పిసిసి పీఠంపై పీటముడి?

`అద్దంకికి అవకాశం వచ్చేనా!

`మళ్ళీ అడ్డపడతారా!

`అద్దంకి పెత్తనం అంగీకరిస్తారా!

`సీతక్కకు ఇస్తారా?

`మంత్రిగా కూడా కొనసాగిస్తారా?

`జగ్గారెడ్డి ఊరుకుంటాడా!

`తన కల నిజం చేసుకుంటాడా?

`హనుమంతన్నకు మరోసారి అవకాశం వచ్చేనా!

`సిఎం. చెప్పిన వారికిస్తారా!

`సామాజిక న్యాయం పాటిస్తారా?

`మాదిగలకు ప్రాధాన్యతనిస్తారా?

`బిసిని పిసిసి చేస్తారా!

`అందరూ హేమా..హేమీలే!

`ఎంపిక కొంచెం కష్టమే.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ కొత్తపిసిసి సారధి ఎవరు? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మొదలైన చర్చ. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ రచ్చ మొదలైంది. గత సంప్రదాయాలకు అనుగుణంగా అధిష్టానం పిపిసిని ప్రకటిస్తుందా? లేక కొత్త ఫార్ములా అనుసరిస్తుందా? అన్నదానిపై కూడా విసృతంగా చర్చ జరుగుతోంది. గతంలో వున్న పరిస్ధితులు వేరు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అడిరది ఆట, పాడిరది పాటగా వుండేది. అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను జాతీయ నాయకులు తోలు బొమ్మల్లా ఆడిరచేవారు. ఎందుకంటే అప్పట్లో బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే. బిజేపి ఎంత పెరిగినా సరిగ్గా పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌కు పూర్తి స్దాయి ప్రత్యామ్నాయం కాదు. కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ఫార్టీ తారుమారైంది. గతంలో బిజేపికి వున్న బలం కూడా ఇప్పుడు జాతీయ స్ధాయిలో కాంగ్రెస్‌కు లేదు. రాష్ట్ర స్ధాయి నాయకుల బెదిరింపులు కూడా పనిచేస్తున్నాయి. అప్పట్లో ఏ నాయకుడైనా తోక జాడిస్తే కత్తిరించే వాళ్లు. ఇప్పుడు తోక జాడిరచేవారికే ప్రాధాన్యతనిస్తున్నారు. సరిగ్గా ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు కేంద్రం నుంచి ఎవరు పంపిస్తే వాళ్లే పిసిసి. అధ్యక్షుడు. అలా వచ్చిన వారిలో కేశవరావు, ఎం. సత్యనారాయణ లాంటి వాళ్లున్నారు. ఎం. సత్యనారాయణ పిపిసి. అధ్యక్షుడు అయ్యేదాకా చాలా మందికి తెలియదు. అలా సీల్డ్‌ కవర్‌లో వచ్చేవారు. పైగా రాష్ట్రంలో రెండు మూడు గ్రూపులను కాంగ్రెస్‌ అదిష్టామనే ప్రోత్సహించేది. కాంగ్రెస్‌ను రెండు, మూడు గ్రూపులుగా విభజించి ప్రోత్సహిస్తూ వుండేది. దాంతో రాష్ట్రంలో వాళ్లంతా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు. అలా రాజకీయాల్లో కాంగ్రెస్‌ తప్ప మరో చర్చ వుండకపోయేది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిఎల్పీ నాయకుడగా వున్నప్పుడు ఆయనకు ప్రధాన పోటీదారు లాంటి డి. శ్రీనివాస్‌ను పిసిసి. అధ్యక్షుడిని చేశారు. ఇలా రెండు స్ట్రాంగ్‌ గ్రూపులు వుండేవి. కాని ఇప్పుడు ఆ పరిస్ధితి వుండదు. అసలు దేశంలోనే కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మరింత పడిపోతూ వస్తోంది. ఒకవేళ కేంద్రంలో ఈసారి కాంగ్రెస్‌ పవర్‌ పెరిగితే , రాష్ట్ర నాయకులు చెప్పినట్లే డిల్లీ పెద్దలు వినాల్సివస్తుంది. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించిన వ్యక్తికే పిపిసి వస్తుందా? లేక ఇతర నాయకుల ఒత్తిడితో మరో శిభిరం ఏర్పాటౌతుందా? అన్నది త్వరలోనే తేలిపోనున్నది. అయితే ఆశావహులు మాత్రం చాలా మంది వున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోడు పదవులను నిర్వహిస్తున్నారు.
ఇక పాలనపై పూర్తి స్ధాయి దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది.
అంతే కాకుండా పార్టీని పటిష్టం చేయాల్సివుంది. అందువల్ల అటు పాలన, ఇటు పార్టీ రెండు ఏక కాలంలో చూసుకోవడం కుదరదు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజలు కూడా రేవంత్‌ సర్కార్‌ మీద పెద్దఎత్తున ఆశలుపెట్టుకున్నారు. ఇక జూన్‌ నెలలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ గట్కెక్కాంటే, మెజార్టీ స్ధానిక సంస్ధలను దక్కించుకోవాలంటే పార్టీ మరింత బలోపేతం కావడం ఎంతో ముఖ్యం. అందువల్ల ఎంత త్వరగా పిసిసి పీట ముడి వీడితే పార్టీకి అంత మేలు. పిపిసి. అధ్యక్షపదవి, సిఎల్పీ అనేది పార్టీకి జోడెద్దుల లాంటి పదవులు. ఈ రెండు పదవులు ఎంత సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం సజావుగా సాగుతుంది. పార్టీ కూడా పటిష్టంగా వుంటుంది. అందువల్ల పిసిసి. అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్నదానిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. సహజంగా ముఖ్యమంత్రి ఎవరు వుంటే వారికి అనుకూలమైన వ్యక్తినే పిపిసి. అధ్యక్షుడిని చేస్తేనే పార్టీ, ప్రభుత్వం రెండూ మనుగడ సాగిస్తాయి. లేకుంటే లుకలుకలు మొదలౌతాయి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత సోదరిగా భావించే సీతక్కను పిసిసి అధ్యక్షపదవికి ఎంపిక చేసే అవకాశం వుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఇప్పటికే మంత్రిగా వున్నారు. అయినా పిసిసి. పదవి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం వుండకపోవచ్చు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ రెండు పదవులు నిర్వహించారు. అలాగే ఇప్పుడు కూడా సీతక్కను మంత్రి పదవిలో కొనసాగిస్తూనే, పిపిసి అధ్యక్షపదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక వేళ సీతక్క కాదంటే, అద్దంకి దయకర్‌కు ఆ పదవి ఇచ్చేందుకు కూడ సిఎం. రేవంత్‌రెడ్డి అనుకూలంగా వున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య సిద్దిపేటలో జరిగిన రోడ్‌షోలో ప్రజలు నుంచి అద్దంకి పదవి మీద నేరుగా డిమాండ్‌ వినిపించింది. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నా తర్వాత స్ధానం అద్దంకిదే అని చెప్పడం జరిగింది. అంటే పార్టీలో తనతో సమానమైన పాత్ర ఇవ్వాలంటే, పిసిసి. అధ్యక్షుడిని చేయాల్సివుంటుంది. ఇప్పటికే ఆయనకు అనేక అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఇక ఇప్పుడు మిగిలింది కేవలం పిపిసి. అధ్యక్ష పదవి మాత్రమే వుంది. అది కచ్చితంగా అద్దంకికే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం జరిగిందన్న వార్తలు వున్నాయి.
మాలలకు కాంగ్రెస్‌లో ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోందన్న విమర్శ వుంది.
అది ఇప్పుడు కూడా అద్దంకికి అడ్డంకిగా మారుతుందా? పిపిసి. వరిస్తుందా? అన్నదానిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తానంటూ అనేక వేధికల మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కైన హనుమంతరావు కూడా పోటీలో వున్నట్టు సమాచారం. గతంలో కూడా హనుమంతరావు పిసిసి. అధ్యక్షపదవి చేపట్టిన అనుభవం వుంది. పైగా గాంధీ కుటుంబానికి అత్యంత విదేయత కల్గిన నాయకుడు. ఎమ్మెల్యేగా, ఎంపిగా ఎలాంటి అవకాశం ఇటీవల కాలంలో దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు రెండు సార్లు రాజ్యసభ దక్కింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది కాంగ్రెస్‌నేతుల పార్టీ మారినా, ఆయన పార్టీ కోసమే పనిచేశారు. పార్టీలోనే వున్నారు. రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడు అయిన సందర్భంలో కూడా తాను పోటీలో వున్నానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆయనైతే అన్ని వర్గాలను కలుపుకుపోతాడన్న నమ్మకం వుంది. కాని వయసు రిత్యా ఆయనను ఇచ్చే అవకాశం వుందా? లేదా? అన్నది చెప్పడం కష్టం. ఇదిలా వుంటే పిసిసి. వర్కింగ్‌ ప్రెసిడెంటుగా వున్న జగ్గారెడ్డి కూడా పిపిసి. రేస్‌లో వుండేందుకు అవకాశం వుంది. కాని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వుంది. పిపిసి. కూడా అదే సామాజిక వర్గానికి కేటాయిస్తే బిసిలనుంచి పెద్దఎత్తున నిరసనలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల రాహల్‌గాంధీకి సన్నిహితుడైన మధుయాష్కీ గౌడ్‌కు పిపిసి. ఇస్తారేమో అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయన తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు. బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొన్న నాయకుడు. ఒక దశలో రేవంత్‌తో సఖ్యత కనబర్చిన మధుయాష్కీ గౌడ్‌ తర్వాత ఆయనకు దూరమయ్యాడు. అంతే కాకుండా రేవంత్‌ రెడ్డికి అనుకూలమైన నాయకులకే పిపిసి. దక్కనుంది. అందులో అద్దంకికా…లేక సీతక్కకా…అన్నది తేలాల్సివుంది…ఇప్పుడున్న పరిస్ధితుల్లో రేవంత్‌రెడ్డికి అనుకూలమైన నాయకుడిని ఎందపిక చేసే అవకాశమే వుందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో, కాంగ్రెస్‌కు మెజార్టీసీట్లు రాకపోతే మాత్రం లుకలుకలు మొదలౌతాయని చెప్పడంలో సందేహం లేదు. పిపిసి. పదవి అనేది ఎప్పుడూ డిమాండ్‌ వున్న పదవే. అందుకే రేవంత్‌రెడ్డి పిసిసి కాకముందు నేనున్నాంటే, నేనున్నానని ఎంతో మంది నాయకులు ప్రకటించుకున్నారు. నాకేం తక్కువ అన్నారు. రేవంత్‌ రెడ్డి ఎవరు? అని కూడా కొందరు ప్రశ్నించారు. జగ్గారెడ్డి అప్పట్లో రేవంత్‌మీద పదేపదే అగ్గిమీద గుగ్గిలమయ్యేవారు. జగ్గారెడ్డి ఓడిపోయి, సైలెంట్‌ అయ్యాడే గాని, సంగారెడ్డిలో గెలిస్తే ఆయన హవా మరో రకంగా వుండేది. అయితే తనకు పిపిసి. కావాలని పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. సామాజిక సమీకరణాలే జగ్గారెడ్డి ఆశలను దెబ్బతీయొచ్చు. చూద్దాం…ఎవరిదిపై చేయి అవుతుందో అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *