలో హాజరై భజన సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారని సాయంత్రం ఆలయం వద్ద బండ్లు తిరుగు కార్యక్రమం ఉన్నదని తెలిపారు.నియోజకవర్గ,పట్టణ మరియు మండలపరిధిలోని అన్నిగ్రామాల ప్రజలు సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున భక్తులకు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి

silver

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని శనిగరం, ఆర్వయ పల్లె, కన్నారావుపేట గ్రామాలలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీని స్థాపించి 25 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎలుకతుర్తి లో ఏర్పాటు చేయడం జరిగిందని. తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు. కావున నర్సంపేట నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయడం కోసం మండలంలోని పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బానోతు హరినాథ్ సింగ్, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, నాయకులు మంద రాజిరెడ్డి, తిప్పని రవీందర్ గౌడ్, ఊట్కూరి అశోక్ గౌడ్, భూక్య బాలరాజు, మాడిశెట్టి రవి, తంగెళ్ల రవీందర్ రెడ్డి, పూజారి రాజు గౌడ్, మాజీ వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పార్టీ క్లస్టర్ ఇంఛార్జి, న్యాయవాది మోటురి రవి కోరారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలను నర్సంపేట మండలలోని జి.జి.ఆర్ పల్లె(గుర్రాల గండి రాజపల్లి)గ్రామంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోటురి రవి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో పార్టిని స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తుందన్నారు.తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో రాష్ట్ర అభిృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుత్తురు కోమల – రమేశ్,మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత – రమేశ్,గ్రామ పార్టి ప్రధాన కార్యదర్శి పురాణి రవీందర్,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,మండల నాయకుడు కత్తుల కుమారస్వామి,గురిజాల గౌడ సంఘం అధ్యక్షుడు మంచిక దేవేందర్,దుగ్గొండి మండల యూత్ నాయకుడు బాణోత్ జై కుమార్,గురిజాల ఎస్ఎంసి మాజీ ఛైర్మన్ కొమ్మ రవి,తుత్తురు వెంకటేష్,గుంటూర్ పల్లి గ్రామ ఇన్చార్జి సంగెం శ్రీకాంత్,తుత్తురు దేవేందర్,మూలం రాజు,జక్కుల అనిల్,మంద బాలయ్య,బర్ల కుమారస్వామి,జక్కుల కనకయ్య,పురాని ఎల్లయ్య,మూలం ఐలయ్య తదితరులు ఉన్నారు.

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి.

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలా మాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సామాజిక సంఘ సంస్కర్త,సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు విద్య కోసం జీవితాంతం కృషి చేసిన సంఘసేవకుడైన మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతి సందర్బంగా వారి సేవలను స్మరిస్తూ.వారికి నా ఘన నివాళులు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ ,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, వార్డ్ అధ్యక్షులు దత్తాత్రేయ,అలి,వెంకట్,విశ్వేశ్వర్,
బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్,నాయకులు తులసి దాస్ గుప్తా,రాజ రమేష్ ,జగదీశ్వర్,ఆనందం,ప్రవీణ్ పాటిల్,ఎజాస్ బాబా,గణేష్ ,నర్సింహ రెడ్డి,దీపక్,లక్ష్మీకాంత్,మోహన్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి;*

 

అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడు,భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి కార్యక్రమాన్ని నర్సంపేట టౌన్ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు నిర్వహించారు. దళిత రత్న,దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ కళ్ళేపెళ్లి ప్రణయ్ దీప్ ఆధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దళిత ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయకులు జనగాం కుమార్,అందె రవి దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ దళిత రత్న గుంటి వీర ప్రకాష్ దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్ తడుగుల విజయ్ లు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత నేత బీహార్ లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోయిని నారాయణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు సాంబయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు గిరిగాని శ్రీనివాస్, కుల పెద్దలు మాదాసి సదానంద,కరుణాకర్, నవీన్, రాజు,మాల మహానాడు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

: రాజానెల్లి ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం రాజానెల్లి గ్రామంలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతదేశ మాజీ ఉప ప్రధానీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ , డీ .ధనరాజ్ మాట్లాడుతూ. బాబు జగ్జీవన్‌ రామ్‌ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ అని, పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు , నేటి యువత ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలోడి ధనరాజ్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ . మధుకర్. బాగప్ప.ఏవన్ గోల నర్సింలు. గోల సురేష్.హబ్రహం. మెషె. పి.లక్మ్యాన్. చింటూ . సంగన.ఈశ్వర్.కజమియా.ఉపరి వినయ్. జ్యోత్ . నాగప్ప పటేల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 6 ఏరియాలోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం యువజన విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
బి.సదానందం ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.నర్సింగ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్
బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసిన ఘన నివాళులు అర్పించారు.అనంతరం జె. నర్సింగ్ మాట్లాడుతూ..
దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట యోధుడు అణగారిన వర్గాల సంక్షేమం కోసం సంఘ సంస్కర్తగా అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి సంకల్పించిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్ వారు మన దేశానికి తొలి దళిత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆదర్శ పాలక అధ్యక్షులుగా పేరు గడించారని తెలియజేశారు.అలాగే అతి పిన్న వయసులో మంత్రి బాధ్యతలు చేపట్టి భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా 40 ఏళ్ల పాటు భారత దేశ పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులను చేపట్టిన గ్రామీణ కార్మికుల కోసం అణగారిన వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ పని చేసే వారని అలాంటి మహనీయుడైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క 118 వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మంచిర్యాల నియోజకవర్గ కమిటీ మరియు యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అభినందనీయమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో
సంక్షేమ సంఘం నస్పూర్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శులు సిహెచ్ వాసు,టి.విజయ్ యూత్ నాయకులు,సుజిత్,ప్రజ్వాల్, జశ్వంత్,అరవింద్,బబ్లూ, నరేష్,తేజ,యశ్వంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి

దళిత సింహం జగ్జీవన్ రామ్-ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి

పరకాల నేటిధాత్రి

 

పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత సింహమని బీహార్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 198లో ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారని ఆయన జన్మదినాన్ని భారతదేశమంతట సమతా దివసుగా జరుపుకుంటారన్నారు.అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి షెడ్యూల్ కులాలను ఆయన సంఘటితం చేశారని,బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారని తెలిపారు.సామాజిక చైతన్యం సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెసెడ్ క్లాసెస్ లీగ్అఖిల భారతీయ రవిదాస్ మహాసభకు పునాది వేశారని అలాగే 1935లో అక్టోబర్19న దళితులకు ఓటు హక్కు కోసం హమండ్ కమిషన్ ముందు వాదన వినిపించారన్నారు.రాజ్యాంగ సభలో సభ్యుడుగా ఆయన పాత్ర ఎనలేనిదని దళితుల సామాజిక న్యాయ రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటుచేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్ లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి తర్వాత కమ్యూనికేషన్,రైల్వే,రవాణ,ఆహార,వ్యవసాయ,రక్షణ వంటి కీలక శాఖలో బాధ్యతలు నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడానికి జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్ఎఫ్ నాయకులు బొచ్చు సంపత్ మాదిగ,దైనంపెళ్లి అజయ్ మాదిగ,ఒంటేరు మహేందర్ మాదిగ,ఏకు ప్రణయ్ మాదిగ,ఒంటేరు చరణ్ మాదిగ లు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమానికి ఎంపిడిఓ ముఖ్య అతిధులుగా హాజరైయ్యరు, కార్యక్రమము లో హద్నూర్ హెచ్ఎం అమృత్ సార్, ఎపిఓ రాజ్ కుమార్,బర్ధిపూర్ మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ పెంటయ్య, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, డాక్టర్ జాన్ శ్రీకాంత్,బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్,నాయకులు మాటూర్ రాజ్‌కుమార్, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, వై నగేష్, ఎం విష్ణు,రాజేందర్,పాండు ముదిరాజ్,, సోషల్ మీడియా దిగంబర్,మోనిరిటీ యూత్ వైస్ ప్రెసిడెంట్ ,ప్రవీణ్ మరియూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది,నాయకులు,వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.

సిరిసిల్ల జిల్లా సినారే గ్రంథాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి
* పాల్గొన్న గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్*

* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*

 

 

సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

Sinare Library

 

ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీ నాగుల సత్యనారాయణ గారు గ్రంథ పాలకుడు కమటం మల్లయ్య పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Sinare Library

 

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

ఝరాసంగం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రాం 117వ జయంతి వేడుకలు ఝరాసంగం మండల కేంద్రమైన గ్రామపంచాయతీలో ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన చిత్రపటాన్ని స్పెషల్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్​రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ సాబ్ సంగమేశ్వర్ నర్సింలు మోహన్ ఏ వన్ మరియు తదితరలు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలిలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో “మహానీయుల స్ఫూర్తి యాత్ర” కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసయ్య హాజరై మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మహనీయుల జయంతి సందర్భంగా మండల కేంద్రంలో మహనీయుల స్ఫూర్తి యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన బాపు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు వర్ధన్నపేట మండలంలోని గ్రామాలలో మహానీయుల స్ఫూర్తి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ యాత్రలో భాగంగా మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి గడపగడపకు చేరవేసి వారి ఆశయాలను కొనసాగింపుగా యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్య పరుస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మహానీయుల జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మరిపట్ల అంజయ్య, ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, టిఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కో కన్వీనర్ జంగిరి భాస్కర్,ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెపాక చంద్రమౌళి, వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, స్వామి, ఎస్టి నాయకులు భీమా నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు కుమారస్వామి, గణేష్, ప్రభాకర్, రమేష్, లాలు నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.  

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరుప్పుల మండల పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి హాజరై, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అన్యాయానికి వ్యతిరేకంగా, రైతుల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు. ఆయన చూపిన మార్గంలో నడిచి, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతుల భద్రతకు కల్పించిన అద్భుత సంక్షేమ కార్యక్రమాలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి జీవనోపాధిని మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అని పేర్కొన్నారు. అదనంగా, రైతులు అన్నదాతలు వారికి గౌరవం కల్పించడం మన బాధ్యత. దొడ్డి కొమురయ్య వంటి పోరాట యోధుల త్యాగాల వల్లే ఈ రోజు రైతులు హక్కులు పొంద గలుగుతున్నారు. ఈ త్యాగాలను గుర్తుంచుకుని, ప్రతి రైతు సంక్షేమానికి పాటుపడాలి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రాంతీయ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ, రైతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి:-

 

మండల కేంద్రంలో పేర్ని రవి కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ సాయిధరైతంగ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కురుమ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
భూమికోసం ,భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి నిజాం నిరంకుశ తూటాలకు బలి అయినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తలుచుకుంటే మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్య తెలంగాణలో బానిసత్వాన్ని నిర్మూలించాలని గ్రామ గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచినటువంటి వ్యక్తి దొడ్డి కొమురయ్య కాబట్టి ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటూ.

ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా నాయకులు గొరిగె రవి కురుమ, మాల్ల యాకయ్య , పేర్ని వీరస్వామి, మరాటి జంపయ్య, దేవర మహేందర్, పేర్ని వెంకటేష్ ,పేర్ని అనిల్ ,దేవర కుమార్ ,కొలుపుల రాజు, పేర్ని శ్రీశైలం యాదగిరి ,నర్సయ్య, పేర్ని వీరయ్య, దేవర సత్తయ్య,కురుమ సంఘం పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version