బాలయ్య ఆవేశం..చిరు సందేశం!

`రసకందాయంలో కూటమి రాజకీయం!

`ఇప్పుడు తేలుతుంది అసలైన మిత్ర ధర్మం.

`తమ్ముడు అన్న వైపు నిలుస్తాడా!

`రాజకీయమే ముఖ్యమనుకుంటాడా!

`అన్నదమ్ముల మధ్య అంతరం మొదలైనట్లా!

`కూటమి బీటలకు తొలి అడుగా!

`బాలయ్య ఇంత కాలం దాచుకున్నది బైట పెట్టాడా!

`ఊహించని పరిణామమా!

`సినీ చాయ్‌లో చిన్న తుఫానా!

`జన సైనికులు స్పందించొద్దని లేఖ ఎందుకు విడుదల చేశారు.

`చిరంజీవి స్పందన నిప్పు రాజేసిందా!

`చిరంజీవి కూల్‌గా రాసిన ఉత్తరమే కుంపటి పెట్టిందా!

హైదరాబాద్‌, నేటిధాత్రి:
సినీ ఇండ్రస్ట్రీలో హీరోలు పైకి ప్లాస్టిక్‌ నవ్వులు పూయించుకుంటూ, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతారని చెప్పడానికి బాలయ్య చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఇండ్రస్త్రీ వర్గాలే అంటున్నాయి. మేమంతా బాగానే వుంటాం. మీరు మా కోసం కొట్టుకోకండి. వాదులాడుకోకండి. తిట్టుకోకండి. అంటూ నీతులు చెప్పే హీరోల మధ్య వుండే మనస్పర్తలు ఎలా వుంటాయనేది అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాటల్లో అర్ధమైంది. ఇప్పటికీ మూడుసార్లు హిందూ పురం ఎమ్మెల్యే వున్న బాలకృష్ణ బహుషా అసెంబ్లీలో మాట్లాడడం ఇది రెండోసారి అనుకుంటా…గతంలో ఒకసారి ఏదో సందర్భంలో రెండు నిమిషాలు మాట్లాడినట్లు గుర్తు. కాని ఇప్పుడు కూడా ఓ రెండు నిమిషాలు మాట్లాడారు. అది ప్రజల కోసం కాదు. ప్రజా సమస్యల మీద కాదు. తనకు జరిగిన అవమానం మీద మాట్లాడారు. తాను సినీ పెద్దను అనే విషయాన్ని పరిశ్రమ గుర్తించడం లేదన్న అక్కసును వెళ్లగక్కినట్టున్నారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఆంద్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సినీపెద్దలను అవమానించాడన్నది గత కొంత కాలంగా సాగిన విపరీత ప్రచారం. నిజానికి ఆ ప్రచారాన్ని ఆదిలోనే తుంచేయాల్సింది. కాని దానిపై
ఆ మధ్య చిరంజీవి గాని, ఇటు ప్రభుత్వ వర్గాలు గాని స్పందించలేదు. దాంతో అది చిలికి, చిలికి గాలి వాన అయ్యింది. ఒక రకంగా కూటమి విజయానికి కూడా పనికొచ్చింది. సహజంగా సినీ పరిశ్రమను అవమానిస్తే, సగటు ప్రేక్షక లోకం కూడా ఎంతో బాధపడుతుంది. తమ అభిమాన హీరోలను ఎవరు అవమానించినా తట్టుకోలేరు. అదే గతంలో జరిగింది. అయితే ఆ అవమానం జరిగిందనేది నిన్నటిదాకా పాకిన వార్త. కాని గత ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తనను ఎలాంటి అవమానం చేయలేదని, ఎంతో గౌరవంగా చూసుకున్నారంటూ చిరంజీవి మీడియాకు లేఖ విడుదల చేశారు. దాంతో వైసిపికి కొండంత బలం వచ్చినట్లైంది. కాని కూటమికే ఏకంగా చిచ్చుపెట్టినట్లైంది. మీడియాకు మంచి మసాల దొరికింది. ఓ వారం పది రోజుల వరకు ధమ్‌ బిర్యాని వండేందుకు ఢోకా లేదు. ఇరువైపుల అభిమానుల ఆవేశాలకు కూడా కొదువుండదు. పైగా మీడియా ఎప్పటికప్పుడు సినీ పెద్దల మధ్య వుండే గ్యాప్‌పై వార్తలు రాస్తే, చూశారా? అదంతా మీడియా సృష్టే అని అనేవారు. ఇదేంటి? అని మీడియా కూడా ప్రశ్నించే పరిస్దితి వచ్చింది. అసలు మ్యాటర్‌లోకి వెళ్లే, గురువారం నాడు అసెంబ్లీలో బిజేపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ గత ప్రభుత్వ అదికారంలో సినీ పెద్దలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో చిరంజీవి లాంటి హీరో మాజీ సిఎం. జగన్‌ను కలిసేందుకు స్వయంగా ఆయన ఫోన్‌ చేసినా స్పందించలేదని గుర్తుచేశారు. పరిశ్రమ గురించి మాట్లాడాలంటూ పదే పదే అడగడంతో ఓ ఐదుగురు మాత్రమే రావాలని జగన్‌ సూచించినట్లు కామినేని గుర్తుచే శారు. పైగా చిరంజీవి బృందం తాడేపల్లి గూడెం జగన్‌ ప్యాలెస్‌కు వెళ్లే అవమానించారన్నారు. గేటు బైటే హీరోల కార్లు ఆపేసి, నడుచుకుంటూ వెళ్లేలా చేశారు. తీరా చిరంజీవి బృందం అక్కడికి వెళ్లినా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చించి వెళ్లండని జగన్‌సందేశం పంపినట్లు గుర్తుచేశారు. దాంతో చిరంజీవి ఒకింత అసహనానికి గురై జగన్‌ రమ్మంటేనే వచ్చాం. అలాంటిది ఇలా అవమానిస్తారా? అని బెదిరించడంతో అప్పుడు జగన్‌ వచ్చారని కామినేని అన్నారు. దీంతో ఒక్కసారికి అసహనానికి గురైన ఎమ్మెల్యే బాలయ్య లేచి కామినేని చెప్పిందాంట్లో కొన్ని అబద్దాలున్నాయన్నారు. జగన్‌ను ఎవరూ బెదిరించలేదన్నారు. అందులోనూ ఎవడూ…అంటూ ఏక వచనం ప్రయోగించారు. ఆ సమయంలో తనను కూడా సంప్రదించారని బాలయ్య గుర్తు చేశారు. అయి తే జగన్‌ను ఉద్దేశించి బాలయ్య మాట్లాడుతూ సైకో అని సంబోధించారు. చిరంజీవిని సినీ పెద్దగా గుర్తించే అర్ధమొచ్చేలా కామినేని వ్యాఖ్యల ను బాలయ్య తప్పు పట్టారు. ఇది గడిచిన కొద్ది సేపటికే చిరంజీవి మీడియాకు మూడు పేజీల లేఖను విడుదల చేశారు. బాలయ్య చెప్పినదాంట్లో నిజం లేదన్నారు. తాను అమెరికాలో వున్నానని, అందుకే లేఖ విడుదల చేశారు. అందులో ఏపి మాజీ ముఖ్యమంత్రి తనను ఎలాంటి అవమానాలకు గురి చేయలే దని స్పష్టం చేశారు. ఒకసారి జగనే స్వయం గా తనను ఇంటికి ఆహ్వానించడంతో తాను, తన సతీమణితో కలిసి లంచ్‌కువెళ్లడం జరిగిందని చిరంజీవి చెప్పారు. ఆ సమ యంలో సినీ పరిశ్రమ సమస్యలపై ఒకసారి సమయం ఇస్తే మరోసారి వస్తామని చిరం జీవి చెప్పారు. దాంతో తప్పకుండా రండి. సమయం ఇస్తామని జగన్‌ చెప్పడం జరిగింది. కొంత కాలానికి ఓ ఐదుగురు సీనీ పెద్దలతో కలిస రావొచ్చని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సమాచారం చిరంజీవి చేరవేశారు. దాంతో ఐదుగురితో కాకుండా ఓ పది మంది వస్తామని చిరంజీవి చెప్పారు. కోవిడ్‌ కారణంగా ఐదుగురిని రమ్మని చెప్పడమే తప్ప మరో ఉద్దేశ్యం లేదని పేర్ని నాని చిరంజీవిని చెప్పి చూశారు. అయితే పది మందికి అవకాశమివ్వండని అడగడంతో సరే అన్నారు. పది మంది చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలంతా జగన్‌ను కలిశారు. వచ్చారు. దీనిపై ఇప్పుడు అసెంబ్లీ లో రగడ జరగడం పట్ల చిరంజీవి వెంటనే స్పందించారు. జగన్‌ తప్పేమీ లేదని తేల్చారు. అయితే అసెంబ్లీలో బాలయ్య తన పేరు ఆ సమయంలో 9 నెంబర్‌గా రాయడం జరిగిం దని అందుకే తాను వెళ్లలేదన్న అర్ధమొచ్చేలా చెప్పారు. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో కూడా ఆ సమయంలో లిస్టు తయారు చేసింది ఎవరని కూడా ప్రశ్నించినట్లు బాలయ్య చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే బాలయ్య మానసిక పరిస్దితి ఇలా వుందంటూ పెద్దఎత్తున వైసిపి బ్యాచ్‌ ఆరోపణల పర్వానికి దిగింది. జగన్‌ హయాంలో మంత్రి పేర్ని నాని అయితే, ఇప్పటి మంత్రి కందుల దుర్గేష్‌ను అడిగానని చెప్పడంతో బాలయ్య ఏ పరిస్ధితుల్లో వున్నాడో అర్దం చేసుకోవచ్చంటూ రకరకాల ఆరోపణలు వైసిపి చేసింది. పైగా జగన్‌నుద్దేశించి అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన తీరుపై వైసిసి తీవ్ర అభ్యంతరం తెలిపింది. గతంలో వైఎస్‌ రాజశేఖరెడిడ్డి కనికరించకపోతే పరిస్దితి ఎలా వుండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని వైసిసి నాయకులు గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన తెరమీదకు తెచ్చారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌, జ్యోతిష్యుడు సత్యనారాయణ మీద బాలయ్య కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు నందమూరి కుటుంబంతా మూకుమ్మడిగా వెళ్లి, వైఎస్‌. రాజశేఖరెడ్డిని ప్రాధేయపడితే కనీసం జైలుకు వెళ్లకుండా బాలకృష్ణ బైటకువచ్చిన సంగతి గుర్తు చేశారు. బాలకృష్ణ ఆ కేసు నుంచి బైటకు వచ్చేందుకు అప్పటి వైద్యుడు కాకర్ల సుబ్బారావు జారీ చేసిన సర్టిపికెట్‌ను వైసిపి బైట పెట్టింది. ఎవరి మానసిక పరిస్దితి బాగాలేదని కేసు నుంచి తప్పించుకున్నారో చూడండి అంటూ వైసిసి నాయకులు చెబుతున్నారు. ఇదిలా వుంటే కూటమి మధ్య కుంపటి రగలకుండా వుండేం దుకు జనసేనకూడ వెంటనే స్పందించింది. చిరంజీవి మీడియాకు విడుదల చేసిన లేఖపై ఎవరూ స్పందించొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా జనసేన చిరంజీవికి మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి జనసేన పార్టీకి ప్రచారం చేసింది లేదు. జనసేనకు చిరంజీవి అండగా వున్నది లేదనే అర్ధమె ుచ్చేలా జనసేన ప్రకటించింది. జనసేన నాయకులు ఎవరు స్పందించినా అది కూటమి కి నష్టం జరుగుందున్న అభిప్రాయాన్ని పార్టీ వ్యక్తం చేసింది. ఇక ఇది ఎంత దూరం పోతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పేలా లేదు. బాలయ్య క్షమాపణ చెప్పాలని వైసిపి డిమాండ్‌ చేస్తోంది.జీవితం కాపాడిన రాజశేఖరరెడ్డిని జీవితాంతం బాలయ్య గుర్తుంచు కోవాలని హితవు పలుకుతున్నారు. అఖండ సినిమాకు సంబంధించి బాలయ్య నాలుగుసార్లు తనకే ఫోన్‌ చేసినట్లు మాజీ మంత్రి పేర్ని నాని ఒట్టేసి మరీ చెబుతున్నాడు. బాలయ్య మన వద్దకు రావడం ఎందుకు? టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించమని జగన్‌ ఆదేశిస్తే తానే అనుమతిచ్చినట్లు పేర్ని నాని అన్నాడు. ఇలా అటు సినిమా పరిశ్రమ, ఇటు రాజకీయ వేదికలన్నీ బాలయ్య వైపే వేళ్లు చూపిస్తున్నాయి.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మాల్స్‌లో దో నెంబర్‌ మాల్‌!?

-మహిళల వస్త్రాలలో పెద్ద ఎత్తున విషపూరిత రసాయన రంగులు!

-మహిళలకు క్యాన్సర్‌ కారకాలకు దారులు!

-అగ్గువ అని చెప్పి, బట్టలతో పాటు రోగాలు అంటగడుతున్నారు.

-ప్లాస్టిక్‌తో కూడుకున్న బట్టల అమ్మకాలు!

-కాటన్‌ ఖరీదుకన్నా ప్లాస్టిక్‌ చౌకగా కొనుగోలు?

-అతి ప్రమాదకరమైన రసాయనాలు కలిపి బట్టల తయారీ!

-వాటిని చౌకగా తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్న మాల్స్‌!?

-మంగళకరమని ప్రకటనలు!

-ఆరోగ్యాలు పాడు చేసే ప్లాస్టిక్‌ దారాలతో తయారైన వస్త్రాలు.

-రంగురంగుల జిగేల్‌ మనిపించేలా రసాయనాలతో బట్టలు!?

-మాల్స్‌లకు పెట్టేది అమ్మవార్ల పేర్లు!

-అమ్మేది అంగడి సరుకుకన్నా అద్వాహ్నం!

-నాసిరకం మెరుగులతో కనికట్టు వ్యాపారం.

-అద్దాల షాపులు చూసి మోసపోకండి.

-రంగు రంగుల వస్త్రాలు చూసి మురిసిపోకండి!

-డిస్కౌంట్ల పేరుతో సాగించే అమ్మకాల ముందు సాగిలపడకండి!

-కిలోల చొప్పున అమ్మకాలంటే ఆశ పడకండి.

-ఏ వ్యాపారి నష్టాలకు అమ్మకాలు చేయరు.

-మాల్స్‌లో తక్కువ ధరలకు అసలే అమ్మరు.

-ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు.

-రెండిరటీ ధరలు ఒక్క దానిలోనే తీస్తారు.

-ఒరిజినల్‌ పట్టు అని మహిళలను నమ్మిస్తారు!

-తామే ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించామంటారు.

-పెళ్ళి, పేరంటం, పండగలు, గిఫ్టుల పేరు చెబుతారు!

-ఆకర్షణీయమైన వస్త్రాలంటూ నాసి రకం అంటగడతారు.

-జనాలను నిండా ముంచేస్తున్నారు.

-ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు సాగిస్తున్నారు.

-మహిళల బలహీనతను దండిగా సొమ్ము చేసుకుంటున్నారు.

-సంప్రదాయమైన పేర్లు మాల్స్‌కు పెడతారు.

-ప్రజల్ని మోసం చేసి వ్యాపారం సాగిస్తుంటారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
గోల్‌ మాల్‌, గోల్‌ మాల్‌ గోవిందం..మనకు అంటగట్టే బట్టలన్నీ నాసిరకం. అవును? కాదని ఎవరు చెప్పినా అది అబద్దం. వ్యాపారం చేసే వారు పట్టపగలు చేసే పచ్చి మోసం. ఇప్పుడు మనం చూస్తున్న, బట్టలు కొంటున్న మాల్స్‌లలో ఎక్కువ శాతం దో నెంబర్‌ మాలే ? కాదని వ్యాపారులు అనొచ్చు. చెప్పొచ్చు. మాయ మాటలు చెప్పి మనకు బట్టలు అంటగట్టొచ్చు. అది కూడా వ్యాపారమే..కాని మనకు జాగ్రత వుండాలి. మనం జాగ్రత్తగా నాణ్యమైన బట్టలు కొనుగోలు చేయాలి. కాని మనం రంగురంగుల లైట్లంటేనే ఇష్టపడతాం. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లోనే కొనుగోలు చేయడానికి తొందరపడతాం. డబ్బులన్నీ పోగొట్టుకుంటాం. ఒకప్పుడు ఒక్క డ్రెస్‌ కొంటే ఎంత నాణ్యతగా వుండేదో అందరకీ తెలుసు. కాని గతంలో లాగా రెండు మూడు డ్రెస్సులతో ఏడాది గడిపే రోజులు కాదు. నాలుగు చీరలలో సంవత్సరం పూర్తి చేసే రోజులు అసలే కాదు. కట్టుకున్నా,కట్టుకోకపోయినా బీరువా నిండా కొత్త చీరులు వుండాలి. ఒక్కసారి కట్టిన చీర ఎంత ఖరీదైనా రెండోసారి కట్టుకుంటే నామూషీ అనుకునే రోజులు. ఒక ఫంక్షన్‌కు కట్టుకున్న చీరలు, వేసుకున్న డ్రెస్సుల మరో ఫంక్షన్‌లో కట్టుకుంటే ఇబ్బంది. అందుకే కొత్త కొత్త బట్టలు ఎప్పటికప్పుడు కావాలి. కట్టుకున్న రోజు ఆ బట్టలు దగధగ మెరవాలి. ఇదే ఇప్పుడు ట్రెండ్‌. అందుకు తగ్గట్టు ఫ్యాషన్‌. అందుకే మాల్స్‌ మనల్ని మోసం చేస్తున్నాయి. అంగడి సరుకుకన్నా అద్వాహ్నమైన బట్టలు అంటగడుతున్నాయి. అయితే ఇందులో జరిగే మోసం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. ఆనారోగ్యాల పాలు కావల్సి వస్తుందన్న నిజం చాల మంది తెలుసుకోలేకపోతున్నారు. మనం ఎంత ఖరీదు పెట్టి కొన్న బట్టలైనా సరే నాసిరకంగా వుండడమే కాదు, అందులో ప్లాస్లిక్‌ ఎక్కువగా కలుపుతున్నారన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాం. దాంతో అద్దాల షాపులు చూసి మురిసిపోతున్నాం. రంగు రంగుల దస్తులు చూసి మోస పోతున్నాం. డిస్కౌంట్ల పేరుతో అమ్మకాలు జరుపుతుంటే అవసరం లేకున్నా కొనుగోలు చేసుకుంటున్నాం. రోజుకోటి కొత్త డ్రెస్‌ వేసుకోవడమే గ్రేట్‌ అనుకుంటున్నాం. అయితే ఇటీవల మార్కెట్‌ను ముంచేస్తున్న దుస్తులన్నీ ఎక్కువగా ప్లాస్టిక్‌ దారాలతో తయారుచేస్తున్నారు. దాంతో ఎంతో మంది మహిళలు అనారోగ్యాల పాలౌతున్నారు. ఒంటి మీద గంటల తరబడి ప్లాస్టిక్‌తోపాటు, విషపూరిత రసాయనాలు కలిపి తయారు చేసిన బట్టలను వేసుకుంటున్నాం. దాంతో శరీరంలో మార్పులు కొని తెచ్చుకుంటున్నాం. మనం వినియోగించే ఆహార పదార్దాలు, ఒంటికి దరించే వస్తువులన్నీ ప్లాస్టిక్‌ మయమైపోతున్నాయి. అయినా గొప్పల కోసం కొనుగోలు చేస్తున్నాం. అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. మాల్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు నగరాలలో కూడా అనేక బట్టల షాపులు వుండేవి. ఇప్పుడు వాటన్నింటినీ మాల్స్‌ వచ్చేసి మింగేశాయి. చిన్న చిన్న పట్టణాలకు సైతం పెద్ద పెద్ద మాల్స్‌ వచ్చి చేరాయి. ఐదు నుంచి పది లక్షల జనాభా వున్న పట్టణాలతోపాటు, నగరాలను ఎంపిక చేసుకొని విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి వ్యాపారంలోనైనా నష్టాలుంటాయోమో కాని బట్టల వ్యాపారంలో కొనసాగిన మాల్స్‌ మూసేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత రియల్‌ వ్యాపారం, బట్టల వ్యాపారం విపరీతంగా పెరిగిపోయాయి. మన రాష్ట్ర వ్యాపారులే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున వ్యాపారులు వస్తున్నారు. మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా వాటిని బాగా ఎంచుకుంటున్నారు. ఖరీదైన బట్టలను కొనుగోలు చేయడం స్టేటస్‌ సింబల్‌గా మార్చుకుంటున్నారు. దాంతో మాల్స్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. కాని మనం కొనుగోలు చేస్తున్న బట్టల్లో నాణ్యత తెలుసుకుంటున్నామా? గుర్తిస్తున్నామా? ఒకటి రెండు ఉతుకులకే ఎంతో ఖరీదైన బట్టలు కూడా రూపు రేఖలు చెదిరిపోతున్నాయి. వాటి నాణ్యతాలోపం బైట పడుతున్నాయి. వాటిని మళ్లీ మాల్స్‌కు తీసుకెళ్లలేం. మాల్స్‌ యజమానులను నిలదీయలేం. ఎవరో ఒకరు…ఎక్కడో అక్కడ ప్రశ్నించినా మీ ఉతుకులో లోపాలంటారే గాని, మా బట్టల్లో తప్పుందని మాత్రం ఎప్పుడూ ఒప్పుకోరు. వినియోగదారులు అక్కడిదాక ఎప్పుడూ వెళ్లరు. ప్రజల ఆ బలహీనతే మాల్స్‌కు పెట్టుబడిగా మారుతున్నాయి. ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మాల్స్‌లో మనం చూసే బట్టలన్నీ ముతక బట్టలే. ముక్కిన బట్టలే. ఒక్కసారే లారీల కొద్ది బట్టలు క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి, మాల్స్‌కు నాలుగైదు రెట్లు పెద్దవైన గోడౌన్లలో ఏళ్ల తరబడి నిలువ చేసి వాటిని వినియోగదారులకు అంటగడుతుంటారు. కొత్త స్టాక్‌ అని నమ్మించి మోసం చేస్తుంటారు. ఎప్పుడో కొనుగోలు చేసిన బట్టలకు కొత్త కొత్త స్టిక్కర్లు వేసి ప్రజల నిండా ముంచేస్తుంటారు. నాసికరకం బట్టలనే ఎక్కువగా అంటగట్టేస్తుంటారు. వాటిపై వుండే రంగులను చూసి మోసపోతుంటాం. అయినా అలాంటి మాల్స్‌లనే ఎంచుకొని పదే పదే కొనుగోలు చేస్తుంటాం. ఎందుకంటే అవి అద్దాల మేడలు. రంగుల రంగుల ప్రపంచం. రకరాల రంగుల లైట్లన్నీ వేస్తారు. సెంట్రల్‌ ఏసిలతో చల్లబరుస్తారు. ఎంతసేపైనా సరే బట్టలను ఎంచుకునే సమయం ఇస్తారు. మాయ మాటలతో ఒకటి కొనుగోలు చేయాలని వెళ్లిన వారి చేత పది కొనిపిస్తారు. ఇదే అసలు రహస్యం. నిజానికి అ రంగురంగుల ప్రదర్శన అంతా అబద్దమే…మన కళ్లను మనతోనే మోసం చేసే ఎత్తుగడలు. ఇక క్లియరెన్స్‌ సేల్‌ అంటారు. అంటే అర్ధమేమిటో ఎవరికీ తెలుసు. అయినా ఎగబడి కొంటాం. అంటే పాత స్టాక్‌ను తీసేస్తున్నాం. అవి అడ్డికిపావుసేరు అమ్మేస్తున్నాం. డెబ్బై ఎనభై శాతం రిబేటు ఇస్తున్నామంటారు. అదెలా సాధ్యమని ఎవరూ ఆలోచించరు. ఐదు వందల చీరపై రెండు వేల స్టిక్కర్‌ అతికించి, డిస్కౌంట్‌ పేరుతో అదే ఐదు వందలకు అమ్మేస్తుంటారు. మనల్ని నిండా ముంచేస్తుంటారు. ఐదు వందల చీరను వందకు అమ్మితే అది డిస్కౌంట్‌ అవుతుందే తప్ప, ధరలు ఇష్టాను సారం పెంచి, తగ్గించినట్లు ప్రచారం చేసి అమ్మితే ఎలా డిస్కౌంట్‌ అవుతుందో అని ఒక్క క్షణం ఆలోచించం. డిస్కౌంట్‌ సేల్‌ డిస్కౌంట్‌ సేల్‌ అంటూ బురిడీ కొట్టిస్తూనే వుంటారు. మనం వెళ్లి కొంటూనే వుంటాం. షాపింగ్‌ అని అందమైన పేరుపెట్టుకొని అవసరం లేకున్నా వేలు తగలేసి చీరలు, డ్రెస్సులు కొనుగోలు చేస్తుంటాం. మన బీరువాలు నింపేసుకుంటాం. వాటిని కట్టేది లేదు. చూసుకొని మురుస్తుంటాం. కొత్త స్టాక్‌ వచ్చిందని, ప్రతి కొనుగోలు మీద బంపర్‌ ఆఫర్లు పెట్టామని ప్రచారం చేస్తుంటారు. లక్కీ డ్రాలు పెడుతుంటారు. బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను ఎరగా చూపుతారు. మళ్లీ మన చేత బట్టలు కొనిపిస్తూనే వుంటారు. ఎండాకాలంలో పెళ్లిళ్ల సీజన్‌ అయిపోగానే సహజంగా ఆషాడం వస్తుంది. ఆషాడంలో ఎలాంటి కొత్త వస్తువులు ఎవరూ కొనుగోలు చేయరు. కాని బట్టల మాల్స్‌మాత్రం ఆషాడం స్పెషల్‌ అని కొనిపిస్తారు. పెళ్లి చేసుకొని అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వచ్చిన ఆడపిల్లల చేత ఆషాడ మాసంలో కూడా బట్టలు కొనుగోలు చేసేలా ఆఫర్లు ప్రకటిస్తారు. ఆషాడం పూర్తయి, శ్రావణ మాసంలో అత్తవారింటికి వెళ్లే కొత్త దంపతుల చేత పవిత్రమైన మాసమంటూ కొత్త బట్టలు కొనుగోలు చేసేలా ప్రచారం సాగిస్తారు. ప్రతి నెల ఏదో ఒక రకమైన ప్రలోభాలకు గురి చేస్తూనే వుంటారు. ఆ తర్వాత వచ్చే దసరా,దీపావళి పూర్తయ్యే సరికి ప్రజల ఇంట్లో వున్న సొమ్మంతా మాల్స్‌లో బట్టల ఖరీదుకు ఖర్చయ్యేలా చేస్తారు. ఏ పండుగ వచ్చినా ఆ పండుగ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయినా అమ్ముడు పోకుండా వున్న స్టాక్‌ నంతా అడ్డికి పావుసేరు అమ్మలేరు. అమ్మాలనుకున్నా ఎవరూ కొనుగోలు చేయరు. బట్టల వ్యాపారమంతా మాయా జాలమే..మన కళ్లకు గంతలు కట్టడమే. పట్టపగలే చుక్కలు చూపించడమే. పగటి వేళలో రంగు రంగుల లైట్లు వేసి బరిడీ కొట్టించడమే. ముతక బట్టలు కూడా అందంగా కనిపించేలా కనికట్టు చేయడమే. అందుకే మాల్స్‌ చూసి మోసపోకండి. పైన పటారం.లోన లొటారమే వుంటుంది. మాల్స్‌ చేసేదంతా మోసమే..మన సొమ్ముకు కన్నం వేయడమే..ఇది తెలుసుకుంటే ఎవరూ మాల్‌ వరకు వెళ్లరు. చేతి చమరు వదిలించుకోరు. చేనేత కార్మికులు మగ్గం మీద ఎంతో కష్టపడి నేసే పట్టు చీరను పోలిన యంత్రాల తయారీ మీద రెడీ అయిన నాసికరకం చీరను అసలు చీరకన్నా ఎక్కువ ఖరీదుకు అమ్ముతున్నా పట్టించుకునే నాధుడు వుండడు. వాటిపై చర్యలు తీసుకోరు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలు కోవాలి.

‘‘హవాలా మార్గంలో’’..’’రిజిస్ట్రార్ల లంచాలు’’!?

`‘‘నేటిధాత్రి’’ చేతిలో వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ‘‘లంచావతారుల చిట్టా’’

`ఏసీబీ అధికారులకే చుక్కలు చూపిస్తున్న లంచావతారులు

`తెలివి మీరిపోయిన రిజిస్ట్రార్లు!?

`ఏసిబికి చిక్కకుండా కొత్త కొత్త పన్నాగాలు!

`చేతికి మట్టి అంటకుండా లంచాలు!

`మార్వాడీలతో రిజిస్ట్రార్ల స్నేహాలు.

 

 

`షాపింగ్‌ మాల్స్‌లతో ఆర్థిక లావాదేవీలు!

`అధికారుల లంచాలతో నడుస్తున్న షాపింగ్‌ మాల్స్‌?

`రిజిస్టార్ల కొత్త పోకడకు పరాకాష్ట.

`ఎంత మందిని పట్టుకుంటారో చూద్దాం!

`దొరికితే వరుసగా అందరం దొరికి పోదాం?

`ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత?

`మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో మనమూ చూద్దాం!

`కోర్టుకు వెళితే కొలువు అదే వస్తుంది?

`లీవ్‌ లో ఉన్న రిజిస్టార్లు వారి అనుచరులతో జరుపుతున్న చర్చలు?

`అందరం దొరికి పోతే పని చేసేటోడు ఎవడుంటాడో చూద్దాం?

`ప్రభుత్వానికే సవాలు విసురుతున్న రిజిస్ట్రార్లు?

`రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారో!

`ఎవడొచ్చి చేస్తాడో చూద్దాం!?

`కొంతమందికి అగర్వాల్లు వీరికి అనుచరులు?

`చెప్పిన చోట ఇస్తారు? అందుకోవాల్సిన చోట అందుకుంటారు !

హైదరాబాద్‌, నేటిధాత్రి:
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని పెద్దలు ఊరికే అనలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరుల ఆటలు సాగడం లేదు. లంచాలు తీసుకోకుండా అధికారులు ఊరుకోలేరు. గతంలో బాజాప్తాగా లంచాలు తీసుకోవడం అలవాటైన ప్రాణాలు. ఒక్కసారిగా లంచాలు తీసుకోకుండా పనిచేయాలంటే వారికి చేతులు రావడం లేదు. ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చినా వారికి భయం లేదు. ఉద్యోగాలు పోతాయన్న భయం అసలే లేదు. ప్రభుత్వాదేశాలు లెక్క చేసేదేమిటన్నట్లు అవినీతి సాగిస్తూనే వున్నారు. లంచాలు తీసుకుంటూనే వున్నారు. ఓ వైపు నిత్యం పట్టుబడుతున్నా, అధికారుల్లో పెద్దగా చలనం లేదు. భయం అంతకన్నా లేదు. మహా అయితే ఏం జరుగుతుంది? నాలుగు రోజులు జైలుకెళ్తాం..అంతకు మించి జరిగేదేమీ వుండదు. ఉద్యోగమైతే పోయేది కాదు. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం తెచ్చుకోవడం ఖాయం. అంతకు నాలుగు రెట్లు సంపాదించుకోవడం తధ్యమన్నట్లు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. అయితే నిత్య సంతర్పణలు సాగే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మాత్రం గతానికి భిన్నంగా లంచాల దారి మళ్లింది. లంచాలు నేరుగా తీసుకోకుండా కొత్త మార్గం అన్వేషించారు. లంచాలు మానుకునే ప్రసక్తే లేదన్నట్లు రిజిస్ట్రార్లు తయారయ్యారు. ఇప్పుడు హవాలా మార్గం ఎంచుకున్నారు. ఏసిబి అదికారులు రావడం. రెడ్‌ హాండెడ్‌గా పట్టుకోవడం. జైలుకెళ్లడం..ఈ తిప్పలంతా లేకుండా లంచాలు తీసుకొని పని చేసే కొత్త దారి వెతుక్కున్నారు. తలనొప్పి తగ్గించుకున్నారు. భయపడుతూ సంతకాలు చేయాల్సిన పని లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే పరిస్ధితులకు అనుగుణంగా మారాలి. లంచాలు తీసుకునే కొత్త దారిని వెతుక్కొవాలనుకున్నారు. మొత్తానికి సబ్‌ రిజిస్ట్రార్లు తెలివిమీరిపోయారు. ఏసిబికి చిక్కకుండా పన్నాగాలు పన్నుతున్నారు. చేతికి మట్టి అంటకుండా లంచాలు తీసుకుంటున్నారు. కనీసం అనుచరులకు కూడా తెలియకుండా చూసుకుంటున్నారు. సమాచారం ఎక్కడా లీక్‌ కాకుండా చూసుకుంటున్నారు. డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎలా పోతున్నాయో కూడా తెలియకుండానే చేతులు మారేలా చేసుకుంటున్నారు. ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి తప్ప మూడో వ్యక్తికి తెలియనంత గుట్టు చప్పుడు కాకుండా లంచాలు తీసుకుంటున్నారు. కడుపు నిండా తింటున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. తెల్లారి అక్రమైనా, సక్రమైన సరే రిజిస్ట్రేషన్లకు లంచాలు లేకుండా సంతకాలు చేయడం లేదు. గతం కాన్నా దర్జాగా లంచాలు తీసుకుంటున్నారు. గతాన్ని మించి వసూలు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్ట్రార్లు పీక్కు తింటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను లంచాల పేరుతో కాల్చుకుతింటున్నారు. ఇందుకు ఎంచుకున్న కొత్త దారి మార్వాడి. వాళ్లు ప్రజలకు కొత్త. తెలంగాణ ప్రాంతానికి కొత్త. విస్తరించిన అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలతో సఖ్యత కొత్త. వారితో హైదరాబాద్‌లో బడాబాడా మార్వాడీలతో హవాల లావాదేవీలు మొదలు పెట్టారు. తెలంగాణలో మార్వాడీల చేతుల్లో వున్న షాపింగ్‌ మాల్స్‌ యజమానులకు నేరుగా లంచాల డబ్బు చేరేలా మార్గం వేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ శాఖలో వుండే ఉద్యోగుల్లో వుండే ఐక్యత మరే ఉద్యోగుల్లోనూ కనిపించదు. ఆ ఐక్యత మళ్లీ మార్వాడీల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇదే రిజిస్ట్రార్లను, మర్వాడీలను కలిపింది. ఒక మార్వాడీకి ఇబ్బంది వస్తే, మరో మార్వాడీ సాయం చేస్తాడు. ఒక రిజిస్ట్రార్‌కు సమస్య వస్తే రిజిస్ట్రార్‌లంతా ఏకమౌతారు. ఈ మధ్య ఓ రిజిస్ట్రార్‌ కూతురు పెళ్లి చేస్తే తెలంగాణలో వున్న రిజిస్ట్రార్‌లంతా కలిసి కట్నాల కింద లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అంటే వారిలో వుండే ఐక్యతను అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలో ఇటీవల పెద్దఎత్తున వెలుస్తున్న షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉన్నత స్దాయి అదికారులు, రిజిస్ట్రార్ల లంచాల సొమ్ములతోనే వెలుస్తున్నాయి. నడుస్తున్నాయన్న విషయం తెలుస్తోంది. షాపింగ్‌ మాల్స్‌లకు అవసరమైన సరుకు కోసం లంచాల డబ్బును సమకూర్చుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇది తెలంగాణలో వున్న రిజిస్ట్రార్ల కొత్త పోడకు పరాకాష్ట అని చెప్పకతప్పదు. అంతే కాకుండా ఇలా ఏసిబీ అధికారులు పదే పదే తమపై నిఘా వల పెట్టడాన్ని సహించలేకపోతున్నారట. ఎలాగైనా పట్టుకోవాలన్న కసితో వున్న ఏసిబి అదికారులకు దొరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాగే నిత్యం నిఘా పెట్టి వేదిస్తే ఉద్యోగాలను వదులుకోవడానికి కూడా సిద్దమనే సంకేతాలు పంపాలన్న ఆలోచనలు చేస్తున్నారట. ఎంత మందిని పట్టుకుంటారో పట్టుకోండి? అనేలా ఏక కాలంలో కావాలనే అందరం దొరికిపోయే ప్లాన్‌ చేద్దామని కూడా అనుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువ వాళ్లైనా ఇలా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. కాని రిజిస్ట్రార్లలో స్టాటజీ మరో రకంగా వుంది. అందుకే దొరికితే వరసగా దొరికిపోదాం? ఉద్యోగమైతే ఎక్కడికిపోదు. తెలంగాణలో వున్న 140 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులే అతి తక్కువ. అందులోనూ సబ్‌ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు అంత పట్టుబడితే పని చేసే వారుండరు. ఏకంగా శాఖనే స్ధంబించిపోతుంది. మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో చూద్దామనే దాక రిజిస్ట్రార్లు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలో రిటైర్‌ అయ్యే అవకాశమున్న రిజిస్ట్రార్లను కావాలనే ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానపడుతూ కొంత మంది లాంగ్‌ లీవ్‌ పెట్టారు. వారి అనుచరులకు ఇన్‌చార్జిల బాధ్యతలు అప్పగించి వారి చేత పనులు పూర్తి చేయిస్తున్నారు. వచ్చే సంపాదనలో వాటలు తీసుకుంటున్నారు. అటు జీతాలు తీసుకుంటున్నారు. ఇటు లంచాలు తీసుకుంటున్నారు. అలా కూడా లంచాలు నేరుగా తీసుకోకుండా ఎక్కడిక్కడ కొందరు అగర్వాల్‌లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు వెళ్లి, కార్యాలయాల సమీపంలో వున్న మార్వాడీలకు ఇస్తారు. తర్వాత ఆ సొమ్మును మర్వాడీలు రిజిస్ట్రార్లకు ముట్ట జెప్పుతారు. అందుకు ప్రతి ఫలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, పట్టణాలలో మార్వాడీలకు పెద్దఎత్తున భూములు కూడా రిజిస్ట్రేషన్ల కూడా చేసిపెడుతున్నట్లు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగ వేళల్లో తెలంగాణలో కొన్ని వేల కోట్ల బట్టల వ్యాపారం సాగుతుంది. అందులో షాపింగ్‌ మాల్స్‌లోనే ఎక్కువగా జరుగుతుంది. ఇక నుంచి ఏసిబి అధికారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కాకుండా నేరుగా అన్ని షాపింగ్‌ మాల్స్‌ లావాదేవీలను పరిశీలిస్తే గుట్టంతా బైటకు వస్తుంది. మాల్స్‌ పెట్టుబడుల్లో వున్న పెద్ద పెద్ద అధికారులు, రిజిస్ట్రార్ల బాగోతమంతా వెలుగులోకి వస్తుంది. రిజిస్ట్రార్ల ఆట కట్టినట్లౌవుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాయాల మీద ఏసిబి రైడ్స్‌ చేసే సమయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు కార్యాలయానికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్లి వస్తున్నారో నిఘా పెడితే మొత్తం అవినీతిని జల్లడపట్టినట్లౌవుంది.

రా..రమ్మని..!

ఘర్‌ వాపసీ… అందరూ తిరిగి రండి!

`గతం మర్చిపోండి!

`అధికారంలో భాగం కండి!

`గతంలో పార్టీ కోసం పని చేశారు.

`మీకు సేవ చేయడానికి మేమున్నాం.

`పదవులిచ్చి అదుకుంటాం.

`మీ అనుభవాలను స్వాగతిస్తాం.

`పార్టీ బలోపేతానికి సిద్దమయ్యాం.

`అవకాశాలు కల్పిస్తాం!

`ఆదరించి అక్కున చేర్చుకుంటాం?

`వచ్చిన వాళ్లందరికీ సముచిత స్థానం కల్పిస్తాం.

`పదవులిచ్చి గౌరవించుకుంటాం.

`పాలనలో భాగస్వాములు చేస్తాం.

`పార్టీలో పెద్ద పీట వేస్తాం.

`మన కాంగ్రెస్‌ కోసం మళ్ళీ దరి చేరండి.

`దయచూపి పార్టీకి అండగా నిలవండి.

`పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురండి.

`కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టండి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చిన ప్రతిసారి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలోనూ ఘర్‌ వాససీ అనే కార్యక్రమం చేపడుతుండండం జరుగుతోంది. ఆ సంప్రదాయం సహజంగానే జరుగుతూ వుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీ ఇందిరాగాందీ హయంలో రెండుగా చీలిన సమయంలో ఘర్‌వాపసీ అనే కార్యక్రమం పెద్దఎత్తున విజయవంతమైంది. ఇందిరాకాంగ్రెస్‌కు మళ్లీ రెడ్డి కాంగ్రెస్‌ గ్రూప్‌ అంతా చేరిపోవడానికి ప్రధాన కారణంగా ఘర్‌ వాపసీని చెబుతారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పుడో, లేక కాంగ్రెస్‌ మీద అలిగి కొత్త పార్టీలు పెట్టుకున్నవారో తిరిగి కాంగ్రెస్‌లోకి చేరుకోవడం జరుగుతుంది. అలా ఒకప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ, ఎన్‌డీ తివారి లాంటి వారు కాంగ్రెస్‌తో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తర్వాత మళ్లీ వారి పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఎంతో మంది నాయకులు బైటకు వెళ్లిపోవడం తర్వాత కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం సర్వసాదారణమే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఘర్‌ వాసపీ కార్యాక్రమాలు పెద్తఎత్తున జరుగుతుందడేవి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఘర్‌ వాపసీ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చింది. కాని దానికి పెద్దగా స్పందన కనిపిస్తున్నట్లు లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ పిలుపు ఈ సమయంలో సరైందేనా? అన్న ప్రశ్నలు ఉత్పతన్నమౌతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ ఘర్‌ వాపసీ అనే కార్యక్రమం చేపడితే ఎంతో బాగుండేది. అప్పుడు ఖచ్చితంగా చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకునేవారు. కాని రెండేళ్ల తర్వాత ఈ పిలుపు వల్ల లాభం కనిపించడంలేదు. అదికారంలోకి వచ్చిన వెంటనే ఏంచేశారు? అనే వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడున్న పరిస్దితుల్లో పాత కాపులైనా సరే వచ్చేందుకు సిద్దపడతారా? అని కూడా చర్చించుకుంటున్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైపోతున్న కాంగ్రెస్‌పార్టీని నమ్మి మళ్లీ ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్దంగా లేనట్లే కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కేవలం పదవులను పట్టుకొని వేళాడే వృద్ద నేతలు పార్టీకి అవసరమా? అని కూడా యువనేతలు అంటున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు పనిచేయని వారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని యువ తరం నాయకులు పిపిసిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అవకాశవాదులే పార్టీ మారుతారు. అలా పదవులు కోసం పార్టీ మారిన వారు మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చి ఒరగబెట్టేందేముంటుంది? అని కూడా అంటున్నారట. అయినా సరే కాంగ్రెస్‌ పార్టీ ఘర్‌ వాపసీ అంటే స్పందనలు కూడా లేవు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల పరిస్ధితి చూస్తూ కూడా వస్తారా అని ఇతర పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసే శక్తి పార్టీ మారిన వారిలోవుంటుందా? చాదస్తం కాకపోతే ఏమిటని కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు. కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసుకునే స్దితిలో కాంగ్రెస్‌ లేదా? యువతరాన్ని ప్రోత్సహించాల్సిన తరుణంలో పాత తరం అవసరమొస్తుందా? యువతరం నాయకత్వాన్ని తయారు చేయాలని రాహుల్‌ అంటున్నారు. పాత తరం నేతలతో ఘర్‌ వాపసీ అని తెలంగాణ కాంగ్రెస్‌ బాద్యులు పిలుపునిస్తున్నారు. పార్టీ అదికారంలో వున్నంత కాలం పదవులు అనుభవించడం. పార్టీ ఓడిపోతే తమ దారి తాము చూసుకోవడం రాజకీయ పార్టీలలో సహజం. అంత మాత్రాన వెళ్లిన వాళ్లు రాకుండాపోరు. పార్టీలో వున్న వాళ్లు రేపు వుంటారన్న గ్యారెంటీ లేదు. దానికి ఘర్‌ వాసపీ అని పేరు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు. కొత్త తరం నాయకులను తయారు చేయలేమని చేతులెత్తేస్తున్నట్లా? యువతరం కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు రావడం లేదా? పాత తరమే మేలని భావిస్తున్నారా? ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. పార్టీని కాదనుకొని వెళ్లిన వారిని రమ్మని పిలవాల్సిన అవసరం ఏముంది? పార్టీలో క్రియాశీలకపాత్ర పోషించిన వారు కూడా ఎంతోమంది పార్టీని వీడి పోయారు. అలా వీడిపోయిన వారిలో పిసిసి. అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లు కూడా వున్నారు. మంత్రులుగా పదేళ్లు పనిచేసిన వారు కూడా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి. అధ్యక్ష పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది పార్టీ ప్రెసిడెంటుగా, తర్వాత పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేసిన డి. శ్రీనివాస్‌ లాంటి వారు పార్టీని వీడిపోయారు. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా కప్పుకున్నారు. అదే శ్రీనివాస్‌ బిఆర్‌ఎస్‌ అదికారం కోల్పోతే కాంగ్రెస్‌ కండువా కప్పుకునేవారేనా? అలా వచ్చిన వారిలో కేశవరావు కూడా వున్నారు. కాని ఆయన వల్ల పార్టీకి జరిగే మేలు లేదు. నష్టం కూడా వుండదు. అంతే ఆయన వున్నారా? అంటే వున్నారు? అనే పేరున్న నాయకుడు. గతంలో ఆయనకు పార్టీ పెద్ద స్ధానం కల్పించింది. పిపిసి. అధ్యక్షుడిని చేసింది. కాని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ మారారు. పదేళ్లపాటు బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నంత కాలం అక్కడే వున్నారు. బిఆర్‌ఎస్‌ ఓడిపోగానే ఆయన పార్టీ మారారు. ఇలాంటి వారు తప్ప రాజకీయ భవిష్యత్తు వున్న వారు ఘర్‌ వాపసీ అంటే వస్తారా? నాగం జనార్ధన్‌ రెడ్డి లాంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో కీలకభూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమం సాగించారు. అప్పటి వరకు ఆయనకు వున్న పేరును ఒక్కసారిగా ఆయనే చెరిపేసుకున్నారు. ఆయన చేరని పార్టీ అంటూ లేదు. కాంగ్రెస్‌లో చేరారు. బిజేపిలో చేరారు. బిఆర్‌ఎస్‌లో కూడా చేరారు. ఇప్పుడు ఘర్‌ వాపసీ అంటే ఆయన వస్తారా? వచ్చినా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తప్ప పార్టీ కోసం వచ్చి పనిచేస్తారా? అనేది కూడా కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించుకోవాలి. పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడిని మెడలు పట్టుకొని బైటకు పంపించినంత పనిచేశారు. ఇప్పుడు ఆయన రమ్మంటే వస్తారా? వచ్చినా ఆయనను చూసి జనం ఓట్లేసి పార్టీని గెలిపిస్తారా? పైగా ఆయనను స్వయంగా సిఎం. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పొన్నాల మర్చిపొమ్మంటే పోతారా? ఈ వయసులో ఆయన పార్టీ మారితే జనం చీకొట్టరా? కాకపోతే పొన్నాల ఆత్మాభిమానం వున్న నాయకుడు. ఆత్మ వంచన చేసుకోలేడు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆమెను పార్టీలోకి రమ్మంటే వస్తుందా? సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీలోనే అక్కా..అక్కడ కూర్చోకు అక్కా..అంటూ చెప్పారు. అయినా ఆమె బిఆర్‌ఎస్‌ను వీడడానికి ఇష్టపడే పరిస్దితి లేదు. ఆమెకు బిఆర్‌ఎస్‌లో అత్యంత ప్రాదాన్యత కల్పించారు. ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. సునీత లక్ష్మారెడ్డి లాంటి వారు పార్టీకి ఎంతో సేవ చేశారు. కాని పార్టీ ఆమెను గుర్తించే పరిస్దితి లేనప్పుడే ఆమె బిఆర్‌ఎస్‌లో చేరారు. కాని ఆమెను రమ్మన్నా మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఆ నాయకుల అవసరం వుందనుకుంటే, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఘర్‌ వాపసీ చేపట్టి వుంటే ఎంతో కొంత ప్రయోజనం వుండేది. రెండేళ్ల తర్వాత పార్టీని వీడిన నాయకులను రమ్మంటే ఫలితం ఏ మాత్రం వుండదన్న సంగతి తెలియదా? అయినా రాహుల్‌ గాంధీ దేశమంతాటా పార్టీలో యువతరాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. స్వచ్చంధగా కాంగ్రెస్‌మీద గౌరవంతో పార్టీ వీడిన వారు వస్తామంటే వద్దని చెప్పలేదు. కాని యువతరాన్ని తయారుచేయాల్సిన తరుణంలో ఘర్‌ వాపసీ అంటే పార్టీ మీద తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనలు చేయడం లేదా? పార్టీ అధికారంలోవుంది. యువతను తయారు చేసుకునే అవకాశం వుంది. వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం వుంది. వారిని కాదనుకొని పాత తరాన్ని ఆహ్వానిస్తే మొదటికే మోసం వస్తుంది. పార్టీ అధికారంలోకి రాగానే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారి పరిస్ధితి ఎలా వుందో చూస్తూ కూడా, కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన నాయకులను రమ్మంటే వస్తారా? వచ్చి గుంపులో గోవిందయ్య కావాలనుకుంటారా? ఎమ్మెల్యేలకే దిక్కులేదు. మాకేం ప్రాదాన్యత వుంటుందన్న ఆలోచనలు చేయకుండా వుంటారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలే ఎందుకు దారి తప్పామా? అని ఆలోచిస్తున్నారు. ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో ఎక్కుడున్నారో తెలుసు. ఎంత మేర హమీలు అమలౌతున్నాయ అందిరికీ తెలుసు.

మహేష్ పై దాడి చేసిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదు…

మహేష్ పై దాడి చేసిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదు.

యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

 

పంచకం మహేష్ యాదవ్ కుటుంబం పై దౌర్జన్యంగా దాడి చేయించిన పులి అంజిరెడ్డి తిరుపతిరెడ్డి కి ప్రజల సమక్షంలో పతనం తప్పదని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు.చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్ యాదవ సంఘం నాయకులతో కలిసి మాట్లాడుతూ మండలంలోని కాలువ పల్లి గ్రామానికి చెందిన పంచిక స్రవంతి మహేష్ యాదవ్ ల కుటుంబంపై దౌర్జన్యంగా దాడి చేయించి గాయపరిచిన మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,కాల్వపల్లి సర్పంచ్ అంజిరెడ్డిలు పంచిక మహేష్ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా మహేష్ కు తెలియజేయకుండా తెల్లారేసరికి అక్రమంగా దేవాలయ నిర్మాణం చేపట్టగా ఇదేమిటని మర్యాదపూర్వకంగా అడుగగా వారిపై దాడి చేయించడం పులి అంజిరెడ్డి కుటుంబానికి ఆప్రజాస్వామ్యమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ మండిపడ్డారు. పంచకం మహేష్ యాదవ్ బిజెపి పార్టీ నుండి రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షతో ఆ ఊరి నుండి మహేష్ ను వెల్లగొట్టాలని నీచమైన ఆలోచనలతో పులి కుటుంబం మహేష్ ను రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక దౌర్జన్యంగా దాడులకు, బెదిరింపులకు పాల్పడుతూ నీచమైన ఆలోచనలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వదిలిపెట్టదన్నారు.ఇప్పటికైనా మహేష్ కుటుంబం పట్ల మీ నీచ రాజకీయాలు మానుకోకపోతే కాల్వపల్లికి గ్రామానికి రాష్ట్రంలోని యాదవులమందరం ఏకమై నీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాములు యాదవ్, కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్, జంగా కొమురయ్య, చంద్రశేఖర్, సతీష్, శ్రీశైలం, సంపత్, దిలీప్,యాదవులు తదితరులు పాల్గొన్నారు.

అస్త్రం, శస్త్రం ‘‘హరీషే’’!

`’’సిద్దిపేట’’ కు అన్నీ ‘‘హరీషే’’!

`సిద్దిపేట కల లో కూడా కలవరించేది ‘‘హరీష్‌’’నే!

`సిద్దిపేటను కళ్లలో పెట్టుకొని కాపాడుతున్నది ‘‘హరీషే’’!

`చెట్టు, చేమ, చెరువు, పొలం ఏదైనా సరే చెప్పే పేరు ‘‘హరీషే’’?

`చెట్టు పేరు చెప్పుకొని ఇంకెవరు వచ్చినా వట్టిదే!

`’’హరీష్‌’’ సేవను చెరిపేసే గీతలు పుట్టలేవులే?

`’’బీఆర్‌ఎస్‌’’ బ్యాక్‌ బోన్‌ ‘‘హరీష్‌’’!

`గులాబీని కాపాడే కొమ్మ ‘‘హరీష్‌’’.

`గులాబీ జెండా ఎగురవేసిన తొలి నేత ‘‘కేసీఆర్‌’’.

`తెలంగాణను గులాబీ వనంగా మార్చిన మలినేత ‘‘హరీష్‌’’.

`తెలంగాణ బ్రాండ్‌ ‘‘హరీష్‌’’.

`సకలజన హిత ‘‘హరీష్‌!లి

`పద్నాలుగేళ్ల పోరాటంలో అలుపెరగని కార్యకర్త ‘‘హరీష్‌’’.

`పార్టీయే ప్రాణమైన నేత ‘‘హరీష్‌’’!

`’’కేసీఆర్‌’’ తెలంగాణ తొలి అడుగుకు ఊత కర్ర ‘‘హరీష్‌’’.

`పార్టీకి తొలి సైనికుడు ‘‘హరీష్‌’’.

`సిద్దిపేట ‘‘హరీష్‌’’ కంచుకోట.ప్రజాభిమానంతో నిండిన కలబోత.

`’’కేసీఆర్‌’’ కలల రూపమైన సిద్దిపేటను పదిలంగా కాపాడుతున్న నేత ‘‘హరీష్‌’’.

`పార్టీకి నీళ్లు పోసి పెంచిన ‘‘హరీష్‌’’.

`పార్టీ కొమ్మలు నరికే పనిలో ‘‘కవిత’’.

`’’హరీష్‌’’ పార్టీకి మూల స్తంభం దాన్ని కూలిస్తే కూలిపోయేది ‘‘కేసీఆర్‌’’ ప్రపంచం.

`ఈ మాత్రం అవగాహన ‘‘కవిత’’కు లేకపోవడం విడ్డూరం.

`పదిలంగా ‘‘కేసిఆర్‌’’ కీర్తిని అజరామరం చేస్తున్నది ‘‘హరీష్‌’’.

`’’హరీష్‌’’ ను బూచిగా చూపి

‘‘కేసిఆర్‌’’ను నిందల పాలు చేస్తున్న ‘‘కవిత’’.

`కూర్చున్న కొమ్మను నరుక్కున్న ‘‘కవిత’’.

`’’బీఆర్‌ఎస్‌’’ పార్టీకి వారసురాలు కాలేదు.

`’’కేసీఆర్‌’’ తర్వాత స్థానం ‘‘కవిత’’కెప్పుడూ దక్కదు.??

`’’కేసీఆర్‌’’ తర్వాత ‘‘కేటిఆర్‌’’ ఆపై ‘‘హిమాన్షు’’??!

`’’హరీష్‌ రావు’’కు ఎలాంటి ఆశలు లేవు.

`ప్రజా సేవ తప్ప ‘‘హరీష్‌’’ కు మరో ధ్యాస లేదు.

`అందరినీ గెలిపించేది ‘‘హరీషే’’.

`పార్టీకి వెన్నెముకగా నిలబడేది ‘‘హరీషే’’.

`’’హరీష్‌’’ తోడుగా ‘‘కేటిఆర్‌’’ కదలితే ప్రభంజనమే!.

`అధికారంలోకి తెచ్చేది ‘‘హరీష్‌, కేటీఆర్‌’’ ద్వయమే.

`‘‘కవిత’’ రాజకీయం త్రిశంకు స్వర్గమే!.

`’’కవిత’’ కలలు ఊహల పల్లకే!.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కలలు తీరేవి కాదు. ఆశలు నెరవేరేవి కాదు. పగటి కలలెప్పుడూ నిజం కావు. ఒక్కసారి చింతమడకు వచ్చి జన్మభూమి, ఖర్మ భూమి అని డైలాగ్‌లు చెబితే జనం నమ్మేది లేదు. కేసిఆర్‌ కూతురుగా ఊరు అక్కున చేర్చుకుంటుందేమో కాని, నాయకురాలిగా ఆ ఊరు కూడా అంగీకరించదు. సిద్దిపేటలో హరీష్‌రావును రాజకీయంగా ఎదుర్కోవాలంటే అంత సులువైన పని కాదు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఛాలెంజ్‌గా నిలబడి గెలవాలి. గెలిచే స్ధానం ఎన్నుకొని గెలవాలని కోరుకోవడం నాయకుల లక్షణం కాదు. అందులోనూ సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసిఆర్‌. ఇప్పుడు హరీష్‌రావు. ముందు ముందు కూడా హరీష్‌రావు మాత్రమే..అంతే కాని ఇంకెవరూ సిద్దిపేటను ఆక్రమించుకునే అవకాశం లేదు. అంతగా ప్రజలకు చేరువైన నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటను హరీష్‌రావు అధికారంలో వున్న పదేళ్లలో అభివృద్ది చేసిన నాయకుడు కాదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే సిద్దిపేటను సిరుల పేట చేశాడు. తెలంగాణ ఉద్యమ గడ్డకు ఊరిపిలూదాడు. ఆనాటి నుంచి నేటి దాకా తనకు ఎదురులేని, తిరుగులేని రాజకీయాన్ని రాసుకున్నాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు కావడం నాయకులందరికీ సాద్యం కాదు. అది ఒక్క హరీష్‌రావుకు మాత్రమే సాధ్యమైంది. సిద్దిపేట నియోజకవర్గంలో అందిరకీ బందువు హరీష్‌రావు. అలా గుర్తింపును, ప్రతి ఇంటిలో స్ధానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. బిఆర్‌ఎస్‌ పార్టీకి అస్త్రశస్త్రాలంటేనే హరీష్‌రావు. అలాంటిది సిద్దిపేటకు అన్నీ ఆయనే. కారు పార్టీకి ఇందనమే హరీష్‌రావు. కేసిఆర్‌ అమ్ముల పొదిలే అస్త్రమే హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావు మీద కవిత ఎన్ని కుట్రలు చేయాలని ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే. తన గౌరవాన్ని తాను కోల్పోవడమే. చుట్టపు చూపుగా వచ్చిన వారికి ఒక్క రోజే మర్యాద. పదే పదే బంధువులు వస్తే ఎవరూ స్వాగతించరు. పదే పదే సిద్దిపేటకు వస్తానంటే కవిత పరిస్దితి కూడా అంతే..నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే వెతుక్కోవాలి. అదీ అసలైన నాయకుల ధైర్యం. అంతే కాని పారిపోయి, పది దిక్కులు చూస్తామంటే ప్రజలు స్వాగతించారు. బిఆర్‌ఎస్‌ గాలి రాష్ట్రమంతా వీస్తున్న సమయంలోనే కవిత ఓడిపోయారు? తాను ఎందుకు ఓడిపోయాను? ఏ వర్గాలకు దూరమయ్యాను? ప్రజలు ఎందుకు తనను దూరం పెట్టారు? అనేది ఆలోచించుకొని, పునరాలోచన చేసుకొని, చేసిన తప్పులను సరిద్దుకొని ముందుకు వెళ్లాలి. కాని తనను ఓడిరచి ప్రజలు తప్పు చేశారనే భావన కవితలో వుండడం ప్రజాస్వామ్యంలో పనికి రాదు. 2014 ఎన్నికల్లో కవితను చూసి నిజామాబాద్‌ ప్రజలు గెలిపించలేదు. కేవలం కేసిఆర్‌ కూతురుగా మాత్రమే గెలిపించారు. ఆ విషయం ఆమె అర్దం చేసుకోలేదు. అందుకే ఓడిపోయారు. రాజకీయాల్లో వారసత్వం ఎప్పటికీ పని చేయదు. ప్రతిసారి గెలిపించేందుకు అసలే ఉయయోగపడదు. ఇరవై ఏళ్లుగా సిద్దిపేట ప్రజలు హరీష్‌రావు వెనుక నిలబతుతున్నారంటే అది ఆయన వ్యక్తిత్వం. ఆయన సేవా గుణం. అందించిన సంక్షేమం. కష్టకాలంలో నాయకుడిగా ఆదుకున్న దాతృత్వం. ఒక నాయకుడు అప్రతిహాతంగా విజయాలు సాదిస్తున్నాడంటే ఒకే కారణం వుండదు. వారిలో వుండే నైతిక రాజకీయాలతోపాటు, ప్రజలపట్ల ఆ నాయకుడికి వుండే అంకిత భావం కూడ పనిచేస్తుంది. సిద్దిపేటలో మొదటిసారి హరీష్‌రావు గెలిచినప్పుడు కేసిఆర్‌ వల్లనే గెలిచారు. కాని తర్వాత కాలం నుంచి హరీష్‌రావు కూడా కేసిఆర్‌ లాగానే ప్రజలను కళ్లలో పెట్టుకొని చూసుకుంటాడన్న నమ్మకాన్ని పెంచుకున్నాడు. సిద్దిపేటలో కేసిఆర్‌ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే అందుకు కారణం కూడా హరీష్‌రావే. కేసిఆర్‌ ఆనవాలును మరింత పునరుద్దరిస్తూ హరీష్‌ రావు ముందుకు సాగుతున్నారు. ప్రతిసారి కేసిఆర్‌ పేరును హరీష్‌రావు నిలబెడుతూ వస్తున్నాడు. తాను పోటీ చేసిన ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. హరీష్‌రావు ఎన్నికల్లో సృష్టించిన చరిత్రను భవిష్యత్తులో ఎవరూ సృష్టించలేరు. ఆయన రికార్డును ఎవరూ అధిగమించలేరు. ప్రజల్లో నాయకుడి మీద ఎంత ప్రేమ వుంటే గాని, అంత మెజార్టీ సొంతం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజీనామా చేసిన ప్రతిసారి ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ విజయాలు సాదించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటను బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేసిన నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటలో ప్రతి కుటుంబం కలలో కూడా కలవరించేది హరీష్‌రావునే. కష్టం వచ్చినా హరీష్‌రావు వద్దకు పరుగెత్తుకుంటూ వస్తారు. సంతోషమైనా సరే హరీష్‌రావుతో పంచుకునేందుకు వస్తారు. ఆయన కార్యాలయం నిత్యాన్నదాన సత్రం. పని మీద వచ్చినా, హరీష్‌రావును చూడడానికి వచ్చినా, సరే ఆకలి తీర్చి పంపే నాయకుడు హరీష్‌రావు. అలాంటి నాయకుడిని సిద్దిపేటకు దూరం చేయడం ఎవరి తరం కాదు. కవిత చెట్టు పేరు చెప్పుకొని వచ్చినా సరే ఆమె రాజకీయం చేసినా సిద్దిపేటలో ఒట్టిదే అవుతుంది. కోరికోరి రాజకీయ కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. హరీష్‌రావు తన నియోజకవర్గంలో ప్రచారం చేయకున్నా గెలుస్తాడు. ప్రజలే మీరు శ్రమ పడి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని హరీష్‌రావుకే చెబుతారు. బిఆర్‌ఎస్‌ను ఇతర నియోజకవర్గాలలో గెలిపించేందుకు వెళ్లండి అని ప్రజలే సూచిస్తుంటారు. అంతగా ప్రజలకు చేరువైన హరీష్‌ను మీద పోటీ చేయడమంటేనే ఎవరైనా ఓటమిని ముందే మూట గట్టుకోవడం అవుతుంది. ఇరవై ఏళ్లులో ఎంతో మందికి అనుభవం ఎదురైంది. సిద్దిపేటలో హరీష్‌రావు సేవను చెరిపేసే గీతలు పట్టువు. ఎందుకంటే చెట్టు, చేమ, పుట్ట, పొలం,చెరువు ఏదైనా సరే హరీష్‌రావు కోసమే ఎదురుచూస్తాయి. హరీష్‌రావునే కలవరిస్తాయి. ఉద్యమ కాలంలోనే హరీష్‌రావు చేసిన సేవ అంతా ఇంతా కాదు. తాను అధికారంలో లేకపోయినా, ఉద్యమ సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవను ప్రజలే గుర్తు చేస్తారు. ఎండాకాలం వస్తే ఎడారిగా మారే సిద్దిపేట రైతులకు ఆంద్రానుంచి గడ్డి కొనుక్కొచ్చి ఉచితంగా అనేక సంవత్సరాలు అందించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. ప్రతి ఊరిలో పశువులకు మంచినీటి కోసం తొట్లు కట్టించారు. నియోకవర్గంలోని ప్రతి ఊరికి సమీపంలో రోడ్డుకు ఇరవైపులా కూడా అలాంటి తొట్లు కట్టించారు. అలా పశువులకు ఆహారమే కాదు, నీటి కొరత లేకుండా చేసిన రైతు ప్రేమికుడు హరీష్‌రావు. తన నియోకవర్గంలో శ్రమదానంతో చెరువులను బాగు చేసి, తెలంగాణ రాకముందే చెరువుల్లో పూడికలు తీసిన నాయకుడు హరీష్‌రావు. అలా ప్రతి ఊరుకు చెరువును
ఉమ్మడి రాష్ట్రంలోనే కల్పతరువును చేసిన నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటకు నాయకుడిగా, పాలకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఎంత వెన్నుదన్నుగా నిలిచారో..అలాగే గులాబీ పార్టీ పరిరక్షకుడిగా హరీష్‌రావు పోషించిన పాత్ర మరెవరూ పోషించలేరు. అయినా ఆది నుంచి కవితకు బిఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఆది నుంచి బిఆర్‌ఎస్‌లో సభ్యత్వమున్న నాయకురాలు కాదు. కనీసం కార్యకర్త కూడా కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే ఆమె బిఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. నిజామాబాద్‌ టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో పోటీచేశారు. పార్టీ నాది అని ఆమె చెప్పుకున్నా అధినేత కేసిఆర్‌కే నచ్చలేదు. ఎందుకంటే ఆమె పార్టీ సభ్యురాలు మొదటి నుంచి కాదు. ఉద్యమ సమయంలో పార్టీలో లేదు. ఉద్యమ సమయంలో ఆమె తన దుకాణం ఆమె నడుపుకున్నారు. జాగృతి పేరుతో ఉద్యమ రాజకీయం చేశారు. తర్వాత ఆమె బిఆర్‌ఎస్‌లో చేరారు. కాని హరీష్‌రావు బిఆర్‌ఎస్‌ పరుడు పోసుకున్నప్పటి నుంచి వున్నారు. తొలిసారి జెండా ఎగుర వేతలో కేసిఆర్‌కుతోడుగా వున్నారు. గులాబీ జెండా ఎగురవేసిన తొలినాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ జెండా ఊరూర ఎగుర వేసుకుంటూ తెలంగాణను గులాబీ వనం చేసిన నాయకుడు హరీష్‌రావు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ బ్రాండ్‌ హరీష్‌రావు. సకల జన హితుడు హరీష్‌రావు. బిఆర్‌ఎస్‌పార్టీకి తొలి సైనికుడు హరీష్‌రావు. సైన్యాధ్యక్షుడిగా పార్టీని ప్రతిసారి గెలిపిస్తూ వస్తున్న నాయకుడు హరీష్‌రావు. కేసిఆర్‌ ప్రపంచాన్ని కాపాడుతూ, ఆయన సామ్రాజ్యాన్ని నిలబెతున్న నాయకుడు హరీష్‌రావు. అయినా నేను సామాన్య కార్యకర్తనే అని చెప్పుకునే గొప్ప గుణమున్న, మనసున్న నాయకుడు హరీష్‌రావు.

ఆల్మట్టి…తెలంగాణకు ఉరి!

`దశాబ్దాలుగా సాగుతున్న నీటి దోపిడీ.
`పదే పదే ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు.


`కేంద్రంలో కాంగ్రెస్‌ వున్నంత కాలం ఇదే జరిగింది.
`మళ్ళీ నీటి దోపిడికి కర్ణాటక తెగబడుతోంది.


`ఆల్మట్టి వివాదంపై అప్పట్లో సినిమాలలో సెటైర్లు.
`ఆల్మట్టి ఆపడంలో చంద్రబాబు విఫలం.
`ఆ రోజుల్లోనే తెలంగాణకు తీరని అన్యాయం.
`మళ్ళీ ఇప్పుడు మరో సారి ఆల్మట్టి పెంపుకు ప్రయత్నం.
`ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణకు తీరని అన్యాయం.
`దక్షిణ తెలంగాణ ఎడారి కావడం ఖాయం.
`కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్‌ తీర్మానం చేసి రెండు నెలలలౌతోంది.
`తెలంగాణ ప్రభుత్వం మౌనం వహించింది.
`మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్తానంటోంది.
`తెలంగాణ ప్రభుత్వం స్పందించకోపోతే దక్షిణ తెలంగాణ ఎడారే అవుతుంది.
`ఇప్పటికే కృష్ణా నదిలో అన్యాయం జరుగుతోంది.
`పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీళ్లు సరిపోవు.
`మరో వైపు పోతిరెడ్డిపాడు తో దశాబ్దాలుగా నష్టం జరుగుతోంది.
`తెలంగాణకు మంచి నీళ్లకు దిక్కు లేదు.
`చెన్నై కి మంచినీటిని తరలించిన ఉమ్మడి పాలకులు.
`తెలుగు గంగ పేరుతో తమిళనాడుకు నీళ్లిచ్చారు.
`రాయలసీమకు నీళ్లు తరలించారు.
`తెలంగాణ ప్రాజెక్టులు పెండిరగ్‌లో పెట్టారు.
`ఆర్డీస్‌ తూములు పగులగొట్టి మరీ నీళ్లు తరలించుకున్నారు.
`ఇప్పుడు మళ్ళీ కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు చుక్క రాదు.
`నికర జలాలకు దిక్కు లేదు.
`వరద జలాలు ఇక్కడిదాకా వచ్చే అవకాశమే లేదు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
ఇప్పుడు మేలుకోకపోతే ఎడారి పాలౌతాం. పాలమూరుతోపాటు దక్షిణ తెలంగాణ ఆగమౌతుంది. మరోసారి అప్పర్‌ కృష్ణ మీద ఆల్మట్టి పెంపుకోసం కర్నాకట ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే దిగువ రాష్ట్రాల మీద కుట్ర చేస్తున్నట్లే లెక్క. ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆల్మట్టి పెంపు వల్ల ఏపికి పెద్ద నష్టం లేకపోయినా తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. అప్పర్‌ కృష్ణాలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల వరకు వచ్చే సరికి దామాషా అంటూ లెక్కలు కడతారు. అప్పుడు కూడా తెలంగాణకు అన్యాయమే మిగులుతుంది. కృష్ణ మీద తెలంగాణలో ప్రాజెక్టులు కడితే ఏపికి నీళ్లు అందలేవన్న ఒకే ఒక్క కారణం చేతనే ఉమ్మడి పాలకులు నిర్మాణాలు చేయలేదు. కృష్ణా నదీ నీళ్లన్నీ ఏపికి తరలించేందుకే ఉమ్మడి రాష్ట్రంలో తీరని అన్యాయంచేశారు. అటు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు మొదలు పెట్టి నీళ్లు తీసుకెళ్లడం మొదలు పెట్టారు. వరద జలాల పేరుతో పోతిరెడ్డి పాడును 44వేల క్యూసెక్కుల లెక్క చెప్పారు. దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ 88వేల క్యూసెక్కులు చేసుకున్నారు. కాని ఏనాడు తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన చేయలేదు. ఎందుకంటే దక్షిణ తెలంగాణకు ఏకైక వర ప్రదాయిని కృష్ణ మాత్రమే. మూసీ లాంటి చిన్న చిన్న నదులు, వాగులున్నా అవి కృష్ణాలో కలిసినా పెద్ద ప్రయోజనం ఏమీ వుండదు. తెలంగాణ ఎక్కువ భాగం కృష్ణా బేసిన్‌లోనే వుంటుంది. తెలంగాణ మీదుగానే ప్రయాణం చేస్తుంది. అయినా ఇప్పటి వరకు కృష్ణా నీటిని సమృద్దిగా తెలంగాణ ఏనాడు వాడుకున్నది లేదు. పైగా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోనే ఏపికి 519 టిఎంసిలు, తెలంగాణకు 291 లెక్క లేల్చారు. నీటి వాటాలు పంచారు. కాని పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఆ 291 టిఎంసిలు కూడా ఇవ్వలేదు. నీళ్లన్నీ ఏపికి తరలించుకుపోయారు. నాగార్జున సాగర్‌లో ఎడమ కాలువను ఎప్పుడూ ఎండబెట్టేవారు. కుడి కాలువ ద్వారాఏపికి నీళ్లు తరలించుకుపోయేవారు. ఏపికే కాదు, చెన్నై నగరానికి కూడా నీళ్లించేందుకు ఉమ్మడిరాష్ట్రంలో తెలుగు గంగ పేరు 1500 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారు. ఉమ్మడి రాష్ట్ర నిధులతో చెన్నైకి నీరు తరలించారు. కాలువ నిర్మాణానికి తమిళనాడు ఖర్చు భరించుకున్నదని మభ్య పెట్టారు. మధ్యలో అనేక ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు. ఏకంగా 65 టిఎంసిల సామార్ధ్యంతో కూడిన రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. అలా ఉమ్మడి రాష్ట్రంలోనే ఏపిలో సుమారు 15కు పైగా కేవలం కృష్ణా నది నీటి కోసమే రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. కాని తెలంగాణకు మంచినీళ్లిచ్చేందుకు ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. తెలంగాణ వచ్చినా కృష్ణా నది నీళ్లను ఇంకా వినియోగించుకునే అవకాశం రావడం లేదు. పైగా ఉరుము లేనిపిడుగులాగా ఎప్పుడో ఆగిపోయిన ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచుకోవడం కోసం కర్నాటక ప్రభుత్వం క్యాబినేట్‌ తీర్మానం చేసకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి కూడా రెండు నెలలు గడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతోంది. కర్నాకట రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆల్మట్టి డ్యామ్‌ పెంపు ఆలోచనను విరమించుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్‌ చేశారు. కర్నాటక ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తే సుప్రింకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. నిజానికి ఆల్మట్టి ప్రారంభించిన సమయంలో కేవలం 126 మీటర్ల ఎత్తు వరకే నిర్మాణం చేసుకోవాలని అప్పట్లో సుప్రింకోర్టు తీర్పునిచ్చింది. కాని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 519 మీటర్లకు వరకు కూడా అనుమతినిచ్చింది. దాంతో కర్నాకట ప్రభుత్వం ఆల్మట్టిని 519 మీటర్ల ఎత్తుకు నిర్మాణం చేసుకున్నది. ఆ నిర్మాణం మూలంగా ఇప్పటికే కృష్ణానదిలో నీళ్లు లేకుండాపోతున్నాయి. ఆల్మట్టి డ్యామ్‌ పూర్తిగా నిండితే తప్ప దిగువకు నీళ్లు వచ్చే పరిసి ్దతి లేకుండాపోయింది. 519 మీటర్ల ఎత్తుతో ఆల్మట్టి డ్యామ్‌లో ఎప్పుడూ 129 టిఎంసిల నీరు నిలువ వుంటోంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 5 మీటర్లు ఎత్తుతో 524 మీటర్ల నిర్మాణం చేపడితే తెలంగాణ ఎడారి కావడం ఖాయం. ఆ 5 మీటర్ల ఎత్తు పెంచుకోవడం వల్ల ఇప్పుడు నిలువ వుండే నీటికన్నా ఎక్కువ నీటి సామార్ధ్యం అమాతంతం సగానికి పైగా పెరుగుతుంది. అంటే ప్రస్తుతం వున్న 129.5 టిఎంసిలకు తోడు అదనంగా మరో 130 టిఎంసిల నీరు నిలువ సామార్ధం పెరుగుతుంది. మొత్తం 300 టిఎంసిల నీరు వరకు నిలువ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం కర్నాటక ప్రభుత్వం రూ.70 వేల కోట్లు కేటాయించినట్లు కూడ తెలుస్తోంది. అయితే ఆల్మట్టి ఎత్తు నిర్మాణంలో మహారాష్ట్రకు పెద్దగా అభ్యంతరం లేదనే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రకు నీటి విషయంలో వచ్చే నష్టమేమీలేదు. కాకపోతే మహారాష్ట్రలోని రెండు జిల్లాలు ముంపుకు గురౌతాయి. అందుకు కర్నాకట పరిహారం అడిగినంత చెల్లించేందుకు రెడీ అంటోంది. దాంతో బ్యాక్‌ వాటర్‌ వల్ల మహరాష్ట్రంలోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పరిహారం కూడా అందుతుంది. అయినా మహారాష్ట్ర ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతోంది. ఆల్మట్టి 5 అడుగులు పెంపు వల్ల తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోతుంది. నారాయణపూర్‌కు చుక్క నీరు కూడా రాదు. నీటి విషయంలో కాంగ్రెస్‌ సర్కారు ఒకింత ఉదాసీనతతో వ్యహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆల్మట్టి అనేది కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వం వున్నప్పుడే ఈ వివాదాలు రేగుతున్నాయి. గతంలో పదేళ్లపాటు బిజేపి ప్రభుత్వం వున్నప్పుడు ఈ వివాదం తెరమీదకు రాలేదు. అసలు గతంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం వున్నప్పుడే 524 మీటర్ల ఎత్తుకు పెంచుకునే ప్రయత్నం బాగానే చేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రబుత్వం వుంది. అయినా అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు దివంగత పి. జనార్ధన్‌రెడ్డి తీవ్రంగా కొట్లాడారు. అప్పుడు కర్నాకటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే వుంది. ఎస్‌ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా వున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ నాయకుడైనా సరే పి. జనార్ధన్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెరగకుండా పెద్దఎత్తున కాంగ్రెస్‌ పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ కూడా తలొగ్గింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కర్నాకటలో అధికారంలోవుంది. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో వుంది. ఇదే మంచి సమయం అనుకొని కర్నాకట సిద్దరామయ్య సర్కారు ఆల్మట్టి ఎత్తు పెంచుకునేందుకు సన్నహాలు చేస్తున్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు మేలుకోలేదు. కనీసం ఆ ఎత్తు ప్రక్రియపై ఇంత వరకు స్పందించలేదు. తాజాగా బి ఆ ర్‌ఎస్‌ నాయకులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే రేవంత్‌ సర్కారు గోదావరి నీటిపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటు బిఆర్‌ఎస్‌ నుంచే కాకుండా కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు కూడా గోదావరి నీటిపై స్పందించారు. బనచర్ల పేరుతో ఏపి ప్రభుత్వం వరద జలాలలో 80 టిఎంసిలు వాడుకునేందుకు సిద్దమైంది. బనక చర్ల విషయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కృష్ణాలో 500 టిఎంసిలు, గోదావరిలో 1000టిఎంసిలు వదిలేసి మిగిలిన నీళ్లను వాడుకోండంటూ ఏపికి సూచించారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వివాదం చిలిచి చిలికి గాలివాన కావడంతో బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొంత గట్టిగా నిలబడే అవకాశం దక్కింది. అయినా ఆ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఏపిలో చంద్రబాబు ఆ ప్రతిపాదన మానుకోలేదు. దానిపై ముందుకు వెళ్లేందుకే సిద్దంగావున్నారు. ఆ ప్రణాళికలు చేస్తూనే వున్నారు. ఇప్పుడు కృష్ణా నదిమీద ఆల్మట్టి డ్యామ్‌ పెంపు ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎలాంటి ప్రకటనచేయలేదు. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆల్మట్టి డ్యామ్‌ నిర్మాణాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదని రేవంత్‌ సర్కార్‌ గట్టిగా నిలబడితే తప్ప ఆగదు. తెలంగాణ ఎడారి కాక మానదు. చూద్దాం ఏంజరుగుతుందో!!

ఉక్కిరిబిక్కిరి…ప్రతి క్షణం కిరికిరి!

`రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య మార్పులు.

`పది రోజులు కాంగ్రెస్‌ పై చేయి.

`పది రోజులు బిఆర్‌ఎస్‌ కాయ్‌ రాజా కాయ్‌.

`రెండు పార్టీల మధ్య నువ్వా! నేనా అన్నట్లు రాజకీయం.

`ఏ పార్టీ గ్రాఫ్‌ పెరుగుతుందో!

`ఏ పార్టీ గ్రాఫ్‌ తగ్గుతుందో అర్థం కానీ పరిస్థితి.

`కేసులు తెరమీదకు రాగానే బీఆర్‌ఎస్‌ సైలెంట్‌.

`విపత్తులు రాగానే బీఆర్‌ఎస్‌ లో జోష్‌.

`రెండు పార్టీలకు బీసీ నినాదం తలనొప్పి.

`కవిత ఎపిసోడ్‌ బీఆర్‌ఎస్‌ ను వెంటాడుతోంది.

`స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌ ను తరుముతున్నాయి.

`ఆరు గ్యారంటీల అమలు ఇప్పట్లో కష్టమే.

`ఇంకా ఆలస్యమైతే మొదటికే మోసమే!

`బీజేపీది మౌన వ్రతమే!

`గ్రూప్‌ వన్‌ మీద నోరు విప్పింది లేదు.

`ఎరువుల మీద ప్రశ్నించింది లేదు.

`కాంగ్రెస్‌ చేస్తున్న ఎదురుదాడికి సైతం సమాధానం చెప్పే పరిస్థితి లేదు.

`కాంగ్రెస్‌ ను దోషిగా చూపించే ధైర్యం లేదు.

`బీఆర్‌ఎస్‌ మీద నోరు పారేసుకోవడం తప్ప మరేం చేయడం లేదు.

`ఎరువుల బురద రుద్దుకునేందుకు సిద్ధంగా లేదు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

తెలంగాణ రాజకీయాల్లో పాలకపక్ష కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ ఉక్కిరి బిక్కిరౌతున్నాయి. ప్రతి క్షణం కిరికిరి ఏదో ఒక కిరికిరిలో ఇరుకుంటున్నాయి. ఇటీవల కాలంలో . రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాjయి. పది రోజులు కాంగ్రెస్‌ పార్టీ పై చేయి. పది రోజులు బిఆర్‌ఎస్‌ కాయ్‌ రాజా కాయ్‌. రెండు పార్టీల మధ్య రాజకీయ గొడవలు తప్ప. రాష్ట్ర ప్రయోజనాలు, పరిపాలనా విశేషాలు, చర్చలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తెల్లారిలేస్తే ఏదో ఒక రాజకీయ వివాదాలు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య ఎల్ల కాలం నువ్వా..నేనా అనే రాజకీయమే సాగుతోంది. సహజంగా రాజకీయం ఎన్నికల వరకే అంటారు. కాని నిత్యం రాజకీయాలే చేస్తుంటారు. ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టాలని పాలకపక్షం చూడడం.. ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రతిపక్షం చూస్తున్నాయి. ప్రజలేమనుకుంటున్నారన్న సంగతి మాత్రం ఎప్పుడో మర్చిపోయారు. ఈ సందర్భంగా ఏ పార్టీ గ్రాఫ్‌ పెరుగుతుందో..ఏ పార్టీ గ్రాఫ్‌ పడిపోతుందో తెలియడం లేదు. ఆయా పార్టీలు కూడా అంచనా వేసుకోవడంలో కూడా ఫెయిల్‌ అవుతున్నాయి. ప్రధాన మీడియా స్రవంతిని పాలకపక్షం గుప్పిట్లో పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ప్రజల మూడ్‌ను బట్టి, ప్రధాన మీడియా కూడా గోడదుండే రాజకీయాలకు పాల్పడుతోంది. ఇలా మీడియా కూడా రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకొని ఊరేగుతోంది. సోషల్‌ మీడియా చెప్పేది అబద్దమని పాలక పార్టీ అంటుంది. అదే పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడే సోషల్‌ మీడియా మీద ఆధాపడి రాజకీయం చేస్తుంది. ఇలా ఎప్పుడూ రాజకీయాలను సజీవంగా వుంచుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పడేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం మీద చేసిన పోరాటం ఒక్కటంటే ఒక్కటైనా వుందా? అదే కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పిపిసి. అద్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజుకో సమస్యతో ప్రజల్లో వుండేవారు. ప్రజలకు అందుబాటులో వుండేవారు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ వుండేవారు. అలా మల్లన్న సాగర్‌ నిర్వాసితుల దగ్గర నుంచి మొదలు, నిరుద్యోగుల సమస్యలపై నిత్యం ఏదో రకమైన పోరాటం చేస్తూ వచ్చేవారు. బాసరలో విద్యార్ధుల సమస్యలమీద రేవంత్‌ చేసిన పోరాటం ఇప్పుడు ఏ బిఆర్‌ఎస్‌ నాయకుడైనా చేస్తున్నాడా? హస్టళ్లలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడుతున్నారా? వి ద్యార్దులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెస్తున్నారా? వారికి అండగా నిలిచే ప్రయత్నం బిఆర్‌ఎస్‌ చేస్తుందా? హస్టల్‌లలో విద్యార్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే అక్కడి వెళ్లడం, మీడియాను అడ్రస్‌ చేయడం తప్ప మరేం చేయలేదు. ప్రభుత్వం ఎలాగూ డిఫెన్స్‌లో వుంది. మేం పోరాటంచేయాల్సిన అసవరం లేదన్న ధీమా బిఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను ప్రజలు కాదనుకుంటే ప్రత్నామ్నాయం మేమే అన్న ఆలోచన మాత్రమే బిఆర్‌ఎస్‌లో వ్యక్తమౌతోంది. అంతే తప్ప సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దామనే ప్రణాళిక మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. ఎక్కడ ప్రభుత్వం తమపై కేసుల్లో ఒత్తిడి తెస్తుందో..అరెస్టుల పర్వం మొదలు పెడుతుందో అన్న భయం కూడా చాలా మంది బిఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఒకప్పటి ఉద్యమస్పూర్తి, పోరాటాలు బిఆర్‌ఎస్‌లో కనిపించడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడబలుక్కొని రాజకీయం చేస్తున్నట్లే వున్నాయి. పది రోజులు కేసుల మీద తప్ప వార్తలుండవు. రెండేళ్ల కాలంగా కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌, ఈ కార్‌ రేస్‌ వంటి కేసుల చుట్టూ రాజకీయం తిప్పారు. ఆఖరుకు కాళేశ్వరం మీద కేసును సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. నిజం చెప్పాలంటే కాళేశ్వరం మీద వేసిన కమీషన్‌ కూడా కొండను తవ్వి ఎలుకను పట్టింది. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. దాంతో కాళేశ్వరంలో ఎలా ముందుకు సాగాలో అర్ధం కాక కేంద్రం కోర్టులోకి ప్రభుత్వం బంతిని వదిలేసింది. ఇలా కేసులతో కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కొంత వాయిదా వేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు అమలు చేసే పరిసి ్దతి కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీకి బిసి నినాదమనేది కాంగ్రెస్‌ మెడకు చేజేతులా చుట్టుకున్నారు. నిజం చెప్పాలంటే ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కొన్ని హమీలు ఇవ్వకుండా వున్నా అధికారంలోకి వచ్చేవారు. కాని ఒకదాని తర్వాత ఒకటి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హమీల వైపు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని ఆరు గ్యారెంటీలన్నారు. అందులో పదమూడు చేర్చారు. మొత్తగా నాలుగువందల ఇరవై హమీలు ఇచ్చారు. అందులో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అనే మాట కాకుండా పార్టీ పరంగా అమలు చేస్తామని చెబితే ఎంతో బాగుండేది. ఇప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించేందుకు వీలుగా వుండేది. కాని ఆ అవకాశం కాంగ్రెస్‌ జార విడుచుకున్నది. లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకున్నది. రాజ్యాంగ రిత్యా 42 శాతం బిసిలకు రిజర్వేషన్లు అమలు సాద్యం కాదని కాంగ్రెస్‌ నాయకులదంరికీ తెలుసు. కాని ప్రకటించారు. ఇచ్చిన హమీని అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుందని తెలుసు. తెలిసి తెలిసి హమీని ఇచ్చారు. బిసిలను ఇప్పుడు మోసం చేస్తే కాంగ్రెస్‌ను సహించరు. క్షమించరు. తెలంగాణలో బిసి ఉద్యమం, నినాదం బలంగా క్షేత్రస్ధాయిలోకి వెళ్లాయి. ఇప్పుడు దానిని ఆపడం ఎవరి తరం కాదు. అన్ని పార్టీలు ఇప్పుడు బిసి నినాదం వినిపించాల్సిందే. కాని ఆ నినాదమే కాంగ్రెస్‌కు గుది బండగా మారిపోయింది. దీనితో ముడిపడి వున్న స్దానికి సంస్ధ ఎన్నికలు పెట్టే పరిసి ్ధతి లేదు. ఇప్పటికిప్పుడు స్దానిక సంస్దల ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్‌ పార్టీ పరిస్టితి ఏమిటో నాయకులందరికీ తెలుసు. ఆఖరుకు అది రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకోవచ్చు. ఆఖరుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదవి కూడా ఎసరు పెట్టొచ్చు. అందుకే ఆగుతున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో వచ్చిన యూరియా కొరత అనేది రైతుల్లో ఆగ్రహజ్వాలలు రగిలిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు కనిపించినా, ఓట్లు అంటూ వచ్చినా ఎలా వుంటుందో తేలిపోయింది. మరో వైపు హైకోర్టు తీర్పు గుడువు ముంచుకొస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌పార్టీ సాలెగూడులో చిక్కుకున్నంతగా గిలగిలాడుతోందని చెప్పకతప్పదు. యూరియా సమస్యను రైతుల మరో పదేళ్ల దాకా మర్చిపోకుండా చేసుకున్నారు. నిజానికి ఎరువుల కొరత వరకు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ మీద ప్రజల్లో వ్యతిరేకత వుండేది. కాలేశ్వరం విషయంలోనూ ప్రజల్లో బిఆర్‌ఎస్‌ మీద కోపమే వుండేది. ఎప్పుడైతే ఎరువుల కొతర వచ్చిందో అప్పటి నుంచి బి ఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఈ మధ్యలో కవిత ఎపిసోడ్‌ వల్ల బిఆర్‌ఎస్‌కు నష్టం జరగుతుందని అనుకున్నారు. కాని ఆఖరుకు ప్రజలు కవితనే మర్చిపోయే పరిస్దితిని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిపెట్టింది. కొంచెం ముందుగా ఎరువుల కొతరపై దృష్టిసారిస్తే బి ఆర్‌ఎస్‌, కవిత మధ్య ఆదిపత్య పోరు రసవత్తరంగా వుండేది. అది కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చేది. ఒక్క యూరియా సమస్య మొత్తం కాంగ్రెస్‌ తలరాతను మార్చేసింది. ఇందులో దూరడానికి బిజేపి ప్రయత్నం చేయడం లేదు. అడకత్తెరలో పోక చెక్క కావడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఏ మాత్రం నోరు తెరిచినా ఎరువుల పరంపరలో పరువు పోగొట్టుకునే పరిస్ధితి తెచ్చుకునేది. అయినా బిజేపి స్టాటజీ ఏమిటో అంతు చిక్కడం లేదు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎరువులు కొరత వుంది. అది మా వల్ల జరిగింది కాదని చెప్పుకునే శక్తి కూడా బిజేపి నాయకులకు లేదా? గతంలో ఇచ్చింది మేమే..ఇప్పుడు ఇస్తున్నది మేమే.. మా వల్ల ఎక్కడా పొరపాటు జరగలేదు. అని చెప్పడానికి బిజేపి నాయకులకు నోరు రావడంలేదా? కాని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నమే జరుగుతోంది. ఆపరేషన్‌ సింధూర్‌ మూలంగా ఎరువుల దిగుమతి ఆలస్యమైందని తప్పును బిజేపి నెత్తిన ఆ పార్టీ నాయకులు వేసుకుంటున్నారు. దాంతో తెలంగాణలో ఇప్పటి వరకు వున్న పేరును కూడా చెరుపుకుంటున్నారు.

వాయిదాతోనే ఫాయిదా!

`తొందరపడి కోడ్‌ కూస్తే కాంగ్రెస్‌ కు కష్టమే!

`పల్లెపోరు ఇప్పట్లో లేనట్లే!

`దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్‌.

`బీజేపీ మాత్రం సైలెంట్‌.

`ఎన్నికల మీద ఆశ లేదు.

`గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు.

`కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

`పల్లెల్లో యూరియా సమస్య మొదటికే మోసం తేవొచ్చు.

`అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు.

`ఇటు నిరుద్యోగుల పోరు.

`42 శాతం బీసీల రిజర్వేషన్‌ ఒత్తిళ్లు.

`ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి.

`వెళ్ళి ఓటమి కొని తెచ్చుకోలేని స్థితి.

`ఏ మాత్రం తొందరపడినా కాంగ్రెస్‌ కు తీరని నష్టమే!

`గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు పెడితే ఇంత గందరగోళం వుండేది కాదు!

`ఆలస్యం చేసిన తప్పిదం కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేయొచ్చు!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో పంచాయితీ ఎన్నికులు జరుగుతాయా? లేదా? అనే ప్రశ్న కూడా వినిపించనంత రాజకీయాలు మారిపోయాయి. రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్‌ 30లోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు వాయిదాతోనే ఫాయిదా వుంటుందనుకుంటోంది. తొందపడి కోడ్‌ కూస్తే మొదటికే మోసం వచ్చే పరిసి ్దతి కనిపిస్తోంది. పల్లెపోరు ఇప్పట్లో లేనటే? అనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టు పెట్టిన గడువు మరీ దగ్గరకొచ్చింది. ఆ లోపు ఎన్నికల నిర్వహణ అసాద్యం. పైగా గత శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకటించారు. దాని ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో బిసిలకు 42శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అందుకు రాష్ట్రంలో కుల గణన కూడా చేపట్టారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ అంశం మీద అసెంబ్లీలో తీర్మాణం చేశారు. అది గవర్నర్‌కు పంపించారు. అక్కడ నుంచి ఆ తీర్మాణం రాష్ట్రపతికి చేరింది. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం రాజకీయాల్లోనైనా, ఉద్యోగాల్లోనైనా 50శాతానికి మంచి రిజర్వేషన్లు అమలు చేసే వీలు లేదు. అయితే తమిళనాడు లాంటికొన్ని రాష్ట్రాలలో 50శాతం లిమిట్‌ లేదు. దాన్ని అనుసరించి తెలంగాణ కూడా 42శాతం బిసిలకు రిజర్వేషన్లు కల్పించుందామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రజలకు చెప్పింది. ప్రజలు కూడా నమ్మారు. కాని సుప్రింకోర్టులో తీర్పు రాకముందు నుంచి షెడ్యూల్‌ 9 ప్రకారం తమిళనాడులో ఆ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. దాంతో సుప్రింకోర్టు తీర్పు ఆ రాష్ట్రానికి వర్తించడం లేదు. సుంప్రికోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50శాతానికి మించడం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్టినెన్స్‌ జారీ చేసింది. దానిని మళ్లీ గవర్నర్‌కు పంపించింది. అది కూడా గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో వుంది. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ కేవలం గత ఎన్నికల్లో గెలిచేందుకు ఆడిన డ్రామా అంటూ బి ఆర్‌ఎస్‌ చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి కూడా తెలుసు. 42 శాతం రిజర్వేషన్‌ అనేది అమలు సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసేందుకు హమీ ఇచ్చిందని బిఆర్‌ఎస్‌ ఆరోపణలు గుప్పిస్తోంది. బిఆర్‌ఎస్‌కు బిసి రిజర్వేషన్ల పెంపు ఇష్టం లేదంటూ కాంగ్రెస్‌ కాలం గడుపుకుంటూ వచ్చింది. బిఆర్‌ఎస్‌ మీద నిందలు వేస్తూ కాలయాపన చేసింది. బి సిల రిజర్వేషన్‌ విషయంలో డిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా కూడా చేసింది. కాని ఆ ధర్నాకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాందీ హజరు కాలేదు. సోనియాగాంధీ రాలేదు. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పడిరది. ఇక రాష్ట్రంలో పరిస్ధితులు స్ధానిక సంస్ధల ఎన్నికలకు అనుకూలంగా లేవు. ఒక వేళ కాంగ్రెస్‌పార్టీ పార్టీపరంగా బిసిలకు 42శాత టికెట్లు ఇచ్చినా అవి వర్కవుటయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో రెండు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారాయి. రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత వుంది. రైతులు మంట మీద వున్నారు. ఎరువులు ఇవ్వడం లేదన్న కోపం వారిలో కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులుగా రైతులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందడం లేదు. మంత్రుల ప్రకటనలు ఒక రకంగా వుంటున్నాయి. అవి కూడా రైతులను నిందించేలా వుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎరువులు సంపూర్ణంగా వున్నాయంటున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ కావాలని రాజకీయం చేస్తుందని కాంగ్రెస్‌ విమర్శలు సాగిస్తోంది. ఇక ఎరువులు అదితో ఇదిగో వస్తున్నాయంటున్నారు. కాని వచ్చిన ఎరువులు ఎక్కడికి వెళ్లాయన్నదానిపై ప్రభుత్వం వద్ద సరైన సమాదానం లేదు. మరో వైపు ఎరువులు పక్క దారి పట్టాయన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఆనాటి రోజులు తెస్తామని చెప్పినట్లే వచ్చాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో ఏనాడు రైతులు ఎరువుల కోసం ఎదురు చూసింది లేదని రైతులే తేల్చిచెబుతున్నారు. ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు ఎరువులు తెచ్చుకున్నామని అంటున్నారు. ఇక కాంగ్రెస్‌, బిజేపిలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రం సరిపోయేంత ఎరువులు సరఫరా చేయలేదని కాంగ్రెస్‌ అంటోంది. రాష్ట్రానికి పంపించిన ఎరువులు ఏమయ్యాయని బిజేపి నిలదీస్తోంది? రాజకీయంగా రెండు పార్టీలు వాదులాండుకుంటే వచ్చే ఫలితమేమీ లేదు. రైతులు గత నెల రోజులుగా ఎండనక, వాననక, రాత్రనక, పగలనక క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పదేళ్లలో మహిళలు ఏనాడు ఎరువుల కోసం రోడ్డెక్కిన సందర్భం లేదు. కాని ఇప్పుడు మహిళలు కూడా ఎరువుల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోంది. పైగా ఎవరుల క్యూలైన్లో తోపులాటల మూలంగా మహిళలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్దితి తలెత్తుతోంది. ఇలా ఎరువులు అందక పల్లెల్లో రైతులు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు అనే మాట మాట్లాడితే కాంగ్రెస్‌పై విరుచుకుపడే పరిసి ్దతి కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నాయకులే ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు వద్దని వాదిస్తున్నారు. ఎన్నికల్లో నిలబడలేం. ప్రచారం చేయలేమంటున్నారు. ఇక మరో సమస్య. నిరుద్యోగ సమస్య. ఏ గ్రూప్‌ వన్‌ పరీక్షను కాంగ్రెస్‌ రాజకీయం చేసిందో..ఇప్పుడు అదే గ్రూప్‌ వన్‌ కాంగ్రెస్‌ మెడకు చుట్టుకునేలా వుంది. గ్రూప్‌ వన్‌ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఎనమిది నెలల్లోగా మళ్లీ పరీక్ష నిర్వహించి, ఉద్యోగ కల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటీషన్‌ వేసేందుకు సిద్దమౌతోంది. కాని గ్రూప్‌ వన్‌ పరీక్ష రద్దు చేయడానికి ఇష్టపడం లేదు. దాంతో నిరుద్యోగులు మళ్లీ రొడ్డెక్కుతున్నారు. ఏ నిరుద్యోగులైతే గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పల్లె పల్లె తిరిగి ప్రచారం చేశారో వాళ్లే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేంగా మాట్లాడుతున్నారు. జివో.29 రద్దు చేయాలంటున్నారు. గ్రూప్‌ వన్‌ పరీక్షలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటున్నారు. గ్రూప్‌ మెయిన్స్‌ రాసిన విద్యార్దులకు రెండు మార్కులు రావడమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారంటూ నిరుద్యోగులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భం చూసుకొని దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ ఓ వైపు బిఆర్‌ఎస్‌ ఒత్తిడి తెస్తోంది. మరో వైపు రెచ్చగొడుతోంది. ఈ రెండిరటి మధ్య బిజేపి ఎలాంటి వాఖ్యలు చేయడం లేదు. పంచాయితీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని అడగడం లేదు. ఎన్నికలు పెడతామంటే కూడ బిజేపి తయారుగా వున్నట్లు లేదు. అందుకే సైలెంటుగా వుంటోందన్న విమర్శలున్నాయి. అంతే కాదు ఇప్పకిప్పుడు పంచాయితీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరిసి ్దతి లేదన్న సంగతి బిజేపికి బాగా తెలుసు. అయినా ఎన్నికల మీద ఆపార్టీకి పెద్దగా ఆశలు లేవన్న సంగతి అర్ధమౌతోంది. ఒక వేళ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో, రెండు శాతమో పంచాయితీ గెలుస్తామన్న ఆలోచన కూడా ఆపార్టీ పెద్దలు చేయడం లేదు. పంచాయితీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్లే పరిస్ధితి కనిపించడం లేదు.

కారు సైనికులు కార్యకర్తలే!

`కారు సైనికులు పార్టీ పరిరక్షకులు

`ఉద్యమ కాలం నాటి నిప్పు కణికలు

`తెలంగాణకు వెలుగునిచ్చే ఉద్యమ వేదికలు

`పార్టీని కాపాడే స్యయం సిద్దులు

`గులాబీ పరిమళలాలు నాయకులే!

`బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉద్యమ పోరు వీరులు

`పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న శ్రామికులు

`పదవుల కోసం ఆశపడిరది లేదు

`పార్టీ మీద అలిగిన సందర్భం పదేళ్లలో కనిపించింది లేదు

`తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌ సైనికుల త్యాగాలు

`తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలుస్తున్న వారధులు

`తెలంగాణ సారధి కేసీఆర్‌ ఆచరణలకు సాక్ష్యాలు

`కేసీఆర్‌ పిలుపుకు సింహనాదాలు

`పార్టీ యంత్రాంగం కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షులు

`పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆత్మీయులు

`వారి త్యాగాలే పార్టీకి తరతరాలకు నిదర్శనాలు

`ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేయండి

`అధికారంలో వున్నప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టలేదు

`కార్యకర్తలందరూ పార్టీని భుజాల మీద మోస్తున్నారు

`పార్టీ పదవులు అప్పగిస్తే మరో వందేళ్లకు పునాదులు వేస్తారు

`తరతరాల తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుడతారు

`కేసీఆర్‌ కీర్తికి కిరీటాలౌతారు

`కేసీఆర్‌ ను కొలిచే భక్తులుగా పార్టీకి సేవలు చేసుకుంటారు

 ఏ పార్టీలోనైనా సరే నాయకులకు ఒక మాట ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అదే..నేను పార్టీకి సామాన్య కార్యకర్తను మాత్రమే. అంటారు. అది నిజమా? కాదు..ముమ్మాటికీ కాదు. ఒక నాయకుడు ఒక కార్యకర్తగా మాత్రమే వుండాలని ఎప్పుడూ కోరుకోడు. మరి కార్యకర్త ఎందుకు ఎల్ల కాలం కార్యకర్తగానే వుంటున్నాడు. ఎదుగూబొదుగూ లేని సంసారం అన్నట్లు ఒక కార్యకర్త జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయే నాయకులు చాలా మంది వున్నారు. అలాంటి కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు. ఒక్క మాటలో చెప్పాలంటే సైనికులు. పార్టీని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్లు. పార్టీ కోసం పని చేయాల్సి వస్తే కుటుంబాన్ని కూడా కాదనుకొని పార్టీ కోసం పనిచేస్తారు. సభలు,సమావేశాలున్నాయంటే వ్యక్తిగత పనులు వదిలేసుకుంటారు. పార్టీ కోసం సమయం కేటాయిస్తారు. మరి వారికేం మిగులుతుంది. అదంతే..ఒక తృప్తి. కార్యకర్త అనే సామాన్యుడికి పార్టీ నుంచి వచ్చేదేమీ వుండదు. ప్రభుత్వాల నుంచి ఒరిగేదేమీ వుండదు. ఆ పార్టీల నాయకులంటే అభిమానం మాత్రమే వారికి వుంటుంది. నాకు కాంట్రాక్టులు ఇవ్వమని కోరడు. ప్రభుత్వ పధకాల అమలలో కూడా త్యాగం చేస్తుంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటాడు. ఎన్నికలు వచ్చాయంటే చాలు. ఇక తన పనులన్నీ పక్కన పెట్టేస్తాడు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీకోసం పనిచేస్తాడు. ఆ నాయకుడిని గెలిపించేందుకు ఎంతో శ్రమిస్తాడు. ఇటు ప్రచారం సాగిస్తుంటాడు. అటు ప్రత్యర్ధుల ఎత్తులు,పైఎత్తులు, వ్యూహాలను అంచనా వేస్తుంటాడు. లేదా తెలుసుకుంటుంటాడు. పార్టీ నాయకులు చేర వేస్తుంటాడు. మొత్తానికి పార్టీని గెలిపించాలన్న తపనతో పనిచేస్తాడు. ఆఖరుకు పార్టీ గెలిచినా, ఓడినా కూరలో కరివేపాకౌతుంటాడు. ఇదీ స్ధూలంగా ఒక కార్యకర్త జీవితం. నాయకులు బాగున్నావా? అని పలకరిస్తేలు చాలు సంబరపడతాడు. బంతిలో పక్కన కూర్చోబెట్టుకుంటే జీవితాంతం సేవ చేస్తుంటాడు. ఇదీ కార్యకర్త చిత్తశుద్ది. అందుకే నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు మాత్రం పార్టీకి స్ధిరంగా వుంటారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ మారుతంటే వారి వెంట వెళ్లేందుకు అసలైన క్యార్యకర్త ఇష్టపడడు. తన జీవితమంతా పార్టీకోసమే పనిచేస్తాడు. అలాంటి కార్యకర్తలు బిఆర్‌ఎస్‌ పార్టీకి కొన్ని లక్షల మంది వున్నారు. ఇప్పుడుంటే ఆ కార్యకర్తలు రాజకీయాలు చేస్తున్నారు. కాని బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పటినుంచి 2014 వరకు అటు ఉద్యమం చేశారు. ఇటు రాజకీయం చేశారు. రెండు రకాల పాత్రలు పోషించిన బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిజంగా ధన్యులు. ఉద్యమమంటే సామాన్యమైన ఉద్యమం కాదు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. వారంలో నాలుగు రోజులు బైండోవర్‌ ఎదుర్కొన్నారు. ఉద్యమం సమయంలో అనేక సార్లు జైలుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తిన్నారు. అణచివేతకు గురయ్యారు. పోలీసు చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన వాళ్లున్నారు. జీవితంలో కోలుకోలేని పరిస్ధితులను కూడా అనుభవిస్తున్నారు. కాళ్లూ చేతులు విరగొట్టుకున్నవాళ్లున్నారు. రాళ్ల దెబ్బలు తిన్న వాళ్లున్నారు. ఇలా బిఆర్‌ఎస్‌ తొలి నాళ్ల నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్యకర్తల్లో చాలా మంది ఆస్దులను పోగొట్టున్నారు. భూములు పోగొట్టుకున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. నిత్యం దీక్షలు చేశారు. రాస్తారోకోలు చేశారు. ధర్నాలు చేశారు. వంటా వార్పులు చేశారు. సభలు, సమావేశాలకు హజరయ్యేవారు. ఇలా నిత్యం ఉద్యమం కోసం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లున్నారు. వారిని ఆ సమయంలో తిన్నావా? అని అడిగిన వాళ్లు లేరు. అయినా ఏ ఒక్క నాడు మనసు నొచ్చుకున్న వాళ్లు కాదు. అదీ బిఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఆ తరం నుంచి నవతరానికి వచ్చినా, వయసు పెరుగుతున్నా కార్యకర్తలుగానే వున్నారు. అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం వుంది. వారిని పార్టీ పరంగా ప్రోత్సహకాలు అందించాల్సి వుంది. పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైన వుంది. 2014 నుంచి పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానించారు. తమకు పదవులు దక్కకపోయినా సహించారు. పార్టీ ఎవరికి పదవులు ఇచ్చినా ఓర్చుకున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఎవరికిచ్చినా గెలిపించుకున్నారు. చిన్నా చితక పదువులు కూడా అనేకం త్యాగం చేశారు. కొత్త , పాత కలయికతో కలిసి సాగాలంటే ఒప్పుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నా సహించారు. ఇలా ఎన్నో రకాల త్యాగాలు కార్యకర్తల సొంతం. చెరువు నిండితే కప్పలు చేరినట్లు పార్టీ బాగున్నప్పుడు చాల మంది వచ్చారు. పార్టీలో పదవులు పొందారు. పార్టీ ఓడిపోగానే మళ్లీ వారిదారి వారు చూసుకున్న వారు వున్నారు. ఇప్పటికైనా పార్టీ తేరుకోవాలి. నిజానిజాలు గ్రహించాలి. కొత్త నీరు అవసరమే..కాని మురికి నీరు వద్దన్న సంగతి తెలుసుకోవాలి. పార్టీ ఓడిపోగానే పది మంది ఎమ్మెల్యేలు ఎలా జారుకున్నారో చూశాం..వారికి ఎంత ప్రాధ్యాత కల్పించినా పార్టీని వదిలేశారు. కాని కార్యకర్తలు అలా కాదు. పార్టీ కోసమే పనిచేస్తారు. జీవితంలో అవకాశాలు రాకపోతాయా? అన్న ఆశతో రాజకీయలు చేస్తుంటారు. పార్టీని నమ్ముకొని వుంటారు. వారికి ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్‌ మీద ఇప్పటికే ఓ అపవాదుంది. పార్టీ నిర్మాణం ఆది నుంచి చేపట్టరు అనే వాదన వుంది. దాన్ని చెరిపేయాల్సిన అసవరం వుంది. పార్టీని కాపాకునేందుకు బలంగా పార్టీ నిర్మాణం జరగాలి. క్షేత్ర స్దాయి నుంచి పదవుల పంపకాలు జరగాలి. భవిష్యత్తులో పార్టీ అదికారంలోకి వచ్చినా పార్టీ యంత్రాంగమే పవర్‌ పుల్‌ అనే సంకేతాలిచ్చేలా కార్యకర్తలను గౌరవించాలి. ఇంత కాలం పార్టీకి సేవ చేస్తూ వస్తున్న వారిని వెంటనే గుర్తించాలి. వారి చేత పార్టీ నిర్మాణం జరగాలి. అన్ని స్ధాయిల్లోనూ పార్టీ పదవులు పంపకాలు చేపట్టాలి. పదేళ్లపాటు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారికి పార్టీ సలహా మండలిలో స్ధానం కల్పించాలి. ఇప్పటి వరకు ఏ పదువులు అందని వారిని గుర్తించి పదవులు అందించాలి. అప్పుడు పార్టీకి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. పార్టీలో కనిపించే ఉత్సాహం అంచనా వేయడం కష్టం. అంతలా గులాబీ విరబూస్తుంది. కారు జోరునందుకుంటుంది. ప్రత్యర్ధులు మందు దుమ్మురేపుకుంటూ పరుగులు పెడుతుంది. మరో రెండు దశాబ్ధాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అసవరం లేకుండా రాజకీయం ముందుకు సాగుతుంది. ఒక్కసారి ఆ దిశగా ఆలోచన చేసి చూడండి. పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టండి. ఇప్పటికైనా కార్యకర్తలు చూపే దారిలో పార్టీని నడపండి. పార్టీ ఓడిపోయి కష్టకాలంలో వున్నా కేసిఆర్‌కు నిజమైన నైతిక స్ధైర్యం అందిస్తున్న ఏకైక వర్గం క్యార్యకర్తలే…ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. కేటిఆర్‌, హరీష్‌రావులు జిల్లాలకు వెళ్తే ఎగేసుకుంటూ వచ్చి, జేజేలు పలుకుతున్నది కేవలం కార్యకర్తలే. తమ నాయకులు వస్తున్నారని ప్రజలను పోగు చేసి ఉత్సాహంగా తీసుకొచ్చి, సభలు విజయవంతం చేస్తున్నది కార్యకర్తలే. నాయకులకు పూలాభిషేకాలు, పాలాబిషేకాలు చేస్తూ జేజేలు పలికేది కార్యకర్తలే.

పంతళ్లకు కొలువు గండం!

*టీచర్లకు టెట్.. ఉద్యోగానికి త్రెట్*

*సుప్రీం కోర్టు తీర్పుతో టీచర్లలో అయోమయం.*

*2010కి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు టెట్ పరీక్ష.*

పంతుళ్లకు కొత్త పరీక్ష!

టెట్ పాస్ కాక ఉద్యోగం ఊస్ట్

సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లలో ఆందోళన.

తమిళనాడులో తప్పని సరి చేస్తే ఒక్క శాతం పాస్ అయ్యారు.

ఏపిలో 50శాతం కూడా పాస్ కాలేదు.

తెలంగాణలో అమలు చేస్తే అంతే సంగతులు!

*ఆ పరీక్ష పెడితే నేను కూడా పాస్ కాకపోవచ్చు. అంటు ఉపాధ్యాయ సంఘ నాయకుడు శ్రీపాల్ ప్రకటన.*

*అప్పీలుకు వెళ్తామని ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం.*

తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి.

*టెట్ పరీక్ష వల్ల 50 వేల మంది ఉపాధ్యాయుల కొలువులు పోవొచ్చు.*

హైదరాబాద్‌, నేటిధాత్రి:

తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా పంతుళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పనైంది. త్వరలో పంతుళ్లకు కొలువుగండం రానున్నది. తెలంగాణలో కనీసం ఓ 50వేల మంది ఉపాద్యాయులు కొలువులు పోయే పరిస్దితి తరుముకొస్తోంది. తాజాగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎంతోమంది ఉపాద్యాయులు కొలువులు రాంరాం కానున్నాయి. సుప్రింకోర్టు తీర్పుతో ఒక్కసారిగా టీచర్లు అయోమయానికి గురౌతున్నారు. ఉక్కిరిబిక్కిరౌతున్నారు. ఇప్పుడేం చేయాలన్నదానిపై సంఘర్షణ పడుతున్నారు. సుప్రింకోర్టే తీర్పు ఇచ్చిన తర్వాత తిరుగేముంటుంది. ఒక వేళ రివ్యూ పిటీషన్‌ వేసి మళ్లీ సుప్రింకోర్టు తలుపు తట్టినా, అదే తీర్పు రాదన్న గ్యారెంటీ ఏముంది? సహజంగా సుప్రింకోర్టు తీర్పులలో రివ్యూ పిటీషన్లు వీగిపోవడమే జరుగుతుంది. కోర్టుకు వెళ్లి మరోసారి చీవాట్లు తినడంకన్నా, కోర్టు ఆదేశాలను పాటించడమే మేలనుకునే సంఘాలు కూడా వున్నాయి. 2010కి ముందు టీచర్లుగా రిక్రూట్‌ అయిన వారు తప్పనిసరిగా టెట్‌ (టీచర్స్‌ టాలెంట్‌ టెస్ట్‌) పరీక్ష రాయాలి. అందులో పాస్‌ కావాలి. ఈ టెట్‌ కూడా రెండు రకాలుగా వుంటుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఒకటి, ప్రైమరీ టీచర్‌ పోస్టులకు మరోకటి నిర్వహిస్తారు. అలాంటి పరీక్షను ఇప్పుడు 2010 కి ముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రాయాలి. ఇదీ స్ధూలంగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో ఉపాద్యాయ అర్హత పరీక్షకు టెట్‌ అనేది వుండేది కాదు. కాని 2010 తర్వాత కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం కేంద్రం ప్రకటించింది. అయితే అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిపై నిర్ణయం తీసుకోలేదు. కాని కొత్తగా డిఎస్సీలు రాయాల్సిన ప్రతి అభ్యర్ధి టెట్‌ రాయడం తప్పని సరి చేసింది. దాంతో క్వాలీటీ టీచర్లు వస్తున్నారన్నది గుర్తించారు. గతంలో కేవలం డిఎస్సీ(డిస్టిక్ట్‌ సెలక్షన్‌) జరిగేది. ఇందులో కూడా మరో మతలబు వుండేది. ఏ జిల్లా ఉపాద్యాయులను ఆ జిల్లా పరిషత్‌ రిక్రూట్‌ చేసుకునేది. తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో డిఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయినా ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు టెట్‌ రాయడం ఉపాధ్యాయులకు సాధ్యమా? అంటే సాద్యం కాకపోవచ్చు? ఎప్పుడో చదువుకున్న పాఠాలను ఇప్పుడు మళ్లీ చదువుకొని పరీక్షలు రాయడం అనేది సాధ్యం కాకపోవచ్చు? అనేదే ఎక్కువగా వినిపిస్తున్న మాట. అయితే టీచర్లు తప్పించుకోవడానికే ఈ పన్నాగం పన్నుతున్నారనేది కొంత మంది వాదన. డిఎస్సీ రాసిన సమయంలో అన్ని రకాల సబ్జెక్టులు చదివి, పరీక్షలు రాశారు. డిఎస్సీ సెలక్టయ్యారు. ఇప్పుడు కూడా ప్రైమరీ,అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లకు ప్రత్యేక సబ్జెక్టు అనేది ఏదీ లేదు. వుండదు. అన్ని రకాల సబ్జెక్టులు చెప్పడానికి సిద్దంగా వుండాలి. చెప్పాలి. కాని ఇప్పుడు పరీక్షలు మేం రాయలేమని టీచర్లు చెప్పడం విడ్డూరంగా వుంది. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులు చెప్పే టీచర్లలో ప్రత్యేకంగా డీఎస్సీలో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులు పాసైన తర్వాతే ఉద్యోగాలు వచ్చాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్ష రాసే అధ్యాపక అభ్యర్ధులు సైన్‌ను ఎంపిక చేసుకుంటే అందులో మూడు రకాల విభాగాలు వుంటాయి. మ్యాథ్స్‌ సబ్జెక్టు వారికి ప్రత్యేకంగానే వుంటాయి. సోషల్‌లో కూడా భూగోళశాత్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్ధశాస్త్రం వేరువేరుగానే వుంటాయి. ఈ సబ్జెక్టులు చెప్పగలిగిన టీచర్లు పరీక్షలు ఎందుకు రాయలేరన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిజానికి 2010 తర్వాత ప్రతి టీచర్‌ టెట్‌ రాయాల్సి వుండేది. కాని ప్రభుత్వాలు అలసత్వం చేశాయి. ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులను మన్నించాయి. వారికి సహకరించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమోషన్లలోకూడా టెట్‌తో పని లేకుండానే వచ్చాయి. ఇప్పుడు అవే గుదిబండగా మారాయి. ఆ సమయంలో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ నుంచి ప్రమోషన్‌ పొందిన వారిలో ఎక్కువ శాతం టీచర్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బిఈడీలు చేయలేదు. ఆ సమయంలో ఉద్యోగాలు పొందిన వారిలో సింహభాగం టీచర్లు అలగప్పా, అన్నామలై యూనివర్సిటీల నుంచి బీఈడీ చేసిన వారే. అందులోనూ అవి దూరవిద్య బిఈడీలు. అంటే ఆ బీఈడీలు చేసిన ఏ ఒక్క అభ్యర్ధి కాలేజీకి వెళ్లింది లేదు. చదవుకున్నది లేదు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఆ యూనివర్సిటీల బీఈడీ చేసిన వాళ్లంతా ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలు రాశారు. కాని ఇప్పటికీ ఆ టీచర్లలలో ఎవరికీ ఒక్క ముక్క ఇంగ్లీష్‌ రాదు. కాని ప్రమోషన్లు సంపాదించి ఇంగ్లీష్‌ బోధిస్తున్నారు. ఇతర సబ్జెక్టులు బోధిస్తున్నారు. అసలు ఆ రోజుల్లో ఇంగ్లీష్‌లో పాస్‌ కావడమే గొప్ప. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు తెలుగు మీడియం చదువుకొని, ఇంగ్లీష్‌లో అన్నామలై, అలగప్పా యూనివర్సిటీల దూరవిద్య సర్టిఫికెట్లు పొందారు. అదృష్టం కలిసొచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాంటి వారు చెప్పే చదువుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల భవిష్యత్తు ఎలా వుంటుందో అర్దం చేసుకోవచ్చు. అందుకే మన విద్యా వ్యవస్ధ ఇలా తగలబడిపోయిందని చెప్పడంతో సందేహం లేదు. తర్వాత కాలంలో దూర విద్య బీఈడీలను ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించలేదు. దాంతో ఎంతో కొంత నాణ్యమైన చదువును చదువుకున్న ఉపాధ్యాయులు ఆ తర్వాత వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను నిలబెడుతున్నారు. కాని అలగప్పా, అన్నామలై యూనివర్సిటీల బిఈడీలు చేసిన వారి వల్ల విద్యా వ్యవస్ధ భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు టీచర్ల యూనియన్లలో నాయకులుగా వున్నవారు ఎక్కువ ఆ బాపతు టీచర్లే అని అంటుంటారు. ందుకంటే వాళ్లు చదువులు చెప్పలేరు. మాటలు చెప్పి పొద్దు పుచ్చుకోగలరు. కాలయాపన చేసి కాలం వెల్లబుచ్చగలరు. నిజం చెప్పాలంటే ఆ తరం అదృష్టవంతులు. వారు చదవు చెప్పలేకపోయిన అడిగిన వారు లేదు. తర్వాత రాజకీయాల్లో దూరి ప్రజలను ప్రభావితం చేసినా పట్టించుకున్న వారు లేదు. అప్పుడే పెరిగిన రియలెస్టేట్‌ వ్యాపారాలు సాగించి కోట్లు సంపాదించడంతో వారిని చూసి ఇతర టీచర్లు భయపడం మొదలైంది. ఫైనాన్స్‌ కంపనీలు, చిట్‌ ఫండ్‌ వ్యాపారాలు మొదలు పెట్టారు. పిల్లలకు చదువులు చెప్పడం తప్ప అన్నీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా వారికి టెట్‌ పరీక్ష అంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే సుప్రింకోర్టు కూడా ఒక్క వెసులుబాటు కల్పించింది. రిటైర్‌ మెంటుకు 5 గడువు వున్న ఉపాధ్యాయులను మినహాయించింది. లేకుంటే ఇంకా ఎంత మంది టీచర్లు కొలువులు కోల్పోయేవారు. తమిళనాడు రాష్ట్రంలో టెట్‌ పరీక్షను రాస్తే అందులో ఒక్క శాతం ఉపాద్యాయులు కూడా ఉత్తీర్ణత సంపాదించలేదని తెలుస్తోంది. ఏపిలో కూడా టెట్‌ పరీక్ష నిర్వహిస్తే కనీసం సగం మంది ఉపాద్యాయులు పాస్‌ కాలేదని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో టెట్‌ పరీక్షను ఆ తరం ఉపాధ్యాయులకు నిర్వహిస్తే ఎంత శాతం మంది పాస్‌ అవుతారో అని దిగులు పడుతున్నారు. అయితే టెట్‌ పాసైన వారికే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా సుప్రింకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల ప్రమోషన్లను ప్రకటించినా, ఆ తరం ఉపాద్యాయులు సైలెంటుగా వున్నారు. ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే మొదటికే మోసం వస్తుందన్న భయపడ్డారు. గొంతు సవరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వారికంటే జూనియర్లకు ప్రమోషన్లు వస్తుంటే చూస్తూ వుండిపోయారు. అదే గతంలో అయితే సీనియర్లకు అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కేవారు. ప్రమోషన్లు ఎలాగూ పోయాయి. తర్వాత ఉద్యోగాలే పోయే పరిసి ్ధతి వస్తుందా? అని దిగులు చెందుతున్నారు. కాకపోతే కొంత గడువిచ్చి రెండుసార్లు అవకాశం కల్పించాలని కొంత మంది ఉపాద్యాయులు కోరుతున్నారు. కొంత మంది దీనిపై మళ్లీ రివ్యూ పిటీషన్‌కు వెళ్తున్నారు. మరి కొంత మంది ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని ఈ తిరకాసులు మాకే ఎందుకొని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది ఎటు దారి తీస్తుందో అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అన్ని శాఖలు వేరు. విద్యా శాఖ వేరు. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్ధలో లోప భూయిష్టంగా వుండొద్దు. నాణ్యమైన విద్య అందాలంటే టాలెంటెడ్‌ ఉపాద్యాయులు తప్పని సరి కావాలి. అందరూ కోరుకునేది ఇదే..!

పొత్తులతోనే కొంప ముంచుకుంటున్న కాంగ్రెస్

`ఒంటరిగా పోటీ కాంగ్రెస్‌కు ఎప్పటికైనా లాభం!
`సాగిలపడినంత కాలం ఇదే ఫలితం.

`సీట్లు కాంగ్రెస్‌ అడుక్కోవడం దురదృష్టకరం.
`ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగి మొదటకే మోసం.


`‘‘ఆప్‌’’ చేతిలో ఇప్పటికే మోసపోయింది.
`‘‘మహారాష్ట్ర’’లో పరువు పోగొట్డుకున్నది.
`ఉత్తరప్రదేశ్‌’’ లో ‘‘ఎస్పీ’’ ఇచ్చిన సీట్లు తీసుకున్నది.
`‘‘హర్యానా’’లో ‘‘ఆప్‌’’ మూలంగా ఆగమైపోయింది.
`‘‘డిల్లీ’’లో దిక్కు లేకుండా పోయింది.
`ఇప్పుడు ‘‘బీహార్‌’’ లో ‘‘ఆర్జేడీ’’ కూడా ‘‘కాంగ్రెస్‌’’ ను బెదిరిస్తోంది.
`ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్‌ భయపడుతోంది.
`ఉత్తరాధిలో బలపడకపోతే భవిష్యత్తు ఆగమ్యగోచరం.
`ఇప్పటికైనా మేలుకోకపోతే మరో పదేళ్లయినా కోలుకోవడం కష్టం.
`‘‘130 ఏళ్ల చరిత్ర’’ పార్టీకి వుంటే సరిపోదు.
`అవకాశాలు అందివచ్చినప్పుడు అందుకోకపోతే వెనుకబాటు తప్పదు.
`ప్రత్యర్థి బలంగా వున్నప్పుడు జనం ఏది చెప్పినా వినరు.
`మూస వాదాలను నుంచి కాంగ్రెస్‌ బైటకు రాకపోతే జనం గెలిపించరు.
`నిజాలు మాత్రమే జనం నమ్మడం లేదు.
`నమ్మించగల శక్తి వున్ననాయకులనే నమ్ముతున్నారు.
`ప్రాంతీయ పార్టీలకు బలమవుతున్నారు.
`దేశ వ్యాప్తంగా బలహీనపడిపోయారు.
`జాతీయ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడితే గెలవదు.
`ప్రాంతీయ పార్టీల చేతిలో పావుగా మారక తప్పదు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలం పెరుగుతోంది. పార్టీ అన్ని రాష్ట్రాలలో పుంజుకుంటోంది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ గ్రాఫ్‌ బాగా పెరుగుతోంది. రాహుల్‌ చెప్పే మాటలను జనం బాగా నమ్ముతున్నారు. ఆయన కోసం జనం సభలకు, ర్యాలీలకు విపరీతంగా వస్తున్నా రు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ప్రాంతీయ పార్టీలను ఎందుకు నమ్ముకుంటోంది? ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఎందుకు ఆదారపడుతోంది? ఏ వామపక్షాలనైనతే కాంగ్రెస్‌బలంగా నమ్మిందో
ఆ వామపక్షాలు కాంగ్రెస్‌ను నిండా ముంచాయి? యూపిఏ వన్‌లో వామపక్షాలకు కాంగ్రెస్‌ ఎంతో ప్రాధాన్యత కల్పించింది. అయినా వామపక్షాలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. రెండోసారి యూపిఏలో వామపక్షాలు అడుగడుగునా కాంగ్రెస్‌ను మోసం చేస్తూ వచ్చాయి. పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వచ్చాయి. కాంగ్రెస్‌ అండతో గెలిచిన వామపక్షాలు కాంగ్రెస్‌ను ఒక రకంగా అల్లాడిరచాయి. దేశంలో కాంగ్రెస్‌ ఈ పరిస్దితి రావడానికి కారణం వామపక్షాలు. ప్రాంతీయ పార్టీలు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతారన్నట్లు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన వాపక్షాలు కూడా కనుమరుగై పోయాయి. ఒకప్పుడు దేశంలో కీలకపాత్ర పోషిచిన వామపక్షాలు కాంగ్రెస్‌ మీద కత్తి దూసి ఆఖరుకు అడ్రస్‌ లేకుండాపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బిజేపి ఇంతలా పుంజుకోవడానికి వామ పక్షాలే పరోక్ష కారణం. కాంగ్రెస్‌ పార్టీ ఉదారతను అలుసుగా తీసుకొని ఆపార్టీని నిర్వీర్యం చేస్తే తాము బలపడతామని వామపక్షాలు భావించాయి. కాని కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేస్తే బిజేపి బలం పెరుగుతుందని ఆలోచించలేకపోయాయి. ఆ తర్వాత దేశంలోనే వామపక్షాలకు ఉనికి లేకుండా పోతాయని కూడా ఊహించలేదు. కాంగ్రెస్‌ అధికారం లోవున్నంత కాలం ప్రభుత్వం మీద నిరసనలు, ధర్నాలు, బంధులు చేపట్టేవి. మరి ఇప్పుడు పదకొండేళ్లుగా నోరు విప్పడానికి కూడా వామపక్షాలు ధైర్యం చేయలేకపో
తున్నాయి. కూర్చున్న చెట్టు కొమ్మ నరు క్కున్న వామపక్షాల పుణ్యమా? అని కాంగ్రెస్‌ గడ్డు రోజలు తెచ్చుకున్నది. ఇప్పటికైనా కాంగ్రె స్‌పార్టీ తేరుకోవాల్సిన అవసరం వుంది. 130 సంవత్సరాల చరిత్ర వుందని చెప్పుకోవడం కాదు? అప్పటి రాజకీయాలను చూపించే శక్తి తెచ్చుకోవాలి. రాజులైనా, రాజ్యాలైనా పట్టాభిషేకమే కీలకం. రాజకీ యాలైనా, నాయకులైనా పదవులే ముఖ్యం. ఈ విషయం రాహుల్‌గాందీ పదే పదే మర్చిపో తున్నాడు. ఘజనీ లాగా ఎన్నిసార్లు దండయాత్ర చేశాడన్నది ఆదర్శం ఎప్పుడూ కాదు. విఫల ప్రయత్నాలు ఎన్ని సార్లు చేసినా ఉపయోగం లేదు. అవకాశాలను అందిపుచ్చులేని వారు నాయకులుగా పనికిరారు. ప్రజాసేవ అనేది పదవుల్లో వున్నప్పుడే ఎక్కువ చేయగలరు. విసృతమైన సేవ చేయగలరు. నిజం చెప్పాలంటే రాహుల్‌ గాంధీ 2009లోనే తప్పటడుగు వేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాంధీ ప్రదాని కావాలనుకున్నారు. కాలేకపో యారు. 2009లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. రాహుల్‌ గాందీ చేజేతులా దానిని జార విడుచుకున్నారు. ఆనాడు ప్రధానిగా పనిచేసి ఐదేళ్లు పాలన చేసి, తర్వాత ఓడిపోయినా మాజీ ప్రదాని అనే గౌరవం వుండేది. కష్టపడకుండానే అన్నీ అవకాశాలు అందినప్పుడు జార విచుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు. మంత్రి పదవి వద్దన్న రాహుల్‌ గాంధీ ఈ పదకొండు సంవత్సరాలలో ఏం సాధించారు. రాజకీయాలు ఏం అవగాహన చేసుకున్నారు. తాను ప్రధాని అయితే ప్రజలకు ఏంచేయలగలను అనేది కూడా ఆయన ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కోసం అనవసర వృధా ప్రయత్నాలు చేస్తున్నా రు. చరిత్రో పోరాటం చేసి గెలిచిన వారున్నారు. అందివచ్చిన అవకాశాలతో పదవులు అందుకున్నవారున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించిన వారు కూడా వున్నారు. రాజకీయాల్లో వ్యూహాలకన్నా మిన్నవైనవి ఏమీ వుండవు. వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా చేసినంత కాలం పగ్గాలు ఆయన చేతిలో పెట్టలేదు. పగ్గాలు రాహుల్‌ గాందీ అందుకోలేదు. రాహుల్‌ గాందీ స్ధానంలో మరే నాయకుడు వున్నా, కాంగ్రెస్‌ను అదికారంలోకి తీసుకొచ్చేవారు. పార్టీ అధ్యక్షుడి పదవే మోయలేని రాహుల్‌ గాంధీ దేశ బాద్యతను ఎలా నిర్వర్తిస్తారో అర్దం కావడం లేదు. ఎందుకంటే ఆయన నాయకత్వమంతా ఫెయిల్యూర్‌తోనే మొదలౌతోంది. ఫెయిల్యూర్‌ కాంగ్రెస్‌ మూట గట్టుకుంటోంది. పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ గెలిచింది వుందా? కాంగ్రెస్‌ను రాహుల్‌ గెలిపించాడన్న భావన పార్టీలో వుందా? ఆయన వ్యూహాలన్నీ అపజయాలుగానే మిగిలిపోతున్నాయి. ఇంకా నాలుగేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా వుంటాయో తెలియవు. ఈసారి కూడా రాహుల్‌ గాంధీ తన పంథాను మార్చుకోలే కపోతే దేశంలో కాంగ్రెస్‌ ప్రజలకు మరింత దూరమవడం ఖాయం. దేశంలో ప్రజలు బిజేపిని గెలిపిస్తున్నారంటే, మరో ప్రజలకుమరో ప్రత్యా మ్నాయం కనిపించడం లేదు. రాహుల్‌ గాందీ మీద ప్రజలకు నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికీ రాహుల్‌ విషయంలో చిన్న పిల్లల చేష్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మానుకోవాలి. హుందాగా రాజకీయాలు చేయడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలకు దూరంగా వుండాలి. ఎన్నికల తర్వాత పొత్తులకు పోవాలే తప్ప, ఎన్నికలుముందు పొత్తులే కాంగ్రెస్‌ను నిండా ముంచేస్తున్నాయి. ఒక్కసారి గత ఐదారేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం చూస్తుంటే, ప్రాంతీయ పార్టీలను నమ్మి బొక్కా బోర్లా పడుతూ వస్తోంది. తన కాళ్ల మీద తాను కాంగ్రెస్‌ పార్టీ నిలబడలేకపోతోంది. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీ ఇచ్చే సీట్ల మీద ఆదారపడి రాజకీయం చేయడం కాంగ్రెస్‌ దురదృష్టకరం. 80 లోకసభ సీట్లులో 15 సీట్లు ఇస్తే చాలనుకుంటే కాంగ్రెస్‌ నాయకులు ఏం కావాలి. వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి. పార్టీలు చీలితే బిజేపి బాగు పడుతుందన్న భ్రమ నుంచి కాంగ్రెస్‌ బైటకు రావాలి. కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకోవాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి ఫ్రధాన కారణం ఆప్‌. అదే ఆప్‌తో సక్యత వల్ల కాంగ్రెస్‌కు మరింత నష్టమే మిగిలింది తప్ప లాభం జరగలేదు. నిజానికి 2013లో ఆప్‌కు డిల్లీలో మద్దతు ఉపసహంరించుకోవడం కాంగ్రెస్‌ చేసిన మొదటి తప్పు. తర్వాత ఆప్‌ కోసం చేతులు చాప డం కాంగ్రెస్‌ చేసిన రెండో తప్పు. అక్కడితో ఆగకుండా పదేపదే ఆప్‌ కోసం తన రాజకీయాన్ని కాంగ్రెస్‌ కోల్పోతూ వచ్చింది. హర్యానాలో గెలవాల్సిన కాంగ్రెస్‌ఎందుకు ఓడిపోయింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగానే అదికార బిజేపి విజయాలు సొంతం చేసు కుంటోంది. ప్రతిపక్షాల మధ్య లుక లుకలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టు కొస్తున్నాయి. డిల్లీ మాజీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైలు కు పంపించినప్పుడు ఆయనకు మద్ద తుగా కాంగ్రెస్‌ నిలిచింది. తర్వాత హర్యానా ఎన్నికలకు ముందు ఆప్‌తో కలిసి బిజేపికి వ్యతిరేకంగా ప్రచా రం సాగించింది. ఆఖరుకు ఎన్ని కలు దగ్గర పడి టికెట్ల పంపకాలలో తేడా వచ్చింది. ఆప్‌ జెల్లకొట్టి కాంగ్రెస్‌కు హాండ్‌ ఇచ్చింది. దాంతో మళ్లీ హర్యానాలో మూడోసారి బిజేపి గెలిచింది. హాట్రిక్‌ సాధిం చింది. అదే సమయంలో కాంగ్రెస్‌, ఆప్‌లు సర్ధుకుపోతే అధికారం దక్కేది. కాని కలిసి సాగలేదు. అది డిల్లీలో కూడా బిజేపి అదికా రంలోకి రావడానికి కారణ మైంది. ప్రతి చోట కాంగ్రెస్‌ మీద ఇతర ప్రాంతీ య పార్టీలు ఆదిపత్యం వహించా లనే చూస్తున్నాయి. తాజాగా బిహార్‌ లో నిన్నటి వరకు మహాగట్‌బం దన్‌లో భాగంగా ఆర్జేడీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ప్రచారం చేస్తూ వచ్చిం ది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా అక్కడ దృష్టిపెట్టింది. ఎలాగైనా సరే బిజేపిని, జేడీయూకు అధికారానికి చరమగీతం పాడాలని రాహు ల్‌ గాందీ ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. అందులో భాగం గా ఓట్‌ చోరీ అనే విషయాన్ని పెద్దఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. బీహార్‌ సాక్షిగా ఎన్నికల సంఘం మీద పెద్దఎ త్తున ఆరోపణలు చేశారు. 65లక్షల ఓట్ల గల్లంతుపై న్యాయం పోరాటం చేస్తున్నా రు. ప్రజల్లో వుంటూ చైతన్యా న్ని రగిలిస్తున్నారు. తీరా ఎన్ని కల తేదీ ప్రకటన దగ్గరకు వచ్చేసరికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు. ఇలా ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని పదేళ్లుగా రాజకీయం చేసినా ఎదు గూ బొదులేదు. ఇలా తమ శ్రమను ప్రాంతీయపార్టీలకు వృదా చేయడం కన్నా, పార్టీని బలోపేతం చేసుకోవడం ఎంతైనా అవసరం. బిజేపిని ఓడిరచాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను పెంచి పోషిస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ మీద ఆ పార్టీలకు కృతజ్ఞత వుండడం లేదు. అందుకే ఇక నుంచైనా ఒంటరి పోరు మీద దృష్టిపెట్టండి. అదే పార్టీని గట్టెక్కిస్తుంది.

పేర్నాల మాటలు..పేకుడు దద్దమ్మలు!?

`ఉద్దండుల పోకడలు.. పొంకనాల చేష్టలు!?

`ప్రజా తీర్పును అవహేళన చేస్తున్రు!

`రాజ్యాంగ స్పూర్తిని పాతరవెట్టిన్రు.

`ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్రు.

`త్రిశంఖు స్వర్గంలో యాలాడుతున్రు!

`ప్రమాణం చేసి పచ్చి అబద్దాలా!?

`ఇమానం తప్పిన్రు!?

`ఇజ్జత్‌ ఇడిశిపెట్టిన్రు?

`నియ్యత్‌ మరిశిండ్రు!

`తొండి మాటలు నేర్శిన్రు!

`కారు దిగలేదంటన్రు

`కాంగ్రెస్‌లో చేరలేదంటన్రు

`ప్రజల నమ్మకాన్ని వంచించిన్రు.

`పార్టీ మారలేదంటన్రు!

`కప్పుకున్నది కాంగ్రెస్‌ కండువ కాదంటున్రు!

`జాతీయ జెండా కండువా అని తొండి ముచ్చట్లు చెప్తున్రు!

`బీఆర్‌ఎస్‌ లోనే వున్నామని బుకాయిస్తున్రు!

`బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే కొనసాగుతున్నామంటున్రు.

`నియోజకవర్గ అభివృద్ధి కోసమే సిఎం ను కలిశినమంటున్రు!

`పూటకో మాట మారుస్తున్రు!

`ప్రజలను ఏమారుస్తున్రు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          నిజాలు ఎలాగూ చెప్పలేరు. కనీసం అబద్దాలైలు కూడా ఆడలేనప్పుడు ధైర్యవంతులని ఎలా అంటారు. అలాంటి వారికి రాజకీయాలెందుకు? ప్రజా ప్రతినిధులు అయ్యేందెందుకు? వారికి పదవులెందుకు? ప్రజల పక్షాన నిలిచినట్లు లేదు? కనీసం తమకు తాముగా రాజకీయ నాయకుడిగా చెప్పుకోవడానికి లేదు? ఇంకా ఎందుకు ఆ పదువులు? రాజకీయం ఎప్పుడూ సూటీగా వుండదని అంటారు. కాని డొంకతిరుడుగు రాజకీయాలైనా సరే సరిగ్గా చేయలేని వారు ప్రజలకు మేలు చేయలేరు. వారి పదవుల కూడా కాపాడుకోలేరు. తెలంగాణలో పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు. రాజీపడే రాజకీయాలు చేసే శక్తిలేదు. ఏ పార్టీలో వున్నామో చెప్పడానికి నోరు కూడా రావడం లేదు. పార్టీ మారినట్లు ఒప్పుకునే ఆత్మస్ధైర్యం లేదు. ఇంతగా దిగజారి రాజకీయాలు చేసి ఆ ఎమ్మెల్యేలు చేసేదేమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మూడునెలల్లో పది మంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కారు దిగారు. కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ విషయం వాళ్లే స్వయంగా మీడియా సాక్షిగా, కార్యకర్తల సమక్షంలో చెప్పారు. కాని ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. తాము పార్టీ మారలేదంటున్నారు. కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. ఇది అనైతిక కాదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లు కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పడం కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా? కనీసం ఆత్మ ప్రబోధం అనేది కూడా వారిలో లేదా? ఎనుకున్న ప్రజలను వంచించడం కాదా? నమ్మి టికెట్‌ ఇచ్చిన పార్టీని మోసం చేయడం కాదా? గెలిపించిన కార్యకర్తలను నట్టెట ముంచడం కాదా? నమ్మించి గొంతు కోసినట్లు కాదా? కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్వాల ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌. సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంక్రట్‌రావు, దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలు బిఆర్‌ఎస్‌ కు రాం రాం చెప్పి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వారితోపాటు ఎంత మందిని కాంగ్రెస్‌లో చేర్చారు. సుప్రింకోర్టు తీర్పు దృష్ట్యా గడువు దగ్గరపడుతుండడంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ వారికి నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాదానం చెప్పాలన్నారు. అందులో 8మంది ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని చెప్పారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మరింత సమయం కోరారు. అయితే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పాడు. ఆయన పార్టీ మారిన రోజు తన రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌ నుంచి అని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్లానని, ఆ తార్వత బి ఆర్‌ఎస్‌లో వున్నానన్నారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చానని మీడియా ముందు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో సమర్ధవంతమైన నాయకుడు. ఆయన పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలని పార్టీ మారినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి యువకుడు, ఇంకా మరో ముప్పై ఏళ్లు రాజకీయం చేయగలిగే శక్తి వున్న నాయకుడితో పనిచేయడం ఆనందంగా వుందన్నారు. కాని స్పీకర్‌కు మాత్రం తాను పార్టీ మారలేదని సమాధానమిచ్చారు. సరే అదే నిజమని అనుకుందాం. కాని ఆయన ప్రభుత్వంలో భాగాస్వామిగా వున్నారు. ఓ కార్పోరేషన్‌కు చైర్మన్‌గా క్యాబినేట్‌ ర్యాంగ్‌ పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆయన పచ్చి అబద్దంచెప్పినట్లు కాదా? అనేక సార్లు సిఎల్‌పి సమావేశంలో పాలు పంచుకోలేదా? ఎంతో సుధీర్ఘమైన అనుభవం వున్న నాయకుడు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, అలాంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి అవసరమని నమ్మి కేసిఆర్‌ 2014 తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు. 2018 తర్వాత ఏకంగా స్పీకర్‌ పదవిని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌గా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇలా అబద్దాలు చెప్పడం విడ్డూరం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ఫ్లెక్సీలున్నాయి. పార్టీ మారినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ఇంటి మీదకు దాడికి దిగిన సందర్భం కూడా అరికెపూడికి వుంది. అయినా పార్టీ మారలేదని చెప్పడం విడ్డూరంగా వుంది. వీరిలో డాక్టర్‌ సంజయ్‌ మీద కేసిఆర్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. నిజానికి జగిత్యాల టికెట్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఆమె ఎంపిగా వున్న సమయం నుంచి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించారు. నిజామాబాద్‌ ఎంపిగా వున్న సమయంలో నిజామాబాద్‌తోపాటు , జగిత్యాల అభివృద్దికి కవిత ఎంతో కృషి చేశారు. అయినా కన్న కూతురు కవితను కాదని సంజయ్‌కు టికెట్‌ ఇస్తే గెలిచి, పార్టీ మారడం అనేది ఏమాత్రం నైతికత కాదని అంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసిఆర్‌ ఎంతో ప్రాదాన్యతనిచ్చారు. ఉన్నత విద్యావంతుడు. పరిపాలనపై పట్టున్న నాయకుడు అని ఎంతో కేసిఆర్‌ నమ్మారు. 2014 ఎన్నికల్లో వరంగల్‌ ఎంపిగా గెలిచిన కడియం శ్రీహరిని, ఉన్న ఫలంగా ఎమ్మెల్సీని చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో ఓ మీడియాలో ఇంతకన్నా నాకు వేరే ఆశలు లేవు. రాజకీయాలు చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి కావడం నా అదృష్టం. ఇక నా జీవితం బిఆర్‌ఎస్‌లోనే పరిసమాప్తమని చెప్పారు. అలా నమ్మిన కడియం శ్రీహరి, రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆఖరుకు గత ఎన్నికల ముందు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్‌ ఇచ్చారు. అయినా కడియం శ్రీహరి మూడు నెలలు కూడా బిఆర్‌ఎస్‌లో లేరు. ఇంకా విచిత్రమేమిటంటే ప్రభుత్వం పడిపోకుండా చూసుకో అని ఒక దశలో రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో సూచించిన కడియం శ్రీహరి, పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. కాని రాజకీయ అనుభవం నేర్పిన పాఠంతో ఆయన చూపించిన రాజకీయ చాణక్యం నిగూడమైంది. కేసిఆర్‌ మరింత నమ్మకంతో కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్‌ ఎంపి. టికెట్‌ కూడా ఇచ్చారు. ఆ సీటు కోసం ఎంతో మంది పోటీ పడినా వారికి కాదని కడియం శ్రీహరికి ప్రాదాన్యతనిచ్చారు. అటు బిఆర్‌ఎస్‌ భీఫామ్‌ ఇచ్చిందో లేదో, ఇటు డిల్లీకి వెళ్లి కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ బిఫామ్‌ తెచ్చుకున్నారు. తన కూతురు కోసం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సార్లు తాను కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. కాని ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఏ పార్టీలో వుండాలో ఆ పార్టీలోనే వున్నానంటూ సమాదానం దాట వేశారు. వరంగల్‌ రాజకీయాల్లోనే టాలెస్టు పర్సనాలిటీ అని గొప్పగా చెప్పుకునే కడియం శ్రీహరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తన కూతురు కోసం పార్టీ మారడమే కాదు, ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న విషయం భహిరంగ రహస్యమే. తప్పించుకునే ఛాన్స్‌లేదని తెలిసినా పార్టీ మారినట్లు కడియం శ్రీహరి ఒప్పుకోకపోవడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఇక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తప్పించుకునే పరిస్ధితి అసలే లేదు. ఎందుకుంటే ఆయన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా వుంటూనే కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ తరుపున సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. వేటు పడాల్సి వస్తే ముందుగా దానం నాగేందర్‌ కు అందరికంటే ముందుపదవిపోక తప్పదు. కాని ఎన్నుకున్న ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమౌతుందో దానం నాగేందర్‌కు గతంలోనే ఓ అనుభవం వుంది. 1999లో మొదటి సారి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్‌కు 2004కు కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దాంతో రాత్రికి రాత్రి టిడిపి పార్టీ టికెట్‌ తెచ్చుకొని సైకిల్‌ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. కాని కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకొన్న అనుభవం దానంకు వుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న భయం వుంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ పోటీ చేయాలంటే భయం పట్టుకున్నది. అందుకే రాజీనామా అంటే భయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే దారి అయితే రాజీనామా చేయాలి. లేకుంటే వేటుకు సిద్దపడాలి. రెండిరటిలో ఏదో ఒకటి తప్పదు. రాజకీయాలలో ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే తప్ప భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ మారరు.

పీఏ చెప్పిందే ఫైనల్‌!?

`పీఏ చెబితే ఎమ్మెల్యే చెప్పినట్లే!(నా)!?

`మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పీఏ ఇష్టారాజ్యం

`మంచిర్యాల ఎమ్మెల్యే పేరు చెడగొడుతున్న పీఏ

`ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే పనులు కానిస్తున్న పీఏ

`మంచిర్యాల నియోజకవర్గంలో పెత్తనమంతా పీఏదే!

`నియోజకవర్గ పనులన్నీ పీఏ కనుసన్నల్లోనే..

`పీఎ ఎస్‌ అంటే ఎస్‌..నో అంటే నో..

`పీఏ అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.

`వద్దంటే కాంట్రాక్టులు వదులుకోవాల్సిందే.

`ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గానికి రావడం లేదు.

`ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావును కలిసేందుకు పీఏ ఎవరికీ అవకాశమివ్వడం లేదు.

`అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడు

`అర్హులైన కాంట్రాక్టర్లను పక్కన పెడుతున్నాడు

`అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

`లోకల్‌ల్లో క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ లేని వారికి టెండర్లు అప్పగిస్తున్నారు

`స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు

`అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నాడు

`అంతా నా ఇష్టమన్నట్లు వ్యవహరిస్తున్నాడు

`ఇప్పటికైనా ఎమ్మెల్యే నిజాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

`అవినీతిలో మునిగితేలుతున్న పిఏను పక్కన పెట్టకపోతే నష్టం జరిగిపోతుందంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఏ నియోజకవర్గంలోనైనా సరే ఎమ్మెల్యేలు చెబితే పనులౌతాయి. మంచిర్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దగ్గర పనిచేసే పిఏ చెప్పిన పనులే అవుతాయి. పిఏ చెప్పినట్లే జరుగుతాయి. ఇక్కడ పిఏ చెప్పిందే ఫైనల్‌..అలా అని ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు ఆదేశాలతో జరిగిపోతున్నాయా? అంటే అదీ లేదు. అసలు ఎమ్మెల్యేకు ఈ విషయాలే తెలియవు. అంతగా పిఏ. ఏదిచెబితే ఎమ్మెల్యే అది చెప్పినట్లే అన్నట్లుగా సాగుతోంది. ఇలా రాష్ట్రంలోనే కాదు, నియోకవర్గంలోఎంతో పేరున్న ఎమ్మెల్యే పేరు చెడిపోవడానికి ఇలాంటి పిఏ ఒక్కరుంటే చాలు అని పార్టీ నాయకులు , ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నమ్మారు. పిఏ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదే మంచిర్యాలలో అందరూ అనుకుంటున్న మాట. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకుఎంతో మంచి పేరుంది. కాని ఏం లాభం. ఆయన పెట్టుకున్న పిఏ వల్ల తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేదు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు చెప్పడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. నాయకులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తన వద్ద పని చేసే పిఏను అంతగా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గ నాయకులు కూడా ఎవరూ పిఏ మీద పిర్యాధు చేయడానికి సాహసించడం లేదు. పైగా పిఏతో సఖ్యతగా వుంటే చాలనుకుంటున్నారు. కాని ప్రజలకు మేలు చేయాలన్నా,సేవ చేయాలన్నా, అభివృద్ది పనుల చేపట్టాలన్నా తామే ముఖ్యమన్న సంగతి నాయకులు కూడా మర్చిపోతున్నారు. పిఏ చెప్పినట్లు తలాడిస్తున్నారు. ఒక రకంగా వారికి కూడా తప్పడం లేదు. ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది నాయకులైన వాళ్లు కూడా పిఏ. మన్ననలు పొందాలనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పార్టీ నాయకులకు దౌర్భాగ్యమైన పరిస్తితే. కాని ఏం లాభం? నోరు తెరిచి ప్రశ్నించలేరు. తమ ముందు పిఏ ఎంత అని అనుకోలేరు. ఎమ్మెల్యేకు చెప్పిన ఆయన పట్టించుకుంటాడో లేదో అన్న అనుమానం. ఎమ్మెల్యేకు ఎప్పుడూ సమాచారమందించే పిఏతో పెట్టుకొని పేరు చెడగొట్టుకోవడం ఎందుకు? ఎమ్మెల్యేకు దూరం కావడమెందుకు? అనే ధోరణిలోనే నాయకులు సాగుతున్నారు. దాంతో ఆ పిఏ ఆడిరది ఆట.. పాడిరది పాటగా మారిపోయింది. ఎలాంటి విషయాల్లోనైనా సరే పిఏ. ఎస్‌ అంటే ఎస్‌. నో.అంటే నో..అంతే! అంతకు మించి దారి లేదు. పరిష్కారం అంతకాన్న లేదు. అంతగా పిఏ ఏలుబడి సాగుతోంది. నిజమే పిఏ పలుకుబడి మంచి పనుల విషయంలోనో, ప్రజలకు మేలు జరిగే విషయంలో సాగితే బాగుంటుంది. కాని తన ఇష్టానుసారం పిఏ సాగిస్తున్న తీరు మాత్రం అందరికీ ఇబ్బందికరంగా మారుతోంది. నాయకులే ఎమ్మెల్యే పిఏ ముందు పెద్దగా నోరు విప్పకపోవడంతో అధికారులు కూడా పిఏకు వంత పాడుతున్నారు. పిఏ చెప్పిందే చేస్తున్నారు. పిఏ ఏది చెబితే అదే చేస్తున్నారు. ఇలా అధికారులు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు? ఆఖరుకు కోర్టు తీర్పులను కూడా పక్కన పెడుతున్నారు. అభివృద్ది పనులను చేపట్టే కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా అదికార గణం నుంచి మొదలు, నియోకవర్గ, ముస్సిపల్‌ అదికారులంతా పిఏ చెప్పినట్లు వినాలి. పిఏ చెప్పిన వారికే కాంట్రాక్టులివ్వాలి. అర్హత లేని వాళ్లైనా సరే పిఏ చెప్పి వారికే టెండర్లు అప్పగించారు. ఇలాంటి ఏ విషయంలోనూ ఎమ్మెల్యేకు సమాచారం వుండడంలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. తమను ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా చేస్తున్నాడని వాపోతున్నారు. నియజక వర్గ పెత్తనమంతా తన గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు తెరతీస్తున్నాడు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు అనార్యో కారణంగా నియోజకవర్గానికి రావడం లేదు. అది అలుసుగా తీసుకొని పిఏ రెచ్చిపోతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎమ్మెల్యేను కలవాలని ఎంత ప్రయత్నించినా పిఏ. ఆ అవకాశం కల్పించడం లేదు. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు వెళ్లినా అప్పాయింటు మెంటు దొరక్కుండా పిఏ చూసుకుంటున్నాడు. దాంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లలేక, పిఏ చేస్తున్న పనులు భరించలేక కాంట్రాక్టర్లు సతమతమౌతున్నారని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే అదికారులను గుప్పిట్లో పెట్టుకొని స్ధానిక కాంట్రాక్టర్లను పిఏ వేధిస్తున్నాడని తెలుస్తోంది. అర్హులైన , లోకల్‌ కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, ఎక్కడి నుంచో వచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. నియోజకవర్గ పరిదిలో ఏ పనులు చేయాలన్నా, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ వుండాలి. అది స్దానికంగా వుండాలి. కనీసం నియోజకవర్గానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వుండాలి. ఇది నిబంధనలు చెబుతున్నాయి. స్ధానికంగా వున్న కాంట్రాక్టర్లందరికీ మంచిర్యాలలోనే క్యాలిటీ కంట్రోల్‌ ల్యాబులున్నాయి. కాని వారికి మాత్రం కాంట్రాక్టులు అందడం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ధర్డ్‌ పార్టీలకే టెండర్లు, కాంట్రాక్టులు వెళ్తున్నాయి. అలా అదికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పిఏ తన ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. స్ధానికంగా క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ లేకపోవడం వల్ల జరుగుతున్న పనులు నాణ్యతను కూడా పట్టించుకునేవారు లేకుండాపోయారు. స్ధానికంగానే క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబులున్న కాంట్రాక్టర్లు పనికిరాకుండాపోతున్నారు. కాంట్రాక్టులు దక్కించుకోలేకపోతున్నారు. ఇలా గత ఏడాది ఇచ్చిన కాంట్రాక్టులపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అయినా అదికారులు ఆ తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టులు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా రద్దు చేసి మరీ కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. పిఏకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పిఏ తన స్వార్ధం కోసం అదికారులను గుప్పిట్లో పెట్టుకొని నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావుకున్న పేరును చెడగొడుతున్నారు. అంతా నా ఇష్టమన్న రీతిలో పిఏ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. పిఏ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావుకు తెలిసే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే మద్దతు లేకుండానే పిఏ ఇంత ఇష్టాను సారం వ్యవహరిస్తారా? అని అనుమానపడే పరిస్ధితి వస్తుంది. ఇంకా మూడేళ్ల కాలం వుంది. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు సేవ చేయాల్సి వుంది. ఇలాంటి సమయంలో పిఏ ఆగడాలను ఎమ్మెల్యే ఉపేక్షిస్తూపోతే ప్రజల్లో నమ్మకం పోయే పరిసి ్దతి రావొచ్చు. ప్రేమ్‌సాగర్‌రావు మంచితనం చాలా మందికి తెలిసినా, కొంత మందికి తెలియకపోవచ్చు. ఎన్నికల నాటికి పరిస్ధితి చేయిదాటి పోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి వచ్చినా, రాకపోయినా ఇప్పటికైనా మేలుకుంటే ఎంతోమంచిదని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే మీద ఎలాంటి వ్యతిరేకత ఇప్పటి వరకు లేదు. కాని పిఏ వల్ల ఆ వ్యతిరేకత మొదలౌతే చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లౌవుతుంది. పిఏల వ్యవహార శైలి వల్ల గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. అలాంటి పరిస్దితి రాకుండా వుండాలంటే వెంటనే ఎమ్మెల్యే పరిస్ధితులను చక్కదిద్దుకుంటేనే రాజకీయ భవిష్యత్తు వుంటుందని ప్రేమ్‌సాగర్‌రావు శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

ఆశపడే…మళ్లా గోసపడే!

-మంది మాటలు నమ్మితె..ఎనుకటి కాలం ముందటికొచ్చే!

-రైతు బంధు కేసిఆర్‌ ఇంట్లకేలి ఇస్తుండా అంటే నమ్మితిరి!

-పదికి ఐదు కలిపి ఇస్తామంటే గంతేస్తిరి

-కాళేశ్వరం కేసిఆర్‌ జేబుల పైసలా అంటే జేజేలు కొడితిరి

-యాభై ఏండ్లలో నీళ్లియ్యనోళ్లను నమ్మితిరి
అబద్దాలు చెప్పీ, చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు నమ్మించి, వంచించారు. సంతోషంగా కేసిఆర్‌ పాలనలో కడుపు చల్లగా బతుకిన, రైతుల నోట్లో కాంగ్రెస్‌ పాలకులు మట్టికొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటు ఇయ్యలేరు. ఎరువులియ్యలేరు. వడ్లు కొనలేరు. రైతును బతకనీయరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలదని, అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ ప్రజలు, రైతులు ఇంక జన్మల కాంగ్రెస్‌ ను నమ్మరు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రజల్లోకి రావాలంటే సిగ్గు పడుతున్నరు. భయపడుతున్నరు. అంటున్న మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్లా ధర్మారెడ్డి, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు’’ తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…

-పదేళ్లలో అరవై ఏళ్ల గోస తీర్చినా కేసిఆర్‌ ను ఒద్దనుకుంటిరి

-ఆరునెలలల్ల ఇరవై నాలుగు గంటల కరంటిచ్చిడు గొప్పేనా అంటే ఓట్లేస్తిరి

-అవద్దాలు చెప్పినోళ్ల మాటింటిరి

-కండ్ల ముందుకు కష్టం రాకుంట సూశిన కేసిఆర్‌ ను దింపితిరి

-కోరికోరి కొరివితో తలగోక్కుంటిరి

-ఎండిపోయిన బావుల్ల నీళ్లొచ్చినా మర్చిపోతిరి

-బతకపోయి, మళ్లోచ్చి బతుకు బంగారమైనా నియ్యత్‌ తప్పితిరి

-మోసం చేసినోళ్లనే నమ్మితిరి..నరకం సూడవడితిరి

-తీరిన గోస తిరిగొచ్చే..

-ఎరువు కరువు మళ్లోచ్చే…

-చెప్పుల లైన్లు మళ్ల కనిపించే..

-బస్తా కోసం కొట్టుకోవాల్సి రావట్టే..

-ఎరువు లేక పంట ఏడ్వవట్టే..

-పంట చేతికెలా వస్తుందని రైతు కంటతడిపెట్టే

-కాలమైనా నీళ్లు లేవాయే..

-కాళేశ్వరం నీళ్లు ఉత్తగ పోవట్టే

-నమ్మితే బతుకులు ఆగంకావట్టే!

అబద్దాలు చెప్పి చెప్పి ప్రజలను కాంగ్రెస్‌ నాయకులు నమ్మించి వంచించారు. సంతోషంగా కేసిఆర్‌ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్లో కాంగ్రెస్‌ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్లియ్యలేరు. కరంటియ్యలేరు. ఎరువులియ్యలేరు. పూర్తి స్ధాయిలో వడ్లు కొనలేరు. రైతును బతకనీయలేరు. యాభై ఏండ్లు పుచ్చుకున్న గోస చాలలేదని తెలంగాణ ప్రజలను నమ్మించి, అలవి కాని హమీలిచ్చి, ఒక్క అవకాశమివ్వండని కోరి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలను రాచి రంపాన పెడుతున్నారు. పాలన చేతగా రైతులను అరి గోసకు గురి చేస్తున్నారు. కనీసం ఎరువులు కూడా సకాలంలో సరఫరా చేసేదిక్కులేదు. మరో వైపు అన్ని వర్గాలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇంక జన్మలో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి రావాలంటే కూడా జంకుతున్నారు. భయపడుతున్నారు. ప్రజలకు ముఖం చూపడం లేదు. పల్లెల్లోకి వస్తే ప్రజలే కాంగ్రెస్‌ నాయకులను తన్ని తరమిస్తారని భయపడుతున్నారంటునన్న మాజీ ఎమ్మెల్యే , బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్లా దర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే….
చరిత్రలో ప్రజలను మోసూం చేసిన పాలకులు వున్నారు. ప్రభుత్వాలున్నాయి. ప్రజలకు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిన పాలకులున్నారు. ఇచ్చిన హమీలను కనీసం గుర్తు చేయలేకుండా పాలించిన వారున్నారు. ఏం హమీలిచ్చారో కూడా తెలియని పాలకులున్నారు. ప్రజలను మోసం చేసిన, అదికారం కోసం అలవి కాని హమీలు ఇచ్చిన పాలకులను చూస్తున్నాం. కాని ప్రజలు ఒక నాయకుడిని మోసం చేసిన సందర్భం కూడా తెలంగాణలో చూశాం. అరవై సంవత్సరాలుగా ప్రజలు అనుభవిస్తున్న గోసను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం సాధన తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి లేదని జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్‌. పద్నాలుగు సంవత్సరాల పాటు సుధీర్ఘమైన అలుపెరగని పోరాటం చేసి, కేందర్ర మెడలు వంచి తెలంగాణను సాధించిన ధీరుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ది చేసుకోవాలో కూడా ఉద్యమ కాలం నాడే బ్లూ ప్రింట్‌ తయారు చేసిన ఉద్యమ కారుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో రూపొంచిందించిన బ్లూ ప్రింట్‌ను పదేళ్ల కాలంలో అమలు చేసి బంగారుతెలంగాణను తయారు చేసిన పాలకుడు కేసిఆర్‌. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక రాష్ట్రాన్ని ఇంత వేగంగా అభివృద్ది చేసిన పాలకుడు ప్రపంచంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా వున్న తెలంగాణను బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఎస్‌ఆర్‌సీ స్టేట్‌ రీ ఆర్గనైజేషన్‌ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. తెలుగు మాట్లాడే ప్రాంతమంతా కలుపుతున్నామని చెప్పి, బాష ఒకటైనా యాసలో, వేషదారణలో, సంస్కృతీ సంప్రదాయాలలో ఏ మాత్రం సంబంధం లేని రెండు ప్రాంతాలను కలిపి 1956లో కాంగ్రెస్‌ పార్టీ దిద్దుకోలేని తప్పు చేసింది. తెలంగాణ పాలిట మరణ శాసనం రాసింది. అలా 1956లో మొదలైన గోస తెలంగాణ ప్రజలు 2014 వరకు అనుభవించారు. అరిగోస పడ్డారు. ఆకలికి ఏడ్చారు. బతుకు దెరువుకు ఏడ్చారు. ఆత్మగౌరవం కోసం తపించారు. ఆత్మాభిమానం లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులుగా బతికారు. బతకలేక వలసలు పోయారు. వున్న ఊరును,కన్నతల్లిని వదిలి పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. ఇలా బతుదెరువు కోసం వలసలు వెళ్లారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. అభివృద్దిని అలక్ష్యం చేశారు. తెలంగాణ ప్రగతిని పక్కన పెట్టారు. తెలంగాణ అంటేనే ఉమ్మడి పాలకులు మండిపడ్డారు. తెలంగాణకు సాగు నీరివ్వలేదు. సరిగ్గా కరంటు ఇవ్వలేదు. సాగుకు ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. రైతులు బోర్లు వేసుకునేందుకు అవకాశమివ్వలేదు. వాల్టా చట్టం తెచ్చి రైతులపై కేసులు నమోదు చేశారు. జైలు పాలు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని ఎంత హింసించాలో అంత హింసించారు. మొత్తంగా తెలంగాణలో సాగు లేకుండా చేశారు. సాగు పడావు పడేలా చేశారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్నారు. పాలించడం చేత కదన్నారు. నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఉమ్మడి పాలకుల చెప్పినట్లు వినే ఉత్సవిగ్రహాలు మార్చారు. తెలంగాణ అంటే వెనుబడిన ప్రాంతంగా మార్చారు. చెరువులు ద్వంసం చేశారు. ప్రాజెక్టులు కట్టలేదు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. నల్లగొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్‌ మహమ్మారి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చూశారు. చిన్న వయసులోనే ప్రాణాలు పోతుంటే కనికరం చూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని చేశారు. అలాంటి తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన సాధించిన పోరాట యేధుడు కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణలో బతుకు విలువ పెంచారు. తెలంగాణ బతుకు దేశానికే ఆదర్శం చేశారు. ఏ తెలంగాణలో అయితే తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎగతాళి చేశారో అదే తెలంగాణలో బంగారు పంటలు పండేలా చేశారు. బంగారు తెలంగాణ తయారు చేశారు. సాగు, తాగు నీటి సమస్య తీర్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని సాగు అద్భుతాలు సృష్టించారు. కాళేశ్వరం లాంటి గొప్ప సాగునీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఐదేళ్లలో చింతలు లేని తెలంగాణ తయారు చేశారు. పదేళ్లలో బంగారు తెలంగాణ తయారుచేశారు. ఒకప్పుడు మెతుకు కోసం ఆరాటపడిన తెలంగాణను దేశానికి అన్న పూర్ణను చేశారు. చుక్క చుక్క ఒడిసిపట్టి తెలంగాణకు మళ్లించాడు. ఎండిన వాగులు పారించారు. ఎండా కాలంలో చెరువులు మత్తలు దుంకించాడు. ఎండిపోయిన బావును మళ్లీ కళకళలాడేలా చేశారు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూశారు. ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్ట రాక్షస పాలన చూశారు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ బంగారు పాలన చూశారు. ఒకప్పుడు చీకటి బతుకులు చూసిన తెలంగాణకు వెలుగులు తెచ్చిన కేసిఆర్‌ పాలన చూశారు. ఎకరాల కొద్ది భూములున్నా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన రైతులున్నారు. ఆటోలు నడుపుకున్నారు. హోటళ్లలో సర్వర్లుగా పనిచేశారు. ఏ చేతితో బంగారు పంటలు పండిరచారో అదే చేతితో, రాళ్లు కొట్టారు. ఎంగిలి ప్లేట్లు కడిగారు. ఇలా తెలంగాణ రైతులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ మరిపించిన కేసిఆర్‌ పాలన చూశారు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకునేలా రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు. పండిన పంటలను కల్లం నుంచే నేరుగా కొనుగోలు చేశారు. రెండు మూడు రోజుల్లో రైతుల అక్కౌంట్లలో డబ్బులు పడేలా చేశారు. ఇన్ని చేసిన కేసిఆర్‌ను కాదుకొని కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించుకున్నారు. కేసిఆర్‌ పాలనలో చీకు చింత లేని జీవితాలు అనుభవించారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని మళ్లీ చింతలు కొని తెచ్చుకున్నారు. విద్య, వైద్యం లేకుండా చేశారు. ఏ ప్రజలు పాలించమని నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలనే ఇబ్బందుల పాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా అలవాటే. కేసిఆర్‌ రైతు బంధు ఇస్తే ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? మేం అదికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఏమైంది? ఆనాడు కేసిఆర్‌ చెప్పినట్లే రైతు బంధుకు రాం..రాం అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల మేలు కోరి కేసిఆర్‌ ఎన్నో సార్లు చెప్పారు. నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్‌ వస్తే కష్టాలు వస్తాయన్నారు. కరంటు కటకట మొదలౌతుందని కేసిఆర్‌ చెప్పి చూశారు. కాని కాంగ్రెస్‌ మాటలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే ఆగం చేస్తుందని కేసిఆర్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినలేదు. అలా ప్రజలను మాయ చేసిన కాంగ్రెస్‌ నాయకులు అధికారం తప్ప ప్రజా సేవను గాలికి వదిలేశారు. కాంగ్రెస్‌ పాలన అంటేనే రాక్షస రాజ్యమని మరోసారి తేలిపోయింది. తెలంగాణ అంతా మళ్లీ కేసిఆర్‌ జపం మొదలైంది. సారే రావాలని కోరుకుంటున్నారు. ఇక వచ్చేదంతా బిఆర్‌ఎస్‌ కాలమే. తెలంగాణ రైతులకు పండుగ రోజులు మళ్లీ కేసిఆర్‌ పాలనలోనే..

కృష్ణార్జునులు ధన్యులు.

అవ్వల మురిపెం..చూసిన కళ్లకు సంబురం!

`ఒకే దగ్గర కృష్ణార్జునులను చూసి అవ్వల సంతోషం.

`మహిళల మద్దతు మరింత చిగురింతకు అవ్వలిచ్చిన చిరునవ్వుల వరం.

`గులాబీ దళానికి వున్న బలానికి ఈ సన్నివేశం నిదర్శనం.

`కేటీఆర్‌, హరీష్‌ లను చూడగానే చుట్టుముట్టిన అవ్వలు.

`కృష్ణార్జునులకు ఒకే శాలువలో సత్కారం.

`కేటీఆర్‌ ను దగ్గర తీసుకొని అవ్వలు పంచుకున్న ఆత్మీయతకు సాక్ష్యం.

`కృష్ణార్జునులను చూసిన ఆనందంలో అవ్వలు విరబూయించిన చిరునవ్వుల వనం.

`నాయకుల పట్ల ప్రజల్లో వున్న నమ్మకానికి సంకేతం.

`ప్రజల్లో ఎంతగా మమేకౌమౌతున్నారో చెప్పడానికి ఒక సందర్భం.

`కేసీఆర్‌ అంటే వున్న అభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం.

`ఆ అభిమానం ఇద్దరు నేతల మీద కురిపిస్తున్న మహిళా లోకం.

`ఇలాంటి ప్రేమ నాయకులందరికీ సాధ్యం కాదు.

`ప్రజల్లో వున్న అంత గొప్ప ప్రేమను దూరం చేసుకోవద్దు.

`అరమరికలు లేకుండా కృష్ణార్జునులు కలిసి సాగాలని అవ్వలు ఇచ్చిన దీవెనలు.

`భవిష్యత్తు బీఆర్‌ఎస్‌ దే అని స్పష్టతనిచ్చిన అవ్వల అనురాగాలు.

`అందుకున్న ఇద్దరు కృష్ణార్జునులకు అవే ఆశీస్సులు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
మన నిత్య జీవితంలో కొన్ని సన్ని వేషాలు, సందర్భాలు ఎదురౌతుంటాయి. అవి కొన్ని సార్లు అబ్బురపరుస్తుంటాయి. ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆనందాన్ని నింపుతాయి. సంతోషాన్ని అందిస్తాయి. అవి మనకే తారస పడనక్కర్లేదు. ఎదుటి వారికి జరుగుతున్నా మనం కూడా సంతోషిస్తుంటాం. ఆ క్షణం మనం కూడా కొంత ఆనందానికి లోనౌతుంటాం. అవి అనుభవించేవారికి ఎలా వుంటుంది? ఆ ఆనందానికి అవధులు వుండవు. అందుకు ఒక్క చిరునవ్వు చాలు. అక్కడ వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారుతుంది. వారి జీవితంలోనే కాదు, చూసే వారి జీవితంలో కూడా ఒక గొప్ప అనుభూతి జీవితాంతం మిగిలిపోతుంది. మనసు పులకరించిపోతుంది. ఇలాంటి సందర్భాలు కొందరి జీవితాల్లో పదే పదే వస్తుంటాయి. కొందరి జీవితాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అలా ఎప్పుడూ ఎదురయ్యే సన్నివేషాలలో పాత్రదారులైన వాళ్లు ఎంత అదృష్టవంతులో అని అనిపించక మానదు. అలాంటి అదృష్టాన్ని పదే పదే అందుకునే నాయకులు తెలంగాణలో ఇద్దరే ఇద్దరు వున్నారు. వాళ్లే కృష్ణార్జునులుగా పిలువబడే కేటిఆర్‌, హరీష్‌రావు. సహజంగా ప్రజలంటే మాకు ఎంతో ఇష్టమని ప్రతి నాయకుడు చెప్పేదే. కాని ఆ నాయకుడంటే మాకు ఎంతో ఇష్టమని ప్రజల చేత చెప్పించుకోవడం అంటే వారి మనసు ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఊరు, వాడ, ప్రాంతం, జిల్లా అని తేడా ఎక్కడ లేకుండా ఎక్కడికెళ్లితే అక్కడ ఆ నాయకుల పట్ల ప్రజలు ప్రేమ ఆదరణ చూపిస్తుంటే చూసే వాళ్లకు కూడా ఎంతో సంతోషంగా వుంటుంది. రాజకీయ ప్రత్యర్ధులకు సైతం ప్రజల నుంచి ఇలాంటి ప్రేమాభిమానాలు కేటిఆర్‌, హరీష్‌లకు దక్కడాన్ని చూసి సంతోషపడతారని చెప్పాలి. పైకి ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా, ప్రత్యర్దులుగా ఎన్ని ఆరోపణలు గుప్పించుకున్నా నాయకులుగా ప్రజల్లో చెరగని ప్రేమను సొంతం చేసుకున్న నాయకులంటే తోటి నాయకులెవరైనా సరే ఆనందపడతారు. కేటిఆర్‌, హరీష్‌లకు ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి ఇలాంటి సన్నివేషాలు తరుచూ జరుగుతూనే వుంటాయి. వారిని చూడగానే పల్లె అయినా, పట్నమైనా సరే ప్రజలు వారి వద్దకు చేరుకుంటారు. ఈ ఇద్దరు బాగున్నారా? అని ఆ ప్రజలను అడగకముందే బాగున్నారా! అయ్యా అంటూ అవ్వలు మూగిపోతారు. కేటిఆర్‌, హరీష్‌రావుల వద్దకు చేరుకుంటారు. వారిని చూసి ఏదో నాయకులు వచ్చారన్న భావన వారిలో వుండదు. తమ పిల్లలు వచ్చినంత సంతోషంగా ఈ ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వెళ్లగానే బావిస్తారు. వారి వద్దకు చేరుకుంటారు. నవ్వుతూ, ముసిముసి నవ్వులు కురిపిస్తుంటారు. అలాంటిదే తాజాగా మరో సన్నివేషం జరిగింది. మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కేటిఆర్‌ వెళ్లారు. సహజంగా ఈ ఇద్దరు పార్టీ కార్యాక్రమాలు, పార్టీ వేదికలు, రాజకీయ సభల్లో నిత్యం కలుసుకుంటూనే వుంటుంటారు. నిత్యం ఫోన్‌లలో సంబాషించుకుంటూనే వుంటారు. ప్రత్యేకంగా ఒకరి ఇంటికి ఒకరు వెల్లడం అనేది సహజంగా కనిపించదు. ఈ మధ్య హరీష్‌రావు ఇంటికి కేటిఆర్‌ వెళ్లారు. ఆ విషయం తెలిసిన చుట్టుపక్కల అమ్మలకు, అక్కలకు, అవ్వలకు తెలిసింది. ఇద్దరు నాయకులు ఇంటి నుంచి బైటకు వెళ్లిపోయే ముందు ఆ అవ్వలంతా ఇద్దరిని చుట్టుముట్టారు. కేటిఆర్‌, హరీష్‌లను పేరు పేరునా పలకరించారు. కేటిఆర్‌ను చూడగానే మరింత అమితానందం పొందారు. ఎందుకంటే హరీష్‌రావు ఎప్పుడూ కనిపిస్తూనే వుంటారు. అక్కడికి వచ్చిన కేటిఆర్‌తో కలిసి హరీష్‌ను చూసే సరికి కృష్ణార్జులను ఒకే సారి ప్రత్యక్ష్యంగా చూడడంతో అక్కడ అవ్వలు సంతోషం వ్యక్తంచేశారు. కేటిఆర్‌కు కరచాలనం చేశారు. కేటిఆర్‌ను పట్టుకొని యోగక్షేమాలు అడిగారు. కేసిఆర్‌ ఆరోగ్యం ఎలా వుందని ఆరాతీశారు. అమ్మ ఎలా వుందని ప్రశ్నించారు. ఓ అవ్వ ఏకంగా కేటిఆర్‌ కడుపులో తల పెట్టి కేటిఆర్‌పై వున్న మమకారాన్ని చూపించింది. గదవ పట్టుకొని కేటిఆర్‌ను చిన్నపిల్లాడిలా ముద్దు చేసింది. ఆ నాయకుల పట్ల ప్రజలకు వున్న అభిమానానికి ఇవి సంకేతం. సహజంగా నాయకులు ఎదురు పడితే, ప్రజలు తమ సమస్యలు చెబుతారు. తమ సమస్యలు వివరిస్తారు. లేదా ప్రశ్నిస్తారు. వారి పాలనపై తమ అభిప్రాయాలను చెబుతారు. కాని ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించలేదు. ఆ నాయకులను చూసిన ఆనందం చాలు అనుకున్నట్లు అవ్వలు మురిసిపోయారు. ఇలా ఇద్దరు నాయకుల పట్ల తెలంగాణ అక్కలు, అమ్మలు,చెల్లెండ్లు, అవ్వలు చూపించే ప్రేమలు మరే ఇతర నాయకులు దక్కినట్లు కూడా కనిపించవు. అవి కూడా బిఆర్‌ఎస్‌ నేతలకు మాత్రమే ఎదురౌతుంటాయి. బిఆర్‌ఎస్‌ అదికారంలోవున్నప్పుడు కేటిఆర్‌ మహబూబ్‌ నగర్‌ జిల్లా పర్యటను వెళ్లారు. అక్కడ ఓ అరుగు మీద అవ్వలు కూర్చుకున్నారు. ఆ సమయంలో కేటిఆర్‌, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌లు పాదయాత్ర చేశారు. సరిగ్గా అవ్వలు కూర్చున్న చోటుకు కేటిఆర్‌ రాగానే ఎంతో మురిసిపోయారు. అయ్యా..అని పిలిచారు. దాంతో కేటిఆర్‌ వాళ్ల వద్దకు వెళ్లారు. వారితో కూర్చొని మాట్లాడారు. ఆ సమయంలో కేటిఆర్‌తోపాటు , అవ్వల మధ్య సంబాషణల్లో నవ్వులు విరబూశాయి. అంటే బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడైనా, ఇప్పుడైనా ఈ నాయకుల పట్ల ప్రజల్లో ఒకటే భావన వుంది. ఇప్పుడంటే ప్రతిపక్షంలో వున్నారు. ఇప్పుడు సమస్యలు లేవనెత్తినా ఉపయోగం లేదు. కాని అధికారంలో వున్నప్పుడు సహజంగా నాయకులు తారసపడితే ఏదో సమస్యలు చెబుతారు. కాని అప్పుడు కూడా నీ కడుపు సల్లగుండ. అని అవ్వలు దీవించారే గాని, మాకు ఈ సమస్యలున్నాయని చెప్పలేదు. కేటిఆర్‌ దేవుడు. మాకు పించన్‌ ఇస్తున్నడు. అని దీవించారు. ఇంతకన్నా నాయకులు ఏం కోరుకుంటారు. ఇలాగే హరీష్‌రావు ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు గుమిగూడుతారు. ఆయనను తమ సొంత కొడుకులా పలకరిస్తారు. ప్రజలను హరీష్‌రావు ఎలా వున్నాడని అడకముందే సారు..బాగున్నర అని ఎదురొస్తారు. ఏమైన సమస్యలున్నాయా? అంటే మీరున్నంక మాకేం బాధ సారూ..అంటారే గాని, ఇది రాలేదు..అది రాలేదని చెప్పడం జరిగేది కాదు. ఇప్పుడు సాదారణ ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లినా అదే ప్రేమ , ఆదరణ ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు కూడా మీరున్నంక మాకేంత తక్కువ అనేలాంటి పదాలే వాడుతారు. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్ధితులను హరీష్‌కు వివరిస్తుంటారు. అందుకే హరీష్‌ ఏ ఊరికి వెళ్లినా ఓ అరుగు మీద కూర్చుంటారు. అందరూ అక్కడకు చేరుకుంటారు. అవ్వలంతా ఆయన చుట్టుముట్టి హరీష్‌నే యోగ క్షేమాలు తెలుసుకుంటారు. ఇలా బిఆర్‌ఎస్‌లో మరి కొంత మంది కూడా వున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా ఇలాంటి సన్నివేషాలు చూస్తుంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన చుట్టూ చేరుతారు. పిల్లాజెల్లా అందరూ ఆయననుఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. నాయకుడు వచ్చాడన్న భయం వారిలో కనిపించదు. ఇక ఇటీవల కాలంలో ఎర్రబెల్లి తన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆయనను చుట్టుముట్టి ఎరువులు రావడం లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని,నీళ్లు రావడం లేదని చెప్పే సందర్భాలు మీడియాలో చూస్తూనే వున్నాం.
మిమ్మల్ని ఓడిరచి తప్పుచేశినం అంటూ ఒక నాయకుడి వద్దకు వచ్చి ప్రజలు పొరపాటును వెళ్లడిరచడం కూడా చాలా అరుదు. అంతే కాదు నాయకుడి వద్ద ఎంత చనువు లేకపోతే ఓటు ఈసారి అటే ఏసిన అని చెప్పి, నాయకుడిని నవ్వించడం కూడా ఎక్కడ చూసి వుండరు. కాని ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రజలు నేను ఓటు వేయలేదని చెప్పిన చిరునవ్వుతో వారితో కలిసిపోవడం అనేది అందరి వల్ల కాదు. తనకు ఓటు వేయలేదని ప్రజల మీద కోపం చూపించే నాయకులే వుంటారు. కాని వేయలేదని చెప్పే చనువు, నాకు తెలుసని నవ్వుతూ వారితో కలిసిపోయే నాయకులు వుండడం కూడా తెలంగాణ నాయకులు గొప్పదనం అని కూడా చెప్పాలి. ఇలా ప్రజాదరణ లభించడం అనేది వారి నిబద్దతకు, ప్రజా సేవకు నిదర్శనమని చెప్పడంలో సందేహం లేదు.

పిల్లల పాలిట పాపిష్టిజ్యోతి! ఇదేం చదువు చెప్పే రీతి.

-వీపు అంతా వాతలు! కమిలిపోయేలా దెబ్బలు!!

-రాచిరంపాన పెడుతున్న పరంజ్యోతి.

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-మాటలు రాని విద్యార్థిని చితకబాదిన టీచర్‌.

-ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లాడు

-యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది!

oasis school warangal incident

-దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు?

-భారతీయత అనే వాట్సాప్‌ గ్రూప్‌ లో పిల్లల దెబ్బల ఫోటోలు వైరల్‌.

-ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వాక్యాలు?

-మూగ విద్యార్థి మీద టీచర్‌ ప్రతాపం.

oasis school warangal incident

-పాఠాలు చెబుతున్నారా! కోపాలు తీర్చుకుంటున్నారా!

-మీకు పిల్లలు లేరా! వారిని ఇలాగే కొడతారా!!

-పసివాడన్న కనికరం లేని టీచర్లు.

-ఎంత కొట్టినా ఏడ్వలేడు పిల్లాడు 

-చేతులెలా వచ్చాయో టీచర్‌ కు..

-వరంగల్‌ ఒయాసిస్‌ స్కూల్‌ టీచర్‌ నిర్వాకం.

-టీచర్‌ కొడుతున్నా అరవలేడు.

-ఏడ్చినా కన్నీళ్లు తప్ప మాటలు రావు.

-అలాంటి విద్యార్థిని కొట్టేందుకు టీచర్‌కు చేతులెలా వచ్చాయి.

-మాటలు రాని విద్యార్థి మీద కనికరం లేకుండా దెబ్బలు.

-యూకేజీ విద్యార్థిపై ఇంత దాష్టికమా?

-విద్యార్థికి మాటలు రాకపోవడం నేరమా

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-తల్లిదండ్రులను పిలిచి బుజ్జగింపులు.

-తల్లిదండ్రులతో పరంజ్యోతి బేరసారాలు.

-ఫీజులో రాయితీ కల్పిస్తామని తల్లిదండ్రులను వేడుకలు.

-ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని స్కూల్‌ ను మూసేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌.

-విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు.

-చైల్డ్‌ వెల్పేర్‌ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                     

అతను యూకేజీ చదువుతున్న పసివాడు. రోజూ స్కూలుకు వెళ్లినట్లే వెళ్లి ఇంటికి వచ్చాడు. తల్లి స్కూల్‌ యూనిఫామ్‌ మార్చేందుకు అబ్బాయి షర్టు విప్పింది. అంతే ఆ అబ్బాయిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది. గుండెలు పిండేలా ఆ తల్లికి ఏడుపు వచ్చింది. ఆ అబ్బాయి వీపంతా తడిమి చూసింది. ఆ తల్లి చేయి వీపు మీద పడగానే ఆ పసివాడు విలవిలలాడిపోయాడు. ముట్టుకుంటేనే జంకుతున్నాడు. వీపంతా ఎర్రగా మారిపోయింది. రక్తం కనిపించేలా వీపు మీద వాతలు తేలాయి. ఏం జరిగిందో చెప్పడానికి ఆ పసివాడికి మాటలు రావు. సహజంగా చిన్న పిల్లలకు మాటలు రాకపోవడం వేరు. కాని ఆ అబ్బాయికి పుట్టుకతోనే మాటలు రావు. కాని ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడు చదువుకోవాలని ఆశించారు. అది కూడా ఎంత ఖర్చయినా సరే మంచి ప్రైవేటు స్కూలుకు పంపాలని అనుకున్నారు. ఫీజులు చెల్లిస్తున్నారు. మాటలు రాకపోయినా, మన మాటలు వింటాడు. మనం ఏం చెబుతాడో అర్ధం చేసుకోగలడు. అందువల్ల స్కూలుకు పంపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని స్కూలు నుంచి ఇంటికి విచ్చన ఆ పసివాడి వీపు నిండా వాతలే వున్నాయి. అది కూడా వీపంతా కమిలిపోయేలా దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆ తల్లి తట్టుకోలేక ఏమైంది నాన్నా, అని అడిగినా ఏదీ చెప్పలేని మూగ జీవితం ఆ పసివాడిది. కనీసం టీచర్‌ కొట్టాడని చెప్పలేడు. టీచర్‌ కొడుతుంటే ఏడ్వలేడు. తన భాధను కన్నీటి రూపంలో తప్ప మరో రకంగా చెప్పలేడు. అందులోనూ టీచర్‌ కర్కషంగా కొట్టినా ఆ పసివాడు వద్దని వారించే వయసు కాదు. కొట్టకండి సార్‌ అనేందుకు నోరు లేదు. ఎదురుతిరిగే వయసు అసలే కాదు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్చించలేడు. కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం, బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు. అలాంటి పసివాడిని కసి తీరా కొట్టిన ఆ టీచర్‌ ఎవరో గాని అతను కర్కోటకుడా? లేక రాక్షసుడా? ఒక పసివాన్ని ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? అసలే మూడు నాలుగేళ్ల పిల్లవాడు. మాటలు రాని మూగ వాడు. అలాంటి పిల్లాన్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్‌కు వుండాలి. అంతే కాని ఆ పిల్లాడిని కసి తీరా కొట్టేంత దుర్మార్గుడు టీచర్‌ గా పనిచేయడానికి అనర్హుడు. శిక్షార్హుడు. అలా పిసి పిల్లవాడిని కొట్టిన టీచర్‌ను నిజంగానే చెట్టుకు కట్టేసి కొట్టితా తప్పులేదు. ఆ టీచర్‌ మిడిమిగి జ్ఞానం వున్నవాడైనా కావాలి. లేకుంటే ఆ స్కూల్‌ యాజమాన్యానిది వింత పోకడైనా కావాలి. ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు. కాని ఇలా ఒళ్లు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు. అసలు కొట్టిన వాడికి పిల్లలున్నారా? లేరా? ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా? ఆరా తీయాలి. ఎందుకంటే బిఈడీ, టిటిసి ట్రైనింగ్‌ చీసుకునే చాత్రోపాద్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది. చైల్డ్‌ సైకాలజీ చదువుకోవాలి. పిల్లల మనస్తత్వాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల అందిరి మనస్తత్వం ఒక్కలా వుండదు. పిల్లలందిరకీ ఒకే రకమైన ఆలోచనలు వుండవు. కొంత మంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు. మరి కొంత మంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు. కొంత మంది ఎప్పుడూ ఆటల మీదనే దృష్టిపెడుతుంటారు. మరి కొంత మంది విద్యార్ధులకు ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. ఇలా ఒక్కొ విద్యార్ధికి ఒక్కొ రకమైన జ్ఞానం సొంతంగా వుంటుంది. వాటిని గమనించి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠాలు చెప్పడమే చైల్డ్‌ సైకాలజీ. ఇలా పిల్లాడిని వీపుంతా కమిలిపోయేలా కొట్టిన వాడి చదువు సంధ్యలేమిటో తెలుసుకోవాలి. పిల్లల్లో అల్లరి చేసేవాళ్లు కొంత మంది వుంటారు. అయితే యూకేజీ చదువుకునే పిల్లల అల్లరి ఆనందంగానే వుంటుంది. అలాంటి విద్యార్ధుల అల్లరిని చూసి కోపం తెచ్చుకునేవాడు టీచర్‌గానే పనికిరాడు. అందులో నోటి నుంచి మాట రాని ఓ మూగ పిల్లవాడు చెసే అల్లరి ఏముంటుంది? అలాంటి పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఇష్టపడరు. ఎంత సేపు తోటి పిల్లలను గమనిస్తూ వుంటారు. అంతే తప్ప వాళ్లు ఇతర పిల్లలతో పోట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. అందరి వైపు ఒక రకమైన చూపులతో చూస్తూ మిగతా వారు గలగల మాట్లాడుతుంటే, నేనేందుకు మాట్లాడడం లేదన్న భావన తన మనసు ఆ పసి హృదయాన్ని ప్రశ్నిస్తూనే వుంటుంది. అలాంటి పిల్లాడిని కొట్టిన స్కూల్‌ యాజమాన్యంలో కనీసం పశ్చాత్తాపం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు కూడా యాజమాన్యానికి ఇష్టం లేదు. ఏ మీడియా నన్ను ఏమీ చేయలేదంటూ ఏం జరిగిందని ప్రశ్నించిన మీడియాతో యజమాని పరంజ్యోతి చిర్రుబుర్రులాడడం వింతగా వుంది. విచిత్రంగా వుంది. తాజాగా ఆ పిసివాడిని కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలు పెద్దఎత్తున భారతీయత అనే వాట్సాప్‌ ద్వారా పెద్దఎత్తున వైరల్‌ అవుతున్నాయి. వరంగల్‌ జిల్లా మొత్తం పాకిపోయింది. అది గమనించిన ఒయాసిస్‌ స్కూల్‌ యజమాని ఆ పసివాడి తల్లిదండ్రులను పిలిపించుకొని బేర సారాలకు దిగినట్లు కూడ సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని తల్లిదండ్రులను కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. తమ పిల్లాడి ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ స్కూల్‌ మేనేజ్‌ మెంటు ఆ తల్లిదండ్రులకు ఆశలు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దఎత్తున సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతుండడంతో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే వారిని పరంజ్యోతి బెదిరిస్తున్నారు. నా వెనుక పెద్ద పెద్ద నాయకులున్నారంటూ చెబుతున్నట్లు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఈ విషయం కొంత మంది పోలీసు అదికారుల దృష్టికి వచ్చింది. ఏ జరిగింది? మీ స్కూలు బస్సులు ఇలా రోడ్డు మీద వుంటే ఎలా? అని ఆ పోలీసులు అదికారులు ప్రశ్నిస్తే మీపై ఆఫీసర్‌కు ఏం కంప్లయింట్‌ చేస్తావో చేసుకో అని వారిని కూడా పరంజ్యోతి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా స్కూల్‌లో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రశ్నించిన వారిని బెదిరించే స్దాయికి విద్యా సంస్ధలు ఎదగడం అనేది వ్యవస్దకే నష్టం. అందువల్ల విద్యా శాఖ జరిగిన సంఘటనపై వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. విద్యార్ధిని అంతలా చితకబాదినా డిఈవో, ఎంఈవోలు ఇంత వరకు స్పందించలేదు. ఆ స్కూల్‌లో ఏం జరిగిందన్నదానిపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. ఇప్పుడు జరిగింది చిన్న సంఘటన కాదు. పసివాడిని వీపులో పిడికిలితో టీచర్‌ గుద్దితే ఆ పిల్లోడి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యులు? అదృష్టం బాగుండి పిల్లవాడుచేయని తప్పుకు శిక్షను అనుభవించాడు. అదే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు పరిస్దితి ఏమిటి? ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా వుంది. అంత జరిగితే ఆ విషయాన్ని బైట పెట్టకపోవడం కూడా తప్పే. ఇవాళ ఈ అబ్బాయికి జరిగింది. మరోసారి మరో అబ్బాయికి జరగదన్న గ్యారెంటీ ఏముంది? ఈ తల్లిదండ్రులను బెదిరించినట్లే ఇతర తల్లిదండ్రులను కూడా స్కూల్‌ యాజమాన్యం బెదిరిస్తుంది. భయపెడుతుంది. కనీసం మాటలు రాని పిల్లాడిని ఎలా కొట్టారని ప్రశ్నించే ధైర్యం తల్లిదండ్రులకు లేదా? ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెబితే అంగీకరిస్తారా? మీ పిల్లాడి ప్రాణాలకన్నా, చదువు ఎక్కువకాదు. ఆ స్కూల్‌ ఫీజు రాయితీ అంతకన్నా పెద్దది కాదు. ఇప్పటికైనా ప్రైవేటుస్కూళ్లలో చదువుకునే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వారి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు? తమ పిల్లలను టీచర్లు ఎలా ట్రీట్‌ చేస్తున్నారన్నది కూడా తెలుసుకుంటుండాలి. లేకుంటే స్కూళ్ల యజమాన్యాల వేషాలు మితిమీరిపోతుంటాయి. విద్యా శాఖతోపాటు, చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ వెంటనే స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యార్ధిని కొట్టిన టీచర్‌ను, ఆ స్కూల్‌ యజమాని పరంజ్యోతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే కట్టడి చేయకపోతే మిగతా స్కూళ్లు కూడా ఇలాగే తయారౌతాయి.

ప్రగతిలో ఖమ్మం ఫస్ట్‌..మంత్రులలో పొంగులేటి బెస్ట్‌!

-పొంగులేటి శీనన్నే నా కుడి భుజం

-శీనన్నే నాకు కొండంత బలమని చెప్పిన సిఎం

-మంత్రిత్వ శాఖల నిర్వహణలో శీనన్నే టాప్‌ అని చెప్పిన సిఎం

-పదేళ్ల బిఆర్‌ఎస్‌లో ఆగిపోయిన అభివృద్ధి

-ఖమ్మం అభివృద్ధి పరుగులో పొంగులేటి చిత్తశుద్ధి

-ప్రజలకిచ్చిన మాట కోసం పొంగులేటి కృషి

-తెలంగాణ వచ్చినా నిన్నటి దాక అభివృద్ధికి ఖమ్మం ఆమడ దూరం

-ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం అందుకుంటున్న మొదటి స్థానం

-చికచక సాగునీటి ప్రాజెక్టులు

-ఊరూర ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు

-వాడ వాడలా సాగుతున్న అభివృద్ధి పనులు

-అవినీతి రహిత పాలనలో దేశానికే ఆదర్శం

-రెవెన్యూ సంస్కరణల్లో భూ భారతి ఒక విప్లవం

-రిజిస్ట్రేషన్‌ శాఖలో అనూహ్యమైన మార్పులు

-పేదలకు మెరుగైన సేవలకు రిజిస్ట్రేషన్‌ శాఖలు నిలయాలు

-ఖమ్మం అభివృద్ధికి మంత్రి పొంగులేటి పట్టుదల

-ఏడాదిన్నరలోనే ఖమ్మం ప్రగతి తోరణాలతో కళకళ

-ఖమ్మంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి శీనన్న కృషి

-ప్రతి ఏడాది 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు

-ప్రతి గ్రామంలో ప్రతి పేదకు ఇల్లు

-ఐదేళ్ళలో విడతల వారిగా నిర్మాణాలు.

-ఖమ్మంలో తొలి విడత ఇండ్లకు గృహప్రవేశాలు

-తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          ప్రజా ప్రభుత్వం, సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పడుతున్న శ్రమతో ఖమ్మం జిల్లాను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్నదే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఆయన వేసుకన్న ప్రణాళికలను అమలు చేస్తూ వున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. అటు మంత్రిగా రాష్ట్రాభివృద్ది, జిల్లా నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఖమ్మం జిల్లా అన్ని రంగాలలో ప్రగతిలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా గూడులేని నిరుపేదలు ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామన్న తన ఎన్నికల హమీని పక్కాగా అమలు చేస్తున్నారు. పేదల కళ్లలో ఆనందం నింపుతున్నారు. అన్ని జిల్లాల కంటే ముందుగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టిన నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అంతే వేగంగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వహస్తాలతో ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయించారు. ఏడాది కాలంలో ఆ ఇండ్లను పూర్తి చేసి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదగా గృహ ప్రవేశాలు చేయించారు. అదీ నాయకుడిగా, ప్రజలకిచ్చిన హమీలు నేరవేర్చే ప్రజా ప్రతినిధి లక్ష్యమని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన చూసిన తమ జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలని ఇతర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు స్పూర్తిపొందేలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన కితాబు ఎంతో విలువైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనకు కుడిభుజంగా వున్నారని అన్నారు. ఆయన పక్కన వుంటే కొండంత బలమున్నట్లేనే అని మంత్రి పొంగులేటిని సిఎం. కొనియాడారు. ఎందుకంటే మంత్రి పొంగులేటిశ్రీనివాస్‌ రెడ్డి చేపడుతున్న మంత్రిత్వ బాధ్యతల్లో ఆయన శాఖలు అన్నింటా ఫస్టు..బెస్ట్‌ అనిపించేలా పనిచేస్తున్నారు. గత బిఆర్‌ఎస్‌ హాయాంలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని చెప్పి ఊరించి, ఊరించి పదేళ్లపాటు ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. అలాంటి కాలం నుంచి కాంగ్రెస్‌ను అదికారంలోకి తెచ్చి, ఖమ్మం జిల్లాలో అర్హులైన పేదలందిరకీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తున్నారు. గృహ నిర్మాణ మంత్రిగా కూడా పొంగులేటి శ్రీనివాస్‌ వుండడంతో ఇందిరమ్మ ఇండ్లపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ ఐదేళ్ల కాలానికి 20లక్షలకు పైగా ఇ ందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం శరవేగంగా జరుతున్నాయి. అందులో చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కూడా జరుపుకున్నాయి. ఈ దసరాకు చాలా వరకు పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్దంగా వున్నాయి. గత ప్రభుత్వంలాగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంమాటలు చెప్పి తప్పించుకోలేదు. అందుకే తొలి ఏడాది బడ్జెట్‌లో రూ.22వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఏడాది మొత్తం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపూరి చేయనున్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే పేదలకు ఇంటి నిర్మాణ పూర్తిని బట్టి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే అటు ఇంటి నిర్మాణం,ఇటు బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరగకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతి వారం డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం. ఏ వారానికి ఆ వారం డబ్బులు చేతిలో వుంటే, ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పులు చేయాల్సిన అవసరం వుండదు. పైగా ఇంటి నిర్మాణం ఒక్క రోజు కూడా ఆగిపోదు. వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్గుతుంది. ఇలా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయలేదు. గత బిఆర్‌ఎస్‌ పాలకులు అసలే చేయలేదు. డబుల్‌ బెడ్‌రూంలు నిర్మాణం చేసి ఇస్తామని 2014,2018 ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. కాని ఇండ్లు నిర్మాణం చేపట్టలేదు. తర్వాత అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. ఆ మాటను కేసిఆర్‌ తప్పారు. ఏ రకంగా ఇండ్లను ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తీరా గత ఎన్నికల సమయంలో సొంత స్థలం వున్నవారికి రూ.5లక్షలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. దానిని ప్రజలు నమ్మలేదు. పదేళ్లలో పది ఇండ్లు కట్టని బిఆర్‌ఎస్‌కు ఎన్నికలప్పుడే డబుల్‌ బెడ్‌రూంలు గుర్తొస్తాయని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు చెప్పిందంటే ఖచ్చితంగా ఇండ్లు ఇస్తుందని బలంగా నమ్మారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదలందిరకీ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌. ఆ సమయంలో తెలంగాణలో 25లక్షల ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో రేవంత్‌ సర్కారు ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటి విడతలో ఇండ్లు రాని వారు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇంకా నాలుగేళ్ల కాలం వుంది. విడతలవారిగా ఇచ్చే ఇండ్లలో ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు హమీ ఇచ్చారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లతోపాటు, ఆయన నిర్వహిస్తున్న రెవిన్యూ శాఖలో కూడ అనేకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. ప్రజాపాలన ప్రజలకు మరింత చేరువ చేశారు. గత ప్రభుత్వ హాయాంలో తీసుకొచ్చిన ధరణి మూలంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నీ తీర్చేందుకు భూ బారతీ తెచ్చారు. ప్రజల సమస్యలు తొలగించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమల రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు పడకుండా చేశారు. ధరణి మూలంగా కొన్నిలక్షల మంది సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఎంత చెప్పినా కేసిఆర్‌ వినిపించుకోలేదు. ప్రజల బాధలు పట్టించుకోలేదు. దాంతో రెవిన్యూ వ్యవస్ధలో అప్పుడు పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నాయకులు పంచుకొని తినడానికి ధరణి బిఆర్‌ఎస్‌కు ఉపయోపడిరది. కాని ఇప్పుడు భూ భారతి మూలంగా ఏ ఒక్కరికీ ఇబ్బంది రాదు. నష్టం కలగదు. అవినీతికి ఎక్కడా తావులేదు. ఏ ఒక్క అదికారి అవినీతికి పాల్పడిని ప్రజా ప్రభుత్వం ఉపేక్షించడం లేదు. ఎంతో మంది అవినీతి అదికారులను జైలుకు పంపించారు. అవినీతిని ఇంతగా అంతం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. దేశంలోనే ఇంతలా అవినీతిని కంట్రోల్‌ చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. అంతగా అవినీతి నిర్మూలన జరుగుతోంది. అది కేవలం రెవిన్యూలోనే కాదు, అన్ని శాఖల్లో అమలు జరుగుతోంది. అవినీతి రక్కసి పారిపోతోంది. ఇక రిజిస్ట్రేషన్‌ శాఖలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకే దగ్గర అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేశారు. దాంతో ప్రజలకు ఎలాంటి అసౌక్యం కలగకుండా పోయింది. అవినీతి అనే పేరు వినపడకుండా చేసిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికే దక్కింది. ఇలా తన శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తూనే మరో వైపు ఖమ్మం జిల్లా ప్రగతిని బాటలువేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగు విస్తరణ, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిపిస్తున్నారు. ఖమ్మ జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి పొంగులేటి చొరవతో తెలంగాణలో పదేళ్ల తర్వాత సుమారు ఏడు లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం అందేలా చేస్తున్నామని పొంగేలేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇలా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాను నెంబర్‌ వన్‌ చేస్తూ ముందుకు సాగుతుండడంతో, మంత్రుల్లో ఆయననే ఫస్ట్‌ , బెస్ట్‌ అనే కితాబు అందుకుంటున్నారు. మిగతా మంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ది పనులు వేగ వంతంచేస్తున్నారు. దటీజ్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని కొనియాడబడుతున్నారు.

పెంచి తగ్గించడం పండగనా?

-జిఎస్టీ తగ్గింపుతో మేలు జరిగేనా!

-జనం నిజమని నమ్మమంటారా?

-పన్నులు పెంచి తగ్గించడం కూడా గొప్పేనా!

-ఏడేళ్లు ఏడిపించి ఇప్పుడు జోలపాడతారా!

-జిఎస్టీ తీసుకొచ్చిన రోజు దేశానికి రెండో స్వాతంత్య్రం అన్నారు.

-ఎడాపెడా స్లాబ్‌లు తెచ్చి పన్నులు బాదారు.

-ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు.

-ఇప్పుడు జిఎస్టీ తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు.

-పరోక్షంగా ప్రజలను పీడిరచుకు తిన్నామని ఒప్పుకున్నారు.

-జిఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ లేదు.

-కేవలం 1.1 శాతమే తేడా వస్తుంది.

-ప్రభుత్వానికి 48 వేల కోట్ల నష్టమని కేంద్రం చెప్పడం విడ్డూరం.

-జిఎస్టీ తగ్గించారు సరే కంపెనీలు ధరలు పెంచితే చేసేదే ముంది!

-ధరల పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ.

-దానిని అదుపు చేయకుండా పన్నులు తగ్గించినట్లు ప్రకటిస్తే సరిపోతుందా!

-జనానికి ఊరట కల్గుతుందా?

-బంగారం మీద జిఎస్టీ తగ్గించామన్నారు.

-బంగారం ధర భారీగా తగ్గుతుందన్నారు.

-ఏడాలో తులం బంగారం ముప్పై వేలు పెరిగిం!

-నిత్యవసర వస్తువుల ధరలు అంతే…

-నాలుగు రోజులు తగ్గిస్తారు.

-కంపనీలు పెంచితే ఆటోమేటిక్‌గా ధరల భారం తప్పదు.

-ప్రభుత్వం చెప్పే గొప్పలకు అర్థముండదు.

-జనానికి ఊరట కల్గిన సంతోషం ఎంతో కాలం వుండదు.

-పన్నలు తగ్గిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులే అంటారు.

-ఎన్నికలు రాగానే తగ్గించినట్లు ప్రకటించి మాయ చేస్తారు.

-జనానికి అన్నీ తెలుసు. భరించక తప్పదని తెలియంది కాదు.

-పన్నులు పీడిరపుకు మార్గం.

-అంతకన్నా ఏముంది దౌర్భాగ్యం

హైదరాబాద్‌, నేటిధాత్రి:

ప్రజలను బురిడీ కొట్టించడంలో రాజకీయ నాయకులను మించిన వారు లేరు. రాజకీయ నాయకులు ఏది చేసినా కరక్టె అనిపించుకుంటారు. తాము చేసిందే కరక్టని ప్రజల చేత కూడా అనిపిస్తారు. అదీ రాజకీయాలకు వున్న గొప్ప తెలివి. ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలదే అంతిమ నిర్ణయం. అందుకే జనం ఏమనుకున్నా సరే..ఎన్నికల్లో గెచే దాక ఒకమాట. గెచాక ప్రజాభివృద్ది పేరుతో మరో మాట. రెండు నాలుకలు లేకుంటే నాయకులు కాలేదు. రాజకీయాలు చేయలేరని చెప్పడానికి చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అంటూ జిఎస్టీని తెచ్చిం. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పన్నుల విషయంలో లెక్కా పత్రం వుండే కాదు. అంటూ జేపి చెప్పిన లెక్కలు జనం నమ్మారు. పన్నుల వసూలు అనేది ఎలా జరుగుతుందో కూడా లెక్క లేకపోతోం. దాంతో ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటూ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వన్‌ నేషన్‌, వన్‌ టాక్స్‌ అంటూ ప్రజలను నమ్మించారు. ప్రజలు కూడా ఊరట కల్గుతుం. ధరలు పెద్దఎత్తున తగ్గుతాయని ఆశించారు. మన దేశంలో నూటికి ఎనభై మంది గువ మధ్య తరగతి ప్రజలే వుంటారు. వారికి రూపాయి ఆదా అయినా సరే అ ఎంతో భరోసాగా వుంటుందని ఆశించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చిం. 2017లో దేశమంతా అబ్బురపడేలా జిఎస్టీ తీసుకొచ్చారు. తాము తెస్తున్న జిఎస్టీ దేశానికి రెండో స్వాతంత్య్రం లాంటిదన్నారు. అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చినట్లే, జిఎస్టీని కూడా అర్ధరాత్రి ప్రకటించారు. అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా ఆ కార్యక్రమాన్ని రాత్రంతా మేలుకొని టివీలకు అతుక్కొని తిలకించారు. గతంలో ఒక వస్తువు, ఒక ప్రాంతంలో ఒక రకమైన పన్ను. మరో ప్రాంతంలో మరో రకమైన పన్ను విధానం వుండే. ఇక దేశంలో ఎక్కడైనా ఏ వస్తువైనా సరే ఒకే పన్ను విధానం అని చెప్పారు. పన్నులను సరలీకృతం చేస్తామని చెప్పారు. దేశమంతా సంతోషపడిర. ఎంతో సంబరపడిర. దేశం కోసం, ధర్మం కోసమంటే ఇదే అని ప్రజలు కూడా బిజేపిని ఎంతో కీర్తించారు. జీఎస్టీ అమలు విషయానికి వచ్చే సరికి ఐదు రకాల స్లాబులు తెచ్చారు. అంతా గందరగోళంగా వుందన్న అనుమానం ప్రజలకు ఆలోనే తెలిసిపోయిం. తగ్గాల్సిన ధరలు పెరుగుతూ వచ్చాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతూ వెళ్లిం. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ గురించి తెలిసి, చిన్న చిన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఏదో జరుగుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అటు ప్రజలకే కాదు, ఇటు వ్యాపారులకు కూడా జిఎస్టీ అనే గుడి బండగా మారుతూ వచ్చిం. ఏడా, రెండేళ్ల గడిచే సరికి దేశంలో వ్యాపారుల జీవితాలు తలకిందులౌతూ వచ్చాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జిఎస్టీ తెచ్చి, దానిని అమలు కార్యాచరణ ప్రకటించిన వెంటనే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. జిఎస్టీ అనే పన్ను విధానంలో లోపభూయిష్టమైందన్నారు. ప్రజలకు నామాలు పెట్టడం తప్ప మరేం లేదన్నారు. ప్రజలను మరింత దోచుకునేందుకు ఎత్తుగడ అన్నారు. గతంలో పన్ను విధానాన్ని ఎత్తి చూపిన బిజేపి నిర్ణయం ప్రజలను పెనం మీద నుంచి పొయ్యిలో వేసినట్లే అవుతుందని అన్నారు. దాన్ని బిజేపి తీవ్రంగా తప్పు పట్టిం. పైగా ఆ సమయంలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అప్పటికే రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ వుండే. రాహుల్‌ గాందీ మీద బిజేపి ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడుతుండేది. రాహుల్‌ ఏం మాట్లాడినా పెడర్దాలు తీసేవారు. ప్రజలు కూడా నిజమే కావొచ్చని, రాహుల్‌ చెప్పేదే అబద్దమని కూడా అనుకుంటూ వచ్చారు. బిజేపి మాటలనే బలంగా నమ్ముతూ వచ్చారు. కాని ప్రజలకు రాను రాను అర్ధమైం. జిఎస్టీ వల్ల పెద్ద బొక్క పడుతోందని అర్ధమైం. ఆ సమయంలో రాహుల్‌ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు నిజమే అనే అనుమానం ప్రజలకు వస్తుందన్న సమయంలో జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. ఐదు స్లాబులన నాలుగు చేశారు. ప్రజలను ఊరడిరచారు. ప్రజలకు ఊరటక్పస్తున్నామని చెప్పారు. అయినా రాహుల్‌ గాంధీ హెచ్చరిస్తూనే వచ్చారు. జిఎస్టీ మూలంగా దేశంలో 18లక్షల చిరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు కనుమరుగయ్యారు. కొన్ని కోట్ల మంకి ఉపా లేకుండాపోయిందని రాహుల్‌ చెప్పారు. ఇప్పుడు అదే నిజమౌతోం. ఒకదశలో ఆహార పదార్థాల మీద కూడా వేసిన పన్నులపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న. పాలు, పెరుగు మీద కూడా 12శాతం జీఎస్టీ వేశారు. దాంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైం. దాంతో మళ్లీ దానిని సవరించారు. ఐదు శాతానికి తెచ్చారు. స్కూలు పిల్లలు వాడే పెన్నులు, పెన్సిళ్లు, ఏరేజర్లు, నోట్‌ బుక్స్‌ ఇలా ప్రతి వస్తువు మీద జీఎస్టీ వేయడం పెద్ద చర్చనీయాంశమైం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై జిఎస్టీ వేయడాన్ని దేశమంతా తప్పు పట్టిం. కాలక్షేపం కోసం తినే పాప్‌ కార్న్‌లో కూడా మూడు రకాల పన్నులు వేయడం బిజేపి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్న. అప్పటి నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పంంచలేదు. గత ఎన్నికల్లో బిజేపికి పూర్తి స్దాయి మెజార్టీ వస్తే ప్రజల జీవితాలు ఎలా వుండేవో అని అనుకుంటున్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పాటైం. బలమైన ప్రతిపక్షం తయారైం. దాంతో బిజేపిపై ప్రతిపక్షాలు అడుగడుగునా విజయం సాధిస్తున్నాయి. బిజేపికి గడ్డుకాలం కనిపిస్తోం. ఓ వైపు ఓట్‌ చోరీ అంటూ రాహుల్‌ గాందీ చేస్తున్న పోరాటం ప్రజలను బాగా ఆకర్షిస్తోం. ప్రజల్లో పెద్దఎత్తున చైతన్యం నింపుతోం. పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన కేంద్రం ఎలాగైనా ఆ దేశానికి బుద్ది చెబుతుందని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలతో సహా,ప్రజలంతా అండగా నిచారు. పహల్‌గావ్‌లో టెర్రరిస్టులు చేసిన పనికి దేశమంతా కుతకుతలాడిర. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరిం. ఆపరేషన్‌ సిందూర్‌ మొదలు పెట్టిన కేంద్రం హటాత్తుగా ఆపరేషన్‌ ఆపేసిం. ఆపరేషన్‌ సిందూర్‌ అయిపోయం. పాకిస్తాన్‌ను చావు దెబ్బతీశామని ప్రజలు అనుకుంటున్న వేళ అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దేశం వ్యాప్తంగా ఒక్కసారిగా కళకళం రేపాయి. యుద్దం నేనే ఆపానంటూ ట్రంప్‌ చెప్పారు. ఒకసారి కాదు పదే పదే చెబుతూ వచ్చారు. దాంతో మన దేశ సార్వభౌత్వం మీద అమెరికా పెత్తనమేమిటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోమొదలైం. ఈ సంఘటన ప్రతిపక్షాలకు మంచి ఆయుధమైపోయిం. ఇక అప్పటి నుంచి అటు ఓట్‌ చోరీ అంశం, ఇటు ఆఫరేషన్‌ సిందూర్‌ అంశాలతో కేంద్రాన్ని ఉక్కిరిక్కిరి చేస్తున్నాయి. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పహల్గావ్‌ మీద దాడి జరిగిన రోజు ప్రధాని మోడీ ఇరాన్‌ పర్యటనలో వున్నారు. హుటాహుటిన దేశానికి చేరుకున్నారు. దానిపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారని అందరూఅనుకున్నారు. కాని మధ్యాహ్నం వరకు బిహార్‌ వెళ్లి ఎన్నికల సభలో మాట్లాడారు. ఇక్కడే ప్రతిపక్షాలకు, ప్రజలకు మరింత ఆగ్రహం వచ్చేలా చేసిం. పార్లమెంటు సమావేశాలలో అధికార బిజేపిని ప్రతిపక్షాలు ఊపిరి సలపనివ్వలేదు. ఇక ఎలాగైనా ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిం. ఆగష్టు పదిహేను స్వాతంత్య్ర నోత్సవం రోజున దేశ ప్రధాని మోడీ దీపావళికి ప్రజలకు కానుక ప్రకటిస్తున్నాను అని చెప్పారు. అందరూ ఏముంటుందని అనుకున్నారు. జిఎస్టీని తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడున్న నాలుగు స్లాబుల స్దానంలో రెండు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. తాజాగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం చేశారు. ఇక ప్రజలు పండగ చేసుకొమ్మంటున్నారు. దాంతో ప్రతిపక్షాలు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. కొండంత పెంచి రవ్వంత తగ్గించి పండగ చేసుకొమ్మడనం బిజేపికే చెల్లిందని ప్రతిపక్షాలు ఎదురు దాడి చేయడం మొదలు పెట్టాయి. ఇలా అయినా బిజేపికి వచ్చే రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే ఇక్కడ కూడా జిఎస్టీ ఎత్తుగడ పాచిక పారలేకుండాపోయిం. కాకపోతే కొంతలో కొంత ఊరట కల్గుతుందని అనుకుంటున్నారు. అయితే అది ఎంత కాలముంటుందో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గిందని ధరలు తగ్గిస్తే, ఉత్పత్తి దారులు వస్తువుల ధరలు పెంచితే మొదటికే వస్తుందని నవ్వుకుంటున్నారు. ఇది బిజేపికి ఎంత మేర మేలు చేస్తుందో వేచి చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version