కరీంనగర్, నేటిధాత్రి:
మండలానికి ఈజిఎస్ నిధుల ద్వారా అన్నీ గ్రామాలకు కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ మండలానికి ఈజిఎస్ నిధుల ద్వారా అన్నీ గ్రామాలకు కోటి రూపాయలు నిధులు మంజూరు చేపించిన కేంద్ర హోంసహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామడుగు మండలంలో పదమూడు బోర్ల కోసం కూడా ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, నాలుగు గ్రామాలకు కులసంఘ భవనాల కోసం కూడా ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, మంత్రి బండి సంజయ్ కుమార్ గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తున్నారని, అధిక నిధులు మంజూరు చేపిస్తున్నారని వారు ఈసందర్భంగా తెలియజేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండలశాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ మోడీ రవీందర్, మాజీ మండలశాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, నాయకులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, కారుపాకల అంజిబాబు, ఎడవెల్లి రాం, ఎడవెల్లి లక్ష్మణ్, మాడిశెట్టి అనిల్, మేకల లక్ష్మణ్, రాగం కనకయ్య, బొజ్జ తిరుపతి,నాగి లచ్చయ్య, బోయిని వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.