ఏండ్లు మారిన రైతుల గోస మారదా?

యువరైతు హరీష్ వర్మ అప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు

వీణవంక,( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలోని గ్రామాలలో వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక గింజ కొనుగోలు చేయలేదని ఓ పక్క వాతావరణ శాఖ వర్షం సూచనలు ఉన్నాయని రైతులను తొందర పెడుతుంటే పండించిన పంటను ఎలా అమ్మాలో తెలియక తికమక పడుతుంటే ఇదే అదునుగా మిల్లర్ల యజమాన్యాలు వడ్ల కొనుగోలు ప్రారంభించి 1800 క్వింటాల్ చొప్పున పచ్చి వడ్ల కింద లెక్క కడుతూ ఒక ట్రాక్టర్ ట్రిప్పులోడికి 25 నుండి 30 కిలోలు కట్టింగ్ చేస్తూ మరియు నూటికి రూపాయి చొప్పున క్యాష్ కటింగ్ చేస్తూ రైతులను తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని పండించిన పంటకు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ దాని ఉసే లేదని ఎన్ని ప్రభుత్వాలు మారిన రైతుల గోస మారడం లేదని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బోనస్ ఇస్తానని మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని రైతు దేశంగా కొనియాడే భారత దేశంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బిజెపిని గద్దె దించాలని రైతులంతా ఏకం కావాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *