మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఐదు సంవత్సరాలు పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిలర్ కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరైనారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది మాజీ కౌన్సిలర్లు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ పట్టణ ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించారు వాటిల్లో ఉన్న సమస్యలను మాకు సాధ్యమైనంత మేరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు స్మశాన వాటికలకు అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చి వార్డులను అభివృద్ధి చేశాం ఈ అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటాము అని అన్నారు అనంతరం
మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించడం జరిగింది మీరు అనేక అభివృద్ధి పనులు చేసి మా పేర్లు నిలబెట్టారు పదవులు అనేవి శాశ్వతం కాదు పదవులు ఉన్నాం లేకున్నా ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరు ముందు ఉండాలని కార్యకర్తలకు దిశా నిర్దాక్షం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ భూపాలపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ మాజీ కౌన్సిలర్లు
తాజా మాజీ కౌన్సిలర్సు ఆకుదారి మమత ఎడ్ల మౌనిక మున్సిపల్ ఫోర్ లీడర్ నూనె రాజు బద్దిసమయ్య కవిత జుమ్మలాల్ మంగళపల్లి తిరుపతి ధార పూలమ్మ ముంజంపల్లి మురళి నాగుల శిరీష దేవేందర్ రెడ్డి రవి మేకల రజిత దొంగల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు