చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ముందుగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్రం ఏర్పాటు అయ్యే రోజు, జనవరి 26. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో మన దేశం పూర్తిగా గణతంత్ర దేశంగా మారింది అని. ఈరోజు స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని, జాతీయ ఐక్యతను స్మరించుకునే మహత్తర దినం. అని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి కార్యదర్శి గడ్డం కొమురయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర్ర లక్ష్మణ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర రమేష్ సభ్యులు రాజేందర్ రాజమౌళి తిరుపతి రాజు ఓదేలు యుగేందర్ సురేష్ చందర్ మహేష్ మరియు పాఠశాల విద్యార్థులు యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.