మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

ఒకే సమస్య ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలి.

ఆర్టిజన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

జేఏసీ ఆధ్వర్యంలో వంట వార్పు ,కళ్లకు గంతలు కట్టి నిరసన

నేటి ధాత్రి, పాటన్ చేరు :

విద్యుత్ ఆర్టిజన్, మీటర్ రీడర్లను, పీస్ రేట్ కార్మికులను, ప్రభుత్వఉద్యోగులుగా గుర్తించాలని మూడవరోజు నిరవధిక సమ్మెలో భాగంగా పటాన్చెరు డివిజన్ కార్యాలయం ఎదుట వంటావార్పు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. అనంతరం రాష్ట్ర డివిజన్ జేఏసీ నాయకులు భూపాల్ రెడ్డి ,పర్వయ్య ,రఘు మాట్లాడుతూ ఒకే సమత్సలో రెండు రూల్స్ అమలు చేయడం కరెక్ట్ కాదని, చేస్తున్న పని ఒకటే అయినప్పుడు రెండు రూల్స్ అమలు చేయడాన్ని తప్పు పట్టారు ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నప్పుడు రెండు రూల్స్ అమలు చేసి బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ను అమలు చేసి కార్మికుల జీవితాలతో శ్రమ దోపిడీకి గురిచేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం దిగి వచ్చేవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు అప్పటి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు పాదయాత్రలో హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ హక్కులను నెరవేర్చేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు ఈరోజు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భట్టి విక్రమార్క గారు మాట మార్చడం బాగోలేదని విద్యుత్ కార్మికులను పట్టించుకోవడంలేదని తెలిపారు విద్యుత్ సమస్యలు ఏదైనా తలెత్తే మాత్రం యాజమాన్యం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా జేఏసీ నాయకులు పలు యూనియన్ల సంఘాల అధ్యక్షులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, ఉపేందర్, నరసింహ, అక్షయ్, ముజీబ్, మురళి, సుధాకర్ ఎల్లేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టిజన్ అన్ మ్యాన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి..

ఆర్టిజన్ అన్ మ్యాన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి

ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన ఆర్థిక భారం లేని డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి బిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు ఉద్యోగులను మోసం చేసి ఆర్టిజన్ కార్మికులుగా మార్చింది కరెంటు ఉద్యోగుల సమస్య తెలంగాణ ప్రజల సమస్యగా మారే ప్రమాదం ఉంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతదని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా వారి డిమాండ్లను నెరవేర్చకపోతే ధర్మసమాజ్ పార్టీగా వారితో ఏ పోరాటకైనా సిద్ధపడతామని వారికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వంగపండ్ల రాజయ్య యాదవ్ కొయ్యడ రమేష్ రేణిగుంట్ల మహేష్ మహేందర్ శీలపాక హరీష్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version