’’మిల్లర్లకు’’ పిల్లర్‌ ‘‘సందీప్‌’’!

`’’మంత్రివర్య’’ ఈ ‘‘దోపిడీ చూడండి’’..ఎపిసోడ్‌-5

`మిల్లర్‌ సందీప్‌..ఇద్దరు అవినీతి అధికారులు ఫినిష్‌!?

`అవినీతి ‘‘డిటి,టెక్నికల్‌ అసిస్టెంట్‌’’లను పట్టించిన మొనగాడు!

`దగాకోరులను దర్జాగ పట్టించిన ‘‘మిస్టర్‌ మిల్లర్‌’’ భారతీయుడు!

`వేధించిన అధికారులకు కటకటాలు చూపించాడు.

`అధికారుల అవినీతిలో భాగం కాలేక సందీప్‌ చేసిన ధైర్యం.ఇతర మిల్లర్‌కు ఆదర్శం.

`ట్రక్‌ షీట్ల మోసాలు..డిటిలకు లక్షలు!

`మిల్లర్లను బెదిరించి ట్రక్‌ షీట్లు అంటగడుతున్న అధికారులు!

`ట్రక్‌ షీట్లు వద్దన్న పాపానికి మిల్లర్‌ సందీప్‌కు వేధింపులు!

`నిజాయితీ వ్యాపారస్తులను చెడగొడుతున్న అధికారులు.

`అధికారుల అడ్డగోలు సంపాదనకు బలౌతున్న మిల్లర్లు.

`‘‘డిటి’’ల అక్రమ సంపాదన కోసం బలౌతున్న మిల్లర్లు.

`ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక డిటిల కోసం ట్రక్‌ షీట్లు తీసుకుంటున్న మిల్లర్లు!

`రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల లంచాలకు సాక్ష్యాలు!

`లంచం ఇవ్వను..ట్రక్‌ షీట్లు తీసుకోను అన్నందుకు సందీప్‌కు ముప్పు తిప్పలు.

`మూడు నెలలుగా సందీప్‌కు రకరకాల వేధింపులు!

`అర్థరాత్రి విజిలెన్స్‌ ఎంక్వౌరీ పేరుతో డిటిల తనఖీలు.

`మిల్లర్‌ సొంత బియ్యాన్ని పిడిఎస్‌ బియ్యంగా కేసులు.

`సందీప్‌కు చెందిన ప్రైవేటు బియ్యం పోలీసు స్టేషనుకు తరలింపు.

`‘‘డిటి’’లకు వంత పాడుతున్న ‘‘జేసి’’?

`కలెక్టర్‌ ఆదేశాలను కూడా లెక్క చేయని ‘‘జేసి’’?

??హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా వేధింపులు???

`ఆఖరుకు ‘‘డిటి’’నీ ఏసిబికి పట్టించిన సందీప్‌!

`నిజాయితీ మిల్లర్‌ను చెడగొడుతున్న అధికారులు!

`ఖజానాకు కాపలా వుండాల్సిన అధికారులు.సివిల్‌ సప్లయ్‌ని లూటీ చేస్తున్నారు?

`మిల్లర్లతో దందాలు చేయించి కోట్లు దండుకుంటున్నారు.

`గోడౌన్లలలో ఎలుకలను మించిన పందికొక్కులౌతున్నారు?

`సివిల్‌ సప్లయ్‌ బొక్కసానికి బొరియలు చేస్తున్నారు!

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                            

ఒక వ్యక్తి చేసే ధైర్యం వ్యవస్దనే నిలబెడుతుంది. ఆ సమాజాన్ని కాపాడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎంత కాలం ఈ అవినీతి అక్రమాలు అనుకున్నప్పుడు ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెడతారు. ఎంత కాలం దౌర్జన్యాలు అనుకున్నప్పుడు ఒక్కడు నిలబడతాడు. ఎదిరిస్తాడు. అన్యాయాన్ని నిలదీస్తాడు. అక్రమాలను ఎదుర్కొంటాడు. సరిగ్గా ఆసిఫాబాద్‌కు చెందిన మిల్లర్‌ సందీప్‌ అదే చేశారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక సార్లు గళమెత్తాడు. కాని ఎవరూ వినిపించుకోలేదు. పట్టించుకోలేదు. అందుకే నిలదీస్తే తప్ప ఎదిరించలేమనుకున్నాడు. అవినీతి పరులను పట్టిస్తే గాని సమజానికి మేలు జరగదనుకున్నాడు. ధైర్యం చేశాడు. ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇప్పటికీ తాను మరిన్ని సమస్యలు ఎదర్కొవాల్సి వస్తుందని తెలుసు. అయినా తన కోసం కాకుండా, తన వ్యవస్ధ కోసం, తోటి వారి కోసం తాను ఒక్క అడుగు వేస్తే ఎంతోమందికి మేలు జరుగుతందనుకున్నాడు. వ్యవస్దలో చీడపురుగులను ఏరి వేయాలనకున్నాడు. ఇప్పుడు తెలంగాణలోని మిల్లర్లందరికీ సందీప్‌ పిల్లర్‌గా మారిపోయాడు. ఇంత కాలం అదికారుల వేధింపులు మిల్లర్లు అనుభిస్తున్నారు. కాని ఎదిరించేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అవినీతికి అలవాడు పడిన అదికారులకు లొంగిపోతున్నారు. తలెత్తుకు బతకాలంటే నిజాయితీగా వుండాలన్న ఆలోచన వున్న మిల్లర్‌ సందీప్‌ మాత్రం సివిల్‌ సప్లయ్‌ శాఖకు చెందిన జిల్లా డిటిల మాటలు వినలేదు. అవినీతికి పాల్పడడానికి ఇష్టపడలేదు. అలాంటి సొమ్ము నాకు వద్దనకున్నాడు. డిటిలకు లంచాలు ఇవ్వడానికి నిరాకరించారు. అవినీతి పరులైన ఇద్దరు సివిల్‌ సప్లయ్‌ చెందిన అదికారులను పట్టించాడు. ఏసిబి చేత రెడ్‌ హాండెడ్‌గా పట్టుకునేలా చేశాడు. దర్జాగా వాళ్లేదే మిల్లర్‌ సందీప్‌ వద్ద దాచుకున్న సొమ్ములాగా లక్షలు కావాలంటే ఇస్తే స్తోమత మిల్లర్‌ వద్ద లేదు. అవినీతి పరుడు సందీప్‌ అసలే కాదు. అలాంటి వ్యక్తిని వేదిస్తే ఎలా వుంటుందో కూడా ఆ అదికారులకు చూపించారు. అదికారుల అవినీతిలో బాగం కాలేక సందీప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మిల్లర్లకు ధైర్యం నింపారు. అయితే సివిల్‌ సప్లయ్‌శాఖలో ట్రక్‌ షీట్ల దందా అనేది అదికారులు సృష్టించుకున్న అవినీతి సమ్రాజ్యంలో ఒక భాగం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు లొసుగులను ఆసరా చేసుకొని అవినీతికి పాల్పడడం అలవాటు చేసుకున్నారు. మిల్లర్లకు వడ్లు కేటాంచి , ట్రక్‌ షీట్లు జారీ చేయాల్సి వుంటుంది. కాని తెలంగానలోని అన్ని జిల్లాల్లో డిటీలు మిల్లర్ల్‌కు వడ్లు కేటాయించకుండానే ట్రక్‌ షీట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాకే పరిమితం కాదు. అన్ని జిల్లాలలోనూ ఇదే సాగుతోంది. ప్రభుత్వ సొమ్ముకు కన్నం పడుతూనే వుంది. మిల్లర్లు రైతులకు డబ్బులు చెల్లించేందుకు అవసరమైన సొమ్ము కోసం అదికారులు ట్రక్‌ షీట్లు జారీ చేస్తారు. దాంతో మిల్లర్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని మళ్లీ వాటిని బ్యాంకులకు చెల్లిస్తుంటారు. అయితే ఎలాంటి వడ్లు లేకపోయినా, ట్రక్‌షీట్లు జారీ చేస్తాం. మేం అడినంత ఇవ్వాలని మిల్లర్లకు డిటీలు సూచిస్తారు. కొంత మంది మిల్లర్లు తమ అవసరాల కోసం అలా ట్రక్‌షీట్లు తీసుకుంటారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటారు. తర్వాత మళ్లీ మిల్లర్లు ఆ సొమ్మును బ్యాంకుకు చెల్లిస్తారు. కాని అందుకు సివిల్‌సప్లయ్‌ అధికారులకు లక్షల రూపాయలు మిల్లర్లు చెల్లిస్తుంటారు. ఇలా ట్రక్‌ షీట్లు ఇస్తామని, తమకు అడినంత ఇవ్వాలని ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు డిటీలు మిల్లర్‌ సందీప్‌కు సూచించారు. దానికి మిల్లర్‌ సందీప్‌ ససేమిరా? అన్నాడు. తనకు ట్రక్‌ షీట్లు అవసరం లేదన్నాడు. ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకోవాల్సిన అత్యవసర సమస్యలు లేవని చెప్పాడు. అయినా డిటీలు కొంత కాలంగా మిల్లర్‌ సందీప్‌ను వేదిస్తూ వస్తున్నారు. ఇలా ఎంత చెప్పినా సందీప్‌ వినిపించకోకపోవడంతో ఆయనపై కక్ష కట్టారు. మిల్లు మీద విజిలెన్స్‌ అధికారుల చేత దాడులు చేయిస్తామంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఒక్కసారి లంచం ఇవ్వడం మొదలు పెడితే అది జీవితాంతం ఉచ్చులా మారుతందనేది సందీప్‌ అభిప్రాయం. అందులోనూ వడ్లు లేకుండా ట్రక్‌ షీట్లు తీసుకోవడం నేరం. ఎప్పటికైనా ఇబ్బందికరం. అదికారులు తప్పించుకుంటారు. మిల్లర్లే ఇరుక్కుంటారు. ఒక్కసారి దొంగ ట్రక్‌ షీట్లు ఇచ్చి సహాయపడినట్లు నటించినా, దాన్ని అడ్డం పెట్టుకొని ఎల్లకాలం అదికారులు వేదిస్తారు. లంచాలు కావాలంటారు. లేకుంటే ట్రక్‌షీట్ల బాగోతం తెరమీదకు తెస్తారు. అందుకే అలాంటి అలాంటి పరిస్దితి తెచ్చుకోవద్దని సందీప్‌ గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అధికారులకు ఇగో హర్ట్‌ అయ్యింది. తాము చెప్పింది చేయడం లేదన్న ఆక్రోశం సందీప్‌ మీద పెరిగింది. ఎలాగైనా సందీప్‌ను వేదించాలని నిర్ణయం తీసుకున్నారు. అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ పేరుతో అర్ధరాత్రి ఇద్దరు డిటీలు మిల్లుకు వచ్చారు. నిజానికి విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగితే ఆ అదికారులు రావాలి. కాని వాళ్వెరు లేకుండా ఇద్దరు డిటీలు అర్దరాత్రి మిల్లును తనిఖీ చేయడానికి వచ్చి తప్పుడు లెక్కలు రాశారు. లేని పోనివన్నీ తమ నివేదికలో రాశారు. అసలు సంబంధం లేని బియ్యాన్ని సీజ్‌ చేశారు. పిడిఎస్‌ బియ్యమని నమ్మించే ప్రయత్నం చేశారు. తన సొంత బియ్యాన్ని తరలించుకుపోయారు. అంటే అదికారులు తలుచుకుంటే మిల్లర్లను ఈ విధంగా కూడా ఇబ్బందుల పాలు చేయొచ్చని నిరూపించారు. ఇలా మిల్లర్లను తమ చేతుల్లో పెట్టుకొని ఆడిరచడం అలవాటు చేసుకున్నారు. వేదించడం నేర్చుకున్నారు. లంచం ఇవ్వను, ట్రక్‌ షీట్లు తీసుకోనే అన్నందుకు మూడు నెలలుగా వేదింపులకు గురి చేస్తూ వస్తున్నారు. డిటీలు తమను వేదిస్తున్నారంటూ సందీప్‌ ఏకంగా జేసికి పిర్యాధు చేశారు. కాని జేసి కూడా డిటీలకు సపోర్టు చేశారు. తర్వాత కలెక్టర్‌కు పిర్యాధు చేశాడు. ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ జేసిని నివేదిక కోరారు. అయినా జేసి, కలెక్టర్‌ ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. దాంతో సందీప్‌ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి తనుకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాపీని చూపించాడు. హైకోర్టు తీర్పును కూడా అటు డిటీలు, ఇటు జేసి ఖాతరు చేయలేదు. పైగా వేదింపులు ఎక్కువ చేశారు. ఖజానాకు కాపలా వుండాల్సిన అధికారులు బొక్కసానికి బొక్క పెడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును మింగుతున్నారు. నిజాయితీగా వున్న వ్యాపారులకు అధికారులే చెడగొడుతున్నారు. వ్యాపారులు తప్పు చేసేందుకు అవకాశమిస్తున్నారు. అవకాశ వాదులుగా వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకొని వేదించుకు తింటున్నారు. మూడేళ్లుగా ట్రాన్స్‌ఫర్లు లేకుండా ఆసిఫాబాద్‌లోనే తిష్టవేసుకొని వున్నారు. మిల్లర్లకు నరకం చూపిస్తున్నారు. ఊ అంటే లంచం..ఆ అంటే లంచం అన్నట్లు దోచుకుతింటున్నారు. ఇక విసిగిపోయిన మిల్లర్‌ సందీప్‌ ఏసిబి అదికారులకు పిర్యాదు చేశారు. పిడిఎస్‌ బియ్యం గోడౌన్‌కు చేర్చాలంటే లారీకి రూ.25వేలు ఇవ్వాలని డిఎం. నర్సింహారావు డిమాండ్‌ చేశారు. అలా మూడు లారీలకు రూ. 75వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు. దాంతో డిఎం.ను మిల్లర్‌ సందీప్‌ నగదు చెల్లించేలా వల వేసి ఏసిబి అధికారులు పట్టుకున్నారు. కటకటాలకు పంపించారు. అధికారులే దగ్గరుండి మిల్లర్ల చేత తప్పులు చేయిస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌ని లూటీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. మిల్లర్ల చేత దందాలు చేయించి కోట్లు దండుకుంటున్నారు. ఇది ఒక్క ఆసిఫాబాద్‌లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఇక్కడ మరో ట్విస్టేమిటంటే ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని తహసిల్ధార్‌కు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు అధికారులు ఎలా చేస్తారో ఈ వ్యవహారంతోఅర్ధం చేసుకోవచ్చు. ఈ అక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సి వుంది. ముఖ్యంగా సివిల్‌సప్లయ్‌శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కమీషనర్‌కు తెలియాల్సిన అవసరం వుంది. ఇలా అధికారుల ఆగడాల మూలంగా మిల్లర్లు ఇబ్బందులు పాలౌతున్నారు. ట్రక్‌ షీట్లపేరుతో అధికారులు లక్షలు కూడబెట్టుకుంటున్నారు. ఇటు మిల్లర్లను వేదిస్తూ సంపాదిస్తున్నారు. అటు మిల్లర్ల చేత తప్పులు దగ్గరుండి చేయిస్తూ లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. ఇది మారాలంటే అందరూ సందీప్‌ లాంటి వారు కాలేరు. అందువల్ల ప్రభుత్వమే దృష్టి సారించాలి. జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. అవినీతి సాగిస్తున్న అధికారులను ఇంటికి పంపించాలి. అప్పుడే సివిల్‌ సప్లైశాఖ బాగు పడుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version