ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌…

ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌

ఇప్ప‌టికే గ‌త నెల‌లో బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ అంటూ వ‌రుస థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో వ‌చ్చి అల‌రించిన‌ ప్రామిసింగ్ యాక్టర్ నవీన్ చంద్ర న‌టించిన కొత్త చిత్రం షో టైమ్.

ఇప్ప‌టికే గ‌త నెల‌లో బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ అంటూ వ‌రుస థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో వ‌చ్చి అల‌రించిన‌ ప్రామిసింగ్ యాక్టర్ నవీన్ చంద్ర (Naveen Chandra) న‌టించిన కొత్త చిత్రం షో టైమ్ (Show Time). ఈ చిత్రం ఈ నెల (జూలై 4)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. కామాక్షి భాస్క‌ర్ల (Kamakshi Bhaskarla), న‌రేశ్ విజ‌య కృష్ణ (VK Naresh), రాజా ర‌వీంద్ర (Raja Ravindra) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్‌ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మదన్‌ దక్షిణామూర్తి ( Madhan Dakshinamurthy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖర్‌ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గ‌విరెడ్డి డైలాగ్స్‌ అందించారు.ఇప్పుడీ సినిమా రెండు వారాల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

సూర్య (నవీన చంద్ర), శ్రుతి (కామాక్షి భాస్కర్) (Kamakshi Bhaskarla) ఓ పాప‌తో కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. అయితే.. ఓ రోజు రాత్రి బిల్డింగ్ లోని ఫ్యామిలీస్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. అదే సమయంలో అటు పెట్రోలింగ్ కు వచ్చిన సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర), అతని అసిస్టెంట్‌కు.. సూర్యకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. సివిక్ సెన్స్ లేకుండా మిడ్ నైట్ పార్టీలు జరుపుకోవడంపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ మర్నాడు సూర్య కూతురు మెడలో గొలుసును ఒకడు లాక్కుపోతుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా అతను ప్రమాదవశాత్తు మ‌ర‌ణిస్తాడు. దాంతో అతని శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాస్తారు.

ఈ లోగా రాత్రి జరిగి రాద్ధాంతంతో పోలీసులు మరోసారి సూర్య ఇంటికి వ‌స్తారు. అదే సమయంలో సూర్య అత్తమామలు అక్కడికి బయలు దేరతారు. ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియక లాయర్ వరదరాజులు (నరేష్‌) సాయం కోరతాడు సూర్య. అనుకోకుండా చేసిన హత్య నుండి సూర్య బయట పడ్డాడా? సూర్య పై కక్ష కట్టిన పోలీసులు అతన్ని ఎలాంటి వేదింపులకు గురిచేశారు? సరదాగా స్నేహితులతో జరుపుకునే మిడ్ నైట్ పార్టీతో సూర్య ఎదుర్కొన్న ఇబ్బందులేమిటీ? వీటి నుండి అతను ఎలా బయట పడ్డాడు? అనేది మిగతా కథ.

ఒకటి రెండు రోజుల్లో జరిగే కథ నేప‌థ్యంలో ఈ సినిమాలో.. థ్రిల్లర్ స్టోరీని వీలైంత వినోద ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రథమార్థం నిదానంగా సాగడం కాస్త‌ బోర్ కొట్టించినా క్లయిమాక్స్ దగ్గరకు వచ్చేసరికి మంచి స‌స్పెన్స్ తో సీటులో కూర్చోబెడ‌తారు. ఒక చిన్న పొరపాటు జరిగినా.. మధ్య తరగతి మనుషులు ఎలా తడబడిపోతారు, భయపడిపోతారు అనే దాన్ని బాగా చూపించారు. మాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఇప్పుడీ సినిమా రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే ఓటీటీల్లో కాకుండా స‌న్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. మంచి థ్రిల‌ర్ కావాల‌నుకునే వారికి ఈ షో టైమ్ (Show Time) చిత్రం మంచి కిక్ ఇస్తుంది.

తీన్మార్ మల్లన్నను పరామర్శించిన జ్యోతి పండాల్..

తీన్మార్ మల్లన్నను పరామర్శించిన జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈనెల 12 వ తేదీన తీన్మార్ మల్లన్న గారు మన ప్రాంతానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే, ఆ సభలో కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడారని, 13వ తేదీన తీన్మార్ మల్లన్న కార్యాలయం పై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దాడి జరిగినందుకు యావత్తు తెలంగాణ బీసీ నాయకులు మరియు తీన్మార్ మల్లన్న టీమ్ మెంబర్స్ అందరు కూడా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో తీన్మార్ మల్లన్న గారి చేతికి గాయాలవ్వడం జరిగింది, కావున, ఈరోజు హైదరాబాద్ లో వారి కార్యాలయంలో జ్యోతి పండాల్ మరియు పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు కలిసి తీన్మార్ మల్లన్నను పరామర్శించడం జరిగింది.

మూడు సంవత్సరాల తర్వాత అమ్మ ఒడికి.

మూడు సంవత్సరాల తర్వాత అమ్మ ఒడికి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

ఇంటి నుండి తప్పిపోయిన మూడు సంవత్సరాల పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన మందమర్రి బ్లూ కోల్ట్ పోలీసులు

పచ్చిక రాజు, పచ్చిక జమున సి ఎస్ ఐ చర్చి, మందమర్రి మార్కెట్ లో గల వారి కుమార్తె మూడు సంవత్సరాల ఆరాధ్య వాళ్ళ అమ్మగారు ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటి ముందర ఆడుకుంటూ, తప్పిపోయి మందమర్రి మార్కెట్ లోని సాయిబాబా గుడి వద్దకు రాగా పాపను గమనించిన స్థానికులు పాపా వివరాలు తెలుసుకోనగా పాప వివరాలు తెలుపకపోయేసరికి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేయగా బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు చిరంజీవి, శ్రీనివాస్ లు పాప యొక్క తల్లిదండ్రుల గురించి చుట్టుపక్కల ఏరియాలలో వేతగా ఎలాంటి ఫలితం లేకపోయేసరికి, మందమర్రి ఎస్సై ఆదేశాల మేరకు పాప యొక్క ఫోటోను సోషల్ మీడియాలో స్థానిక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయగా, పాప తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ కు రాగా, ఆరాధ్యను వాళ్ళ తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది.

విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు..

విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..

 

నేటిధాత్రి:

 

 

 

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి ఇంటర్ సిటీ ప్యాసింజర్ ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు జాన్సన్ సహా 8 మంది స్నేహితులు వచ్చారు.. మామండూరు జలపాతం చూసేందుకు వెళ్ళాలని అందరూ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అందరూ.. ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి జలపాతం వద్దకు వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు జాన్సన్.. ఆ సమయంలో హైటెన్షన్ తీగలను తాకాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు చేతికి తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై.. ఎగిరి రైలు పట్టాలపై పడ్డాడు.

విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డ జాన్సన్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. జాన్సన్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఈ ఘటనపై రేణిగుంటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version