దొంగతనాలకు పాల్పడు తున్న వ్యక్తులు అరెస్ట్

నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బంది*

శాయంపేట నేటి ధాత్రి:

వరంగల్ మరియు హైదరాబాద్ లో మోటారు బైకులు చోరీకి పాల్పడిన ముక్కెర.జాన్ విల్సన్ ,సాయి చరణ్,.భూక్యా. ఆజాద్ ముక్కెర. అవినాష్ మేకల. హరికృష్ణ వసంతాపూర్ అనే వ్యక్తులను శాయంపేట పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4 బైకులు స్వా ధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు .పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వసంతపూర్ గ్రామానికి చెందిన ముక్కెర.సాయి చరణ్ అనే వ్యక్తి గత కొంతకాలం నుండి హైదరాబాదులోని బోడుప్పల్ లో ఉంటున్నాడు.ఆఏరియాలో నివాసం ఉండే భూక్య ఆజాద్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సినిమాలకు షికార్లకు వెళ్తూ జలుసాలు చేస్తూ విలాసంతమైన జీవితం గడిపే వాళ్ళు. జల్సాలకు డబ్బులు లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఇంటి ముందు ఉన్న బండ్లను దొంగలించి ఎవరికి అనుమానం రాకుండా వరంగల్ జిల్లా శాయంపేట మండలం వసంతపూర్ గ్రామంలో ఉన్న వారి బంధువులైన అవినాష్, హరికృష్ణ లకి దొంగలించిన బండ్లను ఇచ్చి వారితో ఇతరులకు అమ్మిపించి అట్టి డబ్బులు వాడుకునేవారు. ఇలా బోడుప్పల్ ప్రాంతం నుండి ఒక స్కూటీ, హోండా షైన్, పల్సర్ బైకులని చోరీ చేయగా శాయంపేట మండలం నుండి ఒక స్కూటీని దొంగ తనంచేసినట్లు చెప్పారు .వీరు నెలలో మొత్తం 4 బైకులు చోరీ చేసినట్లు వివరించారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన శాయంపేట ఎస్సై ప్రమోద్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ సాధన్, ఖలీద్, నరేష్ పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ,సీఐ రంజిత్ రావు ప్రత్యేకoగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *