ఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలు

జైపూఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలుర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జన్మదినొత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రోజున ఎస్టిపిపీ లోని బ్యాచిలర్ ట్రైనీ హాస్టల్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం) శ్రీ జె. ఎన్. సింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా మారాలని ఆయన కోరారు. ఈ రక్తదాన శిబిరంలో ముందుగా పంతుల, భీమ రక్తదానం చేయడం జరిగింది. అనంతరం ఎస్టిపిపీ అధికారులు, సిబ్బంది, పవర్ మేక్ కంపెనీ అధికారులు,సిబ్బంది, పిఈఎస్ కంపెనీ అధికారులు,సిబ్బంది, సిఐఎస్ఎఫ్ సిబ్బంది అలాగే ఎస్టిపిపి పరిసర గ్రామాల ప్రజలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని ,మొత్తం 121మంది రక్తదానం చేయడం జరిగిందని,ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ, మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7 గంటలకు ఎస్టిపిపి ఓపెన్ ఆడిటోరియం నుండి పెగడపల్లిలో గల అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం ఉంటుందని, తర్వాత 10 గంటలకు ఓపెన్ ఆడిటోరియం వద్ద పతాక ఆవిష్కరణ ఉంటుందని, 10:30 కి ఓపెన్ ఆడిటోరియంలో ప్రధానోత్సవం ప్రారంభమవుతుందని, ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రధానోత్సవం మొదలగు కార్యక్రమాలు ఉంటాయని అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) శ్రీ కె.ఎస్.ఎన్. ప్రసాద్, ఏజీఎం ఫైనాన్స్ శ్రీ టీ.సుధాకర్, డీజీఎం(వాటర్ సిస్టమ్స్) శ్రీ జనగామ శ్రీనివాస్, డీజిఎం (సిహెచ్ పి) శ్రీ వి.వి. సుధాకర్ రెడ్డి, డిజిఎం (ఎఫిషియన్సీ) శ్రీ పి.వి. బ్రహ్మం, ఎస్టి పిపి సిఎంఓఎఐ అధ్యక్షుడు శ్రీ సముద్రాల శ్రీనివాస్, ఏఐటియుసి ఫిట్ సెక్రెటరీ శ్రీ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఓటు జిఎం శ్రీ వెంకటయ్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కే రవీందర్, పర్సనల్ మేనేజర్ శ్రీ లొల్ల రామశాస్త్రి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *