2005-2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

2005-2006 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

20 ఏండ్ల అనంతరం కలుసుకున్న క్లాస్ మేట్స్

తంగళ్లపల్లి టౌన్: (నేటిధాత్రి)

 

 

 

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005-2006 లో 10 వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం.చదివిన విద్యార్థులు 20 ఏండ్ల అనంతరం కలుసుకున్నారు. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు రాజి రెడ్డితో, రిటైర్డ్ ఎంఈఓ రామచంద్రరావు, ఉపాధ్యాయులు జలంధర్, రవీందర్,శ్రీధర్, లింగయ్య, బద్రుద్దీన్, శంకర్ నారాయణ, శంకరయ్య,పి.ఈ.టీ నర్సింగరావు,అంజనాదేవి ఉపాధ్యాయులను సత్కరించారు. 20 సంవత్సరాల తరువాత అనంతర పరిచయ వేదిక ఏర్పాటు చేసుకొని తాము చేస్తున్న ఉద్యోగాలు, తమ వృత్తులను పరిచయం చేసుకున్నారు. పలువురు సాప్ట్‌‌ వేర్లు, డాక్టర్లుగా, ఉపాధ్యాయలుగా, రాజకీయ నాయకులుగా స్థిరపడ్డారు.

కోర్ట్ ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.

ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

హన్మకొండ/వరంగల్: నేటిధాత్రి (లీగల్):-

 

 

 

 

హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతంబ మరియు హన్మకొండ జిల్లా ఇంచార్జి న్యాయమూర్తి బి.అపర్ణ దేవి పాల్గొని జెండా ఆవిష్కరించారు.
తదనంతరం ఇరువురు న్యాయమూర్తులు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తరువాత ఇరు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలస సుదీర్ మరియు పులి సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు, అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ మరియు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో తాము పాల్గన్న తీరును గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర అతి ముఖ్య మైనదని, ఉద్యమ ఆరంభం నుండి తెలంగాణ సిద్ధించే వరకు న్యాయవాదులు న్యాయపరమైన అంశాలతో ఉద్యమాన్ని నడిపించారని, న్యాయ వేదికలపై ఉచిత న్యాయపరమైన సేవలు అందిస్తు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, దీక్షలో, నిరసనలో పాల్గొంటూ ఉద్యమాన్ని నడిపిస్తూ, ప్రజలకు తెలంగాణ ఏర్పాటు ఎంత ముఖ్య మైనదో మరియు దాని అవశ్యకత గురించి ప్రజలకు తెలియజేస్తూ ముందు ఉండి, అన్యాయానికి ఎదురు నిలబడి, ప్రజాస్వామ్య విలువలకు బలాన్ని చేకూరుస్తూ నిలబడిన న్యాయవాదుల చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఒక మూలస్తంభంగా నిలుస్తుందని, భవిష్యత్తులోనూ ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయడంలో, చట్టాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించడంలో న్యాయవాదుల భూమిక మరింత గౌరవప్రదంగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పాల్గొన్న మధుర స్మృతులను న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒకరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఇట్టి కార్యక్రమంలో వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు డి.రమాకాంత్, కె. రవి, మరియు ఇరు బార్ అసోసియేషన్ల కమిటీ మెంబెర్స్, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జిపి మరియు ఏజీపిలు మరియు డిఓపి మరియు ఏపిపిలు, కోర్ట్ సిబంది పాల్గన్నారు.

ఘనంగా కొల్లూరులో 11వ తెలంగాణ ఆవిర్భావ ధీనోత్సవ వేడుకలు.

ఘనంగా కొల్లూరులో 11వ తెలంగాణ ఆవిర్భావ ధీనోత్సవ వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొల్లూరులో తెలంగాణ ఆవిర్భావ ధినోస్తవా వేడుకలను పంచాయతీ కార్యాలయం మరియు పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపిటిసి సి హెచ్ రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,యుత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,మాజీ వార్డ్ సభ్యులు ఎం విష్ణు,సామాజికవేత్త దంరాజ్ గౌడ్,ఫీల్డ్ అసిస్టెంట్ సి సుబాకర్,పాఠశాల ఉపాధ్యాయురాలు అక్షర,అంగన్‌వాడీ టీచర్ సంఘమణి, సి శకుంతల,సి నర్సిములు రిపోర్టర్,సి డేవిడ్,సతీష్ గౌడ్, సి ప్రకాష్, సి సంజీవులు, సాయి గౌడ్,దేవదాస్,నర్సిములు,అనిల్, గ్రామ పెద్దలు సి హెచ్ రాములు పంతులు,ఎం రాములు, ఎం బాలప్ప, లక్ష్మయ్య,సంగప్ప మరియు యువకులు,విద్యార్థులు పాల్గోని భారత దేశ త్రివరణ పథకాన్ని ఎగురవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి శుభకాంక్షలు తెలియజేసారు.

సంక్షేమ సారధి మంత్రి సీతక్క.

సంక్షేమ సారధి మంత్రి సీతక్క..

సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

మంగపేట నేటిధాత్రి:

సంక్షేమ సారధి దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే శ్రామికురాలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు సోమవారం ఆయన మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అనంతరం ఇందిరమ్మ గృహాల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జనారంజక పాలన కొనసాగిస్తుందని సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు వెనుకబడిన ములుగు జిల్లా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలతో ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు అనంతరం ఇందిరమ్మ పక్కా గృహాలు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆమని కారోబార్ శెట్టిపల్లి వెంకటేశ్వర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ మోయనుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి దూలిపాల బాలకృష్ణ లక్కీ వెంకన్న కటుకూరి శేషయ్య చెట్టుపల్లి పూలమ్మ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

వ్యవసాయ మార్కెట్ కమిటీ క్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ క్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురక్షరించుకొని

◆ జాతీయ పతాకాఆవిష్కరణ చేసినా

◆ జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ. సాయి చరణ్

◆ డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, ఏఎంసీ.డైరెక్టర్లు,కండేం.సుజాత,శేఖర్ ముదిరాజ్,అఖిల్,జఫ్ఫార్,శంకర్ పాటిల్ , అంజాద్ ,నర్సింలు, కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్, నయుంభాయ్, హగ్గెల్లి రాములన్న గారు, శుక్లవర్ధన్ రెడ్డి, మొయిజ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, INTUC (F) రాజ్ కుమార్ ,మరియు తదితరులు పాల్గొన్నారు.

గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్.

గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల సునీత-మహేందర్ గౌడ్ దంపతుల కుమారుడు వేముల సాయి చరణ్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) హన్మకొండ, వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గౌడ విద్యార్థుల ప్రతిభ పురస్కార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవార్డుకు వేముల సాయి చరణ్ గౌడ్ ఎంపికైనాడు. కాగా ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ లో నిర్వహించిన గౌడ ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో గోపా హన్మకొండ జిల్లా అధ్యక్షులు..కాకతీయ యూనివర్సిటీ ఈసీ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ దంపతులు, మరియు హన్మకొండ గోపా గౌరవ అధ్యక్షులు..గౌడ ప్రతిభా పురస్కార్ ప్రోగ్రాం కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు, మెమొంటో ఇచ్చి, ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సాయి చరణ్ గౌడ్ మాట్లాడారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు కష్టపడి చదువుతానన్నారు.

ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక.!

రాష్ట్రస్థాయి ప్రదర్శనకు రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా గారి ఎంపిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

హైదరాబాదులోని రాష్ట్రస్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై బెస్ట్ ప్రాక్టీస్ నిర్వహించే ఉత్తమ ప్రదర్శనకు న్యాల్ కల్ మండల రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపికైనట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు తెలిపారు.
వీరి ఎంపిక ఇంటర్వ్యూల ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర పర్సన్ గా ఉన్న కమిటీ జిల్లా నుండి నలుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది, అందులో ఒకరు సఫియా సుల్తానా ఇలా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 4వ తేదీన ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యాధికారులు మరియు మల్టీజ్జోన్ కి సంబంధించిన అన్ని జిల్లాల ఎంఈఓ మీటింగ్లో వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న న్యాల్ కల్ మండల విద్యాధికారి మారుతి రాథోడ్ అదేవిధంగా మండల ఉపాధ్యాయులు సఫియా సుల్తాన్ గారికి అభినందించారు.

అమరుల త్యాగాలు మరువలేనివి.

అమరుల త్యాగాలు మరువలేనివి

బాలానగర్  నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ ఉద్యమ సమయంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ సర్పంచ్ మాజీ అధ్యక్షులు సాటి శ్రీనివాస యాదవ్, వంగూరి యాదయ్య, జిల్లా బీజేవైఎం ఐటి సెల్ కన్వీనర్ జరుపుల గణేష్, మాజీ అధ్యక్షులు శ్రీశైలం, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమార్ నాయక్, శ్రీను, లక్ష్మయ్య, నాగేష్, సురేష్, శ్రీకాంత్, భరత్, చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నందు యాదవ్, ఆర్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు..

విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..

 

నేటిధాత్రి:

 

 

 

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి ఇంటర్ సిటీ ప్యాసింజర్ ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు జాన్సన్ సహా 8 మంది స్నేహితులు వచ్చారు.. మామండూరు జలపాతం చూసేందుకు వెళ్ళాలని అందరూ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అందరూ.. ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి జలపాతం వద్దకు వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు జాన్సన్.. ఆ సమయంలో హైటెన్షన్ తీగలను తాకాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు చేతికి తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై.. ఎగిరి రైలు పట్టాలపై పడ్డాడు.

విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డ జాన్సన్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. జాన్సన్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఈ ఘటనపై రేణిగుంటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోవనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబి ఎస్పీ రావుల గీరీదర్ మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు జరుపుకున్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  జెండా ఎగరవేశారు

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

నేటి ధాత్రి

 

 

 

 

 

గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.

ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ.

ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

 

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు.

తాను సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్‌‌ను ఐపీఎల్-2025 ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు అయ్యర్.

41 బంతుల్లో 87 పరుగుల కెప్టెన్సీ నాక్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు.

అటు ముంబైని ఫైనల్ చేర్చలేకపోయాడు సారథి హార్దిక్ పాండ్యా.

ఎంతగా పోరాడినా అతడి జట్టుకు విజయం దక్కలేదు.

ఈ తరుణంలో సంతోషంగా ఉన్న అయ్యర్‌తో పాటు ఓటమి బాధలో ఉన్న పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.

వారిద్దరి జీతాలను కట్ చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి..

బీసీసీఐ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

 

శ్రేయస్ అయ్యర్-హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించింది బీసీసీఐ.

ముంబై ఇన్నింగ్స్ సమయంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత టైమ్‌లో ఓవర్లు పూర్తి చేయలేదు.

దీంతో అయ్యర్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించింది బోర్డు.

అతడితో పాటు పంజాబ్ ఆటగాళ్లందరి జీతాల్లోనూ కోత విధించింది.

ఆ టీమ్ ప్లేయర్లు చెరో రూ.6 లక్షలు కట్టాలి లేకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి 25 శాతాన్ని జరిమానా కింద చెల్లించాలని బోర్డు ఆదేశించింది.

అటు ముంబై ఇండియన్స్ సారథి పాండ్యాకు రూ.30 లక్షల ఫైన్ వేసింది బీసీసీఐ.

స్లో ఓవర్ రేట్ కింద ఇతర ఎంఐ ప్లేయర్లు తలో రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 50 శాతం మొత్తాన్ని కట్టాలని స్పష్టం చేసింది.

రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ఏది తక్కువగా ఉంటే అది చెల్లించాలని బోర్డు తెలిపింది.

పునరాలోచన చేస్తారా..

జరిమానా ద్వారా పంజాబ్ గెలిచిన సంతోషాన్ని బీసీసీఐ ఆవిరి చేసినట్లయింది.

అటు ఓడిన ముంబైకి కూడా ఫైన్ విధించడం ద్వారా వాళ్ల బాధను రెట్టింపు చేసినట్లయింది.

అయితే కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకుంటున్న ప్లేయర్లకు ఈ జరిమానా చిన్న మొత్తంగానే చెప్పాలి.

కాగా, ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్‌ రేట్‌లు భారీగా నమోదయ్యాయి.

గతంలో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే జట్టు సారథికి జరిమానా విధించడమే గాక మ్యాచ్ బ్యాన్ కూడా వేసేది బీసీసీఐ.

కానీ ఈసారి నిషేధం ఎత్తేయడంతో కెప్టెన్లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బ్యాన్ చేయరనే ధీమాతో చాలా మ్యాచుల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు.

బౌలింగ్ మార్పులు-ఫీల్డింగ్ పొజిషన్స్ సెట్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు.

దీంతో మ్యాచులు ముగియడానికి అధిక సమయం పడుతోంది. మరి..

ఈ రూల్ విషయంలో తదుపరి సీజన్‌లో బీసీసీఐ పునరాలోచన చేస్తుందేమో చూడాలి.

 

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు.

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు

కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ ఇవ్వాలి

అసోసియేషన్ నిర్ణయించిన కిరాయి మాత్రమే చెల్లించాలి

ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్టగొడుతారా

నస్పూర్ (మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ తీగల్పాడు గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానుల పొట్ట కొట్టడానికి సిసిఐ గోదాం వాళ్లు తమిళనాడు,కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపియడం వల్ల మా లారీ యజమానుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని, మా లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ వాళ్లు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలరని పై అధికారులని వేడుకుంటున్నాము. ఈకార్యక్రమంలో కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా సురేష్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్, జనరల్ సెక్రెటరీ రాందేని రమేష్,జాయింట్ సెక్రటరీ అరికోళ్ల రమేష్,కల్చర్ సెక్రటరీ గుడికందుల తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి పవన్,క్యాషియర్ కటకం ప్రశాంత్ మరియు లారీ యజమానులు పాల్గొన్నారు.

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది! ఎప్పుడంటే

 

నేటి ధాత్రి:

 

 

 

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాశీ ఖ‌న్నా (Raashii Khanna), క‌న్న‌డ భామ‌ శ్రీనిధి షెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఎప్పుడో ఏడాది కింత మొద‌లైన ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్డేట్ ఇచ్చారు. అక్టోబ‌ర్‌17న సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా హీరో హీరోయున్లు వీడియో కాల్‌లో క‌నెక్ట్ అయి డిటెయిల్స్ చెబుతూ చేసిన వీడియో ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Telusu Kada

 

 

ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండ‌గా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే జాక్ డిజాస్ట‌ర్‌తో సిద్ధుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో ఇప్పుడు ఆయ‌న ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర సాధనలో మాజీ సీఎం కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి.

రాష్ట్రం సిద్ధించడంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి.

మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ సారధ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థుల పోరాటాలు సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరో దశబ్దాల కల సహకారం అయిందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ భారత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై పురుడుపోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి దారి చూపే దీప స్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ష చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, వైనాల వీరస్వామి, ఇంగ్లీశివాజీ, మాజీ సర్పంచులు నాన బోయిన రాజారాం యాదవ్, ఊరటి అమరేందర్ రెడ్డి, మామిండ్ల మోహన్ రెడ్డి, చీకటి ప్రకాష్, వెంకన్న, మాజీ ఎంపిటిసి జన్ను జయరావు, నాయకులు ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, ఆకుల సాంబారావ్, బోట్ల పవన్, బూస సదయ్య, గుండాల శ్రీశైలం, గుమ్మడి వేణు, పరికి కోర్నిల్, రాజు, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి.

జూన్ 4న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి

CITU పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బి.వై.నగర్ లోని కామ్రేడ్,అమృత్ లాల్ శుక్లా భవనంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెల రోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందని ఇంకా సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో దాదాపు 2200 మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉందని అధికారులను ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండవ విడత సబ్సిడీ డబ్బులు రాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారని సబ్సిడీ రావలసిన కార్మికులకు కాలయాపన చేయకుండా అధికారులు వెంటనే రేపటి వరకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.మొదటి విడత సబ్సిడీ వచ్చి నెల రోజులు అవుతున్న సబ్సిడీ రానీ కార్మికులకు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ , వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4 వ. తేదీ బుధవారం రోజున CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో సబ్సిడీ డబ్బులు రాని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ నాయకులు స్వర్గం శేఖర్,సందు పట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు.

వేములపల్లిలో తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …
గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్

మొగుళ్ళపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని వేములపల్లి బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిపారు గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారుప్రత్యేక తెలంగాణ అంశంపై 2017 శ్రీకృష్ణ కమిటీ ఎప్పటి ఆరు ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదనలు జూలై 2013 జూలై 31 తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది 2013 అక్టోబర్ 3న కేంద్రం మండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 13 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు లోకసభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొంది 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని ప్రవేశపెట్టింది 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించాక 2014 దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో తెలంగాణ సాధించారని ఉద్యమ సారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమేష్ ఎండి రహీం బండారి తిరుపతి బీసీ సంఘం అధ్యక్షులు భాష బోయిన శ్రీశైలం వికలాంగుల అధ్యక్షులు రమేష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్ లు బడుగు ఎల్లయ్య, మ్యాకల స్వామి, జక్కుల బాబు, కుంబాల రాజేశం, వేణుగోపాల్ రెడ్డి, కోట్ల మల్లేశం, మార్కెట్ సిబ్బంది, రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, సుమిత్ర సురేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ షఫీ, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహమూర్తి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మదర్ తెరిసా సమైక్య మండల కార్యాలయంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి, రైతు వేదిక వద్ద ఏవో బన్న రజిత, జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలాపించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో ముప్పు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు సబ్బండ వర్గాల త్యాగ ఫలితం తోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగిందని. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సూచనల మేరకు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు త్రివర్ణ పతాకం జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు తధానంతరం వారు మాట్లాడుతూ…
జూన్ 2 స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయిన రోజు
ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరిన రోజు
నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ నినాదం
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం
అలుపెరగని పోరాటాలతో సాధించిన అంతిమ విజయం
అసాధ్యభావనను, సుసాధ్యాం చేసిన శుభదినం స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం, అభివృద్ధితో విరాజిల్లుతున్న మన ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం..తెలంగాణ ప్రజల కాంక్షను తీర్చిన తల్లి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి,
కొత్తగూడ బ్లాక్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు,
బానోత్ విజయ రూప్సింగ్ ఎక్స్ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి.
పులుసం పుష్పలత ఎక్స్ జెడ్పిటిసి.
బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ మండల అధికార ప్రతినిధి.
బోయినేని ప్రశాంత్ రెడ్డి యూత్ మండల అధ్యక్షులు.
వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు.
నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు
సిరిగిరి సురేష్ మండల సోషల్ మీడియా.
కే దాసుప్రసాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు.
బోడ ఈరియా నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు.
కట్రోజు బిక్షపతి బీసీ సెల్ మండల నాయకులు.
శిరబోయిన సాయి
యాదగిరి కిరణ్.
మెకానిక్ కృష్ణ. జితేందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version