`తృణమూల్ కాంగ్రెస్‌లో గుబులు
`వలస కార్మికులు ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం
`ఇదే జరిగితే తృణమూల్ భవిష్యత్తు అంధకారం
`సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీ
`బీజేపీ మాస్టర్ స్ట్రోక్‌తో తృణమూల్ విలవిల
డెస్క్,నేటిధాత్రి:
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున మార్పులు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయిచిన నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చివెలక్కాయపడిన చం దంగా మారింది. ప్రజాప్రాతినిధ్య చట్టం`1950లోని సెక్షన్ 20 కింద ఎన్నికల కమిషన్ ఈ చర్యకు ఉపక్రమించింది. దీని ప్రకారం దేశంలో ఒక ప్రాంతానికి చెందిన పౌరుడు మరో నగరం లో సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పుడు, తన స్వస్థలంలో సొంత ఇల్లు వున్నప్పటికీ, అతనికి ఓటుహక్కు ప్రస్తుతం జీవిస్తున్న నగరంలోనే వుంటుంది తప్ప తన సొంత వూర్లో వుండదు. దీన్నిఈ సెక్షన్ చాలా స్పష్టంగా పేర్కొంటున్నది. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాల్లో బ్లూకలర్ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వీరంతా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. 2011 జనగణన ప్రకారం ఈవిధంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పనిచేస్తున్న బెంగాలీల సంఖ్య కేవలం 24.1లక్షలు కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మూడుకోట్లు దాటిపోయి వుంటుందని అంచనా. అయితే ఇతర రాష్ట్రాల్లో వివిధ రకాల వృత్తుల్లో వైట్‌కాలర్ ఉ ద్యోగాల్లో వున్నవారి సంఖ్య ఇందులో చేర్చలేదు. ఇటువంటివారిలో ఓట్లకోసం బెంగాల్‌కు వ చ్చేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే సీఈఐసీ అనే ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన బెంగాలీల సంఖ్య 3.34కోట్లు! అయితే వెస్ట్ బెంగాల్ మైగ్రెంట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న వారి సంఖ్య 21.67లక్షలు మాత్రమే. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈవిధంగా వలసలు ప్రధానంగా ముర్షిరాబాద్, నాదియా, మాల్డా, బీర్‌భుమ్, 24పరగణాల జిల్లాలనుంచి చోటుచేసుకున్నాయి. ఇవన్నీ దాదాపుగా బంగ్లాదేశ్ సరిహద్దులో వుండే జిల్లాలు కావడంతో, ఇక్కడికి బంగ్లాదేశీయుల వలసలు అధి కం. బంగ్లాదేశీయులంటే 80శాతం వరకు ముస్లింలే. అయితే వీరెవరికీ పశ్చిమబెంగాల్‌లో జీవనోపాధికి అవకాశాలుండవు కనుక, రెండు మూడు నెలలపాటు ఈ జిల్లాల్లో వుండి తప్పుడు మార్గాల ద్వారా ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు సంపాదించి, వీటి ఆధారంతో ఇతర రాష్ట్రాలకు వలసపోతుండటం జరుగుతోంది. ఇటువంటివారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేది తృణ మూల్ కాంగ్రెస్ పార్టీనే. అంటే ఈ పార్టీ అధికారంలో వున్నంతవరకు తమ భద్రతకు ఢోకాలేదన్న అభిప్రాయం ఈ ముస్లింలలో వుంటుంది. ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రాంతాల్లో వుంటున్న ఈ బంగ్లాదేశీ ముస్లింలను, అసవరమైన ఖర్చులన్నీ పెట్టుకొని స్వరాష్ట్రానికి రప్పించి ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటోంది. అంతేకాదు, రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఓట్లు వేసేవారిని లేదా ఇతర పార్టీల కార్యకర్తలను బెదిరించడం, హింసకు పాల్పడటానికి కూడా వీరు గూండాలుగా పనికివస్తున్నారు. స్థానిక బెంగాలీ ముస్లింలు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కద్దు. కానీ ఆవిధంగా వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే బంగ్లాదేశ్ ముస్లింలకు జీవనోపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకతప్పదు. స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ లేదా సాధారణ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పెద్దఎత్తున తన ఓటర్ల సమీకరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్ వలస కార్మికులను (ముస్లింలు) వారి పేర్లు ఎక్కడ రిజిస్టరయి వున్నాయో తెలుసుకొని ఆయా ప్రాంతాలకు తరలిస్తుంది. ఆవిధంగా వారంతా తమకే ఓటువేసేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే సమయంలో ఇటువంటి ఓటర్లకు చార్జీలు పెట్టుకొని కొంత ముట్టచెబుతుండటంతో వీరంతా గంపగుత్తగా తృణమూల్ కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తున్నారు. నిజానికి అంతకుముందు వామపక్షాలు అధికారంలో వున్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి.
ఇప్పుడు ఎన్నికల సంఘం ఇటువంటి ఓటర్ల పేర్లను జాబితానుంచి తొలగిస్తే తృణమూల్ కాంగ్రెస్ పుట్టిమునగడం ఖాయం. బంగ్లాదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.5కోట్లు కాగా ముస్లిం ఓటర్లు 2.25కోట్లు.
ముస్లింఓటర్లు ప్రధానంగా రాష్ట్రంలోని 74 నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై వున్నా రు. మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో వుండటం గమనార్హం. ఇటువంటి నియోజకవర్గాల్లో వలస కార్మికుల ఓట్లను తొలగిస్తే ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ కాగలదు. దీనికితోడు పశ్చిమ బెంగాల్‌లో హిందువుల ఓట్లు సుసంఘటి తం కావడం ఇప్పటికే మొదలైంది. ఉదాహరణకు నాదియా జిల్లాలో ముస్లింల జనాభా 30శా తం. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన కాళి గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.48లక్షలు. వీరిలో ముస్లిం ఓటర్ల సంఖ్య 1.43లక్షలు. వీరిలో 43వేలమంది ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు కనుక వారు, ఈ ని యోజకవర్గానికి చెందిన సాధారణ పౌరులుగా పరిగణించబడరు. ఫలితంగా ఈ 43వేల ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తే, ఈ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు చాలా కష్టం కాగలదు. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, వలస కార్మి కుల పేర్లను తొలగించడం వల్ల రాష్ట్రం మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత ఏర్పడగలదు. 2021 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 45 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే మెజారిటీగా వుండటంతో, వీరి ఓట్లతోనే తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. విశేషమేంటంటే ఈ ని యోజకవర్గాల్లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులు గరిష్టగా 15వేల ఓట్ల తేడాతో ఓటమి చెందడం గమనార్హం. ఈ నేపథ్యంలో వలస ఓట్ల తొలగింపు బీజేపీకి ఎంతటి ప్రయోజనం కాగలదో ఆలో చించవచ్చు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ లక్షలాది బోగస్ ఓట్లను జాబితాలోకి చొ ప్పించడం మరో కారణం. ఎన్నికల సంఘం ఇటువంటి వాటిని కూడా విజయవంతంగా తొలగి స్తే, అప్పుడు నిజమైన ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోగలగుతారు. అయితే ఎన్నికల కమిషన్ కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు బిహార్‌లో కూడా ఈ ప్రక్రి యను మొదలుపెట్టింది. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేయనుంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎన్నికల సంఘం వీటికి తొలి ప్రాధాన్యతనిస్తోంది.
రాబోయే అనర్థాన్ని గుర్తించిన తృణమూల్ కాంగ్రెస్, తమ ఎంపి మొహువా మొయిత్రా ద్వారా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయించింది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను నిలుపు చేయాలన్నది ఈ పిటిషన్ సారాంశం. ఎన్నికల సంఘం ఓటర్ల నిరూపణకోసం పదకొండు డాక్యుమెంట్లు కోరింది. వీటిల్లో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేవు. ఎందుకంటే వీటిని విచ్చలవిడిగా దొంగతనంగా సృష్టిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతోఓ తృణమూల్ కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది. దీనివల్ల ఇప్పుడు వలస వెళ్లిన ముస్లిం కార్మి కుల ఓట్లన్నీ రద్దవుతాయి. మొత్తం ఓటుబ్యాంకు కుప్పకూలిపోతుంది. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్ యోచిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఒకవేళ కోర్టు ఎన్నికల సంఘానికి మద్దతుగా నిర్ణయాన్ని ప్రకటిస్తే ఏంచేయాలన్నది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులను తొలుస్తున్న ప్రశ్న! ఏవిధంగానైనా ఈ వలస కార్మికుల పేర్లను ఓటర్ల జాబితానుంచి తొలగించకుండా చూడాలన్న లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టుపై ఆశలు పెట్టుకుంది! మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి!