మిలర్ల మధ్య సమన్వయం..సమస్యలు పరిష్కారం!

`మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ.

`నిజాయితీగా వ్యాపారం చేసుకోండి.

`బియ్యం తప్పు దారి పట్టకుండా వ్యాపారం చేసుకోవాలి.

`మిలర్లకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచన.

`ఈ విషయాన్ని నేటిధాత్రి కి స్వయంగా వివరించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

`సివిల్‌ సప్లై శాఖ మంత్రి ‘‘ఉత్తంకుమార్‌ రెడ్డి’’ తో ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

మంత్రి ‘‘ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి’’ కి ధన్యవాదాలు తెలిపిన ‘‘తెలంగాణ రైస్‌ మిల్లర్లు’’

`మంత్రి గారు పిలిచారు మాట్లాడారు అది చాలు మిలర్ల భావన.

`మంత్రి గారు సానుకూలంగా మా సమస్యలు విన్నారు సంతోషంగా వుంది.

`ముఖ్యంగా రా రైస్‌ మిలర్ల సమస్యలు విన్నవారు లేరు.

`పెద్ద మనసు చేసుకొని మొదటిసారి మంత్రి గారు విన్నారు.

`మాతో సమావేశం నిర్వహించారు

`పన్నెండేళ్లుగా రైస్‌ మిలర్ల గోడు విన్నవాళ్లు లేరు

`గత ప్రభుత్వం మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు.

`అప్పటి మంత్రులను ఎన్నిసార్లు కోరినా అవకాశం ఇవ్వలేదు.

`మొదటిసారి మా సమస్యలు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విన్నారు.

`మంత్రి గారికి ధన్యవాదములు తెలిపిన తెలంగాణ రైస్‌ మిల్లర్లు.

`కొంత మంది మిల్లర్ల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది.

`మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసిన మిల్లర్లు.

`తెలంగాణ రైస్‌ మిల్లర్ల తరుపున మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రతినిధులు

 

తెలంగాణలోని రైస్‌ మిల్లర్ల మధ్య సమన్వయం..సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కల సాకారమైంది. అది కూడా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చొరవ వల్ల సాధ్యమైంది. మిల్లర్ల సమావేశం తర్వాత మంత్రి నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేర్రదరావుతో ఈ సమావేశ వివరాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఈ బేటీ వల్ల మిల్లర్లకు ఇచ్చిన ఆదేశాలు, చేసిన సూచనలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎడిటర్‌ రాఘవేంద్రరావుకు వివరించారు. మంత్రి ఉత్తమ్‌తో సమావేశం మూలంగా మిల్లకు ఇంత కాలంగా లేన ఒక భరోసా కల్పించినట్లైంది. ఎంత కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్నట్లు వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఏర్పడిరది.ఉభయ వర్గాల మధ్య వున్న అపోహలు కొన్ని తొలగిపోయాయి. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి తెలంగాణలోని మిల్లర్ల అసోసియేషన్‌ నాయకుల మధ్య సమావేశం జరిగింది. అది కూడా ఆహ్లదకరమైన సందర్భంలో చోటు చేసుకున్నది. ఎందుకంటే ఇంత కాలం తెలంగాణలోని రెండు రకాల మిల్లర్లు ప్రభుత్వంతో చర్చల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే అప్పుడప్పుడు బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యూనియన్‌ నాయకులతోనే ప్రభుత్వం సమావేశమౌతూవుండేది. దాంతో రా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌లో ఓ వెలితి వుండేది. వారి సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా వుండేది. ఎందుకంటే రా రైస్‌ మిల్లర్ల సమస్యలు వేరు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల సమస్యలు వేరు. ప్రభుత్వాలు ఎంత సేపు బాయిల్డ్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులతోనే సంప్రదింపులు జరుపుతుండేవారు. వారు తమకున్న సమస్యలు అటు కమీషన్‌ర్‌కు, ప్రభుత్వ వర్గాలకు తెలియజేస్తూ వుండేవారు. కాని అక్కడ రా రైస్‌ మిల్లర్ల సమస్యలు ప్రస్తావనకు వచ్చేవి కాదు. తొలిసారి పన్నెండేళ్ల తర్వాత ఆ చొరవ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తీసుకున్నారు. దాంతో రెండు రకాల యూనియన్‌సభ్యులు మంత్రితో సమావేశమయ్యారు. వారికున్నసమస్యలు మంత్రికి వివరించారు. వారి సమస్యలు సానుకూలంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నారు. ప్రభుత్వం మిల్లర్లకు పూర్తి సహాకారం అందిస్తోంది. కాని కొంత మంది మిల్లర్లు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చారు. నీతిగా, న్యాయంగా, నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని మంత్రి మిల్లర్లకు సూచించారు. ఒక రకంగా ఆదేశించారు. సమస్యలు తెచ్చుకోవద్దు. సమస్యలు సృష్టించొద్దు. ప్రభుత్వాన్ని మోసం చేయొద్దన్న విషయాలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మిల్లర్లకు సూటిగా స్పష్టంగా చెప్పారు. తప్పులు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని కూడా మంత్రి మిల్లర్లను హెచ్చరించారు. మిల్లర్లకుఎలాంటి సమస్యలున్నా వినడానికి, తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా వుంటుందని కూడా మిల్లర్లకు మంత్రి మాట ఇచ్చారు. అయితే ఇది తొలి సమావేశం కావడంతో పూర్తి స్దాయి చర్చలు జరగలేదు. మిల్లర్లు వారి పూర్తి సమస్యలు చెప్పలేదు. మళ్లీ ఒకసారి సమావేశం ఏర్పాటుకు మంత్రి హమీ ఇచ్చారు. అందుకు అవసరమైన విదివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో మిల్లర్లలో సంతోషం నిండిరది. రెండు రకాలైన మిల్లర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాకముందు మిల్లులు తక్కువ. అందులోనూ రా రైస్‌ మిల్లులు చాలా తక్కువ. తెలంగాణలో ఉమ్మడిరాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌మిల్లులే ఎక్కువగా వుండేవి. దాంతో ఆది నుంచి వాటి ఆదిపత్యమే కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణలో పంటలు పుష్కలంగా పండడం మొదలైందో అప్పటి నుంచి తెలంగాణలో వందల్లో వున్న రా రైస్‌ మిల్లులు వేల సంఖ్యకు చేరాయి. పైగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పేదలందిరికీ రేషన్‌ కార్డు దారులకు సన్న బియ్యం అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులు సన్న బియ్యం పండిరచేందుకు పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ రైతులు పండిరచే వడ్లకు మద్దతు ధరను చెల్లిస్తూనే గత రెండు సంవత్సరాలుగా ప్రజా ప్రభుత్వం రైతులకు బోనస్‌ కూడా చెల్లిస్తోంది. దాంతో రైతులంతా సన్న బియ్యం పండిరచేందుకు ముందుకొచ్చారు. రికార్డు స్దాయిలో వడ్లు పండిస్తున్నారు. వాటిని తెలంగాణలోని రా రైస్‌ మిల్లుల ద్వారా ఆడిరచి పేదలందరికీ ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది. ఇలాంటి పరిస్దితులో మిల్లర్లు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి సరిపడా వడ్లు కేటాంపులు వంటి అనేక సమస్యలున్నాయి. వాటిని ప్రభుత్వం ముందు వుంచేందుకు గత ప్రభుత్వంలో ఎంతో ప్రయత్నం చేశారు. కాని ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్లను పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం రా రైస్‌ మిల్లర్ల సమస్యలు తీర్చేందుకు సిద్దంగా వుంది. ముందుగా వారితో ప్రభుత్వం సమావేశం కావడమే రా రైస్‌ మిల్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు కూడా మంత్రితో సమావేశం జరిగినందుకు వాళ్లుకూడా ఎంతో ఆనందంగా వున్నారు. గతంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఏ మంత్రి అవకాశమివ్వలేదు. కేవలం కమీషనర్‌కు తమ గోడును వెల్లబోసుకోవడం తప్ప మంత్రుల దర్శనం జరిగింది లేదు. వారితో సమావేశమైంది లేదు. వారి సమస్యలు నేరుగా మంత్రి దృష్టికి తెచ్చే పరిస్దితి ఎదురైంది లేదు. కాని ప్రజా ప్రభుత్వంలో నేరుగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో సమావేశం జరిగింది. అందుకు బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు, రా రైస్‌ మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా రెండు మిల్లర్ల మధ్య ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా సాగుతోంది. అందులో బాయిల్డ్‌ మిల్లర్ల యూనియన్‌ది పై చేయిగా వుంటోంది. గత ప్రభుత్వం కూడా వారికే ప్రాదాన్యతిస్తూ వెళ్లింది. కాని రా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ను గత ప్రభుత్వం ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు చెప్పే సమస్యలు తప్ప తమ సమస్యలు కనీసం కమీషనర్‌ కూడా చెప్పుకునే అవకాశం లేకుండాపోయింది. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు చెప్పే సమస్యలు రెండు రకాల మిల్లర్ల సమస్యలుగా ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. కాని ఈ రెండు రకాల మిల్లర్లకువుండే సమస్యలు వేరు వేరన్నది ప్రజా ప్రభుత్వం గుర్తించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమావేశంలో రెండు రకాల మిల్లర్లకు అవకాశం కల్పించారు. దాంతో ఎవరి సమస్యలు వారికి? ఎవరి కష్టాలు వారివి? అనేది తేలిపోయినట్లైంది. ఇకపై ఏక కాలంలో రెండు రకాల మిల్లింగ్‌ వ్యవస్ధలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అసవరం లేదని గుర్తించినట్లైంది. ఏ వర్గం సాదకబాధకాలు ఆ వర్గానికి చెందిన ప్రతినిధులు మాత్రమే ప్రభుత్వానికి విన్నవించుకునే వెసులుబాటు కల్పించినట్లైంది. అందుకు ప్రతి మిల్లర్‌ ప్రభుత్వానికి రుణపడి వుంటామంటూ మిల్లర్ల అసోయేషన్ల ప్రతినిధులు నేటిదాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్ర రావుతో చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version