బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం!

`ప్రచారానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులకే ప్రజల భరోసా.

`ఎక్కడికక్కడ ప్రజలు కారు పార్టీ నాయకులకు స్వాగతం

`200 వున్న పింఛన్‌ రెండు వేలు చేసింది కేసీఆర్‌.

`హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది కేసీఆర్‌

`మంచినీటి కరువు లేకుండా చేసింది కేసీఆర్‌

`వరదలొస్తే 10 వేలు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్

 

`కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది బీఆర్‌ఎస్‌ నాయకులు

`పెద్ద ఎత్తున ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇచ్చింది బిఆర్‌ఎస్‌

`ప్రభుత్వం తరుపున నిత్యావసర వస్తువులతో పాటు 500 ఇచ్చింది బీఆర్‌ఎస్‌

`ప్రాణాలకు తెగించి ప్రజల కోసం నిలబడ్డది బీఆర్‌ఎస్‌

`కరోనా సమయంలో బిఆర్‌ఎస్‌ తప్ప ఏ పార్టీ సాయం చేయలేదు

`బస్తీ దవఖానాలు పెట్టి పేదలకు వైద్యం అందించింది కేసీఆర్‌

`గర్భిణీ మహిళలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించింది కేసీఆర్‌

`ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయి ప్రసవాలు చేశారు

`కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి పసి పిల్లలను సంరక్షించారు

`ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటి దగ్గర చేర్చింది కేసిఆర్‌

`కేసీఆర్‌ కిట్‌ తో పాటు రూ. 13 వేలు ఇచ్చింది కేసీఆర్‌

`పేదలను ఆదుకున్నది కేసీఆర్‌

`పేదలకు ఉచిత విద్య, వైద్యం పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్‌

`గురుకులాలు పెట్టి బస్తీ పిల్లలకు చదువు చెప్పించినది కేసీఆర్‌

`ఈ విషయాలు బీఆర్‌ఎస్‌ నాయకులకు చెబుతున్నదే ప్రజలు

`జూబ్లీ హిల్స్‌ లో సునీతను గెలిపించుకుంటామంటున్నారు

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:

కష్టమెక్కడుంటుందో చైతన్యం కూడా అక్కడే వుంటుంది. జూబ్లిహిల్స్‌ లాంటి నియోజక వర్గంలో వున్న అనేక బస్తీలలో వుండే ప్రజలకు అన్నీ తెలుసు. కష్టం తెలుసు. సుఖం తెలుసు. బాధలు తెలుసు. గోసలు తెలుసు. వేధింపులు తెలుసు. బెదిరింపులు తెలుసు. అన్నీ చవిచూసిన వాళ్లే. గతంలో వారి జీవితాలు ఎలా వుండేవో తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా మారిపోయాయో తెలుసు. కేసిఆర్‌ వారిని ఎలా కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నారో తెలుసు. తెలంగాణ రాకముందు జూబ్లీహిల్స్‌లో వుండే కొన్ని ప్రాంతాలు ఎలా వుండేవో ఇప్పుడు ఎలా వున్నాయో చూస్తూనే వున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత సత్వర అభివృద్ది జరిగిన నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్‌ ఒకటి. ప్రత్యేకంగా యూసఫ్‌గూడ, వెంగల్‌రావు నగర్‌, బోరబండ, రహమత్‌ నగర్‌, లాంటి ప్రాంతాల పరిసి ్ధతి ఎలా వుండేదో ఇప్పుడు ఎలా వుందో చూస్తున్నదే. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. సాక్ష్యాత్తు జూబ్లీహిల్స్‌ నియోకవర్గంలో వున్న పేదల బస్తీల ప్రజలు. ఒకప్పుడు పేదల బస్తీలలో వుండే వారికి సరైన సౌకర్యాలు వుండేవి కాదు. కాని అనేక మౌళిక సదుపాయాలు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపిన పాలకుడు కేసిఆర్‌. ఆయా ప్రాంతాలలో కనీస విద్యా సౌకర్యాలు వుండేవి కాదు. వైద్య సదుపాయాలు పేదలకు అందేవి కాదు. అక్కడ ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం కూడ వైద్య సదుపాయం అందేది కాదు. దాంతో ప్రజలు అనేక అవస్ధలు ఎదుర్కొనేవారు. అలాంటి ప్రాంతాలలో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్‌ది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ హైదరాబాద్‌ మొత్తంగా సుమారు 350 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, బస్తీలలో వీటిని అడుగడుగునా ఏర్పాటు చేశారు. దాంతోపేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందడం మొదలయ్యాయి. ఒకప్పుడు వారికి ప్రభుత్వ వైద్యం అంటే అటు ఈఎస్‌ఐ, లేకుంటే నిమ్స్‌, సికింద్రాబాద్‌ వెళ్తే గాంధీ, కోఠి దవఖాన, ఉస్మానియాలు మాత్రమే వుండేవి. ఇక ప్రైవేటు ఆసుపత్రులు ఎన్ని వున్నా, పేదలకు ఆ ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే ఆ ఖర్చు భరించే పరిస్ధితి వుండేది కాదు. ప్రైవేటు చిన్న చిన్న ఆసుపత్రులున్నా వాటిలో కూడా వైద్యం ఖరీదుగానే వుండేది. దాంతో పేద ప్రజలకు కోసం నిపుణులైన వైద్యులతో బస్తీ దవఖానాల నిర్వహణతో పేదలకు ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో బస్తీ దవఖానల వల్ల ఎంతో మేలు జరిగింది. ఇక ఇదిలా వుంటే పేద మహిళల గర్బీణీల అవస్ధలు అన్నీ ఇన్నీ కావు. వారు నెల నెల చెకప్‌ల కోసం కూడ ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది. లేకుంటే వేలాది రూపాయలు ఖర్చు చేసి, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక మహిళ గర్భం దాల్చిన నుంచి డెలవరీ వరకు ఎంతో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వుండేది. ఆఖరుకు డెలివరీ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు ఆపరేషన్‌ చేయాల్సిందే అంటే ఆ కుటుంబం విలవిలాడిపోయేది. వేలల్లో ఖర్చుకు భయపడిపోయేవారు. దాంతో ఆసుపత్రులకు వెళ్లలేక ఇంట్లోనే ఇబ్బందులు పడి, ప్రాణాలు కోల్పోయిన మహిళలు కూడా వున్నారు. అలాంటి పరిస్ధితులను తప్పించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్దితి ఎదురయ్యేది. ప్రైవేటు ఆసుపత్రులు అంటే కచ్చితంగా ఆపరేషన్‌ అనేవారు. దాంతో వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చేది. ఒక వేళ ఆ స్ధోమత లేని వాళ్లు గాందీ లాంటి ఆసుపత్రులకు వెళ్లినా, సమయం దాటిపోయిందనో, ప్రాణాపాయ పరిస్ధితులున్నాయనో ఆక్కడ కూడా చేతులేత్తేస్తే మరింత ఖర్చులు భరించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన వాళ్లున్నారు. గాందీ ఆసుపత్రులలో వైద్యులు పట్టించుకోక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా వున్నారు. హైదరాబద్‌లో వుండే పేద ప్రజలకు ఇలాంటి పరిస్ధితి రాకుండా వుండేందుకు బస్తీ దవఖానాలే కాకుండా ప్రభుత్వమే ఆ గర్భినీ మహిళలను డెలివరికీ ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. గర్భిణీ మహిళలకు డెలివరీ సమయం వచ్చిందంటే 108కు కాల్‌ చేస్తే వెంటనే ఆసుపత్రి వర్గాలు వచ్చి ఆ మహిళలను ఆసుపత్రికి తీసుకెళ్లి డెలివరీ చేసేవి. అది కూడా నార్మర్‌ డెలివరీ చేసి, తల్లీ పిల్లలను కాపాడుతున్నాయి. డెలవరీ అయిన తర్వాత డిచ్చార్జి రోజున ఆడ పిల్ల పుట్టిన తల్లిదండ్రులకు రూ.13వేలు, మగ పిల్లాడు పుట్టిన తల్లిదండ్రులకు రూ.12 వేల నగదు కూడా కేసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చేది. దానికితోడు ఒక ఏడాది కాలం పుట్టిన పిల్లలకు అవసరమయ్యే సబ్బులు, పౌడర్లు, డైపర్లు, మందులతో కూడిన కేసిఆర్‌ కిట్‌ను కూడా అందజేశారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని జూబ్లీహిల్స్‌ ప్రజలే చెబుతున్నారు. ఇక బస్తీలలో వుండే పేద ప్రజల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుకునేందుకు వేలల్లో ఖర్చవుతుంది. దాంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు కాకుండా పనులకు పంపిస్తూ వుండేవారు. అలాంటి పిల్లలకు ఖచ్చితంగా ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో కేసిఆర్‌ కేజీటు పీజి అనే పథకాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1900 గురుకులాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పెద్దఎత్తున హైదరాబాద్‌ కూడా ఏర్పాటు చేశారు. హస్టల్‌ వసతితోపాటు, ఉచిత విద్యను అందించారు. అంతే కాకుండా మామూలు ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్నాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరుకు ఎంతో మంది విద్యార్ధులు గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడే సన్నబియ్యంతో భోజనం, మెరుగైన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఒకప్పుడు బస్తీలంటే నిరక్షరాస్యులు ఎక్కువగా వుండేవారు. కాని ఇప్పుడు ప్రతి ఇంటిలోని పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. గురుకులాలలో చదువుకుంటున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క పాఠశాల ఏర్పాటుకు అప్పటిపాలకులు సహకరించపోయేవారు. కాని కేసిఆర్‌ బస్తీ బస్తీకి స్కూల్‌ ఏర్పాటు చేశారు. గురుకులాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో విద్యా కుసుమాలు విరబూసేలా చేస్తున్నారు. అలాంటి జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రజలంత ముక్తకంఠంతో కేసిఆర్‌ పాలనకు జై కొడుతున్నారు. మాగంటి సునీతను గెలిపించుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్‌, బిజేపిలు ఎన్ని విన్యాసాలు చేసినా, ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించినా సరే కేసిఆర్‌ వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు అంటున్నారు. మాగంటి సునీతను గెలిపించి మా రుణం తీర్చుకుంటామంటున్నారు. కారు గుర్తుకు ఓటేస్తామంటున్నారు. కారే కావాలి, సారే రావాలంటూ ప్రజలే పాడుకుంటున్నారు. ప్రచారానికి వెళ్తున్న బిఆర్‌ఎస్‌ శ్రేణులను ప్రజలే స్వచ్చందగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. బస్తీలలోని ఇతరపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో పెద్దఎత్తున చేరుతున్నారు. బిఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నారు. కేసిఆర్‌కు జై కొడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version