కారు..కాంగ్రెస్‌.. మధ్య కమలం!

https://epaper.netidhatri.com/view/256/netidhathri-e-paper-7th-may-2024%09/4

`కారు జోరు ఓట్లు తెచ్చేనా?

`హస్తవాసినే ఆదరిస్తారా?

`కమలం నలిగేనా! వికసించేనా!!

`రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు!

`కొన్ని చోట్ల మూడిరటి పోటీ.

`అటు రేవంత్‌ రెడ్డి ముమ్మర ప్రచారం.

`ఇటు కేసీఆర్‌ విపరీత ప్రచారం.

`బిజేపి ఆశలు కూడా కొన్ని సజీవం.

`కేసీఆర్‌ సభలకు అపూర్వ స్పందన.

`కేసీఆర్‌ రాకతో పెరిగిన కాక.

`రోడ్‌ షోలకు పోటెత్తున్న జనం.

`రేవంత్‌ సభలకు అంతే తండోపతండాలుగా జనం.

`రేవంత్‌ కేసీఆర్‌ పై మళ్ళీ పై చేయి సాధిస్తాడా!

`రేవంత్‌ ను ఓడిరచి కేసిఆర్‌ ఉనికి కాపాడుకుంటాడా!

`జనం మాటేమిటి!

`పార్టీలపై ప్రజల స్పందనేమిటి!

`పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ ఓటరు మదిలో ఏముంది!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల గడువుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్ధాయిలో జరుగుతోంది. అటు జాతీయ పార్టీలు, వారి అగ్ర నాయకులు , ఇటు బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, హరీష్‌రావులు కాలుకు బలపం కట్టుకోకుండా ప్రచారం సాగిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు అయిపోయిన మూడు నెలల్లోనే మళ్లీ ఎన్నికల వాతావరణం రావడం వల్ల ప్రజలు ఎటు వైపు మొగ్గుతారన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఎవరి లెక్కలు వారికి వున్నాయి. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. కాని ప్రజలు ఎవరు అంచనాలకు అందడం లేదు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎన్నుకొని ప్రజలు మోసపోయారని బిఆర్‌ఎస్‌ విసృతంగా ప్రచారం సాగిస్తోంది. పదేళ్లుగా తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుతిన్నదని కాంగ్రెస్‌ ఆరోపణలు సాగిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే మాటలు ప్రజలకు పదే పదే చెప్పి, ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టింది. దాంతో ప్రజలు చాల తొందరగా కాంగ్రెస్‌ పథకాలకు ఆకర్షితులయ్యారు. విపరీతమైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలు ఆ పార్టీని నమ్మడానికి ముందూ వెనుకాడుతుంటారు. అందులోనూ కాళేశ్వరం కథను కాంగ్రెస్‌ వాళ్లు, మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వచ్చారు. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ పార్టీ పాటించిన మౌనం కూడా కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఎందుకంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. అదే కాంగ్రెస్‌ గెలుపుకు ఉపయోగపడిరది. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ చెప్పడానికి పెద్దగా ధైర్యం చేయడం లేదు. మూడు నెలల్లోనే తెలంగాణకు కరువొచ్చింది. అది తెచ్చిన కరువు అంటూ బిఆర్‌ఎస్‌ వాదించింది. కాదు వర్షాభావ పరిస్ధితులే కారణమని కాంగ్రెస్‌ అంటోంది. ఇప్పుడు అసలైన రాజకీయం ఈ ఎన్నికల్లో వుంటుంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ చెప్పిన మాటలే వింటే మాత్రం భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌కు తెలంగాణలో నూకలు చెల్లినట్లే…కాంగ్రెస్‌ చెప్పింది అబద్దమని…తాము నమ్మి మోసపోయామని గ్రహించి బిఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు కట్టబెడితే మాత్రం కాంగ్రెస్‌కు ఇక ఐదేళ్లు కష్టకాలమే..రేవంత్‌ ప్రభుత్వానికి దిన దిన గండమే..ఇక బిఆర్‌ఎస్‌ నాయకులు ఆగరు. బిఆర్‌ఎస్‌ పెద్దలు అసలే ఆగరు. నిత్యం ఏదో ఒక వివాదం రాజేస్తారు. ప్రజలకు మరింత దగ్గరౌతారు. ఎందుకంటే తెలంగాణలో నీళ్లు, కరంటు ఎంతో కీలకం. తెలంగాణలో సాగు సాగాలంటే నీరు కావాలి. కరంటు తప్పకుండా కావాలి. ఈ రెండు లేకుండా సాగు అసాధ్యం. అందుకే తెలంగాణలో ఈ ఎన్నికలకు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో సాగినంత జోరుగా, జోష్‌గా ఎక్కడా ఎన్నికల ప్రచారాలు సాగడం లేదు.

దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కోలాహాలం వున్నప్పటికీ తెలంగాణలో సాగుతున్నంత ప్రచారం ఎక్కడా సాగడం లేదనే చెప్పాలి. మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. ఏ పార్టీ వెనకడుగు వేయడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్యనే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. కొన్ని కీలకమైన స్దానాల్లో బిజేపి కూడా తన బలం చూపించే అవకాశం వుంది. కాని తెలంగాణలో బిజేపి పైకి జరుగుతున్న ప్రచారమంత లేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను కాదనుకుంటే ఆ ఓట్లు, సీట్లు బిజేపికి వెళ్లొచ్చు. కాని బిఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. పైగా రైతులు, సామాన్యుల ఓటు తోడయ్యే అవకాశం వుంది. దాంతో మెజార్టీ సీట్లు బిఆర్‌ఎస్‌కు వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. మాకు పద్నాలుగుసీట్లు వాస్తాయని కాంగ్రెస్‌. మాకు పది సీట్లకు పైగా వస్తాయని బిజేపి చెబుతున్న మాటల్లో నిజంలేదు. కాని ఇక్కడ బిఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను ఆ రెండు జాతీయ పార్టీలు గమనించడం లేదు. అతివిశ్వాసంతో బిఆర్‌ఎస్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదు. అది ఆ రెండు పార్టీలకు గండాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. కాకపోతే పూర్తి స్దాయిగా ప్రజల నాడి కూడా ఏ పార్టీకి అంతు చిక్కడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రచారం ముందుకొస్తుందో అన్న సందేహం అన్ని పార్టీలలోనూ వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఇక కాంగ్రెస్‌కు ఎదరులేదు. పార్లమెంటు ఎన్నికల్లో తిరుగుండదు అని అందరూ అనుకున్నారు. రెండు నెలులు గడిచిన తర్వాత రాష్ట్రంలో బిజేపి పుంజుకుంటుందన్న సంకేతాలు వెలువడ్డాయి. బిఆర్‌ఎస్‌ పూర్తిగా చతికిల పడినట్లే అన్న భావనే సర్వత్రా వ్యక్తమైంది. కాని ఇప్పుడున్న పరిస్ధితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజేపిలను దాటుకొని బిఆర్‌ఎస్‌ పరుగులో ముందుకు వెళ్తుందన్న మాటలు విని పిస్తున్నాయి. సైలెంటు ఓటింగ్‌ జరిగే అవకాశం వుందన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం వున్నాయి. కేంద్రంలో పదేళ్లపాటు అదికారంలో వున్న బిజేపి తెలంగాణకు పెద్దగా చేసిందేమీ లేదన్నది తెలియంది కాదు. కాకపోతే ఇటీవల కొంత బిజేపి బలం పెరిగిందన్న వాదనలు వున్నాయి. సరిగ్గా శాసన సభ ఎన్నికలకు ముందు రెండేళ్లుగా తెలంగాణలో బిజేపి ఊపు మీద కనిపించింది.

శాసన ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు బిజేపి చతికిలపడిరది.

ఒక దశలో తెలంగాణలో కాంగ్రెస్‌ కన్నా ముందంజలో వున్నదనుకున్న బిజేపి, కర్నాటక ఎన్నికలతో ఒక్కసారి వెనక్కి వెళ్లింది. మూడో స్ధానంలో వున్న కాంగ్రెస్‌ మొదటి స్దానానికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఏస్దానానికి వెళ్తుందనేదానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. గత ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మీద నిజంగానే ప్రజల్లో వ్యతిరేక వుందా? అన్ని ఎన్నికలు జరిగితే గాని అర్ధం కాకపోవచ్చు. ఎవరు చెప్పే లెక్కలు వారికున్నా, జనం లెక్కలు జనానికేవ వుంటాయి. వాటిని అన్ని సార్లు పసిగట్టలేపోవచ్చు. అధికారంలో వున్న కాంగ్రెస్‌ను పైకి నిందించకపోవచ్చు. ఎన్నికల్లో ఓటుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఆ పార్టీ ప్రభుత్వం మెరుగ్గా వుందని అనుకోవచ్చు. అదే రెండో స్దానానికో, మూడో స్ధానానికో పరిమితమైతే పాలన బాగలేదన్నది అర్ధం చేసుకోవచ్చు. గత రెండు నెలల క్రితం వరకు బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న వాళ్లే ఇప్పుడు కేసిఆర్‌ సభలు చూసి ఆశ్యర్యపోతున్నారు. కేసిఆర్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అంటున్నారు. కేసిఆర్‌ ఎక్కడికెళ్లినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. వచ్చిన వాళ్లు ఓట్లేస్తారా ? లేదా? అన్నది తర్వాత సంగతి. కాని ఇప్పటీకీ కేసిఆర్‌పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లలేదనే అనిపిస్తోంది. లేకుంటే అంత మంది జనం రారు. ఎంత తీసుకొచ్చినా రోడ్‌షోలకు అంత మంది ఎగబడడం జరగదు. రాత్రి వేళల్లో కూడా కేసిఆర్‌ కోసం ఎదరుచూడరు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కేసిఆర్‌ రోడ్‌షోలు సక్సెస్‌ కావడం అన్నది రాజకీయాల్లో మార్పులకు సంకేతమనే చెప్పాలి. కేసిఆర్‌ రోడ్‌షోలతో కారు పరుగులు పెట్టడానికి సిద్దంగా వుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పల్లె జనం అంతా కాంగ్రెస్‌కు సై అన్నారు. ఆ పార్టీని గెలిపించారు. కాని వచ్చీ రావడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం మూలంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. కారణాలు ఏవైనా కావొచ్చు. ఉద్యోగాల విషయంలో యువత కాంగ్రెస్‌ వైపు చూసింది. చాలా వరకు సబ్బండ వర్గాలన్నీ కాంగ్రెస్‌ను ఎంచుకున్నాయి. కాని అవే సబ్బండ వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ చేసిన పొరపాటు ఏమీలేకపోయినా, అపవాదు మోసే పరిస్దితి కనిపిస్తోంది. అసలు వెంటనే పార్లమెంటు ఎన్నికలు రావడం కూడా కాంగ్రెస్‌కు ఆశనిపాతమైందని అంటున్నారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ అడుగులు ముందుకు పడడలేదు. మూడు నెలలు గడవకముందే ఎన్నికల కోడ్‌ రావడం కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది కరమైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. కాళేశ్వరం వల్ల తెలంగాణకు సాగు నీరందలేదనేది కాంగ్రెస్‌ వాదన. మరి కాళేశ్వరం లేకుండా నీళ్లెందుకు రైతులకు ఇవ్వలేదనేది బిఆర్‌ఎస్‌ వాదన.

ఈ రెండిరటిలో రైతులు, ప్రజలు కాంగ్రెస్‌ను నిందించే పరిస్ధితి ఎదురౌతోంది.

కాంగ్రెస్‌ను నమ్మి, బిఆర్‌ఎస్‌కు ఓటు వేయని రైతాంగం కూడా ఇప్పుడు మళ్లీ కేసిఆర్‌ రావాలి. కావాలి అని కోరుకుంటున్న సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్‌ కాళేశ్వరం నిర్మాణం చేయడానికి ముందే తెలంగానలోని చెరువులన్నీ బాగు చేశాడు. వాటిని నీటితో నింపాడు. అందుకు కారణం దేవాదుల. ఆ దేవాదుల నిర్మాణం జరిగింది కాంగ్రెస్‌ హాయాంలోనే..కాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దేవాదులను పూర్తి స్ధాయిలో వినియోగించుకుంటే రైతులకు కష్టం వచ్చేది కాదు. రైతులు కేసిఆర్‌ను గుర్తుంచుకునేవారు కాదు. పంటలు కొన్ని ప్రాంతాల్లో ఎండిపోవడం వల్ల కూడా రైతులు కేసిఆర్‌ను కోరుకుంటున్నారు. కేసిఆర్‌ రోడ్‌ షోలకు పెద్దఎత్తును ప్రజలు హజరౌతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలకు కూడా ప్రజలు బాగానే వస్తున్నారు. కాని శాసన సభ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డికి వచ్చిన జనం వేరు..ఇప్పుడు వస్తున్న జనం వేరు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్‌షోలకు స్వచ్చంధంగా వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ సభలకు పార్టీ తరలిస్తే వస్తున్నారు. అప్పుడు కేసిఆర్‌ సభలకు పార్టీ తరలిస్తే వచ్చారు. ఇప్పుడు కేసిఆర్‌ రోడ్‌షోలకు ప్రజలు స్వచ్చందంగా హజరౌతున్నారు. అంటే పరిస్ధితులు మారిపోతున్నాయని చెప్పకతప్పదు. ఇంకా సరిగ్గా ఎన్నికలకు కేవలం ఏడు రోజుల సమయమే వుంది.

ప్రధాని మోడీ కూడా తెలంగాణ ఎన్నికల మీద ప్రత్యేక శ్రద్దపెట్టినట్లు చెప్పుకుంటున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ కూడా తెలతంగాణలో పెద్దఎత్తున రోడ్‌షోలు ప్లాన్‌ చేసుకున్నారు. మోడీ తెలంగాణకు వస్తే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందనుకున్నారు. కాని ఎక్కడా మోడీ ప్రభావం కనిపించిండం లేదు. ఇదిలా వుంటే ఒక్కసారిగా కేసిఆర్‌ రోడ్‌షోలను ప్లాన్‌ చేయడంతో జనమంతా కమలాన్ని చూడడం మర్చిపోయినట్లున్నారు. కేసిఆర్‌ రోడ్డెక్కిన తర్వాత మోడీ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత కనిపిండచం లేదు. పైగా అటు కాంగ్రెస్‌, ఇటు బిఆర్‌ఎస్‌ లు హోరాహోరీగా తలపడే పరిస్ధితులు వున్నాయి. కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లు రాకపోతే, ఐదు నెలలకే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లౌవుంది. కేసిఆర్‌ మాటకు విలువ పెరుగుతుంది. కారుకు బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌లో లుకలుకలకు కారణమౌతుంది. అదే బిఆర్‌ఎస్‌ మెజార్టీ సీట్లు సాధిస్తే కాంగ్రెస్‌ను మరింత నష్టం చేకూరుతుంది. అందవల్ల కాంగ్రెస్‌కు మెజార్టీసీట్లు రావాలి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిలదొక్కుకోవాలన్నా, బిఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్ధం కావాలన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావాలి. ఇందులో ఏ మాత్రం బిజేపికి మెజార్టీ సీట్లు వచ్చినా తొలి ప్రమాదం కాంగ్రెస్‌ పార్టీకే ఎదురౌతుంది. తర్వాత బిఆర్‌ఎస్‌ ఉనికి ప్రమాదంలో పడుతుంది. అందుకే బిజేపికి కన్నా కారు, కాంగ్రెస్‌లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదే తరుణంలో బిజేపి కూడా ఏమీ వెనుకబడి పోలేదు. కాని ప్రజల తీర్పు ఎలా వుంటుందన్న అంచనాలు అందడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *