పాస్టర్ గా పరిచయం పెంచి దోచేశాడు

@ 48 గంటల్లో కేసును చేదించిన నెక్కొండ పోలీసులు

@పలువురిని ప్రశంసించిన సీఐ చంద్రమోహన్

#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో గురువారం రోజున భారీ చోరీకి గురైన విషయం తెలిసిందే ఈ కేసును సవాల్ గా తీసుకున్న నెక్కొండ పోలీసులు తిరగకముందే చేదించడం జరిగింది చోరీ కేసు విషయంలో నిందితున్ని త్వరగా పట్టుకున్నందుకు పోలీసులపై ప్రజలు ప్రశంస జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం రోజు అప్పలరావుపేట గ్రామంలో తిప్పని వీరభద్రయ్య మరియు అతని భార్య ప్రమీల తమ ఇంట్లో ఆరు తులాల బంగారం మరియు 60 వేల రెండు వందల రూపాయలు పోయినాయి అంటూ ఫిర్యాదు చేయగా నెక్కొండ ఎస్సై మహేందర్ మరియు సీఐ చంద్రమోహన్ ఫిర్యాదు సేకరించి కేసు నమోదు చేసి ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం, టవర్ డంప్, లోకల్ ఇంటెలిజెన్స్ వారి సహాయంతో కేసును చేదించడం జరిగిందని సీఐ చంద్రమోహన్ తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు అలంకాని పేట గ్రామానికి చెందిన దంతాల రవి గా గుర్తించామని అన్నారు. దంతాల రవి అప్పలరావుపేట గ్రామంలో బాపిస్ట్ చర్చిలో పాస్టర్ గా పనిచేసేవాడని తిప్పని వీరభద్రయ్య కుటుంబానికి అత్యంత సన్నితంగా ఉంటూ కుటుంబ సభ్యులను నమ్మించి 11-0 4-2024 రోజున వీరభద్రయ్య కుటుంబం జాతీయ ఉపాధిహామీ పథకం పనులకు వెళ్లడంతో అదే చనువుగా భావించిన పాస్టర్ దంతాల రవి వీరభద్రయ్య ఇంటి తాళాలు తీసి బీరువా తలుపులు తీసి ఆరు తులాల బంగారం 60, 200 ఎత్తుకెళ్లడం జరిగిందని నిందితుడు రవి వద్ద నుండి ఆరు తులాల బంగారం 60, 200 రూపాయలు రికవరీ చేసుకుని దంతాల రవి పై క్రైమ్ నెంబర్ 74 /2024 కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని నెక్కొండ సీఐ చంద్రమోహన్ ఎస్సై మహేందర్ లు తెలిపారు. అనంతరం సిఐ చంద్రమోహన్ మాట్లాడుతూ ఈ కేసులో అత్యంత చాకచక్యంగా పాల్గొన్న ఎస్సై మహేందర్ ను కానిస్టేబుళ్లు రమేష్, రాకేష్, శ్యాంసుందర్, కే వెంకటేశ్వర్లు, సల్మాన్ పాషలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *