బెల్లంపల్లి నేటిధాత్రి :
ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో మాదిగ హక్కుల దండోరా ఎం.హెచ్.డి పట్టణ సమావేశ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ అధ్యక్షతన జరిగినది
ఈ యొక్క సమావేశంలో పట్టణ కమిటీ బలోపేతం చేయడంలో భాగంగా మాదిగ హక్కుల దండోరా ఎం హచ్ డి బెల్లంపల్లి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంగే సారయ్య మాదిగ.పట్టణ ప్రధాన కార్యదర్శిగా.కాంపల్లీ సతీష్ మాదిగ.పట్టణ కార్యదర్శి గా సుంకు ఐలయ్య మాదిగ.మంద రజనీకాంత్ నీ కార్యదర్శి గా.వేముల మల్లేష్ కోశాధికారి గా నియమించడం జరిగింది
అలాగే బెల్లంపల్లి పట్టణ మాదిగ హక్కుల దండోరా ఎం హెచ్ డి యువ సేవ అధ్యక్షుడు గద్దల కుమార్ మాదిగ.ను నియమించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతితులు గా మాదిగ హక్కుల దండోరా ఎం హెచ్ డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ , రాష్ట్ర కార్యదర్శి కాంపల్లి రాజం , జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి రాజ్ కుమార్ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుశనపల్లి రాజలింగు తదితరులు పాల్గొన్నారు.