పుట్టిన బిడ్డకు ముర్రిపాలు ,6 నెలల వరకు తల్లిపాలనే తాగించాలి.
జిల్లా సంక్షేమ అధికారి నాగేశ్వరరావు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామంలోని హైస్కూల్లో శుక్రవారం రోజున పోషణ పక్వాడ ప్రోగ్రామును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి నాగేశ్వరరావు సిడిపిఓ అవంతి హాజరై పోషణ్ పక్వాడ గురించి మరియు కిషోర బాలికలలో గర్భవతులు బాలింతలు పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను లోబర్త్ వేటును తగ్గించుటకు తీసుకోవలసిన సమతుల హారము, వ్యక్తిగత శుభ్రత…